Viral: Woman Remodels Her Old Retail Shop Into Modern House, Cost Will Amaze You - Sakshi
Sakshi News home page

పాడుబడిన భవంతిని రూ.5.16 కోట్లు పలికేలా చేసింది

Published Thu, Jun 17 2021 12:05 PM | Last Updated on Thu, Jun 17 2021 3:24 PM

Wales Woman Transforms A Derelict Retail Store Into Rs 5.16 Crore Home - Sakshi

వేల్స్‌/లండన్‌: ఓ మహిళ పాడుపడిన తన రిటైల్‌ షాపును అందమైన భవంతిగా మార్చింది. ఒకప్పుడు దాన్ని కొనడం కాదు కదా కనీసం చుడ్డానికి కూడా ఇష్టపడని వారు.. ఇప్పుడు ఆ భవంతికి కోట్లు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ వివరాలు.. యూకే వేల్స్‌కు చెందిన ఎలిజబెత్‌ అనే మధ్య వయసు మహిళకు ఓ చిన్న రిటైల్‌ షాప్‌ ఉంది. ఏళ్ల క్రితం నాటి దుకాణం కావడంతో పాడు పడింది. అమ్మకానికి పెట్టినా పెద్దగా డబ్బులు రావు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఆ షాప్‌ని అమ్మడం ఎలిజబెత్‌కు ఇష్టం లేదు.

ఈ క్రమంలో ఎలిజబెత్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ షాపును కూల్చివేసి ఆ స్థలంలో తన కలల సౌధం నిర్మించాలనుకుంది. ఈ క్రమంలో కేవలం ఆరు వారాల్లోనే తనకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకుంది. మూడు బెడ్రూంలు, ఒపెన్‌ కిచెన్‌, లాంజ్‌, గార్డెన్‌లతో అందమైన ఇంటిని నిర్మించుకుంది ఎలిజబెత్‌. అయితే ఈ ఇంటి నిర్మాణం అనుకున్నంత సులభంగా జరగలేదన్నారు ఎలిజబెత్‌. తన షాప్‌ ఉన్న స్థలంలో ఎలాంటి సౌకర్యలు ఉండకపోగా చాలా మురికిగా.. తేమగా ఉండేదని తెలిపారు. 

అయితే ఇవేవి ఎలిజబెత్‌ను ఆపలేకపోయాయి. ఇంటిని నిర్మించాలనుకున్న ఆమె సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతులు పొందారు. ఆ తర్వాత కాంట్రాక్టర్స్‌ని సంప్రదించారు. ఇక ఎలిజబెత్‌ న్యూటన్ బీచ్‌కు చాలా దగ్గరగా ఉండటంతో తీరప్రాంత అనుభూతి పొందాలనుకున్నారు. దీని గురించి తన ఆర్కిటెక్ట్ పీటర్ లీతో చర్చించారు. ఈ క్రమంలో అతను బోట్‌హౌస్ డిజైన్‌లో ఆమె ఇంటిని నిర్మించాడు. ఇక ఇంటి నిర్మాణం అంతా పర్యావరణ హితంగా సాగింది. కేవలం ఆరు వారాల వ్యవధిలో పాడుబడిన బిల్డింగ్‌ స్థానంలో అత్యద్భతమైన ఇంటిని నిర్మించారు. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ఈ ఇల్లు 5,00,000 పౌండ్స్‌ (రూ.5.16 కోట్లు) ధర పలుకుతుంది. అంతకంటే ఎక్కువ రావచ్చంటున్నారు ఎలిజబేత్‌.

చదవండి: అవును, 139 ఏళ్ల భవనం రోడ్డు దాటుతోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement