employee
-
రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్
ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వైరల్ అయ్యాయి.పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తికార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.పూణేలోని 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు. -
భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది
సాధారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది జాయిన్ అయిపోతారు. కొందరు అమ్మానాన్నలను అడగాలని, పెళ్ళైన మహిళలైతే తమ భర్తలకు చెప్పాలని అనుకుంటారు. ఇటీవల ఓ మహిళ ఉద్యోగానికి ఎంపికైన తరువాత.. తన భర్త ఆమోదం కావాలని అడిగిన వెంటనే జాబ్ పోగొట్టుకుంది.ముంబైకి చెందిన ఒక సీఈఓ తన కంపెనీలో సీనియర్ పదవికి ఎంపికైన ఒక మహిళను ఉద్యోగంలో చేరడానికి ముంచే తొలగించారు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఆఫర్‌ను అంగీకరించే ముందు తన భర్త ఆమోదం పొందాలని అడిగింది. దీంతో తక్షణమే ఆమెను ఆ ఉద్యోగానికి రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.Spoke to a candidate tdy, who wanted us to meet her husband after we had selected her.Instant reject.P.s: This was for a senior level hire.— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికైన మహిళ.. ఉద్యోగంలో చేరడానికే సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికే తన భర్త ఆమోదం కావాలని చెబుతోంది. రేపు కంపెనీ కోసం పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది. ఆమె పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉందని.. కంపెనీ సీఈఓ భావించి రిజెక్ట్ చేశారు.ఇదీ చదవండి: 'పెట్రోల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్లు'.. నితిన్ గడ్కరీప్రస్తుతం కంపెనీ సీఈఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు సీఈఓ చేసిన పనిని సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మహిళలు తరచుగా ఎదుర్కొనే సామాజిక అడ్డంకులను ఎత్తి చూపారు.Bcas she wants her husband to say yes for her to join us. Why would an independent woman want that. Basically she wants her husband to interview us to see if its ok for her to join. Shows she is totally dependent on him. How will she ever take any decisions, if she cannot take a…— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025 -
Software Employee: భర్త శరత్ వేధింపులే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ
-
Hyderbad Software: వివాహం జరిగిన 6 నెలలకే..
-
'ఫ్యామిలీతో గడుపుతున్నావు.. జీతం తగ్గిస్తున్నాం': షాకిచ్చిన కంపెనీ
రెడ్దిట్ వేదికగా.. చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులో జరిగే సంఘటనలు, అనుభవాలను మాత్రమే కాకుండా సమస్యలను కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగి తమ హెచ్ఆర్ నుంచి వచ్చిన వింతైన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.''ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితుల కోసం కేటాయిస్తున్నావు. కాబట్టి మీ బాధ్యతలను తగ్గిస్తున్నాము. మీ పోస్ట్ అలాగే ఉంటుంది. పని తక్కువైంది కాబట్టి.. జీతం తగ్గిస్తున్నాము'' అని హెచ్ఆర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్లో ఉండటం చూడవచ్చు.ఈ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫిసులలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని చెబుతున్నారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించకపోతే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. కంపెనీ మీకు లేఆఫ్ నోటీసు ఇవ్వకపోవడం మీ అదృష్టం.. అని ఒక వినియోగదారు అన్నారు.ఆఫీసులలో జరుగుతున్న అకృత్యాలు అంతా.. ఇంతా కాదు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.ఇదీ చదవండి: 'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. -
సమస్యను సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగి: నెట్టింట్లో వైరల్
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్‌ను ఎవరూ ఆపలేరని హెచ్ఆర్కు చెప్పండి. పీఎఫ్ పాస్‌బుక్‌లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది. -
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!
మీరు చెప్పినట్లేగానే నేను వారానికి 70గంటలకు పైగా పనిచేశా. చివరికి నాకు మిగిలిందేంటి? నా భార్య విడాకులు ఇవ్వమని అంటోంది. ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల, ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. అయితే, నారాయణ మూర్తికి సూచనకు పలువురు మద్దతు పలికితే.. మరికొందరు విమర్శించారు. ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయండి. ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. అలా మీరు చెప్పినట్లు చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతోంది. మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది’అని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేసే తమ భవిష్యత్ ఇలాగే ఉంటుందేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పేరు ప్రస్తావించని టెక్కీ.. అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ బ్లిండ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ‘నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నా. కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశా. ప్రమోషన్ కోసం జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి చేరుకున్నాను. జీతం, ప్రమోషన్ పెరిగే కొద్ది పనికూడా పెరిగింది. ఎంతలా అంటే నా విధుల్లో భాగంగా యురోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చేంది. ఫలితంగా, ఆఫీస్ మీటింగ్స్ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి. అది చాలదన్నట్లు కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మూడేళ్లకే సీనియర్ మేనేజర్‌గా ప్రమోషన్‌తో పాటు ఏడాదికి రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను.కానీ ఏం లాభం ఇప్పుడు నా భార్య నాకు విడాకులు కావాలని అడుగుతోంది. అందుకు కారణం నేనే. ఆఫీస్ వర్క్ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోయాను. డెలివరీ తర్వాత తనతో గడిపానా అంటే అదీలేదు. తోడు లేక, నా కూతురు పుట్టిన రోజులకు అటెండ్ కాలేకపోయాను. పాపం నా భార్య డిప్రెషన్‌కు గురైంది. డిప్రెషన్ ఎక్కువైంది. డాక్టర్‌కు చూపించుకోవాలని అడిగేది. అది సాధ్యమయ్యేది కాదు. చివరికి ఈ బాధల్ని తట్టుకోలేక నా భార్య విడాకులు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు."నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో, ఏ కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?’ అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు. View on Blind -
నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి!
కోల్‌కతా : అత్యవసర పని పడింది. నేను అడిగింది లీవే కదా. లీవ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి సహనం కోల్పోయాడు. తాను సెలవు అడిగితే ఉన్నతాధికారి కాదనడంతో కోపం కట్టలు తెంచుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉన్నతాధికారితో పాటు సహచర ఉద్యోగులపై దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో తిరుగుతూ కనిపించారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన కరిగరి భవన్‌లోని సాంకేతిక విద్యా విభాగంలో అమిత్ కుమార్ సర్కార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలాగే ఆఫీస్‌కు వచ్చిన కుమార్ లీవ్ కావాలని ఉన్నతాధికారిని అడిగారు. ఆ విషయంలో తన సహోద్యోగులతో గొడవ జరిగింది. ఈ గొడవలో అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో సహచర ఉద్యోగులపై దాడి చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లి పోయారు. వీపున బ్యాగు, రక్తంతో తడిసిన కత్తితో వెళ్తున్న అమిత్‌ను స్థానికులు వీడియోలు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్‌లో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు తన సహోద్యోగులతో సెలవు విషయంలో గొడవ పడ్డాడు. సెలవు నిరాకరించడానికి గల కారణం, సహోద్యోగులపై కత్తితో ఎందుకు దాడి చేశారో తెలియాల్సి ఉంది. నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్నాం. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తాం. కాగా, అమిత్ కత్తిదాడిలో జయదేబ్ చక్రవర్తి, శాంతను సాహా, సర్తా లేట్, షేక్ సతాబుల్ గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
కానిస్టేబుల్ రూ.500 కోట్ల అక్రమాస్తులపై రాజకీయ దుమారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఏకంగా రూ.500 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. బయటపడింది. గత నెలలో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఉన్న పాడుబడిన వాహనంలో ఏకంగా రూ.11 కోట్ల రూపాయల నగదు, 52 కిలోల బంగారం, ఒక డైరీ బయటపడింది. ఇంతేకాక శర్మ మొత్తంగా రూ.500 కోట్ల ఆస్తులు పోగేసినట్లు లోకాయుక్త పోలీసులు కనుగొన్నారు. శర్మ అవినీతి వ్యవహారం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత జితూ పట్వారీ ఆరోపిస్తున్నారు. ఈ విషయం సౌరభ్‌శర్మ డైరీ చూస్తే తెలుస్తుందన్నారు. తనకు శర్మ డైరీలోని ఆరు పేజీలు మాత్రమే దొరికాయని పట్వారీ చెప్పారు. ఈ ఆరోపణలపై బీజేపీ ధీటుగా స్పందించింది. గతంలో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా ఉండేదని కౌంటర్ ఇచ్చారు. అయితే కానిస్టేబుల్ సౌరభ్‌శర్మ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. -
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్
ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది. అనేక సంఘాలను ఎదుర్కొన్న తరువాత కంపెనీ రూ.3000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి అన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంస్థ క్లియర్ చేస్తోంది.చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కంపెనీ చెల్లించడంతో.. సంస్థ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పిఎఫ్ బకాయిల క్లియరెన్స్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్పైస్‌జెట్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.SpiceJet has settled pending employee provident fund dues of ₹160.07 crore accumulated over the past two years, along with other statutory liabilities such as TDS, GST, and employee salaries. This was made possible through internal cash flows and the ₹3,000 crore raised via a… pic.twitter.com/QFgbBXGmxZ— SpiceJet (@flyspicejet) December 13, 2024 -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ?
-
బాస్‌ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్
ఒకప్పుడు ఉద్యోగులు సమయంతో పనిలేకుండానే ఆఫీసుకు ముందుగా వచ్చేసి.. పని పూర్తి చేసుకుని లేటుగా కూడా ఇంటికి వెళ్లేవారు. అయితే.. ఇప్పుడున్న ఉద్యోగులలో కొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసులో లేట్ అయితే.. రేపు డ్యూటీకి లేటుగా వస్తామంటూ బాస్‌కు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక ఉద్యోగి.. హాయ్ సార్ & మేడమ్ నేను రేపు ఉదయం 11.30 గంటలకు ఆఫీసుకు వస్తాను. ఎందుకంటే నేను రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరాను, అంటూ మెసేజ్ చేశారు.ఉద్యోగి పంపిన మెసేజ్‌ను 'ఆయుషి దోషి' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా జూనియర్ నాకు ఇలా మెసేజ్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నాను, ఈ కాలం పిల్లలు వేరేలా ఉన్నారు. ఆఫీసు నుంచి లేటుగా వెళ్లాను, కాబట్టి లేటుగా ఆఫీసుకు వస్తాను. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ.. పేర్కొంది.సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే పనిని ఉద్యోగికి అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన పనిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. కానీ.. పని చేయాల్సిన సమయంలో ఉద్యోగి ఫోన్‌పై ద్రుష్టి పెడుతూ పనిని ఆలస్యం చేస్తే.. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని.. ఆయుషి దోషి మరో ట్వీట్లో వెల్లడించారు.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ మీద నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులను కంపెనీలు దోచుకుంటున్నాయని చెబుతుంటే.. మరికొందరు ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం అని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఆ ఉద్యోగి కాన్ఫిడెంట్ నచ్చిందని చెబుతున్నారు.I can’t believe my junior sent me this. Today’s kids are something else. He stayed late, so now he’s going to show up late to the office to "make up" for it. What a move!🫡🫡 i am speechless mahn. pic.twitter.com/iNf629DLwq— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) November 12, 2024 -
విషాదం మిగిల్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం కేసు
సాక్షి, కృష్ణా జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది. అవనిగడ్డ మండలం తుగలవానిపాలెంలో ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. స్నేహితుని వద్దకు వెళ్లి వస్తానని చెప్పి చల్లపల్లికి చెందిన బొడ్డు సుమంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లారు.అయితే, రెండు రోజుల క్రితం పులిగడ్డ-పెనుమూడి వారధి పై సుమంత్ బైక్, ఫోన్, పర్సు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమంత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఉద్యోగినికి మెసేజ్.. మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్‌కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్జ్కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్‌కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు. -
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..
అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగిని కంపెనీ బాస్ తొలగించడమే కాకుండా.. మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా వెల్లడించారు. నేను ఎనిమిది నెలలకు పైగా సంస్థలో పనిచేసాను. కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది. అయితే క్రమంగా పని భారం పెరిగింది. ఒత్తిడి తీవ్రమైంది. ఒక నెల క్రితం ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది. ఆ తరువాత చికెన్‌పాక్స్ సోకింది.అనారోగ్యంతో బాధపడుతున్న నేను మూడు రోజులు సెలవు కావాలని సీఈఓకు మెయిల్ చేశాను. కానీ సీఈఓ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని వెల్లడించారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ చేయలేనని చెప్పాను. ఆరోగ్యం కుదుటపడాలంటే కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి రాజీనామా చేయాలనీ నిర్ణయించున్నాను. ఆ తరువాత నా రాజీనామాను సీఈఓకు అందించాను. ఒక నెల రోజులు ముందుగా రిలీవ్ చేయాలని అభ్యర్థించాను.సీఈఓ నా రాజీనామాను తిరస్కరించమే కాకుండా.. తప్పకుండా కంపెనీలో పనిచేయాలని చెప్పారు. ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో నాకు ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది. ఆ తరువాత మళ్ళీ ఒకసారి నా రాజీనామా గురించి సీఈఓకు గుర్తుచేశాను. అయినా నా మీద సీఈఓ సానుభూతి చూపలేదు. ఆ తరువాత రెండు రోజులు సెలవు తీసుకున్నాను. అయితే నాకు వారు టెర్మినేషన్ ఇమెయిల్‌ను పంపారు.ఇదీ చదవండి: అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..వారు టెర్మినేషన్ ఇమెయిల్ పంపిన తరువాత.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV)లో తప్పుగా రిపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే.. మూడు నెలల జీతం డిమాండ్ చేశారని, ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగారు. దీనికి చాలామంది స్పందిస్తూ మంచి న్యాయవాదిని సంప్రదించాలని, కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని తమదైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఉన్నారు. -
పని ఒత్తిడి పనిపడదాం..!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది. ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం. హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని యాజమాన్యం.. కంపెనీపై తీవ్ర విమర్శలు
పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధంఅయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్సంస్థ తీరు దారుణంఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీకాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్‌లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రంగంలోకి కేంద్రంఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. -
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్‌బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ఏ పనీ లేదు.. రూ.3.10 కోట్లు సంపాదించాను: అమెజాన్ ఉద్యోగి
ఏడాదిన్నర కాలంలో కంపెనీలో ఎలాంటి పనిలేకుండా ఏడాదికి 3.10 కోట్ల రూపాయలు జీతము తీసుకుంటున్నట్లు అమెజాన్ సీనియర్ ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పనిచేయకుండా ఇంత జీతం ఎలా తీసుకుంటున్నారు? అనే అనుమానం చాలామందిలో కలిగింది. మరిన్ని వివరాలు చూసేద్దామా..గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. అమెజాన్‌లో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగంలో చేరారు. ఏడాదిన్నర కాలంలో ఏ పనీ చేయకూండానే 370000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3.10 కోట్లు) జీతంగా పొందినట్లు వెల్లడిస్తూ.. ఈ అదృష్టం ఎంతకాలమో అని అన్నారు.నిజానికి గూగుల్ కంపెనీ లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ పనీ చేయకుండానే డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే అమెజాన్ కంపెనీలు చేరినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కేవలం ఏడు సపోర్ట్ టికెట్లను పరిష్కరించినట్లు, ఒకే ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించినట్లు చెప్పారు. దాన్ని నిర్మించడానికే మూడు నెలలు సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా దీన్ని కేవలం మూడు రోజుల్లో రూపొందించవచ్చని ఆయనే వెల్లడించారు. రోజులో ఎక్కువ భాగం మీటింగులకే పరిమితమవుతానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.అమెజాన్ ఉద్యోగి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం 'ఎక్స్'లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిని విమర్శిస్తున్నారు. రోజంతా ఏ పని లేకుండా ఇదెలా సాధ్యం? ఇతర ఉన్నతోద్యోగులు ఇలాంటి వారిని గమనించడం లేదా? అని అంటున్నారు.many such cases pic.twitter.com/4o32Qq7JKE— anpaure (@anpaure) August 23, 2024 -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్ఓ రూల్స్..అవేంటో తెలుసా?
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్ స్కీమ్స్ (ఎన్పీఎస్ అండ్ ఈపీఎఫ్ఓ), ఇన్ కమ్ ట్యాక్స్, ఫాస్టాగ్‌లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్పీఎస్: టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు నెలవారి పెన్షన్‌ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్ దారులకోసం పీఎఫ్ఆర్డీఏ ఆథార్ నెంబర్‌తో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగి.. స్పాట్లో రిజైన్! ఎందుకంటే..
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు. దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్‌లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్‌కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు. So, I Quit My Job byu/CrazieIrish inantiwork -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
‘శాడిస్ట్ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
Survey : గూగుల్ ఉద్యోగులైతే చాలు.. యాపిల్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు.. గతంలో ఏ కంపెనీలో పని చేశారు. ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఇతర టెక్నాలజీ కంపెనీల్ని ఇష్టపడుతున్నారా? ఇలాంటి ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింక్డిన్ ప్రొఫైల్స్ ఆధారంగా తేలిన సర్వే ప్రకారం.. గూగుల్‌కు నుంచి యాపిల్‌లో చేరిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్‌లో పనిచేస్తున్న సిబ్బంది గతంలో ఇంటెల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో పని చేసినట్లు సర్వే పేర్కొంది. సర్వే ఎలా చేశారు టెక్కీల గురించి ఏ సంస్థ సర్వే నిర్వహించిందనే విషయాలపై స్పష్టత లేదు. అయితే సర్వే చేసిన ప్రతినిధులు.. ముందుగా గూగుల్,అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, నెట్‌ఫ్లిక్స్, ఎన్విడియా, సేల్స్ ఫోర్స్, అడోబ్, ఇంటెల్, ఊబర్ ఉద్యోగుల లింక్డిన్ ప్రొఫైల్‌ని చెక్ చేశారు. ఆ ప్రొఫైల్స్‌లో టెక్కీలు ప్రస్తుతం, గతంలో ఏ కంపెనీలో పనిచేశారో గుర్తించి.. వారిని పర్సంటేజీల వారీగా పరిగణిస్తే చివరిగా ఏ సంస్థ ఉద్యోగులు ఎవరు, ఎక్కడ పనిచేశారో నిర్ధారించారు. దీన్నిబట్టి యాపిల్ సంస్థ అమెజాన్, అడోబ్, గూగుల్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మక్కువ చూపితే.. యాపిల్ ఉద్యోగులు మాత్రం గూగుల్‌లో చేరేందుకు ఇష్టం చూపిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఈ సంస్థ ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ యాపిల్ సంస్థ..అమెజాన్, అడోబ్, గూగుల్, ఐబీఎం, ఇంటెల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒరాకిల్, టెస్లా ఈ పది కంపెనీల వర్క్ ఫోర్స్‌ని నియమించుకునేందుకు ప్రాదాన్యం ఇస్తుంది. 2019లో ఇంటెల్ స్మార్ట్ ఫోన్ మోడెమ్ బిజినెస్‌ని యాపిల్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కుపెర్టినో దిగ్గజం (యాపిల్) ఇంటెల్ ఉద్యోగుల్ని నియమించుకుని వారితో తన సొంత రేడియో చిప్‌లను తయారు చేయించుకునేందుకు నిమగ్నమైంది. యాపిల్ ఉద్యోగులు రిజైన్ చేసి మరో టెక్ కంపెనీలో చేరే జాబితాలో గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, సేల్స్‌ఫోర్స్, అడోబ్, ఇంటెల్, ఒరాకిల్‌లు ఉన్నాయి. గూగుల్ మాజీల వైపు యాపిల్ చూపు సర్వే ప్రకారం.. గూగుల్ మాజీ ఉద్యోగుల్ని యాపిల్ హయర్ చేసుకునేందుకు ఇష్టపడుతుంది. గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. గూగుల్‌లో ఉద్యోగం చేసేందుకు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకుంటుండగా.. గతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన 12,108 మంది ఉద్యోగుల్ని గూగుల్ ఎంపిక చేసుకుంది. మెటాలో టెక్నాలజీ రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 26.51శాతంగా ఉంది. గూగుల్‌లో పనిచేసిన ఉద్యోగులు 24.15శాతం, ఐబీఎంలో 2.28 శాతం మంది మెటాలో చేరారు. అలాగే కొత్త అవకాశాల కోసం 3,363 మంది గూగుల్ ఉద్యోగులు మెటాలో చేరినట్లు నివేదిక స్పష్టం చేసింది. -
ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.. 'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అడ్వర్టైజింగ్లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శన్ మెహతా జీతం ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ 2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం. -
క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు అప్పు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పల్నాడు: ఆర్థిక బాధలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీపావళి రోజున నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే, సివిల్ పోలీసులు తెలిపిన వివరాలు.. రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన బద్దూరి గంగిరెడ్డి(33) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈపూరు మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. గత నెల 23న దసరా పండుగ సెలవులపై భార్య, పాపతో అలవాల చేరుకున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్లేందుకు బయలుదేరగా, నాకు పని ఉంది మీరు వెళ్లడంటూ గ్రామంలోనే ఉండిపోయాడు. తనకు కంపెనీ పని ఉందంటూ నాలుగైదు రోజుల క్రితం నరసరావుపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వెళ్లకుండా ఆదివారం ఉదయం 10 గంటలకు ద్విచక్రవాహనంపై సాతులూరు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాడు. తన సోదరి సంధ్యకు ఫోన్ మెసేజ్ పంపాడు. తాను బతకనని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ చేశాడు. ఆతర్వాత కొద్దిసేపటికి సాతులూరు రైల్వే స్టేషన్ పట్టాలపై చేరుకున్నాడు. ఆసమయంలో గుంటూరు–గుంతకల్లు వెళ్లే పాసింజర్ కిందపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే లింగారెడ్డి మృతి చెందాడు. రైల్వే కీమెన్ కోటేశ్వరరావు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. రైల్వే సీఐ పి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ శ్రీనునాయక్, చిలకలూరిపేట రూరల్ సీఐ అశోక్‌కుమార్, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్టేషన్ మాస్టర్ కుమారరాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా నష్టపోయి రూ.40 లక్షలు అప్పులపాలుకాగా తండ్రి లింగారెడ్డి తీర్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావటంతో బెట్టింగ్‌లకు అలవాటు పడి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో కలత చెందిన లింగారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం
అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి అదే హోటల్లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది. జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. రిట్జ్-కార్ల్టన్ హోటల్లో తనకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇచ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు..
