హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్స్‌.. రిటైల్‌ స్పేస్‌కు గిరాకీ | Retail space demand in Hyderabad Cushman Wakefield | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్స్‌.. రిటైల్‌ స్పేస్‌కు గిరాకీ

Published Sun, Feb 9 2025 9:46 AM | Last Updated on Sun, Feb 9 2025 10:58 AM

Retail space demand in Hyderabad Cushman Wakefield

గతేడాది హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి (Real estate) బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్‌ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ క్రమంగా పెరుగుతోంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌(సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయని తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ.విస్తీర్ణంలో 11 షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

సిటీలో మూడు మాల్స్‌ 
గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. పుణె, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కత్తాలో ఒక్క మాల్‌ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ.షాపింగ్‌ మాల్‌ స్పేస్‌ మార్కెట్‌లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది.

నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. కూకట్‌పల్లి 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్‌ మాల్స్‌ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.

5–25 శాతం పెరిగిన అద్దెలు 
నగరంలో ఫ్యాషన్, హైపర్‌ మార్కెట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ వంటి విభాగాల పనితీరు బాగుండటంతో రిటైల్‌ స్పేస్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా కొంపల్లి, కోకాపేట, ఏఎస్‌రావ్‌ నగర్, నల్లగండ్ల, వనస్థలిపురం, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంపల్లి, కొత్తపేట, మాదాపూర్‌ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు పెరిగాయి. గత కొన్ని త్రైమాసికాలలో ఆయా ప్రాంతాలలో అద్దెలు 5–25 శాతం మేర వృద్ధి చెందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement