slow works
-
తక్కువగా పని చేయమని బ్రతిమాలుకున్న బాస్..
సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగులు కొంచెం ఎక్కువసేపు పని చేస్తే బాగుండని కోరుకుంటూ ఉంటారు యజమానులు. వృత్తిని దైవంగా భావించి ఓవర్ టైమ్ పని చేసి యజమాని మెప్పు పొందిన అలాంటి ఉద్యోగులు కూడా లేకపోలేదు. అలాగే కొంచెం ఎక్కువ పని చెప్పినా విసుక్కునే ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఉద్యోగులను తక్కువగా పని చెయ్యమనే బాస్ లు ఎక్కడైనా ఉంటారా అంటే నేనున్నాని చెబుతున్నారు ఒక బాస్. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగిని ఆ బాస్ కొన్ని మెయిల్స్ కు సమాధానాలు ఇవ్వమని కోరారు. అత్యుత్సాహంతో ఆ ఉద్యోగి తన బాస్ తనకు ఇచ్చిన పనిని కొద్ది గంటల్లోనే ముగించేశాడు. దీంతో ఆ బాస్ పిలిచి మరీ చివాట్లు పెట్టారంట. ఆ విషయాన్ని స్వయంగా ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసక్తితో పని చెయ్యి.. తన బాస్ పిలిచి.. నీకు నీ పనంటే ఇష్టమని నాకు అర్ధమవుతుంది. నీకు వచ్చిన అన్ని మెయిల్స్ కు సమాధానం పంపాల్సిన అవసరం లేదు. కొన్నిటిని అలా వదిలేయమని, అలాగే అంత వేగంగా కూడ ఆ పని చేయాల్సిన అవసరంలేదని.. కొంచెం నెమ్మదిగా పనిచేయమని చెప్పారట. నీవలన మిగతా ఉద్యోగుల్లో లయ దెబ్బతింటుంది. నాకు వాళ్ళు చాలా ముఖ్యమని సున్నితంగా హెచ్చరించారని చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తొందరగా పనిచేసే వాడు వేరొకరి పనిని చెడగొడతాడని భయంతో మీ యజమాని అలా చెప్పి ఉంటాడని కొందరంటే.. నీకు పని తక్కువగా ఉంది కాబట్టి తొందరగా అయిపొయింది.. నీ పని పెంచితే సరిపోతుంది.. అని ఇంకొందరన్నారు.. తొందరగా పనైపోతే ఖాళీగా బాస్ ముందు తిరిగే బదులు మిగిలిన వారి పని చేసిపెట్టవచ్చు కదా.. అని మరికొందరు సలహాలిచ్చారు. ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
లక్ష్యం సాధ్యమా!
కడప : వైఎస్సార్‌జిల్లాను 2018 మార్చి నాటికి స్వచ్ఛజిల్లాగా ప్రకటించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు అధికారులు ఆపసోపాలు పడక తప్పడం లేదు. కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి కృషి చేస్తున్నారు. ఈనెలాఖరుకల్లా వైఎస్సార్‌జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా(ఓడీఎఫ్)గా ప్రకటించాలని సీఎం అధికారులను అదేశించారు. కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించగలగాలి. అ దిశగా అధికారులు కృషి చేస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం అవుతుందా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం 3వేల మరుగుదొడ్లకు సంబంధించి హార్డ్‌కోర్ కింద ( పలు కారణాల చేత ఆగిపోయినవి, ఉదాహరణకు గట్టి నేల ఉండటం, ఇంటిలో గర్భిణులు,బాలింతలు ఉండటం, ఇంటి పెద్దలు చనిపోవడం వంటి వి) పనులు అగిపోయాయి. అడుగడుగునా అడ్డంకులే జిల్లాలో స్వచ్చ భారత్ మిషన్ పథకాన్ని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి 3,04, 992 మరుగుదొడ్లు అవసరమని గుర్తించారు. పథకం ప్రారంభంలో లబ్థిదారులకు బిల్లుల చెల్లింపు సరిగా లేదు. ఫలితంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చాలామంది ఆసక్తి చూపలేదు.దీంతో పథకం లక్ష్యం కుంటుపడుతూ వచ్చింది. గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్డి నిర్మాణం గురించి సరైన అవగాహన కల్పించక పోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయలేక అధికారులు ఆపసోసాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ స్వచ్చభారత్ మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ బాబురావునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేసి లక్ష్యాన్ని కేటాయించారు. దీనిపై నిత్యం పర్యవేక్షించడంతోపాటు నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులతోపాటు 9వ తరగతి చదివే విద్యార్థులను కూడా మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు. లక్ష్యం సాధించేందుకు కృషి మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో స్పీడ్‌గా ఉంది.కలెక్టర్ చొవర తీసుకోవడంతోపాటు నిత్యం పర్యవేక్షించడం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నాం. – సంజీవరావు, ఆర్‌డబ్లూఎస్, ఎస్ఈ -
పుష్కరాల రోజుల్లో సీఎం రూటు ఎటో?
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కరాలు జరిగే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే మార్గంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉంటున్న విషయం విదితమే. ఆగస్టు 12వ తేదీ నుంచి పుష్కరాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. పుష్కరాల రోజుల్లో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ, సీతానగరం ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సీఎం నివాసం నుంచి ప్రస్తుతం ఆయన ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం అయితే లక్షలాది మంది భక్తుల మధ్య సీఎం ప్రయాణం చేయడం ఆయన భద్రతకే ప్రమాదమని పలువురు అధికారులు భావిస్తున్నారు. మరి తాడేపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లాలంటే ఉన్న రెండు మార్గాలు కూడా పూర్తి కాలేదు. మొదట అధికారులు పుష్కరాలు ప్రారంభం అయితే ఉండవల్లి సీఎం నివాసం వద్ద నుంచి ఉండవల్లి, ఉండవల్లి సెంటర్, స్క్రూబ్రిడ్జి, ఎన్టీఆర్ కట్ట మీదుగా బైపాస్ రోడ్డుకు వెళ్లి విజయవాడ క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ కరకట్ట విస్తరణ పనులు ఆఘమేఘాలపై చేపట్టారు. పనులు చేస్తుండగానే సీఎం నివాసం నుంచి క్యాంపు ఆఫీసు వరకు తాడేపల్లిలోని సేఫ్టీ హౌస్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎన్టీఆర్ కరకట్ట ఎర్త్ వర్క్‌లే జరుగుతున్నాయి. దాదాపుగా రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రహదారి నిర్మాణం మరో 18 రోజుల్లో పూర్తి అవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క రోజు వర్షం కురిసినా, నాలుగైదు రోజుల పనులకు అంతరాయం కలుగుతోంది. ఇదిలాఉంటే తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి కొత్తూరు మీదుగా పశువుల ఆసుపత్రి బ్రిడ్జి దాటి బైపాస్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంది. ఈ రహదారిలో తాడేపల్లి, కష్ణా కెనాల్, కొలనుకొండ ప్యారీ కంపెనీలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ నుంచి భక్తులు ఈ ప్రాంతం గుండానే ప్రయాణం సాగించాల్సి ఉంది. అటు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద, ఇటు సీతానగరం వద్ద, కొత్తూరులో భక్తులను సీఎం వచ్చే సమయంలో ఆపితే వేలాది మంది భక్తులకు అసౌకర్యం ఏర్పడుతుంది. ప్రకాశం బ్యారేజి దగ్గర నుంచి విజయవాడ వెళ్లే సమయంలో అర్ధగంట ట్రాఫిక్ ఆపితేనే ప్రస్తుతం వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. పుష్కరాల సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపితే, తోపులాట జరిగి రాజమండ్రి లాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే రానున్న పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూటు ఎటో అర్థం కాక భద్రత సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు.