maid
-
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్‌లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్‌ఫెలోస్‌లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
కి‘లేడీ’ పనిమనిషి.. చోరీ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి..
ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్లో ఇంట్లో చోరీ చేసి పరార్ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోగా. ఓనర్ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.అయితే.. ఓనర్ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్‌ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్ చూసి అవాక్కయ్యారు.వాట్సాప్‌లో స్టేటస్‌లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు 2.4 లక్షల ఉంటుందని ఓనర్ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు. -
అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..!
అతనొక అనుభవజ్ఞుడైన డాక్టర్ అయినప్పటికీ తన కుటుంబంలోని వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటన్నది నిర్థారించలేకపోయాడు. పలు టెస్టులు చేసి ఆ వ్యాధి ఏంటనేది చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యాధి ఏంటనేది..అతడి ఇంట్లో పనిచేసే పనిమనిషి జస్ట్ 15 సెకన్లలో ఠక్కున చెప్పేసింది. ఆమె సమయస్ఫూర్తికి విస్మయానికి గురైన డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఎలా చెప్పిందంటే...డాక్టర్ ఫిలిప్స్ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతమైన చలి, కీళ్లనొప్పులు, దగ్గుతో బాధపడ్డాడు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వచ్చాయి. దీంతో ఫిలిప్స్ కోవిడ్ 19, ఇన్ఫ్లుంజా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తికి ఏం వ్యాధి వచ్చేందని నిర్థారించలేకపోయాడు. దీంతో అతనికి సరైన అందిచలేకపోయాడు. అసలు అతనకు వచ్చిన సమస్య ఏంటర్రా బాబు అంటు తలపంటుకున్నాడు. అప్పుడే వచ్చిన పనిమినిషి ఆ వ్యక్తికి వచ్చింది 'ఆంజంపి'ని అనే వ్యాధి అని స్థానిక భాషలో చెప్పింది. ఇది తన మనవళ్లకు వచ్చిందని, వారిలో ఈ లక్షణాలు చూశానని అంది. వెంటనే పనిమినిషి చెప్పిన వ్యాధికి సంబంధించిన పార్వోవైరస్ బీ19 అనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్ ఫిలిప్స్. చివరికి ఆమె చెప్పిందే నిజమయ్యింది. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధిని వైద్య పరిభాషలో రిథీమా ఇన్ఫెక్టియోసమ్ అని పిలుస్తారు. ఇది హ్యుమన్ పార్వోవైరస్ బీ19 వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బుగ్గలపై వచ్చే ఎరుపు దద్దర్లను స్లాప్డ్ చీక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ దద్దర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మేరకు సదరు డాక్టర్ ఫిలిప్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..17 ఏళ్ల వైద్య అనుభవం ఆ వ్యాధిని నిర్థారించలేదు. కేవలం పది సెకన్లలో ఆ వ్యాధి ఏంటో చెప్పగలిగిన తన పనిమినిషి ముందు తన అనుభవం కూడా సరిపోలేదని అన్నారు. అయితే నెటిజన్లు జనరల్ ప్రాక్టీషనర్(జీపి)ని ఎందుకు సంప్రదించలేదని వైద్యుడిని ప్రశ్నించగా..ఈ రోజుల్లో జీపీ ఆశించిన స్థాయిలో నిర్థారించడ లేదని అన్నారు. తనకు తన పనిమనిషి వ్యాది నిర్థారణ విలువైనదని, అందువల్లే ఒక రోజు సెలువు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.(చదవండి: జీ7 సదస్సులో మోదీకి భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్ ఇదే..!) -
బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు..
ముంబై: యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది ఓ పనిమనిషి. భర్తతో కలిసి బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించింది. వెండి, బంగారం, వజ్రాభరణాలు, నాణేలు.. ఇలా రూ.47 లక్షలు విలువచేసే నగలు ఎత్తుకెళ్లింది. మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26-27 మధ్యన ఈ ఘటన జరిగింది. యజమాని సూరజ్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పనిమినిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్‌పాల్ హర్గెను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.27లక్షలు విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొమ్ము కోసం ఆమెను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు యజమాని సూరజ్ అగర్వాల్ కుటుంబం ఇంట్లో లేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అలీబాగ్ వెళ్లారు. దీన్నే అదునుగా తీసుకున్న పనిమనిషి.. మొగుడితో కలిసి పథకం పన్ని చోరీకి పాల్పడింది. చివరకు కటకటాలపాలైంది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
నోయిడాలో పనిమనిషి మీద ఓనర్ దాష్టీకం
-
బలవంతంగా లాక్కొని వెళ్లి.. ఇదేం చర్య? వాళ్లూ మనుషులే కదా!
బుధవారం ఒక వీడియో వైరల్ అయ్యింది. ఢిల్లీ నోయిడాలోని ఒక సొసైటీలో 20 ఏళ్ల పనిమనిషిని ఆమె యజమాని బలవంతంగా లాక్కుని పోయే వీడియో అందరూ చూశారు. ‘పని చేయను మొర్రో’ అంటున్నా వినకుండా ఆ పనిమనిషిని తన ఇంటికి తీసుకెళ్లి హింసించింది ఆ యజమాని. ఇటీవల మనిమనుషులను హింసించి వార్తలకెక్కుతున్న యజమానులు ఎక్కువగా ఉన్నారు. పని మనుషులు స్త్రీలు. ఇంట్లో పని చేయించునేది స్త్రీలే. సమ దృష్టితో పని చేయించుకోకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అశాంతితో గడపాల్సి వస్తుంది. ► పని మనుషులతో పని విధానం ఎలా ఉండాలి? లోకంలో పని మనుషుల మీద ఉన్నన్ని జోకులు మరెవరి మీదా ఉండవు. పని మనుషులు ‘డిమాండ్స్’ పెట్టడం గురించి ఈ జోకులన్నీ ఉంటాయి. వారి పని పద్ధతి గురించి కూడా జోకులుంటాయి. ‘పని మనుషులు’ కూడా ‘ఇంత పని మాత్రమే చేస్తాం’... ‘ఇంత జీతానికే చేస్తాం’ అని డిమాండ్ చేయడం ‘యజమానులకు’ వింతగా, నవ్వులాటగా, సహించలేని వ్యవహారంగా అనిపిస్తుంది. కాని ఈ యజమానులు లేదా వారి పిల్లలు ఉద్యోగాల్లో చేరేటప్పుడు తప్పనిసరిగా పని స్వభావం, పని గంటలు, జీతం తెలుసుకుని అందుకు అంగీకారమైతేనే చేరుతారు. పని మనుషులు మాత్రం తమ వద్ద అలా ఉండటాన్ని భరించలేరు. ► తాజా ఘటన పని మనుషులు ‘అతీగతీ’ లేని వారు అనే భావనతో వారితో ఎలాగైనా వ్యవహరించవచ్చని యజమానులు అనుకుంటే వారు పోలీసు కేసుల వరకూ వెళ్లాల్సి ఉంటుందని నోయిడాలో జరిగిన తాజా ఘటన తెలియచేస్తోంది. నోయిడా సెక్టర్ 120లో షెఫాలీ కౌల్ అనే మహిళ తన వద్ద పని చేసే 20 ఏళ్ల అనిత అనే అమ్మాయిని లిఫ్ట్‌లో నుంచి తన ఫ్లాట్‌కు ఈడ్చుకుంటూ వెళ్లే వీడియో వైరల్ అయ్యింది. ఆమె వద్ద పని చేసే ఒప్పందం అక్టోబర్‌తో ముగిసినా ఇంకా పని చేయవలసిందేనని ఆమె బలవంతం చేస్తున్నదని, ఇంట్లో నిర్బంధిస్తోందని, తిడుతోందని, కొడుతోందని అనిత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీడియో ఇందుకు సాక్ష్యం పలుకుతోంది. నేరం రుజువైతే షెఫాలీ కౌల్‌కు శిక్ష తప్పదు. దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మనకు సేవ చేసేవారు మనకంటే తక్కువ అనే భావన పాతుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ► పని మనుషులు నిస్సహాయులు పనికి సంబంధించిన ఎటువంటి గ్యారంటీ లేని నిస్సహాయులుగానే పని మనుషులు వున్నారు. యజమానులు వారిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసేయొచ్చు. వారికి కనీస వేతన చట్టం వర్తించదు. సెలవులు ఉండవు. ప్రసూతి సెలవులు చాలా పెద్ద మాట. రోజూ వచ్చిపోతూ పని చేసే పని మనుషుల కంటే ఇంట్లోనే ఉంటూ పని చేసే వారికి యజమానులు చెడ్డవాళ్లయితే నరకం కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. తమ వద్దే గతి లేకుండా ఉన్నారన్న ఉద్దేశంతో వీరి చేత చాకిరి విపరీతంగా చేయించడమే కాదు... ఏదైనా తప్పు జరిగినా/మాట వినకపోయినా దండన కూడా ఉంటుంది. ఆ దండన– ► జీతం ఆపడం ∙ ►ఆకలికి మాడ్చడం ► నిద్ర లేకుండా పని చేయించడం ► కొట్టడం ∙హింసించడం ► దొంగతనం నిందలు వేయడం కొన్ని సంఘటనల్లో లైంగిక దాడులు కూడా జరపడం. ఇవన్నీ శిక్షార్హమైన నేరాలని యజమానులు గుర్తుంచుకుంటే మంచిది. కాని యజమానుల ధోరణి అహంతో నిండి ఉంటోంది. కొంత కాలం క్రితం ముంబైలోని ఒక సొసైటీలో పని మనుషులందరూ తమకు జీతాలు తక్కువ ఉన్నాయని పనిలోకి రాబోమని ఈ సొసైటీ ఎదుట ధర్నా చేశారు. అప్పుడు యజమానులు తగ్గి జీతం పెంచారు. కాని కొన్ని నెలల్లోనే ఎవరైతే ఆ ‘విప్లవం’ లేవదీశారో వారందరి పని పోయింది. మెల్ల మెల్లగా తీసేశారు. మళ్లీ తక్కువ జీతానికి పని చేసే వాళ్లే పనిలో కుదరాల్సి వచ్చింది. ► పని మనుషులూ మనుషులే పని మనుషులూ మనుషులే. పని మనుషులుగా ఇళ్లల్లో పని చేసేది, చేయాల్సింది స్త్రీలే. వీరంతా నిరుపేద వర్గం నుంచి వచ్చినవారే అయి ఉంటారు. వారికి కుటుంబాలు ఉంటాయి... పిల్లలు ఉంటారు... బాధ్యతలు ఉంటాయి... అనారోగ్యాలు ఉంటాయి... భర్తల నుంచి ఏదో ఒక మేరకు వొత్తిళ్లు ఉంటాయి... సమస్యలు ఉంటాయి... అని గుర్తుంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందుల్లో బతుకు గడవడానికి వారు పనిలో చేరుతారు. ఇంటికి సంబంధించిన ‘మురికి’ని శుభ్రం చేస్తారు. వారి సహాయం, శ్రమ లేకుండా ఇళ్లు శుభ్రపడవు. యజమానులు సౌకర్యంగా తమ పనులు చేసుకోలేరు. అందువలన వారితో స్నేహంగా, సమదృష్టితో వ్యవహరించడం అవసరం. వారి అవసరాలు అన్నీ తీర్చాల్సిన పని లేదు కాని ఒక్కోసారి వారి బాధను పట్టించుకోవడం కూడా అవసరమే. కుటుంబంలో ఒకరిగా మారి దశాబ్దాల పాటు పని చేసిన మనుషులు, పని మనిషిని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే యజమానులు ఎందరో ఉన్నారు. కాని అలా కాకుండా ‘మనం అనేవాళ్లం... వాళ్లు పడేవాళ్లు’ అనే భావన ఉంటేగనక అలాంటి భావనను మార్చుకోక తప్పదు. కొందరి ఇళ్లల్లో పని మనుషులు నెలకు మించి నిలువరు. పని మనుషులను మార్చుతూ వెళతారు కాని తాము మారరు. ఇవి చేయండి ► మీకు ఎన్ని పని గంటలు కావాలో ముందే స్పష్టంగా చెప్పండి ఏమేమి పనులు చేయాలో తప్పనిసరిగా ముందే చెప్పండి వారానికి ఒకరోజు సెలవు (ఒక పూటైనా) ఇవ్వండి ∙ అనారోగ్యం ఉంటే బలవంతంగా పని చేయించకండి ∙ పండగలకు బక్షీసు ఇవ్వండి ∙ చీటికి మాటికి జీతం కోయకండి ∙పరుష పదజాలం ఉపయోగించకండి పని చేస్తుంటే వెంట ఉంటూ అజమాయిషీ చేయకండి ► మీరు తినలేనివి పెట్టకండి. -
పని మనిషి కాస్త.. ఓనర్ అయ్యింది!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్ పమేలా కీ లిండెన్ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది. ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి. -
పెళ్లైన నెలకే పనిమనిషిలా మార్చారు.. ‘పనులు చేయాలనడం క్రూరత్వం కాదు’
