సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగులు కొంచెం ఎక్కువసేపు పని చేస్తే బాగుండని కోరుకుంటూ ఉంటారు యజమానులు. వృత్తిని దైవంగా భావించి ఓవర్ టైమ్ పని చేసి యజమాని మెప్పు పొందిన అలాంటి ఉద్యోగులు కూడా లేకపోలేదు. అలాగే కొంచెం ఎక్కువ పని చెప్పినా విసుక్కునే ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఉద్యోగులను తక్కువగా పని చెయ్యమనే బాస్ లు ఎక్కడైనా ఉంటారా అంటే నేనున్నాని చెబుతున్నారు ఒక బాస్.
తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగిని ఆ బాస్ కొన్ని మెయిల్స్ కు సమాధానాలు ఇవ్వమని కోరారు. అత్యుత్సాహంతో ఆ ఉద్యోగి తన బాస్ తనకు ఇచ్చిన పనిని కొద్ది గంటల్లోనే ముగించేశాడు. దీంతో ఆ బాస్ పిలిచి మరీ చివాట్లు పెట్టారంట. ఆ విషయాన్ని స్వయంగా ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆసక్తితో పని చెయ్యి..
తన బాస్ పిలిచి.. నీకు నీ పనంటే ఇష్టమని నాకు అర్ధమవుతుంది. నీకు వచ్చిన అన్ని మెయిల్స్ కు సమాధానం పంపాల్సిన అవసరం లేదు. కొన్నిటిని అలా వదిలేయమని, అలాగే అంత వేగంగా కూడ ఆ పని చేయాల్సిన అవసరంలేదని.. కొంచెం నెమ్మదిగా పనిచేయమని చెప్పారట. నీవలన మిగతా ఉద్యోగుల్లో లయ దెబ్బతింటుంది. నాకు వాళ్ళు చాలా ముఖ్యమని సున్నితంగా హెచ్చరించారని చెప్పుకొచ్చాడు.
దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తొందరగా పనిచేసే వాడు వేరొకరి పనిని చెడగొడతాడని భయంతో మీ యజమాని అలా చెప్పి ఉంటాడని కొందరంటే.. నీకు పని తక్కువగా ఉంది కాబట్టి తొందరగా అయిపొయింది.. నీ పని పెంచితే సరిపోతుంది.. అని ఇంకొందరన్నారు.. తొందరగా పనైపోతే ఖాళీగా బాస్ ముందు తిరిగే బదులు మిగిలిన వారి పని చేసిపెట్టవచ్చు కదా.. అని మరికొందరు సలహాలిచ్చారు.
ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
Comments
Please login to add a commentAdd a comment