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్‌తో పాటు డియర్నెస్ అలవెన్స్ (dearness allowance (DA)) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ అలవెన్స్ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర కేబినెట్ ఉద్యోగుల డీఏ అలెవన్స్ను 4 శాతానికి పెంచింది. కేంద్ర నిర్ణయంతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షన్లకు లబ్ది చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తద్వారా ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై ఏకంగా రూ.12,815.60 కోట్ల అదనపు భారం పడనుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, ఈ పెంపు జనవరి 01, 2023 నుండి అమలులోకి రానుంది. డియర్నెస్ అలవెన్స్ అంటే..? ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. డీఏను మన దేశంలో మొదటిసారిగా 1972లో ముంబై నుంచి ప్రవేశపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డియర్నెస్ అలవెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. 👉 : Follow the Sakshi TV channel on WhatsApp: -
'సార్ వద్దు.. నన్ను అలా పిలువు! నా కోరిక తీర్చవా? అంటూ మహిళా ఉద్యోగితో..
సాక్షి, సిద్దిపేట: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా స్థాయి అధికారి కింది స్థాయి మహిళా ఉద్యోగితో అస్యభంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక.. నిత్యం లైంగిక వేధింపులు భరించలేక సదరు మహిళ లోలోపలే కుమిలిపోతోంది. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన వీడియో కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినిని ద్వితీయ స్థాయి అధికారి తనను పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆయనకు 50 ఏళ్లు, పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 22 ఏళ్ల వయసు ఉండే మహిళా వైద్యురాలిపై కన్నేసి ఆమెకు రాత్రి వేళల్లో ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ‘సర్ అనకు.. నన్ను మామయ్య అను’.. ‘వీడియో కాల్ చేస్తే కనబడవా.. చిన్న కోరిక కూడా తీర్చవా’.. ‘నీవు రెడీ అంటే.. పెళ్లి చేసుకుంటా..’ అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. అధికారి వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేధైర్యంలేక ఆమె ఆవేదన చెందుతోందని అక్కడి ఉద్యోగుల నుంచి సమాచారం. ఆయన గతంలో పనిచేసిన చోట కూడా ఇలానే ప్రవర్తించాడని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. -
ఉద్యోగం నుంచి పొమ్మన్న బాస్.. ప్రైవేట్ వీడియోతో ప్రతీకారం తీర్చుకున్న యువతి!
పంజాబ్‌లోని జలంధర్‌లో అశ్లీల వీడియో వైరల్ అయిన ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. స్థానికంగా పిజ్జాషాప్ నిర్వహిస్తున్న ఒక జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో ఫేక్ అని, దానిని ఎడిట్ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ యువతి గతంలో ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. ఆ యువతి యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇటువంటి పనిచేసిందని పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం జలంధర్‌కు చెందిన ఒక జంట పిజ్జా షాప్ ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుకాణదారు తమ ప్రైవేట్ వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ము ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాలుగు వీడియోలు వైరల్ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితురాలిని తనీషాగా గుర్తించామని, ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఆమె గతంలో ఒక పిజ్జా షాపులో పనిచేసేదని, ఆమె పనితీరు నచ్చకపోవడంతో యజమాని ఆమెను పనిలో నుంచి తీసేశారని, దీంతో ఆమె యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తెలిపారు. అలాగే రూ. 20 వేలు కావాలంటూ డిమాండ్ చేసిందన్నారు. కేసు దర్యాప్లు చేస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా? -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగిని గుర్తు తెలియని దుండుగులు హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురలో చోటుచేసుకుంది. మృతుడిని హర్‌ప్రీత్ గిల్‌గా గుర్తించారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామతో కలిసి భజన్‌పురలోని సుభాష్ విహార్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది దుండగులు ఇద్దరిపై అడ్డగించి కాల్పులు జరిపారు. అనంతరం స్థానికులు గమనించి వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామకు చికిత్స అందిస్తున్నారు. మృతుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయిదుగురు వ్యక్తులు తనపై, తన అల్లుడిపై కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హర్‌ప్రీత్ ఇంటి నుంచి బయటకు వెళ్తూ 10 నిమిషాల్లో తిరిగి వస్తానని తమ తల్లిదండ్రులకు తెలిజయేశారు. దుండగుల కాల్పుల్లో గిల్ తలపై కుడి వైపు, బుల్లెట్ గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు. మృతుడి మేనమామ భజన్‌పురా నివాసి. అతడికి కూడా తలపై కాల్పులు జరగడంతో లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చేర్పించినట్లు డీసీపీ తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో యాక్టివ్‌గా ఉందని, నగరంలో పెద్ద డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో తమ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. చదవండి: Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో -
రోజుకి గంట మాత్రమే పని.. రూ. 1.2 కోట్లు వేతనం
లక్షల ప్యాకేజి రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఒక 'సాఫ్ట్వేర్' ఇంజినీర్ రోజుకి కేవలం ఒక గంట మాత్రమే పనిచేస్తూ ఏకంగా రూ. 1.2 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడెవరు? ఎక్కడ పనిచేస్తున్నాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మనం చెప్పుకుంటున్న యువ సాఫ్ట్వేర్ (డెవాన్) గూగుల్ (Google) కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు రోజుకి 1 గంట మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన పనిచేస్తాడు. మిగిలిన సమయం స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీలో తాను ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు పని చాలా త్వరగా నేర్చుకున్నట్లు, కోడ్లను కూడా త్వరగా పూర్తి చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? నిజానికి తనకు వారానికి సరిపడా వర్క్ ఇస్తే దాన్ని మొదటి రోజే దాదాపు పూర్తి చేస్తాడు, ఆ తరువాత మిగిలిన నాలుగు రోజులు కేవలం గంట మాత్రమే పనిచేసి చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మొత్తానికి అతనికి ఇచ్చిన వర్క్ మాత్రం టైమ్‌కి పూర్తి చేస్తాడు. ఇచ్చిన టైమ్‌కి పని బాగా చేస్తుండటం వల్ల కంపెనీ ఇతనికి బోనస్ అందించడంతో పాటి రివార్డులు కూడా అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఇతడు కూడా ఒకడు కావడం గమనార్హం. అంతే కాకుండా గూగుల్ సంస్థలో జాబ్ చేయడం చాలా సులభమని చెప్పుకొచ్చాడు. డెవాన్ 1,50,000 డాలర్లను వార్షిక జీతంగా పొందుతున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.2 కోట్లు. -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్‌లోని బర్గర్ కింగ్‌లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్‌గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్‌బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్‌ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు..
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచక ఉద్యోగి వేధింపుల బండారం బట్టబయలైంది. ఓ జాతీయ క్రీడాకారిణిపై మంత్రి పేషీ ఉద్యోగి వేధింపుల ఘటన సంచలనం రేకెత్తించింది. మంత్రి సిఫార్సుతో వచ్చినా వేధింపులు తప్పలేదని ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కెరీర్‌కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ వేధించాడు. అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్లినా నన్ను కలవనివ్వలేదు. గతంలో వేధింపులకు గురైనా బయటకు రాలేకపోయామంటూ బాధితురాలు వాపోయింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగినిపై నిఘా..బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
‘సెలవులు పెడితే క్రిమినల్లా చూస్తున్నారు’.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్‌ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్‌ప్లేస్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్‌ప్లేస్‌లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా.. "నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్‌ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు. సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్‌టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్‌టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు. -
ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష..
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు. అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు. ఆరోగ్య పథకంపై చర్చ.. రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.ఈపథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు.అంతేగాక ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు. ఇదీ చదవండి: ‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’ -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగిని చేసిన పనికి..
Work From Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచములోని చాలా దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home) వెసులుబాటు కల్పించాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా దీనికే అలవాటుపడిన ఎంప్లాయిస్ ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు పనిని సక్రమంగా నిర్వహించడం లేదని కంపెనీలు వాపోతున్నాయి. ఇటీవల ఒక కంపెనీ తమ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసి వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (IAG) కన్సల్టెంట్ 'సుజీ చీఖో' వర్క్ ఫ్రమ్ హోమ్‌లో సరిగ్గా విధులు నిర్వహించడం లేదని ఈ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటి నుంచి పనిచేసే సమయంలో సరిగ్గా టైపింగ్ చేయలేదని, అసలు ఆమెకు టైపింగ్ రాదనీ కంపెనీ వెల్లడించింది. సుజీ చీఖో పనితీరుని పసిగట్టడానికి 49 రోజుల పాటు కీస్ట్రోక్ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో ఆమె చాలా తక్కువ కీస్ట్రోక్ యాక్టివిటీని కలిగి ఉన్నట్లు కనిపెట్టింది. అంతే కాకుండా 47 రోజులు వర్క్ ఆలస్యంగా ప్రారంభించినట్లు, 29 రోజులు సమయం కంటే త్వరగా లాగవుట్ చేసినట్లు, మొత్తం మీద 44 రోజులు కంపెనీ నిర్దేశించిన పూర్తి సమయం పనిచేయలేదని కనుక్కుంది. మిగిలిన రోజులు అసలు పనే చేయకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి.. సుజీ చీఖో పనితీరు సరిగ్గా లేదని కంపెనీ చాలా సార్లు గట్టిగా హెచ్చరించింది. పర్ఫామెన్స్ మెరుగుపరచుకోవాలని మూడు నెలలు సమయం కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అంతే కాకుండా కంపెనీ ట్రాకింగ్‌ను తప్పుపట్టడమే కాకుండా.. తాను సరైన విధంగా పనిచేస్తున్నట్లు, ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో కాకుండా వేరే డివైజులో పనిచేస్తున్నట్లు వాదించింది. ఆమె వాదనను ఫెయిర్ వర్క్ కమిషన్ (FWC) తిరస్కరించింది. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మంగళం పాడాయి. -
దివాళ అంచున ప్రముఖ సంస్థ.. 12 వేల మంది ఉద్యోగులు ఇంటికి?
బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ఇటీవల సరిగా లేదన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పడుతూ దివాళ అంచుకు వెళుతున్నాయి. కొందరు యజమానులు తమ కంపెనీలను మూసివేస్తున్నారు కూడా. తాజాగా ఓ ప్రముఖ రీటైలర్ సంస్థ కూడా భారీగా నష్టాలు రావడంతో దివాళ అంచుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. యూకే లో వస్తువులను చవగ్గా విక్రియిస్తూ మధ్యతరగతికి చేరువైన విల్కో రిటైల్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్రమాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2021 డిసెంబర్లో ప్రారంభమైన వడ్డీ రేట్ల పెంపుల పెంపు, రిటైలర్ బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల అనుగుణంగా వ్యాపారాన్ని నడపలేకపోవడం కారణంగా ఈ సంస్థ వ్యాపారం క్షీణిస్తూ వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ తరహా సంస్థలు కొన్ని లాభాల బాటలో నడిపాయి. విల్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జాక్సన్ మాట్లాడుతూ.. "ఇది చాలా ఆందోళన చెందాల్సిన అంశం. విల్కోలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు వారి ఉపాధిపై భయాలను తొలగించడంతో పాటు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికే కంపెనీ చర్యలు ప్రారంభించిందని అన్నారు. మరో వైపు విల్కో ఇప్పటికే రీస్ట్రక్చరింగ్ సంస్థ హిల్కో నుంచి 40 మిలియన్ పౌండ్లను రుణంగా తీసుకుంది. ఆ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో కోత, యాజమాన్యంలో మార్పులను చేయాల్సి ఉంటుంది. అలాగే మరీ భారంగా పరిణమించిన శాఖలను విక్రయించడం ద్వారా కొన్ని నిధులను సేకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టోర్లలో చాలా చోట్ల ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మళ్లీ విల్కో పాత వైభవం వస్తుందా లేదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. చదవండి టెక్ మహీంద్రా కీలక నిర్ణయం .. ఆనందంలో ఉద్యోగులు -
మద్యం మత్తులో మేనేజర్‌కు మెసేజ్.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!
మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్‌తో చాట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆ మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్ తన బాస్‌కు అర్థరాత్రి 2:30కి మెసేజ్ చేసి, దానిలో.. ‘బాస్ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాసిన బాస్.. ఎక్స్ నుంచి మద్యం మత్తులో మెసేజ్‌లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్‌లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్‌లు మీకు రావు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు! Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl — Siddhant (@siddhantmin) August 4, 2023 -
బైజూస్ ఆఫీస్‌లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్‌ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్‌తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్‌లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్‌ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
పనిఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
భాగ్యనగర్‌కాలనీ: పనిఒత్తిడి కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దయాల్గూడ ఎలైట్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న భగవాన్ నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన వారి వద్ద విచారించినా ఫలితం లేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. టోల్ గేట్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. Woman's Brazenness Caught On Camera: Toll Plaza Employee Threatened, Hair Pulled https://t.co/hGIn4pSlSO pic.twitter.com/hMjzuID9bX — NDTV (@ndtv) July 17, 2023 ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
ఫాస్ట్‌గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్‌కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
తక్కువగా పని చేయమని బ్రతిమాలుకున్న బాస్..
సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగులు కొంచెం ఎక్కువసేపు పని చేస్తే బాగుండని కోరుకుంటూ ఉంటారు యజమానులు. వృత్తిని దైవంగా భావించి ఓవర్ టైమ్ పని చేసి యజమాని మెప్పు పొందిన అలాంటి ఉద్యోగులు కూడా లేకపోలేదు. అలాగే కొంచెం ఎక్కువ పని చెప్పినా విసుక్కునే ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఉద్యోగులను తక్కువగా పని చెయ్యమనే బాస్ లు ఎక్కడైనా ఉంటారా అంటే నేనున్నాని చెబుతున్నారు ఒక బాస్. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగిని ఆ బాస్ కొన్ని మెయిల్స్ కు సమాధానాలు ఇవ్వమని కోరారు. అత్యుత్సాహంతో ఆ ఉద్యోగి తన బాస్ తనకు ఇచ్చిన పనిని కొద్ది గంటల్లోనే ముగించేశాడు. దీంతో ఆ బాస్ పిలిచి మరీ చివాట్లు పెట్టారంట. ఆ విషయాన్ని స్వయంగా ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసక్తితో పని చెయ్యి.. తన బాస్ పిలిచి.. నీకు నీ పనంటే ఇష్టమని నాకు అర్ధమవుతుంది. నీకు వచ్చిన అన్ని మెయిల్స్ కు సమాధానం పంపాల్సిన అవసరం లేదు. కొన్నిటిని అలా వదిలేయమని, అలాగే అంత వేగంగా కూడ ఆ పని చేయాల్సిన అవసరంలేదని.. కొంచెం నెమ్మదిగా పనిచేయమని చెప్పారట. నీవలన మిగతా ఉద్యోగుల్లో లయ దెబ్బతింటుంది. నాకు వాళ్ళు చాలా ముఖ్యమని సున్నితంగా హెచ్చరించారని చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తొందరగా పనిచేసే వాడు వేరొకరి పనిని చెడగొడతాడని భయంతో మీ యజమాని అలా చెప్పి ఉంటాడని కొందరంటే.. నీకు పని తక్కువగా ఉంది కాబట్టి తొందరగా అయిపొయింది.. నీ పని పెంచితే సరిపోతుంది.. అని ఇంకొందరన్నారు.. తొందరగా పనైపోతే ఖాళీగా బాస్ ముందు తిరిగే బదులు మిగిలిన వారి పని చేసిపెట్టవచ్చు కదా.. అని మరికొందరు సలహాలిచ్చారు. ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది. తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు. ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..? -
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ లో 1000 ఉద్యోగాలు
-
టీసీఎస్‌కు షాక్.. వేలలో మహిళా ఉద్యోగులు రిజైన్
-
రోజుకి 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగి.. డాక్టర్ చెప్పింది విని షాక్
-
ఉద్యోగి క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాకే పదోన్నతి
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి పొందాకే పదోన్నతి పొందేందుకు అర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇచ్చినా, ఆ స్టే ఉత్తర్వులను చూపుతూ పదోన్నతి కోరజాలరని తేల్చిచెప్పింది. ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినా లేదా క్రిమినల్ కేసు, అభియోగాలు, అభియోగపత్రం దాఖలైనా ఆ ఉద్యోగికి పదోన్నతినివ్వడాన్ని వాయిదా వేయొచ్చని 1991లో ప్రభుత్వం జీవో 66 జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుపై స్టే విధించినా తనకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఓ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. నకిలీ సర్టిఫికెట్లతో.. కర్నూలుకు చెందిన నాగరాణి 1996లో కారుణ్య నియామకం కింద ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్లలో ఇంటర్ పూర్తి చేయాలని అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఇంటర్ పూర్తికి తనకు మరో మూడేళ్ల గడువునివ్వాలని ఆమె అభ్యర్థించగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2001లో నాగరాణి బీఏ సర్టిఫికెట్లను సమర్పిస్తూ వీటి ఆధారంగా తన సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. బెటాలియన్ కమాండెంట్ ఆ సర్టిఫికెట్లు నిజమైనవో, కావో తేల్చాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపారు. వాటిని పరిశీలించిన వర్సిటీ అధికారులు నకిలీవని తేల్చారు. దీంతో నాగరాణిని సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ కమాండెంట్ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరమైన శిక్ష కింద ఏడాది పాటు ఇంక్రిమెంట్‌ను వాయిదా వేశారు. 2002లో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అదే ఏడాది ఆమెకు అభియోగాలకు సంబంధించి మెమోరాండం ఇచ్చారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కర్నూలు నాలుగో టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె సర్వీసులను క్రమబద్ధీకరించారు. ఇదే సమయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. నాగరాణిని దోషిగా తేలుస్తూ ఆమెకు మూడు నెలల జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ఆమె 2008లో కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఆమెకు విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. తిరిగి సరైన అభియోగం నమోదు చేసి ఆమె వాదనలు విని తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు సూచించింది. దీనిపై నాగరాణి 2009లో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది. పదోన్నతినిచ్చేలా ఆదేశాలివ్వండి.. కాగా తనపై కోర్టు కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో తనకు ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి ఇవ్వడం లేదని, దీనిని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ 2021లో నాగరాణి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. నాగరాణిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆమె పదోన్నతికి అర్హురాలు కాదని తేల్చిచెప్పారు. చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన -
వర్క్ టైంలో ఆన్ లైన్ షాపింగ్ అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి
-
25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుభవార్త
రాజస్థాన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు పూర్తి పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించింది. జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్షత జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో రాజస్థాన్ సివిల్ సర్వీస్ (పెన్షన్) నిబంధన 1996 సవరణ ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం పూర్తి పెన్షన్ అందుకోనున్నారు. అయితే విధమైన లబ్ధి పొందాలంటే ప్రభుత్వ ఉద్యోగి 28 ఏళ్ల సర్వీసు పూర్తి చేయడం తప్పనిసరి. దీనితో పాటు 75 ఏళ్ల పింఛనుదారుడు లేదా అతని ఫ్యామిలీ 10 శాతం అదనపు పెన్షన్ భత్యం అందుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన నిర్ణయం ప్రకారం పింఛనుదారు మరణించిన తరువాత రూ. 12,500 వరకూ ప్రతీనెలా ఆదాయం అందుకునే అతని వివాహిత కుమారుడు లేదా కుమార్తె కూడా ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు అర్హులవుతారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ కొత్త సవరణ నోటిఫికేషన్ 2023 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. చదవండి: చిత్రాలు గీసేందుకు చేతులెందుకు? -
ఓ మహిళా చిరుద్యోగి.. 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి
సాక్షి, అమరావతి: తన సర్వీసు క్రమబద్ధీకరణ, జీతభత్యాల విషయంలో 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన న్యాయ పోరాటంలో ఓ మహిళా చిరుద్యోగి చివరకు విజయం సాధించారు. అధికారుల తీరును తప్పుపడుతూ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నాటి నుంచే (2009) ఆ మహిళా ఉద్యోగి నోషనల్ పే పొందేందుకు అర్హురాలన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. ఆమె తన సర్వీసు క్రమబద్ధీకరణ నాటి నుంచే (1993) నోషనల్ పేకు అర్హురాలని స్పష్టం చేసింది. అలాగే నోషనల్ పే బకాయిలకు సైతం ఆమె అర్హురాలేనని తేల్చిచెప్పింది. ఆమెకు అనుకూలంగా ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసిందని.. అయితే అధికారుల లోపం, నిర్లక్ష్యం వల్లే ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరిగిందని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారుల చేసిన తప్పులకు ఆ మహిళా ఉద్యోగికి చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను అడ్డుకోలేమని కుండబద్దలు కొట్టింది. ఆ మహిళకు అనుకూలంగా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టప్రకారమే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాక రూ.10 వేలను ఆమెకు ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. జీతం చెల్లించకపోవడంతో న్యాయ పోరాటం.. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన జి.పుల్లమ్మ 1986లో తాత్కాలిక ప్రాతిపదికన కడప చిల్డ్రన్ హోం సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయాగా చేరారు. 1994లో ప్రభుత్వం జీవో 212 జారీ చేసింది. దీని ప్రకారం.. 1993కు ముందు తాత్కాలిక పద్ధతిలో నియమితులైన వారందరి పోస్టులను క్రమబద్ధీకరించాలని ఆదేశాలిచ్చింది. దీంతో పుల్లమ్మ సర్వీసును కూడా 1993 నుంచి క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొంటూ 1994లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆమెను రైల్వేకోడూరు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో అటెండర్‌గా నియమించారు. అయితే 2001 జూన్ నుంచి ఆమెకు జీతం చెల్లించడం నిలిపేశారు. దీంతో పుల్లమ్మ జీతం కోసం ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ పుల్లమ్మకు జీతం చెల్లించాలంటూ 2003లో అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు జీతం చెల్లించలేదు. అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ఆమె ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించారని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. దీన్ని పుల్లమ్మ 2004లో మరోసారి ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. సర్వీసు క్రమబద్దీకరణ విషయంలో ఆమె పెట్టుకున్న దరఖాస్తుపై తగిన నిర్ణయం వెలువరించాలని 2006లో అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆమె సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని పక్కన పెట్టి, జీతాన్ని రూ.3,850గా సవరించి.. 2005 నుంచి బకాయిలు చెల్లిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. అయితే అధికారులు తన ఉద్యోగం క్రమబద్దీకరణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పులమ్మ 2006లోనే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్ వేశారు. దీంతో అధికారులు ఆమె జీతాన్ని 2003 నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే తాను 1993లో నియమితులయ్యానని, అప్పటి నుంచి సవరించిన జీతాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పుల్లమ్మ 2007లో మరోసారి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆమె సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ ఆదేశాలిచ్చింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేయడంతో దిగొచ్చిన అధికారులు ఆమె సర్వీసును క్రమబద్ధీకరిస్తూ 2009లో జీవో జారీ చేశారు. దీంతో ఆమె 2010లో సేవిక పోస్టులో నియమితులయ్యారు. అయితే ఆమెకు చెల్లించాల్సిన ఇతర ప్రయోజనాల విషయంలో అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె 1994 నుంచి తనకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ చెల్లించేలా అధికారులను ఆదేశించాలంటూ 2010లో ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ 1993 నుంచే పుల్లమ్మ సర్వీసును క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. తమ ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను సవరించాలని అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అధికారులు హైకోర్టులో 2013లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విన్న ధర్మాసనం అధికారులు పుల్లమ్మ సర్వీసు క్రమబద్ధీకరణ, జీతం చెల్లింపులో ఆమెను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదంటూ అధికారుల పిటిషన్‌ను కొట్టేసింది. చదవండి: నట్టేట ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? -
పక్కింటి ఒంటరి మహిళ నగలపై కన్నేశాడు.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మద్యం వ్యసనం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దొంగను చేసింది. డబ్బు కోసం పక్కింటి ఒంటరి మహిళ నగలపై కన్నేశాడు. అదను చూసి నగలు చోరీ చేశాడు. అనుమానం రాకుండా అత్యంత జాగ్రత్తపడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పది రోజుల్లోపే కేసు ఛేదించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగే దొంగ అని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. తాగుడుకు అవసరమైన డబ్బు కోసమే ఈ చోరీ చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో రమాదేవి అనే ఒంటరి మహిళ నివాసం ఉంటోంది. ఆమె అద్దెకుంటున్న చిన్నపాటి భవనంలోనే నాలుగు పోర్షన్లు ఉన్నాయి. రమాదేవి ఇంటి పక్కనే మరో కుటుంబం నివాసం ఉంటోంది. వారి ఇంటికి ఇటుకలపల్లికి చెందిన సందీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చి వెళుతుండేవాడు. వర్క్ ఫ్రం హోం కావడంతో ఎక్కువ శాతం అతనూ ఇక్కడే గడిపేవాడు. ఇందులో భాగంగానే రమాదేవి దగ్గర బంగారు నగలు ఉన్న విషయాన్ని సందీప్ గమనించాడు. ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. వేసవి కావడంతో అన్ని కుటుంబాల వారూ రాత్రిపూట మేడపై పడుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని చోరీకి పథక రచన చేశాడు. ఈ నెల 14న రాత్రి అక్కడే బస చేశారు. అర్ధరాత్రి వేళ రమాదేవి తల దిండుకింద ఉంచిన తాళం చెవి తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బీరువా తెరచి 25 తులాల బంగారు ఆభరణాల్లో 7 తులాల నగలను అపహరించాడు. తిరిగి తాళం చెవిని రమాదేవి దిండు కింద పెట్టి.. అక్కడి నుంచి జారుకున్నాడు. 15న ఉదయం ఇంట్లోకి వెళ్లిన రమాదేవి.. అప్పటికే తెరిచి ఉన్న బీరువాని గమనించింది. బంగారు నగలను పరిశీలిస్తే కొన్ని కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. బుకాయించినా.. బుక్కయ్యాడు.. పోలీసులు మొదట చోరీ జరగలేదని భావించారు. అయితే రమాదేవి పక్కాగా చెబుతుండటంతో నేరస్థలాన్ని పరిశీలించిన పోలీసులు తగిన ఆధారాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఆ ఇంటి చుట్టుపక్కల నివాసముంటున్న వారి వేలి ముద్రలను తీసుకున్నారు. అయితే వీరి వేలిముద్రలు సరిపోలలేదు. చివరగా సందీప్ ఒక్కడే మిగిలిపోయాడు. పోలీసులు పిలిస్తే తనకు ఇటుకలపల్లి పోలీసుస్టేషన్లో కోట్ల రూపాయల స్థలానికి చెందిన పంచాయితీ నడుస్తోందని, తానిప్పుడు రాలేనని బుకాయిస్తూ వచ్చాడు. రెండు రోజులు ఎదురు చూసిన పోలీసులు ఎట్టకేలకు సందీప్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. అయినా అతని నుంచి సరైన వివరాలు రాలేదు. చివరగా వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో చేసేదిలేక సందీప్ నగలు చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. కాజేసిన బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును తాగుడు కోసం ఖర్చు చేసినట్లు చెప్పాడు. నిందితుడు సందీప్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
అక్రమార్జనలో ‘రాజు’
సాక్షి, అమరావతి/చిత్తూరు (కార్పొరేషన్)/విశాఖ దక్షిణం/శ్రీకాకుళం క్రైమ్/పార్వతీపురం టౌన్: అవినీతి నిరోధక శాఖ వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో సోమవారం ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు, మరో దేవదాయ శాఖ ఉద్యోగి పట్టుబడ్డారు. ఇందులో ఆదాయానికి మించి ఆస్తుల్ని కలిగి ఉన్న ఇద్దరితోపాటు లంచం తీసుకుంటుండగా ఒకరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు ఏసీబీ డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రుద్రరాజు రవిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందులో ఆదాయానికి మించి భారీగా ఆస్తులను గుర్తించారు. రూ.39.40 లక్షల నగదు, 3.87 కిలోల వెండి, బంగారం, వజ్రాలతోపాటు భవనాలు, ఖరీదైన కార్లు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు భార్య, కుమార్తె, మరో వ్యక్తి పేరుపై లాకర్లు ఉన్నాయని, ఇంకా సోదాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పార్వతీపురం ఏఈఈ తక్కువ తినలేదు పార్వతీపురం సబ్ డివిజన్ పంచాయతీరాజ్ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరమాచినేని సుధాకర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, విజయవా డలో రెండు ఫ్లాట్లు, విజయనగరం, విజయవాడలో మూడు ఖాళీ స్థలాలు, కృష్ణా జిల్లాలో ఆరుచోట్ల 8.06 ఎకరాల వ్యవసాయ భూమి, 719.33 గ్రాముల బంగారు నగలు, 2.39 కేజీల వెండి వస్తువులు, రూ.78,392 నగదు, బ్యాంకుల్లో రూ.20,30,552 డిపాజిట్లతో పాటు అత్తగారింట్లో నాలుగు లాకర్ల తాళాలను గుర్తించారు. పట్టుబడిన లంచగొండి గుంటూరులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ (సీనియర్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న మీనా వెంకటేశ్వరరావు న్యాయస్థానంలో ఉన్న ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేసి రూ.5 వేలు తీసుకున్నారు. మరో రూ.5 వేలు ఇస్తేనే కౌంటర్ దాఖలు చేస్తానని బాధితుడిని ఇబ్బంది పెట్టడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం మీనా వెంకటేశ్వరరావు బాధితుడి నుంచి మరో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టు డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు. (చదవండి: దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు) -
‘నాకు జీతం పెంచడం లేదు సార్’, కోర్టుకెక్కిన ఉద్యోగి..కంగుతిన్న ఐబీఎం!
ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ ఐబీఎంకు భారీ షాకిచ్చాడో ఓ ఉద్యోగి. పనిచేయకుండా 15 ఏళ్ల నుంచి నెల నెలా ఠంచన్‌గా జీతం తీసుకుంటున్నాడు. పైగా సంస్థ తనకు జీతం పెంచడం లేదని, కంపెనీ తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతుందని కోర్టు మెట్లెక్కాడు. మరి చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో ఐబీఎంపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాడు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పొందానికి వచ్చింది. సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు ఐబీఎం వేతనం అందిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు. ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. ‘సంస్థ వైద్యం చేయిస్తుంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. కాకపోతే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో ఇయాన్కు సంస్థ ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తీర్పిచ్చారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
రూ. 9 కోట్ల సంపాదనకు సగటు భారతీయుడికి ఎన్నేళ్లు పడుతుందంటే..
ఒక మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్‌లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ.. రూ. 9.09 కోట్లు.. ఈ లెక్కన భారతీయులకు 158 ఏళ్లు పడుతుందట! 30 ఏళ్లు సర్వీసు వేసుకున్నా.. ఐదు జీవితకాలాలు అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. అక్కడైతే.. ఏకంగా 664 ఏళ్లు పడుతుందట. ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందు కోసం కేవలం 15 ఏళ్లే పడుతోంది. మన దేశవాసుల సగటు జీతం రూ.48 వేలు కాగా.. స్విట్జర్లాండ్‌లో అది రూ.5 లక్షలు. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్–5.. లీస్ట్ 5 జాబితాన్ని చూసేద్దామా.. చదవండి: 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..! -
జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్ విప్రో తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు దీనిపై అయితే, ప్రొడక్ట్‌లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ఆఫర్‌కే అంగీకారం తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్‌కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్‌లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్ దలాల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్‌ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్‌లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం ఉద్యోగులకు మేం ఆప్షన్లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్ వేతనాల తగ్గింపు ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్‌కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్‌పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్‌తో ఆన్‌బోర్డ్‌లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల అవసరాల్ని గమనిస్తున్నాం మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ పేర్కొంది. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 100మందిని తొలగించనుంది. అమెజాన్ తన వ్యాపారాలను క్రమ బద్ధీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో విభాగంలో ఈ ఉద్యోగాలను తొలగిస్తోంది. డివిజన్లోని 7వేల మంది ఉద్యోగులలో 1 శాతం మందిపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఆర్థిక సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ తాజా నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ సర్వీసెస్ డివిజన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) విభాగంలో అమెజాన్ తొలగింపుల తాజా రౌండ్ తొలగింపులు షురూ అయ్యాయి. అమెరికా, కోస్టారికా కెనడాలోని ఉద్యోగులకు వారి ఉద్యోగ తొలగింపులకు సంబంధించి సమాచారం అందించింది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) జాబ్-సెర్చ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్లో ప్రభావిత ఉద్యోగి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.అమెజాన్లోవెబ్ సర్వీసెస్‌లో 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కేవలం ఒక్క రోజు ముందు అకస్మాత్తుగా తనకు కంపెనీ ఉద్వాసన పలికిందని ఆమె వాపోయారు. ఈ మేరకు కంపెనీకి ఒక వీడ్కోలు సందేశాన్ని పోస్ట్ చేశారు. సామూహిక తొలగింపుల మధ్య ఇదొక నంబరు గేమ్..ఇపుడు నా టైం వచ్చిందంతే..నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇన్ని రోజులు కంపెనీలో ఎదుగుదలకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్క్షతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలోని వంక మలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణంలోని యాధవ వీధికి చెందిన సుబ్బమ్మ, వెంకటశివ దంపతుల కుమారుడు ఆదిశేషు (28) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఆదివారం తన స్నేహితులు రవితేజ, మంజులతో కలిసి శ్రీశైలానికి కారులో బయలుదేరాడు. కారు గరుడంపల్లి వంక మలుపు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదిశేషు అక్కడికక్కడే మృతి చెందగా రవితేజ, మంజులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆదిశేషు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్‌ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఉద్యోగికి 365 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తే.. వావ్.. అది కదా బంపర్ఆఫర్ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్ లభించింది. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం షెన్జెన్ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో జోడించింది. అంటే పార్టీలో వెయిటర్‌గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్‌ప్రైజ్ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు. అతడు దీనికి సంబంధించిన చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) 男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO — The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023 మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రాజకీయ నేతలతో సెల్ఫీలు.. ఉద్యోగికి కలెక్టర్ షాకింగ్ ట్విస్ట్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎన్నికల విధుల్లో ఉండగా వీఐపీల వద్ద సెల్ఫీ తీసుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడింది. వివరాలు.. నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రిల్ మాస్టర్ అయిన అంజన్‌కుమార్‌ను సోలూరు వద్ద చెక్ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్‌గా నియమించారు. మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ ఆర్.లత అతన్ని సస్పెండ్ చేశారు. చదవండి: బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి.. -
చిక్కుల్లో సివిల్ సర్వెంట్.. ఆఫీస్‌లో స్మోక్ చేసినందుకు రూ.8 లక్షల ఫైన్!
మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారా? స్మోకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటోంది జపాన్ దేశం. ఆఫీస్ ఆవర్స్‌లో వర్క్ పక్కన పెట్టి స్మోక్ చేసేవారికి కఠిన శిక్షలు విధిస్తోంది. 14 ఏళ్ల సర్వీసులో 4,500 కంటే ఎక్కువ సార్లు ధూమపానం చేసినందుకు జపాన్ సివిల్ సర్వెంట్ ఇబ్బందుల్లో పడ్డాడు. పనివేళల్లో సిగరెట్లు కాల్చినందుకు అతడికి 11వేల డాలర్లు ( రూ. 894915) ఫైన్ విధించింది అక్కడి స్థానిక ప్రభుత్వం. ఒసాకాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన చట్టాలు ఉన్నాయి. 2008లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించింది. 2019లో ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో ధూమపానం చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..ఒసాకా నగరంలో 61 ఏళ్ల సివిల్ సర్వెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు సహోద్యోగులు పదేపదే ధూమపానం చేసినట్లు తేలింది. దీంతో వారి ఆరు నెలల పాటు జీతంలో 10 శాతం కోత విధించారు. 2022 సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురూ రహస్యంగా సిగరెట్లు దాచిపెడుతున్నారంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు మళ్లీ ధూమపానం చేస్తూ పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ముగ్గురికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, ముగ్గురు మళ్లీ ధూమపానం చేయడం ప్రారంభించారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులు జరిపిన విచారణలో స్మోకింగ్ గురించి అబద్ధం చెప్పారు. స్థానిక పబ్లిక్ సర్వీస్ చట్టం ప్రకారం 61 ఏళ్ల సివిల్ సర్వెంట్ విధులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వేతన తగ్గింపుతో పాటు, అతని జీతంలో 1.44 మిలియన్ యెన్లను తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యక్తి డ్యూటీలో 355 గంటల 19 నిమిషాల పాటు పొగ తాగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. -
‘మీకు నచ్చకపోతే, నా తల తీసుకెళ్లండి’.. ఉద్యోగులపై మండిపడ్డ సీఎం!
డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేని కారణంగా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగుల డీఏ పెంపు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మమతా మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. చాలకపోతే.. నా తల నరకి తీసుకెళ్లండి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇకపై డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా ఎంత కావాలి? ప్రభుత్వం ప్రకటించిన డీఏ పట్ల మీరు సంతోషంగా లేకుంటే నా తల నరికి తీసుకెళ్లండి ”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ విధానం వేరువేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? ’అని మండిపడ్డారు. ఫిబ్రవరి 15న, అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి.. ఉపాధ్యాయులతో సహా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు, ప్రాథమిక వేతనంలో 3% డియర్నెస్ అలవెన్స్‌గా ప్రభుత్వం ఇస్తోంది. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు సవరించిన డియర్నెస్ అలవెన్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న డియర్నెస్ అలవెన్స్‌తో (డీఏ) పోలిస్తే పెంపుదల చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వ భావించారు. అందుకే పెంపుపై అసంతృప్తితో నిరసనలు చేపట్టారు. చదవండి: తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే.. -
EPFO: పెన్షనర్లు ఆగ్రహం.. నాలుగు నెలలని వారంలోనే ముగింపా?
సిరిపురం మాధవరావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసి.. 2013 మేలో పదవీ విరమణ పొందారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈపీఎఫ్ఓ అధికారులు దానిని తిరస్కరించడంతో సాధారణ పెన్షన్ పొందుతున్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరిగి అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, కొన్నిసార్లు ఓపెన్ అయినా వివరాలు నమోదు చేసేటప్పుడు స్తంభించిపోవడం ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతలో గడువు ముగిసింది. దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్ల విషయంలో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)’తీరుపై పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్ నమోదులో గందరగోళం, త్వరగా గడువును ముగించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ పొందినవారు దరఖాస్తు చేసుకోలేక నష్టపోయామని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ తాత్సారం, సర్వర్ సమస్యతోపాటు నమోదు విషయంలో అవగాహన లోపంతో జాయింట్ ఆప్షన్ ఇవ్వలేకపోయామని అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాము చేసేదేమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఈపీఎఫ్ఓ చందాదారులు, పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్ అమలుపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 4న తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 3వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన ఈపీఎఫ్ఓ.. చాలా తాత్సారం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20న దీనిపై ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అంతేకాదు దరఖాస్తులు, జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన లింకును మరో ఐదురోజులు ఆలస్యంగా 25వ తేదీన అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3వ తేదీతో గడువు ముగియనుండగా.. కేవలం వారం రోజుల ముందు మాత్రమే లింకును అందుబాటులోకి తేవడం గమనార్హం. అయితే 2014 సెప్టంబర్ 1 తర్వాత పదవీవిరమణ పొందినవారు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ మరో రెండునెలల పాటు అవకాశం కల్పించింది. వారు మే 3 నాటికల్లా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీనితో వారిలో చాలా మంది అధిక పెన్షన్‌కు దూరమయ్యారు. దేశవ్యాప్తంగా 91,258 దరఖాస్తులే.. 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైనవారిలో దేశవ్యాప్తంగా కేవలం 91,258 మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ ఇవ్వగలిగారు. పేరుకు నాలుగు నెలలు అవకాశం ఇచ్చినా.. సర్క్యులర్ జారీ, ఆన్లైన్ లింకు అందుబాటులోకి తేవడంలో ఈపీఎఫ్ఓ జాప్యం చేసిందని సీనియర్ పెన్షనర్లు మండిపడుతున్నారు. తమకు మరో అవకాశం కల్పించాలంటూ ఈపీఎఫ్ఓకు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!? -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
ఉద్యోగాల కోతలు.. మార్క్ జూకర్బర్గ్ కు సెక్యూరిటీ పెంపు
-
రాయలచెరువు పీహెచ్ సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకుంటుండగా సెల్ ఫోన్ తో చిత్రీకరణ
-
పెళ్లికి పది రోజులు ఉండగా.. ఉన్నటుండి వరుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ.. తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాల్గో కుమారుడు హరీష్‌బాబు (33) ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్‌బాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది
ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థ గూగుల్ కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సంస్థ చేపట్టిన తొలగింపు చర్యలకు ఎంతో మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా సంస్థలో ఉద్యోగం కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలోనే హెచ్ఆర్ ఉద్యోగి ఓ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అందులో ఏముందంటే! యూ ఆర్ ఫైర్డ్... డాన్ లనిగన్ ర్యాన్ గూగుల్ లో హెచ్ఆర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డాన్ కాల్ అకస్మాత్తుగా డిస్కనెక్ట్ అయ్యింది.అలా ఎందుకు జరిగిందో కనక్కునేందుకు తన సిస్టమ్ నుంచి ఆఫీస్‌కు కాంటాక్ట్ అయ్యిందుకు ప్రయత్నించాడు. చివరికి సిస్టమ్ కూడా లాక్ అయ్యింది. ఇంతలో తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్న మెసేజ్ వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. ‘ గత శుక్రవారం వేల మందితో సిబ్బందిని గూగుల్ (Google) తొలగించింది. అందులో నేను కూడా ఉన్నానంటే నమ్మలేకున్నాను. గూగుల్‌లో తన ప్రయాణం ఇంత ఆకస్మిక ముగుస్తుందని ఊహించలేదని ర్యాన్ తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. గత వారం 12,000 సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలో ఈ కోతలు గురించి ఊహాగానాలు నెలల తరబడి చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఈ స్థాయిలో లేఆఫ్స్ ఊహించలేదుని ఉద్యోగులు అంటున్నారు. చదవండి: 70కి పైగా స్టార్టప్‌లలో వేలాది మంది తొలగింపు.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం -
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
ఆ ఉద్యోగులకు శుభవార్త, ఈపీఎఫ్‌వో కొత్త గైడ్‌లైన్స్ విడుదల.. అవేంటో తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులు సైతం పీఎఫ్‌కు అర్హులేనని కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని పారాగ్రాఫ్ 11(3) 1995 స్కీమ్ కింద సంస్థలు 8 వారాల్లో అమలు చేయాలని సూచించింది. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ విడుదల ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో 1995 స్కీమ్‌లోని పేరా 11(3) ప్రకారం సెప్టెంబర్ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే సెప్టెంబర్ 1,2014కి ముందు రిటైరైన ఉద్యోగులు, రిటైర్మెంట్కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్ కోసం ఆప్షన్ తీసుకొని ఉండంతో పాటు ఇతర కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాలని విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. పీఎఫ్ పరిమితిని సుప్రీం ఎందుకు పెంచింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (epfo) 2014లో ఓ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం..ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును వెలువరించింది. ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సమర్థించింది. అయితే, పీఎఫ్‌లో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. చదవండి👉 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! -
ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం, చెంచుపల్లి గ్రామానికి చెందిన మేకల లిఖిత్ నవనీత్ (24) పోచారం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్నేహితుడు మచ్చ నవీన్‌తో కలిసి దిల్‌శుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వారిరువురు బైక్‌పై హాస్టల్ నుంచి పోచారానికి వెళుతుండగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడ్డారు. బస్సు వెనక చక్రాలు లిఖిత్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లిఖిత్ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్ చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరు మేకల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను నమ్మించి.. ఫోన్లో ట్విస్ట్ ఇచ్చిన బంధువు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేసిన వ్యక్తిపై గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... న్యూ గిరిపురానికి చెందిన గుడిసె వెంకటేశ్వరరావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు అన్నయ్య అయిన మిద్దె వెంకటేష్ గవర్నర్ పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. తాను కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నానని, ఆ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొంత పెట్టుబడి కావాలని వెంకటేశ్వరరావును అడిగాడు. అందుకు అంగీకరించిన వెంకటేశ్వరరావు 2021 నుంచి పలు దఫాలుగా రూ.35లక్షలు వెంకటేష్‌కు ఇచ్చాడు. వెంకటేష్ స్కై సీ కంప్యూటర్స్ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం వెంకటేశ్వరరావు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది? అని మిద్దె వెంకటేష్‌ను అడగగా ఇంకా వ్యాపారం ప్రారంభించలేదని సమాధానం ఇచ్చాడు. అతను గట్గిగా నిలదీయగా కొత్త కంప్యూటర్ సంస్థకు బిజినెస్ క్రెడిట్ ఇవ్వరని, అందుకే తాను బిజినెస్ స్టార్ట్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. తర్వాత వెంకటేష్ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న షాపులో వాటా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. గత నెల 27న నగరానికి వచ్చిన వెంకటేశ్వరరావు షాపునకు వెళ్లి చూడగా, అందులో రూ.35 లక్షల స్టాకు లేదని గమనించాడు. వెంకటేష్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్‌ను గట్టిగా నిలదీయగా, వెంకటేష్ అతనిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానని బెదిరించడమే కాకుండా వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ -
ప్రైవేట్ బీమానా? కార్పస్ ఫండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకంలో భారీ సంస్కరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరుపై అసంతృప్తి నేపథ్యంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ప్రస్తుత నగదు రహిత ఆరోగ్య పథకం స్థానంలో రెండు ప్రత్యామ్నాయ పథకాలపై దృష్టిసారించింది. ఒకటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థకు అప్పగించి.. వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించడం. ఇందులో ఎవరికైనా జబ్బు చేస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత వైద్య సేవలు పొందేలా చూడాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు ఏడాదికి రూ.20 వేలు ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాలని యోచిస్తోంది. రెండో ప్రత్యామ్నాయమేంటంటే... ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం. ఉద్యోగులు, ప్రభుత్వం కలిపి ఏడాదికి రూ.700 కోట్లు కార్పస్ ఫండ్ తయారు చేసి, ఉద్యోగ కుటుంబ సభ్యులు వైద్యం పొందిన వెంటనే సంబంధిత ఆసుపత్రులకు సొమ్ము అందించేలా చూడటం. ఆరోగ్యశ్రీకి రీయింబర్స్మెంట్..! ప్రస్తుతం రీయింబర్స్మెంట్ పథకం కూడా ఉన్నా.. డబ్బులు చెల్లించి వైద్య సేవలు తీసుకున్న ఉద్యోగులు రీయింబర్స్మెంట్ పొందడం గగనంగా మారింది. వైద్య విద్యాసంచాలకుల పరిధిలో ఉన్న ఆ వ్యవస్థను ఆరోగ్యశ్రీకి అప్పగించడం ద్వారా సులభతరం చేయాలని కూడా సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా పథకాలను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ వైద్య పథకంపై చర్చించనున్నారు. ఇక ఎన్ఏబీహెచ్ ఆసుపత్రుల్లోనే... నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవే టు ఆసుపత్రులు తమను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లాందుతున్నారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ నెట్వర్క్, 236 ప్రైవేటు నెట్వర్క్, 67 డెంటల్ ఆసుపత్రులున్నాయి. వీటిలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా దాదాపు 900 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. సాధారణ వైద్య సేవలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగదు రహిత వైద్యం ఉండి కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని, మరోవైపు రీయింబర్స్‌మెంట్‌లో కోత కోస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆరోగ్య పథకంలో సంస్కరణలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా తెచ్చే పథకాన్ని కొన్ని ఆసుపత్రులకే పరిమితం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్)లోనే అమలు చేయాలని యోచిస్తోంది. అంటే కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుతాయన్నమాట. నాలుగు స్థాయిల్లో వాటా! ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్ వారీగా సొమ్ము వసూలు చేస్తారు. అలాగే రాష్ట్రంలోనూ వేతనాలను బట్టి లెవెల్స్ నిర్ధారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వాటాను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించి కార్పస్ ఫండ్ తయారుచేస్తారు. తక్కువ వేతనదారుల నుంచి రూ.250, భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.500–600 వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని ఉద్యోగులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలా చేస్తే ఏడాదికి రూ. 350 కోట్లు వసూలవుతుంది. దానికి ప్రభుత్వం రూ. 350 కోట్లు ఇస్తే, మొత్తం రూ.700 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించే రెండు ప్రత్యామ్నాయాల్లో దేనికైనా తాము సిద్ధమేనని అంటున్నారు. -
నవ్వలేదని ఉద్యోగిపై వేటు... కోర్టు ఏమందంటే?
-
ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని అయితే దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే. అలాగే రిమోట్ పనివిధానాన్ని రద్దు చేసిన మస్క్ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. ట్విటర్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్..
-
భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం!
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక మాంద్యం ముప్పు ఉన్న నేపథ్యంలో ఇటీవల దిగ్గజ సంస్థలు సైతం భారీగా లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తమ సిబ్బంది సంఖ్యను భారీగానే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపుల ప్రభావం ఇతర దేశాల కంటే భారత్‌లో ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు బిజినెస్ పత్రికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అమెజాన్ ప్రభావం భారత్‌పై పడనుంది! భారత్‌లో ఈ టెక్ దిగ్గజం ఇ-కామర్స్, వెబ్ సేవలు, వీడియో స్ట్రీమింగ్‌తో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఎకానమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ (Facebook)తో పాటు పలు దిగ్గజ సంస్ధలు సైతం తమ సిబ్బందిని భారీగానే తగ్గించుకుంటున్నాయి. అయితే ఇతర సంస్థలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండవచ్చుని పేర్కొంది. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలతో సహా, అమెజాన్ సంస్థకు భారతదేశంలో 1.1 మిలియన్లకు( 11 లక్షల సిబ్బంది) పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుత లేఆఫ్‌ల కారణంగా వారిపై ఈ ప్రభావం పడనుందని వెల్లడించింది. ఈ తొలగింపులు ఇంజినీరింగ్‌తో సహా అనేక రంగాలలో జరిగినట్లు తెలుస్తోంది. భారత్‌లో కంపెనీకి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోని కో-వర్కింగ్ స్పేస్‌ల నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెటా గత వారం 11,000 ఉద్యోగాలను తగ్గించినట్లు ప్రకటించింది. ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ తమ సిబ్బందిని సగానికి తగ్గించింది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
మంటల్లో బ్యాంకు అధికారి...మొబైల్ ఫోన్ పేలడమా? ఆత్మహత్య?
యశవంతపుర: కర్ణాటక బ్యాంక్ లీగల్ అఫీసర్ ఒకరు ఇంటిలో కాలిపోయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఉడుపిలో జరిగింది. రాజ్‌గోపాల్ సామగ (42) హైదరాబాద్‌లోని కర్ణాటక బ్యాంక్‌లో లీగల్ అధికారిగా పనిచేస్తూ నెల కిందటే మంగళూరుకు బదిలీ అయ్యారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కొడుకు ఉన్నారు. ఉడుపి కృష్ణమఠ సమీపంలోని వాదిరాజ రోడ్డులో ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంటిలో నుంచి మంటలు, పొగలు రావడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి పరిశీలించగా పడక గదిలో శరీరం సగభాగం కాలిపోయి చనిపోయి ఉన్నాడు. లోపల నుంచి తాళం వేసుకొన్నట్లు గుర్తించారు. మొబైల్‌ఫోన్ పేలడమా, లేక ఆత్మహత్య చేసుకొన్నారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. (చదవండి: ప్రేమించాలంటూ వెంటపడి మరీ కత్తితో...) -
మస్క్‌తో తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత కొత్తబాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వరుసగా ఉద్యోగులను తొలగించడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సీఈవో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్ తాజాగా ఒక ఉద్యోగిపై పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆండ్రాయిడ్ యాప్‌పై వాదన నేపథ్యంలోఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్ ఎరిక్ ఫ్రోన్హోఫెర్ అనే ఉద్యోగిపై వేటు వేశారు ఎలాన్ మస్క్. ట్విటర్లో ఆండ్రాయిడ్‌లో ట్విటర్ ఎందుకు స్లో అయింది, దాని పరిష్కరించడానికి మీరు ఏమి చేసారు? అనే దానిపై మొదలైన వాదన వరుస ట్వీట్లలో మరింత వేడి పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహానిక గురైన మస్క్ హి ఈజ్ఫైర్డ్ అంటూ ట్వీట్ చేశారు. సిస్టమ్ లాక్ అయిన పిక్‌ను షేర్ చేసిన, ఎరిక్ తన తొలగింపును ధృవీకరించారు. దీంతో తనను బహిరంగంగా విమర్శించే కంపెనీ ఇంజనీర్లను తొలగించే పనిలో ఉన్న మస్క్ తన కోపాన్ని ప్రదర్శించారంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాస్‌తో ప్రయివేటుగా మాట్లాడి ఉండి ఉండాల్సింది.. ఇలా పబ్లిక్‌గా బాస్‌తో వాదించడం తగదు అంటూ 20 ఏళ్ల అనుభవం ఉన్న మరో యాప్ డెవలవర్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ట్విటర్లో దాదాపు పదేళ్లపాటు సేవలందించిన మరో ఇంజనీర్ బెన్ లీబ్ని కూడా మస్క్ ఇదే విధంగా తొలగించారు. 🫡 https://t.co/YpaQysrIv0 — Eric Frohnhoefer @ 🏡 (@EricFrohnhoefer) November 14, 2022 Unbelievable exchange. Can I write this up as a teaching case for my management classroom? pic.twitter.com/lYteE7d4N8 — Sandy Piderit (@SandyPideritPhD) November 14, 2022 కాగా చాలా దేశాల్లో ట్విటర్ నెట్ వర్క్స్‌లో కావడంపై మస్క్ యూజర్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్ స్లో అయినందుకు, ముఖ్యంగా కొన్ని దేశాలలో వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ట్విటర్ కొనుగోలు తరువాత సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత ఇటీవల మొత్తం 5,500 కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 4,400 మందిని ఎలాంటి ముదస్తు నోటీసు లేకుండానే నిలిపివేశారు. How to be the ultimate professional and still utterly destroy someone, a masterclass by @EricFrohnhoefer pic.twitter.com/mgUHJ0xLbH — Dan Kim (@dankim) November 14, 2022 -
అపుడు వేటు..ఇపుడు స్పెషల్ గిఫ్ట్: ట్విటర్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలుచేసిన తరువాత టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పలు కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా, పలువురి కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు. అంతేకాదు నిర్దాక్షిణ్యంగా అనేకమంది సీనియర్ ఉద్యోగులతో పాటు, దాదాపు 50 శాతం మందిని తొలగించారు. అయితే ఆశ్చర్యకరమైన ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మాజీ మహిళా ఉద్యోగి పోస్ట్ ఒకటి వైరల్ గామారింది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?) తొలగించిన ఉద్యోగుల్లో ఒకరైన ట్విటర్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఎలైన్ ఫిలాడెల్ఫో ట్విటర్ నుంచి పదేళ్ల వార్షికోత్సవ అభినందలు, బహుమతిని తాజాగా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. "ఈరోజు స్పెషల్ డెలివరీ వచ్చింది!!" పదేళ్ల వార్షికోత్సవ అభినందన సందేశంతో ట్విటర్ పార్శిల్ వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్విటర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులు తమ భావోద్వేగాలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు.ఎలైన్ కూడా వరుస ట్విట్లలో తనను తొలగించడంపై బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎరా ముగిసింది. పదేళ్ల సేవల తరువాత దుర్మార్గంగా తొలగించారంటూ ఆవేదన వెలిబుచ్చారు. అలాగే తన తోటి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఇదీ చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు కాగా ట్విటర్ పగ్గాలు చేపట్టిన తర్వాత, మస్క్ గత వారం ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగించారు. ఈ చర్య చట్టాల ఉల్లంఘన, అమానవీయమంటూ ప్రపంచవ్యాప్తంగా మస్క్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. got a special delivery today!! pic.twitter.com/Xzc3cmEEfJ — Elaine Filadelfo (@ElaineF) November 7, 2022 End of an era. This is a brutal way to go after 10 years, but Twitter isn’t defined by last night. It’s defined by the culture *we* made, the lifelong friendships, how we supported each other, the damn good work we did along the way. You’re my people forever #LoveWhereYouWorked — Elaine Filadelfo (@ElaineF) November 4, 2022 -
వర్క్ ఫ్రమ్ హోమ్: కంపెనీ వింత రూల్స్.. ఈ ఉద్యోగి లక్ బాగుంది!
కరోనా మహ్మమారి కారణంగా ఉద్యోగులు ఆఫీసులు విడిచి వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) అంటూ వారి ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ ట్రెండ్‌నే అనుసరిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగుంది గానీ ఈ క్రమంలో కొన్ని కంపెనీలు వింత రూల్స్‌ని తమ ఉద్యోగులపై రుద్దుతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన కారణంతో తన ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో పరిహారం కూడా దక్కింది. ఫ్లోరిడాకు చెందిన టెలిమార్కెటింగ్ కంపెనీ అయిన చేటు, తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలు బాటు ఇచ్చింది. అయితే ఇందులో ఓ మెలిక కూడా పెట్టింది. ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటల పాటు కెమెరాను ఆన్‌లో ఉంచాలని కోరింది. దీంతో పాటు వారి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని కూడా షేర్ చేయాలని తెలిపింది. ఓ ఉద్యోగి మాత్రం వెబ్‌క్యామ్ ద్వారా తనపై ఎప్పటికప్పుడు కంపెనీ నిఘా ఉంచడం, అంతేకాకుండా తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను షేర్ చేయమని అడగడం ద్వారా ట్రాక్ చేయడం అతనికి ఇష్టపడలేదు. ఇది తన ప్రైవసీకి ఇబ్బందిగా ఉందని భావించి ఈ రూల్స్‌ని పక్కన పెట్టాడు. దీంతో నిబంధనలను పాటించని కారణంతో అతడిని కంపెనీ తొలగించింది. ఈ అంశంపై ఆ ఉద్యగి కోర్టుకు వెళ్లగా.. కంపెనీ ఆదేశాలు సక్రమంగా లేవని, ఉద్యోగిని విధుల నుంచి తొలగించడానికి సరైన కారణాలు లేవని నెదర్లాండ్స్ కోర్టు స్పష్టం చేసింది. తొలగించిన ఉద్యోగికి 72,700 అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 60 లక్షలు) డాలరలు చెల్లించాలని ఆదేశించింది. కాగా తమ ఉద్యోగులపై నిఘా ఉంచడానికి మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ఏకైక సంస్థ చేటు మాత్రమే కాదు. Digital.com నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించే 60 శాతం కంపెనీలు వారి ఉత్పాదకత, ఉద్యోగ కార్యకలాపాలపై పర్యవేక్షించేందుకు ఈ రకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. చదవండి: వామ్మో.. ఒక్కరోజే రూ. 3,000 కోట్ల బంగారం కొన్నారు, ఎందుకో తెలుసా! -
పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ ఇవ్వలేదని ఆక్రోశంతో పౌర కార్మికుడు పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం వేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ పౌర కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్ప పీడీఓ శివరాజ్‌ను దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ అడిగాడు. అయితే పీడీఓ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కృష్ణప్ప సోమవారం రాత్రి కార్యాలయానికి వెళ్లి చెప్పుల హారం వేసాడు. తాలూకా పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ పౌర కార్మికులతో సమావేశమై వారికి సర్ది చెప్పారు. అనంతరం చెప్పుల హారాన్ని తొలగించారు. -
అసంఘటితం నుంచి సంఘటిత రంగానికి
ముంబై: కీలక పరిశ్రమలు కార్మికుల మళ్లింపుపై దృష్టి సారించాయి. ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు తమ పరిధిలో పనిచేసే అసంఘటిత కార్మికులను సంఘటిత రంగంలోకి మళ్లిస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. ఈ రంగాల్లోని 59 శాతం కంపెనీలు ఇదే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొంది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)లో 37 శాతం కంపెనీలు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్ఎంసీడీ)లో 36 శాతం, హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ రంగంలో 27 శాతం కంపెనీలు ఇలా చెప్పాయి. ఈ రంగాల్లో కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకురావడంపై సెంటిమెంట్ ఎలా ఉందన్న దానిపై టీమ్ లీజ్ సర్వే చేసింది. 230 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికుల నిర్వహణను పెద్ద సవాలుగా కంపెనీలు పేర్కొన్నాయి. ►అసంఘటిత కార్మికులకు సంబంధించి వేతనాలు తమకు పెద్ద సవాలు అని 45 శాతం కంపెనీలు తెలిపాయి. ►కార్మికుల నైపుణ్యాల పరంగా లోటును 21 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ► తరచూ విధులకు రాకపోవడం తాము ఎదుర్కొంటున్న సవాలు అని 15 శాతం కంపెనీలు తెలిపాయి. ► ఈ సవాళ్లను అధగమించేందుకు కంపెనీలు అసంఘటిత రంగ కార్మికులను రెగ్యులర్ కార్మికులుగా తీసుకుని పనిచేయించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నట్టు ఈ సర్వేలో తెలిసింది. ► 90 శాతానికి పైగా పనివారు అసంఘటిత రంగంలోనే పనిచేస్తుండడం సంస్థలకు ప్రతిబంధకమని టీమ్‌లీజ్ పేర్కొంది. ఈ దిశగా అడుగులు.. ‘‘65 శాతానికి పైగా కంపెనీలు అసంఘటిత రంగ కార్మికుల నిర్వహణను సవాలుగా భావిస్తున్నాయి. దీంతో 56% కంపెనీలు అసంఘటిత రంగ కార్మికులను థర్డ్ పార్టీ రోల్స్‌లోకి తీసుకుని సంఘటిత కార్మికులుగా పనిచేయించుకోవాలని అనుకుంటున్నాయి. ఇప్పటికే 64% కంపెనీలు ఈ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టాయి. 67 శాతం కంపెనీలు ఏడాదిలోగా అమలు చేయాలనే ప్రణాళికతో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. -
జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్‌లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్‌లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వీడియో: గన్ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి..
తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్ వాల్టన్ బీచ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్‌ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది. In reference to the FWB Chick-fil-A employee who ran to help a woman with a baby who was being carjacked, we want to say a sincere thank you to Ms. Kelner for providing video of a portion of the encounter. (see prior post). A major shout-out to this young man for his courage! pic.twitter.com/2Lcwe46azv — OkaloosaSheriff (@OCSOALERTS) September 14, 2022 ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేసే మైకేల్ గోర్డాన్‌గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్ హీరో ఉదంతం వెలుగు చూసింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్‌కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్‌ను అభినందించింది. సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ బిల్లులు ఉండాల్సిందే!
ఉద్యోగం చేస్తే ప్రతి నెలా జీతం వస్తుంది ఈ కాన్సెప్ట్ మనందరికి తెలసిందే. అయితే మన జేబులోకి వచ్చే జీతం మాత్రమే మనకు ముఖ్యంగా కనిపిస్తుంది, కానీ సీటీసీలో(CTC) చాలా భాగాల ఉంటాయి. మన పని బట్టి వాటికి అలవెన్స్‌లు కూడా అందుకుంటాం. అవి రవాణా భత్యం, టూర్ డ్యూటీ అలవెన్స్, మొబైల్ రీయింబర్స్మెంట్, కన్వీనియన్స్ అలవెన్స్ వంటి రకరకాలు ఉంటాయి. ఇక్కడే దాగిన ఓ విషయం ఏంటంటే.. మనం అలవెన్స్‌ల బిల్లులు లేకపోతే మనపై టాక్స్ భారం పడతుందండోయ్. బిల్లలు తప్పనిసరి.. లేదంటే కంపెనీ నుంచి ఉద్యోగులు పొందే అలవెన్స్‌లపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం ఉద్యోగులు కచ్చితంగా వారి అలవెన్స్ బిల్లులు సమర్పించాలి. ఒకవేళ బిల్లులు సమర్పించపోతే వాటిపై పన్ను కట్టాల్సి వస్తుంది. ఒక ఉద్యోగి పొందుతున్న అలవెన్సులు పన్ను పరిధిలోకి వస్తే, వారికి టీడీఎస్ (TDS) కూడా వర్తిస్తుంది. అలవెన్సులపై వర్తించే టీడీఎస్ అనేది ఉద్యోగి ఎంచుకున్న ఆదాయపు పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఉద్యోగులు బిల్లులను నిర్వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు ఉద్యోగి అతని బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ ఒకవేళ మీకు పన్నుకు సంబంధించిన నోటీసు పంపితే, ఆ సమయంలో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసినట్లు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వ్యక్తి తన ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఖర్చు చేసిన అలవెన్స్‌లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 10 (14)i ప్రకారం ఏం చెప్తోందంటే.. ‘ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం తన ఉద్యోగ బాధ్యతలరీత్యా వ్యక్తి పొందే ఏ అలవెన్స్లైనా వాటి నుంచి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే! -
మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్
జీవిత బీమాలో అగ్రస్థాయి కంపెనీ అయిన ఎల్ఐసీ.. కొత్త పెన్షన్ ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 867) విడుదల చేసింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్ ప్లాన్. రెగ్యులర్‌గా ఈ ప్లాన్‌లో పొదుపు చేసుకుంటూ.. కాల వ్యవధి తర్వాత యాన్యుటీ ప్లాన్ తీసుకుని పెన్షన్ పొందొచ్చని ఎల్ఐసీ తెలిపింది. ఒకేసారి చెల్లించే సింగిల్ ప్రీమియం ప్లాన్ లేదంటే రెగ్యులర్‌గా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కనిష్ట, గరిష్ట ప్రీమియం పరిమితుల మధ్య పాలసీదారు తనకు అనుకూలమైన మొత్తాన్ని ప్రీమియంగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం రూపంలో చేసిన చెల్లింపులను నాలుగు ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది పాలసీదారు అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలను ప్రీమియం నుంచి మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పాలసీలో 5–15 శాతం మధ్య గ్యారంటీడ్ అడిషన్ కూడా చెల్లిస్తారు. -
మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదా? అయితే ఇలా చేయండి..
మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నా.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)అకౌంట్లోకి డబ్బులు జమ కావడం లేదా? అయితే ఇప్పుడు మీరు ఖాతాలోకి డబ్బులు డిపాజిట్ కావడం లేదని ఈపీఎఫ్ఓకు ఇలా ఫిర్యాదు చేయండి. సంస్థలు ప్రతినెల ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లోకి ప్రావిడెంట్ ఫండ్‌ను జమ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. గత నెల ఉద్యోగికి చెల్లించిన జీతానికి..15 రోజులలోపు యజమాని ప్రతి నెలా బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్‌తో కలిపి 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. దీంతో ఆ డిపాజిట్లకు సంబంధించిన సమాచారం క్రమం తప్పకుండా ఎస్ఎంఎస్ల రూపంలో చందాదారులకు అందుతుంది. లేదంటే ఉద్యోగులు సైతం ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్ అయ్యి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలోకి జమ చేసిన డిపాజిట్లను కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సంస్థలు పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయవు. అప్పుడు ఉద్యోగులు తమకు రావాల్సిన పీఎఫ్ ఇంకా డిపాజిట్ కాలేదని ఎంప్లాయిఫీడ్బ్యాక్@ఈపీఎఫ్ఐఇండియా.జీవోవి.ఇన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు తర్వాత, రిటైర్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ సదరు సంస్థ యజమానిని విచారిస్తుంది. ఈ విచారణలో డిపాజిట్ చేయలేదని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు చెల్లించిన మొత్తం కాలానికి ఈపీఎఫ్ఓ అధికారులు ఉద్యోగి అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి చెల్లించేలా ఒత్తిడి తెస్తారు. -
మీ పీఎఫ్ ఖాతాకు ఈ-నామినేషన్ కంపల్సరీ.. సులభమైన అప్డేట్ కోసం 10 స్టెప్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్లో నామినీ వివరాలు అప్డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి. కనుక ఇప్పుడే ఆలస్యం కాకుండా త్వరగా మీ ఈపీఎఫ్ ఈ- నామినేషన్ చేయండి. ఈ నామినేషన్ సులభంగా చేసేయండి ఇలా... ►ఈపీఎఫ్ఓ( EPFO ) వెబ్సైట్లోకి వెళ్లి, ‘సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లండి. ►‘ఫర్ ఎంప్లాయిస్’ విభాగంలో ‘మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్’ ఆఫ్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ►మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ►లాగిన్ అయ్యాక 'మేనేజ్' ట్యాబ్ కింద, 'ఇ-నామినేషన్' ఎంచుకోండి. ►ఇప్పుడు అందులో మీ 'వివరాలను నింపి' ట్యాబ్ కింద ఉన్న 'సేవ్' క్లిక్ చేయండి. ►తర్వాత మీ కుటుంబ డిక్లరేషన్‌ను అప్డేట్ చేసేందకు మీ కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, జెండర్,రిలేషన్, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు (ఆఫ్షనల్), గార్డియన్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన వివరాలను నింపిన తర్వాత ‘ఎస్’పై క్లిక్ చేయండి. ►ఇక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను వివరాలను నింపే ఆఫ్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న 'యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్'పై క్లిక్ చేయండి. ►ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు నింపిన తర్వాత వారి నగదు వాటాను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని అందులో నింపాలి. ఆపై ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి. ►ఇప్పుడు 'ఈ-సైన్' ఆఫ్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని(otp) సబ్మిట్ చేయండి. ►అయితే ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, ఈపీఎఫ్ సభ్యలు ముందుగా యూఏఎన్( UAN )మెంబర్ పోర్టల్‌లో వారి యూఏఎన్ ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి మెంబర్ ఐడీ, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/భార్య పేరు, సంబంధం, ఉద్యోగంలో చేరిన తేదీని నిర్ధారించుకోవాలి. వీటితో పాటు ప్రతి నామినీకి కేవైసీ( KYC) వివరాలను సమర్పించడంతో పాటు వారి PF/ EDL మొత్తం వాటాను కూడా తెలిపాల్సి ఉంటుంది. చదవండి: షావోమీ భారీ షాక్, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు! -
నేను ఏ తప్పూ చేయలేదు..యాపిల్ సంస్థ నన్ను బెదిరిస్తోంది!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. వెర్జ్ కథనం ప్రకారం.. క్యాంప్‌బెల్ అనే ఉద్యోగి గత ఆరేళ్లుగా యాపిల్ సంస్థ ఐఫోన్ రిపేర్ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ తరుణంలో ఐఫోన్ సెక్యూరిటీ ఫీచర్లపై టిక్ టాక్‌లో టిప్స్ ఇచ్చింది. దీంతో టిక్‌టాక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం తనను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తోందంటూ యాపిల్ ఉద్యోగి పేర్కొంది. సెక్యూరిటీ టిప్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు అందులో తాను యాపిల్ ఉద్యోగిని అని చెబితే చర్యలు తప్పవని చెప్పిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. టిక్ టాక్ వీడియోల్లో ఎక్కడా తాను యాపిల్ ఉద్యోని అనే విషయాన్ని చర్చించలేదని, అయినా తనని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు "నేను యాపిల్ ఉద్యోగిని. నా సంస్థకు ఇచ్చే నా సందేశం ఇదే. "ప్రస్తుతం, నేను 3 రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో కారణంగా నా ఉద్యోగం ఊడిందో లేదో తెలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాంటూ వీడియోలో చెప్పడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 యాపిల్ భారీ షాక్, ఉద్యోగులపై వేటు! -
Braden Wallake: ఉద్యోగుల తొలగింపు,'క్రైయింగ్ సీఈవో' పోస్ట్ వైరల్!
నా ఉద్యోగుల్ని ప్రేమిస్తున్నాను. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలతో వారిని విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది. ఉద్యోగుల తొలగింపు కష్టమైన పనే. అయినా తప్పడం లేదంటూ ఓ సంస్థ సీఈవో సెల్ఫీ తీసి లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో తనని తాను క్రైయింగ్ సీఈవో అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక మాధ్యం, పెరిగిపోతున్న ధరలు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో పాటు ఇతర కారణాల వల్ల స్టార్టప్స్ నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఒహియో రాష్టం కొలంబస్ నగరంలో 'హైపర్ సోషల్' అనే మార్కెటింగ్ ఏజెన్సీ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. అయితే ఉద్యోగులంటే అమితంగా ఇష్టపడే ఆ సంస్థ సీఈవో Braden Wallake (బ్రాడెన్ వాల్ ఏక్) తొలగింపు అంశాన్ని జీర్ణించుకోలేకపోయారు. కంటతడి పెట్టుకున్నారు. ఏడుస్తున్న ఫోటోను సెల్ఫీ తీసి లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నందుకు బాధగా ఉందని, తనకు తానే ఒక 'క్రైయింగ్ సీఈవో' అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. గంటల వ్యవధిలో ఆ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ పోస్ట్‌కు 30,500 మంది రియాక్ట్ అయ్యారు. 6వేల మంది కామెంట్ల వర్షం కురిపించారు. 500మంది ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. కానీ పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంపై 'బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్' సైతం ఈ క్రైయింగ్ సీఈవోని ఇంటర్వ్యూ చేసింది. సింపతి కోసం సింపతి కోసమే. ఉద్యోగుల్ని తొలగించి ఎట్లా ఏడుస్తున్నారో చూడండి. అందులో వాస్తవం లేదు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ నెటిజన్లు ఖండించడంతో బ్లూమ్‌బర్గ్.. బ్రాడెన్ను సంప్రదించింది. మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్స్ సైతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మీలా ఉద్యోగుల్ని ఫైర్ చేసినందుకు ఏ సంస్థ సీఈవో మీలా ఏడుస్తూ ఇలా పోస్ట్‌లు చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని బ్లూమ్‌బర్గ్ ప్రతినిధులు (ఫోన్ ఇంటర్వ్యూలో) ఆయన్ని ప్రశ్నించగా.. నేనేదో మార్కెటింగ్ స్ట్రాటజీ, లేదంటే సానుభూతి కోసం ఏడుస్తున్న ఫోటోని పోస్ట్ చేయలేదు. ఉద్యోగం కోల్పోయిన నా సంస్థ ఉద్యోగులకు ఉపయోగపడుతుందని పోస్ట్ చేస్తున్నాను. నా పోస్ట్ వల్ల నా మాజీ ఉద్యోగుల్లో ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా నాకు సంతోషమే' అంటూ వివరణ ఇచ్చారు. -
అధ్యక్షా.. బాస్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. జీతంతో పాటు బోలెడు బెనిఫిట్స్!
న్యూయార్క్: ఉద్యోగులకు సరిపడా జీతం ఇవ్వకుండా వారితో యంత్రాలుగా పనిచేయించుకుంటున్నారు కొందరు యజమానులు. మరొకొందరైతే ఉద్యోగులను జీతం తీసుకుని బానిసలుగా చూస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. తమకు వచ్చిన జాబ్ అని కాకుండా నచ్చిన జాబ్ చేస్తామని అంటున్నారు ఉద్యోగులు. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా ఓ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకోవాలని చెబుతున్నాడు. ఉద్యోగులు చేసే పనికి కేవలం జీతం ఇస్తే సరిపోదని వారికి తగిన గౌరవం కూడా ఇవ్వాలని ఆయన అభిప్రాయం. ఈ విషయాన్నే ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అమెరికాలోని సీటెల్‌కు చెందిన సీఈఓ తన ఉద్యోగులకు ఏకంగా 80,000 డాలర్లు అంటే రూ 63.7 లక్షల కనీస వేతనం చెల్లిస్తున్నామని చెప్తున్నారు. అంతేనా తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు వారికి నచ్చిన ప్రదేశం నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించామని, మంచి జీతంతోపాటు బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటూ తెలిపాడు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు సౌకర్యాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఉద్యోగుల పనికి సరైన శాలరీ మాత్రం ఇస్తే సరిపోదని, వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉండాలంటున్నాడు. తమ కంపెనీలో ఒక్కో ఉద్యోగానికి తమకు 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని తెలిపాడు. ఉద్యోగులకు సరైన వేతనం, గౌరవం దక్కని చోట పనిచేయాలని ఏ ఒక్కరూ అనుకోరని అన్నారు. ఈ ట్విట్ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లో వైరల్ కాగా నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మీ లాంటి బాస్ ఆధ్వర్యంలో పని చేయడం ఉద్యోగుల అదృషమని యూజర్లు కామెంట్ చేశారు. My company pays an $80k min wage, lets people work wherever they want, has full benefits, paid parental leave, etc. We get over 300 applicants per job. "No one wants to work" is a hell of a way of saying "companies won't pay workers a fair wage and treat them with respect." — Dan Price (@DanPriceSeattle) August 8, 2022 చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ! -
75 ఏళ్ల స్వాతంత్య్రం.. మూడు షిఫ్ట్‌లు, రోజుకు రూ. 50 భత్యం
శివాజీనగర(బెంగళూరు): భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌ను ఆచరిస్తుండగా, విధానసౌధపై ప్రతి రోజు త్రివర్ణ పతాకం ఎగురవేసే వారి భత్యం రోజుకు రూ. 50 మాత్రమే. ఈ సందర్భంగా వారు తమ భత్యం రూ.100 పెంచాలని కోరుకుంటున్నారు. గ్రూప్ ‘డీ’ ఉద్యోగులుగా నియామకమైన ఏడుగురు కార్మికులు తమ జెండావిష్కరణ కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రతిరోజు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు. హోమ్‌గార్డులతో గాని పోలీస్ సిబ్బందితో పని చేస్తారు. విధానసౌధ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 150 అడుగుల ఎత్తు నాలుగో అంతస్తులో 30 అడుగుల ఎత్తు కలిగిన జెండా స్తంభముంది. అంటే తాము విధానసౌధ బయట నుండి చూసే జెండాలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 180 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతాయి. పాదరక్షలు లేకుండానే... విధానసౌధపై జెండావిష్కరణ పాదరక్షలు లేకుండగా చేయటం అంత సులభమైన పని కాదు. అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సూర్యోదయం సమయంలో కొంచెం పైకి ఎత్తాలి. సూర్యస్తమయం సమయంలో నిర్ధారించిన సమయంలో కిందకు దించాలి. పాదరక్షలు లేకుండగానే జెండావిష్కరణ చేయాలి. దానిని కిందకు దింపిన తరువాత దానిని మడవటానికి ఒక విధానముందని జెండా కర్తవ్యంలో ఉన్న సీనియర్ సిబ్బంది ఆంథోని మీడియాకు తెలిపారు. ఆయన 26 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాడు. ఆంథోని తరహాలోనే తోటి ఉద్యోగులు రాత్రి–పగలు షిఫ్ట్ పద్దతిలో పనిచేస్తున్నారు. వర్షం వచ్చినా కూడా వారికి సెలవు లేదు. ఉదయం 6.22కు సూర్యోదయమైతే ఏమైనా గాని ఆ సమయానికి జెండా ఆవిష్కరణ చేయాలి. ఈ ఉద్యోగులు తమ నియమించిన పనికి జీతం పొందుతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు విధానసౌధలో కార్యాలయాల తలుపులు మూయటం, తెరవటం కూడా ఉంది. రోజుకు 50 రూపాయలను ఫ్లాగ్ డ్యూటీ కోసం ఇవ్వబడుతోందని ప్రభుత్వ డీపీఏఆర్ వర్గాలు తెలిపాయి. 2013లో రోజుకు 15 రూపాయలుండేది. 2016లో రోజుకు రూ.25, అప్పటి నుండి జీతం పెంచలేదు. రోజుకు రూ.100 పెంచాలని చేసిన వారి డిమాండ్‌ను ఇప్పటి వరకు పరిష్కరించలేదని డీపీఏఆర్ అధికార వర్గాలు తెలిపాయి. వారు విధానసౌధలో ఆవిష్కరించే జెండా 8 అడుగుల ఎత్తు, 12 అడగుల వెడల్పుతో కర్ణాటకలో అతిపెద్ద జెండాల్లో ఇది ఒకటి. చదవండి: వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! -
మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఒక సంస్థ నుండి మరొక సంస్థకు ఉద్యోగం మారినపుడు, ఆ ఉద్యోగి ఐడీ నంబరు మారినట్టుగా యూఏఎన్ మారదు. అందుకే అది యూనివర్సల్ అయింది. ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంస్థలో చేరిన సమయంలో ఉద్యోగి తప్పనిసరిగా యజమానికి తమ యూఏఎన్ నంబరును అందించాలి. అపుడు ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అలాగే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్ఏ నెంబర్‌తో కేవైసీ లింక్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్‌తో మాత్రమే ఈపీఎఫ్‌వో సభ్యుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మేనేజ్మెంట్ సులువవుతుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్, లోన్ దరఖాస్తులను సమర్పించడం లాంటివి. దీనికి ఎలాంటి భౌతిక పత్రాలు అవసరం లేకుండా ఆన్లైన్లో ఉప సంహరణ అభ్యర్థనను ఈజీగా చేసుకోవచ్చు. అయిత మొదటిసారి EPFO సైన్ అప్ చేస్తున్నప్పుడు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ప్యాన్, ఆధార్‌తోపాటు, ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కార్డ్‌ను నమోదు చేయాలి. ఆన్లైన్లో యూఏఎన్ ఎలా పొందవచ్చు. • ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో మెంబర్ ఇ-సేవాకు లాగిన్ అవ్వాలి • ముఖ్యమైన లింక్ విభాగంలో అందుబాటులో ఉన్న “UANని యాక్టివేట్ చేయండి” ఆప్షన్‌పై క్లిక్ చేయండి • ఆధార్ ఆప్షన్ ఎంచుకుని, తదుపరి సూచలన మేరకు అవసరమైన వివరాలు నమోదు చేయండి • గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ పై క్లిక్ చేయండి.. ఇక్కడ మనం నమోదు చేసిన వివరాలను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది • కొనసాగించడానికి అంగీకరించు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి • మీ అభ్యర్థనను ధృవీకరించడానికి మీ మొబైల్ల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి • UANని యాక్టివేట్ చేయండిపై క్లిక్ చేయండి. • ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. -
7ఏళ్లలో తొలిసారి 20 నిమిషాలు లేటు.. ఉద్యోగం నుంచి తొలగింపు!
ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కొంత ఆలస్యంగా వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ఓ వ్యక్తి 20 నిమిషాలు లేటుగా ఆఫీసుకు రావటంతో ఉద్యోగం కోల్పోయాడు. అతను ఉద్యోగంలో చేరిన ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఆలస్యం కావటం గమనార్హం. తన సహ ఉద్యోగి ఒకరు ఈ అంశాన్ని రెడిట్‌లో షేర్ చేశారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. రెడిట్‌లోని యాంటీవర్క్ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి ఆలస్యమ్యయాడని, కేవలం 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నేను, నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం.’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. ఆ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగానే తొలగించి తక్కువ జీతాన్ని పని చేసే వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలని సంస్థ భావించిన్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
పని మధ్యలో నిద్ర.. ఏం పర్లేదు మా కంపెనీకి ఓకే!
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అప్పుడప్పుడు బల్లల మీదే తలవాల్చి కునుకుతీసే సందర్భాలు మామూలే! ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. మధ్యాహ్నంపూట కాస్త కునుకు తీస్తే, మెదడు చురుకుదేరి పనితీరు మెరుగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. అయినా, పనివేళల్లో ఉద్యోగులు కునుకుతీయడానికి తగిన ఏర్పాట్లు ఏ ఆఫీసులోనూ కనిపించవు. జపాన్‌లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్బాక్సెస్) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
పశ్చిమ గోదావరి: ఆగడాలలంక శివారు వద్ద లారీ కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడుకు చెందిన ముంగర హర్షవర్దన్ (30) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులను నిర్వహిస్తున్నాడు. శనివారం బ్యాంకు పని నిమిత్తం తన స్కూటిపై హర్షవర్దన్ పైడిచింతపాడు నుంచి ఏలూరు బయలుదేరాడు. ఆగడాలలంక శివారు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఇటుకల లోడు లారీని అధిగమించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్కూటి ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఏఎస్సై చలపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పంచానామా అనంతరం బంధువులకు అప్పగించారు. ఏఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైడిచింతపాడులో విషాదఛాయలు హర్షవర్దన్ మృతితో పైడిచింతపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ముంగర బోజరాజు, ఝాన్సీలక్షి్మల పెద్ద కుమారుడు హర్షవర్దన్‌కు మూడేళ్ల క్రితం దుర్గాశ్రీతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఎనిమిదో నెల గర్భిణి. భార్య డెలివరీ తర్వాత బెంగళూరుకు కుటుంబ సమేతంగా వెళదామని భావించాడని, ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు కబళించిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దేవుడు తనకు అన్యాయం చేశాడంటూ భార్య దుర్గాశ్రీ గుండెలవిసేలా రోదించడంతో ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి మెలిగే హర్షవర్దన్ మృతి చెందాడన్న వార్తను గ్రామస్తులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. -
ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. మారిన రూల్స్ ఇవే!
Provident Fund Tax Rules: బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నిబంధనలల్లో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు ప్రకారం.. ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి పన్ను విధించేవి, మరొకటి పన్ను మినహాయింపు ఖాతాలు అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. గడిచిన నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. అయితే ఈ నిర్ణయం మాత్రం ఈపీఎఫ్ఓ చందాదారులకు షాక్ అనే చెప్పాలి. ఈపీఎఫ్ఓ చందాదారులు ఇవి తప్పక తెలుసుకోవాలి..! ►పీఎఫ్ FY 2021-22కి గాను వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. చివరి సారిగా 1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు చేరింది. ►ఈపీఎఫ్ఓ చందాదారుల వాటా.. వార్షికంగా రూ.2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ►ఉద్యోగులు వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే.. వారిపై పన్ను భారం ఉండదు. ►ఒక యజమాని ఉద్యోగి ఈపీఎఫ్‌కి నగదు జమ చేయకపోతే (contribution threshold) కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ ₹ 5 లక్షలకు పెంచనున్నారు. ►కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ పెంచిన అనంతరం.. అదనంగా పెంచిన నగదుపై మాత్రమే పన్ను విధిస్తారు, మొత్తానికి కాదు. ►ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే నగదు, దానిపై వచ్చే వడ్డీ ఈపీఎఫ్‌లో ప్రత్యేక అకౌంట్లో నిర్వహించనున్నారు. ►యజమానులు(Accruals) అక్రూవల్స్ ఆధారంగా పన్నులను నిలిపివేస్తారు కాబట్టి, ఈ వివరాలను తప్పనిసరిగా ఫారమ్ 16, ఫారమ్ 12BAలో నింపాలి. ►నెలవారీ ఆదాయం ₹ 15,000 వరకు ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో యజమానులు తప్పనిసరిగా ఈపీఎఫ్ నగదు జమ చేయాల్సి ఉంటుంది. చదవండి: విమానయాన సంస్థలకు భారీ ఊరట -
'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్!
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్ని రోజులు హైబ్రిడ్ వర్క్‌తో తలమునకలైన ఉద్యోగులు.. ఇప్పుడు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు సంస్థలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనేది సంస్థల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా రిమోట్ వర్క్‌తో టీం లీడర్లు, బాస్‌లు ఉద్యోగులతో వర్క్ చేయించుకోవడం తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగులు ట్రెండ్‌కు తగ్గట్లు స్నేహితులతో ఎలా మెలుగతారో.. బాస్‌లతో సైతం అదే తరహాలో సంభాషిస్తున్నారు. ఆ సంభాషణలే బాసిజం చూపించే బాస్‌లకు అస్సలు నచ్చడం లేదు. హర్టవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగి శ్రేయాస్.. బాస్ సందీప్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను మీరూ చూసేయండి తాజాగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న శ్రేయాస్ అనే యువతికి ఆమె బాస్ సందీప్ ఓ వర్క్ అలాట్ చేశాడు. ఆ వర్క్ పూర్తయ్యిందా అంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్‌కు శ్రేయాస్ ఇలా రిప్లయి ఇచ్చింది. "హే.. నో,నాట్ ఎట్" అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ బాస్‌కు కోపం తెప్పించింది. దీంతో సందీప్ స్పందించాడు. హాయ్ శ్రేయాస్ నేను మీ బాస్‌ను నన్ను 'హే' అని పిలవొద్దు. ఉద్యోగులు బాస్‌తో మాట్లాడేందుకు కొన్ని పద్దతులుంటాయి. నీకు నా పేరు గుర్తు లేకపోతే హాయ్ అని మెసేజ్ చేయ్. దీంతో పాటు "డ్యూడ్", "మ్యాన్", "చాప్", "చిక్" అని కూడా పిలవొద్దు. అంటూ ఉద్యోగికి వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. అంతే ఆ రిప్లయికి ఉద్యోగి శ్రేయాస్ స్పందిస్తూ.."మంచిది. నేను మీతో వాట్సాప్ చాట్ చేస్తున్నాను. తప్పితే లింక్డిన్, మెయిల్ చేయలేదు. మిమ్మల్ని కించ పరచలానే ఉద్దేశ్యం నాకు లేదు. నేను ప్రొఫెషనల్‌గా మీతో మాట్లాడాను అని బాస్‌కు చెప్పింది".ఆ వాట్సాప్ సంభాషణను ఉద్యోగి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడం,అది కాస్త వైరల్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. -
ఈపీఎఫ్‌లో ఈ-నామినేషన్ ఫైల్ చేశారా! లేదంటే మీకే నష్టం!
ఈపీఎఫ్ ఖాతాదారులకు విజ్ఞప్తి. ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్‌కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే జత చేయండి అంటూ ఈపీఓవో సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మనం ఈపీఎఫ్ అకౌంట్లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్1:ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి స్టెప్2:మ్యానేజ్ బటన్‌పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి స్టెప్3: అండర్ ఫ్యామిలీ డిక్లరేషన్‌పై ఎస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. స్టెప్4: తర్వాత మీ నామిని డీటెయిల్స్ యాడ్ చేయాలి. నామినితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను ఎంటర్ చేయండి స్టెప్5: నామిని డీటెయిల్స్‌లో నామిని ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్, అడ్రస్, ఐఎఫ్ఎస్ఈ కోడ్, నామిని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. స్టెప్6: అనంతరం యాడ్ రో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇతర నామిని సభ్యుల వివరాల్ని ఎంటర్ చేయోచ్చు. స్టెప్7: తర్వాత నామినికి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారో (ఉదాహరణకు 100శాతం) ఎంటర్ చేయండి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువగా ఉంటే పర్సెంటేజీల వారీగా యాడ్ చేయండి స్టెప్8: వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు ఎంటర్ చేసిన వివరాలు సేవ్ అవుతాయి. స్టెప్9: ఆ తర్వాత ఈ-సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్‌తో లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటంది ఎందుకు ఈపీఎఫ్ అకౌంట్‌కు ఈ నామినేషన్ ఫైల్ చేయాలంటే ఖాతాదారుడు మరణిస్తే అతను/ఆమె అకౌంట్లో ఉన్న మొత్తం నామిని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది అదే ఖాతాదరుడు మరిణిస్తే పీఎఫ్‌తో పాటు రూ.7లక్షల వరకు ఇన్స్యూరెన్స్ క్లయిమ్ నామిని ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది. -
నెరవేరబోతున్న కల!: ప్రభుత్వ ఉద్యోగులుగా సచివాలయ సిబ్బంది
సచివాలయ కొలువులకు భద్రత లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలన్న సిబ్బంది కల సాకారం కానుంది. ఉద్యోగుల భవితకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రొబేషన్‌ను పూర్తి చేసుకున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు అధికారం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందిన వారి జాబితాను సిద్ధం చేసింది. దీంతో సచివాలయ సిబ్బంది ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ప్రజలకు సేవలందించే భాగ్యంతోపాటు భవితకు భరోసా లభించిందని హర్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతూ జిల్లా వ్యాప్తంగా 1,312 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో 11,969 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,319 మంది ఉద్యోగాలు సాధించారు. 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో 11 పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–6, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వీఆర్వో, మహిళా పోలీస్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల్లో ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. వార్డు సచివాలయాల్లో 10 పోస్టుల్లో అడ్మిని్రస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, హెల్త్సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, అమెనిటీస్ సెక్రెటరీ, ఎనర్జీ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రొబేషన్ కసరత్తును ఉన్నతాధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ ఇటీవల ఈ కసరత్తుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమా వేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. ప్రొబేషన్ వివరాల నివేదికను ఈ నెల 31లోపు ప్రభుత్వానికి పంపనున్నారు. రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో సచివాలయ ఉద్యోగుల యాంటిసిడెంట్ వెరిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రెండవ విడత పరీక్షలో ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో వారికి వచ్చే దశలో ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, అర్బన్ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ పర్యవేక్షించాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీగా కసరత్తు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. మొదటి దశలో ఉద్యోగాల్లో చేరిన వారికి నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌కు అర్హులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీగా కసరత్తు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించాం. ఇటీవల సమావేశం నిర్వహించి ప్రొబేషన్ కసరత్తుపై పలు సూచనలు చేశాం. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు నా పేరు హరిబాబు. పూతలపట్టు నియోజకవర్గం నాగవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నా. ప్రొబేషన్ పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. ప్రజల ఇంటి వద్దకే పరిపాలన కోసం సచివాలయాలను ఏర్పాటు చేసి మాకు ఉద్యోగాలు కల్పించిన సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయడంలో పారదర్శకత పాటిస్తాం. నా పేరు జీఎస్.మధురవాణి. ఎంఎస్సీ పూర్తయింది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం–2 గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. గతంలో ప్రైవేట్ కళాశాలలో పనిచేశా. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నా జీవితానికి భరోసా దక్కింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నేను విధుల్లో చేరి రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్నా. త్వరలో నన్ను రెగ్యులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల మేరకు రైతు భరోసా కేంద్రం ద్వారా దేశానికి వెన్నెముక అయిన రైతులకు సేవ చేయడం ఆనందంగా ఉంది. -
Crime News: మంచిర్యాలలో ‘గంజాయి’ డెత్!
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్లో గంజాయి కలకలం రేగుతోంది. సింగరేణి ఉద్యోగులు.. ముఖ్యమంగా యువ ఉద్యోగులు గంజాయికి బానిసలవుతున్నారు. తాజాగా ఓ యువ ఉద్యోగి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఉద్యోగి అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరి నది నుంచి అతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. గంజాయి మత్తువల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కోల్‌బెల్ట్ ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజా ఘటన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు మాదక ద్రవ్యాల నివారణపై కౌన్సెలింగ్ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గోదావరిలోకి దూకి సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
-
అర్ధరాత్రి ఇంటికి ప్రియుడు వచ్చి.. ఆ సమయంలో..
మండ్య(బెంగళూరు): జిల్లాలోని మద్దూరు తాలూకా ఆతగూరు హోబలి కెస్తూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్రామ పంచాయతీ డి గ్రూపు ఉద్యోగిని సుమ (38) హత్యకు గురైంది. శనివారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈమె భర్త రాజణ్ణ డి.గ్రూప్ ఉద్యోగిగా పనిచేసేవాడు. వీరికి యోగేశ్ అనే టెన్త్ చదివే కుమారుడు హాస్టల్లో ఉంటున్నాడు. రాజణ్ణ గతంలో చెరువులో చేపలు పడుతూ మునిగిపోయి మరణించాడు. తరువాత ఆమెకు భర్త ఉద్యోగం లభించింది. అర్ధరాత్రి ఆమె ఇంటికి ప్రియుడు వచ్చాడని, ఆ సమయంలో గొడవ పడి హత్యచేశాడని సమాచారం. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, 2017లో సుమ కొప్ప గ్రామ పంచాయతీలో జీపీ అధ్యక్షుడు చంద్రహాస్ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. మండ్య సెషన్స్ కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు వీగిపోవడంతో చంద్రహాస్ విముక్తుడయ్యాడు. చదవండి: హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్ -
విద్యుత్‌శాఖలో మీటర్ల గోల్మాల్.. అసలు విషయం ఏంటంటే..
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ శాఖలో అవినీతి భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టిజన్–2 కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కృష్ణ వినియోగదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుని మీటర్లను నేరుగా విక్రయించాడు. నిబంధనల ప్రకారం ఆన్లైన్ ద్వారా కంజుమర్ సెంటర్లో విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్న వారికే మీటరు ఇవ్వాలి. సదరు ఉద్యోగి నేరుగా డబ్బులు తీసుకొని అమ్ముకున్నాడు. రోజుకు ఎన్ని మీటర్లు విక్రయించాడు.. ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అధికారులు మా మూలుగా తీసుకోవడంతో ఈ వ్యవహరం జరిగి న్నట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగి విక్రయించిన మీటర్లకు బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు ఈ విషయాన్ని అధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ బాగోతం బయటపడింది. విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడే కృష్ణపై సస్పెషన్ వేటు వేశారు. అలాగే పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు ఎస్సై హజరుద్దీన్ బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. కాగా కృష్ణ 40మందికి మీటర్లు విక్రయించినట్లు ఎస్ఈ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.1900 వసూళ్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎంత మంది వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేశారో విచారణలో బయట పడనుంది. దీంతో కొంతమంది ఉద్యోగులు, అధికారుల్లో గుబులు రేపుతోంది. -
ఉద్యోగి ఘనకార్యం.. రిచ్‌గా పెళ్లి చేసుకునేందుకు ఏం చేశాడంటే..?
యశవంతపుర(కర్ణాటక): వైభవంగా పెళ్లి చేసుకోవడానికి తను పనిచేసే బ్యాంకునే దోచుకున్నాడో ఘనుడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురుగోడు డీసీసీ బ్యాంక్‌లో మార్చి 6న రూ.ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే కేసు విచారించిన పోలీసులు బ్యాంక్‌లో పనిచేస్తున్న క్లర్క్ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30), అతడి అనుచరులు సంతోష్ కాళప్ప కుంబార (31), గిరీశ్ (26) దొంగతనం చేశారని తేల్చారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? దీంతో వీరిని అరెస్టు చేసి.. నాలుగుకోట్ల 20 లక్షల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాదీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి క్లర్క్ బసవరాజు, అతని స్నేహితులతో కలిసి బ్యాంకు దోపిడీ చేసినట్లు తేలింది. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయతోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడినట్లు క్లర్క్ విచారణలో తెలిపాడు. -
గుడ్‌న్యూస్,ఇకపై వారానికి ఒకసారి శాలరీ!! భారత్‌లో మొదలైన కొత్త కల్చర్!
ప్రపంచ దేశాల్లో కోవిడ్ కారణంగా ఉద్యోగుల వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వర్క్ కల్చర్‌తో పాటు ఉద్యోగుల చెల్లించే నెలవారీ జీతాల విధానం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటి వరకు నెలకు ఒక సారి మాత్రమే సంస్థలు ఉద్యోగులకు జీతాల్ని చెల్లిస్తుండేవి. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి వారానికి జీతాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల్లో సంస్థలు ఉద్యోగులకు వారం వారం జీతాల్ని చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఈ కల్చర్ ఇండియాలో మొదలైంది. దేశీయ బీ2బీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఇండియా మార్ట్ ఉద్యోగులకు నెలవారీ కాకుండా వారం వారం జీతాల్ని చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. వారానికి ఒకసారి జీతాలు చెల్లించడం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవని, తద్వారా వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఇండియా మార్ట్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. కాగా,డిసెంబర్ 2021 త్రైమాసికంలో ఇండియామార్ట్ ఏకీకృత నికర లాభంలో 12.4 శాతం క్షీణించి రూ.70.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.80.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎఫ్వై22 3వ త్రైమాసికంలో దీని ఆదాయం రూ.173.6 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి రూ.188.1 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. -
68 ఏళ్ల సర్వీస్‌లో.. ఒక్కరోజు లీవ్ పెట్టలేదు మరి!
నిబద్ధతతో, నిజాయితీతో పని చేసే ఉద్యోగులే ఒక కంపెనీకి నిజమైన సంపద!. ఇలాంటి డెడికేషన్తోనే ఇక్కడో పెద్దాయన ఒకే కంపెనీలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పని చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్కు కంపెనీ అవకాశం ఇచ్చినా.. ఇంకా కొన్నేళ్లపాటు సర్వీస్‌లోనే కొనసాగాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో జబ్బు చేసిందని ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదు ఆయన. అందుకే కంపెనీ సైతం సర్వీస్‌ను ఆయన ఇష్టమైనంత కాలం పొడిగించింది. 83 ఏళ్ల వయసులోనూ హుషారుగా పనిచేస్తున్న బ్రెయిన్ క్రోలే గురించి ఆసక్తికర కథనం.. సౌత వెస్ట్ ఇంగ్లండ్ సోమర్సెట్లో నివాసం ఉండే బ్రియన్ కోర్లే.. 1953లో తన 15 ఏళ్ల వయసులో సీ అండ్ జే క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పేదరికం కారణంగా తండ్రి ఆర్మీలో చేరితో.. కుటుంబ పోషణలో భాగం కావాలని చిన్నవయసులో బ్రియన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏజ్ వల్ల మొదట కంపెనీ అతన్ని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చదువుకుంటూనే పనికి వస్తానని చెప్పడంతో అప్పుడు ఓకే చెప్పింది. అలా ఓవైపు స్కూల్.. మరోవైపు ఫ్యాక్టరీ.. సమ్మర్ హాలీడేస్ పూర్తిస్థాయి పనికే అంకితం అయ్యాడు. వారంలో 45 గంటల పని.. వచ్చిన డబ్బంతా అమ్మకు ఇచ్చేసేవాడు. అలా ఏళ్లు గడిచినా.. క్లార్క్స్ కంపెనీతో అతని బంధం కొనసాగుతూ వస్తోంది. ఇంతలో కంపెనీ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి.. అవుట్లెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి బ్రియన్ వయసు 50 ఏళ్లు. అన్నేళ్లపాటు కంపెనీలో కొనసాగినందుకు ప్రతిగా.. అతని అవుట్లెట్ విభాగానికి బదిలీ చేసింది. దీంతో బ్రియన్ సేవలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్రియన్ వయసు 83 ఏళ్లు. కంపెనీ రికార్డుల్లో ఈయనగారు ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదని ఉంది. ఇంకో వందేళ్లైనా ఇదే కంపెనీలో పని చేస్తానంటూ హుషారుగా చెప్తున్నాడు ఈ తాత. ఇంతకీ ఈ పెద్దాయన ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ ఫ్రెడెరిక్ అట్టెన్బర్గ్. 95 ఏళ్ల వయసులో హుషారుగా ఈ పెద్దాయన రిటైర్మెంట్ లేకుండా పని చేస్తున్నాడు. ఒకవైపు ప్రకృతి ప్రేమికుడిగా వైల్డ్ లైఫ్ ఫిల్మ్‌మేకింగ్‌తో, మరోవైపు బ్రాడ్‌కాస్టింగ్ ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అట్టెన్బర్గ్. అందుకే సర్ డేవిడ్లా తాను సుదీర్ఘకాలం ఇష్టమైన పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట!. పనిలో ఇష్టం.. నిజాయితీ.. దేవుడంటే నమ్మకం.. ఆరోగ్యవంతమైన జీవనం ఇదే తన కెరీర్ రహస్యం అంటున్నారు బ్రియన్ కోర్లే. -
ఏ కష్టం వచ్చిందో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: ఆ దంపతులిద్దరిదీ ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. అతనో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె ప్రైవేటు స్కూల్లో టీచర్. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ముచ్చటైన కుటుంబం. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవు. ఏమైందో, ఏ కష్టం వచ్చిందో చిన్నారి కూతురితో పాటు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వీరి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం, దేవుడి గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. నోట్లో నురగలతో తల్లీకూతుళ్లు.. ఉరేసుకున్న శ్రీకాంత్ సీఐ శ్రీనివాసులురెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే శ్రీకాంత్‌గౌడ్ (42), తన భార్య అనామిక (40) కుమార్తె శ్రీస్నిగ్ధతో కలిసి అమీన్పూర్ వందనపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్‌ది మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం పోతాయపల్లి కాగా అనామిక కుటుంబం అల్వాల్‌లో ఉండేది. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 నుంచి వందనపురి కాలనీలో ఉంటున్నారు. అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్ గ్లోబల్ కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. స్నిగ్ధ రెండో తరగతి చదువుతోంది. రెండురోజులుగా ఒకరి ఫోను స్విచ్ఛాప్ రావడం, మరొకరి ఫోను మోగుతున్నా ఎత్తకపోవడంతో అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి వందనపురిలోని వారింటికి వచ్చారు. తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో అనుమానంతో అమీన్పూర్ పోలీసులకు, ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. అనామిక, శ్రీస్నిగ్ధ నోట్లో నురగలతో విగతజీవులుగా పడి ఉన్నారు. పక్క గదిలో శ్రీకాంత్‌గౌడ్ ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. విగతజీవులుగా ఉన్న ముగ్గుర్నీ చూసి కుటుంబసభ్యులు పెద్దపెట్టున రోదించారు. శ్రీకాంత్, అనామికలు బాగానే ఉండేవారని, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవని శ్రీరామచంద్రమూర్తి విలపించారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోలీసులు దంపతులిద్దరి ఫోన్లను, శ్రీకాంత్‌గౌడ్ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌గౌడ్ ఫోన్‌కు లాక్ ఉందని సీఐ తెలిపారు. సెల్‌ఫోన్ డేటా రికవరీకి నిర్ణయం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ దంపతులకు చెందిన ఒక ఫోన్ ఫార్మాట్ చేసి ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఈ ఫార్మాట్ అయిన సెల్‌ఫోన్ కూడా ఉంది. ఈ సెల్‌ఫోన్‌ను ఎందుకు ఫార్మాట్ చేశారు.. అందులోని డేటాను ఎందుకు తొలగించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన డేటాను రికవరీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ దంపతులకు ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వీరి బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వీరికి సుమారు రూ.30 లక్షల వరకు అప్పులు ఉన్నాయనే ప్రాథమిక సమాచారం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. కానీ వారు నివసిస్తున్న ఇల్లే రూ.కోటికి పైగా విలువ చేసేది కావడంతో పాటు, వీరికి పొలాలు ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నట్టు తెలియడంతో ఈ అప్పులేవీ ఆత్మహత్యలకు కారణం కాకపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇంట్లో సూసైడ్ లెటర్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. పని మనిషిని రెండురోజుల ముందే రావద్దని చెప్పినట్లు తెలిసింది. -
బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!
ఓ సాఫ్ట్వేర్ సంస్థ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్ చేస్తే సమారు $2,500 నుంచి 5వేల డాలర్లు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తుంది. కానీ ఉద్యోగులు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్ని ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొత్త ఉద్యోగుల నియామకం లేదా, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఆ సంస్థను వదిలి వెళ్లకుండా ఉండేలా చూడడం ఆయా సంస్థలకు కత్తిమీద సాములాగా మారింది.అందుకే ఉద్యోగుల భద్రతా, శాలరీను పెంచడం, బోనస్ ఇవ్వడంతో పాటు వారి పిల్లల ఎడ్యుకేషన్ కు సంబంధించి అనేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా కొత్త టాలెంట్ కోసం అరిజోనాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ 'ట్రైన్యువల్' సీఈఓ క్రిస్ రోంజియో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్ చేస్తే సమారు $2,500 (సుమారు.రూ.2లక్షలు )చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. రోంజియో 2020,మే' లో పే-టు-క్విట్ పాలసీని ప్రారంభించారు. ఈ పాలసీలో భాగంగా ఉద్యోగులు తమ జాబ్‌కు రిజైన్ చేసిన రెండు వారాల్లో కంపెనీ ప్రకటించిన రూ.2కోట్లను ఉద్యోగులకు అందిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా కొత్త ఉద్యోగుల నియమాకం సులభం అవ్వడంతో పాటు, ఉద్యోగం నుంచి రిజైన్ చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండొద్దని భావించారు. తాజాగా పే-టు- క్విట్లో భాగంగా ఈ ఆఫర్‌ను రూ.2లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు. ఇప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించే ఉద్యోగులకు అదనపు 'బెన్ ఫిట్స్' ను కోల్పోతారని రోంజియో వెల్లించారు. ఈ సందర్భంగా రోంజియో మాట్లాడుతూ..తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంవత్సరానికి $80,000, $100,000 సంపాదిస్తున్నట్లయితే, $2,500 చాలా తక్కువగా ఉండొచ్చు.లేదంటే వేరే సంస్థకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చు. అందుకే ఆఫర్‌ను $2,500 నుంచి $5000('సుమారు రూ.4లక్షలు) పెంచాం. అయినా జాబ్‌కు రిజైన్ చేయలేదంటే వారికి అదనపు బెన్ఫిట్స్' ను అందించమని చెప్పారు. చదవండి: ఉద్యోగులకు షాక్, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా! -
అప్పు ఇచ్చిన పాపానికి హత్య.. మృతదేహాన్ని పార్సిల్ చేసి..
చిత్తూరు: కష్టాల్లో ఉన్నాం.. కాస్త డబ్బు అప్పుగా ఇస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం.. అనగానే సహాయం చేసిన పాపానికి వ్యక్తిని హత్య చేసి భాకరాపేట ఘాట్‌రోడ్డులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప వివరాల మేరకు.. తిరుపతి ఎల్బీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్(54) తిరుపతి టూరిజం శాఖలోని ట్రాన్స్‌పోర్టులో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారం చేసేవాడు. తిరుపతికి చెందిన మధుబాబు, రాజు, మధురెడ్డిలకు వడ్డీకి కొంత నగదు ఇచ్చాడు. సరిగ్గా వడ్డీ చెల్లించకపోవడంతో వారిని నిలదీశాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31న చంద్రశేఖర్‌కు మధుబాబు ఫోన్ చేసి డబ్బులిస్తానని పిలిచాడు. ఇంటి నుంచి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్వీ యూనివర్శిటీలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్ సెల్‌ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోని అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. డీఎస్పీ నరసప్ప, సీఐలు రవీంద్ర, శ్రీనివాసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. చంద్రశేఖర్‌కు ఫోన్ రాగానే తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని మధుబాబు గోడౌన్‌కు వెళ్లాడు. మధుబాబు తన వద్ద డబ్బులు లేవని, డబ్బు చెల్లించేవరకు తన భూమి దస్తావేజులు ఉంచుకోమని వాటిని అందజేశాడు. దస్తావేజులు పరిశీలిస్తున్న చంద్రశేఖర్‌ను వెనుక నుంచి మధురెడ్డి, రాజు రాడ్డుతో తలపై మోదారు. అనంతరం కేకలు వేయకుండా నోటికి గుడ్డను కట్టి, కాళ్లు చేతులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. మృతి చెందాడని నిర్ధారించుకుని గోనె సంచిలో కుక్కి అట్టబాక్సులో ఉంచారు. తెలిసిన వారి కారు తీసుకుని డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం భాకరాపేట ఘాట్‌రోడ్డుకు చేరుకుని, లోయలో మృతదేహాన్ని పడేసి పారిపోయినట్లు డీఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న మధుబాబు, మధురెడ్డిల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య కస్తూరి, కుమారుడు రూపేష్, కుమార్తె లావణ్య ఉన్నారు. -
స్పష్టతలేని విభజన..ఏ జిల్లాకు వెళ్లాలో!.. ఆందోళనలో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ నేడు కీలక దశకు చేరుకోనుంది. ఉద్యోగులకు జిల్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ జిల్లాకు తమను కేటాయిస్తారోననే ఆందోళనలో వారున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 5 వేల ప్రధానోపాధ్యాయులు మినహా 1.04 లక్షల మంది టీచర్లు జిల్లా కేడర్ కిందకే వస్తారు. సీనియారిటీకి కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాళ్ల డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సీనియర్లు కోరుకున్న ప్రాంతానికి, జూనియర్లు ఇష్టం లేకున్నా కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడే అనేక సందేహాలు తెరమీదకొస్తున్నాయి. విద్యాశాఖ ఇప్పటివరకూ సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. టీచర్లను జిల్లాకు కేటాయించినా ఆ జిల్లాలో వాళ్లను ఏ స్కూలుకు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? విద్యా సంవత్సరం మధ్యలో ఇది సాధ్యమా? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. టీచర్లను విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ చేస్తే బోధన కుంటుపడొచ్చన్న వాదన విన్పిస్తోంది. జటిలమైన సమస్య... రాష్ట్రంలోని 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఉద్యోగుల విభజన తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే విభజన అంశమే పెద్ద ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. 1975లో లోకల్ క్యాడరైజేషన్ చేసిన తర్వాత ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల్లో కొనసాగించారని, 2006లో కొందరు స్థానికేతరులను వారి జిల్లాలకు తరలించారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తే బాగుండేదని, ఇతర జిల్లాలకు వెళ్లలనుకొనే వారిని పంపితే సరిపోయేదని అభిప్రాయపడుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకురావడం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొందని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ సమస్య ఇంత జటిలం కాకుండా ఉండేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టకుండా జూనియర్ టీచర్లను వేరే జిల్లాలకు పంపడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం వల్ల స్థానికేతర జిల్లాల వాళ్లు పట్టణ ప్రాంతాలకు వస్తారని, స్థానికులు మాత్రం సీనియారిటీ లేకపోవడం వల్ల సొంత ప్రాంతానికి, కుటుంబ బాంధవ్యాలకు దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. కొన్ని వర్గాలకు అన్యాయం సీనియారిటీ వల్ల ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మారుమూల ఏజెన్సీ జిల్లాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని, వారు ఇప్పట్లో రిటైరవరు కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వేరే జిల్లాల్లో స్థానికేతరులుగా వాళ్లు పోటీ పరీక్షలు రాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలందరినీ ఏకం చేస్తామన్న ప్రభుత్వ హామీలు కాలగర్భం కలిసే వీలుందనే వాదన విన్పిస్తోంది. ఈ కేటాయింపులకు ముందే 258 ఉత్తర్వు ద్వారా లోకల్ క్యాడరైజేషన్‌లో భాగంగా జిల్లా స్థాయి పోస్టుగా పేర్కొన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టునైనా జోనల్ పోస్టుగా మారిస్తే ఏదో ఒకరోజు తాము సొంత జిల్లాకు వస్తామనే ఆశ ఉండేదని అభిప్రయపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ను జోనల్ పోస్టుగా చూపించిన అధికారులకు స్కూల్ అసిస్టెంట్పట్ల ఎందుకు కనికరం లేదో అర్థం కావడం లేదని వరంగల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించారు. స్థానికత స్ఫూర్తికి విరుద్ధం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలనే స్ఫూర్తితో కొత్త జోనల్ విధానాన్ని తీసుకుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో ఈ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటోంది. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని స్థానికతను పట్టించుకోకపోవడంతో పలు శాఖల్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రక్రియతో చాలా జిల్లాల్లో కొత్త నియామకాలు జరిగే పరిస్థితి ఉండదు. మరోవైపు ఆన్లైన్లో చేపట్టాల్సిన ఆప్షన్ల ప్రక్రియను మాన్యువల్ పద్ధతిలో చేపట్టడంతో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయి. పరపతిని ఉపయోగించుకొని కొందరు ఇష్టానుసారంగా జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను సవరిస్తేనే ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. – చలగాని సంపత్‌కుమార్ స్వామి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్పష్టత ఏదీ? ఈ రోజైతే జిల్లా కేటాయింపు ఆర్డర్లు ఇస్తారు. కానీ టీచర్లు ఏ స్కూల్లో పనిచేయాలనేది డీఈవోలు నిర్ణయించాలి. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మార్గదర్శకాలూ ఇవ్వలేదు. టీచర్‌ను బదిలీ చేశారు కాబట్టి పాత స్కూల్లో ఉండే వీల్లేదు. కొత్త స్కూలుకు వెళ్లాలంటే సమయం పడుతుంది. విద్యాసంవత్సరం మధ్యలో ఈ పరిణామంతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది.– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శ
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. డెలివరీ ఎంప్లాయిస్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు తాజాగా వెలుగు చూసింది. తుపానుల సమయంలోనూ డెలివరీలు చేయాలంటూ డెలివరీ పార్ట్నర్ను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇల్లినాయిస్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. భీకరమైన తుపాను నేపథ్యంలో హెచ్చరికలు జారీకాగా, అది కేవలం హెచ్చరికే కదా అంటూ డెలివరీ పార్ట్నర్కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్. డెలివరీ కోసం వెళ్లాల్సిన ఓ యువతికి ఈ అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. తుపాను లేదు గిఫాను లేదు. అది కేవలం హెచ్చరిక మాత్రమే. ఆర్డర్లు డెలివరీ చేయకుండా వెనుదిరిగితే ఉద్యోగం ఊడుతుందని ఆ డెలివరీ గర్ల్‌ను అమెజాన్ ప్రతినిధులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఛాటింగ్‌కు సంబంధించి స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అమెజాన్‌పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు అమెజాన్‌లో డెలివరీ ఎంప్లాయిస్ల పట్ల మేనేజ్మెంట్ తీరు ఇలాగే ఉంటుందని, ప్రతికూల వాతావరణంలో తమ కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరంటూ పలువురు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. చదవండి: అమెజాన్‌కు భారత్‌లో షాక్.. 200 కోట్ల జరిమానా -
కిక్కు కోసం.. బాస్‌కు రిజైన్ లెటర్ దేని మీద రాసిచ్చాడంటే !
సాధారణంగా ఉద్యోగులు తాము పని చేస్తున్న కంపెనీ నచ్చకపోతే రాజీనామా చేయడం సహజం. అందుకు వారు ఏ వైట్ పేపర్పైనో, లేదా మెసేజ్, ఈ మెయిల్ ద్వారా పంపడం సహజమే. ఎవరు రాజీనామా చేయాలన్నా ఇదే ఫాలో అవుతారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని భావించాడో, లేదా బాస్‌పై కోపమో గానీ తన రాజీనామాను విచిత్రంగా రాశాడు. అంతేనా.. అతను ఏ పేపర్ మీద రాశాడో తెలిస్తే షాక్‌తో పాటు యాక్ కూడా అంటారు మరీ. అసలు ఆ ఉద్యోగి చేసిన నిర్వాకం ఏంటంటే.. ఓ ఉద్యోగి తన కంపెనీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరూ ఇచ్చినట్లు తన రాజీనామాను ఇస్తే కిక్కు లేదనుకున్నాడు. అందుకే.. ఏకంగా టాయిలెట్ పేపర్ మీద తన రాజీనామా లేఖను రాశాడు. ఈ నెల 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని రాసి.. తన బ్యాక్ చూపిస్తున్నట్టుగా డ్రాయింగ్ కూడా వేశాడు. దాన్ని రెడిట్‌లో పోస్ట్ చేసి.. మా బాస్‌కు ఇదే రాజీనామా పత్రాన్ని ఇవాళ ఇవ్వబోతున్నా అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. టిష్యూ పేపర్‌పై రాసిన లెటర్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాప్రే.. ఇలాంటి రిజైన్ లెటర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు -
గిన్నిస్ బుక్‌లోకెక్కిన ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి
నరసాపురం: పెన్సిల్ లెడ్‌పై అతుకులు లేకుండా, ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూదిమొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న కొప్పినీడి విజయమోహన్‌కు సూక్ష్మ కళాకారుడిగా పేరు ఉంది. సూదిమొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. రాష్ట్రీయ యువగౌరవ్ సమ్మాన్ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. 50 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. విజయమోహన్ తండ్రి వరహాలరావు ఆటో డ్రైవర్. తల్లి నాగ సుశీల గృహిణి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయమోహన్ 2019 అక్టోబర్‌లో గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. -
లైంగిక వేధింపులు, ఎలన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరో ఎదురుదెబ్బ తగిలింది. టెస్లా కంపెనీలో లైంగిక వేధింపులు ఎక్కువైతున్నాయంటూ ఆ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దీంతో వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎలన్‌కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో టెస్లా మోడల్ 3లో పనిచేసే మహిళా ప్రొడక్షన్ అసోసియేట్ కోర్ట్‌లో దావా వేశారు. వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులకు గురైనట్లు దావాలో పేర్కొన్నారు. దాదాపు 3ఏళ్ల పాటు లైంగిక వేధింపులకు గురైనట్లు, ఆ వేధింపులు ఇంకా ఎక్కువ కావడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు. నా శరీరం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. తరుచూ తోటి ఉద్యోగులు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించింది. 'ది వెర్జ్' తో ఆమె ఇలా చెప్పింది.' దాదాపు 3ఏళ్ల నుంచి ప్రతిరోజూ నా మహిళా సహోద్యోగులు బెదిరించే వారు. అసభ్య పదజాలంతో దూషించే వారు. ఆఫీస్‌లో పనిచేయాలనే ఉద్దేశంతో అనేక దాడుల్ని ఎదుర్కొన్నాను. నిరంతరం లైంగిక వేధింపులకు గురికావాల్సిన అవసరం లేదు. నా కుటుంబం కోసమే అన్నీ భరించాల్సి వచ్చింది. ఇకపై భరించే ఓపిక నాలో లేదు. నన్ను, నా కుంటుంబాన్ని ఆదుకోవాలని వ్యాఖ్యానించింది. చదవండి: ఎలన్‌మస్క్ ఎందుకిలా జరుగుతోంది? -
వారం రోజులు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి: సుప్రీంకోర్టు
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా.. పంట వ్యర్థాలను కాల్చడాన్ని వారంపాటు ఆపేయాలని రైతులను కోరింది. అలానే ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే మరోసారి లాక్డౌన్ విధింపునకు తాము సిద్ధమే అని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంలో ప్రత్యేక అఫిడవిట్లను దాఖలు చేశాయి. కాగా, ఢిల్లీలో ప్రజలు జీవించడానికి భయపడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, గతం వారం నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు) -
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
-
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ)లో 55 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన ‘స్టాఫ్ బినవొలెంట్ త్రిఫ్ట్ (ఎస్బీటీ) ఫండ్’ను తిరిగి కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో ఎస్బీటీ ఫండ్‌ను ఏళ్లపాటు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా/రిటైరైనా ఆ నిధి నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించేవారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎస్బీటీ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ (ఏపీజీఎల్ఐ) అమల్లోకి వచ్చింది. కాగా, ఏపీజీఎల్ఐ 55 ఏళ్లలోపు ఉద్యోగులకే వర్తిస్తుంది. దాంతో ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం గతంలో ఉన్న అమలు చేసిన ఎస్బీటీ ఫండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం కొత్త ఎస్బీటీ ఫండ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఫండ్ 2021 డిసెంబర్ నాటికి 55 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వర్తిస్తుంది. ఆ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 చొప్పున కంట్రిబ్యూషన్ వసూలు చేస్తారు. ఈ మేరకు రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
విషాదం: అందరూ చూస్తుండగానే.. షాపింగ్‌మాల్‌లో షాకింగ్ వీడియో
సాక్షి, ఖమ్మం జిల్లా: నగరంలో విషాదంలో చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగి.. కస్టమర్‌కు బట్టలు చూపిస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా టేబుల్‌పైనే కూప్పకూలిపోయాడు. ఖమ్మం నగరానికి చెందిన చాంద్ పాషా గత కొద్దికాలంగా కేఎల్ఎం షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా కస్టమర్‌కు బట్టలు చూపిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి దాకా మాట్లాడిన ఉద్యోగి.. అంతలోనే మృతి చెందడంతో ఉద్యోగులు, కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. చదవండి: ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ -
బంధం తగ్గుతోంది..
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తమ బాస్‌తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు లేకపోవడం, ఉద్యోగులు– ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి కారణాలని పేర్కొంది. ఈ సమస్యలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైనట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా పరిశోధన.. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 38 వేల మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, హెచ్ఆర్ విభాగానికి చెందినవారు, ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది. ఇందులో భారత్ నుంచి 5,500 మంది పాల్గొన్నారు. వీటన్నింటిని ఓసీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ క్రోడీకరించి 2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదికను వెలువరించింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ పరిశోధన మరోమారు స్పష్టం చేసిందని ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు గ్యారీ బెక్స్ట్రాండ్ చెప్పారు. ప్రోత్సాహం లేదు.. 57 శాతం మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి ప్రోత్సాహాన్ని పొందడం లేదని పరిశోధనలో వెల్లడించారు. 62 శాతం మంది పై అధికారులు విజయం సాధించడం ఎలాగో చెబుతుండగా, 52 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగుల విజయాల గురించి ఇతరులకు వివరిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమైతే పరిస్థితులు మరింత దిగజారతాయని పరిశోధన పేర్కొంది. ఉద్యోగులను పట్టించుకోకపోతే, ఉద్యోగులు కూడా తమ సంస్థ గురించి పట్టించుకోవడం మానేస్తారని తెలిపింది. సంస్థలోని ముఖ్యమైన సందర్భాలను కలసి జరుపుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా వారు బాగా పని చేస్తారని నివేదిక స్పష్టం చేసింది. కీలకాంశాలు.. పరిశోధనలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు తమకు నూతన పరిచయాలు కార్యాలయాల్లోనే అవుతాయని చెప్పారు. సామాజికంగా ఇతరులతో కలసి పని చేస్తే తమలోని ఉత్తమ నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. మరో 45 శాతం మంది ఉద్యోగులు.. గతేడాది నుంచి ఆఫీస్ వర్క్‌కు సంబంధించిన దైనందిన సమన్వయ కార్యక్రమాలు బాగా పడిపోయాయని చెప్పారు. 57 శాతం మంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశంతో కనెక్షన్ తెగిపోయాక తమ పనితీరు 90శాతం వరకూ పడిపోయిందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో పాటు పని వల్ల నీరసపడిపోవడం (బర్న్ఔట్) బాగా పెరిగిందని వెల్లడించారు. చదవండి: కోవిడ్ పోరులో కొత్త ఆశలు -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 15 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జులైలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా జులైలో 14.65 లక్షలుగా నమోదైంది. వీరిలో 9.02 లక్షల మంది తొలిసారిగా చేరిన వారు. ఇక మిగతా వారు గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్‌వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్ మధ్య నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్డౌన్ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది. -
Puducherry: వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తమిళి సై టీకా మెలిక
సాక్షి, చెన్నై(తమిళనాడు): కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉద్యోగుల జీతాలకు.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ టీకా మెలిక పెట్టారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం, దీపావళి రాయితీలు అని గురువారం ప్రకటించారు. వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ టీకా వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు గురువారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. రాజ్ నివాస్ ఆవరణలో ఈ ర్యాలీని తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో మాస్క్ వేటకు 200 బృందాలు చెన్నైలో మళ్లీ మాస్క్‌లు ధరించే వారు, భౌతిక దూరం పాటించే వారి సంఖ్య తగ్గింది. దీంతో ప్రత్యేక బృందాల్ని చెన్నై కార్పొరేషన్ గురువారం రంగంలోకి దింది. రెండు వందల ప్రత్యేక బృందాలు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా వేయనున్నాయి. మాస్క్‌లు ధరించని వారి వద్ద నుంచి స్పాట్ ఫైన్ వసూలు చేయడమే కాకుండా, హెచ్చరించి మరీ మాస్క్‌లు ఇచ్చే పనిలో పడ్డారు. ఇక, చెన్నై వేప్పేరిలోని వ్యవసాయ కళాశాలలో 13 మంది, కోయంబత్తూరులోని నర్సింగ్ కళాశాలలో 46 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం గమనార్హం. చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు -
Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..?
