
రెడ్దిట్ వేదికగా.. చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులో జరిగే సంఘటనలు, అనుభవాలను మాత్రమే కాకుండా సమస్యలను కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగి తమ హెచ్ఆర్ నుంచి వచ్చిన వింతైన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.
''ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితుల కోసం కేటాయిస్తున్నావు. కాబట్టి మీ బాధ్యతలను తగ్గిస్తున్నాము. మీ పోస్ట్ అలాగే ఉంటుంది. పని తక్కువైంది కాబట్టి.. జీతం తగ్గిస్తున్నాము'' అని హెచ్ఆర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌లో ఉండటం చూడవచ్చు.
ఈ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫిసులలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని చెబుతున్నారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించకపోతే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. కంపెనీ మీకు లేఆఫ్ నోటీసు ఇవ్వకపోవడం మీ అదృష్టం.. అని ఒక వినియోగదారు అన్నారు.

ఆఫీసులలో జరుగుతున్న అకృత్యాలు అంతా.. ఇంతా కాదు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.
ఇదీ చదవండి: 'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్
నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment