Eco friendly
-
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్‌తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్‌గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్‌గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్‌ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
గోమయం, గోమూత్రంతో : సమాజ హితం కోసం, ప్రకృతికి దగ్గరగా!
‘నా బిడ్డలు ఆరోగ్యంగా జీవించడానికి వారికి నేను ఇలాంటి భూగోళాన్ని ఇస్తున్నానా?’ అని ఆవేదన చెందుతోంది పూజా రాథోడ్. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. సహజమైన వనరులతో ప్రకృతి సిద్ధంగా జీవించడానికి మనమెందుకు సిద్ధంగా ఉండడం లేదు... అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ చెన్నమనేని పద్మ. ఇద్దరి ఆవేదనలోని ఆంతర్యం ఒక్కటే. భూమి చల్లగా ఉంటే మన జీవితాలు ఆనందంగా గడుస్తాయని. భూమాతకు ఎదురవుతున్న పరీక్షలకు సమాధానంగా ఇద్దరూ అనుసరిస్తున్న మార్గం ఒక్కటే. ఒకరిది రాజస్థాన్ రాష్ట్రం, మరొకరిది తెలంగాణ. పర్యావరణం పట్ల వారికి ఉన్న స్పృహ ఒకరితో మరొకరికి పరిచయం లేకపోయినా, ఆలోచనలను పంచుకోకపోయినా... వారిని ఒక దారిలో నడిపిస్తున్నది మాత్రం భూమాత గురించిన శ్రద్ధ, ఆరోగ్యకరమైన జీవనం పట్ల ఆసక్తి మాత్రమే. పూజారాధోడ్ చిత్రకారిణి. పటం మీద బొమ్మలు చిత్రిస్తారు. డాక్టర్ పద్మ ఇంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు చేస్తారు. ఇద్దరూ తమ కళకు ముడిసరుకుగా ఉపయోగిస్తున్నది ప్రకృతి ప్రసాదాలను మాత్రమే. ఎర్ర మట్టి, రంపపు పొట్టు, మొక్కజొన్న పీచు, బొగ్గు, గోరింటాకు, ఆవు పేడ, గులకరాళ్లు, పూలు, వంటల్లో ఉపయోగించే పిండి...వీటికి పూజ క్రియేటివిటీ తోడైతే అద్భుతమైన వాల్ పెయింటింగ్ తయారవుతుంది. పద్మచేతిలో ఆవు పేడ గణపతి, లక్ష్మీదేవి రూపాలవుతుంది.పూజా రాథోడ్...జైపూర్‌లోని ఐఐఎస్యూలో విజువల్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, ‘స్టూడియో ద సాయిల్’ పేరుతో ఆర్ట్ స్టూడియో స్థాపించింది.డాక్టర్ చెన్నమనేని పద్మ... హైదరాబాద్‌లోని వనిత మహావిద్యాలయలో తెలుగు ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. తన విద్యార్థులకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను గమనించిన తర్వాత వాటి పరిష్కారం కోసం చేసిన అన్వేషణ ఇలా సహజ జీవనశైలి, జీవనశైలిలో ఆవు పాత్ర తెలిసి వచ్చాయంటున్నారు. ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత పళ్లు తోముకోవడం నుంచి రాత్రి పడుకునే ముందు దోమలను పారదోలడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్ వరకు రోజు మొత్తంలో ఉపయోగించే అనేక వస్తువులను గోమయం, గోమూత్రంతో తయారు చేసి చూపిస్తున్నారు. వాటి తయారీలో శిక్షణనిస్తున్నారు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, హ్యాండ్ మేడ్ సోప్స్, కీ హోల్డర్స్, ధూప్ స్టిక్స్, జపమాల, వాకిలి తోరణాలు... ఇలా రకరకాల వస్తువులు తయారు చేస్తోందామె.సస్టెయినబుల్ లైఫ్ స్టైల్ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తన రిటైర్మెంట్ జీవితాన్ని అంకితం చేసినట్లు చెప్పారు పద్మ. ఆవును బతికించుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని సాధించవచ్చని నిరూపించాలనేది ఆమె ఆశయం. ఇందుకు ఆవును పెంచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన తర్వాత స్వయంగా రెండు వందల గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. అందుకోసం హైదరాబాద్ నగరాన్ని వదిలి జగిత్యాల జిల్లాలోని సొంతూరు బోర్నపల్లికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు పద్మ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తన గ్రామం నుంచే మొదలుపెట్టారు. ఇదీ చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలుసహజ సిద్ధంగా...ఆవు తనకు చేతులెత్తి మొక్కమని చెప్పదు. తనను ఉపయోగించుకుని ఆరోగ్యంగా జీవించమని కోరుతుంది. అందుకే ఆవును అమ్మతో సమానం అని చెబుతారు. ఆవుతో వచ్చే ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆవును ఎన్ని రకాలుగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవచ్చో తెలియచేయడానికి నెలకు ఐదువందల రూ΄ాయలకు ఒక కిట్ తయారు చేశాను. అందులో ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనింగ్ మెటీరియల్ నుంచి దేహాన్ని శుభ్రం చేసుకునే వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. రసాయన రహితమైన, ప్రకృతి సహజమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం కోసం నా ప్రయత్నం కొనసాగుతోంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచాలంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. నేలను భద్రంగా ఉంచుకోవాలి. రసాయనాలతో నేల కాలుష్యం, నీరు కాలుష్యం కావడంతో మన దేహమూ కాలుష్య కాసారమవుతోంది. క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. – డాక్టర్ చెన్నమనేని పద్మ, విశ్రాంత ఆచార్యులు, సామాజిక కార్యకర్త ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మోడ్రన్ లైఫ్ ఎకో స్టయిల్: వాడి పారేసిన వాటితోనే అద్భుతాలు..!
ఇది ఈశాన్య రాష్ట్రాల మహిళల విజయం. వారు ప్లాస్టిక్, ఇతర ఫైబర్లకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ లాంగ్‌పై పోటరీని క్యాండిల్ తయారీకి మలుచుకున్నారు. పంటను నిల్వచేయడానికి కరెంటుతో పని లేని ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నారు. తమ దగ్గర దొరికే వస్తువులను అది కూడా పర్యావరణహితమైన వస్తువులు, వాడి పారేసిన తర్వాత త్వరగా మట్టిలో కలిసిపోయే వస్తువులతో మోడరన్ లైఫ్‌స్టయిల్‌ని ఎకో ఫ్రెండ్లీగా మారుస్తున్నారు. నాటి కుండల్లో నేటి క్యాండిల్..మణిపూర్ రీజియన్‌లో విస్తరించిన హస్తకళలలో లాంగ్‌పై ఒకటి. నల్లటి మట్టితో కుండల తయారీ అన్నమాట. రిన్ఛోన్ అనే మహిళ లాంగ్‌పై కళను మోడరన్ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా మలుచుకుంది. పరిమళాలను వెదజల్లే సోయా వ్యాక్స్ క్యాండిల్ జార్లు తయారు చేసింది. పారాఫిన్ వ్యాక్స్‌కు బదులుగా సోయా వ్యాక్స్‌ను ఉపయోగిస్తోందామె. సువాసన కోసం పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాని వస్తువులనే వాడుతోంది. ఆ ఉత్పత్తులన్నీ పర్యావరణహితమైనవే కావడంతో వీటికి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ప్రయోగాలను చేస్తోన్న రిన్ఛోన్ వెంచర్ ‘అక్టోబర్ పంప్కిన్’ను రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీ విద్యాసంస్థ ‘ఉమెన్‌ప్రెన్యూర్ ఫర్ భారత్ 2.0 పప్రోగ్రామ్’ కింద 15 లక్షల ప్రోత్సాహకానికి ఎంపిక చేసింది. తాంగ్ఖుల్ ఆదివాసీ తెగకు చెందిన రిన్ఛోన్ తన కుటుంబంలో మాత్రమే కాదు, ఆ తెగలోని తొలితరం ఎంటర్ప్రెన్యూర్.మేఘాలయకు చెందిన వెస్ట్ ఖాసీ హిల్స్‌లో నివసించే బినోలిన్ సైయిమ్లే జీరో ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్ తయారీలో విజయవంతమైంది. కాల్చిన ఇటుకలు, నదిలో దొరికే ఇసుక, వెదురు, సీజీఐ షీట్స్, ఇనుపమేకులు, సిమెంట్, గులకరాళ్లు ఉపయోగించి రైతులకు ఉపయోగపడే స్టోరేజ్ కంటెయినర్స్ తయారు చేసింది. ఇక్కడ రైతుల ప్రధానపంట కూరగాయల సాగు. పంటను కోసి మార్కెట్‌కు తరలించే లోపు పాడయ్యేవి. ఈ స్టోరేజ్ కంటెయినర్ల వల్ల రైతులు పండించిన పంట మార్కెట్‌కు చేరేలోపు పాడయ్యే దుస్థితి దూరమైంది. అర్థవంతమైన వ్యర్థంమరో మహిళ నాగాలాండ్‌కు చెందిన నెంగ్నెథెమ్ హెంగ్నా. ఆమె అరటి నారతో ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేసి పాలిమర్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయాన్ని చూపించింది. టేబుల్ మ్యాట్, కోస్టర్, పండ్లు, కూరగాయలు నిల్వ చేసే బుట్టలు, క్యారీ బ్యాగ్‌ల వరకు పదమూడేళ్లుగా ఆమె తయారు చేస్తున్న అరటినార వస్తువులు దేశమంతటా విస్తరించాయి. ఇక అస్సామీయులు పడవ తయారీలో ప్రయోగం చేశారు. నాటుపడవలను చెక్కతో తయారు చేస్తారు. మన్నిక దృష్ట్యా వాటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్ బోట్స్ వాడుకలోకి వచ్చాయి. వీటికి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని వెదురుతో కనుక్కున్నారు. ఈ ఇన్నోవేటివ్ బోట్స్ తయారీలో 85 శాతం వెదురు, పది శాతం పాలిమర్, ఐదు శాతం ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. ఈ పడవలు పదిహేనేళ్లపాటు మన్నుతాయి. పాడైన తర్వాత ఈ విడిభాగాలు భూమిలో కలిసిపోతాయి. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ఎలాంటి ఉత్పత్తులు వాడాలో చెప్పిన మంత్రి
పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రజలు దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చన్నారు. ఫలితంగా పర్యావరణ సంబంధిత సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గోయల్ మాట్లాడారు.‘ప్రస్తుత జీవన శైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్‌కు ఇది కీలకం. వినియోగ ధోరణలను చక్కదిద్దుకోకపోతే సుస్థిర, పర్యావరణ సవాళ్లకు పరిష్కారం లభించదు. తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే పూర్తిగా పర్యావరణ సవాళ్లు వస్తున్నట్లు భావించకూడదు. వినియోగం కూడా అందుకు కారణం. వినియోగ డిమాండ్‌పైనే తయారీ ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!వినియోగ ధోరణుల్లో మార్పు రావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పర్యావరణ విధ్వంసానికి దక్షిణాది దేశాలు కారణం కాదని..ఇందులో అభివృద్ధి చెందిన దేశాల పాత్రం ప్రధానమని చెప్పారు. అవి చౌక ఇంధనాలను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఇటలీ, భూటాన్, బహ్రెయిన్, అల్జీరియా, నేపాల్, సెనెగల్, దక్షిణాప్రికా, మయన్మార్, ఖతార్, కంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. -
ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!
బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ మధ్యనే జూలై లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి, ఏడాది క్రితం వరకు ఆమె – పిల్లల్ని అస్సలు కనకూడదనే అనుకున్నారు! ఆమెలోని ఎకో యాంగ్జైటీనే అందుకు కారణం. ‘ఇంతటి విపరీతమైన వాతావరణ మార్పుల్లో పిల్లల్ని భూమి మీదకు తెచ్చిపడేయటం ఎలారా దేవుడా.. ‘అని ఆకాశం వైపు దీనంగా చూసేవారట రిచా. ఉదయ లేస్తూనే భూతాపం గురించి ఆలోచించటం, లేచాక కిటికీ లోంచి పొల్యూషన్ లోని తీవ్రతను అంచనా వేయటం రిచాకు అలవాటైపోయింది. ‘మొన్నటి వరకు అతి వేడి. ఇప్పుడు అతి చలి. ఈ మార్పులు నా బిడ్డపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాను. తనకు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ వే. అలాంటి కొన్ని బేబీ ఐటమ్స్ ని నా స్నేహితురాళ్లు దియా మీర్జా, సోహా అలీ ఖాన్, ఇంకా నా పేరెంటల్ యోగా ఇన్స్ట్రక్టర్ నాకు కానుకగా ఇచ్చారు. నా చుట్టూ వాళ్లంతా నా ఆందోళనను కనిపెట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా పాప పెంపకంలో నాకు తోడ్పడుతున్నారు. టిప్స్ ఇస్తున్నారు’ అని ‘ఓగ్స్ ఇండియా‘కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు రిచా. ఇక ఆమె భర్త అలీ ఫజల్ గురించి చెప్పే పనే లేదు. ఈ ’మీర్జాపుర్ ’ యాక్టర్.. సింగిల్ యూస్ లాస్టిక్కి ఎప్పట్నుంచో వ్యతిరేకి. భార్యాభర్తలు షాపింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ యాకేజీల్లో ఏ రూపంలోనూ ప్లాస్టిక్ అన్నదే ఉండదు. బిడ్డ పుట్టాకయితే వాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. పిల్లలు పుట్టక ముందు నుంచే, పుట్టబోయేవారి సంరక్షణ గురించి, వారి కోసం భూతాపాన్ని తమ వంతుగా తగ్గించటం గురించి ఆలోచించే ఇటువంటి తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. భూమి తల్లి వారిని చల్లగా చూస్తుంది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు. -
సిటీ.. గో గ్రీన్
హరితభవనాలుగా నివాస, వాణిజ్య, కార్యాలయాలుస్వచ్ఛమైన గాలి.. ఫుల్ వెంటిలేషన్.. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఇలా ప్రకృతితో కలిసి జీవించడం అంటే కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో కష్టమే. స్థలాభావం, నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం ఇలా కారణాలనేకం. కానీ కరోనా తర్వాత నివాసితుల అభిరుచి మారింది. ఇళ్లు, ఆఫీసు, షాపింగ్‌మాల్,మెట్రోరైల్.. ఇలా ఒకటేమిటి ప్రతీది హరితంగానే ఉండాలని కోరుకుంటున్నారు. సాక్షి హైదరాబాద్హరిత భవనాల్లో ఏముంటాయంటే..సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌తో 20–30 శాతం విద్యుత్, 30–40 శాతం నీరు ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. జీవవైవిధ్యం, సహజ వనరుల పరిరక్షణతో మెరుగైన గాలి నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు. ల్యాండ్ స్కేపింగ్, వరి్టకల్ గార్డెనింగ్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, ఎస్టీపీ, రూఫ్‌టాప్ సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి.షేక్‌పేట, కోకాపేట, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శామీర్‌పేట, పటాన్చెరు ఇలా నగరం నలువైపులా ఈ హరిత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ ధరలు విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.4,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణాలు 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటున్నాయి.హైదరాబాద్‌లో 890 ప్రాజెక్టులు2001లో దేశంలో 20 వేల చదరపు అడుగుల్లో (చ.అ.)కేవలం ఒక్కటంటే ఒక్కటే హరిత భవనం ఉండగా, ప్రస్తుతం 1,175 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 13,722 భవనాలు ఉన్నాయి. ఇందులో 120కు పైగా నెట్‌జీరో బిల్డింగ్లే ఉన్నాయి. హైదరా బాద్‌లో 114 కోట్ల చ.అ.ల్లో 890 ప్రాజెక్టుల పరిధిలో హరిత భవనాలుండగా, ఇందులో నివాస, వాణిజ్య భవనాలే కాదు స్కూళ్లు, ఫ్యాక్టరీలూ ఉన్నాయి. అపర్ణాసరోవర్, రెయిన్బో విస్టాస్, మైహోమ్ అవతార్, బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్ సైబర్ కాలనీ, రహేజా విస్టాస్‌లు గ్రీన్ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి.తొలిముద్ర నగరానిదే..⇒ హరిత భవనాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేకస్థానం. గృహాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, రైలు, మెట్రోస్టేషన్లు, ఫ్యాక్టరీలు, ఐటీ టవర్లు, విద్యాసంస్థలు ఇలా 31 విభాగాలలో హరిత భవనాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రేటింగ్ ఇస్తుంది. వీటిల్లో తొలి రేటింగ్ పొందిన భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్గాగుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరితభవనంగా గచి్చ»ౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ⇒ ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెరి్మనల్గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. ⇒ తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా, కొత్తగా నిర్మించిన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం కూడా ఐజీబీసీ రేటింగ్స్ అందుకున్నాయి.రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా.. హరిత భవనాలను ప్రోత్సహించేందుకు దేశంలో 11 రాష్ట్రాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పరి్మట్ ఫీజులో 20 శాతం, స్టాంప్ డ్యూటీ సర్చార్జ్లో 20 శాతం తగ్గుదల ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. సిడ్బీ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది. ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు, ఐటీ టవర్లు, రైలు, మెట్రోస్టేషన్లు ఇలా 31 విభాగాల్లో తొలి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో హరితభవనాలకు ప్రభుత్వం నుంచి రాయితీ, ప్రోత్సాహకాలు లేవు.తెలంగాణలో ఐజీబీసీ ప్రాజెక్టులలో కొన్ని..⇒ దుర్గంచెరు, పంజగుట్ట, ఎల్బీనగర్ సహా 17 మెట్రోస్టేషన్లు ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రైల్వే నిలయం ⇒ కాచిగూడ రైల్వేస్టేషన్ ⇒ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ గ్రీన్ విలేజ్ ⇒ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ⇒ సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లు ⇒ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట) ⇒ ఇనార్బిట్ మాల్, నెక్సస్ షాపింగ్‌మాల్⇒ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జేయూఎన్టీయూహెచ్ (సుల్తాన్పూర్) ⇒ క్యాప్‌జెమినీ కార్యాలయం ⇒ హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ (తూంకూరు) ⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంగ్రీన్ బిల్డింగ్స్ ఉద్యమంలా చేపట్టాలి ఏ తరహా నిర్మాణాలైనా సరే హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ బిల్డింగ్స్‌ను బిల్డర్లు ఉద్యమంలా నిర్మించాలి. హరిత భవనాల గురించి నగరంతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలకు అవగాహన కలి్పంచేలా పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలి. - శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడుహరిత భవనాలను కోరుకుంటున్నారు హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటికి రాగానే చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుండటంతో గ్రీన్ బిల్డింగ్స్‌లను కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. - ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ఎండీ -
హాయి హాయిగా... కూల్ కూల్‌గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్‌ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్‌గా ప్రయాణిస్తున్నారు. -
ఎకో ఫ్రెండ్లీ దీపావళికి పిలుపునిచ్చిన విశాఖ కార్పోరేషన్
-
తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..
ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంతోమంది ఎన్నో రకాల పర్యావరణ హితకరమైన ప్లేట్లను తీసుకొచ్చారు. చెట్ల నారతో చేసేవి, ఆకులతోటి, లేదా కాగితాలు తదితర విభిన్నమైనవి వచ్చాయి. కానీ ఇక్కడొక వ్యక్తి ప్లేట్లలో తిని పడేయక్కుండే హాయిగా తినేసే ప్లేట్లను తయారు చేశాడు. తినేయొచ్చు లేదా వేరే విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అలా రూపొందించాడు. ఇవి ప్రపంచంలోనే ఏకైక తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేటు కూడా. వివరాల్లోకెళ్తే..కేరళకు చెందిన విజయ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ వినూత్న ప్లేట్లను ఆవిష్కరించాడు. కట్లరీ బ్రాండ్‌తో తూషాన్ అనే కంపెనీని స్థాపించి వీటిని ఉత్పత్తి చేస్తున్నాడు. నిజానికి బాలకృష్ణన్ కుటుంబం మారిషస్‌లో ఉండేది. ఆయన అక్కడ సైన్యం, భీమా, బ్యాకింగ్ తదితర రంగాలలో విజయవంతంగా పని చేసి స్వచ్ఛంద పదవివిరమణ చేసిన 46 ఏళ్ల వ్యక్తి. 2013లో మారిషస్ నుంచి తిరిగి స్వదేశానికి రాగానే ఇల్లు కట్టుకుని స్థిరపడాలని అనుకున్నాడు. అదికూడా వంద శాతం సౌరశక్తితో నిర్మించాడు. అతను ఇల్లుని కూడా పర్యావరణ హితంగానే నిర్మించుకున్నాడు. వారి ఇంట్లో కూడా వ్యర్థపదార్థాల నుంచి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను ఉపయోగిస్తారు. బాలకృష్ణన్ మారిషస్ నుంచి కేరళలోని ఎర్నాకులంకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఈ పర్యావరణపై మరింతగా దృష్టిసారించాడని చెప్పాలి. ఎందుకంటే మారిషస్ చాలా పరిశుభ్రమైన ప్రదేశం. రహదారిపై ఒక్క కాగితం ముక్క, ప్లాస్టిక్ బాటిళ్లు కనుగొనడం అసాధ్యం. అంతలా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రత పట్ల మారిషస్‌లో ఉన్న నిబద్ధత బాలకృష్ణన్ మనుసులో బలంగా నాటుకుపోయింది. అదే ఈ వినూత్న బయోడిగ్రేడబుల్ ప్లేట్లు ఆవిష్కరణకి నాంది పలికేలా చేసింది. ఆయన దుబాయ్‌లో ఓ పార్టీకి హాజరయ్యారు. అక్కడ అతనికి తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణతో ఆశ్చర్యపోయిన ఆయన ఒక పోలిష్ కంపెనీ అలాంటి ప్లేట్లను తయారు చేసినట్లు తెలుసుకున్నాడు. దీన్నే భారతదేశానికి తీసుకురావాలనే కోరికతో పోలిష్ కంపెనీని కూడా సంప్రదించాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. అయినా నిరాశ చెందక బాలకృష్ణనే స్వయంగా వరి ఊక, వరిపొట్టు, మొక్కజొన్న వ్యర్థాలు తదితర వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఈ తపనే కొచ్చిలోని ఒక సైన్సు ఎగ్జిబిషన్‌కు దారితీసింది. ఆ ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాల్లో సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) కొబ్బరిపీచుతో తయారుచేసిన ప్టేట్లను ఉంచడం గమనించాడు. ఇది పరిశోధనా ప్రయోజనాల కోసమే గానీ వాణిజ్యీకరణ కోసం ఉద్దేశించింది కాదని ఆ సీఎస్ఐఆర్ బృందంతో జరిపిన చర్చల్లో తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సీఎస్ఐఆర్ డైరెక్టర్‌ను సంప్రదించి తన ఆసక్తిని వివరించారు. ఆ తర్వాత ఆ సీఎస్ఐఆర్ బృందంతో సమావేశం జరిగింది. అది బాలకృష్ణన్‌కి సహకరించడానికి అంగీకరించింది. ఐతే వారి పరిశోధనలకు నిధుల సమస్య ఎదురైంది. ముందుగా బాలకృష్ణన్ ప్రాజెక్టులో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్లేట్ల తయారీకి యంత్రాలు లేకపోవడంతో అదనంగా మరో పదిలక్షలు పెట్టుబడి పెట్టారు. అంకితభావం, నిబద్ధతలకు ప్రతిఫలంగా సరిగ్గా 2018లో గోధుమ ఊకతో తయారు చేసిన ప్టేట్లు ల్యాబ్‌లో ఆవిర్భవించాయి. దీంతో శాస్త్రవేత్తలు భారీ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు, లైసెన్సులు సంపాదించారు బాలకృష్ణన్. దీంతో 2021లో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. అదే అంగమలీకి చెందిన వీఐఆర్ నేచురల్స్ పుట్టుకకు దారితీసింది. కట్లర్ తూషన్ బ్రాండ్‌తో ఈ ప్లేట్లను ఉత్పత్తి చేశారు. నిజానికి తూషన్ అంటే మళయాళంలో అరటి ఆకు అని అర్థం. ప్రైవేట్ సమావేశాలు, పర్యావరణ స్ప్రుహతో కూడిన వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లను కలిగిన వివిధ రకాల భోజన సెట్టింగ్‌లో ఈ ప్లేట్లో హవా ఊపందుకోవడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ తూషాన్ కంపెనీ రోజూకి వెయ్యి పెద్ద ప్లేట్లు, మూడు వేల చిన్న ప్లేట్లు ఉత్పత్తి చేస్తుంది. తమ ఉత్పత్తికి తగ్గ డిమాండ్ ఉండపోయినా స్టాక్ నిర్వహణకు హామీ ఇచ్చేంత స్థిరంగా ఉందని ధీమాగా చెబుతున్నారు బాలకృష్ణన్. అలాగే కుమరకోమ్‌లో జరిగిన జీ20 ఈవెంట్ వంటి వాటికి ఊహించని రేంజ్లో ఆర్డర్ వచ్చిన సందర్భాల గురించి చెప్పుకొచ్చారు. ఆ ప్రోగామ్ కోసం దాదాపు 3వేల ప్లేట్లను సరఫరా చేసే ఆర్డర్ వచ్చిందని చెప్పారు. తూషన్ కట్లరీ బ్రాండ్ ఉత్పత్తులు జీరో శాతం వ్యర్థాల ఉత్పత్తిగా పేరుగాంచాయి. ఈ ప్లేట్లు ప్రయోజనం.. ఈ ప్లేట్లలో భోజనం చేసి పడేయక్కర్లేదు. మళ్లీ వాడుకోవచ్చు లేదా వాటిని తినొచ్చే లేదా ఆవులు లేదా ఆక్వా ఫుడ్‌గా కూడా పెట్టొచొచ్చు. అలాగే పర్యావరణంలో ఈజీగా డికంపోజ్ అవుతుంది. అన్ని రకాలుగా ఉపయోగపడేలా రూపొందిచిన ప్లేట్లు. View this post on Instagram A post shared by Thooshan (@thooshanediblecutlery_) వరించిన అవార్డులు ఈ ఆవిష్కరణకు గానూ బాలకృష్ణన్ రాఫ్తార్ ఏబీఐ జాతీయ అవార్డు, 2022లో ఎఫ్ఐసీసీఐ అగ్రి స్టార్టప్ సదస్సు స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతిష్టాత్మకమైన క్లైమథాన్ 2022 వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కాయి. ఇక తూషన్ ఉత్పత్తుల్లో పెద్ద ప్లేట్ల ధర ఒక్కొక్కటి రూ. 10, చిన్నవి ఒక్కో ముక్క రూ.5 అదనంగా, బియ్యం పిండితో తయారు చేసిన 100 స్ట్రాస్‌ల సెట్ రూ 150కి అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు బాలకృష్ణన్. అంతేగాదు ప్లాస్టిక్‌లను దశలవారీగా నిర్మూలించి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరీ సామాజిక బాధ్యత అని గ్రహించడం చాలా ముఖ్యం అని అన్నారు. ఇలాంటి వినూత్న ఉత్పత్తులు ప్రజలు స్వీకరించాలే ప్రోత్సహం ఉండాలన్నారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు మంచి బ్రాండ్‌గా ఉనికి చాటుకున్నప్పటికి లాభాలబాట పట్టాల్సి ఉందన్నారు. చాలా ఆటుపోట్ల మధ్య ఈ బ్రాండ్ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. View this post on Instagram A post shared by Thooshan (@thooshanediblecutlery_) ఇంకా ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా, కెనడా, హంగేరీ, మెక్సికో వంటి దేశాల్లో ఈ పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు మంచి ప్రజాదరణ ఉండటం విశేషం. కాగా, ఈ ఉత్పత్తుల ఆవిష్కర్త బాలకృష్ణన్ మాట్లాడుతూ..తాను ఇది ప్రారంభించాలనుకున్నప్పుడూ కుటుంబ సభ్యలెవరూ మద్దతివ్వలేదని, ఒక్క తన భార్యే సహకారం అందించారని చెప్పారు. అందరూ రిస్క్ అన్నట్లు పెదవి విరిచారు. ఈ రోజు అందరిచే ప్రసంశలందుకునేలా మంచి పర్యావరణ హిత బ్రాండ్‌ని ఉత్పత్తి చేశాననే ఆనందం దక్కింది. ఇక మరిన్ని లాభాలు అందుకునేలా వ్యాపారాన్నిబాగా ముందకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యం అని బాలకృష్ణన్ సగర్వంగా చెప్పారు. (చదవండి: నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..) -
ప్రకృతి అనుకూల ఉత్పత్తులకు భారీ మార్కెట్ - డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ: గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే, 2030 నాటికి ఈ రంగానికి అదనంగా 62 బిలియన్ డాలర్ల మేర వార్షిక మార్కెట్ ఏర్పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ప్రైవేటు రంగం ప్రకృతి అనుకూల పరిష్కారాలను అనుసరిస్తే 2030 నాటికి అదనంగా (అన్ని రంగాల్లో) 10.1 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ఏర్పడుతుందని అంచనా వేసింది. గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో నీటి నిర్వహణ, బాధ్యాయుత వనరుల సమీకరణ, ప్రకృతి పరిరక్షణను ప్రస్తావిస్తూ.. ప్రకృతి నష్టం విషయంలో కంపెనీల పాత్రను ఇవి పునర్ వ్యవస్థీకరిస్తాయని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగం వార్షిక టర్నోవర్ 700 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రకృతికి నష్టం కలిగిస్తున్నట్టు వివరించింది. ఒక్క కాస్మొటిక్స్ పరిశ్రమే ఏటా 120 బిలియన్ ప్యాకేజింగ్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. కాస్మోటిక్స్, సబ్సుల్లో ముడి పదార్థంగా వినియోగించే పామాయిల్ కారణంగా 2000–2018 మధ్య అంతర్జాతీయంగా 7 శాతం అటవీ సంపద క్షీణతకు కారణమైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ప్రస్తావించింది. ఈ రకమైన హానికారక విధానాలకు వ్యతిరేకంగా.. గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ప్రకృతి పరిధిలోనే, ప్రకృతి అనుకూల విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని డబ్ల్యూఈఎఫ్ నివేదిక నొక్కి చెప్పింది. ఈ రంగంలో వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తి 3.4 శాతం మేర ప్రపంచ గ్రీన్గౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమవుతున్నట్టు వివరించింది. ప్లాస్టిక్‌ను 10–20 శాతం మేర తిరిగి వినియోగించడం ద్వారా 50 శాతం సముద్ర ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించొచ్చని సూచించింది. జీవ వైవిధ్యానికి హాని కలిగించే రిస్క్‌లను అధిగమించే పరిష్కారాలతో అదనంగా 10.1 లక్షల కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని డబ్ల్యూఈఎప్ ఎండీ గిమ్ హువే పేర్కొన్నారు. పురోగతి నిదానం ప్రకృతి పరిరక్షణ పట్ల వ్యాపార సంస్థల్లో అవగాహన పెరుగుతున్నా ఈ దిశగా పురోగతి నిదానంగా ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఫారŠూచ్యన్ గ్లోబల్ 500 కంపెనీల్లో 83 శాతం వాతావరణ మార్పులకు సంబంధించి లక్ష్యాలను కలిగి ఉండగా, ఇందులో కేవలం 25 శాతం సంస్థలే తాజా నీటి వినియోగం లక్ష్యాలను ఆచరణలో పెట్టినట్టుగా తాజా అధ్యయన గణాంకాలను ప్రస్తావించింది. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మిగిలిపోయిన కూరగాయలతో ప్యాకింగ్ పేపర్స్, ఆదర్శంగా నిలుస్తున్న మాన్య
పర్యావరణ పరిరక్షణ గురించి మాటలు కాదు, చేతల్లో చూపించండి అని గ్రేటాథన్ బర్గ్ గళం విప్పింది. ఈ మాటను తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మాన్యా. అందుకే మాన్యను ‘అంతర్జాతీయ యూత్ ఇకో– హీరో’ అవార్డు వరించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఎనిమిది నుంచి పదహారేళ్ళలోపు వయసు వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేడు మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా మన దేశం నుంచి మాన్యహర్షను ఏరికోరి ఈ అవార్డు వరించింది. మాన్య చేపట్టిన ‘సన్‌షైన్ ప్రాజెక్టుకు గానూ ఇంతటి గుర్తింపు లభించింది. 27 దేశాలు, 32 అమెరికా రాష్ట్రాల్లో... ఇరవై ఏళ్లుగా పర్యావరణం గురించి కృషిచేస్తోన్న... 339 మందిని గుర్తించి వారిలో పదిహేడు మందికి ఇకో హీరో అవార్డులు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ళ మాన్య గోల్డెన్ బీ ఆఫ్ విబ్జిఆర్ హైస్కూల్లో చదువుతోంది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం. మాన్యకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నానమ్మ రుద్రమ్మ మాన్యతో మొక్కను నాటిస్తూ... ‘‘ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమగా చూసుకోవాలి. మనతో పాటు మొక్కలు, జంతువులను బతకనిస్తే మనం బావుంటాము’’ అని ఆమె మాన్యకు చెప్పింది. అప్పటినుంచి మాన్యకు పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనేది. లాక్డౌన్ సమయంలో... కరోనా వైరస్ చెడు చేసినప్పటికీ సరికొత్త పనులు చేయడానికి కొంతమందికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటును వాడుకున్న మాన్య.. పిల్లల కోసం ‘సన్‌షైన్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రింట్, డిజిటల్ కాపీల ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మ్యాగజైన్‌ను బెంగళూరులోని మాంటిస్సోరి, ఇతర స్కూళ్లల్లోని పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. వివిధ కార్యక్రమాలను పరిచయం చేస్తూ పర్యావరణ ప్రాధాన్యత గురించి వివరిస్తోంది. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్’, ‘పేపర్ మేకింగ్ వర్క్‌షాప్’, ‘పిల్లలు నీటిని ఎలా కాపాడగలరు?’, ‘న్యూఇండియా సస్టెయినబుల్ క్యాంపెయిన్’,ప్లాస్టిక్ ఫ్రీ జూలై రైటింగ్ కాంపిటీషన్’, ఎర్త్‌డే రోజు పెయింటింగ్ పోటీల వంటివాటిని మ్యాగజైన్ ద్వారా నిర్వహిస్తూ పర్యావరణంపై చక్కని అవగాహన కల్పిస్తోంది. తన యూట్యూబ్ ఛానెల్లో కూడా పర్యావరణ కార్యక్రమ వీడియోలు షేర్ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పీల్స్‌తో పేపర్స్.. అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వంటింట్లో మిగిలిపోయే కూరగాయ తడి వ్యర్థాలను ప్యాకింగ్ పేపర్స్‌గా మారుస్తోంది. కూరగాయ తొక్కలను ఉపయోగించి, పెన్సిల్స్, పేపర్లు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రెండు వందలకు పైగా వెజిటేబుల్ పీల్ పేపర్లను తయారు చేసింది. ఇందుకోసం వంటింట్లో మిగిలిపోయిన వ్యర్థాలు, పండుగల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సేకరించి, వాటిని గ్రైండ్ చేసి పేపర్‌గా మార్చడం విశేషం. పాత జీన్స్ ప్యాంట్లను డెనిమ్ పేపర్లుగా తీర్చిదిద్దుతోంది. మాన్యా స్వయంగా తయారు చేయడమే గాక, వర్క్‌షాపుల ద్వారా పేపర్ల తయారీ గురించి పిల్లలకు నేర్పిస్తోంది. అనేక అవార్డులు.. నాలుగున్నరవేలకు పైగా మొక్కలను నాటి, ఏడువేల మొక్కలు పంపిణీ చేసింది. ఐదువేల విత్తనాలను నాటింది. ఎనిమిదివేలకు పైగా ఆర్గానిక్, కాటన్ సంచులను పంచింది. సిటీ, హైవే రోడ్లు, నీటి కుంటలను శుద్ధిచేసే కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటికి గుర్తింపుగా మాన్యకు అనేక అవార్డులు వచ్చాయి. వెజిటేబుల్ పేపర్‌కు గ్రీన్ ఇన్నోవేటర్, జల వనరుల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరానికి గాను ‘వాటర్ హీరో’, ఎర్త్డాట్ ఓ ఆర్జీ ఇండియా నెట్వర్క్ నుంచి రైజింగ్ స్టార్, హ్యూమానిటేరియన్ ఎక్స్‌లెన్స్ అవార్డులు వచ్చాయి. పృథ్వి మేళా, అక్షయ్కల్ప్ రీసైక్లింగ్ మేళా, లయన్స్ క్లబ్, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, బైజూస్ పేపర్ బ్యాగ్ డే వంటి కార్యక్రమాల్లో పర్యావరణంపై ప్రసంగించింది. ఇవన్నీగాక మాన్య ప్రకృతిమీద ఏడు పుస్తకాలు రాసింది. 2019 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ పోయెట్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. ‘‘ఈ అవార్డు నా కృషిని గుర్తించి మరింత స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్‌లో నా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను’’ అని చెబుతూ ఎంతోమందిని ఆలోచించేలా చేస్తోంది మాన్య. -
ఈ శ్రావణ మాసం ఇల్లుని ఇలా తీర్చిదిద్దుకుందామా!
సంప్రదాయ వేడుకలకు వేదిక శ్రావణం. కళ కళలాడే వెలుగులను మోసుకువచ్చే మాసం. తీరైన శోభను తీర్చడానికి శ్రమతోపాటు డబ్బునూ ఖర్చు పెడతారు. ఎక్కువ కష్టపడకుండా పర్యావరణ స్నేహితంగా శ్రావణ మాస వ్రతాలకు, పూజలకు ఎకోఫ్రెండ్లీ థీమ్‌తో ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో హైదరాబాద్ వాసి డెకార్ నిపుణులు కల్పనా రాజేష్ ఇస్తున్న సూచనలు ఇవి.. ఆకులు అల్లుకున్న గోడ ఎక్కడైతే వ్రతం పీట పెడతారో ఆ చోట గోడకు తమలపాకులు, విస్తరాకులు, మర్రి ఆకులను ఒకదానికి ఒకటి కుట్టి, సెట్ చేయవచ్చు. మధ్య మధ్యలో బంతిపూలు లేదా గులాబీలు అమర్చవచ్చు. లేదంటే, ఇరువైపులా దండ కట్టి వేలాడదీయవచ్చు. ఏది సహజంగా ఉంటుందో దానిని ఎంపిక చేసుకోవాలి. బ్యాక్‌డ్రాప్‌లో వెదురు బుట్టలను ఉపయోగించవచ్చు. ఈ బుట్టలకు పూల అలంకారం చేస్తే కళగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలావరకు బ్యాక్ డ్రాప్లో వాడే కర్టెన్స్ ప్రింటెడ్‌వి వచ్చినవి వాడుతుంటారు. వాటిని ఎంపిక చేసుకుంటే మనం అనుకున్న థీమ్ రాదు. ఇక వీటిలో పాలియస్టర్వి వాడకపోవడం మంచిది. ఎకో థీమ్‌లో ఎంత పర్యావరణ హితంగా ఆలోచనను అమలు చేస్తే అంత కళ ఉట్టిపడుతుంది. రంగు రంగుల హ్యాండ్లూమ్ శారీస్‌ను కూడా బ్యాక్ డ్రాప్‌కి వాడచ్చు. వట్టివేళ్లతో తయారుచేసే తెరలు కూడా వాడచ్చు. అందమైన తోరణం... మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎలాగూ మామిడి ఆకులు తోరణం కడతారు. అలాగే, ఇప్పుడు వరికంకులతో తోరణాన్ని కట్టచ్చు. వీటిని వేడుక పూర్తయ్యాక మరుసటి రోజు బయట గుమ్మానికి అలంకారంగా వాడచ్చు. ఆ తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారిపోతుంది. అమ్మవారికి కట్టే చీర కూడా నారాయణ్‌పేట, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్ పట్టు చీర ఎంపిక చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ చేసుకోవాలంటే మూడు వెదురు కర్రలు తీసుకొని, క్లాత్, అరటి ఆకులతో సెట్ చేయవచ్చు. ఇత్తడి బిందెలు .. గంటలు ఇంట్లో బిందెలు ఉంటాయి కదా... వాటిలో మట్టిని నింపి, అరటి చెట్లను సెట్ చేసుకోవచ్చు. స్టీల్ బిందె అయితే నచ్చిన క్లాత్ చుట్టి, మట్టి నింపితే చాలు. కుందులు జత అడుగు పొడవు ఉన్నవి ఎంచుకొని, రెండు వైపులా అమర్చుకోవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం నింపి, మధ్యలో కొబ్బరిపువ్వు సెట్ చేసి పెడితే ఎంతో అందంగా వచ్చేస్తుంది. అమ్మవారికి మల్లెపూల దండ, కలువపువ్వు మంచి కాంబినేషన్. లేదంటే గులాబీలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర రెండువైపులా పాత కాలం నాటి ఇత్తడి పాత్రలు ఉంటే వాటిలో మొక్కలు పెట్టవచ్చు. ఇత్తడి గంటలు ఉంటే వాటిని డెకార్ ప్లేస్‌లో అలంకారంగా వేలాడదీయవచ్చు. అరటిగెల పెట్టచ్చు. ప్లాస్టిక్‌కు నో ఛాన్స్ ప్లాస్టిక్ పువ్వులతో వచ్చే అనర్థాలు ఎన్నో. వీటి బదులుగా బంతి, చామంతి, గులాబీ, కొబ్బరి ఆకుతో చేసిన దండలను, కాటన్ దారాలు ఉపయోగించవచ్చు. రంగవల్లికల కోసం రసాయన రంగులు వాడకుండా పువ్వులతో ముగ్గులు వేయచ్చు. ఆర్గానిక్ కలర్స్ వాడుకోవచ్చు. కింద కూర్చోవడానికి కోరాగ్రాస్ చాపలు, కలంకారీ, షోలాపూర్ బెడ్‌షీట్స్ వాడచ్చు. బొమ్మలతో భలే.. తెలుగు రాష్ట్రాల్లో మనవైన బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి, నిర్మల్, చేర్యాల మాస్క్స్... ఆ బొమ్మలు పెట్టి కూడా అలంకారం చేసుకోవచ్చు. బ్రాస్ ఖరీదు ఎక్కువ అనుకుంటే టెర్రకోట ప్లాంటర్స్, గుర్రపు బొమ్మలు, మట్టి ప్రమిదలు, రంగురంగు గాజులు... వాడవచ్చు. అతిథులకు ఎకో కానుక మార్కెట్లో వెదురు బుట్టలు దొరుకుతున్నాయి. పండ్లు, పూలు వంటివి ఈ బుట్టల్లో సెట్ చేయవచ్చు. అతిథులకు అందజేయడానికి ఇవి బాగుంటాయి. రసాయనాలు కలపని ఆర్గానిక్ పసుపు, కుంకుమ ఎంచుకోవాలి. చేనేత బ్లౌజ్ పీస్ పెడితే గిఫ్ట్ ప్యాక్ రెడీ అవుతుంది. మన దగ్గర ఉన్న పర్యావరణ వస్తువులను సరిచూసుకొని, వాటితో ఎలా అలంకరణను పెంచుకోవచ్చనేది ముందుగా ఆలోచించి, ఆ విధంగా సిద్ధంగా చేసుకుంటే సంతృప్తికరమైన డిజైన్ వస్తుంది. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కెమికల్ స్ప్రే చేస్తుంటారు. థర్మోకోల్ మీద ఆకులు పెట్టి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ అంటుంటారు. కానీ, మనం ఎంచుకునే థీమ్ మొత్తం తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉంటేనే అది పర్యావరణ హితం అవుతుంది. – కల్పనా రాజేశ్, డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు -
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి -
మిత్రులు సాధించిన విజయమిది.. స్టార్టప్ కంపెనీ సూపర్ సక్సెస్
వ్యాపారం చేయాలంటే అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే సరిపోదు. నాలుగు గోడలు దాటి బయటి ప్రపంచంలోకి రావాలి. జనవాణి వినాలి. సృజనాత్మక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఈ మిత్రులు అదే చేశారు. ‘ఎకోసోల్ హోమ్’తో ఘన విజయం సాధించారు... సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలతో మూడు సంవత్సరాల క్రితం రాహుల్ సింగ్, ప్రియాంకలు బోస్టన్ నుంచి నోయిడాకు వచ్చారు. ‘ఇదేమిటీ వింత’ అన్నట్లుగా చూశారు చుట్టాలు పక్కాలు. ‘ఇటు నుంచి అటు వెళతారుగానీ, అటు నుంచి ఇటు రావడం ఏమిటి?’ అనేది వారి ఆశ్చర్యంలోని సారాంశం. ‘రిస్క్ చేస్తున్నారు. అమెరికాలో సంపాదించిన డబ్బులను వృథా చేయడం తప్ప సాధించేది ఏమీ ఉండదు’ అన్నారు కొందరు. అయితే ఆ ప్రతికూల మాటలేవీ ఈ దంపతులపై ప్రభావం చూపలేకపోయాయి. ఇండియాకు రావడానికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారికి బోలెడు సమయం దొరికింది. ‘మనం తీసుకున్న నిర్ణయం సరిౖయెనదేనా?’ నుంచి ‘ఎలాంటి వ్యాపారం చేయాలి...’ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.వ్యాపారమైనా సరే... అది కొత్తగా, సృజనాత్మకంగా, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలనుకున్నారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే... ఎకోసోల్ హోమ్. అరవింద్ గణేషన్‌తో కలిసి రాహుల్ సింగ్ మొదలు పెట్టిన ఈ ఎకో–ఫ్రెండ్లీ హోమ్ ఎసెన్షియల్స్ కంపెనీ సూపర్ సక్సెస్ అయింది. రాహుల్, అరవింద్‌లు అమెరికాలోని ఇ–కామర్స్ కంపెనీ ‘వేఫేర్’లో పని చేశారు. ‘వేఫేర్లో పనిచేసిన అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడింది. వినియోగదారుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో స్పష్టత రావడానికి ఆ అనుభవం ఉపయోగపడింది. పర్యావరణ హితానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరుగుతున్నట్లు విషయాన్ని గ్రహించాం. ఆ సమయంలోనే ఎకోసోల్ కంపెనీ ఆలోచన వచ్చింది’ అంటున్నాడు ఎకోసోల్ హోమ్ కో–ఫౌండర్ అరవింద్ గణేశన్. ‘అవగాహన కలిగించేలా, అందుబాటులో ఉండేలా, అందంగా ఉండేలా మా ఉత్పత్తులు ఉండాలనే లక్ష్యంతో బయలుదేరాం. ప్లాస్టిక్ వల్ల జరిగే హాని గురించి చాలామందికి అవగాహన ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ధరలు ఆకాశంలో ఉండకూడదు. అందుకే మా వస్తువులకు అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాం’ అంటాడు రాహుల్ సింగ్. ఒకవైపు కోవిడ్ కల్లోలం భయపెడుతున్నా మరో వైపు ఇండియా, చైనా, థాయిలాండ్, మెక్సికోలలో తమ ఉత్పత్తులకు సంబంధించి సప్లై చైన్‌ను నిర్మించుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. రా మెటీరియల్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ వరకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ఒక్కొక్క సవాలును అధిగమిస్తూ 2021లో తాటి ఆకులతో తయారుచేసిన ప్లేట్లతో సహా 20 ఉత్పత్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మనం రోజూ వినియోగించే ప్లాస్టిక్ ఫోర్క్‌లు, కప్‌లు, స్ట్రాలు, ప్లేట్స్... మొదలైన వాటికి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు ఇందులో ఉన్నాయి. కంపెనీ నిర్మాణ సమయంలో వివిధ జిల్లాలకు చెందిన రైతులతో కలిసి పనిచేశారు రాహుల్, అరవింద్‌లు. వారు ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ‘తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు’ అంటారు రాహుల్, అరవింద్. కిచెన్,డైనింగ్, టేబుల్‌టాప్, బాత్, పర్సనల్ కేర్....మొదలైన విభాగాల్లో 42 రకాలైన ఉత్పత్తులను అందిస్తోంది ఎకోసోల్ హోమ్. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అయిదు వేల స్టోర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పదివేల స్టోర్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.‘మా ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కంపెనీ ప్రారంభంలో వెంచర్ క్యాపిటల్స్‌ను సంప్రదించినప్పుడు ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒక రిటైలర్ మాత్రం లక్ష రూపాయల చెక్ ఇచ్చాడు. అది మాకు ఎంతో విశ్వాస్వాన్ని ఇచ్చింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్, అరవింద్‌లు. More junk food, more plastic means more pollution! However, we can lessen the use of plastic with plastic-free products that are made with perfect high-quality that can be used for any events. Happy National Junk Food Day!https://t.co/yloDJONQ7I#NationalJunkFoodDay #SaveEarth pic.twitter.com/1chFc25XcX — EcoSoulHome (@EcoSoulHome1) July 21, 2021 A beautiful environment starts with you. Make the switch to reusable and 100% organic products and help our planet. Start with EcoSoul Home. Use the code ecosoul10 at checkout for 10% off all our products! 😍 #EcoSoul #LiveGreen #SaveTheEarth pic.twitter.com/fRDesyalby — EcoSoulHome (@EcoSoulHome1) May 24, 2021 -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్‌లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్‌స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్‌లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్‌లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్‌వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్‌లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్‌కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్‌గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ ఇంట్లోనే మొదలవ్వాలి
మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్యాకింగ్ మెటీరియల్‌లో మూడింట రెండు వంతులు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికే ఖర్చవుతోంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో పేపర్, పేపర్ బోర్డ్, కార్డ్బోర్డ్, వ్యాక్స్, ఉడ్, ప్లాస్టిక్లు, మోనో కార్టన్లు... ఇంకా రకరకాలవి ఉపయోగిస్తారు. మిగిలిన అన్నిటికన్నా ప్యాకింగ్ మెటీరియల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ శాతం తక్కువే. కానీ మట్టిలో కలిసిపోకుండా పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతూన్న ప్లాస్టిక్ తోనే సమస్య. క్లైమేట్ చేంజ్, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల మీద చర్చించిన ఐక్యరాజ్య సమితి... నదులు, సముద్రాలను ముంచెత్తుతోన్న కాలుష్యాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న ఈ సమస్యకు మన వంతుగా చెక్ పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూద్దాం. ఫ్యామిలీ ఆడిట్ ప్యాకింగ్ మెటీరియల్‌ని తిరిగి ఉపయోగించడం పట్ల శ్రద్ధ చూపించకపోవడం కూడా ప్రధానమైన కారణం. ‘స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో ఒక్కశాతం కంటే ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ చెత్త లోకి వెళ్లదు. అంటే అక్కడ 99 శాతం మళ్లీ వాడకంలోకి వస్తోంది. అదే మనదేశంలో రీయూజ్ 22 శాతానికి మించడం లేద’ని బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త నరేశ్ హెగ్డే చెప్పా రు. ‘‘మన దేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఉదయంపాలప్యాకెట్‌తో మొదలయ్యే ప్యాకింగ్ అవసరం రాత్రి పడుకునే ముందు ఇంటి బయట పెట్టే చెత్త కవర్ల వరకు సగటున రెండు నుంచి మూడు కిలోల ప్యాకింగ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. ఫుడ్ ఆర్డర్ల ద్వారా వచ్చే ప్యాకెట్లది సింహభాగం. ఈ సమస్య సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ. కానీ ఈ విషయంలో ప్రతి కుటుంబం ఆడిట్ చేసుకోవాలి. వ్యర్థాల ఉత్పత్తిని ఎంత మేర నిలువరించవచ్చు అని విశ్లేషించుకుని అమలు చేయాలి’’ అని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. రీ యూజ్ ‘‘మనం ఇప్పుడిప్పుడు ఇళ్లలో తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేయడం వరకు అలవరుచుకుంటున్నాం. ఇకపై ఈ రెండింటితోపాటు రీ యూజబుల్ మెటీరియల్‌ను వేరు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఒకసారి వాడిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ దఫాలు వాడడం ఒక సూచన. ఇక కొన్నింటిని వాడిపారేయాల్సిందే, తిరిగి వాడడానికి వీలుకాదు. ఉదాహరణకు షాంపూ ప్యాకెట్లు, కాస్మటిక్ ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి. చైతన్యం ఉన్నప్పటికీ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం ఒక కారణం. ప్లాస్టిక్‌ని సరైన విధానంలో రీ సైకిల్ చేయడం, పరిహరించడం మనకు మనంగా చేయగలిగిన పని కాదు. తయారు చేసిన కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని పలు సందర్భాల్లో సూచించాం. ఇదెలాగంటే... సౌందర్యసాధనాలు, షాంపూ, వాషింగ్‌పౌ డర్, క్లీనింగ్ ఉత్పత్తులను వాడేసిన తర్వాత ప్యాకెట్లను ఏ దుకాణంలో కొన్నామో అదే దుకాణంలో తిరిగి డిపాజిట్ చేయడం అన్నమాట. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి కిరాణా దుకాణం వరకు సరఫరా అయినట్లే ఖాళీ ప్యాకెట్లు కూడా సప్లయ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా తయారీ స్థానానికి తిరిగి చేరాలి. ఈ నియమాన్నిపాటించగలిగితే ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయవచ్చు’’ అంటారు పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. నిజానికి భారతీయుల జీవనశైలిలో సింగిల్ యూజ్ కంటే ముందు రీ యూజ్ ఉండేది.పాళీతో రాసే ఇంకు పెన్నుల నుంచి కాటన్ చేతి సంచీ వరకు ప్రతి వనరునీ వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించేవాళ్లం. యూజ్ అండ్ త్రో, సింగిల్ యూజ్ మాటలుపాశ్చాత్యదేశాల నుంచి నేర్చుకున్న అపభ్రంశమే. కానీ ఇప్పుడు ఆయా దేశాలు రీ యూజ్ వైపు మరలుతూ ఇండియాను వేలెత్తి చూపిస్తున్నాయి. మనం వీలైనంత త్వరగా మనదైన రీ యూజ్ విధానాన్ని తిరిగి మొదలుపెడదాం. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే అది పర్యావరణ సమతుల్యత సాధనలో తొలి అడుగు అవుతుంది. ప్రత్యామ్నాయాలున్నాయి! ► బర్త్‌డేపార్టీలో ధర్మాకోల్ బాల్స్, ప్లాస్టిక్ చమ్కీలను వాడుతుంటారు. అవి లేకుండా వేడుకను ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ► పెళ్ళిళ్లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చేసుకోవాలి. ► ఇంట్లో ప్లాస్టిక్‌ని అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరిగా రీయూజ్ చేయాలనే నియమాలను పెట్టుకోవాలి. ఆ నినాదాన్ని ఇంటి గోడ మీద రాసుకుంటే మనల్ని చూసి మరికొంత మంది ప్రభావితమవుతారు. ► పేపర్ బ్యాగ్, కాటన్ బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారవుతున్న క్యారీ బ్యాగ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు. – వాకా మంజులారెడ్డి -
మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా?
ఫొటోల్లో కనిపిస్తున్న భవంతిని చూడండి. ఇది పూర్తిగా మృణ్మయ భవనం. అంటే మట్టితో నిర్మించిన భవంతి. ఇదొక హోటల్. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరులో ఉంది. ఈ హోటల్ గదుల్లో ఏసీలు ఉండవు. ఇందులో ఇంకో విశేషమూ ఉంది. నిల్వచేసిన వాననీటినే అన్ని అవసరాలకూ ఉపయోగిస్తారు. చివరకు తాగడానికి కూడా ఆ నీరే విద్యుత్తు అవసరాల కోసం ఇందులో పూర్తిగా సౌరవిద్యుత్తునే వినియోగిస్తారు. పర్యావరణానికి ఏమాత్రం చేటుచేయని రీతిలో అధునాతనంగా రూపొందించిన ఈ హోటల్ రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పద్ధతులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటోంది. భారతదేశంలోని వాయుకాలుష్యంలో దాదాపు 30 శాతం భవన నిర్మాణాల కారణంగా సంభవిస్తున్నదే! నిర్మాణం కారణంగా కాలుష్యం వ్యాపించకుండా, పర్యావరణహితంగా ఉండేలా చిక్మగళూరులో ‘శూన్యత’ హోటల్ నిర్మాణం జరిగింది. ఈ హోటల్ ప్రాంగణం లోపలి నివాస గృహ సముదాయం కూడా పర్యావరణ అనుకూలమైనదే కావడం విశేషం. ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌ను రెండేళ్ల కిందట కొద్దిపాటి సిమెంటు, కాంక్రీటుతో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. విద్యుత్తు కోసం సౌరఫలకాలను అమర్చారు. నీటి సరఫరా కోసం వాననీటి సేకరణ వ్యవస్థను, ప్రాంగణాన్ని చల్లగా ఉంచేందుకు మట్టి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ హోటల్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని చాలావరకు స్థానికంగానే సమకూర్చుకున్నారు. నిర్మాణ సమయంలో ఒక్క నీటిచుక్క కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా లోకేశ్ గుంజుగ్నూర్ అనే యువ పర్యావరణ ప్రేమికుడికి వచ్చిన ఆలోచన! ఈ హోటల్ యజమాని ఆయనే! కొ న్నేళ్ల కిందట లోకేశ్ తాను పుట్టిపెరిగిన చిక్మగళూరులో ఖాళీ భూమిని కొనుగోలు చేశారు. పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ ఒక రిసార్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదే ‘మడ్ హోటల్’గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. రిసార్ట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు లోకేశ్ తన హోటల్ ప్రత్యేకంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని భావించారు. నిర్మాణపరంగా కూడా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించాలని అనుకున్నారు. భవిష్యత్తులో భవనాన్ని కూల్చేసినా, ఆ పదార్థాలు మళ్లీ భూమిలోనే కలిసిపోయేలా ఉండాలని భావించారు. అమెరికాలోని మయామీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన లోకేశ్‌కు ఇంత పచ్చని ఆలోచన రావడమే గొప్ప! ఆ ఆలోచనే ‘శూన్యత మడ్హోటల్’గా రూపుదాల్చింది. ఈ హోటల్ నిర్మాణం కోసం లోకేశ్ మొదట బెంగళూరులోని ‘డిజైన్ కచేరీ’ అనే ఆర్కిటెక్చర్ సంస్థను, పుదుచ్చేరి దగ్గరి ప్రకృతి ఆశ్రమం ‘ఆరోవిల్’లో శిక్షణ పొందిన పునీత్ అనే యువ సివిల్ ఇంజినీరును సంప్రదించారు. వారి సహకారంతో లోకేశ్ తన కలల కట్టడాన్ని సాకారం చేసుకోగలిగారు. హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగిన నిపుణుల బృందం మొదట ఇటుకల తయారీ ప్రారంభించింది. నేలను సమం చేయడానికి తొలగించిన మట్టితోనే ఇటుకలను తయారు చేశారు. చుట్టుపక్కల పదిహేను మైళ్ల వ్యాసార్ధంలోని ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి నిర్మాణానికి ఉపయోగించడంతో రవాణా ఖర్చులు, కాలుష్యం చాలావరకు తగ్గాయి. స్థానికంగా లభించే సున్నపు రాయిని, ఐదు శాతం కంటే తక్కువ మోతాదులో సిమెంటును కలిపి ఇటుకలను తయారు చేసుకున్నారు. ఈ పనులన్నీ నిర్మాణ స్థలంలోనే జరిగాయి. మిక్సింగ్ మెషిన్ నడిచేందుకు, ఇతర పరికరాలను నడిపేందుకు కావలసిన విద్యుత్తు కోసం అక్కడే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్మరశ్మి పుష్కలంగా ఉండే వేసవిలో ఈ పనులు జరిగాయి. నిర్మాణం ఎత్తు లేపడానికి, ఎత్తుకు తగినట్లుగా దన్నుగా అమర్చే ఉక్కు సామగ్రిని నివారించడానికి నిర్మాణ బృందం లోడ్‌బేరింగ్ నిర్మాణ పద్ధతిని అనుసరించింది. దీనివల్ల నిర్మాణం బరువు పైకప్పు నుంచి గోడలకు, పునాదులకు బదిలీ అవుతుంది. ఉక్కు ఉత్పాదన విస్తారంగా లేని కాలంలో పాత భవనాల నిర్మాణాల కోసం ఈ పద్ధతినే ఉపయోగించేవారు. ఇక సీలింగ్ కోసం కొబ్బరి చిప్పలు, పాట్ ఫిల్లర్లను ఎంచుకున్నారు. ఈ ఫిల్లర్లు పై అంతస్తుకు దృఢమైన ఫ్లోరింగ్‌గా పనిచేయడమే కాకుండా, గదులను కళాత్మకంగా, చల్లగా ఉంచుతాయి. ఇది హోటల్ కావడం వల్ల ఇక్కడకు వచ్చే అతిథులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన అంశం. వేసవిలో చిక్‌మగళూరు వాతావరణం వెచ్చగా ఉంటుంది. పరిసరాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి గదులను చల్లగా ఉంచడానికి ఎయిర్‌కండిషన్ బదులు సహజ శీతలీకరణ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ విధానంలో భవనం కింద పది అడుగుల మేర పెద్ద పీవీసీ పైపును అమర్చారు. ఇది బయటి గాలికి శీతలీకరణ పైపుగా పనిచేస్తుంది. పైపుగుండా గాలి వెళుతున్నప్పుడు చల్లబడుతుంది. తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రాంగణంలోని పదకొండు గదుల్లోకి ప్రసరిస్తుంది. గదుల లోపల కూడా అక్కడి వెచ్చని గాలిని బయటకు పంపేందుకు పైకప్పులకు చిమ్నీలు ఉంటాయి. ఈ వ్యవస్థ కారణంగా బయటి వాతావరణం ఎలా ఉన్నా, గదుల్లోని ఉష్ణోగ్రత 18–25 డిగ్రీల మధ్యనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మంచినీటి కోసం వాననీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా 50వేల లీటర్ల ట్యాంకును నిర్మించుకున్నారు. దీని నిర్మాణం పైభాగంలో కాకుండా, భూగర్భంలో చేపట్టారు. ఈ నీటిని శుద్ధి చేసి, హోటల్‌కు వచ్చే అతిథులకు తాగునీరుగాను, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు సరఫరా చేస్తున్నారు. వంటా వార్పులకు కూడా ఇదే నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ హోటల్లో ప్లాస్టిక్‌ను అసలు వాడరు. అతిథులకు స్టీల్ బాటిళ్లలోనే నీరు అందిస్తారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానంలో నిర్మించిన ఈ హోటల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ∙రాచకొండ శ్రీనివాస్ -
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్‌లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్‌లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్‌ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్‌ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎకో వెడ్డింగ్ కల్చర్..
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే ఇద్దరు కలిసి జీవితం గడపడం అంతే తప్ప కన్నవాళ్లని కష్టాల్లోకి నెట్టడం కాదు...పెళ్లంటే ఇద్దరు భవిష్యత్తును అందంగా ఊహించుకోవం ఒక్కటే కాదు భావితరాలకు మంచి సందేశం ఇవ్వడం కూడా.. అనుకున్నారు నగర యువతి స్ఫూర్తి కొలిపాక. అందుకే తన పెళ్లిని అంగరంగ వైభవంగా కాక ఆదర్శవంతంగా మార్చారు. పర్యావరణ ప్రేమికురాలైన స్ఫూర్తికి ఇటీవలే కేన్సర్ బయాలజీలో పీహెచ్డీ చేసిన ప్రశాంత్‌తో వివాహం జరిగింది ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉన్నా... పూర్తిగా లో బడ్జెట్లో అది కూడా పర్యావరణ హితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది..ఈ రకమైన పెళ్లి కోసం తన తల్లిదండ్రులను బంధువులు/స్నేహితులను సిద్ధం చేయడానికి తనకు కనీసం సంవత్సరం పట్టిందని అంటున్నారు. ఆమె పంచుకున్న తన ఎకో–వెడ్డింగ్ విశేషాలు... ► అతిథులకు వాట్సాప్ లేదా వీడియో కాల్ల ద్వారా మాత్రమే ఈ–ఆహ్వానాలను పంపించారు. ►పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం సాంప్రదాయ పందిరిని ఎంచుకున్నారు స్థానిక టెంట్ హౌస్ నుంచి కొన్ని అదనపు కుర్చీలను మాత్రం అద్దెకు తీసుకున్నారు. ఇంటి లోపల అదనపు అలంకరణ ఏమీ చేయలేదు. ఇంటి నిండా మొక్కలు, వినోదం, నవ్వు సంగీతం తప్ప. ►పెళ్లి షామీర్‌పేట్‌లోని ఓ గ్రీన్ ఫామ్స్‌లో జరిగింది – గదులు/ ఓపెన్–ఎయిర్ లాన్లు/ డైనింగ్ స్పేస్/ పిల్లల కోసం ప్లే ఏరియాతో కూడిన అందమైన 5 ఎకరాల ఫామ్ హౌస్ –24 గంటలకు కేవలం 55,000/మాత్రమే చెల్లించినట్లు స్ఫూర్తి చెప్పారు. ►ఉదయం పెళ్లి అయినందున, విద్యుత్ తోరణాలు, లైటింగ్/ఏసీ తదితర అనవసరమైన వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. ఉదయపు వెలుతురు ఆహ్లాదకరమైన గాలి బాగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ►పెళ్లి మండపాన్ని స్థానికంగా లభించే పూలతో పూర్తిగా అలంకరించారు. అలాగే సహజంగా పెరిగిన చెట్లను నేపథ్యంగా ఉపయోగించారు! ►అతిథుల కోసం వేదికను సూచించడానికి దారి పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లను చేయకుండా కాన్వాస్‌ను ఉపయోగించారు. ►ఎంతో కాలంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉపయోగించని ఆమె తన పెళ్లికి జీరో–ప్లాస్టిక్ బాటిల్ పాలసీని అమలు చేశారు. వివాహ ఆహ్వానంలోనే అతిథులు తమ సొంత వాటర్ బాటిల్‌ను తెచ్చుకోవాలని కోరారు. అలాగే ప్లాస్టిక్‌తో చుట్టబడిన బహుమతులు వద్దని తదితర పర్యావరణ హితమైన సూచచనలతో ప్రత్యేకంగా ఓ పేజీ జతచేశారు. ►విందులోకి పూర్తిగా సహజమైన కాయగూరలు, ఆకుకూరలతో పూర్తి సాంప్రదాయ తెలుగు భోజనాన్ని ఎంచుకున్నారు అది కూడా పచ్చని అరటి ఆకులపై మాత్రమే వడ్డించారు. వ్యయాన్ని తగ్గించారిలా... ►వధువు, వరుని కుటుంబాలు ఇచ్చి పుచ్చుకునే కట్నకానుకల్ని పూర్తిగా రద్దు చేసుకున్నారు. కన్యాదాన్ అప్పగింతలు ఆచారాలు అలాగే మహిళలకు ప్రత్యేకమైన వివాహ గుర్తులను వద్దని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం కొన్ని సాంప్రదాయ చేనేత వస్త్రాలను మాత్రమే ఎంచుకున్నారు. ఆమె పెళ్లి చీర అదీ చేనేత స్టాల్లో కేవలం 1,000/ మాత్రమే వెచ్చించి కొనుగోలు చేశారు. ►అభివృద్ధి చెందుతున్న ఎకోఫెమినిస్ట్గా, అన్ని రకాల కట్నాలు/ కట్నాలను వ్యతిరేకించాలని స్ఫూర్తి యువతను కోరుతున్నారు. చాలామంది వధువు కుటుంబం వరుడికి ఇచ్చే కట్నం గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ వరుడి సోదరీమణులకు బహుమతులు, ఆడపడుచు కట్నం, సమీప బంధువులు వారి పిల్లలకు బట్టలు, బట్టల కట్నాలు, రిటర్న్ బహుమతులు, మొదలైనవి ఇవన్నీ వధువు కుటుంబాల ఆర్థిక భారాన్ని పెంచేవేనని ఇవి మానేస్తే వ్యయాన్ని తగ్గిస్తాయి. ► అంతేకాదు పర్యావరణానికి మేలు చేస్తాయనీ అంటున్నారామె. నగరంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సోషల్ వర్క్ కోసం పలు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంగా తన అనుభవాలే తనను పర్యావరణ ప్రియురాలిగా మార్చాయని, సామాజిక మాధ్యమాలతో పాటు వీలున్నన్ని మార్గాల ద్వారా తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. -
ఎకో-ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌లో మీ ఇంటికి దీపావళి కళ కావాలంటే!
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో-ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు. ♦ సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పళ్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ♦ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ♦ మట్టి దీపాంతలు, లాంతర్లకు బదులు అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశ్మిని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి -
గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!
పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు. నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ (క్లిక్ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
Youth Pulse: బర్త్‌డేకి ఆకాశంలో చుక్కలు తెంచుకురమ్మంటావా.. వద్దులే!
‘నీ బర్త్‌డేకి ఆకాశంలో చుక్కలు తెంచుకురమ్మంటావా’ అని ఆకాశానికి నిచ్చెనలు వేసేవారి కంటే, నేల మీదే ఉండి స్నేహితులకు పచ్చటి మొక్కను కానుకగా ఇచ్చేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు. ‘రేపటి సండేను ఎలా ఎంజాయ్ చేద్దాం బ్రో..’ అని ఆరా తీసేవారికి భిన్నంగా ‘రేపటి సండే సరదాగా ఫీల్డ్‌వర్క్ చేద్దాం’ అని పలుగు పారా అందుకుంటున్న వాళ్లు పెరుగుతున్నారు. అవును...యూత్ మారుతుంది! నిన్నా మొన్నటి వరకైతే యూత్‌లో కొద్దిమందికి ‘పర్యావరణం’ అనేది ఎకాడమిక్ విషయం మాత్రమే. ఏ ఉపన్యాసం, వ్యాసంలోనో ఆ ‘స్పృహ’ కనిపించి మాయమయ్యేది. కోవిడ్ సృష్టించిన విలయం, దాని తాలూకు నిర్జన నిశ్శబ్ద విరామం తమలోకి తాము ప్రయాణించేలా చేసింది. ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచింది. రణగొణధ్వనులతో క్షణవిరామం లేని జీవితంలో ప్రశ్న ఒకటి వచ్చి ఎదురుగా నిలుచుంది. ‘ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?’ ఆత్మవిమర్శ అనే పెద్దమాట తగదుగానీ, ఎక్కడో ఏదో మొదలైంది. అదే యూత్‌ను ‘ఎన్విరాన్మెంటల్ యాక్టివిజమ్’లో చురుకైన పాత్ర నిర్వహించేలా చేస్తుంది. గత రెండు సంవత్సరాల అధ్యయనాలు,సర్వేలు చెబుతున్నది ఏమిటంటే– ‘భారతీయ యువతరంలో పర్యావరణ స్పృహ పెరిగింది’ అని. ( ఉదా: గోద్రెజ్ స్టడీ, క్రెడిట్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్, నీల్సన్) ‘పర్యావరణం’ అనేది యూత్ డిన్నర్ టేబుల్ డిస్కషన్‌లోకి రావడమే కాదు, ఫ్యాషన్ ఛాయిస్‌లలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. ‘గతంలో యువ వినియోగదారులు ప్రింట్ లేదా స్టైల్ నచ్చితే కళ్లు మూసుకొని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పీస్ ఎలా తయారైందో అడిగి తెలుసుకుంటున్నారు. అది పర్యావరణహితం కాకపోతే స్టైల్‌గా ఉన్నాసరే తిరస్కరిస్తున్నారు. వారిలో వచ్చిన మార్పుకు ఇదొక సంకేతంగా చెప్పవచ్చు’ అంటున్నారు ఎకో–కాన్షియస్ ఫ్యాషన్ డిజైనర్ అంజలి పాటిల్. ‘సౌఖ్యం,సుఖం, స్టైల్ వరుసలో ఇప్పుడు పర్యావరణహిత దృష్టి కూడా చేరింది. మనవంతుగా ఏదైనా చేయాలి అనుకోవడమే దీనికి కారణం’ అంటున్నారు మరో డిజైనర్ రజిని అహూజ. టీ–షర్ట్ల ద్వారా కూడా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది యూత్. అందమైన వారి టీ–షర్ట్‌లపై కనిపించే... ‘ఎర్త్ డే ఎవ్రీ డే’ ‘సే నో ప్లాస్టిక్‌బ్యాగ్’ ‘గుడ్ ఎన్విరాన్మెంట్ పాలసీ ఈజ్ గుడ్ ఎకనామిక్ పాలసీ’....నినాదాలు ఆకట్టుకుంటున్నాయి. కేవలం దుస్తుల విషయంలోనే కాదు ఆహారం, విహారం, వినోదం....మొదలైన వాటిలో కొత్త చాయిస్‌లు వెదుక్కుంటున్నారు. ప్యాస్టిక్ వ్యర్థాల నివారణపై స్నేహితులతో కలిసి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న స్నేహ షాహి(బెంగళూరు), హితా లఖాని(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేటర్), వర్ష రైక్వార్ (గ్రాస్రూట్స్ క్లైమెట్ స్టోరీటెల్లింగ్), ‘మార్చ్ ఫర్ క్లీన్’ అంటూ పర్యావరణహితం వైపు అడుగులు వేయిస్తున్న హినా సైఫీ....ఇలా చెప్పుకుంటూ పోతే యువ ఆణిముత్యాల జాబితా చాలా పెద్దది. వారు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నారు. నదులలోని కిలోల కొద్ది వ్యర్థాలను పైకి తీయడం, మొక్కలు నాటడం, చెట్లకు నీరుపోయడం...కాస్త శ్రమగా అనిపిస్తుందా? ఆ చిరుశ్రమను మరిచిపోవడానికి ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖెల్ జాక్సన్ ‘ఎర్త్సాంగ్’తో పాటు పర్యావరణ పాప్ పాటలు ఎన్నో ఉన్నాయి! చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక -
ఆ సమస్యలకు చెక్ పెట్టే ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్ ధర సుమారు 17 వేలు!