ముంబై: ఇంట్లో పనులు చేయాలని వివాహితను ఆమె కుటుంబ సభ్యులు ఆదేశించడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఇంట్లో వివాహిత చేసే పనులు పనిమనిషి చేసే పనులతో సమానం కాదని వెల్లడించింది. ఇంట్లో కుటుంబం కోసం పనులు చేయాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ పెట్టిన కేసు(ఎఫ్ఐఆర్)ను న్యాయమూర్తులు జస్టిస్ విభా కంకాన్వాడీ, జస్టిస్ రాజేశ్ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నెల 21న కొట్టివేసింది. పెళ్లయ్యాక కేవలం నెల రోజుల పాటు తనను చక్కగా ఆదరించారని, ఆ తర్వాత ఒక పనిమనిషిలా మార్చారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రూ.4 లక్షలతోపాటు ఒక కారు ఇవ్వాలంటూ భర్త, అత్తమామలు డిమాండ్ చేశారని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని వెల్లడించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ మహిళ భర్త, అత్తమామలు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ‘‘ఇంట్లో వివాహితను పనులు చేయాలనడం కుటుంబం కోసమే కదా. ఇంటి మనిషికి పనులు చెప్పడం పనిమనిషిని ఆదేశించినట్లు కాదు. ఇకవేళ ఆమెకు ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఆ విషయం చెప్పాలి. అప్పుడు పెళ్లికొడుకు ఆ పెళ్లి విషయంలో పునరాలోచించుకొనే అవకాశం ఉంటుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. శారీరకంగా, మానసికంగా వేధించారంటూ కేవలం నోటిమాటగా చెబితే సరిపోదని, అందుకు ఆధారాలు చూపాలని, తగిన వివరణ ఇవ్వాలని సూచించింది. -
దొంగతనం ఆరోపణలతో.... పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసి...
దొంగతనం చేసిందనే ఆరోపణలతో ఒక కుటుంబం పనిమినిషిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్థితికి తీసుకు వచ్చింది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఆ కుటుంబం ఒక మంత్రగాడి మాటలు నమ్మి పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో సత్‌బరిలోని అన్సల్ విల్లాలో ఉంటున్న ఒక కుటుంబం ఇంట్లో పది నెలల క్రితం ఒక దొంగతనం జరిగింది. ఐతే ఆ కుంటుంబికులు దొంగను కనిపెట్టేందుకు ఒక మంత్రగాడిని సంప్రదిస్తారు. అతను ఇంట్లో పనివాళ్లందరికీ సున్నం, అన్నం కలిపి ప్టెటమని చెప్పాడు. అది తిన్నప్పుడూ ఎవరి నోరు ఎర్రగా అవుతుందో వాళ్లే దొంగ అని చెప్పాడు. ఐతే బాధితురాలు తన కుటుంబంతో కలసి సదరు యజమాని కుంటుంబం వద్దే ఉంటుంది. వారి ఇంట్లోనే ఆమె రెండేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే ఇంట్లో పనిచేసే వాళ్లందరికి పెట్టారు. ఈ అన్నం తిన్న బాధితురాలి ముఖం ఎర్రగా మారింది. అంతే ఆమే దొంగ అని భావించి బట్టలు విప్పించి గదిలో బందించి కొట్టడం వంటి పనులు చేశారు. ఐతే ఆమె ఈ అవమానాన్ని భరించలేక ఎలకల మందు తిని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో సదరు కుటుంబికులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు కుటుంబం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా ) -
ఇళ్లల్లో పని మనుషులుగా చేరి.. నమ్మకంగా ఉంటూ..
సాక్షి, బెంగళూరు: ఇళ్లల్లో పని మనుషులుగా చేరి యజమానులకు నమ్మకం కలిగించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను హెణ్ణూరు పోలీసులు సోమవారం చేశారు. వీరి వద్ద నుంచి 250 గ్రాముల బంగారు నగలు, 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీసీపీ డాక్టర్ బీమాశంకర్‌గుళేద్ వివరాలు వెల్లడించారు. హెణ్ణూరు అరవింద అనే వ్యక్తి ఇంట్లో పనిచేస్తున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన సుబ్బలక్ష్మీ అనే మహిళ నమ్మకంగా ఉంటూ బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లిందని ఫిర్యాదు చేశారు. హెణ్ణూరు సీఐ వసంత్‌కుమార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ముంబై వెళ్లి సోమవారం మహాదేవి, ప్రియాంకా రాజేశ్, వనితలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మహిళలు ఎఫ్బీలో రెఫర్ హౌస్ మెయిడ్స్ అనే పబ్లిక్ గ్రూప్‌లో ఖాతాలు తెరిచి పనిమనుషులు అందుబాటులో ఉన్నారని పోస్టు పెట్టారు. దీంతో అరవింద్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన మహిళ నకిలీ ప్రూఫ్‌తో వచ్చినట్లు తేలింది. ఆమె అసలు పేరు ప్రియాంక కాగా సుబ్బులక్ష్మీ అని చెప్పుకుంది. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు ముంబై వెళ్లి అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ముంబైలో పలు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు పట్టుబడిన మహిళలు -
కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి
Krishnam Raju Family Celebrates Their Maid 25Years Of Service : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్‌మీడియాలో షేర్చేసుకుంది. 25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. 25 years of literally doing everything and anything and keeping us sane. Thank you for everything Padma Aunty💙#25years #pillarofstrength #gkmwomen pic.twitter.com/lqwlp5xsUa — Praseedha Uppalapati (@PraseedhaU) October 21, 2021 -
బంజారాహిల్స్: ఇంట్లో పని చేస్తున్న యువతిపై అత్యాచారం
సాక్షి, బంజారాహిల్స్: ఇంట్లో పని చేస్తున్న యువతిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లిన ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ విల్లాలో ఈ నెల 15వ తేదీన యువతి పనిలో చేరింది. అదే ఇంట్లో శివ(38) వంట మనిషిగా పని చేస్తున్నారు. చదవండి: Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం ఎప్పటిలాగే బాధిత యువతి తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్ క్లీన్ చేస్తుండగా శివ ఆమె వద్దకు వచ్చి బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానంటూ ఆమెను బెదిరించాడు. వెంటనే ఆమె తన సోదరుడికి విషయం చెప్పింది. ఈ మేరకు బాధితురాలు తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడిన శివ కోసం గాలిస్తున్నారు. చదవండి: అమీర్‌పేట్‌లో స్కూల్ విద్యార్థిని అదృశ్యం -
ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను..
చాంద్రాయణగుట్ట( హైదరాబాద్): తన ఇంట్లో పనిచేస్తున్న ఓ యువతికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేస్తున్న యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి (19) స్థానికంగా ఓ ఇంట్లో పనులు చేస్తోంది. ఇంటి యజమాని కుమారుడు (23) గత కొన్ని రోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధించసాగాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫొటోలను తీసి తన వాట్సాప్‌లో పెట్టుకోవడంతో పాటు షేర్ చేస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి విజయనగర్‌కాలనీ: వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనయ్య తెలిపిన వివరాల ప్రకారం...టోలిచౌకిలో నివసించే మహ్మద్ సాబెర్ (36) భార్య నవ్యా సుల్తానా ఆదివారం పనిపై ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌కు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి టోలిచౌకిలోని తన ఇంటికి వెళ్తుండగా మెహిదీపటపట్నం పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం. 35 వద్ద వెనుకనుంచి ఢీకొట్టి సాబెర్ తలపై నుంచి లారీ చక్రం వెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు
బంజారాహిల్స్: నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన ఘట నలో నిందితురాలిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 లోని ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఉదయ్‌భాస్కర్ అనే అధికారి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన సరోజ అనే మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. యజమాని లేని సమయంలో తొమ్మి ది తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయ్‌భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం -
పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు
సింగపూర్ సిటీ : సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ తన పనిమనిషి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ఆకలికి అలమటిస్తున్న ఆమెకు పట్టెడు మెతుకులు కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన గయాతిరి మురుగన్ అనే మహిళ 2015 నుంచి సింగపూర్‌లో నివసిస్తోంది. ఐదు నెలల క్రితం ఆమె మయన్మార్‌కు చెందిన పియాంగ్‌ను పనిలో పెట్టుకుంది. పనిలో చేరిన మరుక్షణం నుంచి గయాతిరి ఆమెతో క్రూరంగా ప్రవర్తించేది. బండెడు చాకిరి చేసిన ఆమెకు కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదు. పైగా ప్రతిరోజు ఆమెను కొడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను ఇంట్లోనే బంధించింది. ఇంట్లోని ఓ రూమ్‌లో గ్రిల్‌కు కట్టేసి, ఆమెపై వేడివేడి పదార్థాలు వేసి నరకం చూపించింది. దీంతో ఆమె పెట్టిన చిత్రహింసలు తాళలేక ఆ పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహానికి శవ పరీక్ష చేయగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో 31 చోట్ల గాయాల తాలూకు మచ్చలుండగా, బయట చర్మం మీద 47 గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయిందన్నారు. పోషకాహారం అందకపోవడం కూడా ఆమె చావుకు మరొక కారణమని పేర్కొన్నారు. కాగా నిందితురాలి మీద 28 అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్య అని పనిమనిషి బంధువుల తరపు న్యాయవాది మహమ్మద్ ఫైజల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలికి జీవితఖైదు లేదా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరారు. చదవండి: కూల్‌డ్రింక్ ఆర్డర్ చేస్తే.. యూరిన్ బాటిల్ వచ్చింది! -
'దొంగ' పనిమనిషి అరెస్ట్
సాక్షి, అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): ఓ వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన రోజే రూ.8.60 లక్షల విలువైన 23 కాసుల బంగారు నగలను దోచుకెళ్లిన మాయ‘లేడీ’ని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తు అంతా ఆమె నుంచి రికవరీ చేశారు. అమలాపురం కల్వకొలనువీధిలో పక్షవాతంతో మంచంపై చికిత్స పొందుతున్న పలచర్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్దురాలికి సపర్యలు కోసం పనిమనిషిగా ఎరువ మేరీ సునీత రావడం..వచ్చిన రోజే అంటే ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారు నగలతో పరారు కావడం వంటి పరిణామాలు తెలిసిందే. పనిమనిషిగా చేరి చోరీకి పాల్పడిన 42 ఏళ్ల మేరీ సునీత గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామవాసిగా అమలాపురం పోలీసులు గుర్తించారు. చోరీ జరగగానే విజయవాడ, హైదరాబాద్‌కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు ఆమెను వెంటాడి అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. విజయవాడ శ్రీనివాస హోం కేర్ సర్వీస్ సెంటర్ ద్వారా మేరీ సునీతను అమలాపురంలో అనంతలక్ష్మి వద్ద పనిమనిషిగా పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకు అమలాపురం ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద మేరీ సునీతను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న రూ.8.60 లక్షల విలువైన బంగారు నగలను డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చూపించి, వివరాలను వెల్లడించారు. (చదవండి: తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు) ప్రతిచోటా పనిమనిషి ముసుగులోనే చోరీలు గత కొన్నేళ్లుగా ధనికులైన వృద్ధుల వద్ద సపర్యలకు పనిమనిషిగా చేరి ఆ ముసుగులో చోరీ చేయడంలో మేరీ సునీత చేయి తిరిగిన నేరస్థురాలని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ తరహాలో హైదరాబాద్‌లో ఆమె 11 కేసులు, విశాఖపట్నంలో రెండు కేసుల్లో నిందితురాలు. ఈ 13 కేసులకు సంబంధించి మూడు కేసుల్లో జైల్లో శిక్షలు కూడా అనుభవించిందని చెప్పారు. అమలాపురం చోరీ కేసుకు సంబంధించి ఆమె ఎంత బంగారం దోచుకెళ్లిందో అంత బంగారాన్ని కేవలం రెండు రోజుల్లో సీఐ బాజీలాల్ బృందం రికవరీ చేసిందన్నారు. మేరీ సునీత సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతికత సహాయంతో ఆమె కదలికలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ కేసులో డీఎస్పీ మాధవరెడ్డి, ఇన్చార్జి డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సీఐ బాజీలాల్, పట్టణ ఎస్సైలు ఎం.ఏసుబాబు, కె.చిరంజీవి, జిల్లా ఐటీ కోర్ క్రైమ్ ఎస్సై ఎం.ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు మల్లాడి హరిబాబు, రమేష్‌బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం.మూర్తి, సీహెచ్ మాధవిలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అభినందించారు. -
తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు
అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది. సాక్షి, అమలాపురం టౌన్ : పట్టణంలోని కల్వకొలనువీధికి చెందిన పటచోళ్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన విజయవాడకు చెందిన మేరీ సునీత అనే మహిళ ఈ చోరీకి పాల్పడింది. అనంతలక్ష్మి పక్షవాతంతో కదల్లేని పరిస్థితుల్లో మంచంపైనే ఉండి చికిత్స పొందుతోంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో బంధువులు విజయవాడకు చెందిన పనిమనుషులను కుదిర్చే ఓ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ విజయవాడ నుంచి మేరీ సునీత అనే మహిళను అమలాపురంలోని అనంతలక్ష్మి ఇంటికి ఆదివారం పంపించింది. పనిలో చేరిన ఆమెకు వృద్ధురాలికి ఎలాంటి సపర్యలు చేయాలో బంధువులు చెప్పి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో వృద్ధురాలు, తాను మాత్రమే ఉండడాన్ని అవకాశంగా భావించిన ఆ మాయలేడీ వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న బంగారు నగలపై కన్నేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటక వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న 24 కాసుల బంగారు నగలను పట్టుకుని పరారైంది. సోమవారం ఉదయం పని మనిషి కనిపించకపోవడంతో పాటు ఇంట్లో నగలు మాయకావడంతో అది ఆ మహిళ చేసిన పనేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. పనికి కుదిర్చిన కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించినా ఆమె గురించి సరైన సమాచారం రాలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ ఆ వృద్ధురాలి ఇంటిని సందర్శించి ఆమెను విచారించారు. పనిమనిషిగా వచ్చిన మహిళ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను నియమించారు. హైదరాబాద్, విజయవాడలకు సోమవారం ఉదయమే ఆ రెండు పోలీసు బృందాలు బయల్దేరాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ సంస్థను కూడా విచారించనున్నారు. 24 కాసుల బంగారు నగలతో పాటు, రూ.20 వేల నగదు కూడా ఆ మహిళ దోచుకుపోయిందని వృద్ధురాలి బంధువులు అంటున్నారు. -
‘రూ 1800 నోటు ఉంటే బాగుండేది’
తన నెల జీతం పూర్తిగా ఇవ్వలేదని ఓ యువకుడితో పనిమనిషి వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తనకు రూ 1800 చెల్లించలేదని మహిళ మరాఠీలో వాదిస్తుండగా, పూర్తి జీతం ఇచ్చామని యువకుడు చెబుతున్నారు. తాము రూ 500 నోట్లు మూడు, ఒక రూ .రెండు వందల నోటు, ఒక వంద నోటును ఇచ్చామని మొత్తం 1800 రూపాయలు చెల్లించామని అతడు చెబుతుండగా, ఆమె తనకు 1500 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చారు కానీ 1800 రూపాయలు పూర్తిగా ఇవ్వలేదని వాదించారు. ఎంత చెప్పినా ఆమెకు అర్ధం కాకపోవడంతో కాలిక్యులేటర్లో లెక్క వేసి చూపినా మహిళ సమాధానపడలేదు. ‘వీరు పనిమనిషికి 1800 రూపాయలు చెల్లించారు..అయితే వారు రూ 1500 రూ 300లే ఇచ్చారని మహిళ చెబుతోంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 1800 రూపాయల నోటు విడుదల చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. చదవండి : స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్ These guys paid their house help 1800 bucks but she’s saying they paid her 1500 and 300 😫 pic.twitter.com/KTwGW1NyQW — Daaktarni (@DrVW30) August 30, 2020 -
చనిపోయిన యజమాని ఏటీఎమ్‌తో..
కోల్‌కతా : చనిపోయిన యజమాని ఏటీఎమ్ కార్డును దొంగిలించి లక్షల రూపాయలు డ్రా చేసుకుందో పనిమనిషి. దాదాపు 35లక్షలు దోచుకున్న తర్వాత పోలీసులకు చిక్కి జైలు పాలయింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నదియ, నాకాసిపురకు చెందిన రీటా రాయ్ అనే మహిళ కోల్‌కతా అన్వర్‌షా రోడ్‌లోని ఓ ఇంటిలో గత ఏడేళ్లుగా పని చేస్తోంది. లాక్డౌన్ మొదలైన కొన్ని రోజులకే మరణించిన ఇంటి యజమాని ఏటీఎమ్ కార్డును దొంగిలించి గత రెండు నెలల నుంచి ఖాతాలోని డబ్బులను మాయం చేయటం మొదలుపెట్టింది. ( నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు ) ఇలా మొత్తం 35 లక్షల రూపాయల వరకు కాజేసింది. మృతుడి ఖాతాలోంచి డబ్బులు మాయం అవటం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్ డిపార్ట్మెంట్ రీటాను అదుపులోకి తీసుకుంది. ఆమెతో పాటు దొంగతనానికి సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు అధికారులు. వారి వద్ద నుంచి 27 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ సాహసం
-
బీరూట్ బీభత్సం : మహిళ సాహసం
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నెత్తురోడింది. మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో బీరూట్ నగరమంతా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శన మిస్తున్నాయి. ఈ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ] ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన దాడిలా ఉందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. అయితే పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. అయితే పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నటి భానుప్రియపై మరో ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి : పనిమనిషి వివాదం సద్దుమణగకముందే మరో సమస్యలో చిక్కుకున్నారు సినీ నటి భానుప్రియ. ఆమె మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు దళిత, ప్రజా సంఘాల నేతలు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాలు.. వడ్లమూరుకు చెందిన ఇద్దరు దళిత మైనర్ బాలికలతో భానుప్రియ వెట్టి చాకీరి చేయించుకున్నారంటూ భానుప్రియతో పాటు ఆమె తల్లి, సోదరుని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు.. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయాలంటూ దళిత, ప్రజా సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ తన కుమార్తెను వేధిస్తున్నారంటూ భానుప్రియ, ఆమె సోదరుని మీద సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభావతి కుమార్తె తన ఇంట్లో దొంగతనం చేసిందని.. ఆ విషయం అడిగినందుకు తమ మీద తప్పుడు కేసులు పెట్టిందంటూ భానుప్రియ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేశారు. -
భానుప్రియ మెడకు బాలకార్మిక కేసు..?
చెన్నై : సినీనటి భానుప్రియ మెడకు బాలకార్మిక చట్టం కేసు చుట్టుకునేట్టు కనిపిస్తోంది. మైనర్ బాలికను పనికి నియమించుకోవడం పట్ల బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో మూడు రోజుల కిందట భానుప్రియను అరెస్ట్ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. చదువుకోవాల్సిన బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భానుప్రియపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. ఇలా పెట్టుకున్నట్లు రుజువైతే కోర్టు భానుప్రియకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం భానుప్రియ తన ఇంట్లో పనికి పెట్టుకుంది. ఇటీవల కాలంలో తన కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి చోరీ వస్తువులు అడిగినందుకు ఇలా కేసు పెట్టి బెదిరిస్తున్నారని భానుప్రియ ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భానుప్రియ ఇంట్లో పని చేసే బాలిక తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని, తల్లి చెప్పడంతోనే దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకుంది. దాంతో దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే భానుప్రియ కుటుంబంపై ఈ ఆరోపణలు చేసినట్లు గుర్తించిన పాండీబజార్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. -
భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీబజార్ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనిచేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెను లైంగిక వేధిస్తున్నాడని, అంతేకాకుండా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నాడని ప్రభావతి కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన భానుప్రియ.. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని తెలిపారు. మరోవైపు మైనర్ అమ్మాయిని ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న వ్యవహారంలో భానుప్రియ, ఆమె సోదరుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. బాలకార్మిక చట్టం ప్రకారం ఇలా వ్యవహరించిన వారిపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని భానుప్రియ చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు బాలకార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. -
భానుప్రియ పనిమనిషి కథ సుఖాంతం
పెరంబూరు: నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట, సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కూతుర్ని కొడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణలపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి భానుప్రియను విచారించడానికి శుక్రవారం చెన్నైకి వచ్చారు. కాగా శనివారం నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి ఏడ్చిందని తెలిపారు. శుక్రవారం పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ తెలిపారు.