బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ఇటీవల సరిగా లేదన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పడుతూ దివాళ అంచుకు వెళుతున్నాయి. కొందరు యజమానులు తమ కంపెనీలను మూసివేస్తున్నారు కూడా. తాజాగా ఓ ప్రముఖ రీటైలర్ సంస్థ కూడా భారీగా నష్టాలు రావడంతో దివాళ అంచుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. యూకే లో వస్తువులను చవగ్గా విక్రియిస్తూ మధ్యతరగతికి చేరువైన విల్కో రిటైల్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది.
కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్రమాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2021 డిసెంబర్‌లో ప్రారంభమైన వడ్డీ రేట్ల పెంపుల పెంపు, రిటైలర్ బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల అనుగుణంగా వ్యాపారాన్ని నడపలేకపోవడం కారణంగా ఈ సంస్థ వ్యాపారం క్షీణిస్తూ వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ తరహా సంస్థలు కొన్ని లాభాల బాటలో నడిపాయి.
విల్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జాక్సన్ మాట్లాడుతూ.. "ఇది చాలా ఆందోళన చెందాల్సిన అంశం. విల్కోలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు వారి ఉపాధిపై భయాలను తొలగించడంతో పాటు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికే కంపెనీ చర్యలు ప్రారంభించిందని అన్నారు. మరో వైపు విల్కో ఇప్పటికే రీస్ట్రక్చరింగ్ సంస్థ హిల్కో నుంచి 40 మిలియన్ పౌండ్లను రుణంగా తీసుకుంది. ఆ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో కోత, యాజమాన్యంలో మార్పులను చేయాల్సి ఉంటుంది. అలాగే మరీ భారంగా పరిణమించిన శాఖలను విక్రయించడం ద్వారా కొన్ని నిధులను సేకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టోర్లలో చాలా చోట్ల ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మళ్లీ విల్కో పాత వైభవం వస్తుందా లేదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment