ఖమ్మంక్రైం :ఖమ్మం నగరంలోని ఓ దుకాణంలో దొంగలు చొరబడి రూ. 23.50 లక్షలు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నారుు. వైరారోడ్‌లోని మమతా ఆస్పత్రి రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అజీజ్ 17 ఏళ్లుగా స్టార్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్ దుకాణం నడుపుతున్నారు.
సోమవారం రాత్రి యథాప్రకారం దుకాణం బంద్ చేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అందులో గుమస్తాగా పనిచేసే రాఘవరావు దాకాణం తెరిచి చూడగా టేబుల్ కౌంటర్ తీసి వుండటంతో పాటు ఇతర సామగ్రి చిందరవందరగా పడిఉంది. సమాచారం అందుకున్న అజీజ్ షాపునకు చేరుకుని కౌంటర్‌లోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీ ఇలా జరిగింది..
బ్యాటరీస్ దుకాణం వెనుక పాత ఇనుప సామగ్రి దుకాణం ఉంది. దొంగలు మొదట ఆ దుకాణంలోకి దిగి టేబుల్ కౌంటర్‌ను పగులకొట్టి చూడగా అందులో వారికి ఏమీ లభించలేదు. తర్వాత వెంటిలేటర్ నుంచి బ్యాటరీల షాపులోకి దూరారు. కౌంటర్ తాళం తీసి అందులోని 23.లక్షలను తీసుకెళ్లారు. ఆ నగదును బ్యాటరీలకు సంబంధించి కంపెనికీ చెల్లించాల్సి ఉందని షాపు యజమాని అజీజ్ వాపోయూరు.
కాగా వెంటిలేటర్ నుంచి 14 ఏళ్లలోపు వారే దూరే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. చోరీ ఘటనపై పోలీసులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంత డబ్బు కౌంటర్‌లో ఉంచడంపై విస్మయం వ్యక్తమవుతుండగా, దొంగలు నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి స్క్రూడ్రైవర్లతో తెరిచి డబ్బులు ఎత్తుకెళ్లడంపై తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.ఘటనా స్థలాన్ని డీఎస్పీ దక్షిణమూర్తి, టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ కుమార్, క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించారు.
బ్యాటరీ దుకాణంలో చోరీ
Published Wed, Feb 25 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement