బాత్‌రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు.. | Maid Husband Steal Jewellery From Employer Home Pune Maharashtra | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో నుంచి దూరి యజమాని ఇంట్లో చోరీ.. భర్తతో కలిసి నగలు ఎత్తుకెళ్లిన పనిమనిషి

Published Fri, Dec 30 2022 1:23 PM | Last Updated on Fri, Dec 30 2022 1:54 PM

Maid Husband Steal Jewellery From Employer Home Pune - Sakshi

ముంబై: యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది ఓ పనిమనిషి. భర్తతో కలిసి బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ తొలగించి లోపలికి ప్రవేశించింది. వెండి, బంగారం, వజ్రాభరణాలు, నాణేలు.. ఇలా రూ.47 లక్షలు విలువచేసే నగలు ఎత్తుకెళ్లింది.

మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26-27 మధ్యన ఈ ఘటన జరిగింది. యజమాని సూరజ్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పనిమినిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్‌పాల్ హర్గెను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి రూ.27లక్షలు విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొమ్ము కోసం ఆమెను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు యజమాని సూరజ్ అగర్వాల్ కుటుంబం ఇంట్లో లేదు. క్రిస్‌మస్ పండుగ సందర్భంగా అలీబాగ్ వెళ్లారు. దీన్నే అదునుగా తీసుకున్న పనిమనిషి.. మొగుడితో కలిసి పథకం పన్ని చోరీకి పాల్పడింది. చివరకు కటకటాలపాలైంది.
చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement