ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత సమయం వస్తుంది? మహా అయితే ఒక రోజు.. నెల లేదా సంవత్సరం అనుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యాటరీ అయితే వేల సంవత్సరాలు పాటు పనిచేస్తుంది. ఇంతకీ ఆ బ్యాటరీ పేరు ఏంటి? ఎవరు రూపొందించారు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
రెండు బ్రిటీష్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇంజనీర్ల బృందం ఒక అద్భుతమైన బ్యాటరీని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 'కార్బన్-14 డైమండ్ బ్యాటరీ'. ఇది వేల సంవత్సరాల పాటు తక్కువ మొత్తంలో శక్తిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
బ్యాటరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి.. డైమండ్‌లో నిక్షిప్తం చేసిన కార్బన్-14ని ఉపయోగిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పేర్కొంది. కార్బన్-14 ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుంది. అయితే ఇది విద్యుత్తును తయారు చేయడానికి ఫోటాన్‌లకు బదులుగా.. ఐసోటోప్ ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రాన్‌లను ఉపయోగిస్తుంది.
కార్బన్-14 జీవితకాలం 5,700 సంవత్సరాల కంటే ఎక్కువ. బహుశా ఇన్ని సంవత్సరాలు మనగలిగే బ్యాటరీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ కార్బన్ 14 బ్యాటరీని అంతరిక్ష పరిశోధనలలోని ప్లానెటరీ రోవర్‌లకు శక్తినివ్వడానికి, నీటి అడుగున ఏర్పాటు చేసే సెన్సార్‌లలో, పేస్‌మేకర్‌లకు శక్తినివ్వడానికి, ఇంప్లాంట్ చేయదగిన వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే పరికరాలలో ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు.
💎Scientists and engineers from the UK Atomic Energy Authority (@UKAEAofficial) and the University of Bristol (@BristolUni) have successfully created the world’s first carbon-14 diamond battery.
This new type of battery has the potential to power devices for thousands of years,… pic.twitter.com/Kquxpn1PHA— UK Atomic Energy Authority (@UKAEAofficial) December 4, 2024
Comments
Please login to add a commentAdd a comment