ఓపెన్ కిచెన్ అయినా, ఇరుకు వంటగది అయినా.. వంటకాల వాసన, ఆ తాలూకు పొగ ప్రతి ఇంటా ప్రధాన సమస్యయి కూర్చుంటోంది. ఎంత ఘుమఘుమలైనా ఎంతసేపని ఆస్వాదిస్తాం. పైగా ఊపిరితిత్తులకు ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఆ సమస్యకు చెక్ పెడుతుంది ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్. చూడటానికి లారీ షేప్‌లో ఉంటుంది. డివైజ్‌కి ఒకవైపు రెగ్యులేటర్‌తో పాటు ఒక చిన్న బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే.. డివైజ్ కింద ఒక ఫ్యాన్ తిరుగుతూ పొగ పైకి రాకుండా.. డివైజ్కిరువైపులా ఉన్న చిన్నచిన్న హోల్స్ నుంచి కింద ఉండే ట్రేలోకి చేరుతుంది. ముందుగా ఆ ట్రేలో వాటర్ నింపుకుని గాడ్జెట్‌ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా దీనిలోని ఐటమ్స్ గ్రిల్ చేసుకోవడానికి ఉపయోగించే గ్రిల్.. నలువైపులా ఎత్తుగా ఉండి మధ్యలో కిందకు వాలి, అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దాంతో గ్రిల్ అవుతున్నప్పుడు వ్యర్థాలు కిందకు చేరతాయి. దీనిలో ఇతర వంటకాలకు వీలుగా సమాంతరంగా ఉండే ప్రత్యేకమైన పాన్ కూడా ఉంటుంది. వాటిని అమర్చుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. -ధర : 239 డాలర్లు (రూ.17,859) చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే! -
వెలుగుదారులు.. అసామాన్యులు
సోలార్ పవర్.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. చాలా కాలం క్రితమే సోలార్ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్ అంటే జలవిద్యుత్ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్. అంటే వీలైనంత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇండియా డాటా పోర్టల్ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు. అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్ గర్ల్. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్ ఐరన్ కార్ట్’. ఈ మొబైల్ ఇస్త్రీ బండి సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్ షాట్ ప్రైజ్ దిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్ మోహన్’ ప్రాజెక్టు. విద్యుత్ మోహన్ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్ అంటే బొగ్గు లేదా కార్బన్ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్గా మారుతాయి. బయోచార్ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?) ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్ లైఫ్ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్ తో కలిసి సోలార్ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్ . సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్ పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ లో ‘ఇన్ స్ప్రెన్యూర్ 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ విమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!) గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన నీల్ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్ కింద అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్ సైకిల్ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్.. తాను తయారు చేసిన సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే. కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సోలార్ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్లో కింద లైటింగ్ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!) ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్ సోలార్ ఎలక్ట్రిక్ కార్‌ను రూపొందించారు. సోలార్ మొబిల్ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్ రెడ్డి, జీత్ బెనర్జీ, వరుణ్ గుప్తా, శివభూషణ్ రెడ్డి, సులేఖ్ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?) ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. - శ్రీనాథ్ గొల్లపల్లి సీనియర్ అవుట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ g.srinath@sakshi.com -
AP Special: శ్రీవారి సన్నిధిలో ఇం‘ధన’ పొదుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ)లో విద్యుత్ పొదుపునకు చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణహిత, ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెడుతున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సహకారంతో ఈ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను టీటీడీ అమలు చేయనుంది. దీనివల్ల టీటీడీ ప్రస్తుతం విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్తు కాగా, 70 శాతం విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సరఫరా చేస్తోంది. విద్యుత్ బిల్లులకు ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు టీటీడీ ఖర్చు చేస్తోంది. విద్యుత్ ఆదా చర్యలు అమలు చేయడం ద్వారా బిల్లులలో కనీసం 10 శాతం ఆదా చేయాలని భావిస్తోంది. దీనికోసం టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల భవనాలపై 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు కేంద్రాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ), జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాత ఫ్యాన్ల స్థానంలో కొత్తవి.. టీటీడీలోని పాత పంప్ సెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపు సెట్లు, 5 వేల సాధారణ ఫ్యాన్ల (75 వాట్లు) స్థానంలో సూపర్ ఎఫిషియంట్ బీఎల్డీసీ (బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు) ఫ్యాన్లు (35 వాట్లు) వంటి ఇంధన సామర్థ్య ఉపకరణాలను అమర్చనున్నారు. వీటి వల్ల ఏడాదికి రూ. 62 లక్షల విలువైన 0.88 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యే అవకాశముంది. విద్యుత్ ఆదాకు ప్రణాళికలు టీటీడీ అనుబంధ ఆలయాలు, సత్రాలలో విద్యుత్ పొదుపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో భాగంగా బీఈఈ స్టార్ రేటెడ్ ఉపకరణాలు వినియోగంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను తగినంత స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నాం. అదే విధంగా తిరుమల, తిరుపతిలో ఎలక్ట్రిక్ రవాణా సదుపాయాలను కూడా ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ చర్యల వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాం. –టీటీడీ ఈవో కె.జవహర్‌రెడ్డి -
Diwali 2021 Safety Precautions: టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో... వికటిస్తే అంతే చీకటినీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రమాదాలేవీ లేకుండా కేవలం వేడుకల సంబరాలు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అందరూ పాటించాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు. అలాంటి సాధారణ జాగ్రత్తలు మొదలు కళ్లూ, ఒళ్లూ, చెవులూ... విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపేదే ఈ కథనం. చెవులు జాగ్రత్త... దీపావళి బాణాసంచా వల్ల దేహంపై ప్రధానంగా దుష్ప్రభావం చూపే ముఖ్యమైన మూడు అంశాలు శబ్దం, పొగ, రసాయనాలు. అప్పుడే పుట్టిన చిన్నారులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం మరింత ఎక్కువ. వీటిలో శబ్దం వల్ల ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవుల విషయంలో రక్షణ పొందడం ఎలాగో చూద్దాం. కొన్ని టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కానీ మన చెవి కేవలం 7 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే హాయిగా వినగలుగుతుంది. ఆ పైన పెరిగే ప్రతి డెసిబుల్ కూడా చెవిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చెవులను రక్షించుకోడానికి ‘ఇయర్ ప్లగ్స్’ కొంతమేరకు అనువైనవి. ►పెద్ద శబ్దాలతో పేలిపోయే టపాకాయలు కాకుండా చాలా తక్కువ శబ్దంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాల వంటివి కాల్చడం మంచిది. ►ఒకవేళ పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయితే చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వంటివి వెయ్యకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. కళ్ల విషయంలో అప్రమత్తత అవసరం చాలా ఎక్కువ తీక్షణమైన వెలుగు, దానితోపాటు వెలువడే వేడిమి, మంట... ఈ మూడు అంశాలతో కళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి. కాలని / పేలని బాణాసంచాపై ఒంగి చూడటం మంచిది కాదు. ►కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►ప్రమాదవశాత్తు కంటికి ఏదైనా గాయం అయినప్పుడు ఒక కన్ను మూసి, ప్రమాదానికి గురైన కంటి చూపును స్వయంగా పరీక్షించి చూసుకోవాలి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. చర్మం జర భద్రం బాణాసంచాతో చర్మం కాలిపోయే ముప్పు ఎక్కువ. అందునా కాళ్ల, వేళ్ల, చేతుల ప్రాంతంలోని చర్మం గాయపడే ప్రమాదం మరింత అధికం. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచాని కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరిస్తే, అవి వేలాడుతూ మంట అంటుకొనే ప్రమాదం ఉంది. అందుకే కొద్దిగా బిగుతైనవే వేసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. దూరం పెరిగే కొద్దీ చర్మానికి నేరుగా తాకే మంట, వేడిమి తాకే ప్రభావమూ తగ్గుతుంది. ►బాణాసంచా కాల్చే సమయం లో ముందుజాగ్రత్తగా రెండు బక్కెట్లు నీళ్లు పక్కనే ఉంచుకోవాలి. చర్మం కాలితే కంగారు పడకుండా తొలుత గాయంపై నీళ్లు ధారగా పడేలా కడగాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న మామూలు నీళ్ల (ప్లెయిన్ వాటర్)ను వాడాలి. ఐస్ వాటర్ మంచిది కాదు. కాలడం వల్ల అయిన గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు గాయాల్ని తడిగుడ్డతో కప్పి ఉంచవచ్చు. ►కాలిన తీవ్రత చాలా ఎక్కువగా సమయాల్లో చేతుల వేళ్లు ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ►కాలిన గాయాలు తీవ్రమైతే బాధితులకు ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, ఇంటి లోపలా, టెర్రెస్‌పైన కాల్చకూడదు. పేలే బాణాసంచాను డబ్బాలు, పెట్టెలతో పాటు... మరింత శబ్దం కోసం కుండల్లో, తేలికపాటి రేకు డబ్బాల్లో, గాజు వస్తువుల్లో ఉంచి అస్సలు కాల్చకూడదు. అవి పేలిపోయినప్పుడు వేగంగా విరజిమ్మినట్టుగా విస్తరించే పెంకుల వల్ల చర్మం, కళ్లూ, అనేక అవకాశాలు, తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని బాణాసంచా అస్సలు కాల్చకూడదు. పెద్దవాళ్ల సహాయం లేకుండా చిన్నపిల్లలు వాళ్లంతట వాళ్లే కాల్చడం సుతరామూ సరికాదు. పిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండి, జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో మన పండగ... మరింత సురక్షితంగా మారి పూర్తిగా‘సేఫ్ దీపావళి’ అవుతుందని మనందరమూ గుర్తుపెట్టుకోవాలి. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి..
తిరుమల: తిరుమల శ్రీవారిని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీఆర్డీవో డైరెక్టర్ ఆఫ్ జనరల్ విక్రమసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల (పర్యావరణ హిత సంచుల) విక్రయ కేంద్రాన్ని సతీష్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న, పశువులకు ప్రాణసంకటంగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్లను డీఆర్డీవో రూపొందించిందన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో తయారయ్యే ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసిపోతాయని చెప్పారు. -
Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు
సాక్షి, జగిత్యాల: ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయి. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ అభ్యుదయ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేసి, హైదరాబాద్ లాంటి నగరాల్లో విక్రయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించడమంటే ఇష్టం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం గోశాల ఏర్పాటు చేసింది. వీకెండ్‌తో పాటు సెలవుల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి శభాష్ అన్పించుకుంది. గోమయ రాఖీలు.. గోశాలలో ఆవులు విసర్జించిన పేడను దాదాపు నెల రోజుల పాటు ఎండబెట్టారు. పిడకల మాదిరిగా తయారైన ఆవుపేడను గ్రైండర్ లేదా ప్రత్యేక మిషన్‌లో వేసి గోధుమ పిండిలా తయారు చేశారు. అలా తయారైన మెత్తటి పేడకు గోరు గమ్ పౌడర్ (సోయా చిక్కుడుతో తయారైనది)తో పాటు కొంత చెరువు మట్టిని రొట్టె పిండిలా కలిపి రకరకాల డిజైన్ సాంచా(మోడల్)ల్లో పెట్టి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికించారు. తర్వాత చామంతి, గులాబీ పూలను ఎండబెట్టి, పూల రేకులను గ్రైండ్ చేసి రంగులు తయారు చేస్తారు. రాఖీలకు ఏ రంగు అవసరమనుకుంటే ఆ రంగులను వాడుతారు. ఉపయోగాలు.. రక్షాబంధన్ అనంతరం చేతిక కట్టిన రాఖీ తీసివేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాఖీ చేతులకు ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా గోమయ రాఖీ యాంటీ రేడియేషన్గా పనిచేసి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి ద్వారా సంపాదన కంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవితం విలువైనది మనిషి జీవితం చాలా విలువైనది. ప్రస్తుత మన అలవాట్లు, వాడే రసాయన పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆవు మూత్రం, పేడను పంటలకు ఎరువుగానే కాకుండా, మనిషి రోజు వారీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో రాఖీలు తయారు చేశాం. – డాక్టర్ పద్మ, గోమాయ రాఖీల తయారీదారు గి‘రాఖీ’ వెలుగులు సిరిసిల్ల: కొన్నేళ్ల క్రితం వరకు రాజన్న సిరిసిల్ల్ల వస్త్రోత్పత్తి, బీడీల తయారీకి ప్రసిద్ధి చెందింది. నేత కుటుంబంలోని మహిళలు బీ డీలు తయారు చేస్తూ ఇంటి పోషణలో తోడుగా నిలిచేవారు. ఈనేపథ్యంలో చాలా రోజులు గా సిరిసిల్లలో బీడీ పరిశ్రమ కుదేలై పనిదొ రక్క సతమతమవుతున్న మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధిగా రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్నారు. బీడీల తయారీ కంటే మంచిది కావడంతో యువత, విద్యార్థులు, గృహిణులు ఉత్సాహంగా ఏడాదిలో పదినెలలు రాఖీలు తయారు చేస్తున్నారు. కలిసొచ్చిన లాక్డౌన్.. లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీల దిగుమతి చాలా వరకు తగ్గింది. అయితే సిరిసిల్ల, చందుర్తిలో రాఖీ పరిశ్రమను శ్రీహరి–తేజస్విని దంపతులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఇక్కడి రాఖీలు ప్రజలను ఆకట్టుకోవాలంటే మహా నగరాల్లో నుంచి వచ్చే రాఖీలకు దీటుగా తయారు చేయాలి. ఈక్రమంలో రాఖీల తయారీకి ముడి సరుకును ముంబాయిలోని మల్లాడ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. రంగురాళ్లు, సిల్వర్, గోల్డెన్, దేవుళ్ల బొమ్మలు, వివిధ పార్టీల గుర్తులతో రాఖీలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మణికంఠ రాఖీ సెంటర్ బ్రాండ్ పేరు పక్క జిల్లాలకు పాకింది. రాఖీల నాణ్యత ఎక్కువ, ఖరీదు తక్కువ కావడం, లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో రాఖీల తయారీ తగ్గడం సిరిసిల్ల రాఖీలకు మరింత కలిసొచ్చింది. తక్కువ ధరల్లో.. సిరిసిల్లలో తయారయ్యే రాఖీలు చూసేందుకు అందంగా, తక్కువ ధరలో దొరకడం వీటికి క్రేజ్ పెరిగింది. రూ.2 నుంచి రూ.100 వరకు ఖరీదు చేసే రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. ఏటా జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి మండలం లింగంపేట లో సుమారు 16లక్షల రాఖీలు తయారు చేస్తున్నా రు. జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తది తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
పాడుబడిన భవంతిని రూ.5.16 కోట్లు పలికేలా చేసింది
వేల్స్/లండన్: ఓ మహిళ పాడుపడిన తన రిటైల్ షాపును అందమైన భవంతిగా మార్చింది. ఒకప్పుడు దాన్ని కొనడం కాదు కదా కనీసం చుడ్డానికి కూడా ఇష్టపడని వారు.. ఇప్పుడు ఆ భవంతికి కోట్లు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ వివరాలు.. యూకే వేల్స్‌కు చెందిన ఎలిజబెత్ అనే మధ్య వయసు మహిళకు ఓ చిన్న రిటైల్ షాప్ ఉంది. ఏళ్ల క్రితం నాటి దుకాణం కావడంతో పాడు పడింది. అమ్మకానికి పెట్టినా పెద్దగా డబ్బులు రావు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఆ షాప్‌ని అమ్మడం ఎలిజబెత్‌కు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఎలిజబెత్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ షాపును కూల్చివేసి ఆ స్థలంలో తన కలల సౌధం నిర్మించాలనుకుంది. ఈ క్రమంలో కేవలం ఆరు వారాల్లోనే తనకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకుంది. మూడు బెడ్రూంలు, ఒపెన్ కిచెన్, లాంజ్, గార్డెన్లతో అందమైన ఇంటిని నిర్మించుకుంది ఎలిజబెత్. అయితే ఈ ఇంటి నిర్మాణం అనుకున్నంత సులభంగా జరగలేదన్నారు ఎలిజబెత్. తన షాప్ ఉన్న స్థలంలో ఎలాంటి సౌకర్యలు ఉండకపోగా చాలా మురికిగా.. తేమగా ఉండేదని తెలిపారు. అయితే ఇవేవి ఎలిజబెత్‌ను ఆపలేకపోయాయి. ఇంటిని నిర్మించాలనుకున్న ఆమె సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతులు పొందారు. ఆ తర్వాత కాంట్రాక్టర్స్‌ని సంప్రదించారు. ఇక ఎలిజబెత్ న్యూటన్ బీచ్‌కు చాలా దగ్గరగా ఉండటంతో తీరప్రాంత అనుభూతి పొందాలనుకున్నారు. దీని గురించి తన ఆర్కిటెక్ట్ పీటర్ లీతో చర్చించారు. ఈ క్రమంలో అతను బోట్‌హౌస్ డిజైన్‌లో ఆమె ఇంటిని నిర్మించాడు. ఇక ఇంటి నిర్మాణం అంతా పర్యావరణ హితంగా సాగింది. కేవలం ఆరు వారాల వ్యవధిలో పాడుబడిన బిల్డింగ్ స్థానంలో అత్యద్భతమైన ఇంటిని నిర్మించారు. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ఈ ఇల్లు 5,00,000 పౌండ్స్ (రూ.5.16 కోట్లు) ధర పలుకుతుంది. అంతకంటే ఎక్కువ రావచ్చంటున్నారు ఎలిజబేత్. చదవండి: అవును, 139 ఏళ్ల భవనం రోడ్డు దాటుతోంది! -
గుడ్ ఐడియా.. మాస్కులు వాడి పడేస్తే మొలకెత్తుతాయి
కర్ణాటక: కరోనా వైరస్ రాకతో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. సామాజిక దూరం, శానిటైజర్లు, మాస్క్‌ల వాడకం.. ఇలా ఇవన్నీ దాదాపు ఏడాదిన్నరకు పైగా మనుషుల జీవితంలో భాగమయ్యాయి. ఈ క్రమంలో కరోనా కేసులతో పాటు మాస్క్‌ల వాడకం కూడా పెరుగుతోంది. అయితే మార్కెట్లో దొరుకుతున్న మాస్క్‌లు కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వదిలేయడం, పర్యావరణ హితం కాకపోవడం వల్ల వ్యర్థాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైన మాస్క్‌ను తయారు చేశాడు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఇప్పట్లో మాస్క్‌ల వాడకం ఆపలేం కనుక పర్యావరణ హితమైన మాస్క్‌లతో కర్ణాటక లోని మంగళూరుకు చెందిన నితిన్ వాస్ మన ముందుకు వచ్చాడు. ఒక దళసరి పేపర్ మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం వంటి విత్తనాలను పెట్టి మాస్క్‌లు రూపొందించాడు. వీటిని వాడేసిన తర్వాత నేల మీద పడేస్తే…అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. నితిన్ వాస్కు వచ్చిన ఈ అద్భుత ఐడియాకు మంగళూరులోని పేపర్ సీడ్ అనే సంస్థ సాయం అందించింది. అతని ఆలోచనలకు అనుగుణంగా పేపర్ సీడ్ మాస్కులు తయారు చేస్తోంది. ఇవి ఒక్కసారి వాడి పడేయాల్సిన మాస్క్లని, పేపర్‌తో రూపొందించినవి కాబట్టి… ఒకసారే వినియోగించాలని చెప్పింది. ప్రస్తుతానికి ఇలాంటివి ప్రయోగాత్మకంగా 400 మాస్క్‌లు తయారు చేశామని, ఇవి విజయవంతమైతే.. ఇలాంటివి మరిన్ని తయారుచేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! ) -
ఎన్నో పెళ్లిల్లు చూశాం.. కానీ ఈ పెళ్లి ఎప్పుడైనా చూశారా!
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు.. అంతేనా.. ఇంకా చాలా.. వెడ్డింగ్ ప్లానర్లు.. డెస్టినేషన్ వెడ్డింగులు.. ఇలాంటివి కొన్ని విన్నాం.. కొన్ని చూశాం కూడా.. మరి.. ఢిల్లీలో జరిగిన ఆదిత్య–మాధురీల పెళ్లి గురించి విన్నారా? ఎలా జరిగిందో చూశారా? వీరు చాలా వినూత్నంగా చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ పెళ్లి గురించి జాతీయ పత్రికలు సైతం రాశాయి.. ఎందుకంటే.. అందరిలా ఆదిత్య అగర్వాల్(32) పెళ్లి మండపానికి భారీ బారాత్‌తో గుర్రమెక్కి రాలేదు.. తనే కాదు.. అతని ఫ్రెండ్స్ కూడా ఇదిగో ఇలా చిన్నపాటి ఎలక్ట్రిక్ బైక్‌ల మీద వచ్చారు.. అది కూడా రెంట్‌కు తీసుకుని.. ఇక మాధురి బంధువుల ఇంట్లోనే పెళ్లి వేదిక ఏర్పాటు చేశారు. బయట పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టలేదు.. స్కూళ్లో వాడే బ్లాక్‌బోర్డుపై చాక్‌పీసుతో ఆదిత్య వెడ్స్ మాధురి అని రాశారు. ఎక్కడా ప్లాస్టిక్ అన్నది వాడకుండా.. మండపం డెకరేషన్ కూడా పాత సీసాలు, వార్తాపత్రికలతో చేసేశారు.. భారీ దండలకు బదులు తులసిమాలలు వేసుకున్నారు. అది కూడా ఎందుకో తెలుసా? ఎండిపోయిన తర్వా త టీ పౌడర్లా వాడుకోవడానికట! ఇక కట్నం సంగతి.. రెండు కుటుంబాల వాళ్లు ఒక కిలో పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అదే కట్నం!! శుభలేఖలు ముద్రించనేలేదు.. అంతా ఆన్లైన్ పిలుపులే. వచ్చినోళ్లు కూడా ఎకోఫ్రెండ్లీ బహుమతులు ఇవ్వగా.. వాటిని కూడా కాగితంలో చుట్టి తెచ్చారట. ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లి ఐడియా మాధురీదే.. తన తల్లి రీసైక్లింగ్‌కు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నారట.. దాంతో అదే స్ఫూర్తితో కేవలం రూ.2 లక్షల ఖర్చుతో మొత్తం పెళ్లి కానిచ్చేశారు. -
‘రణ్వీర్- దీపికా వివాహ విందుకు వీరే సప్లై చేశారు’
కోవిడ్ మహమ్మారి అందరికీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాఠాన్ని, జీవిత పరమార్థాన్ని నేర్పించి ఉంటుంది. 2020లో ఎక్కువ కాలం అందరూ ఇళ్లకు, తమ తమ పరిసరాలకే పరిమితం కావడం వల్ల దేశవ్యాప్తంగా పర్యావరణపరంగా, పచ్చదనం పెరుగుదల విషయంలో ఎంతో కొంత మేలు జరిగింది. ప్రస్తుతం వివిధ రూపాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడంతో పాటు ఒకసారి వాడి పారేసే వస్తువులకు గిరాకీ పెరగడం కాలుష్యం పెరుగుదలకు కారణమవుతోంది. ఇది పర్యావరణానికి సైతం నష్టం కలగజేస్తోంది. అయితే పర్యావరణ పరిరక్షణతో పాటు పుడమితల్లికి సాంత్వన చేకూర్చే వివిధ వినూత్న ఆవిష్కరణలకు కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు శ్రీకారం చుట్టారు. – సాక్షి, హైదరాబాద్ ‘క్లాన్ ఎర్త్ అప్పారెల్ అండ్ ఫ్యాషన్స్’ లక్ష్యం పది లక్షల మొక్కలు కాలుష్యం వ్యాప్తి, వాతావరణ మార్పులకు కొంతలో కొంతైనా తమ వంతుగా అడ్డుకట్ట వేయడంతోపాటుగా, ఎవరూ లేని వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రియాంక మండల్, బ్రోటీన్ విశ్వాస్ కోల్‌కతాలో ‘క్లాన్ ఎర్త్ అప్పెరల్ అండ్ ఫ్యాషన్స్’ను ప్రారంభించారు. 2030 కల్లా పది లక్షల మొక్కలు నాటాలనేది ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎలా అంటే...పర్యావరణహిత ముడిపదార్థాలతో తయారు చేసిన బ్యాక్‌పాక్ బ్యాగ్‌లు, వాక్స్డ్ కాటన్ కాన్వాస్‌తో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిలో మహిళల బ్యాగులు, పురుషుల వ్యాలెట్లు, బ్యాక్పాక్లు, కోకోనట్ క్యాండిల్స్‌తో పాటు వెదురు టూత్‌బ్రెష్, నేలలో నాటడానికి అనువైన నోట్ పుస్తకం వంటి 14 వస్తువులతో కూడిన ‘జీరో వేస్ట్ కిట్’వంటి ఉత్పత్తులున్నాయి. ఒక్కో వస్తువును వినియోగదారులు కొనుగోలు చేయగానే ఈ సంస్థ ప్రతినిధులు ఐదేసి మొక్కలు నాటడమే ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ‘చుక్’ఉత్పత్తులు అయోధ్యకు చెందిన వేద్‌కృష్ణ తాను స్థాపించిన ‘చుక్’సంస్థ ద్వారా చెరుకు పిప్పితో డిస్పోజబుల్ ప్లేట్స్, బౌల్స్, బాక్స్‌లు తదితరాలను తయారు చేస్తున్నాడు. లెక్కకు మించి ఉత్పత్తి అవుతున్న చెత్తాచెదారం తగ్గించడంతో పాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలు, తదితరాలతో సులభంగా మళ్లీ భూమిలో కలిసిపోగలిగే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. భారత రైల్వేస్ మొదలుకుని అమెజాన్, హల్దీరామ్, లైట్ బైట్ ఫుడ్స్, స్టార్‌బక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ‘చుక్’ కస్టమర్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన బాలీవుడ్ నటులు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునే వివాహా విందుకు 75 వేల యూనిట్ల తమ ఉత్పత్తులను ఈ సంస్థ పంపించింది. ‘ఎకో రైట్’ ద్వారా మాస్క్‌ల తయారీ అహ్మదాబాద్‌కు చెందిన ఉదిత్సూద్, నిఖితా బర్మేచా ‘ఎకో రైట్’ సంస్థను ప్రారంభించారు. పర్యావరణహిత బ్యాగ్‌లు, రీసైకిల్ చేసిన కాటన్, జూట్ కలిపి (జూటన్) మాస్క్‌లు తయారుచేసి విక్రయిస్తున్నారు. పిల్లల కోసం వారికిష్టమైన కార్టూన్ల బొమ్మలతో బ్యాగ్‌లను తయారుచేస్తున్నారు. ఈవిధంగా 18 రకాల వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పనిచేసే వారిలో 90% మహిళా సిబ్బందే. ‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ పేరుతో టైల్స్ పర్యావరణహిత నిర్మాణాలతో పాటు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ అనే కంపెనీ పనిచేస్తోంది. ముంబైలో ఈ సంస్థను తేజాస్ సిడ్నాల్ ప్రారంభించారు. అతనితో కలసి కొందరు ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పర్యావరణంలో, ఇతరత్రా వెలువడే వాయుకాలుష్యం నుంచి ‘బ్లాక్ కార్బన్’ను విడదీసి కార్బన్ టైల్స్‌ను ఈ కంపెనీ తయారుచేస్తోంది. వాయుకాలుష్యం నుంచే వివిధ రకాల భవన నిర్మాణ వస్తువులను, ముడిసరుకును తయారుచేస్తున్నారు. వాయుకాలుష్యం నుంచి సేకరించిన ఆయా హానికారక వస్తువులను సరైన పద్ధతుల్లో వేరు చేసి, వాటికి సిమెంట్, ఇతర సహజ ముడివస్తువులతో కార్బన్ టైల్స్, ఇతర వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. తాము చేపట్టే నిర్మాణాల్లో ఆ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. ‘మింక్’ పేరుతో ఖాదీ వస్తువులు రోజువారి జీవన విధానంలో ఖాదీ వినియోగాన్ని పెంచేందుకు, సహజమైన రంగులు, సేంద్రియ కాటన్ తదితరాలను ఉపయోగించి తయారుచేసే పర్యావరణహిత దుస్తులను మింక్ లేదా మినీ కౌచర్ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థను మిని, కొచ్చెరి సి షిబు ప్రారంభించారు. ప్రధానంగా ఖాదీని ఉపయోగించి మహిళలకు సంబంధించిన వివిధ రకాల దుస్తులు తయారు చేస్తున్నారు. -
జనం మెచ్చిన రైతుబిడ్డ
సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసి శభాష్ అనిపించుకుంది... ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడి ఇచ్చే వక్కతోటను సాగు చేసే రైతులు కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగానే ఉన్నారు. అయితే పంటసంరక్షణలో భాగంగా ‘బోర్డో’లాంటి రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు కళ్లు మండడంతో పాటు చర్మ, శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది రైతులు. ‘పెరికో’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకునే ‘బోర్డో’ వల్ల శరీరం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు ఎకో–ఫ్రెండ్లీ అగ్రిస్ప్రేయర్తో పరిష్కారం కనిపెట్టింది దక్షిణ కర్ణాటకలోని పుట్టూరుకు చెందిన నేహాభట్. నేహా తాత నుంచి తండ్రి వరకు ‘స్ప్రే’ పుణ్యమా అని ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కున్నవారే. సమస్య గురించి తెలుసుగానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు పదమూడు సంవత్సరాల నేహాకు. రెండు సంవత్సరాల తరువాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్ ఎక్స్ప్లోర్స్(గ్లోబల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం) నిర్వహించే కార్యక్రమం అది. మన దైనందిన జీవిత సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అదృష్టవశాత్తు దీనిలో నేహాభట్కు పాల్గొనే అవకాశం వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్ ‘సమస్య గురించి తెలిసినా పరిష్కారం తోచని పరిస్థితిలో ఎన్ఎక్స్ప్లోర్స్ ఒక దారి చూపింది’ అంటుంది పదిహేను సంవత్సరాల నేహా. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న గాటర్ పంప్‌కు మూడు స్ప్రేయర్ ఔట్లెట్లను అమర్చడంలాంటి మార్పులతో ఆధునీకరించి సరికొత్త ఆటోమేటెడ్ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసింది. దీనికి పెద్దగా నిర్వహణ ఖర్చు అవసరం లేదు. తక్కువ ఇంధనంతో నడపవచ్చు. శబ్దసమస్య ఉండదు. టైమ్ వృథా కాదు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో మానవప్రమేయాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే అయిదు గంటల పాటు పని చేస్తుంది. ఈ అగ్రిస్ప్రేయర్ను మరింత ఆధునీకరించి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే దిశగా ప్రయోగాలు చేస్తుంది నేహా భట్. ఈ స్ప్రేయర్‌కు రూపకల్పన చేసే ప్రయత్నంలో తండ్రి, రైతులు, ఉపాధ్యాయుల నుంచి విలువైన సలహాలు తీసుకుంది. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఎకోఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు జాతీయస్థాయిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) అవార్డ్ అందుకుంది. ‘ప్రతి రైతు ఆటోమేటెడ్ అగ్రిస్ప్రేయర్ ఉపయోగించాలి అనేది నా కోరిక’ అంటోంది నేహా. రసాయన వ్యర్థాలు, భారలోహాలతో కూడిన నీరు పొలాల్లో పారకుండా ఒక మార్గాన్ని కనిపెట్టింది నేహా. స్థానికంగా ఎక్కువగా కనిపించే ఒక రకం మొక్కను పొలం గట్లలో నాటుతారు. ఆ మొక్క విషకారకాలను పీల్చుకొని నీటిని శుద్ధి చేస్తుంది. చక్కని కంఠంతో పాటలు పాడే నేహా బొమ్మలు గీస్తుంది. రకరకాల ఆటలు ఆడుతుంది. పుస్తకాలు చదువుతుంది. సైన్స్ ఆమె అనురక్తి, పాషన్. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనిపెట్టాలనేది ఆమె కల. కల అంటూ కంటే ఫలితం చేరువ కావడం ఎంతసేపని! -
దివ్వెల దీపావళి
సాక్షి, అమరావతి : ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాలని కోరుతోంది. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రం రెండు గంటల పాటు పరిమితంగా వినియోగించేందుకు అనుమతించింది. ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలకు సూచిస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం టపాసులు కాల్చడాన్ని, బాణసంచా విక్రయాలను నిషేధించగా కొన్ని చోట్ల నియంత్రించాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు గంటలు ఓకే... దీపావళి రోజు రెండు గంటలు పాటు బాణాసంచా వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమతిలేని బాణాసంచా దుకాణాలు, టపాసుల వినియోగంపై అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్చందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ దిశగా పోలీస్ యంత్రాంగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ తగిన ఆదేశాలు ఇచ్చారు. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టారు. తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని స్థల యజమాని అంగీకారపత్రంతోపాటు అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆంక్షలకు కారణాలు ఇవీ.. – శీతాకాలంలో వైరస్లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో టపాసులు పేల్చితే కాలుష్యం కారణంగా వైరస్ మరింత విస్తరించే ముప్పు ఉంది. వాయుకాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా బాధితులకు ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో బాణసంచా కాల్చడం, విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 30 వరకు బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిస్మస్ సహా నూతన ఏడాది వేడుకల్లోనూ బాణాసంచా కాల్చేందుకు కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించడంపై ఎన్జీటీ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్ ధర్మాసనం రాష్ట్రాల స్పందన కోరింది. – కాలుష్యం నివారణకు బాణాసంచా వినియోగాన్ని నిషేధించాలంటూ కొందరు పర్యావరణ వేత్తలు 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేలా అనుమతించింది. -
వచ్చేసింది ఎకో ఫ్రెండ్లీ ఫుడ్‌జోన్
గచ్చిబౌలి: నో ప్లాస్టిక్, నో వెండింగ్ నినాదంతో జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైటెక్‌సిటీలో టౌన్ వెండింగ్ కమిటీ ప్రకటించిన రెడ్‌జోన్‌లో వీధి వ్యాపారుల కోసం దాదాపు రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌జోన్‌లో 50 స్టాళ్లు నెలకొల్పారు. వ్యాపారులను బృందాలుగా చేసి స్టాళ్లను అప్పగించారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ అందించనున్నారు. షీ టాయిలెట్లు, స్టోన్ బెంచీలు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆకర్షించేలా ఫుడ్ సంబంధిత పెయింటింగ్స్ వేశారు. స్టాళ్లలో ఆహారాన్ని తయారు చేసే వారికి జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. రెడ్ జోన్ ఇదే.... చందానగర్ సర్కిల్–21 పరిధిలోని మాదాపూర్‌లోని నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్‌కు కుడివైపు, మెటల్ చార్మినార్ కమాన్ నుంచి న్యాక్ గేట్ వరకు రెండు వైపుల రెడ్ జోన్‌గా ప్రకటించారు. రోడ్లపై వీధి వ్యాపారులు ఉండరాదని.. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడోద్దనే నినాదంతో రెడ్ జోన్ పరిధిలో శిల్పారామం ఎదురుగా అండర్ పాస్ పక్కన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఫుడ్ జోన్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్తదితర సౌకర్యాలు స్టాళ్ల అలాట్మెంట్.. మాదాపూర్‌లోని ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఇప్పటికే 47 మంది వ్యాపారులకు అప్పగించారు. హైదరాబాద్, ఇండియన్, ఇటాలియన్, చైనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఒకటో నెంబర్ స్టాల్లో మొక్కజొన్న పిండితో చేసిన ప్లేట్స్, గ్లాసులు, స్పూన్లు, కంటెయినర్స్ విక్రయిస్తారు. ఇవి వాడిన తరువాత నీటిలో వేస్తే కరిగిపోతాయి. రెండో నెంబర్ స్టాల్లో కాటన్ బ్యాగ్స్, జ్యూట్ బాగ్స్, పేపర్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇక్కడ నిషేధం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఫుడ్ జోన్ తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నెలకు మెయింటెనెన్స్ రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్, నీటి వసతి జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. సోలార్ ప్యానెల్స్ .. ఫుడ్ జోన్లో 6 కేవీ కెపాసిటీ కల్గిన రెండు చోట్ల సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫుడ్ జోన్‌కు విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. స్టాళ్లకు ఎదురుగా రాతి బెంచీలు, టేబుల్స్ ఏర్పాటు చేయగా సోలార్ ప్యానెల్స్ వద్ద గ్రీనరీతో పాటు టాయిలెట్లు సిద్ధంగా ఉంచారు. -
ఆర్టీసీకి పర్యావరణ హిత పురస్కారం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు తనవంతు పాత్ర పోషిస్తూ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నందుకు రాష్ట్ర ఆర్టీసీ ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్’ నుంచి పురస్కారం అందుకుంది. శుక్రవారం ఢిల్లీలో ఏఎస్ఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రజా రవాణాలో ఆవిష్కరణలు అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి విజయ్‌కుమార్ సింగ్ నుంచి టీఎస్ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్.. సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ యుగేందర్‌తో కలసి ఈ అవార్డును అందుకున్నారు. -
ప్లాస్టిక్‌ను ఇలా కూడా వాడొచ్చు..
సాక్షి, అమరావతి : మానవాళి మనుగడకే పెను సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో వాటితో ఇటుకలు తయారు చేసి, నిర్మాణాల్లో ఉపయోగించ వచ్చనే విషయం పర్యావరణ పరిరక్షణ పరంగా ఊరట కలిగిస్తోంది. మట్టి, బూడిద (ఫ్లైయాష్).. సిమెంట్, ఇసుక మిశ్రమంతో తయారైన ఇటుకలతో నిర్మించే కట్టడాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలే పది కాలాలపాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటాయంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు. ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించే కట్టడాలకు నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని.. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ ఇటుకల ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. ఈ దృష్ట్యా కొంత కాలంగా పలు దేశాల్లో ప్లాస్టిక్‌తోనూ ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం, ఆ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి, ఉపరితల, భూగర్భ జలాలు, భూమి, ఆకాశం కలుషితం అవుతున్నాయి. దీని వల్ల ఏటా కోట్లాది పక్షులు, జంతువులు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉభయతారకంగా వ్యర్థాల నిర్మూలన ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగంలో యూరోపియన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, అమెరికా, భారతదేశం ఉన్నాయి. ఏడాదికి సగటున ఒక యూరోపియన్ పౌరుడు 36 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పడేస్తున్నాడు. తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం చైనాలో 28 కేజీలు, అమెరికాలో 24 కేజీలు, మన దేశంలో 11 కేజీల వరకు ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దేశంలో పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గాలి, నీరు, భూ కాలుష్యానికి దారితీస్తోంది. వీటి నిర్మూలనకు తొలుత అర్జెంటీనా విస్తృత పరిశోధనలు చేసింది. ఇటుకల తయారీలో ప్లాస్టిక్‌ను వినియోగించి.. మట్టి, ఫ్లైయాష్, సిమెంట్ ఇటుకల కంటే ఐదు శాతం పటిష్టంగా ఉంటాయని తేల్చింది. నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత, శబ్ద తరంగాలను నిరోధించే స్వభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించిన కట్టడాల మన్నిక అధికంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ. దీంతో అర్జెంటీనాలో తొలిసారిగా భారీగా ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగం మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్.. అమెరికా, చైనా తదితర దేశాల్లోనూ ప్లాస్టిక్ ఇటుకల వినియోగం పెరిగింది. ఇటుకల తయారీ ఇలా.. ప్లాస్టిక్ వ్యర్థాలైన బాటిళ్లు, కవర్లను ఒక పెద్ద బాయిలర్‌లో వేసి 105 నుంచి 110 డిగ్రీల వరకు వేడి చేసి, ద్రవరూపంలోకి మారుస్తారు. ఈ ద్రావకాన్ని గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీలకు వచ్చేలా చల్చార్చుతారు. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు, నాలుగు లేదా ఐదు శాతం మట్టి లేదా ఫ్లైయాష్ (బూడిద) లేదా సిమెంట్‌ను చేర్చి మిశ్రమంగా మారుస్తారు. ఇటుక కావాల్సిన పరిమాణంలో రూపొందించిన దిమ్మల్లో ఆ మిశ్రమాన్ని పోసి ఇటుకలు తయారు చేస్తారు. వారం రోజులపాటు ఈ ఇటుకలపై నీటిని చల్లాక (క్యూరింగ్) నిర్మాణాల్లో వినియోగిస్తారు. దేశంలో కొచ్చిలో శ్రీకారం కేరళలోని కొచ్చిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ఇంజనీరింగ్ విద్యార్థులు నడుంబిగించారు. 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి.. 2,500 టన్నుల పరిమాణంలో ఇటుకలను తయారు చేసి, భవన నిర్మాణాల్లో వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 800 కేజీల ప్లాస్టిక్ ద్రావకం వస్తుంది. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుక కంటే.. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి నాలుగు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుకలు బలంగా ఉంటాయని తేలింది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోయి, పర్యావరణానికి పెను సవాల్ విసురుతున్న తరుణంలో ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీ పర్యావరణహితమైనది. భారీగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సరైనరీతిలో రీసైక్లింగ్ చేసి, ప్రత్యామ్నాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ వ్యయం, బరువు తక్కువ. నాణ్యత ఎక్కువ. మట్టి, ఫ్లైయాష్ ఇటుకల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలు నిర్మాణ రంగంలో మరింత అనువుగా ఉంటాయి. వీటిని భిన్న ఆకృతుల్లో తయారు చేసి అలంకృతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ ఇటుకల తయారీతో పాటు నిర్మాణ రంగంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఎస్పీ అంచూరి, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్, హైదరాబాద్ -
ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు!
సాక్షి ప్రతినిధి విజయనగరం: కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు అచ్చెరువొందేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్ వినియోగించకూడదని నిర్ణయించుకున్న తూనుగుంట్ల గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే వాడారు. విజయనగరంలోని మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాశారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు. పెళ్లి పనులను సూచిస్తున్న లక్క బొమ్మలు.. వధూవరులు ఇది పెళ్లికుమార్తె కోరిక ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక అభిప్రాయం. తన వివాహాన్ని ప్లాస్టిక్ రహితంగా జరిపించాలని కోరింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి వినియోగించాం. నిజానికి మూడేళ్లుగా ప్లాస్టిక్ నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా పెట్టాం. – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం పూలు, తాటాకు గొడుగులతో అలంకరణ -
ఢిల్లీని వీడని వాయుకాలుష్యం
-
దీపావళి ఎఫెక్ట్; ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. ‘సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్)’ నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చరాదని, కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ టపాసుల అమ్మకాలను నిషేధించగా కాకరవొత్తులు, చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. వీటి ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని పేర్కొంది. ఇందుకు తోడు రాజధానిలో కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది. అంతేగాక శనివారం నుంచి రాత్రి సమయాల్లో భవన నిర్మాణ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం నమోదైన కాలుష్యపు సూచీ చూస్తుంటే నగర వాసులు సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని నవంబర్ 4 నుంచి 15 వరకు మరో దఫా అమలు చేయనున్నారు. సాధారణంగా పవన నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే మంచిదని, 51-100 ఫర్వాలేదని, 101-200 మధ్య రకమని, 201-300 బాలేదని, 301-400 పూర్తిగా బాలేదని, అలాగే 401-500 తీవ్రమైనది-ప్రమాదకరమని సఫర్ నివేదించింది. చదవండి : ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి -
ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి
దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్ దీపాలను వెలిగించడం వల్ల కూడా కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. ఇందులోభాగంగానే ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అవి కూడా ప్రభుత్వం తయారు చేసిన వాటిని మాత్రమే కొనాలి. ప్రభుత్వం తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటితోనే ఈసారి ఢిల్లీ వాసులు దీపావళి జరుపుకొని సంతృప్తి పడవలసిందే. -
మట్టే కదా అని నెట్టేయకండి.. చూస్తే ఫిదానే
భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా పండగలు విరాజిల్లుతున్నాయి. దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుతూ.. ఎన్నో అనురాగాలను, ఆప్యాయతలను పంచి పెడుతాయి ఈ పండగలు. అన్ని పండగల్లో దీపావళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుంగా ప్రపంచంలోనే ఎక్కువమంది జరుపుకునే పండగ దీపావళి. దీపావళి పేరు వినగానే అందరికీ గుర్తోచ్చేది దీపాల కాంతుల్లో వెలిగే జిగేలులు. ఆకాశమంతా విరజిల్లే సంబరాలు.. ఇంతటి వైభవంగా జరుపుకునే ఈ పండగలో మెయిన్ అట్రాక్షన్ మహిళలు. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం ఈ పండడ ప్రత్యేక. అయితే అలాంటి మగువల అందాలకు మరింత వన్నే చేకూర్చేవి వారి అలంకరణ. ఈ అలంకరణలో మందుగా గుర్తొచ్చేవి ఆభరణాలు. జ్యువెల్లరీ లో ముఖ్యంగా బంగారం, వెండి, డైమండ్,ముత్యాలు వగైరా. వీటితో పాటు ఈ మధ్య కాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇవి కూడా పాతబడిపోయాయి. ప్రతీసారి ఇవే ధరించడం మహిళలకు కాసింత రోటీన్‌గా అనిపిస్తోంది. అయితే ప్రతి పండక్కి ఒకింత కొత్తగా, మరింత నూతనంగా అలంకరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఈ సారి వీటికి భిన్నంగా మట్టితో తయారు చేసినవి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు. నగరానికి చెందిన కృష్ణలత గత కొంత కాలంగా వీటి పైనే దృష్టి పెట్టింది. మట్టితో ఒకటి కాదు రెండు ఏకంగా వందల రకాల వస్తువులను తయారు చేస్తుంది. అభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు ఏ పండగకైనా ఉపయోగించే వస్తు సామాగ్రిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. తన స్వహస్తాలతో తయారైన ఈ ఆభరణాలను చూసి ముచ్చటపడటమే కాక, ధరించి ఆహా అనాల్సిందే. పండగలకు ఉపయోగించే ప్రతి వస్తువులలో సాధారణంగా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పెనుభూతంగా తయారవుతూ మానవ మనుగడకు తీవ్ర ప్రమాదంగీ తయారవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణానికి మేలు జరిగేలా మట్టితో తయారు చేసిన వస్తువులను ఈ ప్రత్యేక పండగలో ఉపయోగిద్దాం. చెడుపై మంచి గెలిచినా విజయానికి దీపావళి జరుపుకుంటారన తెలిసిందే. అలాగే ప్రస్తతం ప్రపంచంలో చెడుగా వ్యాప్తి చెందుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మనం కూడా ఓ మంచి పనికి శ్రీకారం చుడుదాం. పరిచయం... అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కృష్ణలతకు మట్టితో వివిధ వస్తువులు తయారు చేయడం అలవాటు. అనంతరం అమెరికా నుంచి నగరానికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ మట్టితో అభరణాలు, తయారు చేయడం ప్రారంభించారు. తాను ఏం చేసిన పర్యావరణానికి హానీ కలగకుండ ఉండాలి. అంతేగాక కొత్తగానూ, అందరూ మెచ్చేలా ఉండాలని భావించారు. కేవలం తన అభిరుచితోనే ప్రారంభించిన ఈ పనిని 2014లో ఊర్వి పేరుతో ఓ బ్రాండ్‌ను స్థాపించి మట్టితో అనేక వస్తువులను తయారు చేసి బిజెనెస్ ప్రారంభించారు. మట్టి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అనేక పదార్ధాలతో తయారు చేసే వస్తువులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. తయారీ విధానం... అభణానికి కావల్సినంత మట్టిని తీసుకొని మొదట దానిని ఎండబెట్టాలి. ఆ తరువాత మట్టిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అప్పుడు అది స్టోన్‌లా మారుతుంది. దానిని మనకు కావల్సిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్‌లో జ్యువెల్లరీ తయరు చేసుకోవచ్చు. ఏంటీ ప్రత్యేకత మట్టితో తయారు చేయడం. ఎలాంటి రసాయనాలను వాడకపోవడం ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తయారు చేయడం పూర్తిగా పర్యావరణ హితమైనవి, కాలుష్యానికి ఆమడ దూరం వెండి,బంగారం వంటి అభరణాలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం దీపావళికి ప్రత్యేకంగా నూతన వెరైటీలతో జ్యువెల్లరీ(నగలు, చెవి కమ్మలు) తయారీ. అదే విధంగా దీపావళికి ప్రతేక ఆకర్షణ ప్రమిదలు. సాధారణంగా వీటిని మట్టితోనే తయారు చేస్తారు. ఈ మట్టిలో సైతం అనేక ఆకృతులలో అంటే గణేష్ ప్రమిదలు, నెమలి ఆకార ప్రమిదలు, ఏనుగు ప్రమిదలు వంటివి చేస్తోంది. వీటితోపాటు గుమ్మానికి వేలాడదీసే ప్రమిదలు. ఆవు పేడ (కవ్ డంగ్)తో తయారు చేస్తుంది. అంతేగాక పండక్కి వచ్చే అతిథుల కోసం వాయినంగా ఇచ్చే కుంకుమ భరణిని మట్టితో తయారు చేయడం. తులసి కోట వంటివి ఈ దీపావళికి ప్రత్యేకం. ధరలు.. కృష్ణలత తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్క దానికి ఒక్కో ధర ఉంటుంది. అధిక ధరలకు కాకుండా తయారీకి అయిన ఖర్చుతో కలిపి అందరికి అందుబాటులో ఉండే ధరకు వీటిని మనం కొనవచ్చు. ఆవు పేడ ప్రమిదలు- రూ.140 నుంచి రూ. 240....డిజైనర్ ప్రమిదలు-రూ. 320.... నగలు- రూ.450 నుంచి మొదలు... చెవి కమ్మలు రూ. 120 నుంచి ప్రారంభం. సో ఇంవేందుకు అలస్యం వెంటనే కొనేయండి. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో లాగిన్ అవ్వండి. లేదా నేరుగా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. -
ఎకో బొకేకి జిందాబాద్!
సాక్షి, ఒంగోలు సిటీ: పువ్వులను చూడగానే మనస్సు తెలియని అనభూతితో పులకించిపోతుంది. వాటి పరిమళాలు ప్రశాంతతను చేకూర్చుతాయి. ఆ పుష్పాలను అందంగా పుష్పగుచ్ఛాలుగా మార్చి సందర్భానుసారంగా నచ్చిన వారికి ఇస్తాం. అయితే అలాంటి పుష్ప గుచ్ఛానికి ప్లాస్టిక్ పేపర్ చుట్టడం వల్ల ఒక్క సారిగా పరిమళ అనుభూతి మారిపోతుంది. అలాగే పూల బొకేలకు ప్లాస్టిక్ తొడుగు వదిలేయమంటున్నారు పర్యావరణ ప్రేమికులు. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వరసగా ఉన్నాయి. వివిధ కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు ప్రారంభోత్సవాలకు నోచుకుంటున్నాయి. ఇలాంటి అన్ని కార్యక్రమాలకు పూల బొకేలు విరివిగా ఉపయోగించే నేపథ్యంలోనే వాటికి ప్లాస్టిక్ తొడుగులను వదిలేస్తే పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారు. పువ్వులను ప్లాస్టిక్ కవర్లతో బంధించి వాటి అందాన్ని పరిమళాలను అదిమి పట్టేకంటే రంగుల పేపర్లు జనపనార అల్లికల్లో మరింత అందంగా తీర్చిదిద్దువచ్చు. ఇలా చేయడం వల్ల పుష్పాలు త్వరగా వాడిపోకుండా ఉండడంతో పాటు మరింత తాజాగా ఉంటాయి. అవగాహన.. నగరంలో క్రమేణా ప్లాస్టిక్ వినియోగం పట్ల అవగాహన వచ్చింది. వాడకం బాగా తగ్గింది. కొందరు కాగితపు సంచులు ఇస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులను కొన్నప్పుడు వారు కాగితపు క్యారీ బ్యాగులను ఇస్తున్నారు. రెడీమేడ్ దుకాణాల్లో గుడ్డ సంచులను ఇస్తున్నారు. ఇలా కొన్ని వర్గాల్లో ప్లాస్టిక్ వాడకం పట్ల అవగాహన వచ్చింది. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మున్సిపాలిటీలు, గిద్దలూరు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లోనూ ప్లాస్టిక్ వాడకం పట్ల అవగాహన వస్తోంది. భవిష్యత్తులో పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు పడ్తున్నాయి. అయితే అధికారులు క్రమం తప్పకుండా ప్లాస్టిక్ వాడకం గురించి సరైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండాలి. ప్లాస్టిక్ సంచులు వాడుతున్న వారికి జరిమానాలను విధించాలి. ఒక్క ఒంగోలులోనే రోజుకు 150 టన్నుల వ్యర్థాలు వస్తుండగా ఇందులో 30 శాతం వ్యర్థాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. బాటిళ్ల రూపంలో ఉన్నవి భూమిలో నిర్వీర్యం కానివి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో జరిమానాల వడ్డింపు ప్లాస్టిక్ క్రమేణా నిషేధించకుంటే జరిమానాల వడ్డింపులతో పాటు దుకాణాల అనుమతులను రద్దు చేస్తారు. ఒంగోలు నగరంలో పూల మార్కెట్ పెద్దదే. నిత్యం టన్నుల కొద్దీ పూల లావాదేవీలు జరుగుతున్నాయి. పండగ వేళల్లో పూల వినియోగం అధికమే. ప్లాస్టిక్ వాడకూడదని నగర పాలక సంస్థ, ఇతర విభాగాల అధికారులు హెచ్చరించారు. అయినా ఇంకా ప్లాస్టిక్ కవర్లు, బొకేలకు ప్లాస్టిక్ తొడుగులు వాడుతూనే ఉన్నారు. అందుకే అధికారులు పుష్పగుచ్ఛాల తయారీ విక్రయదారులను చైతన్యపరిచే పనిలో పడ్డారు. అందంగా చుట్టాలి ఈ సీజన్లో పూల బొకేలకు బాగా గిరాకీ ఉంటుంది. ప్లాస్టిక్ తొడుగులు వాడకుండా జనపనార.. పేపర్లతో అందంగా చుడితే బొకే ఇంకా అందంగా ఉంటుంది. గతంలో మన ఇంట్లో ఉండే చేనేత జనపనార ఇతర సంప్రదాయ సంచిని తీసుకెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకొనే వాళ్లం. మాంసం దుకాణానికి వెళితే మనం ఎంత తెచ్చుకోవాలనుకుంటున్నామో అందుకు సరిపడా స్టీలు బాక్సులను తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పద్ధతిని ఎందుకు వదులుకున్నాం. ఈ రోజుల్లో చేతిలో సంచి పట్టుకోవాలంటేనే నామోషీగా ఫీలవుతున్నాం. ఖాళీ చేతులతో వెళ్లి ఐదారు ప్లాస్టిక్ కవర్లతో కావాల్సిన వస్తువులను సామగ్రి తెచ్చుకుంటున్నాం. ఇది మన వినాశనాన్ని కోరుతుంది. పండుగల సీజన్లో ఇంకా ప్లాస్టిక్ వినియోగం రెట్టింపవుతుంది. దీని వల్ల పర్యావరణ ముప్పు అధికమవుతుంది. -
ప్రకృతి హితమే రక్షగా...
‘రక్షాబంధనం’ అనేది అన్న చెల్లెలికి ఇచ్చేరక్షణకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేది.ఒక్క మార్పుతో ఈ పండగను మరింతవేడుకగా జరుపుకోవచ్చు. అదెలాగో చెబుతున్నాయి కొన్ని పర్యావరణహిత సంస్థలు. 1. మొక్కలకే రాఖీలు మీరు మనసు పెడితే మొక్కలకే రాఖీలను పూయించవచ్చు అంటున్నారు గార్గి. ‘బా నో బాట్వో’ వ్యవస్థాపకులు గార్గి ఔరంగాబాద్ నివాసి. చెట్లు, మొక్కల నుంచి ఆకులు, గింజలు, షెల్ ..వంటి భాగాలను సేకరించి వాటిని రాఖీల తయారీ కోసం వాడుతున్నారు. ఆన్లైన్ ప్రచారం ద్వారా ‘నా సోదరి నా బలం’ అనే ట్యాగ్‌తో క్యాంపెయిన్ ద్వారా గార్గి మరో మైలురాయి దాటారు. 2. హెచ్ఐవీ పిల్లలకు రాఖీ బెంగుళూరులోని జీసస్ హెచ్ఐవీ హోమ్‌లో ఏడాది నుంచి పదేళ్ల వయసున్న హెచ్ఐవీ ప్రభావిత పిల్లలు తలదాచుకుంటున్నారు. వీరికి ‘సీడ్ పేపర్ ఇండియా’ వ్యవస్థాపకులు రోషన్ రాయ్ పర్యావరణ హితమైన రాఖీలను రెండేళ్లుగా అందిస్తున్నారు. ఈ రాఖీలు ఎలా ఉంటాయంటే .. మొక్క వచ్చేందుకు అనువైన విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరినారతో తయారు చేసిన కార్డులను.. ఇలాంటి వాటితో ఒక కిట్‌ని రూపొందించి వారికి ఇస్తున్నారు. 3. స్లమ్ మహిళలకు ఉపాధి ప్రజలతో కలిసి పనిచేస్తేనే అనుభవాలు పువ్వుల పరిమళాలవుతాయి. ఢిల్లీ వాసి సౌరభ్ డిగ్రీ తర్వాత సొంతంగా బాల్ పెన్ తయారీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఏడాది గడిచాక పెన్నులన్నీ ప్లాస్టిక్‌వే అని ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. ‘బయో క్యూ’ పేరుతో ‘పర్యావరణహితమైన స్టేషనరీ’ని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ద్వారా ప్రతి నెలా 5–6 లక్షల విత్తనాల పెన్నులు, పెన్సిళ్లను తయారు చే యడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన నుంచే మొక్కల రాఖీలను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు సౌరభ్. ‘కిందటేడాది 6,000ల సీడ్ రాఖీలు తయారుచేశాం. ఈ ఏడాది 15,000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఢిల్లీలోని చుట్టుపక్కల స్లమ్ ఏరియాల నుంచి 20 మంది మహిళలతో ఈ గ్రీన్ రాఖీల తయారీ చేస్తున్నాం. దీనిద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం’ అని ఆనందంగా తెలిపారు సౌరభ్. 4. ఒక్కో దారం ఒక్కో కథ సామాజిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మధ్యప్రదేశ్‌కి చెందిన గ్రామ్‌ఆర్ట్ ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకొని ఈ రాఖీలను రూపొందించింది. ముంబయ్‌లో ఆదివాసీల హక్కుల కోసం ర్యాలీ చేసిన మానవ హక్కుల కార్యకర్త నవ్లీన్ 19 కత్తి పోట్లకు గురయ్యారు. ఆమె జ్ఞాపకార్థం ‘గ్రామ్ ఆర్ట్’ 19 ముడులతో కూడిన రాఖీని తయారుచేసింది. అలాగే గర్భాశయ ఆకారంలో ఉన్న రాఖీ ద్వారా సమాజంలో లింగ అంతరాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా ఒక్కో దారం ఒక్కో కథను కళ్లకు కట్టేలా చేస్తుంది గ్రామ్ ఆర్ట్. ‘హమ్ కమ్జోర్ నహీ’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి చెందిన 100 మంది గ్రామీణ మహిళలతో కలిసి ఈ విత్తన రాఖీల తయారీని చేపట్టారు. కిందటేడాది 12,000 రాఖీలను అమ్మిన ఈ సంస్థ ఈ ఏడాది 20,000ల సీడ్ రాఖీలను అమ్మాయిలని నిర్ణయించుకున్నామని సంస్థ వ్యవస్థాపకులు లలిత్ వంశీ తెలిపారు. 5. మట్టితో అనుబంధం అభికా క్రియేషన్స్ మట్టితో రాఖీలను తయారు చేస్తుంటుంది. ఈ రాఖీలను బటర్ పేపర్లో ప్యాక్ చేస్తారు. మట్టి రాఖీ, పేపర్ నేలలో సులువుగా కలిసిపోతుంది. ‘వీటిని కొంతమంది తమ ఆప్తులకు కానుకలుగా కూడా ఇస్తుంటారు’ అని ఆనందంగా తెలిపారు వ్యవస్థాపకులు. 6. పేపర్ రాఖీ పేపర్‌తో తయారు చేసిన రాఖీతో పాటు కిట్‌లో అరుదైన జాతి మొక్కల విత్తనాలు చుట్టి ఉన్న కాగితం పాకెట్ కూడా ఉంటుంది. ఈ విత్తనాల ద్వారా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నేటి తరాన్ని రకరకాల గ్యాడ్జెట్లు తమవైపుకు తిప్పుకుంటున్నాయి. ఇలాంటప్పుడు పర్యావరణ మూలాలకు వారిని తీసుకెళ్లడం అత్యవసరం’ అంటారు బైస్మిటా వ్యవస్థాపకులు స్మిత. రాఖీని సోదర ప్రేమకు, రక్షణకు, సంఘీభావనకు గుర్తుగా ఉపయోగిస్తారు. అయితే, చాలా వరకు రాఖీలో ఉపయోగించే ప్లాస్టిక్, రసాయనాల రంగులు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. వీటికి సరైన పరిష్కారం పర్యావరణ హితమైనవి ఎంపిక చేసుకోవడమే. మన చుట్టూ ఉన్నవారికి ప్రకృతి పట్ల వారి బాధ్యతను గుర్తుచేయడమే. -
ఎంపీలకు 400 కొత్త ఇళ్లు
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలకు ఇళ్లు నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతమున్న 400 పాత ఇళ్లను పడగొట్టి ఆ వ్యర్థాలతో వాటి స్థానంలోనే కొత్తవి నిర్మించాలని నిర్ణయించింది. 60 ఏళ్ల కిందట నిర్మించిన రాష్ట్రపతి భవన్‌కు ఇరువైపులా ఉన్న నార్త్ ఎవెన్యూ, సౌత్ ఎవెన్యూల్లో ఈ కొత్త భవనాలను నిర్మించనున్నట్లు కేంద్ర ప్రజా పనుల విభాగాధికారి ఒకరు తెలిపారు. పాత ఇళ్లనన్నింటినీ పడగొట్టి, ఆ వ్యర్థాలను కొత్త ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు. దీనికి సుమారు రూ. 57.32 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 36 డూప్లెక్స్ ఇళ్లను రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించింది. వీటిని కొత్త ఎంపీలకు ఇవ్వనున్నారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 300 మంది మొదటిసారిగా ఎంపీలుగా గెలిచారు. -
ఒడిసి పడదాం.. దాచి పెడదాం
ఘట్కేసర్: విపరీతంగా జనాభా పెరగడంతో హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డిలో కనిపించే పచ్చని పంట పొలాలు నేడు ప్లాట్లుగా మారి వేలాది కాలనీలు వెలిశాయి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. కాలనీల ఏర్పాటుతో నీటి వనరులకు ఎక్కడికక్కడే అడ్డకట్ట వేయడంతో వర్షాలు కురిసినా నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్డుపై చేరి కాలనీలు మునిగిపోతున్నాయి. సెల్లార్లో కారు ఆపి నిద్రపోయిన ఓ డ్రైవర్ కారులోకి వర్షం నీరు చేరి మృతి చెందిన ఘటన నగరంలో జరిగినా అధికారులు, ప్రజల్లో చలనం రావడం లేదు. అభివృద్ధి పేరుతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాంక్రీట్ జంగిల్లా మారి వర్షం నీరు ఇంకే అవకాశం లేక మూసీలో కలుస్తున్నాయి. ప్రభుత్వం ఇంకుడు గుంతలపై ప్రచారం చేసినా ప్రజల్లో అవగాహన లేక ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి బొట్టును వృథా చేయకూడదని ఘట్కేసర్ మండలం వీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్ పూర్తి చేసిన తోట రాజు, రవి, దివాకర్, హెచ్ఓడీ కృష్ణారావు సహకారంతో ముందడుగు వేశారు. వరద ముప్పు రాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు నడుం బిగించారు. ‘రిసెప్టివ్ పేవర్స్’ పేరు తో ప్రాజెక్టును తయారు చేసి ఏడాది పాటు కళాశాలలో ప్రయోగించగా మంచి ఫలితం కనిపించడంతో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వరద ముçప్పును తప్పించే యత్నం.. నగరంలో వరద తీవ్రత తగ్గించి భూగర్భ జలాలను పెంచేందుకు విద్యార్థులు ఈ ప్రాజెక్టును రూపొందించారు. కళాశాలలో 1,400 చదరపు అడుగుల విïస్తీర్ణంలో రూ.1.4 లక్షలతో రిసెప్టివ్ పేవర్‌ను నిర్మించారు. దీనిపై వరద నీటిని పంపించడంతో లోపలికి గుంజుకోవడంతో భూగర్భ జలాలు పెరిగినట్లు గుర్తించారు. ఈ విధానంతో నగరంలో వరద ముప్పును తíప్పించ వచ్చని చెబుతున్నారు. వృథాగా వదలకూడదని.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తే çస్థలం వృథా అవుతుందని చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఇంటి స్థలం పోను పార్కింగ్, ఖాళీ స్థలంలో టైల్స్‌కు బదులు ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఎటువంటి సమస్య తలెత్తకుండా వర్షాకాలంలో భూమి చిత్తడిగా మారదు. రోడ్డుపైకి వచ్చిన నీటి ని పేవర్స్ (టైల్స్) పీల్చుకొని కిందున్న కంకరలోకి పంపిస్తాయి. అక్కడి నుంచి భూమిలోకి వెళ తాయి. దీంతో వరదలు రావు. కానీ ఆ ప్రదేశంలో భారీ వాహనాలు కాకుండా కార్లు, ద్విచక్ర వాహనాలు, లైట్ వెహికిల్స్‌ను మాత్రమే నడపాలి. నిర్మాణ విధానం ఇలా.. ప్రాజెక్టును నిర్మించదల్చుకున్న ప్రాంతంలో రెండు ఫీట్ల లోతు æగుంతను తవ్వి ఫీటు మేర 40 ఎంఎం కంకర, తర్వాత అర ఫీటు మేర 20 ఎంఎం కంకర పరచాలి. కంకరపై గోనె సంచులు గాని, జియో టెక్స్ టైల్స్ లేయర్‌ను గాని వేసి మూడు ఇంచుల మేర ఇసుక పోయాలి. అనంతరం ఇసుకపై పేవర్స్ (టైల్స్)ను పార్కింగ్, వాకింగ్ చేసే స్థ«లాల్లో సిమెంట్‌ను వినియోగించకుండా బిగించాలి. ఒకసారి నిర్మిస్తే ఏళ్ల పాటు సేవలందించే ఒక్కో టైల్కు రూ. 480 వ్యయం కాగా చదరపు అడుగుకు మూడు అవసరం అవుతాయి. చుక్క నీరు వృథా కాకుండా లోపలికి వెళతాయి. దీంతో ఎంత వరద వచ్చినా ముప్పు వాటిల్లకుండా నీరంతా భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎక్కడ అనుకూలం.... రోడ్లకు ఇరువైపులా, ఫుట్‌పాత్‌లు, పార్కులు, గార్డెన్స్, కాలినడక బాటలో, రైల్వేస్టేషన్స్, బస్‌స్టేషన్స్, పార్కింగ్, వాకింగ్ ట్రాక్‌లు తదితరుల ప్రాంతాల్లో వీటిని ఉపయోగించవచ్చు. -
ఇండియా వద్దనుకుంది.. జపాన్ కళ్లకద్దుకుంది
చెన్నై : వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. వాహనాలు. మన దేశంలో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటికో బైక్ అయినా తప్పనిసరి అన్నట్లు మారాయి పరిస్థితులు. ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండేవన్ని కాలుష్య.. అనారోగ్య కారకాలే. అలా కాకుండా ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఆక్సిజన్ ఉంటే. వినడానికి కాస్త అత్యాశగా అనిపిస్తున్న ఇది మాత్రం వాస్తవం. కొయంబత్తూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజనీర్ ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపాడు. హైడ్రోజన్ వాయువును ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్‌ను విడుదల చేసే ఓ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ని కనుగొన్నాడు. సౌందిరాజన్ కుమారసామి అనే మెకానికల్ ఇంజనీర్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ.. ‘ఇది నా కల. దీన్ని సాధించడం కోసం దాదాపు పదేళ్ల నుంచి శ్రమిస్తున్నాను. హైడ్రోజన్ని ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్ని విడుదల చేసే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ని కనుగొన్నాను. ప్రపంచంలో ఇలాంటి రకమైన ఆవిష్కరణ ఇదే మొదటిది. దీన్ని భారతదేశంలో వినియోగంలోకి తీసుకురావాలనేది నా కల. అందుకోసం ప్రతి కార్యాలయం తలుపు తట్టాను. కానీ ఎవరూ దీనిపట్ల సానుకూలంగా స్పందించలేదు. దాంతో జపాన్ ప్రభుత్వాన్ని కలిసి దీని గురించి వివరించాను. వారు నాకు అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఈ ఇంజన్ని జపాన్‌లో ప్రారంభిచబోతున్నాను’ అని తెలిపారు సౌందిరాజన్. -
చూడచక్కని జంట.. ఆకుపచ్చని పెళ్లి
సాక్షి, ముంబై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను ప్రస్తుత తరంవారు విభిన్నంగా, అందరూ మెచ్చుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేశారు ముంబైకి చెందిన దీపా కామత్, ప్రషిన్ జాగర్ జంట. వివాహం అనగానే పెళ్లి పత్రికల నుంచి మొదలు డెకరేషన్స్, భోజనాలు చేసే ప్లేట్లు, గ్లాస్‌ల దాకా పర్యావరణానికి విఘాతం కలిగించేవే. ప్రకృతికి నష్టం కలిగించే ఇలాంటి వస్తువులేవీ వాడకుండా.. పర్యావరణ హితంగా తమ పెళ్లి ఉండాలని వారు కోరుకున్నారు. తమ సాదాసీదాగా వినూత్న వివాహానికి పెద్దలను, స్నేహితులను ఒప్పించారు. వారి సహకారంతో పర్యావరణానికి అనుకూలమైన, రీసైక్లింగ్ (జీరో ప్లాస్టిక్)వస్తువులనే వాడాలని, ఆఖరికి టిష్యూ పేపర్ కూడా వాడకూదని(పేపర్ చెట్ల నుంచి వస్తుందని) నిర్ణయించుకున్నారు. వివాహ ఆహ్వానానికి పత్రికల బదులు వాట్సప్ మెసేజ్, దగ్గరి బంధువులను కలిసి ఆహ్వానం చెప్పివచ్చారు. భోజనాలు వడ్డించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పాత పద్ధతి పళ్లాలు వాడారు. వీరనుకున్నంత సులభంగా ఈ పనులు జరగలేదు. ఎన్నో అడ్డంకులు, బంధువుల నుంచి వ్యతిరేకత వీటన్నింటినీ అధిగమించి, ప్రకృతి ఒడిలో అందరినీ ఆలోచింపజేసాలా వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పర్యావరణ అనుకూల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది. -
మట్టి విగ్రహాలను పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి
-
స్వచ్ఛ గణేష్ సాక్షిగా.
-
స్వచ్ఛ గణేష్ సాక్షిగా
-
జై బోలో ఎకో ఫ్రెండ్లీ వినాయక్ కీ!
-
72 అడుగుల ఏకో ఫ్రెండ్లీ వినాయకుడు
-
కలప వస్తువులే బెటర్ అట..
రోమ్: ఇంట్లోని టేబుల్, కుర్చీ, మంచం లాంటి ఫర్నీచర్ కలపతో చేసిందయితేనే పర్యావరణానికి మంచిదట. ఇల్లు కూడా కాంక్రీట్ మెటీరియల్‌తో కట్టింది కాకుండా రిసైక్లింగ్ కలపతో చేసిందయితే ఇంకా మంచిదట. ఫర్నీచర్ తయారీకి ఉపయోగించే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేస్తున్నారని, అడవులు అంతరించి పోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని ఇంతకాలం అందరం భావిస్తూ వచ్చాం. ఇందులో కొంతవరకే వాస్తవం ఉందని, వాస్తవానికి ఫర్నీచర్ కోసం కలపకు బదులుగా ప్లాస్టిక్, అల్యూమినియం, ఇనుము, ఉక్కుతో తయారు చేస్తున్న వస్తువుల వల్లనే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదమని ఐక్యరాజ్యసమితి ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)’ ఓ నివేదికలో వెల్లడించింది. ప్లాస్టిక్, ఇతర మెటీరియల్‌తో ఫర్నీచర్ తయారు చేయడానికి శిలాజ ఇంధనం ఎక్కువ అవసరమవుతుందని, ఈ ఇంధనం ఖర్చు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, ఇది భూతోపన్నతికి దారి తీస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ప్లాస్టిక్ వస్తువులు, వాటి రీసైక్లింగ్ వల్ల కూడా ఇంధనం ఖర్చు ఎక్కువగా పెరుగుతోందని తెలిపింది. పైగా ఈ వస్తువులకు కార్బన్‌ను పీల్చుకునే గుణాలు కూడా లేవు. అదే ఫర్నీచర్ తయారీకి మెటల్ మెటీరియల్‌ను కాకుండా కలపను ఉపయోగించినట్లయితే ఫర్నీచర్ తయారీకి ఎలాంటి ఇంధనం అవసరం ఉండదని, కలపను కట్ చేయడానికి మాత్రం విద్యుత్‌ను ఉపయోగించాల్సి వస్తుందని ఎఫ్‌ఏఓకు చెందిన ఫారెస్ట్ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ రెనీ కాస్ట్రో సలాజర్ తెలియజేశారు. పైగా కలపకు కర్బన ఉద్గారాలను కొన్నేళ్లపాటు తనలో ఇముడ్చుకునే గుణం ఉందని, పైగా కలప ఫర్నీచర్‌ను ఆరు బయట పడేస్తే అది సేంద్రీయ పదార్థంగా కూడా మరుతోందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 12 శాతమే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేయడం వల్ల జరుగుతోందని ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. అదే ఇంట్లోని ఫర్నీచర్‌తోపాటు ఇంటిని కూడా రీసైక్లింగ్ కలపతో నిర్మించుకున్నట్లయితే ఏటా 13.5 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను అరికట్టవచ్చని, ఇది ఒక బెల్జియం దేశం ఏటా విడుదల చేసే కర్బన ఉద్గారాలకన్నా ఎక్కువని నివేదిక పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం కలపకు బదులుగా మనం ఉపయోగిస్తున్న ప్రత్యామ్నాయ మెటీరియల్ వల్లనే పర్యావరణం ఎక్కువ దిబ్బతింటోంది. అలా అని కలప కోసం అడవులను అడ్డంగా నరకడాన్ని నియంత్రించాల్సిందే. కర్బన ఉద్గారాలను తన కడుపులో ఇముడ్చుకునే చెట్లను పరిరక్షించుకోవాల్సిందే. ఓ పక్క సమృద్ధిగా చెట్లను పెంచుతూనే మానవ అవసరాలకు కలపను సమన్వయంతో ఉపయోగించుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మనకు తెలియకుండానే మైనర్ పిల్లలతో తయారు చేస్తున్న చెప్పులను, బూట్లను కొనుగోలు చేస్తుంటాం. తెలిశాక అలాంటి బ్రాండ్లకు దూరంగా ఉండాలనుకుంటాం. అలాగే మనకు వస్తున్న కలప అక్రమంగా వస్తుందా, సక్రమంగా వస్తుందా, సమృద్ధిగా ఉన్న చోట నుంచి వస్తుందా ? తెలసుకొని వ్యవహరించే విచక్షణ మనకుంటే అడవులను కాపాడుకోవచ్చు. మన కలప అవసరాలను తీర్చుకోవచ్చు. సక్రమమైన కలపంటూ సర్టిఫై చేయడానికి ‘ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్’ లాంటి అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.