battery store
-
భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..
Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. -
సూపర్ కెపాసిటర్.. దీని శక్తి తెలిస్తే షాక్ అవుతారు!
ఫొటో చూశారా? వేలిపై చిన్నగా బంగారు రంగుతో మెరిసిపోతోందే.. ఒక నిర్మాణం. అదో సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు! ఎందుకంటే ఈ బుల్లి సూపర్ కెపాసిటర్‌లో మనం సాధారణంగా వాడే ‘ఏఏఏ’ సైజు బ్యాటరీలో ఉండేంత శక్తి ఉంటుంది! కాగితాన్ని మడిచి వినూత్నమైన ఆకారాలను సృష్టించే జపనీస్ కళ ఒరెగామీ స్ఫూర్తితో అతిసూక్ష్మస్థాయి ఎలక్ట్రానిక్స్‌ను ఉపయోగించి జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూపర్ కెపాసిటర్‌ను తయారు చేశారు. పైగా దీన్ని మానవ శరీరం లోపల కూడా వాడుకోవచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మన రక్తంలోని కొన్ని కీలకమైన పదార్థాలతోనే ఇది శక్తిని నింపుకుంటుంది. ప్లాస్టిక్ లాంటి పదార్థపు పొరల మధ్య కాంతికి స్పందించే పదార్థాన్ని ఉంచి పీడాట్:పీఎస్ఎస్ అనే ప్రత్యేక ప్లాస్టిక్‌ను ఎలక్ట్రోడ్లుగా ఉపయోగిస్తారు. కాంతికి స్పందించే పదార్థం కరెంటును సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మొత్తం ఏర్పాటుపై ఒత్తిడిని సృష్టించినప్పుడు పొరలన్నీ ఒక క్రమ పద్ధతిలో ‘ఒరెగామీ’ తరహాలో మడుచుకొని బయో సూపర్ కెపాసిటర్లు తయారవుతాయి. ఒకొక్కటీ ధూళి రేణువు కంటే తక్కువ సైజులో ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే 0.001 ఘనపు మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. రక్తపు ప్లాస్మా లాంటి లవణ ద్రావణాల్లో ఉంచినప్పుడు ఈ బయో సూపర్ కెపాసిటర్లు విజయవంతంగా విద్యుత్‌ను నిల్వ చేసుకోగలిగాయి. అంతేకాకుండా మూడు కెపాసిటర్లను జోడించి మరీ ఉపయోగించవచ్చు. రక్తనాళాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా కేన్సర్ కణతుల పెరుగుదలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఒలివర్ జి షిమిట్ తెలిపారు. చదవండి: కూల్‌డ్రింక్స్ తాగితే లావెక్కుతాం.. ఎందుకో తెలుసా? ‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్‌లో 30 శాతం మంది బాధితులు -
అమర్‌రాజా కొత్త ప్లాంటు!
చిత్తూరు, సాక్షి: అమర్‌రాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరులోని తన గ్రోత్ కారిడార్‌లో కొత్త బ్యాటరీ ప్లాంట్‌ను ఆరంభించింది. ద్విచక్ర వాహనాల బ్యాటరీల కోసం ఉద్దేశించిన ఈ ప్లాంట్‌ను సంస్థలోని ప్రధాన వాటాదారు జాన్సన్ కంట్రోల్స్ చైర్మన్ అండ్ సీఈవో జార్జ్ ఆర్. ఓలీవర్ ప్రారంభించారు. దీని వార్షిక సామర్థ్యం 17 మిలియన్ యూనిట్లు. దీని కోసం అమర్‌రాజా గ్రూపు రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. అంతర్జాతీయ పోటీని తట్టుకునేందుకు అమర్‌రాజా మరో ముందడుగు వేసినట్లు ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని అత్యంత వేగవంతమైన అసెంబ్లీ లైన్స్ ఈ గ్రోత్ కారిడార్‌లోని ప్లాంటులో ఉన్నాయని ఆయన చెప్పారు. తొలి దశలో ఏటా 5 మిలియన్ యూనిట్ల బ్యాటరీల ఉత్పత్తి చేస్తామని గ్రూప్ వైస్‌చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పారు. ఈ ప్లాంటు ద్వారా 1300 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనున్నారన్నారు. విజయవంతమైన భాగస్వామ్యం.. అమర్‌రాజా బ్యాటరీస్తో తమది విజయవంతమైన భాగస్వామ్యమని జార్జ్ ఆర్. ఓలీవర్ చెప్పారు. అమర్‌రాజాతో జట్టు కట్టి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోందన్నారు. ‘‘అత్యంత నాణ్యమైన బ్యాటరీలను భారతీయులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ అత్యాధునిక బ్యాటరీ ప్లాంటు కొత్త మైలురాళ్లను సృష్టిస్తుందనే నమ్మకం మాకుంది’’ అన్నారాయన. కొత్త ప్లాంటు రెండు కంపెనీల మధ్య విప్లవాత్మక ప్రయాణానికి నాంది పలకనుందని చెప్పారు. కార్యక్రమంలో అమర్‌రాజా బ్యాటరీస్ సీఈవో విజయ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 2.7 మెగావాట్లతో రూఫ్ టాప్ సోలార్.. ప్లాంటు విద్యుత్ అవసరాల కోసం 2.7 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ సిస్టమ్‌లో అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించారు. -
బ్యాటరీ దుకాణంలో చోరీ
ఖమ్మంక్రైం :ఖమ్మం నగరంలోని ఓ దుకాణంలో దొంగలు చొరబడి రూ. 23.50 లక్షలు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నారుు. వైరారోడ్‌లోని మమతా ఆస్పత్రి రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అజీజ్ 17 ఏళ్లుగా స్టార్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్ దుకాణం నడుపుతున్నారు. సోమవారం రాత్రి యథాప్రకారం దుకాణం బంద్ చేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అందులో గుమస్తాగా పనిచేసే రాఘవరావు దాకాణం తెరిచి చూడగా టేబుల్ కౌంటర్ తీసి వుండటంతో పాటు ఇతర సామగ్రి చిందరవందరగా పడిఉంది. సమాచారం అందుకున్న అజీజ్ షాపునకు చేరుకుని కౌంటర్లోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఇలా జరిగింది.. బ్యాటరీస్ దుకాణం వెనుక పాత ఇనుప సామగ్రి దుకాణం ఉంది. దొంగలు మొదట ఆ దుకాణంలోకి దిగి టేబుల్ కౌంటర్‌ను పగులకొట్టి చూడగా అందులో వారికి ఏమీ లభించలేదు. తర్వాత వెంటిలేటర్ నుంచి బ్యాటరీల షాపులోకి దూరారు. కౌంటర్ తాళం తీసి అందులోని 23.లక్షలను తీసుకెళ్లారు. ఆ నగదును బ్యాటరీలకు సంబంధించి కంపెనికీ చెల్లించాల్సి ఉందని షాపు యజమాని అజీజ్ వాపోయూరు. కాగా వెంటిలేటర్ నుంచి 14 ఏళ్లలోపు వారే దూరే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. చోరీ ఘటనపై పోలీసులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంత డబ్బు కౌంటర్లో ఉంచడంపై విస్మయం వ్యక్తమవుతుండగా, దొంగలు నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి స్క్రూడ్రైవర్లతో తెరిచి డబ్బులు ఎత్తుకెళ్లడంపై తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.ఘటనా స్థలాన్ని డీఎస్పీ దక్షిణమూర్తి, టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ కుమార్, క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించారు.