భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ బాగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రారంభం నుంచి కొన్ని సమస్యల ఉన్నప్పటికీ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది.
తరుణ్ పాల్ అనే వ్యక్తి ట్విటర్‌లో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి. కావున వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి.
మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 వరకు (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు.
ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే, తరుణ్ పాల్ చెప్పినట్టు ఓలా బ్యాటరీ ధరలు ఎంతమేరకు ఉంటాయనేది క్లారిటీ లేదు. అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment