battery
-
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
బ్యాటరీ రంగంలో భారీ పెట్టుబడులు: ఐఈఎస్ఏ
న్యూఢిల్లీ: బ్యాటరీ, మొబిలిటీ స్టార్టప్ వ్యవస్థలో.. భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏడాదిలో రావొచ్చని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది.పెట్టుబడులు నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిని నడిపించడంతోపాటు ఈ స్టార్టప్‌లు తయారు చేసే ఉత్పత్తుల పురోగతికి దోహదం చేస్తుందని ఐఈఎస్ఏ తెలిపింది. అంతేగాక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ మేనేజ్మెంట్, విడిభాగాల తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వా రా అంకుర కంపెనీలను ప్రోత్సహించడానికి ఐఈఎస్ఏ చురుకుగా పని చేస్తోంది. ఇప్పటికే 400 స్టార్టప్‌లు, యూనిడో, ఐక్రియేట్, ఇండి యా యాక్సిలరేటర్, ఇతర ప్రముఖ సంస్థల తో చేతులు కలిపింది. స్టార్టప్‌లకు పెట్టుబడి మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక ధ్రువీకరణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి సాయపడుతోంది. -
భారీ బ్యాటరీ ప్లాంట్‌ను చుట్టుముట్టిన అగ్ని జ్వాలలు
మోస్ ల్యాండింగ్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దావానలం తీ వ్రత తగ్గుముఖం పట్టే లా కనిపించడం లేదు. గురు వారం ప్రపంచంలోనే పెద్దదైన మోస్ ల్యాం డింగ్‌లోని బ్యాట రీ స్టోరేజీ ప్లాంట్‌ను మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అధికారులు కాలిఫోర్నియాకు 77 మైళ్ల దూరంలోని ఈ ప్లాంట్‌ను మూసివేశారు. ఆ చుట్టుపక్కల మోస్ ల్యాండింగ్, ఎల్క్ హార్న్ స్లో ఏరియాల్లోని సుమారు 1,500 మందిని ఖాళీ చేయించారు. సమీపంలోని ఒకటో నంబర్ హైవేలో కొంత భాగాన్ని మూసివేశారు. టెక్సాస్‌కు చెందిన కంపెనీ విస్ట్రా ఎనర్జీకి చెందిన మోస్ ల్యాండింగ్ పవర్ ప్లాంట్‌లో వేలాదిగా లిథియం బ్యాటరీలను నిల్వ ఉంచుతారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే అదుపు చేయడం ఎంతో కష్టమని అంటున్నారు. అయితే, కాంక్రీట్ భవనంలోని బ్యాటరీలకు మంటలు వ్యాపించడం అంత సులువు కాదని చెబుతున్నారు. ప్లాంట్‌లోని సిబ్బందిని ముందుగానే ఖాళీ చేయించామని విస్ట్రా తెలిపింది. -
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
జీరో కార్బన్ ఉద్గారాల వైపు ప్యూర్ ఈవీ
జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్‌తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది.సోలార్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే శక్తిని కంపెనీ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని ప్యూర్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ దొంగరి అన్నారు. లేటెస్ట్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో కలిసి సోలార్ పవర్ (Solar Power) ఉపయోగించడం ద్వారా.. మేము భవిష్యత్తులో గొప్ప పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. అంతే కాకుండా జీరో కార్బన్ ఉద్గారాలు మా లక్ష్యం అని అన్నారు. -
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
ఐదు లక్షల మందితో భారత్ బ్యాటరీ షో!
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లువ్యాపార విస్తరణపై ఎల్అండ్టీ ఫైనాన్స్ దృష్టిఎల్అండ్టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది. -
వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..
ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత సమయం వస్తుంది? మహా అయితే ఒక రోజు.. నెల లేదా సంవత్సరం అనుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యాటరీ అయితే వేల సంవత్సరాలు పాటు పనిచేస్తుంది. ఇంతకీ ఆ బ్యాటరీ పేరు ఏంటి? ఎవరు రూపొందించారు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రెండు బ్రిటీష్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇంజనీర్ల బృందం ఒక అద్భుతమైన బ్యాటరీని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 'కార్బన్-14 డైమండ్ బ్యాటరీ'. ఇది వేల సంవత్సరాల పాటు తక్కువ మొత్తంలో శక్తిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.బ్యాటరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి.. డైమండ్‌లో నిక్షిప్తం చేసిన కార్బన్-14ని ఉపయోగిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పేర్కొంది. కార్బన్-14 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. అయితే ఇది విద్యుత్తును తయారు చేయడానికి ఫోటాన్లకు బదులుగా.. ఐసోటోప్ ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రాన్లను ఉపయోగిస్తుంది.కార్బన్-14 జీవితకాలం 5,700 సంవత్సరాల కంటే ఎక్కువ. బహుశా ఇన్ని సంవత్సరాలు మనగలిగే బ్యాటరీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ కార్బన్ 14 బ్యాటరీని అంతరిక్ష పరిశోధనలలోని ప్లానెటరీ రోవర్లకు శక్తినివ్వడానికి, నీటి అడుగున ఏర్పాటు చేసే సెన్సార్లలో, పేస్మేకర్లకు శక్తినివ్వడానికి, ఇంప్లాంట్ చేయదగిన వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే పరికరాలలో ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు.💎Scientists and engineers from the UK Atomic Energy Authority (@UKAEAofficial) and the University of Bristol (@BristolUni) have successfully created the world’s first carbon-14 diamond battery.This new type of battery has the potential to power devices for thousands of years,… pic.twitter.com/Kquxpn1PHA— UK Atomic Energy Authority (@UKAEAofficial) December 4, 2024 -
HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం
సాక్షి,హైదరాబాద్: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.పార్క్ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. ఇదీ చదవండి: ఫ్యాబ్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం -
పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి, చిన్న బ్యాటరీలను కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, రిమూవబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో పెద్ద బ్యాటరీలను కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి తెలుసుకుందాం.4 కిలోవాట్ బ్యాటరీఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, రివర్ ఇండీ, టోర్క్ క్రటోస్ ఆర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా 195 కిమీ (ఓలా ఎస్1 ప్రో), 190 కిమీ (ఓలా ఎస్1 ఎక్స్), 161 కిమీ (రివర్ ఇండీ), 180 కిమీ (టోర్క్ క్రటోస్ ఆర్)గా ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న బ్యాటరీని కలిగి ఉన్నప్పటికీ రేంజ్ తేడా ఏంటా? అని బహుశా ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఒక వాహనంలో ఉన్న ఫీచర్స్.. దాని పరిధిని (రేంజ్) నిర్థారిస్తారు. అంతే కాకుండా ఎంచుకున్న మోడ్.. ప్రయాణించే రోడ్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి.4.4 కిలోవాట్ బ్యాటరీఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైకులో 4.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 187 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఏకైన మోడల్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కావడం గమనార్హం.5 కిలోవాట్ బ్యాటరీసింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఫిక్డ్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. 5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జీతో 212 కిమీ రేంజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు 525 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.5.1 కిలోవాట్ బ్యాటరీటీవీఎస్ ఐక్యూబ్ వివిధ పరిమాణాల బ్యాటరీలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేసిన రెండేళ్ల తరువాత 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జీతో 185 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఇది దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు.ఇదీ చదవండి: రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..7.1 కిలోవాట్ బ్యాటరీ & 10.3 కిలోవాట్ బ్యాటరీబెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైకులో 7.1 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన ఎఫ్77 మ్యాక్ 2 రీకాన్ మోడల్ 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 323 కిమీ రేంజ్ అందిస్తుంది. -
రిస్కులో బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ
న్యూఢిల్లీ: రీసైక్లింగ్ వ్యవస్థలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ పలు రిస్కులు ఎదుర్కొంటోందని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్‌ఏఐ) తెలిపింది. పరిశ్రమలోకి మోసపూరిత వ్యాపార సంస్థల ఎంట్రీతో పాటు పర్యావరణంపరంగా విపత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వివరించింది.ప్రస్తుత ధర విధానం వల్ల లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై భారత్‌కు సుమారు 1 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకంపరంగా నష్టం వాటిల్లుతోందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో లిథియం రీసైక్లింగ్‌కు ఫ్లోర్ ధరను పెంచాలని, నిబంధనలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంఆర్‌ఏఐ వివరించింది. -
ఈవీబ్యాటరీల స్వాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది.బ్యాటరీల స్వాపింగ్, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. విదేశాల్లో ఈ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్న వారు సైతం స్వాపింగ్ సేవలను ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుత విద్యుత్ కనెక్షన్ ద్వారానే స్వాపింగ్ సేవలను అందించడానికి కేంద్రం వీరికి అవకాశం కల్పించింది. సర్వీసు చార్జీలపై సీలింగ్ ఈవీ చార్జింగ్ కేంద్రాల్లో ఏసీ/డీసీ చార్జింగ్కు వసూలు చేయాల్సిన సర్వీసు చార్జీలపై గరిష్ట పరిమితిని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ, భూమి ధరకు సంబంధించిన చార్జీలు వీటికి అదనం కానున్నాయి. యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు చేసే సగటు వ్యయంతో పోల్చితే చార్జింగ్ కేంద్రాలకు సరఫరా చేసే విద్యుత్ టారిఫ్ అధికంగా ఉండరాదని కేంద్రం స్పష్టం చేసింది. 2028 మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా ఇవే సర్వీస్ చార్జీలు, టారిఫ్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. సగటు సరఫరా వ్యయంతో పోల్చితే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 0.7 రేట్లు, సాయంత్రం 4 నుంచి ఉదయం 9 గంటల వరకు 1.3 రేట్ల అధిక వ్యయంతో చార్జింగ్ కేంద్రాలకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. ఈవీ చార్జర్ల కోసం సబ్ మీటర్లను సరఫరా చేయాలని డిస్కంలను కోరింది. 3 రోజుల్లోనే కరెంట్ కనెక్షన్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే మెట్రోపాలిటన్ నగరాల్లో కేవలం 3 రోజుల్లోనే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇతర మున్సిపాలిటీల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో, కొండలున్న గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటే 90 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం చేస్తే ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రూల్స్–2020 ప్రకారం దరఖాస్తుదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థకు స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్థలు తమ స్థలాలను ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం రెవెన్యూ షేరింగ్ మోడల్ కింద అందించాలని కేంద్రం సూచించింది. స్థలం ఇచ్చినందుకుగాను ప్రతి యూనిట్ విద్యుత్ చార్జింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో రూపాయిని వాటాగా తీసుకోవాలని చెప్పింది. తొలుత 10 ఏళ్ల లీజుకు స్థలాలను కేటాయించాలని కోరింది. చార్జింగ్ కేంద్రాలఏర్పాటుదారులకు కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాలని సూచించింది. -
పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..
జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
మారుతీ ఈవీ రేంజ్ 500 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్‌కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. -
9 నిమిషాల ఛార్జ్.. 965 కిమీ రేంజ్: ఇది కదా కావాల్సింది
ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్ ఓ బ్యాటరీ రూపొందించింది.కొరియన్ బ్రాండ్ శాంసంగ్ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.శాంసంగ్ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్‌తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్‌పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్‌లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్‌ను మరింత స్లిమ్‌గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్‌ను గ్లాస్ / మెటల్‌తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
భారతీయ మార్కెట్లోకి మొదటి సోడియం అయాన్ బ్యాటరీలు..
సాక్షి, సిటీబ్యూరో: భద్రత ప్రమాణాలే ప్రాముఖ్యతగా వినూత్న సాంకేతికతతో తయారు చేసిన దేశంలోనే మొట్ట మొదటి శక్తివంతమైన సోడియం అయాన్ బ్యాటరీలను ‘సోడియం ఎనర్జీ సంస్థ’ విడుదల చేసింది. బుధవారం నగరంలోని మెర్క్యూరీ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సోడియం ఎనర్జీ సహ–వ్యవస్థాపకులు బాల పచియప్ప బ్యాటరీలను భారతీయ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీల కంటే సోడియం అయాన్ బ్యాటరీలు అధిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయన్నారు. 2026 నాటికి విద్యుత్ నిల్వల అవసరం 5 రెట్లు పెరుగుందని, అధిక జనాభా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. భద్రత, నాణ్యత, వేగవంతమైన చార్జింగ్‌తో ఈ బ్యాటరీలు అధునాతన సేవలందిస్తాయని పేర్కొన్నారు. లిథియం కన్నా సోడియం 500 రెట్లు అధిక సామర్థ్యాలతో పర్యావరణానికి హాని లేకుండా రికవరీ, రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు. అనంతరం సోడియం అయాన్ బ్యాటరీలతో నడిచే వాహనాల పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శించారు. -
స్మార్ట్‌ఫోన్ కోసం న్యూక్లియర్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు పని చేస్తోంది!
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
న్యూక్లియర్ బ్యాటరీ.. దీని మన్నిక 50 ఏళ్లు
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జమ్మూ-కశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ! ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రానిక్ వినియోగం మరింత ఎక్కువగా ఉంది. పరికరాలు పెరుగుతుంటే.. వాటికి ఛార్జింగ్ కీలకమైన అంశంగా మారింది. దీంతో నిత్యా జీవితంలో ఉపయోగించే దాదాపు అన్ని పరికరాలకు ప్రతి రోజు ఛార్జింగ్ వేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చైనా కంపెనీ ఓ కొత్త బ్యాటరీ ఆవిష్కరించింది. బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్ (Betavolt) ఇటీవల 'న్యూక్లియర్ బ్యాటరీ' పరిచయం చేసింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ బ్యాటరీ అటామిక్ ఎనర్జీని గ్రహించి ఏకంగా 50 ఏళ్ళు పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ చూడటానికి పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. బీటావోల్ట్ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రోప్రాసెసర్లు, లేటెస్ట్ సెన్సార్లు, చిన్న డ్రోన్లు, మైక్రో-రోబోట్ వంటి వాటి వినియోగంలో చాలా ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ కొలతలు బీటావోల్ట్ ఆవిష్కరించిన కొత్త బ్యాటరీ కేవలం 15 x 15 x 5 మిమీ కొలతల్లో ఉంటుంది. ఇది న్యూక్లియర్ ఐసోటోప్లు, డైమండ్ సెమీకండక్టర్ల పొరలతో తయారు చేసినట్లు సమాచారం. ఈ న్యూక్లియర్ బ్యాటరీ ప్రస్తుతం 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2025 నాటికి 1-వాట్ పవర్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేసేలా తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ రేడియేషన్ వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, పేస్మేకర్ల వంటి వైద్య పరికరాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చని బీటావోల్ట్ వెల్లడించింది. బ్యాటరీ ఎలా పని చేస్తుంది? బీటావోల్ట్ కొత్త బ్యాటరీ ఐసోటోపుల నుంచి శక్తిని పొందుతుంది. ఈ విధానంవైపు 20 శతాబ్దం ప్రారంభంలోనే పరిశోధనలు మొదలయ్యాయి. అయితే చైనా 2021-2025 వరకు 14వ పంచవర్ష ప్రణాళిక కింద అణు బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. బ్యాటరీ లేయర్ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. ఆకస్మికంగా పేలే అవకాశాలు లేదని చెబుతున్నారు. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుని ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఈ బ్యాటరీని టెస్ట్ చేస్తూనే ఉంది, ప్రభుత్వాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తరువాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది. -
ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన రంగం వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా కంపెనీ 'నియో' (Nio).. అద్భుతమైన రేంజ్ (సింగిల్ ఛార్జ్ 1000 కిమీ) అందించడానికి అనుగుణంగా ఉండే ఓ బ్యాటరీని తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగానే చాలా సంస్థలు తమ ఉత్పత్తులను ఈవీలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు చైనా కంపెనీ పరిచయం చేసిన బ్యాటరీ టెస్లాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బ్యాటరీతో తయారైన నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అధికారులు సుమారు 1000 కిమీ దూరం ప్రయాణించి దానికి సంబంధించిన జర్నీ లైవ్ స్ట్రీమ్ 2023 డిసెంబర్ 17న షాంఘైలో ప్రదర్శించినట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ అని కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. 2024 ఏప్రిల్ నాటికి ఈ బ్యాటరీల ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. సంస్థ తయారు చేసే ఈ బ్యాటరీ విలువ సుమారు 42100 డాలర్ల (రూ.32 లక్షలు) వరకు ఉంటుందని సమాచారం. నిజానికి ఈ ధరతో ఓకే లగ్జరీ కారునే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ బ్యాటరీ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. -
180 ఎకరాల విస్తీర్ణంలో జపాన్ కంపెనీ ప్లాంట్.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: ఐఫోన్లకు కావాల్సిన బ్యాటరీలను సరఫరా చేస్తున్న జపాన్ కంపెనీ టీడీకే భారత్‌లో లిథియం అయాన్ సెల్స్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని మనేసర్ వద్ద 180 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. దశలవారీగా ఈ కేంద్రానికి కంపెనీ రూ. 6,000–7,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేనాటికి సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేడిన్ ఇండియా ఐఫోన్లలో వాడే బ్యాటరీల కోసం ఈ ప్లాంటులో సెల్స్‌ను తయారు చేస్తారని మంత్రి తెలిపారు. అయితే తయారీ కేంద్రం స్థాపనకై పర్యావరణ అనుమతి కోసం టీడీకే వేచి చూస్తోందని సమాచారం. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న చైనాకు చెందిన యాంపీరెక్స్ టెక్నాలజీని (ఏటీఎల్) 2005లో టీడీకే కొనుగోలు చేసింది. అనుబంధ కంపెనీ అయిన నవిటాసిస్ ఇండియా ద్వారా భారత్‌లో ఏటీఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రీచార్జేబుల్ బ్యాటరీ ప్యాకేజ్‌లను హర్యానాలోని బావల్ వద్ద ఉన్న ప్లాంటులో నవిటాసిస్ తయారు చేస్తోంది. -
ఇంట్లో పేలిన స్కూటర్ బ్యాటరీ
హోసూరు: హోసూరు సమీపంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన మునిరాజ్ (38)తన కుటుంబసభ్యులతో కలిసి హోసూరు సమీపంలోని కళుగొండపల్లి సుభాష్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అదే ప్రాంతంలో సూపర్ మార్కెట్‌ను నిర్వహిస్తున్నాడు. గత మూడేళ్లుగా బ్యాటరీ స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు. అర్ధరాత్రి విస్ఫోటం శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపును మూసివేసి ఇంటికి వచ్చిన దంపతులు స్కూటర్ బ్యాటరీని విప్పి ఇంట్లో చార్జింగ్కు పెట్టారు. అర్ధరాత్రి బ్యాటరీ గట్టి శబ్దంతో పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. టీవీ, ఫ్యాన్, బల్పులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఇంటి పైకప్పు కూడా చీలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న మంజునాథ్, భార్య మాల (33), కొడుకు రక్షణ్ (11), కూతురు జయ్గంగ (8)లు విషవాయువుల మధ్యలో చిక్కుకుని ఉండగా, చుట్టుపక్కల వారు చేరుకొని ఇంటి తలుపులు బద్దలగొట్టి మంటలార్పి ప్రమాదంలో ఇరుక్కుపోయిన దంపతులను, పిల్లలను బయటకు తీశారు. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దుర్ఘటనపై బాధితుడు మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బ్యాటరీ టెక్నాలజీల్లో భారత్ మరింత ముందుకు
నోయిడా: బ్యాటరీ టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) మార్కెట్ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల మార్కెట్ 128 గిగావాట్–అవర్ (జీడబ్ల్యూహెచ్) స్థాయికి చేరవచ్చనే అంచనాలు ఉన్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొన్న సందర్భంగా ఇన్ఫర్మా మార్కెట్స్ ఆఫ్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిలకడైన రీసైక్లింగ్ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ విద్యుత్ డిమాండ్‌లో చైనా, భారత్ సారథ్యంలోని ఆసియాకి ప్రస్తుతం 60 శాతం వాటా ఉందని ఉడ్ మెకెంజీ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ విట్వర్త్ తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల్లో సాంకేతిక పురోగతి వల్ల పవన, సౌర విద్యుత్ సామర్థ్యాలు నాలుగింతలు పెరగనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఈ రంగంలో 3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. 700 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 900 పైగా బ్రాండ్లు ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. 40,000 మంది సందర్శకులు ఈ ఎక్స్పోను సందర్శించే అవకాశం ఉంది. -
రిలయన్స్ కొత్త ఆవిష్కరణ - కంపెనీల వెన్నులో వణుకు..
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోతో పాటు నిర్వహిస్తున్న 'ది బ్యాటరీ షో ఇండియా' మొదటి ఎడిషన్ సందర్భంగా ఈ ఆవిష్కరణ జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్ ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశకు చేరుకుందని, వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ బ్యాటరీలు ఒక ఛార్జ్‌తో 70 నుంచి 75 కిమీ రేంజ్ అందించనున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా బ్యాటరీలను సౌరశక్తిని ఉపయోగించి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ బ్యాటరీలను కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా గృహోపకరణాలకు కూడా ఉపయోగించుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. నిజానికి వాహన వినియోగదారుడు ఛార్జింగ్ అయిపోగానే బ్యాటరీ మార్చుకోవాలి, కావున బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో కూడా మార్చుకోవచ్చు. ఈవీ స్టేషన్స్‌లో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ బ్యాటరీ మార్చుకోవడానికి కేవలం ఆరు సెకన్లు సమయం పడుతుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్‌లో సోలార్ ప్యానెల్లు, మీటర్లు, ఇన్వర్టర్, క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయని అధికారి తెలిపారు. అంతే కాకుండా టూ వీలర్స్ కోసం ఆటోమేటెడ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ (OE) తయారీదారులతో కలిసి పని చేస్తున్నట్లు, త్వరలోనే అనుకూలమైన మోడల్స్ వస్తాయని వెల్లడించారు. -
మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!
Jharkhand Lithium Reserves: ప్రపంచానికి మైకాను ఎగుమతి చేసిన జార్ఖండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను గుర్తించిన తరువాత తాజాగా జార్ఖండ్‌లో అపారమైన నిల్వలను గుర్తించారు. జమ్మూ కశ్మీర్ , రాజస్థాన్, కర్ణాటకలలో లిథియం నిల్వలు కనుగొన్న కొన్ని నెలల తర్వాత, జార్ఖండ్‌లో కూడా కాస్మిక్ ఖనిజ నిల్వలను గుర్తించడం విశేషం. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) జియోలాజికల్ సర్వే నిర్వహించి, జార్ఖండ్‌లో కోడెర్మా , గిరిడిహ్‌లో లిథియం సహా అరుదైన ఖనిజాల నిల్వలున్న ప్రాంతాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాలతో పాటు తూర్పు సింగ్భూమ్ ,హజారీబాగ్‌లలో అన్వేషణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 30శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం లిథియం కోసం ప్రధానంగా చైనాపైనా ఎక్కువగా ఆధారపడుతోంది. జార్ఖండ్‌లో లిథియం నిల్వల ఆవిష్కరణతో దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకుపోనుంది. లిథియం ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తే, అది చౌకైన ఎలక్ట్రిక్ బ్యాటరీలకు దారితీస్తుందని , చివరికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత దిగి వవస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇపపటికే జార్ఖండ్ ప్రభుత్వం లిథియం మైనింగ్ సామర్థ్యాలను అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. (స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?) లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు , ఇతర గాడ్జెట్ల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. కోరలు చాస్తున్న కాలుష్యం, ఉద్గార నిబంధనల కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)వైపు మొగ్గుతున్నాయి. దీంతో లిథియంకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచానికి కనీసం 2 బిలియన్ల (200 కోట్లు) EVలు అవసరమవుతాయి .వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే లిథియం నిల్వలున్నాయి. లిథియం మైనింగ్ , ప్రాసెసింగ్‌లో చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం లిథియంలో ఎక్కువ భాగం చైనా, ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా ద్వారా సరఫరా చేయబడుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, బీహార్ , పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉన్న తూర్పు రాష్ట్రం ఇప్పటికే యురేనియం, మైకా, బాక్సైట్, గ్రానైట్, బంగారం, వెండి, గ్రాఫైట్, మాగ్నెటైట్, డోలమైట్, ఫైర్‌క్లే, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బొగ్గు (32 శాతం), ఇనుము, రాగి (భారతదేశంలో 25 శాతం) నిల్వలకు ప్రసిద్ధి చెందింది. -
భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..
Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నైవేలీ సిద్ధం.. చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిందే. భారీ పరిమాణంలో విద్యుత్‌ను నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవడానికి అవసరమైన సాంకేతికత, సదుపాయాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారిగా 8 మెగావాట్ల భారీ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బెస్)ను దక్షిణ అండమాన్ దీవిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) ఏర్పాటు చేసి విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతంగా స్టోరేజీ సిస్టంను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, దానికి అనుసంధానంగా 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. 101.94 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.136.61 కోట్లను ఖర్చు చేసినట్టు నైవేలీ సంస్థ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలిపారు. సాధారణంగా యూనిట్ సౌర విద్యుదుత్పత్తికి రూ.2.60 నుంచి రూ.2.8 పైసల వ్యయం అవుతుండగా, బ్యాటరీ సిస్టంలో నిల్వ చేసేందుకు అవుతున్న వ్యయాన్ని కలుపుకుని.. మొత్తంగా యూనిట్‌కు రూ.7.41 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆయన గత జనవరి 12న నైవేలీ సంస్థ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఏర్పాటైన తొలి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైవేలీ సంస్థ తరఫున పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అండమాన్‌లో మరో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్.. దక్షిణ అండమాన్ విద్యుత్ అవసరాలు 35 మెగావాట్లు. పూర్తిగా డీజిల్ జనరేటర్లతోనే ఆధారపడేవారు. పెద్ద ఎత్తున కాలుష్యం, డీజిల్ వ్యయం ఉండేది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఈ సమస్య కొంత మేరకు తగ్గింది. అండమాన్ విజ్ఞప్తి మేరకు రెండో విడత కింద మరో 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. రెండో దశ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే విద్యుత్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతిక విశేషాలు.. - లిథియం అయాన్ బ్యాటరీల మోడ్యూల్స్ - 1260 - 0.96 ఎంవీఏ సామర్థ్యం గల 9 బెస్ కంటైనర్లు - 0.96 ఎంవీఏల సామర్థ్యం గల బై-డైరెక్షనల్ పవర్ కండిషనింగ్ సిస్టంలు- 18 - యూనిట్ విద్యుత్ ధర రూ.7.4 ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం.. వ్యాపార విస్తరణలో భాగంగా పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, లిగ్నైట్ నుంచి మిథనాల్, గ్యాస్, డీజిల్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ, ఏపీతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాలపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల రంగ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లో నైవేలీ ఆధ్వర్యంలో ఎలక్రి్టక్ వాహనాల పరిశ్రమ స్థాపనకు పరిశీలిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ఇంధన శాఖలతో చర్చలు సైతం జరిపాం. రెండు రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్.. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం. ఆ వెంటనే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణకు 311 మెగావాట్లు తెలంగాణకు, 230 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. మా విద్యుత్ అత్యంత చౌక.. మా లిగ్నైట్ గనుల దగ్గరే విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. లిగ్నైట్ రవాణా ఖర్చులుండవు. దీంతో దేశంలోనే అత్యంత చౌక విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ధరలపరంగా మెరిట్ ఆర్డర్లో టాప్ పోజిషన్లో ఉన్నాం. రూ.24000 కోట్ల పెట్టుబడులు.. దేశంలోనే 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ మాదే. 2030 నాటికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 6000 మెగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం నైవేలీ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ఎల్ను నెలకోల్పాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలిస్తాం. -
ఏసీసీ బ్యాటరీకి మహర్దశ
న్యూఢిల్లీ: దేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ భారీ వృద్ధిని చూడనుంది. డిమాండ్ ఏటా 50 శాతం కాంపౌండెడ్ చొప్పున (సీఏజీఆర్) పెరుగుతూ, 2022 నాటికి ఉన్న 20 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) నుంచి.. 2030 నాటికి 220 గిగావాట్ అవర్‌కు చేరుకుంటుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ వృద్ధికి స్థానికంగా అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ, బలమైన స్థానిక సరఫరా మద్దతునిస్తాయని పేర్కొంది. మొత్తం వ్యాల్యూచైన్ (మెటీరియల్ ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ఇంటెగ్రేషన్)లో అధిక భాగాన్ని భారత్ స్థానికంగానే తయారు చేసే స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ అధ్యయనం కోసం 6డబ్ల్యూరీసెర్చ్ సాయాన్ని సీఐఐ తీసుకుంది. ‘‘వాహనం పవర్‌ట్రెయిన్‌ను బ్యాటరీ నడిపిస్తుంది. మెరుగైన బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) అభివృద్ధికి వీలుగా, బ్యాటరీ టెక్నాలజీలో పురోగతి అవసరం. తయారీ సామర్థ్యాల ఏర్పాటు, జాతీయ స్థాయిలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా బలోపేతం చేయడమే కాకుండా.. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్‌కు అధిక నాణ్యత, వినూత్నమైన బ్యాటరీ మెటీరియల్స్‌ను సరఫరా చేసే విశ్వసనీయ సరఫరా వ్యవస్థలు అవసరం’’ అని సీఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ అయిన విపిన్ సోది తెలిపారు. మైనింగ్‌ను ప్రోత్సహించాలి.. కోబాల్ట్, నికెల్, లిథియం, కాపర్ మైనింగ్, రిఫైనింగ్‌ను దేశీయంగా ప్రోత్సహించాలని సీఐఐ నివేదిక సూచించింది. బ్యాటరీ తయారీలో వినియోగించే కీలకమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. బ్యాటరీ తయారీని పెంచేందుకు వీలుగా పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో మద్దతుగా నిలవాలని అభిప్రాయపడింది. అలాగే, ఖనిజాల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు (ఆర్అండ్డీ) ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీ కోసం ఇతర దేశాలతో సహకారం ఇచ్చిపుచ్చుకోవడం, బ్యాటరీ కెమికల్స్ పరిశ్రమ పర్యావరణ ఇతర అనుమతులు, లైసెన్స్‌లను పొందే విషయంలో నియంత్రణలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కేంద్ర సర్కారు 20 గిగావాట్ అవర్ ఏసీసీ తయారీకి వీలుగా ఉత్పత్తి ఆధారిత అనుసంధాన పథకం కింద (పీఎల్ఐ) రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దేశీయంగా బ్యాటరీల ముడిసరుకు ఉత్పత్తి ► ఎల్ఎఫ్పీ తయారీలో ఆల్ట్‌మిన్ బ్యాటరీల్లో కీలకమైన క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ (క్యామ్)కి సంబంధించిన ముడి సరుకు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ)ని తొలిసారి దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ఆల్ట్‌మిన్ శ్రీకారం చుట్టింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖలో భాగమైన ఏఆర్‌సీఐ తోడ్పాటుతో పైలట్ ప్రాతిపదికన 10 మెగావాట్ల సామర్ధ్యంతో ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు మౌర్య సుంకవల్లి, కిరీటి వర్మ తెలిపారు. దీనిపై దాదాపు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. విద్యుత్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామరŠాధ్యన్ని 3 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు 2025 నాటికి 25 గిగావాట్లు, 2030 నాటికి 150 గిగావాట్ల సామర్ధ్యం అవసరమవుతుందని చెప్పారు. ఎల్ఎఫ్పీ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్ఎఫ్పీకి అవసరమయ్యే లిథియంను బొలీవియా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. -
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
షాకింగ్ న్యూస్.. ఓలా బ్యాటరీ కొనాలంటే అంత చెల్లించాలా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ బాగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రారంభం నుంచి కొన్ని సమస్యల ఉన్నప్పటికీ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. తరుణ్ పాల్ అనే వ్యక్తి ట్విటర్లో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి. కావున వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 వరకు (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే, తరుణ్ పాల్ చెప్పినట్టు ఓలా బ్యాటరీ ధరలు ఎంతమేరకు ఉంటాయనేది క్లారిటీ లేదు. అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. -
భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: జమ్మూ కశ్మీర్లో అపారమైన లిథియం నిక్షేపాలను కనుగొనడంపై పారిశశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇక సందేహం లేదు, భారతదేశం భవిష్యత్తు అంతా ఎలక్ట్రి ఫైయింగే అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో అత్యంత కీలకమైంది లిథియం, ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్ర భవిష్యత్తులో ఈ-వాహనాల్లో భారత్ దూసుకుపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?) దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. లిథియం నిక్షేపాల ఆవిష్కరణతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత దిగిరానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మొత్తం 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్ర గనుల శాఖ పేర్కొంది. నాన్-ఫెర్రస్ ఖనిజమైన లిథియం..ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడే కీలకమైన మూలకం. భారీగా లిథియం నిల్వలగుర్తింపుతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని, ఫలితంగా డీజిల్, పెట్రోల్‌పై ఆధారపడడం ఇకపై మరింత తగ్గుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే..) కాగా ఈవీ కార్ల బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో లిథియం ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ బ్యాటరీలో ఉత్పత్తిపై చైనా వంటి దేశాల దిగుమతులపై ఆధారపడుతోంది ఇండియా. తాజా పరిణామంతో ఈవీల ఉత్పత్తి ఖర్చు ఖచ్చితంగా తగ్గుంనుందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలు, మండుతున్న ఇంధన ధరల నేపథ్యంలో గ్లోబల్‌గా ఈవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది. -
తెలంగాణలో మల్టీగిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటుకానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామన్నారు. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా 750 కోట్ల రూపాయలను ఈ కేంద్రం పై పెట్టుబడిగా పెట్టనున్నారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అలాక్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టం ను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ -అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈ ఎస్ ఎస్ పాలసీని తీసుకొచ్చిందన్న కేటీఆర్, ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం తమదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కీలకంగా మారేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ గోపాలకృష్ణన్ విసి పాల్గొన్నారు. -
‘హరిత’ వాహనాలపై బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్ ఆధారిత మైనింగ్ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు. 2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది. -
తెలుగు కుర్రాడి సత్తా.. ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ హీరోస్ అవార్డు..
వాషింగ్టన్: తెలుగు కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్ చేస్తున్నందుకు సీఎన్ఎన్ హీరోస్ యంగ్ వండర్ అవార్డు కైసవం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ కుర్రాడి పేరు శ్రీ నిహాల్ తమ్మన. తెలుగు మూలాలున్న ఇతని కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తోంది. వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్ మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల బ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్. 2019లోనే 'రీసైకిల్ మై బ్యాటరీ క్యాంపెయిన్' ప్రారంభించాడు. బ్యాటరీ రీసైకిల్‌పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు నిహాల్. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేశాడు. ఇలా మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. నిహాల్ ప్రతిభను గుర్తించిన సీఎన్ఎన్ అతడ్ని యంగ్ వండర్ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిహాల్ చెబుతున్నాడు. చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు! -
నడిరోడ్డుపై పేలిపోయిన ఆటో.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మంగళూరు: కర్ణాటకలో ఆటో రిక్షా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మరోక వ్యక్తి ఆధార్ కార్డుని వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆ ప్రయాణికుడు తమకూరు డివిజన్‌కి చెందిన రైల్వేలో పనిచేస్తున్న ప్రేమరాజ్ హుటాగి అనే వ్యక్తి ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నాడుని చెప్పారు. సదరు వ్యక్తి గతేడాది రెండుసార్లు తన ఆధార్‌కార్డుని పోగొట్టుకున్నాడుని చెప్పారు. కానీ అతను కచ్చితంగా ఎక్కడో పోగొట్టుకున్నది చెప్పలేదని అన్నారు. ఈ మేరకు సదరు రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ..." తనకి సుమారు రాత్రి 7.30 గంటలకి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చించి. మీరు ఎక్కడ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తన గురించి ఆరా తీశారు. అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత ఆ ఆటో రిక్షా పేలుడు ఘటన గురించి చెప్పారు. తనకు పోలీసులు చెప్పేంత వరకు కూడా ఈ ఘటన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. ఐతే తన ఆధార్ కార్డు పోయిందనేది వాస్తవమే గానీ మంగళూరులో తాను పోగొట్టుకోలేదని చెబుతున్నాడు. తన ఆధార్ కార్డు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, మరో ఆధార్ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా తన ఆధార్‌కార్డు మిస్యూజ్ అవుతుందని తనకసలు తెలియదని" చెబుతున్నాడు. ఇదిలా ఉండగా. ...ఈ ఆటో రిక్షా బ్లాస్ట్‌కి కారణం ఆ ప్రయాణికుడేనని, అతనే నిందితుడని కర్ణాటక డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రవీణ్ సూద్ తేల్చి చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణికుడు బ్యాటరీలు అమర్చిన కుక్కర్‌ని వెంట తీసుకువెళ్లాడని చెప్పారు. అందువల్ల ఈ పేలుడు సంభవించి, ఆ డ్రైవరు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అలాగా ఆ ప్రయాణికుడు నకిలీ ఆధార్ కార్డుతో, నకిలీ అడ్రస్, నకిలీ పేరుతో చెలామణి అవుతున్నాడని చెప్పారు. ఇది అనుకోని ప్రమాదం కాదని పెద్ద ఎత్తున నష్ట కలిగించేలా ప్లాన్ చేసిన ఉగ్రవాద చర్యేనని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ చీఫ్ ఈ ఘటనసై రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కేంద్ర నిఘా సంస్థలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సదరు నిందితుడు కోయంబత్తూర్‌లో తప్పుడు పేరుతో సిమ్ తీసుకున్నట్లు చెప్పారు. అతని కాల్ డేటా ఆధారంగా తమిళనాడు అంతటా పర్యటించాడని చెప్పారు. తమిళనాడులో అతను ఎవరెవర్నీ కలుసుకున్నాడు, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు) -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
హైడ్రోజన్ సెల్.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు
హైడ్రోజన్ సెల్– దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా అనుబంధ సంస్థ ‘వోవెన్ ప్లానెట్’ చిన్నసైజు సిలిండర్‌లాంటి ఈ హైడ్రోజన్ సెల్‌కు రూపకల్పన చేసింది. దీని బరువు 5 కిలోలు మాత్రమే! ఈ హైడ్రోజన్ సెల్ గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిపోయాక వీటిని రీఫిల్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోజన్ సెల్స్‌తో వాహనాలకు, విద్యుత్ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. ప్రత్యేకించి విహారయాత్రకు వెళ్లేవారికి ఈ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని హైడ్రోజన్ సెల్స్ మరింతగా వినియోగంలోకి వస్తే, ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్! -
ఎలక్ట్రిక్ బైక్ నుంచి పొగలు
-
బ్యాటరీ ఫ్యాకర్టీలో అగ్ని ప్రమాదం
-
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లి కోడుకు మృతి
-
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లికొడుకు మృతి
-
విషవాయువుతో బ్యాటరీ..!
గాలిలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతోందన్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూమ్మీద మనిషి మను గడ కూడా కష్టమన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేసి కార్బన్ డయాక్సైడ్‌తోనే పనిచేసే ఓ రీచార్జబుల్ బ్యాటరీని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ నిల్వ చేసుకోగలగడం దీని ప్రత్యేకత. కచ్చితంగా చెప్పాలంటే లిథియం అయాన్ బ్యాటరీ కంటే 7 రెట్లు ఎక్కువ విద్యుత్ నిక్షిప్తం చేసుకోగలదీ కొత్త బ్యాటరీ. గతంలోనూ ఇలాంటి బ్యాటరీలు తయారు చేసినప్పటికీ అవి ఎక్కువసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఉపయోగపడేవి కావు. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని కొత్తరకం పదార్థాలను వాడటం ద్వారా ఒక్కో బ్యాటరీ కనీసం 500 సార్లు రీచార్జ్ చేసుకునేలా తయారు చేశారు. మాలిబిడనం డై సల్ఫైడ్ను కాథోడ్ తయారీలో వాడగా.. అయానిక్ లిక్విడ్, డైమిథైల్ సల్ఫాక్సైడ్లను ఎలక్ట్రొలైట్తోనూ ఉపయోగించడం ద్వారా తాము కొత్త బ్యాటరీని తయారు చేశామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సలేహీ ఖోజిన్ తెలిపారు. వాణిజ్య స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీల తయారీకి ఇంకొంచెం సమయం పట్టే అవకాశమున్నట్లు చెప్పారు. -
ఎలక్ట్రిక్ బస్సు సిటీ గడప దాటదా?
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మల్లగుల్లాలు పడుతోంది. దూర ప్రాంతాలకు నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏర్పడి మధ్యలో ఆగిపోతే ఎలా అని ఆందోళన చెందుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపైనా సంస్థ తీవ్రంగా మ«థనపడుతోంది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి ప్రాంతాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ప్రతిపాదననూ ఆర్టీసీ విరమించుకుంది. ఫలితంగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)’పథకం రెండో విడత కింద కేంద్రం పెద్ద సంఖ్యలో బ్యాటరీ బస్సులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పరిమిత సంఖ్యలోనే తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ పథకం కింద 600 బస్సులు మంజూరుకు వీలుగా కేంద్రాన్ని కోరాలని ముందుగా భావించింది. కానీ, హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు వాటిని నడిపితే ఏర్పడే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇప్పటికిప్పుడు లేనందున కేవలం 334 బస్సులు మాత్రమే కోరాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు కేంద్రానికి పంపే గడువు గురువారంతో ముగుస్తుండటంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి పంపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి పంపనున్నారు. సమస్యగా చార్జింగ్ స్టేషన్లు.. ఎలక్ట్రిక్ బస్సు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పథకం మొదటి దశ కింద మంజూరై హైదరాబాద్‌లో తిరుగుతున్న ఏసీ బస్సుల ధర ఒక్కోటి రూ.2.40 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 60 శాతం బ్యాటరీదే భారం. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు తయారువుతున్నా.. బ్యాటరీలను మాత్రం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో బ్యాటరీ బస్సులను వాడిన దాఖలాలు లేనందున ఎక్కడా వాటి చార్జింగ్ పాయింట్లు లేవు. గతేడాది హైదరాబాద్‌లో 40 బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీంతో వాటి కోసం 3 చోట్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. చార్జింగ్ కేంద్రం ఏర్పాటు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్‌లోనే చార్జ్ చేసి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా నగరం నుంచి ఇతర పట్టణాలకు వాటిని నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రయాణం మధ్యలో బస్సు బ్యాటరీలో సమస్య తలెత్తితే దాన్ని వెనక్కు తీసుకురావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే తరచూ సమస్యలు తలెత్తితే వాటిని నిర్వహించటం సాధ్యం కాదని తేల్చుకున్న అధికారులు.. వాటిని హైదరాబాద్ వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులే.. ఫేమ్ పథకం తొలి దశలో 40 బస్సులు కొన్నారు. అవన్నీ ఏసీ బస్సులే. వీటిని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిప్పుతున్నారు. ఇప్పుడు కొత్తగా నాన్ ఏసీ బ్యాటరీ బస్సులే కొనాలని నిర్ణయించారు. వీటి ధర తక్కువగా ఉండటంతో టికెట్ ధర కూడా తగ్గనుంది. దీంతో వీటికి సాధారణ ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందనేది అధికారుల ఆలోచన. నగరం, శివారు ప్రాంతాలు, సమీపంలోని చిన్న పట్టణాల వరకు మాత్రమే వీటిని తిప్పబోతున్నారు. వరంగల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే బస్సులను పూర్తిగా సిటీ బస్సులుగానే నడపాలని నిర్ణయించారు. అన్ని చోట్లా సిటీ సర్వీసులే.. ప్రస్తుతం దేశంలో ఎక్కడా దూర ప్రాంతాలకు వీటిని నడపటం లేదు. ఢిల్లీ, బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లో ఈ బస్సులు పరుగుపెడుతున్నా.. అన్ని చోట్లా సిటీ బస్సులుగానే తిరుగుతున్నాయి. దూర ప్రాంతాల మధ్య వాటిని ప్రారంభించనందున.. వాటి నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టీసీకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 వేల బస్సులు తిప్పాలని కేంద్రం నిర్ణయించినందున, కొన్ని చోట్ల దూరప్రాంతాల మధ్య తిప్పే అవకాశం ఉంది. అప్పుడు ఆయా సంస్థలకు ఎదురయ్యే అనుభవాలను తెలుసుకుని భవిష్యత్‌లో రాష్ట్రంలో కూడా దూర ప్రాంతాల మధ్య వాటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సుల వివాదం.. మరో కారణం.. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 25 శాతానికి మించకూడదనేది నిబంధన. కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో దీన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిమితి నిండిపోయింది. కొత్తగా అద్దె బస్సులను ఏర్పాటు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయి కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అద్దె బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనే బ్యాటరీ బస్సులను అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక సంఘాల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎదుర్కోవటం కూడా ఇబ్బందిగా అధికారులు భావించారు. వెరసి తొలుత 600 బస్సులు సమకూర్చుకోవాలని భావించినా ఇప్పుడు దాన్ని 334కే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఎక్కువ బస్సులు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే అందుకు వీలుగా 550, 450 బస్సులు తీసుకునేలా రెండు ప్రతిపాదనలు కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. స్మార్ట్ సిటీ బస్సులు.. స్మార్ట్ సిటీలకు ప్రత్యేకంగా ఈ బస్సులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఉన్న వరంగల్ పట్టణంలో కొన్నింటిని ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. 12 మీటర్లు, 9 మీటర్లు, 7 మీటర్ల పొడవుండే 3 కేటగిరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 40 బస్సులు 12 మీటర్ల పొడవైనవే. పాతబస్తీ లాంటి ఇరుకు దారులుండే రోడ్లపై వీటిని నడపడం ఇబ్బందిగా ఉంటుంది. టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉన్నందున వీటిలో రద్దీ కూడా తక్కువగా ఉంటోంది. అందుకోసం సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చిన్న బస్సులే తిప్పబోతున్నారు. ఇందుకోసం 9, 7 మీటర్ల బస్సులను కూడా కొంటున్నారు. మొత్తం 334 బస్సులు కొనాలని దాదాపు ఖరారు చేశారు. ఇందులో 309 బస్సులను హైదరాబాద్‌లో తిప్పాలని, మిగతా వాటిని వరంగల్ పట్టణంలో సిటీ బస్సులుగా తిప్పాలని భావిస్తున్నారు. -
ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్టు
కడ్తాల్(కల్వకుర్తి): గత కొంతకాలంగా జిల్లాలోని కడ్తాల్ షాద్‌నగర్‌తో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా తదితర ప్రాంతాల్లో పలు వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్ సబ్ డివిజన్ ఏసీపీ సురేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో షాద్‌నగర్ టౌన్ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్యతో కలిసి ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన కావేటి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం తప్పట్ల నర్సు గ్రామానికి చెందిన దేవరేటి తిమ్మప్ప అలియాస్ శివ స్నేహితులు. వీరిద్దరూ రాత్రి వేళల్లో నిలిపి ఉన్న వాహనాల బ్యాటరీలు చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్నగర్ తదితర ప్రాంతాల్లో దాచిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలోని కడ్తాల్, షాద్‌నగర్ ప్రాంతాలతో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా తదితర ప్రాంతాల్లో 80 వరకు వాహనాల బ్యాటరీలు చోరీ అయ్యాయి. ఇదిలా ఉండగా గత మార్చి 28న కడ్తాల్‌లో, 29న షాద్‌నగర్ రెండు ప్రదేశాలలో పలు వాహనాల బ్యాటరీలు మాయం కావడంతో సంబంధిత వాహనాల యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాహన తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తలకొండపల్లి చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న టాటా ఏస్ వాహనంలో 8 బ్యాటరీలను గుర్తించిన పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేసి విచారించగా వారు బ్యాటరీల దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. పోలీసుల విచారణలో రూ.4.23లక్షల విలువ చేసే80 బ్యాటరీలను చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్నగర్ తదితర ప్రాంతాల్లో దాచిపెట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా రూ. 3.75 లక్షల విలువ చేసే 71బ్యాటరీలను, వివిధ ప్రాంతాలలో స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ సురేందర్ తెలిపారు. చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులలో కావేటి శ్రీనుపై గతంలో పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులున్నట్లు చెప్పారు. స్వాధీన పరుచుకున్న బ్యాటరీలను కోర్టుకు సమర్పించి, నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బందికి ప్రశంస.. బ్యాటరీల చోరీ కేసును స్వల్ప కాలంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ సురేందర్ ప్రత్యేకంగా అభినందించారు. షాద్‌నగర్ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్యలతో పాటు, ఆమనగల్లు, కొందుర్గు, నందిగామ, తలకొండపల్లి, షాద్‌నగర్, కడ్తాల్ పోలీస్ స్టేషన్లలో క్రైమ్ డిపార్టుమెంట్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్లా, గురుప్రసాద్, శేఖర్, రవీందర్, శివకుమార్, యాదగిరిలను అభినందించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందానికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
వేడి బ్యాటరీ రెడీ అవుతోంది!
రోజంతా మండే సూర్యుడు పుట్టించే వేడిని రాత్రిళ్లు వాడుకోగలిగితే ఎలా ఉంటుంది? సాయంకాలమవుతూనే చల్లబడటం మొదలవుతుంది కాబట్టి అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు మాత్రం ఇలా అనుకోవడం లేదు. పగటి వేడిని నిల్వ చేసుకుని.. అవసరమైనప్పుడు దాన్ని విడుదల చేసే సరికొత్త బ్యాటరీని తయారు చేశారు వీరిప్పుడు. వేడి చేస్తే మంచు కరిగి నీరవుతుంది. చల్లబరిస్తే నీరు కాస్తా మళ్లీ మంచుగా మారిపోతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇంకోలా చెప్పాలంటే వేడిని నిల్వ చేసుకుని మంచు కాస్తా నీరైందన్నమాట. చల్లబరచడం ద్వారా నీటిలోని వేడి విడుదలై మంచు ఏర్పడింది. మైనం, కొవ్వులు ఇలా చాలా పదార్థలు కూడ ఇలాగే వేడితో తమ స్థితిని మార్చుకుంటాయి. వీటినే ఫేజ్ ఛేంజ్ మెటీరియల్స్ (పీసీఎం) అంటారు. కాకపోతే ఇవి నిల్వ చేసుకున్న వేడి బయటకు పోకుండా చూడటం చాలా కష్టం. ఈ నేపత్యంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు పరమాణు స్థాయిలో స్థితిని మార్చుకునే వినూత్నమైన వ్యవస్థను అభివద్ధి చేశారు. దీన్ని పీసీఎంలకు అనుసంధానిస్తే చాలు.. వేడి ఆ పదార్థం లోపలే ఉండిపోతుంది. చిన్న కాంతి కిరణానికి స్పందించే పదార్థాన్ని కొవ్వులతో కలపడం ద్వారా వీరు వేడిని నిల్వ చేసుకోగల బ్యాటరీని సిద్ధం చేశారు. ఇది పరారుణ కాంతిని స్వీకరించి కరిగిపోతుంది. ఆ తరువాత ఎంత చల్లబరిచినా కూడా గట్టిపడదు. ఇంకో రకమైన కాంతి కిరణంతో మాత్రమే ఈ పదార్థం మళ్లీ గట్టిపడుతుంది. ఈ వినూత్న పదార్థంతో ఫ్యాక్టరీలతోపాటు అనేక చోట్ల వథా అవుతున్న వేడిని వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
మూడింతల శక్తిమంతమైన బ్యాటరీ
విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ కూడా త్వరలోనే పెట్రోలు, డీజిల్ కార్లను నిషేధిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జపనీస్ సంస్థ తొషీబా బ్యాటరీ టెక్నాలజీలో కీలక పురోగతి సాధించింది. నిమిషాల్లోనే రీచార్జ్ అవడంతోపాటు ఒకసారి చార్జ్ చేసుకుంటే మూడింతలు ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాయి. తొషీబా తాజాగా టైటానియం– నియో యం ఆక్సైడ్‌ను ఆనోడ్‌గా వాడుతూ కొత్త బ్యాటరీని అభివృద్ధి చేసింది. వీటిలో లిథి యం అయాన్లు ఎక్కువగా నిక్షిప్తమయ్యేం దుకు తద్వారా మైలేజీ పెరిగేందుకు మార్గం సుగమమైంది. కొత్త టెక్నాలజీతో తయారు చేసిన 50 ఆంపియర్ హవర్స్ బ్యాటరీ విద్యుత్ నడిచే కారులో ఉపయోగిస్తే అది దాదాపు 320 కి.మీ దూరం ప్రయాణించగలదని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ఒసము హోరీ చెప్పారు. పైగా కొత్త బ్యాటరీలను ఆరు నిమిషాల్లో రీచార్జ్ చేసుకోవడమే కాక, 5,000 సార్లు రీచార్జ్ చేసుకోవచ్చంటున్నారు. 2019 నాటికి ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తాయని అంచనా. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌లో బ్యాటరీ సమస్య?
ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టించాయి. శాంసంగ్ గెలాక్సీ 7కి చుట్టుముట్టినట్లే తాజాగా ఆపిల్ ఐఫోన్ 8కి బ్యాటరీ పరమైన సమస్యలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. రెండు దేశాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాటరీపరంగా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు సంఘటనలు నమోదైనట్టు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ఒకటి తైవాన్లోనూ, మరొకటి జపాన్‌లోనూ చోటు చేసుకున్నాయి తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోయింది. ఈ భాగం ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి. తైవాన్‌కి చెందిన మహిళ మిస్. వూ 64 జీబీ స్టోరేజ్ రోజ్ గోల్డ్ ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేశారు. ఐదు రోజుల తరువాత ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే ఫోన్ ముందు భాగం ఉబికి వచ్చింది. చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికే బాడీనుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయి కనిపించిందని ఐ ఫోన్ 8 ప్లస్ ఓనర్ వాపోయారు. దీనిపై విశ్లేషణ కోసం కొన్ని డివైస్‌లను ఆపిల్ సంస్థ తిరిగి పంపిస్తున్నారట. అంతేకాదు శాంసంగ్ గెలాక్స్ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమయిన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే ఐ ఫోన్ 8, 8ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు దేశీయంగా కూడా ఐ ఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఆపిల్ ను సంప్రదించినపుడు అది కేవలం నెట్వర్క్ సమస్య అని అయితే ఈ వార్తలపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. అలాగే ఆపిల్ స్మార్ట్ఫోన్లు ఐ ఫోన్, ఐ ఫోన్ 7ప్లస్ పేలుళ్లు అక్కడక్కడా నమోదైన సంగతి తెలిసిందే. iPhoneが昨日より膨らんでる。 Apple、早く回収しにきて! pic.twitter.com/sRx6orgxi6 — まごころ (@Magokoro0511) September 25, 2017 -
ఇక విద్యుత్‌నూ నిల్వ చేయొచ్చు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సాధారణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన వెంటనే సరఫరా చేసి వినియోగదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప విద్యుత్‌ను నిల్వ చేసే అవకాశం ఇప్పటివరకు అందుబాటులో లేదు. కాకుంటే చిన్న చిన్న బ్యాటరీల్ని ఏర్పాటు చేసుకుని ఇన్వర్టర్ల ద్వారా గృహావసరాలకు మాత్రమే విద్యుత్‌ను నిల్వ చేసుకునే వీలుంది. అంతేతప్ప భారీస్థాయిలో మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను నిల్వ చేసుకునే ప్రాజెక్టేదీ ఇంతవరకూ రాష్ట్రస్థాయిలో ఎక్కడా లేదు. అయితే తాజా సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో విద్యుత్‌ను నిల్వ చేసేందుకోసం ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనూ విద్యుత్‌ను నిల్వ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా సౌర విద్యుత్‌ను నిల్వ చేయాలని ఇంధనశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ పేరుతో 5 మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. నెల్లూరు లేదా విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఇంధనశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారిగా రాష్ట్రంలో తలపెట్టిన ఈ విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకోసం టెండర్ల ప్రక్రియను సైతం ప్రారంభించారు. ఇందుకోసం పలు కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటును నెలకొల్పడంతోపాటు బ్యాటరీలద్వారా విద్యుత్‌ను నిల్వ చేయాల్సి ఉంటుంది. దీని ఏర్పాటుకుగాను మెగావాట్‌కు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే విద్యుత్‌ను కూడా నిల్వ చేసుకుని అవసరమైన సమయాల్లో సరఫరా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా కరెంటు కష్టాలను అధిగమించడానికి వీలవుతుంది. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల(బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు) సామర్థ్యం భారీస్థాయిలో ఉంటుంది కాబట్టి.. సౌర విద్యుత్ వైపుగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
సూర్యుడికి స్విచ్ వేసినట్లే..!
సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే.. కరెంటు కోతల్లేకుండా చేసుకోవచ్చుగానీ.. ఏర్పాటుతోనే వస్తుంది చిక్కు. ఉన్న ప్యానెళ్లేమో బోలెడంత బరువున్నాయి. ప్యానెళ్లతోపాటు బ్యాటరీ, ఇన్వర్టర్ వంటివీ అవసరమవుతాయి. ఖరీదు కూడా ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటి వల్లే కాబోలు.. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై ఈ చికాకులేవీ ఉండవులెండి! ఎందుకంటే.. ఫొటోల్లో కనిపిస్తున్న సోల్ప్యాడ్ ప్యానెళ్లు వచ్చేస్తున్నాయి మరి! ఈ ప్యానెల్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది ఆల్ ఇన్ వన్! ఇన్వర్టర్, బ్యాటరీ, ప్యానెళ్లు అన్నీ కలగలిపి వస్తాయి. అలాగే అవసరానికి తగినంత విద్యుత్తును మాత్ర మే సరఫరా చేయడం మిగిలినదాన్ని బ్యాటరీల్లో నిల్వ చేయడం ఆటోమేటిక్‌గా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో జరిగిపోతుంటుంది. ఇంట్లోని ఏయే ఎలక్ట్రిక్ పరికరాలకు సోలార్ విద్యుత్తు వాడాలన్నదాన్ని కూడా మనమే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో నిర్ణయించుకోవచ్చు. కావాల్సినప్పుడు మార్చుకోవచ్చు. ఇది కాకుంటే.. సోల్ కంట్రోల్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన ఒక్కో స్మార్ట్ గాడ్జెట్‌ను వాడుకోవచ్చు. ఇది మనం తరచూ ఆన్/ఆఫ్ చేసే పరికరాలను పరిగణనలోకి తీసుకుని వేటికి సోలార్ ఎనర్జీ అందించాలో నిర్ణయిస్తుంది. ప్యానెల్ వెనుకన ఉండే యూఎస్బీ పోర్ట్స్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లకు నేరుగా చార్జ్ చేసుకునే అవకాశముంది. ఒక్కో ప్యానెల్‌ను కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. బరువు 12 కిలోలు మాత్రమే. ఎక్కువ విద్యుత్తు అవసరమైతే.. ఒకటి కంటే ఎక్కువ ప్యానెళ్లను జత చేసుకునే ఏర్పాట్లున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ తయారు చేస్తున్న ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కూడా ఎక్కువేనని అంచనా. -
బ్యాటరీ సైకిల్‌పై సవారీ
35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఆకట్టుకుంటున్న ఈ-పేంథర్, ఈ-డ్రాగన్ సైకిళ్లు రూపొందించిన గైట్ విద్యార్థులు రాజానగరం : ఆలోచనలకు పదును పెడితే అనేక అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక గైట్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేస్తున్న థర్డియర్, ఫైనల్ ఇయర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ఈ సైకిళ్లకు ‘ఈ–పేంథర్, ఈ–డ్రాగాన్’ అని నామకరణం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను హెచ్ఓడీ సుబ్రహ్మణ్యం శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ–పేంథర్ ఆటోమెబైల్ ఇంజినీరింగ్ చదువుతున్న బీటెక్ థర్డియర్ విద్యార్థులు హర్షవర్థన్‌రెడ్డి, కుమార్ వెంకటేష్, చంద్రశేఖర్ తాతాజీ పాత సైకిళ్లను తీసుకుని మెరుగులు దిద్దారు. బ్యాటరీ, మోటారును అమర్చిన సైకిల్‌కు ‘ఈ–పేంథర్’ అని పేరుపెట్టారు. దీని తయారీకి రూ.17 వేలు ఖర్చయింది. ఈ–డ్రాగాన్ బీటెక్ ఫైనలియర్‌కు చెందిన రాఘవ, మంజూష, మోహన్, సందీప్‌లు ఇదే తరహాలో బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ‘ఈ–డ్రాగాన్’ పేరు పెట్టిన వీటి తయారీకి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. ప్రొఫెసర్ సందీ రాజశేఖర్ పర్యవేక్షణలో వీటిని తయారు చేశారు. బాలల నుంచి వృద్ధుల వరకూ ఈ వాహనాలను నడిపే వీలుంది. 35 కి.మీ. వేగంతో నడిచే ఈ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీకి ఒకసారి చార్జింగ్ పెడితే 30 కి.మీ. వరకూ నడుస్తుంది. ఈ సైకిళ్లకు ఒక్కోదానికి 250 వాట్స్ మోటారు, కంప్యూటర్ యూపీఎస్‌లో వాడే బ్యాటరీలు నాలుగు (ఒక్కొక్కటి 12 వాట్స్) ఉపయోగించారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా వీటిని తయారు చేశారని హెచ్ఓడీ తెలిపారు. -
బ్లాక్‌బస్టర్ బ్యాటరీ...
వాట్లు.. కిలోవాట్లు కాదు.. ఏకంగా వంద మెగావాట్లు! ఆస్ట్రేలియాలో విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్న ఓ భారీ బ్యాటరీ సామర్థ్యం ఇది. ఇంత భారీ సైజు బ్యాటరీ తయారవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఈ భారీ బ్యాటరీ సిద్ధమవుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కోతల నివారణకు తగిన మార్గాలు చూపాల్సిందిగా స్థానిక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కంపెనీలకు ఆహ్వానం పలికింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 91 కంపెనీలు పోటీపడ్డాయి. అయితే అవకాశమిస్తే కేవలం వంద రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి కరెంటు కోతల్లేకుండా చేస్తానని లేదంటే అందరికీ ఉచితంగా కరెంటు పంచిపెడతానని ట్వీట్టర్ వేదికగా మస్క్ సవాలు విసిరారు. తాజాగా ఈ కాంట్రాక్ట్ మస్క్‌కే దక్కడంతో వంద మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీని తయారు చేస్తానని హామీనిచ్చారు. గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఈ బ్యాటరీలో నిల్వ చేసి కోతల సమయంలో అందరికీ సరఫరా చేస్తానని మస్క్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తయ్యే వంద మెగావాట్ల బ్యాటరీతో దాదాపు 30 వేల ఇళ్లకు విద్యుత్ అందుతుంది. -
పదేళ్లు పనిచేసే బ్యాటరీలు!
బోస్టన్ (అమెరికా): దాదాపు దశాబ్ద కాలం పాటు నిరంతరంగా పనిచేసే సామర్థ్యంగల బ్యాటరీలను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ విషరహిత బ్యాటరీలు నీటిలో కరిగి ఉన్న కర్బన అణువుల రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటాయని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు 1000 సైకిల్స్ (చార్జింగ్/డిస్చార్జింగ్) పూర్తి కాగానే వాటి జీవిత కాలం ముగుస్తుంది. కానీ ఈ విషరహిత బ్యాటరీలు మాత్రం 1000 సైకిల్స్ పూర్తయ్యేసరికి 1 శాతం సామర్థ్యాన్ని మాత్రమే కోల్పోతాయని హార్వర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్ మైఖేల్ అజీజ్ తెలిపారు. తటస్థ జలంలో ఎలక్ట్రోలైట్లను కరిగించడం వలన ఆ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయని వివరించారు. పరిశోధన ఫలితాలను ఏసీఎస్ ఎనర్జీ లెటర్స్ జర్నల్‌లో పొందుపరిచారు. -
మూడు టైర్ల టూ వీలర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్ విద్యుత్తుతో నడిచే వాహనాల గురించి మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం. ఫోల్డ్ చేసుకునే బుల్లి బైకుల నుంచి పడవంత కార్లు కూడా ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. ఇందులో ఏమీ విశేషం లేదుగానీ.. ఈ ఫొటోను పరిశీలనగా గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది. అవునండి... ఈ మోటా ర్‌సైకిల్ రెండు చక్రాల బండి కాదు. మూడు చక్రాలబండి. ఇదొక్కటే దీని విశేషం కాదులెండి. ఇంకా చాలా ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్ వర్జీనియా ప్రాంతంలో ఉండే జెడ్ఈవీ అనే చిన్న కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఇప్పటివరకూ చాలా మోడళ్ల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేసిన ఈ సంస్థ తాజాగా ముందువైపున రెండు, వెనుకవైపు ఒక చక్రం ఉండే ఎల్‌ఆర్‌సీ – టీ 15ని సిద్ధం చేసింది. ఎల్‌ఆర్‌సీ టీ–15 అని పిలుస్తున్న ఈ మోటార్ బైక్ 15 కిలోవాట్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. అది కూడా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో! బీఎండబ్ల్యూ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కంపెనీ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు ఇంత సామర్థ్యమున్న బ్యాటరీని వాడుతున్నప్పటికీ కేవలం 160 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలగడం విశేషం. పైగా ఎల్‌ఆర్‌సీ టీ–15 మోటార్.. బాడీలో కాకుండా చక్రంలోనే ఏర్పాటు అవడం మరో విశేషం. మూడు చక్రాలు ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా స్థిరంగా ఉంటుంది. వంపులు వచ్చినప్పుడు ముందువైపున ఉన్న రెండు చక్రాలు వంపునకు తగ్గట్టుగా పైకి కిందకు కదులుతాయి. పదేళ్ల క్రితం పియాజియో కూడా ఇలాంటి బైక్‌ను సిద్ధం చేసినప్పటికీ అది మార్కెట్ ఆదరణ చూరగొనలేదు. తాజాగా జెడ్ఈవీ సిద్ధం చేసిన ఈ సరికొత్త బైక్‌కు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి. రేటెంతో చెప్పలేదు కదూ... దాదాçపు 20 వేల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 14 లక్షలు! -
ఇక సెల్ఫోన్లను ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
-
ఇక సెల్ఫోన్లను ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అత్యవసరంగా ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం వస్తే.. సమయానికి స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతే... పవర్ బ్యాంక్‌లో కూడా పవర్ అయిపోతే... చార్జింగ్కు ఎలాంటి అవకాశం లేకపోతే...ఎలాంటి కమ్యూనికేషన్‌కు ఆస్కారం లేని ఎడారి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోతే!. ఇక నుంచి అలాంటి తిప్పలను తప్పించేందుకు బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచంలోని పలు సంస్థలు ఇప్పటికీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి పరిశోధనలు ఇంకేమాత్రం అవసరం లేదని, తాము శాశ్వత పరిష్కారం కనుగొన్నామని బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఇక జీవితాంతం చార్జింగ్ చేయాల్సిన అవసరంలేని డైమండ్ బ్యాటరీని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ జీవితాంతం అంటే మన జీవితాంతమని కాదు. ఆ డైమండ్ బ్యాటరీ కాలం అని. ఇంతకు దాని జీవితం ఎంతంటే 11,460 సంవత్సరాలట. అందులో సగం చార్జింగ్ అయిపోవడానికి 5,730 సంవత్సరాలు పడుతుందట. ఈ బ్యాటరీని సెల్ఫోన్ల్తోపాటు ట్యాబ్, ల్యాప్‌ట్యాప్ లాంటి అన్ని చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థ అణుథార్మికతలో కార్బన్ 14 ఉంటుందని, దాని నుంచి కృత్రిమ వజ్రాలను తయారు చేయవచ్చని, అణు థార్మిక శక్తిగల ఆ వజ్రం నుంచి నిరంతం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని బ్రిస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ కృత్రిమ డైమండ్ బ్యాటరీ నుంచి అణుధార్మికత నేరుగా మనపై ప్రభావం చూపించకుండా ఆ డైమండ్‌పై మరో పొరను కవచంలా ఏర్పాటు చేయవచ్చని వారు చెప్పారు. ఈ కవచం వల్ల అణు డైమండ్ బ్యాటరీ నుంచి వెలువడే అణు ధార్మికత శక్తి ఓ అరటి పండు నుంచి వెలువడేదానికి సమానంగా ఉంటుందని, కనుక మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని వారు తెలిపారు. అయితే ఎంతకాలంలో అవి మనకు అందుబాటులోకి వస్తాయో మాత్రం వారు తెలపలేదు. -
వేడియారం
మన శరీరం ఎల్లప్పుడూ వెచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎలాంటి పని లేకుండా ఉన్నప్పుడు ఈ వేడితో ఓ బల్బును వెలిగించవచ్చునట. వ్యాయామం చేసేటప్పుడు పుట్టే వేడిలో మాత్రం ఈ విద్యుత్తు ఓ కిలోవాట్ వరకూ ఉంటుందని అంచనా. ఇప్పుడీ వేడి... విద్యుత్తు సంవాదం ఎందుకయ్యా అంటే... పక్కనున్న ఫొటో చూడండి. ఈ వాచీకి బ్యాటరీ అన్నది అస్సలు అవసరం లేదు. మన శరీరంలోని వేడితోనే పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ పవర్ వాచ్ కంపెనీ ఐదేళ్ల శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సూపర్ స్మార్ట్‌వాచ్ రోజువారీ వ్యాయామం లెక్కలేయడంతోపాటు ఎంత విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగేంత వేడి పుట్టించారో కూడా చెబుతుంది. యాభై మీటర్ల లోతు నీళ్లల్లో వేసినా చెక్కుచెదరని ఈ వాచ్ నుంచి ఆండ్రాయిడ్ ఓఎస్‌కు, అక్కడి నుంచి క్లౌడ్‌కు సమాచారాన్ని పంపించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి... ఈ వాచీ నడవాలంటే ఎప్పుడూ కట్టుకునే ఉండాలా? అవసరం లేదు. తీసేయగానే ఇది స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అతితక్కువ కరెంటుతో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇండిగోగో ద్వారా కేవలం రెండు నెలల్లోనే దాదాపు లక్ష డాలర్ల పెట్టుబడులు సేకరించిన మ్యాట్రిక్స్ పవర్‌వాచ్ కంపెనీ వచ్చే ఏడాది జూలై నుంచి వీటిని అందరికీ అందుబాటులోకి తేనుంది. ధర దాదాపు రూ.9 వేల వరకూ ఉండవచ్చు. -
గూగుల్ క్రోమ్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ డెడ్!
ల్యాప్‌టాప్ బ్యాటరీ తొందరగా డెడ్ అవుతోందా.. దానికి కేవలం మీ లాప్టాప్ తయారీ సంస్థను మాత్రమే నిందించాల్సిన అవసరం లేదు. అందులో మీరు వాడే బ్రౌజర్లు కూడా.. బ్యాటరీ ఎంత వేగంగా ఖర్చవుతుంది అనే విషయాన్ని నిర్ణయిస్తాయని మైక్రోసాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందని నిర్థారించారు. ఇందులో భాగంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి వివిధ బ్రౌజర్లతో ఉన్న ఒకే తరహా ల్యాప్‌టాప్‌లను లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా పరీక్షించగా.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డెడ్ అవటం గమనించారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ అతి తక్కువ సమయం 4:19 గంటలు పనిచేయగా.. మొజిల్లా 5:09 గంటలు, ఒపేరా 6:18 గంటలు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కలిగిఉన్న ల్యాప్‌టాప్ అత్యధికంగా 7:22 నిమిషాలు పనిచేసినట్లు గుర్తించారు. అయితే బ్యాటరీ సేవింగ్ విషయంలో ఇటీవలి కాలంలో గూగుల్ క్రోమ్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ కంపెనీ ప్రతినిథి తెలిపారు. -
ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!
యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి 12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. -
పర్యావరణ ప్రియమైన ప్రయాణం..!
ఏథెన్స్: పెట్రోల్, డీజిల్ అవసరం లేదు... బ్యాటరీలో చార్జింగ్ ఉంటే చాలు, బ్యాటరీలో చార్జింగ్ కూడా లేకుండా పోతే...పైన ఉన్న సోలార్ ప్యానల్ రీచార్జితో నడుస్తుంది, సౌరశక్తి కూడా అందుబాటులో లేకుండా పోతే... వాహనంలోని మనుషులే శక్తిని సృష్టించుకోవచ్చు! పెడల్స్ తొక్కుతూ బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు... ఇలా మూడు ప్రత్యామ్నాయ వనరులతో నడిచే బండి ఇది. పేరు ‘సన్నీ క్లిస్ట్’. చూడటానికి ఆటోలా... లైట్‌వెయిట్ బాడీతో ఉండే ఈ వాహనం ఎలక్ట్రానిక్ బ్యాటరీ చార్జింగ్‌తో దాదాపు 70 కిలోమీటర్ల దూరం అవిరామంగా పయనిసిస్తుంది. ఆ దూరం పయనించే లోగా సమకూర్చుకునే సౌరశక్తితో మరో 50 కిలోమీటర్ల నడవగలదు. ఎలక్ట్రికల్ బ్యాటరీ శక్తి, సౌరశక్తితో లభించిన పవర్ శూన్య స్థాయికి వచ్చినా ప్రత్యేక పెడల్ అమరిక వాహనాన్ని ముందుకు తీసుకెళ్లగలదు. వాహనంలో కూర్చున్న వారు పెడల్స్‌ను తొక్కితే బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. కొద్ది సేపు అలా కష్టపడితే పదిహేను కిలోమీటర్ల ప్రయాణానికి ఇంధనాన్ని సంపాదించినట్టే. ఇలా నడిపించుకోగల ఈ వాహనం ఎలాంటి కాలుష్యకారకం కాదు. వాతావరణంలోకి ఎలాంటి చెడు వాయువులనూ విడుదల చేయని అత్యుత్తమ వాహనం ఇది...అని అంటున్నారు దీని రూపకర్తలు. గ్రీస్ ఆటోమొబైల్ ఇంజనీర్లు ఈ వాహనాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఏథెన్స్ నగర శివారుల్లో తిరుగుతోంది. ఇప్పటికే యూరోపియన్ కాంపిటీషన్స్‌లో అవార్డులను కూడా అందుకున్న ఈ వాహనాన్ని పర్యావరణ ప్రేమికులకు కానుకగా అందిస్తామని అంటున్నారు రూపకర్తలు. -
హైటెక్ కారు బ్యాటరీ
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న నానా పరిమితుల కారణంగా వాటి వైపు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు. వాటికి ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేసినా 50 కిలోమీటర్లకు మించి ప్రయాణించడం కష్టం. పట్టణాలు, నగరాల్లో ఏదో లోకల్ జర్నీలకు తప్ప ఇలాంటి కార్లు లాంగ్ జర్నీలకు ఏమాత్రం అనుకూలం కాదు. అయితే, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక హైటెక్ కారు బ్యాటరీని రూపొందించారు. దీనిని ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, నిరాటంకంగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఈ హైటెక్ బ్యాటరీలతో నడిచే కార్లు పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లకు దీటుగా రోడ్లపై పరుగులు తీయగలవని, వీటి ఇంధన సాంద్రత మామూలు బ్యాటరీల కంటే 90 శాతం ఎక్కువని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్యాటరీలను వారు ‘లిథియం-ఆక్సిజన్’ సమ్మేళనంతో రూపొందించారు. మామూలు కారు బ్యాటరీల కంటే ఇవి చాలా తేలికైనవని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే లీథియం బ్యాటరీలలో ఇంధన సాంద్రత తక్కువగా ఉండటం వల్ల వాటిని తరచు చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పోలిస్తే, తాము రూపొందించిన లిథియం-ఆక్సిజన్ బ్యాటరీల ఇంధన సాంద్రత పదిరెట్లు ఎక్కువని దీని రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ క్లేర్ గ్రే చెబుతున్నారు. -
ఇక గుండెకు బ్యాటరీ లెస్ పేస్‌మేకర్
వాషింగ్టన్: వైద్యరంగంలో గుండెకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పేస్మేకర్లను వాడుతున్నారు. పేస్మేకర్లు గుండెకు కావాల్సిన కదలికలను అందించడానికి ఉపయోగపడుతాయి. అయితే ఇప్పటివరకూ వాడుతున్న పేస్మేకర్లలో బ్యాటరీలను వాడుతున్నారు. ఇక బ్యాటరీల అవసరం లేకుండా స్వతహాగా శక్తిని తయారుచేసుకునే పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నయి. పీజోఎలక్ట్రిక్ సిస్టం ద్వారా గుండెకదలికల్లో జనించే శక్తినే పేస్మేకర్లు ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ పవర్‌గా మార్చుకునే కొత్త టెక్నాలజీని అమెరికన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పటివరకు వాడుతున్న పేస్మేకర్లను వాటిలోని బ్యాటరీ చార్జింగ్ కోసం ఐదు నుండి పది సంవత్సరాలలో మార్చాల్సి ఉండేది. కాగా తాజా విధానంతో దీనికి పరిష్కారం లభించినట్లవుతుంనీ, తద్వారా పేస్మేకర్ల ఖర్చు తగ్గుతుందని ప్రొఫెసర్ అమిన్ కరామి తెలిపారు. పీజోఎలక్ట్రిక్ విధానం ద్వారా పేజ్మేకర్ల నిర్మాణంలో ఇంతకు ముందున్నటువంటి సంక్లిష్టతలు తొలగిపోనున్నట్లు తెలిపారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్న వారికోసం త్వరలోనే బ్యాటరీ లెస్ పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నాయి. -
పూరి-చెన్నై రైలులో పొగలు
పూరి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడంతో.. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం స్టేషన్ సమీపంలో పావుగంట పాటు నిలిచి పోయింది. బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడం గమనించిన గార్డు అధికారులకు సమాచారం అందిచాడు. వారి సూచనల మేరకు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రైలును ఆపేశారు. మరమ్మత్తుల అనంతరం రైలు బయలు దేరింది. -
జనరేటైర్
ఇంధనాన్ని సమకూర్చే టైర్ ఉందంటే నమ్ముతారా? ఇది నిజం. విద్యుచ్ఛక్తితో నడిచే కారుకి మరింత బ్యాటరీ పవర్‌ను ఈ రకం టైర్లు అందిస్తాయి. జెనీవాలో జరిగిన ఆటో షోలో ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కో’ కంపెనీ ఈ సరికొత్త ‘బీహెచ్ఓ3 టైర్’ను ఆవిష్కరించింది. సహజ ఇంధన వనరులు రానురాను తగ్గిపోతున్నందున ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించి ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను ఆవిష్కరించారు. కరెంటుతో నడిచే కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మంచి ప్రాచుర్యం లభిస్తోంది. వాటికి బీహెచ్ఓ3 టైర్లు అమర్చడం వల్ల కారు వేగంగా నడిపే సమయంలో టైర్లలో తీవ్రమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ యాంత్రిక వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చి కారు బ్యాటరీకి పంపడం ఈ టైర్ ప్రత్యేకత. అలా మార్చే క్రమంలో కలిగే ఒత్తిడిని తట్టుకునే మెటీరియల్‌తో ఈ టైర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకున్న ప్రధాన సమస్య రీఛార్జింగ్ . పెట్రోల్ దొరికినంత సులువుగా ఎలక్ట్రిక్ రీఛార్జ్ సెంటర్లు దొరకవు. మనదేశంలో అయితే ఎలక్ట్రిక్ కార్ల వాడకం చాలా తక్కువ. ఇప్పుడీ పవర్ జనరేటింగ్ టైర్‌తో ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. -
గంట నడిస్తే.. రెండున్నర గంటల చార్జింగ్!
మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అయిందా? అందుబాటులో చార్జ్ చేసుకునే అవకాశం లేదా? ఏం ఫరవాలేదు. ఈ బూట్లు వేసుకుని నడిస్తే చాలు.. మీ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. వీటిని వేసుకుని ఒక గంట నడిస్తే.. రెండున్నర గంటల పాటు ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వీటిని తయారు చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే.. బూట్ల కింది సోల్భాగం లోపల చిన్న జనరేటర్, మెకానికల్ వ్యవస్థ ఉంటుంది. నడిచినప్పుడు ఏర్పడే గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఈ వ్యవస్థ బూటుపైన ఉండే బ్యాటరీకి అనుసంధానమై ఉంటుంది. ఇంకేం.. నడిచినప్పుడు పుట్టే కరెంటు ఎప్పటికప్పుడు ఈ బ్యాటరీలో నిల్వ అవుతుంది. తర్వాత బ్యాటరీని తీసి కేబుల్ ద్వారా ఫోన్‌కు పెట్టుకోవడమే. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘సోల్పవర్’ కంపెనీ వెల్లడించింది. -
బ్యాటరీ ఆదాకు ఆరు దారులు...
స్మార్ట్ఫోన్లతో ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో అన్న బెంగ మాత్రం తీరడం లేదు. రకరకాల అప్లికేషన్లు వాడుతూండటం, డేటా కనెక్షన్లు ఎక్కువ కావడం దీనికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ ఛార్జ్‌ను ఆదా చేసుకోవాలంటే రెడీమేడ్ అప్లికేషన్లతోపాటు కొన్ని సింపుల్ టెక్నిక్లను పాటించడం మేలు. వాటిల్లో కొన్ని మీ కోసం... 1- రంగుల స్క్రీన్‌తో చిక్కే... స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లోని రంగులు బ్యాటరీ వాడకంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల రంగు రంగుల బ్యాక్గ్రౌండ్లు, వాల్పేపర్ల స్థానంలో వీలైనంత వరకూ డార్క్ కలర్‌వి వాడటం మేలు. దీనివల్ల బ్యాటరీ సమయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చునని అంచనా. అమోలెడ్ స్క్రీన్ల విషయంలో ఇది దాదాపు 21 శాతం వరకూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బానే ఉంది కానీ.. నా అందమైన వాల్‌పేపర్‌ను ఎలా వదులుకోవడం అనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. బ్యాటరీ ఛార్జ్ బాగా తక్కువగా ఉన్నప్పుడైనా... యానిమేటెడ్, రంగుల వాల్పేపర్ల స్థానంలో డార్క్ వాల్‌పేపర్‌ను వాడండి. 2- ప్రకటనలతో బ్యాటరీ ఖాళీ... బ్యాటరీ, మెమరీలను సేవ్ చేసుకునేందుకు మనం రకరకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. వీటితో కొంత ప్రయోజనమున్నప్పటికీ ఆ అప్లికేషన్లతోపాటు వచ్చే ప్రకటనలతో మాత్రం బ్యాటరీ ఖాళీ అవుతూంటుందని మైక్రోసాఫ్ట్, పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. గేమ్స్, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనలు డౌన్లోడ్ అయ్యేందుకు బ్యాటరీ, ప్రాసెసర్లను ఉపయోగించడం దీనికి కారణం. కొన్ని లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ మెజారిటీ వాటిల్లో మాత్రం తప్పనిసరి అవుతోంది. 3- సాధారణ అప్లికేషన్లతో కూడా... ప్రకటనలతో కూడిన ఆప్లికేషన్లు మాత్రమే బ్యాటరీని ఖర్చు చేస్తాయనుకోవద్దు. వాటితోపాటు సాధారణ అప్లికేషన్లు.. ముఖ్యంగా వాతావరణ సంబంధిత, మెసేజింగ్, ఈమెయిల్స్, జీపీఎస్ వంటివి కూడా దుబారాకు కారణమవుతున్నాయి. అప్డేట్స్ కోసం తరచూ రిక్వెస్ట్‌లు పెట్టాల్సి రావడం వల్ల ఇలా జరుగుతోంది. ఫోన్ సెట్టింగ్స్‌ను కొంత మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అరగంటకు ఒకసారి అప్డేట్ చేసుకునే బదులు రెండు గంటలకు ఒకసారి చేసుకోవడం వంటిదన్నమాట. 4- వైబ్రేషన్స్‌ను ఆపేయండి... రింగ్టోన్లు ఇబ్బంది పెడుతున్నాయని అనుకునేవారు వైబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లడం చాలామంది చేసే పని. అయితే మొత్తం బ్యాటరీని వేగంగా కదల్చాల్సినంత శక్తి అవసరమవుతుంది కాబట్టి వైబ్రేషన్స్‌తో బ్యాటరీ ఠక్కున ఖాళీ అయ్యే అవకాశముంది. వైబ్రేషన్స్‌ను పూర్తిగా తొలగించుకోవడం లేదా.. దాని తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని సౌండ్ అప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని ‘వైబ్రేట్ వైల్ రింగింగ్’, ‘వైబ్రేట్ ఆన్ టచ్’ అప్షన్లను తీసేయండి. 5- వేడితోనూ ఇబ్బందే... మనమాదిరిగానే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పరిసరాల్లోని వాతావరణానికి ముఖ్యంగా వేడికి స్పందిస్తూంటుంది. ఎక్కువ వేడెక్కినా... చల్లగా ఉన్నా బ్యాటరీ వేగంగా ఖాళీ అవడంతోపాటు లోపలి పరికరాలు పాడయ్యే ప్రమాదముంది. వీలైనంత వరకూ గది ఉష్ణోగ్రతలకు దగ్గరగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవడం ఈ సమస్యకు ఒక పరిష్కారం. వేసవి ఎండల్లో వాహనాల్లోపల వదిలేయడం అంతమంచిది కాదు. ఆ పరిస్థితుల్లో ఫోన్‌ను వాడినా ఇబ్బందే. అందువల్ల సాధారణ ఉష్ణోగ్రతలకు చేరుకునే వరకూ వాడకుండా చూసుకోవాలి. 6- సెట్టింగ్‌లు సరిచూసుకోండి... స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ సరిగా లేకపోతే మీ ఫోన్ బ్యాటరీ వేగంగా కొండెక్కుతుంది. స్క్రీన్ ప్రకాశం వీటిల్లో అత్యంత ముఖ్యమైంది. పూర్తిస్థాయికి బదులు సగం స్థాయికి దీన్ని తగ్గిస్తే కొన్ని గంటలపాటు బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని డిస్ప్లే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీ కంటికి నప్పే స్థాయి వరకూ ప్రకాశాన్ని తగ్గించుకోవడం లేదా... తక్కువ బ్రైట్నెస్ ఉన్న ఫోన్లను ఎంచుకోవడం మేలు. -
గల్లా గూండాల ఫ్యాక్టరీని మూసేయాలి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బ్యాటరీల తయారీ మానేసి గూండాలను తయారు చేస్తున్న గల్లా అరుణకుమారి అమరరాజ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని శెట్టిపల్లె పంచాయతీ వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీ, బీటీఆర్ కాలనీ, మంగళం క్వార్టర్స్ ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరులు చెవిరెడ్డి హనుమంతరెడ్డి, చెవిరెడ్డి రఘు, పార్టీ నాయకులు రుద్రగోపి, లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రగోపి, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారంలో ఉండి వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీశాఖ భూములను గల్లా అరుణకుమారి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవడం కోసం పార్టీ మారారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభంజనాన్ని తగ్గించి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో పార్టీ నాయకులు, కార్యకర్తలపై మంగళంలోని టీడీపీ నాయకులు, అమరరాజ ఉద్యోగులతో దాడులు చేయిస్తోందన్నారు. చంద్రగిరి ని యోజకవర్గంలో భాస్కర్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలుకుతుండడాన్ని చూసి ఓర్వలేక ఫ్యాక్టరీ ఉద్యోగులను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన పంచాయతీ మాజీ సర్పంచ్ మునికృష్ణ, వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడి గెలవాలని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు వి.గోపి, గాజుల రమణ, జయప్రకాష్, మహ్మద్‌కాశీం, ఓబుల్‌రెడ్డి, దాము, రమేష్, బ్రహ్మయ్య, శకుంతలమ్మ పాల్గొన్నారు.