సాక్షి, కరీంనగర్: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పి చేతివాటం ప్రదర్శించారు. అదే అధికారి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ తన చతురతను ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆ అధికారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అమ్మకం జరిగాయని పలువురు చర్చించుకుంటున్న నేపథ్యంలో... ఒక పోస్టును ఆసుపత్రిలోనే ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వ్యక్తికి కట్టబెట్టేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ముట్టజెప్పిన సదరు వ్యక్తి కూడా తనకు పోస్టు దక్కుతుందనే భరోసాతో ఉన్నట్లు తోటి దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఖరారైన పోస్టు రూ.2 లక్షలు పలుకగా, మరో పోస్టుకు మాత్రం లాభసాటిగా బేరం కుదుర్చేందుకు డబ్బులు పెట్టే సత్తా ఉన్న అభ్యర్థిని వెతుకుతున్నట్లు తెలిసింది. 2 పోస్టులు.. 87 దరఖాస్తులు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు పోస్టులకు 87 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అదనుగా కీలక అధికారి బేరసారాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టులన్నీ సదరు అధికారి కనుసన్నల్లలోనే భర్తీ కావడంతో అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టు వచ్చినట్లేనని ప్రచారం బహిరంగంగా జరుగుతోంది. అర్హుల ఎంపికతో నోటీసు... దరఖాస్తుదారుల లిస్టు ప్రకారం అర్హులు, అనర్హుల లిస్టు తయారు చేసి ఈ నెల 14న అధికారులు ఆసుపత్రిలో నోటీసు బోర్డుపై అంటించారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలుంటే తెలపాలని, లేని పక్షంలో రెండు పోస్టులకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎంఎల్టీ చేసిన వారు అనర్హులట.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) పూర్తి చేసి పారా మెడికల్ బోర్డునుంచి సర్టిఫైడ్ అయిన వాళ్లని సైతం అనర్హులుగా ప్రకటించారు. పారామెడికల్ బోర్డు ఆక్ట్ నెం.38 ఆఫ్ 2006 ప్రకారం ఎంఎల్టీ చదివిన వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొత్త నిబంధన పెట్టారని పలువురు ఎంఎల్టీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల ఎంపికపై అభ్యంతరం... ఎంఎల్టీ చదివిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై శ్రీనాథ్ అనే దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలుపుతూ లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు గురువారం లేఖను అందించారు. ఈ లేఖలో మరో వివాదాన్ని సైతం లేవనెత్తారు. నోటిఫికేషన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నప్పటికీ, ఎంపిక నోటీసు వచ్చే సరికి జోనల్ స్థాయి నియామకం అని ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎల్టీ చదివిన వారికి న్యాయం చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్.. ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నిబంధనల ప్ర కారమే చేపట్టాం. డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకుంటామని నోటిఫికేష న్లో స్పష్టం చేశాం. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నాం. – డాక్టర్ రత్నమాల, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?
Work From Home: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సమకాలిన అంశాలపై స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం ఉండాలా? వద్దా ? దాని వల్ల ఉపయోగాలు నష్టాలపై ఆయన వరుసగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. అవన్ని నవ్వులు పూయించడంతో పాటు చర్చకు సైతం దారి తీస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం తొలగించి, తన భర్తను ఆఫీసుకు రమ్మనకపోతే తమ దాంపత్య బంధానికి వీడాకులు తప్పవంటూ ఇటీవల ఓ గృహిణి చేసిన రిక్వెస్ట్‌ని షేర్ చేసిన హర్ష్ గోయెంకా... తాజాగా మరో వీడియోను వదిలారు. నెలల తరబడి వర్క్‌ఫ్రం హోంకి అలవాటైన ఉద్యోగులు.. ఆఫీసులకు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశంపై ఫన్నీగా చిత్రీకరించిన వీడియోను షేర్ చేశారు. ఆఫీసులో ఉద్యోగులు ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పటికీ... వారంతా ఇంటి నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. Scene at workplace after over a year of zoom/teams meetings 😀😀😀! pic.twitter.com/sCCVpMurma — Harsh Goenka (@hvgoenka) September 13, 2021 హర్స్ గోయెంకా ట్వీట్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా ఉన్నప్పటికీ వాస్తవం అదేనంటూ రీ ట్వీట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. చదవండి : Viral Video: ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ! -
చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో పంచుకునేలా నమ్మకం సంపాదించుకోవడం.. వలలో చిక్కని వారిని ముగ్గులోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత వారిపై అవినీతిపరులనే ముద్ర వేసి మానసిక వేదనకు గురిచేస్తాడు. దొంగ వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. చివరికి నయానో.. భయానో తన దారికి తెచ్చుకుని అక్రమార్జనకు మార్గంసుగమం చేసుకుంటాడు. ఇదీ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన చిరుద్యోగి ‘చీకటి బాగోతం’ . సాక్షి, తిరుపతి: అక్రమాలనే ఆదాయ వనరుగా మార్చుకున్న తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ చిరుద్యోగి లీలలు అన్నీఇన్నీ కావు. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఆయన ప్రమేయం లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. చిల్లర కోసం సదరు చిరుద్యోగి వేస్తున్న చీకటి వేషాలపై కార్యాలయం సిబ్బందే కథలు కథలుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులపైనే పెత్తనం చెలాయిస్తున్న ఆయన వైఖరిపై విస్తుపోతున్నారు. పథకం ప్రకారం ప్రలోభం తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి చిరుద్యోగే సర్వం సరç్ఛౌరా చేస్తుంటాడు. అందరితోనూ చనువుగా మసలుకుంటుంటాడు. అందరి అవసరాలను తానే తీరుస్తుంటాడు. తద్వారా తన అవినీతికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. బదిలీపై వస్తున్న అధికారులను సైతం ముందుగానే ఫోన్ లో సంప్రదించి తిరుపతిలో అన్నీ తానే అని నమ్మిస్తాడు. వారికి కావాల్సిన పనులన్నీ చేసిపెట్టి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఒకవేళ వచ్చిన అధికారి వలలో చిక్కకుంటే మరింత దారుణంగా వ్యవహారం నడిపిస్తాడు. ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఆహారం, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపేస్తాడు. మత్తులోకి జారుకున్న అధికారిపైకి వేశ్యలను ఉసిగొల్పి నగ్న వీడియోలను చిత్రీకరిస్తాడు. కొద్దిరోజుల తర్వాత ఆ అధికారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిలు చేస్తాడు. ఇక చేసేది లేక నిజాయితీపరులైన అధికారులు సైతం చిరుద్యోగికి అనుకూలంగా మారిపో తారు. అప్పటి నుంచి ఆ అధికారి ఉన్నన్ని రోజులు యథేచ్ఛగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. డబ్బుకు లొంగే అధికారులైతే చిరుద్యోగి మరింత దారాళంగా వ్యవహరిస్తాడు. నెలకు ఎంత కావాలి అని డీల్ కుదుర్చుకుంటాడు. ( చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు ) ఒకేసారి ఏడాదికి ఇవ్వాల్సిన సొమ్మును ముట్టజెప్పి మొత్తం కార్యాలయాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారులపై లేనిపోని నిందలు మోపి విస్తృతంగా ప్రచారం చేయిస్తాడు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో యథాలాపంగా మాట్లాడుతున్న అధికారుల వీడియోలను ఫోను లో చిత్రీకరించి అవినీతి మరకను అంటిస్తాడు. చిరు ద్యోగి బారిన పడి పలువురు అధికారులు మానసి క క్షోభకు గురై తిరుపతి నుంచి బదిలీ చేయిం చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఎవరితో కలవ కుండా తమ పని తాము చేసుకుని వెళ్లే అధికారులను సైతం చిరుద్యోగి వదిలిపెట్టడం లేదని పలు వురు సిబ్బంది తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఓ అధికారి ఒంటరిగా కూర్చుని మద్యం తాగుతున్న వీడియోను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని మరికొందరు అధికారులను బెదిరింనట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. -
ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.83 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూన్‌లో 12.83 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్‌లో కరోనా వైరస్ నెమ్మదించడం ఉద్యోగ కల్పనకు దారితీసినట్టు పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నికర సభ్యుల నమోదుతో పోలిస్తే జూన్‌లో 5.09 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌లో 12.83 లక్షల మంది కొత్త సభ్యుల్లో 8.11 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చినవారే. అంటే మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా -
కొడుకు విదేశాలకు వెళ్లాలి.. తెలివిగా 7 కిలోల గోల్డ్ కాయిన్స్ స్వాహా
వడోదర: అప్పులు తీర్చేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు ఓ ఉద్యోగి. అందుకు సులభంగా ఉంటుందని తాను పని చేస్తున్న చోటే చేతి వాటం ప్రదర్శించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కిలోల బంగారాన్ని నగల దుకాణం నంచి మాయం చేసాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విరాల్ సోని వడోదరలో ఓ ప్రముఖ నగల దుకాణంలో కొనేళ్లుగా స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కళ్లేదుటే కోట్ల బంగారం కనపడేసరికి అడ్డదారిలో సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన మనోడికి వచ్చింది. ఇక ఆలస్యం చేయక తెలివిగా తస్కరించడం మొదలెట్టాడు. ఆ విధంగా సోనీ 2016 నుంచి 2021 మధ్య రూ. 4 కోట్ల విలువైన 7.8 కిలోల విలువైన 24 కేరట్ల బంగారు నాణేలను చోరీ చేశాడు. కాగా దొంగలించిన ఈ బంగారం అమ్మడంలో అదే స్టోర్‌లో పనిచేస్తున్న తరజ్ దివాన్ సహకరించాడు. షోరూం క్యాషియర్లకు నకిలీ వోచర్లను సమర్పించి గోల్డ్ కాయిన్స్‌ను సోని చోరీ చేసినట్లు స్టోర్ యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఎప్పటికప్పుడు ముగ్గురు కస్టమర్ల పేర్లతో నకిలీ వోచర్లను ఇస్తుండటంతో అనుమానించిన క్యాషియర్ యజమానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. కాగా అప్పులు తీర్చేందుకు, తన కుమారుడి విదేశీ విద్య కోసం ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. -
జాబు చిన్నది.. జేబు పెద్దది, కోట్లకు పడగెత్తిన చిరుద్యోగి
రాజోలు/పి.గన్నవరం: పంచాయతీ బిల్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి హోదాలో భారీగా అక్రమాస్తులను కూడబెట్టి ఏసీబీకి చిక్కాడు కార్యదర్శి నిమ్మకాయల సూర్యనారాయణ. పంచాయతీ పరిధిలో నిర్మించే అపార్టుమెంట్లు, లేఅవుట్లే ఆయన టార్గెట్. ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి అవినీతి చిరుద్యోగి ఆటకట్టించారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఐదుచోట్ల సోదాలు నిర్వహించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి, వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలతోపాటు, పంచాయతీ కార్యదర్శి నివాసం ఉంటున్న తాటిపాక శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ, మలికిపురం మండలం లక్కవరంలోని బావమరిది, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తోడల్లుడు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. రూ.1.40 కోట్ల ఆస్తులను అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు.1,347 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు, ఒక ఇల్లు, రెండు ప్లాట్లు, 12 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు మోటారు సైకిళ్లు, ఒక కారును, రూ.1.47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న పత్రాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. గతంలోనే ఆర్జన గతంలో రాజోలు మండలం తాటిపాక, పొన్నమండ, కాట్రేనిపాడు, బి.సావరం, వేగివారిపాలెం గ్రామ పంచాయతీల్లో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సూర్యనారాయణ ఆ సమయంలోనే అక్రమార్జనకు పాల్పడినట్టు గుర్తించారు. తాటిపాక వాణిజ్యపరంగా అభివృద్ధి కావడంతో అక్కడ నిర్మించే అపార్టుమెంట్లకు, లే–అవుట్లకు అనుమతి ఇచ్చేందుకు లంచాలు గుంజి ఆస్తులు సంపాదించారు. తాటిపాకలో నిమ్మకాయల సూర్యనారాయణ నివాసం ఉంటున్న శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ తర్వాత పొన్నమండ, కాట్రేనిపాడు, వేగివారిపాలెం, బి.సావరం పంచాయతీల్లో కార్యదర్శిగా పని చేశారు. ఏడాది క్రితం రాజోలు మండలం పొన్నమండ నుంచి పి.గన్నవరం మండలం మానేపల్లి బదిలీ అయ్యారు. ప్రజాప్రతినిధులతో విభేదాలు రావడంతో పి.గన్నవరం మండలానికి బదిలీపై వెళ్లారు. ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లడంతో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. -
ప్రైవేటు కంపెనీలో మేనేజర్.. లాక్డౌన్ దెబ్బకి దొంగగా మారాడు
బెంగళూరు: లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ఉపాధి లేక కూలి పనులు చేసుకోగా, మరికొందరు వారి చదువు కన్నా తక్కువ స్థాయి పని చేస్తూ రోజులు గడుపుతున్నారు, ఇంకొందరు ఉద్యోగ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఓ ఎంబీఏ చదివిన యువకుడి ఉన్న ఉద్యోగం పోవడంతో దొంగగా మారి కటకటలా పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటు చేసుకుంది. అతడు ఎంబీఏ చదివి ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న ఆ యువకుడికి కరోనా దెబ్బతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో చైన్‌స్నాచర్ అవతారం ఎత్తాడు. జయనగర పూర్ణిమా కన్వెన్షన్ హాల్ నుంచి వస్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోయిన షేక్ గౌస్ అనే చోరున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా తన దయనీయ గాథ చెప్పాడు. సార్ నేను ఎంబీఏ పూర్తి చేశా. కరోనా లాక్డౌన్ వల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రూ.35 వేల అప్పు ఉంది. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. వేరే ఉద్యోగాలేవీ దొరకలేదు. దీంతో చైన్‌స్నాచింగ్ చేశానని చెప్పాడు. -
వామ్మో.. కిలాడీ గ్యాంగ్.. ఫైనాన్స్ ఉద్యోగికి మాయమాటలు చెప్పి..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా డబ్బులు కావాలని కోరారు. మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్ఫోన్లను స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు. -
సర్పంచ్ భర్తపై ఇనుపరాడుతో దాడి..
సాక్షి, పెంబి(నిర్మల్): మండలంలోని వేణునగర్ గ్రామ సర్పంచ్ భర్త రమేష్‌పై గ్రామ పారిశుధ్య కార్మికుడు ఆదివారం సాయంత్రం ఇనుప రాడుతో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు రమేష్ వివరాల ప్రకారం.. ప ల్లె ప్రకృతి వనంలో కార్మికుడు సోనేరావు రో డ్డుపై ట్రాక్టర్ నిలిపి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. రోడ్డుపై ట్రాక్టర్ నిలుపవద్దని, పక్కకు పె ట్టుకుని బకెట్‌తో నీళ్లు పోయాలని తెలుపగా సోనేరావు తనచేతిలోని ఇనుపరాడుతో దాడి చేశాడు. తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమేష్ తెలిపాడు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా చేశారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంద శాతం అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది, స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. -
వాల్‌మార్ట్‌లో జింక హల్చల్.. సిబ్బంది భలే కంట్రోల్ చేశారే! వైరల్
మనుషుల అభివృద్ధి పేరుతో నగరాలను విస్తరించూకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలు కూడా జననివాసాలుగా మారుతున్నాయ్.దీని కారణంగా అడవులు తగ్గి జంతువులు నగరాల్లో సంచరించడం ఇటీవల మామూలుగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య కనిపిస్తు అవి బెదురుతూ మనల్ని భయపెడుతున్నాయి. కాగా ఈ సన్నివేశాలు రికార్డు కావడం, నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి తరహాలో ఓ జింక్ వాల్‌మార్ట్‌లోకి రాగా దాన్ని కంట్రోల్ చేయడానికి నానతంటాలు పడ్డాడు ఓ సిబ్బంది. వివరాల్లోకి వెళితే.... విస్కాన్సిన్ వాల్‌మార్ట్‌లో అనుకోని కస్టమర్ రూపంలో ఓ జింక షాపులోకి వచ్చింది. పాపం అక్కడి పరిసరాలు అంతా కొత్తగా ఉండే సరికి కాస్త బెదిరి నానా హైరానా చేసింది. ఇక షాపును ధ్వంసం చేస్తుండడంతో అందులోని ఓ సిబ్బంది మాత్రం ధైర్యంగా ఆ జింకను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో.. జింకను నడవకుండా సిబ్బంది చాకచక్యంగా దాన్ని నియంత్రిస్తూ వ్యవహరించాడు. జంతువు పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా అలానే ఆ సిబ్బంది ఉండగా ఈ క్రమంలో ఇతర సిబ్బంది దాని బయటకు పంపడానికి వెనుక తలుపు తెరిచి పంపేసి హమ్మయ్యా అనుకున్నారు. ఈ ఘటన జూన్ 23 న బారాబూలో జరిగగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. When a deer got loose inside a Wisconsin Walmart, one brave employee pinned it with her bare hands until coworkers could rush to open a back door. According to reports, the deer was then released outside safely. pic.twitter.com/a3rzY9wMkg— NowThis (@nowthisnews) June 30, 2021 -
కొరడా ఝుళిపించిన కలెక్టర్.. డీపీఆర్‌ఓపై చర్యలు
సాక్షి, యాదాద్రి(నల్లగొండ): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి పద్మపై కలెక్టర్ పమేలా కొరడా ఝుళిపించారు. హెచ్చరిస్తున్నా అలసత్వం వీడకపోవడంతో గురువారం ఆమెను సమాచార శాఖ (ఐఆండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ బాధ్యతలు తీసుకున్న తొలిరోజునుంచే సీరియస్‌గా దృష్టి సారించారు. వారం రోజులు గడుస్తున్నా కొందరిలో మార్పు రాకపోవడాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా డీపీఆర్‌ఓపై తొలి వేటు వేశారు. జిల్లా యంత్రాంగంలో దడ జిల్లాలో పని చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు చాలామంది స్థానికంగా నివాసం ఉండ డం లేదు. ఇతర జిల్లాల నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. కలెక్టర్ బాధ్యతలు చేపట్టాగానే ఈ విషయంపై దృష్టి సారించారు. తొలిరోజే అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, నాల్గో తరగతి ఉద్యోగుల్లో స్థానికంగా నివాసం ఉండనివారి వివరాలనుసేకరించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిపోతున్న అధికా రులను గుర్తించారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలస్థాయి అధికారులు, సిబ్బంది సమయపాల న పాటించకుండా రాకపోకలు సాగించడం, ప్రజల కు అందుబాటులో ఉండకపోవడంతో చక్కదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 12గంటల వరకు విధులకు హాజరుకాకపోవడం, మధ్యాహ్నం 3 కాగానే వెళ్లిపోయే వారందరి వివరాలను సేకరించినట్లు తెలిసింది. మరికొందరిపైనా వేటు పడనుందా? డీపీఆర్ఓను సరెండర్ చేయడం ద్వారా నిర్లక్ష్యం వహించే ఉద్యోగుల విషయంలో తన వైఖరి ఏమిటో కలెక్టర్ చెప్పకనేచెప్పారు. ఇప్పటికే సుమారు ఐదుగురి వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, స్థానికంగా ఉండకపోవడం, సమాచారం లేకుండా జిల్లాను విడిచివెళ్తున్న వారిపై నిఘా ఉంచారు. వర్షాకాలం కావడంతో వరదలు వచ్చిన సమయంలో అధికారులు స్థానికంగా లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆమె ఇప్పటికే సమావేశంలో వివరించారు. దీంతోపాటు పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా పక్కాగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మార్పురానివారు ఎంత టి వ్యక్తులైనా సరే చర్యలు తప్పవని.. డీపీఆర్ఓ అ టాచ్తో చెప్పకనే చెప్పిందని అధికార వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. నిర్లక్ష్యానికి మూల్యం! సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటన, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పనుల పరి శీలన, వాసాలమర్రిలో గ్రామసభ, సహపంక్తి భోజనం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఉండగా డీపీఆర్ఓ అందుబాటులో లేకుండాపోయారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కలెక్టర్ నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మూడు రోజులు సెలవుపై వెళ్లారు. తన సి బ్బంది ద్వారా కలెక్టర్ చాంబర్లో విధులు నిర్వహించే ఉద్యోగికి సెలవు పత్రం అందజేసి వెళ్లారు. చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి పర్యటనకోసం వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నా సమాచార శాఖ పరంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్లక్ష్యం చేశారని కలెక్టర్ ఆగ్రహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గురువారం విధులకు హాజరైన డీపీఆర్ఓ పద్మకు.. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సిబ్బంది అందజేశారు. దీంతో ఆమె తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.