Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి.
టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది.
ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..
బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment