
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.10.46 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాషాఢ సా.4.36 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.12.42 నుండి 2.18 వరకు, దుర్ముహూర్తం: ప.12.39 నుండి 1.27 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: ఉ.11.33 నుండి 1.13 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.26, సూర్యాస్తమయం: 6.01.
మేషం... దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు శ్రమాధిక్యం. ఉద్యోగులకు చిక్కులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.
వృషభం... మిత్రులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులకు కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు.
మిథునం... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన సమాచారం. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల సమయం.
కర్కాటకం... కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు.
సింహం.... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. .
కన్య...... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు ఆటుపోట్లు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఖర్చులు. దూరప్రయాణాలు.
తుల...... నూతన పరిచయాలు. కొన్ని చర్చలు సçఫలం. పనుల్లో విజయం. ఉద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. దైవదర్శనాలు.
వృశ్చికం... కార్యక్రమాలలో ఆటంకాలు. భూసంబంధిత వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు.
ధనుస్సు...... పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల ముఖ్య సమాచారం. వాహనాలు కొంటారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు.
మకరం... ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. వ్యాపారులకు పనిఒత్తిడులు. ఉద్యోగులకు గందరగోళం.
కుంభం... ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి.
మీనం.... కుటుంబసభ్యులతో తగాదాల పరిష్కారం.. అదనపు రాబడి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment