కర్ణాటక: ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్న ఇంటిలోని గుట్టుమట్లను తెలుసుకుంది, ఓ రోజు బంగారు, నగదు చోరీ చేసి, చివరకు కటకటాల పాలైన పనిమనిషి ఉదంతమిది. వివరాలు.. పరప్పన అగ్రహార ఠాణా పరిధిలోని ఓ ఇంటిలో నిందితురాలు పనిచేసేది. చాలా బంగారు ఆభరణాలు, నగదు ఉండటాన్ని గమనించిన కిలాడీలో దుర్బుద్ధి పుట్టింది.
బంగారు నగలు, నగదు మాయం చేసి ఏమీ తెలియనట్లు పని చేసుకుంటోంది. సొత్తు కనబడకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కాగానే భర్త, అతని అన్నతో కలిసి నిందితురాలు పరారైంది. పోలీసులు గాలింపు జరిపి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారం, నగదును స్వాదీనపరచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment