employer
-
తక్కువగా పని చేయమని బ్రతిమాలుకున్న బాస్..
సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగులు కొంచెం ఎక్కువసేపు పని చేస్తే బాగుండని కోరుకుంటూ ఉంటారు యజమానులు. వృత్తిని దైవంగా భావించి ఓవర్ టైమ్ పని చేసి యజమాని మెప్పు పొందిన అలాంటి ఉద్యోగులు కూడా లేకపోలేదు. అలాగే కొంచెం ఎక్కువ పని చెప్పినా విసుక్కునే ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఉద్యోగులను తక్కువగా పని చెయ్యమనే బాస్ లు ఎక్కడైనా ఉంటారా అంటే నేనున్నాని చెబుతున్నారు ఒక బాస్. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగిని ఆ బాస్ కొన్ని మెయిల్స్ కు సమాధానాలు ఇవ్వమని కోరారు. అత్యుత్సాహంతో ఆ ఉద్యోగి తన బాస్ తనకు ఇచ్చిన పనిని కొద్ది గంటల్లోనే ముగించేశాడు. దీంతో ఆ బాస్ పిలిచి మరీ చివాట్లు పెట్టారంట. ఆ విషయాన్ని స్వయంగా ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసక్తితో పని చెయ్యి.. తన బాస్ పిలిచి.. నీకు నీ పనంటే ఇష్టమని నాకు అర్ధమవుతుంది. నీకు వచ్చిన అన్ని మెయిల్స్ కు సమాధానం పంపాల్సిన అవసరం లేదు. కొన్నిటిని అలా వదిలేయమని, అలాగే అంత వేగంగా కూడ ఆ పని చేయాల్సిన అవసరంలేదని.. కొంచెం నెమ్మదిగా పనిచేయమని చెప్పారట. నీవలన మిగతా ఉద్యోగుల్లో లయ దెబ్బతింటుంది. నాకు వాళ్ళు చాలా ముఖ్యమని సున్నితంగా హెచ్చరించారని చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తొందరగా పనిచేసే వాడు వేరొకరి పనిని చెడగొడతాడని భయంతో మీ యజమాని అలా చెప్పి ఉంటాడని కొందరంటే.. నీకు పని తక్కువగా ఉంది కాబట్టి తొందరగా అయిపొయింది.. నీ పని పెంచితే సరిపోతుంది.. అని ఇంకొందరన్నారు.. తొందరగా పనైపోతే ఖాళీగా బాస్ ముందు తిరిగే బదులు మిగిలిన వారి పని చేసిపెట్టవచ్చు కదా.. అని మరికొందరు సలహాలిచ్చారు. ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
అమెజాన్‌ను మించి.. ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ ఏంటో తెలుసా?
ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్‌గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్‌స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్‌కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్‌గా బిగ్ బాస్కెట్ నిల్చింది. ఎంప్లాయర్‌ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే అసైన్మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు. -
బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు..
ముంబై: యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది ఓ పనిమనిషి. భర్తతో కలిసి బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించింది. వెండి, బంగారం, వజ్రాభరణాలు, నాణేలు.. ఇలా రూ.47 లక్షలు విలువచేసే నగలు ఎత్తుకెళ్లింది. మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26-27 మధ్యన ఈ ఘటన జరిగింది. యజమాని సూరజ్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పనిమినిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్‌పాల్ హర్గెను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.27లక్షలు విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొమ్ము కోసం ఆమెను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు యజమాని సూరజ్ అగర్వాల్ కుటుంబం ఇంట్లో లేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అలీబాగ్ వెళ్లారు. దీన్నే అదునుగా తీసుకున్న పనిమనిషి.. మొగుడితో కలిసి పథకం పన్ని చోరీకి పాల్పడింది. చివరకు కటకటాలపాలైంది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
ఎంజాయ్ చేయడం లేదని జాబ్ పీకేశారు.. కోర్టుకెక్కిన ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. లాభదాయకంగా లేని వ్యాపారాల్ని మూసివేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఉద్యోగులు నవ్వలేదని ఫైర్ చేస్తుంది. 2015లో జర్మనీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ క్యూబిక్ పార్టనర్స్ సంస్థ ‘మిస్టర్ టి’ అనే ఉద్యోగికి పింక్ స్లిప్ జారీ చేసింది. అతను చేసిన తప్పల్లా ఒక్కటే. ఆఫీస్‌లో ఫన్‌గా ఉండక పోవడం, వీకెండ్స్‌లో ఆఫీస్ అయిపోయిన తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మందు కొట్టకపోవడంలాంటి కారణాలు చూపెట్టి అతన్ని ఇంటికి పంపించేసింది. దీంతో సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ కేసు విచారణలో భాగంగా ఉద్యోగి పారిస్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని, సంస్థ సిబ్బందితో వీకెండ్స్‌లో పబ్‌లు, పార్టీలకు రావడం లేదని క్యూబిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. కాబట్టే ‘వృత్తిపరమైన అసమర్థత’గా పరిగణలోకి తీసుకుంటూ అతనిపై వేటు వేసినట్లు విన్నవించింది. సంస్థ వివరణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ టి’ని సెమినార్లు, పబ్స్ బలవంతంగా పాల్గొనేలా హక్కు కంపెనీకి లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. విచ్చలవిడితనం, బెదిరింపులు, రెచ్చగొట్టడం, గొడవ పెట్టుకోవడంలాంటివి ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. ఏదేమైనా పని గంటల తరువాత ఆఫీస్ నిర్వహించే పార్టీల్ని నిరాకరించే హక్కు ఆ ఉద్యోగికి ఉందని స్పష్టం చేసింది. కాబట్టి తన మాజీ ఉద్యోగికి నష్టపరిహారంగా 2,574 పౌండ్లు (సుమారు రూ. 2.54 లక్షలు) చెల్లించాలని క్యూబిక్ పార్ట్నర్స్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో నష్టపరిహారాల రూపంలో మరో 395,630 పౌండ్లు (సుమారు రూ. 3.90 కోట్లు) కావాలన్న మిస్టర్ టి డిమాండ్‌ను కోర్టు పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ టి 2011లో సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2014లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మరుసటి ఏడాది ఉద్యోగం నుంచి క్యూబిక్ తొలగి౦చింది. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
7ఏళ్లలో తొలిసారి 20 నిమిషాలు లేటు.. ఉద్యోగం నుంచి తొలగింపు!
ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కొంత ఆలస్యంగా వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ఓ వ్యక్తి 20 నిమిషాలు లేటుగా ఆఫీసుకు రావటంతో ఉద్యోగం కోల్పోయాడు. అతను ఉద్యోగంలో చేరిన ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఆలస్యం కావటం గమనార్హం. తన సహ ఉద్యోగి ఒకరు ఈ అంశాన్ని రెడిట్‌లో షేర్ చేశారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. రెడిట్‌లోని యాంటీవర్క్ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి ఆలస్యమ్యయాడని, కేవలం 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నేను, నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం.’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. ఆ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగానే తొలగించి తక్కువ జీతాన్ని పని చేసే వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలని సంస్థ భావించిన్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పనిచేసే కంపెనీ యజమాని అత్యాచారం చేయడమే కాకుండా పదో అంతస్తు నుంచి కిందకి తోసి హత్య చేశాడు. డీసీపీ మూర్తి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో డెయిరీని నిర్వహించే ప్రతీక్ వైష్ (40)అనే వ్యక్తి తన దగ్గర సెక్రటరీగా పని చేసే 19 ఏళ్ల అమ్మాయికి ఆఫీసు పని ఉందని మభ్యపెట్టి కళ్యాణ్‌పూర్‌లో ఉన్న తన ఫ్లాట్‌కి తీసుకువెళ్లాడు. ఇంటికి తీసుకువెళ్లాక తనతో సెక్స్ చేస్తే డబ్బులు ఇస్తానని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయమంతా పోలీసులకి చెబుతానని ఆమె గట్టిగా బెదిరించడంతో పదో అంతస్తులో ఉన్న తన ఇంటి బాల్కనీ నుంచి ఆమెని కిందకి తోసేశాడు. దీంతో ఆ అమ్మాయి మరణించింది. మొదట పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతీక్ ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ప్రతీక్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా అతనిని న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: హైదరాబాద్: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం -
ఉద్యోగాలకు ఆకర్షణీయ సంస్థల్లో గూగుల్ టాప్
న్యూఢిల్లీ: ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా తర్వాత స్థానాల్లో నిల్చాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన గూగుల్ ఇండియా అత్యధికంగా మార్కులు దక్కించుకున్నట్లు రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. టాప్ 10 ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్స్ జాబితాలో ఇన్ఫోసిస్(4వ స్థానం), టాటా స్టీల్(5), డెల్(6), ఐబీఎం(7), టీసీఎస్(8), విప్రో(9), సోని(10) ఉన్నాయి. 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొన్నారు. ఉద్యోగం, కుటుంబానికి సమ ప్రాధాన్యం.. ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచి్చనట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. వారు అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. వేతన ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఈ అంశానికీ అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62%).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65%) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైంది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం(61%), ఉద్యోగ భద్రత(61%) అంశాలు తర్వాత స్థానా ల్లో ఉన్నాయి. కంపెనీల ఎంపికలో ఉద్యోగార్థుల కొలమానాలు మారుతున్నాయని విశ్వనాథ్ తెలిపారు. తమకు విలువనిచి్చ, అండగా నిలవడంతో పాటు తమ అభిప్రాయాలు, లక్ష్యాలకు అనుగుణమైన సంస్థలనే ఉద్యోగార్థులు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్ : నష్టపరిహారం చెల్లింపు చట్టంలో మార్పులు
న్యూఢిల్లీ : కార్మికుల అండగా ఉండేందుకు సామాజిక భద్రత ( నష్టపరిహారం) రూల్స్‌లో మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు అనేక కీలక మార్పులకు సంబంధి ముసాయిదా సిద్ధం చేస్తోంద. ఇందులో కార్మికుల నష్టపరిహారం చెల్లింపు విషయంలో కార్మికులకు సత్వర న్యాయం జరిగే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు తేనున్నారు. 30 రోజుల్లో... ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా కార్మికుడు పని ప్రదేశంలో గాయపడినా, చనిపోయినా 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాంటూ నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ నిబంధన సరిగానే అమలవుతోన్న ప్రైవేటు కంపెనీల్లో చాలా సార్లు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యం జరుగుతోంది. దీని వల్ల కార్మికులు నష్టపోతున్నారు. కొత్త ముసాయిదా చట్టంలో ఈ ఆలస్యాన్ని నివారించి కార్మికులకు మేలు జరిగేలా మార్పు చేశారు. 12 శాతం వడ్డీతో ప్రస్తుతం ముసాయిదా చట్టంగా అమల్లోకి వస్తే గాయపడిన లేదా మరణించిన కార్మికుడికి కంపెనీ లేదా యజమాని 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించని పక్షంలో నష్టపరిహారంగా అందె మొత్తం పైనా 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మార్పులు కార్మికులకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. చదవండి : హ్యుందాయ్ సరికొత్త ఎస్యూవీ‘ అల్కజార్’ -
2 లక్షల మార్క్‌ను దాటేసిన కాగ్నిజెంట్
సాక్షి, బెంగళూరు : గ్లోబల్ టెక్నాలజీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతదేశంలో ఎక్కువ వైట్ కాలర్ ఉద్యోగాలను కల్పిస్తున్న రెండవ సంస్థగా అవతరించింది. టీసీఎస్ తరువాత 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న రెండవ ఐటి కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. గ్లోబల్‌గా 2.9 లక్షల ఉద్యోగులను కలిగి వుంది. కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాంకుమార్ రామమూర్తిని నియమించిన సందర్భంగా కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. భారతదేశంలోని ఉద్యోగులు, టీంతో లెక్కలేనన్ని పరస్పర చర్చలు, రెండు వారాల పర్యటన అనంతరం రత్నం లాంటి కాగ్నిజెంట్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రశంసలు కురిపించారు. తమ గ్లోబల్ డెలివరీ, సొల్యూషన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఉందన్నారు. భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులైన, నిబద్థత కలిగిన సహోద్యోగులను కలిగి ఉండటం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు. రెండు లక్షలపైగా ఉద్యోగులు ఖాతాదారులకు విలువైన సేవలందించారనీ, పరిశ్రమలోనే అత్యంత విలువైన సేవలు, నూతన ఆవిష్కరణల సామర్థ్యంతో కాగ్నిజెంట్ ఇండియా ఉజ్వల భవిష్యత్తు వెలుగొందుతుందన్నారు. కాగా ఇండియాలో అతి ఎక్కువమంది ఉద్యోగాలను కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్ వుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉద్యోగులుండగా, వీరిలో ఎక్కువమంది భారతీయులే. మరోవైపు ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 40వేల మంది విదేశీయులు. -
రాఖీ పండుగ రోజు అమానుషం
కాన్పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపమైన రాఖీ పండుగ రోజు అమానుషం చోటు చేసుకుంది. జీతం డబ్బులు అడిగిన పాపానికి యజమాని అఘాయిత్యానికి బలయ్యాడో ఓ బాల కార్మికుడు. తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమన్నందుకు వేడి వేడి నీళ్లతో క్రూరంగా సమాధానం చెప్పాడా యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. షీలూ సింగ్ చందేల్ నడిపే చాట్ బండిలో సోను(13) బోయ్‌గా పని చేస్తున్నాడు. రాఖీ పండుగ అంటే సోనూకి చాలా ఇష్టం. అందులోనూ అనురాగాల అక్కకి చిరు కానుక ఇవ్వడం ఇంకా ఇష్టం. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లేందుకు జీతంతో పాటు, సెలవివ్వమని యజమానిని గత వారంరోజులుగా అడుగుతూనే వున్నాడు. అయినా యజమాని స్పందించలేదు. కనీసం తనకు రావాల్సిన జీతం యిస్తే అక్కకు బహుమతి పంపిస్తానని సోను బుధవారం కొంచెం గట్టిగానే అడిగాడు. అంతే..యజమాని ఆగ్రహంతో రెచ్చిపోయాడు. మరిగే మరిగే నీళ్లు సోనూ పై పోశాడు. దీంతో వీపుపైనా, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాఖీ పండుగకు ఇంటికి వెళ్తానంటే ఒప్పుకోలేదని సోనూ వాపోయాడు. ఇంటికి వెళ్లకపోయినా...కనీసం సోదరికి బహుమతి పంపించేందుకు డబ్బులు అడిగినా కనికరించలేదనీ, బూతులు తిడుతూ, మరిగే నీళ్లు తన మీద కుమ్మరించాడంటూ తెలిపాడు. ఈ సంఘటనపై సోను కుటుంబ సభ్యులు స్థానిక బర్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులవరకూ తమకు విషయం తెలియలేదని కనీసం తన తమ్ముడి వైద్యం గురించి కూడా యజమాని పట్టించుకోలేదని సోనూ సోదరుడు చింటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని బర్రా పోలీసు అధికారి అజయ్ రాజ్ వర్మ తెలిపారు. -
కార్పోరేట్ ఉద్యోగింట.. కానుకల పంట!!