retail shops
-
రిటైల్ మాల్స్ భారీ విస్తరణ.. వేల కోట్ల పెట్టుబడి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు వచ్చే 3–4 ఏళ్లలో 30–35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జోడించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విస్తరణకు ర.20,000 కోట్ల వ్యయం చేయనున్నారని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడింంది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాలు బాగా పుంజుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. 17 నగరాల్లోని 28 మాల్స్ నుంచి సేకరించిన సవచారం ఆధారంగా ఈ నివేదిక రపుదిద్దుకుంది. లీజుకు ఇవ్వగలిగే 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి విస్తరించాయి. ‘రిటైల్ మాల్ ఆపరేటర్ల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో మూడింట ఒక వంతు నతనంగా తోడు కానుంది. కొత్తగా తోడయ్యే స్థలంలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉంటుంది. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల వెలుపల డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మాల్స్ ఆదాయం మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే 125 శాతం ఉండనుంది’ అని నివేదిక వివరించింది. స్థిరంగా క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్.. ‘మాల్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ ఈక్విటీ, గ్లోబల్ పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 15–20 శాతం నిధులు వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం వృద్ధిని సాధించిన తరువాత మాల్ యజమానులు 2023–24లో 7–9 శాతం ఆదాయ వృద్ధితో వరుసగా రెండవ సంవత్సరం అధిక పనితీరును కనబరిచే అవకాశం ఉంది. ఈ బలమైన పనితీరు మాల్స్ 95 శాతం ఆరోగ్యకర ఆక్యుపెన్సీని కొనసాగించడంలో సహాయపడింది. కస్టమర్ల రాక విషయంలో మల్టీప్లెక్స్‌లు సాధారణంగా మాల్స్‌కు బలమైన పునాది. మెరుగైన కంటెంట్ లభ్యతతో ఈ విభాగం ఆరోగ్యకర పనితీరును కనబరుస్తోంది’ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంత బ్యాలెన్స్ షీట్స్‌తో పాటు గణనీయంగా పెట్టుబడి ప్రణాళికలు ఉన్నప్పటికీ మాల్ యజమానుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. 28 మాల్స్‌కు మొత్తం రూ.8,000 కోట్ల రుణాలు ఉన్నాయి. -
దివాళ అంచున ప్రముఖ సంస్థ.. 12 వేల మంది ఉద్యోగులు ఇంటికి?
బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ఇటీవల సరిగా లేదన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పడుతూ దివాళ అంచుకు వెళుతున్నాయి. కొందరు యజమానులు తమ కంపెనీలను మూసివేస్తున్నారు కూడా. తాజాగా ఓ ప్రముఖ రీటైలర్ సంస్థ కూడా భారీగా నష్టాలు రావడంతో దివాళ అంచుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. యూకే లో వస్తువులను చవగ్గా విక్రియిస్తూ మధ్యతరగతికి చేరువైన విల్కో రిటైల్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్రమాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2021 డిసెంబర్లో ప్రారంభమైన వడ్డీ రేట్ల పెంపుల పెంపు, రిటైలర్ బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల అనుగుణంగా వ్యాపారాన్ని నడపలేకపోవడం కారణంగా ఈ సంస్థ వ్యాపారం క్షీణిస్తూ వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ తరహా సంస్థలు కొన్ని లాభాల బాటలో నడిపాయి. విల్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జాక్సన్ మాట్లాడుతూ.. "ఇది చాలా ఆందోళన చెందాల్సిన అంశం. విల్కోలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు వారి ఉపాధిపై భయాలను తొలగించడంతో పాటు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికే కంపెనీ చర్యలు ప్రారంభించిందని అన్నారు. మరో వైపు విల్కో ఇప్పటికే రీస్ట్రక్చరింగ్ సంస్థ హిల్కో నుంచి 40 మిలియన్ పౌండ్లను రుణంగా తీసుకుంది. ఆ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో కోత, యాజమాన్యంలో మార్పులను చేయాల్సి ఉంటుంది. అలాగే మరీ భారంగా పరిణమించిన శాఖలను విక్రయించడం ద్వారా కొన్ని నిధులను సేకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టోర్లలో చాలా చోట్ల ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మళ్లీ విల్కో పాత వైభవం వస్తుందా లేదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. చదవండి టెక్ మహీంద్రా కీలక నిర్ణయం .. ఆనందంలో ఉద్యోగులు -
Telangana: వ్యాపారులకు శుభవార్త.. ఇక 24 గంటలూ షాపులు తెరవొచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని జీవో జారీ చేశారు. తదనుగుణంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988కు సవరణలు చేసినట్టు తెలిపారు. 24 గంటలపాటు దుకాణం తెరిచి ఉంచేందుకు గాను ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే ఈ జీవో అమలులో ఈ కింది పది నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఐడీ కార్డులు జారీ చేయాలి వారాంతపు సెలవు ఇవ్వాలి వారంలో కచ్చితమైన పనిగంటలు ఉండాలి ఓవర్ టైమ్‌కు వేతనం చెల్లించాలి పండుగలు, సెలవు దినాల్లో పని చేసినవారికి కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి మహిళా ఉద్యోగులకు తగిన వేతనం ఇవ్వాలి రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల అంగీకారం తీసుకోవాలి.. రవాణా సదుపాయం కల్పించాలి రికార్డులను సరిగా మెయింటైన్ చేయాలి పోలీస్‌యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
పాడుబడిన భవంతిని రూ.5.16 కోట్లు పలికేలా చేసింది
వేల్స్/లండన్: ఓ మహిళ పాడుపడిన తన రిటైల్ షాపును అందమైన భవంతిగా మార్చింది. ఒకప్పుడు దాన్ని కొనడం కాదు కదా కనీసం చుడ్డానికి కూడా ఇష్టపడని వారు.. ఇప్పుడు ఆ భవంతికి కోట్లు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ వివరాలు.. యూకే వేల్స్‌కు చెందిన ఎలిజబెత్ అనే మధ్య వయసు మహిళకు ఓ చిన్న రిటైల్ షాప్ ఉంది. ఏళ్ల క్రితం నాటి దుకాణం కావడంతో పాడు పడింది. అమ్మకానికి పెట్టినా పెద్దగా డబ్బులు రావు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఆ షాప్‌ని అమ్మడం ఎలిజబెత్‌కు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఎలిజబెత్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ షాపును కూల్చివేసి ఆ స్థలంలో తన కలల సౌధం నిర్మించాలనుకుంది. ఈ క్రమంలో కేవలం ఆరు వారాల్లోనే తనకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకుంది. మూడు బెడ్రూంలు, ఒపెన్ కిచెన్, లాంజ్, గార్డెన్లతో అందమైన ఇంటిని నిర్మించుకుంది ఎలిజబెత్. అయితే ఈ ఇంటి నిర్మాణం అనుకున్నంత సులభంగా జరగలేదన్నారు ఎలిజబెత్. తన షాప్ ఉన్న స్థలంలో ఎలాంటి సౌకర్యలు ఉండకపోగా చాలా మురికిగా.. తేమగా ఉండేదని తెలిపారు. అయితే ఇవేవి ఎలిజబెత్‌ను ఆపలేకపోయాయి. ఇంటిని నిర్మించాలనుకున్న ఆమె సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతులు పొందారు. ఆ తర్వాత కాంట్రాక్టర్స్‌ని సంప్రదించారు. ఇక ఎలిజబెత్ న్యూటన్ బీచ్‌కు చాలా దగ్గరగా ఉండటంతో తీరప్రాంత అనుభూతి పొందాలనుకున్నారు. దీని గురించి తన ఆర్కిటెక్ట్ పీటర్ లీతో చర్చించారు. ఈ క్రమంలో అతను బోట్‌హౌస్ డిజైన్‌లో ఆమె ఇంటిని నిర్మించాడు. ఇక ఇంటి నిర్మాణం అంతా పర్యావరణ హితంగా సాగింది. కేవలం ఆరు వారాల వ్యవధిలో పాడుబడిన బిల్డింగ్ స్థానంలో అత్యద్భతమైన ఇంటిని నిర్మించారు. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ఈ ఇల్లు 5,00,000 పౌండ్స్ (రూ.5.16 కోట్లు) ధర పలుకుతుంది. అంతకంటే ఎక్కువ రావచ్చంటున్నారు ఎలిజబేత్. చదవండి: అవును, 139 ఏళ్ల భవనం రోడ్డు దాటుతోంది! -
జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 130 ప్రాంతాల్లో 2021-22లో అభివృద్ధి చేయాలని లక్ష్యించినట్లు. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలలో ప్రతి 30-50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్‌లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్‌షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్‌లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. స్థలాల గుర్తింపు, ఆదాయ ప్రణాళికలు, స్థానిక అనుకూలతలు, సౌకర్యాల డిజైన్ రూపకల్పన వంటి అంశాలపై ఎన్హెచ్ఏఐ నిమగ్నమైంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
'యూజ్ మీ' ఇట్స్ లోకల్ గురూ!
ఆన్లైన్ కొనుగోళ్లకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రముఖ సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లోని దుకాణాలు అందుబాటులో ఉండే యాప్స్ ఉన్నాయా? వాటిలో ధరలు సరిపోల్చుకునే అవకాశం ఉందా? అంటే ఉంది. సరికొత్తగానగరవాసులకు పరిచయమైనయూజ్ మీ యాప్‌తో ఇవి సాధ్యమే. సాక్షి, సిటీబ్యూరో :నగరానికి చెందిన సంజయ్ కప్పగంతుల మెకానికల్ ఇంజినీర్. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో నాలుగేళ్లు పనిచేసి 1999లో అమెరికా వెళ్లాడు. 13ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకొని 2013లో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ కంటే సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ ఏదైనా తీసుకురావాలని ఆలోచించాడు. ఒక్క ఫోన్‌కాల్‌తో అన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే జస్ట్ డయల్ లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ఫీడ్‌బ్యాక్ ప్రధాన సమస్య అని గుర్తించి ‘యూజ్ మీ’ యాప్ రూపొందిచినట్లు సంజయ్ చెప్పారు. యూజర్స్–వెండర్స్ కనెక్ట్.. ‘ఆన్లైన్ సేవల విషయంలో ఇప్పటికే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా పెద్ద దుకాణాలు, ప్రముఖ సేవల సంస్థలే అందుబాటులో ఉంచారు. మన దగ్గర్లోని కిరాణ దుకాణాలు, స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్స్, బైక్ మెకానిక్ సెంటర్స్, ప్లంబర్ తదితర అందులో ఉండవు. 70 శాతం మంది ఇలాంటి అవసరాలున్నవారే ఉన్నారు. పైగా వినియోగదారుడికి, దుకాణాదారుకు మధ్య అనుసంధానం ఉండదు. అందుకే ‘యూజ్ మీ’ యాప్ రూపొందించాం. యూజర్స్, వెండర్స్‌ను కనెక్ట్ చేశాం. ప్రస్తుతం చాటింగ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అందుకే చాట్ ద్వారానే ఈ ప్రకియ పూర్తి చేసేలా యాప్‌ను తీర్చిదిద్దామ’ని సంజయ్ వివరించారు. గల్లీ కొట్టులో కొనుగోలు చేయొచ్చు... ‘ఈ యాప్ సహాయంతో వినియోగదారులకు సమీపంలోని వ్యాపార సంస్థలు, సేవలందించే వాటి వివరాలు జీపీఎస్ ఆధారంగా తెలియజేస్తున్నాం. తద్వారా నచ్చిన సేవలు పొందొచ్చు. సేవలు, వ్యాపార విధానంలో ఇదో విప్లవాత్మక మార్పు. సమీపంలోని కిరాణా దుకాణాలకు ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు కొనుగోలు చేయబోయే వస్తువును ఇతర దుకాణాల్లో ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఈ తరహా సేవలందించే వాళ్లు ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా వద్ద 56 కేటగిరీలు, 3 లక్షల వెండర్ల డాటా ఉంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత నెలలో హైదరాబాద్, విజయవాడలో ప్రారంభించాం. మా సేవలకు సానుకూల స్పందన వస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యాప్ తీసుకురానున్నామ’ని చెప్పారు సంజయ్. -
రిటైల్ షాపులకు వారాంతపు సెలవుల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిటైల్ షాపులకు వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గతంలో వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా ప్రస్తుతం అమలులో ఉన్న వారం రోజులు పని చేసే నిబంధననే మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆదేశాలి చ్చింది. ఈమేరకు బుధవారం కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కార్మికుల నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున, 48 గంటలు పని పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా వారాంతపు సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఆఫ్లైన్లోనూ మొబైల్స్ చౌకే...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ బూమ్ పుణ్యమాని భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారం జోరు మీద ఉంది. భారీ డిస్కౌంట్లు అంటూ కొన్ని ఆన్లైన్ కంపెనీలు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో కొనే కస్టమర్లు పెరిగిపోతున్నారు. దీంతో సంప్రదాయ రిటైల్ షాపులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆన్లైన్ కంపెనీలకు పోటీగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో సింహభాగం కైవసం చేసుకున్న మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇంతే. ప్రముఖ ఆన్లైన్ కంపెనీలకు దీటుగా మొబైల్ షాపులు పలు మోడళ్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మధ్య ధరల వ్యత్యాసం కేవలం 5 శాతమేనని మొబైల్ రీసెర్చ్ కంపెనీ 91మొబైల్స్.కామ్ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. కామర్స్ సైట్ల వైపుకు.. డిస్కౌంట్లపై సాధారణంగా వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారు. ఈ అంశమే ఈ-కామర్స్ కంపెనీలకు కలసి వస్తోంది. కొన్ని రకాల ఉత్పత్తులను ఊహించనంత తక్కువ ధరకే విక్రయిస్తున్న పోర్టళ్లు.. భారీ డీల్స్‌ను ప్రకటించినప్పుడు వ్యూహాత్మంగా ముందుకెళ్తున్నాయి. కొన్ని నిమిషాల్లోనే స్టాక్ లేదు (ఔట్ ఆఫ్ స్టాక్) అనే బోర్డు తగిలిస్తున్నాయి. ఒక ఉత్పాదన దొరక్కపోతే మరో ఉత్పాదనవైపు వినియోగదారులు మళ్లుతారన్నది కంపెనీల భావన. అందుకు తగ్గట్టే డిస్కౌంట్ల వేటలో నెటిజన్లు ఇతర వెబ్సైట్లనూ జల్లెడ పడుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయన్న కారణంగా అవసరం లేని వస్తువులనూ కొనుగోలు చేస్తున్నారు. పోర్టళ్లలో ధరలు గంటగంటకూ మారుతున్నాయి. కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనేముందు బ్రాండ్, ధర పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. బెస్ట్ డీల్స్ రిటైల్ షాపుల్లోనూ.. ఆన్లైన్ అనగానే భారీ డిస్కౌంట్లకు దొరుకుతాయన్న ప్రచారం ఉంది. వాస్తవానికి బెస్ట్ డీల్స్‌ను రిటైల్ స్టోర్లు సైతం అందిస్తున్నాయి. దీనికితోడు 100 శాతం విక్రయానంతర సేవ ఔట్లెట్ల ప్రత్యేకమని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరమే లేదు. క్షణాల్లో కస్టమర్ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. మోడళ్లను స్వయంగా పరిశీలించొచ్చు’ అన్నారు. 15 రోజుల ట్రయల్ పీరియడ్లోగనుక ఫోన్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చి కొత్తది తీసుకునే అవకాశాన్ని కూడా బిగ్ సి కల్పిస్తోందని చెప్పారు. ఆన్లైన్ కంపెనీలు కొన్ని ఉత్పత్తులను మాత్రమే భారీ డిస్కౌంట్లకు ఆఫర్ చేస్తున్నాయని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. ఈ భారీ డీల్‌లో లాభపడేది అతికొద్ది మంది కస్టమర్లు మాత్రమేనని అన్నారు.