ఓపెన్ కిచెన్ అయినా, ఇరుకు వంటగది అయినా.. వంటకాల వాసన, ఆ తాలూకు పొగ ప్రతి ఇంటా ప్రధాన సమస్యయి కూర్చుంటోంది. ఎంత ఘుమఘుమలైనా ఎంతసేపని ఆస్వాదిస్తాం. పైగా ఊపిరితిత్తులకు ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఆ సమస్యకు చెక్ పెడుతుంది ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్. చూడటానికి లారీ షేప్‌లో ఉంటుంది.
డివైజ్‌కి ఒకవైపు రెగ్యులేటర్‌తో పాటు ఒక చిన్న బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే.. డివైజ్ కింద ఒక ఫ్యాన్ తిరుగుతూ పొగ పైకి రాకుండా.. డివైజ్‌కిరువైపులా ఉన్న చిన్నచిన్న హోల్స్ నుంచి కింద ఉండే ట్రేలోకి చేరుతుంది. ముందుగా ఆ ట్రేలో వాటర్ నింపుకుని గాడ్జెట్‌ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పైగా దీనిలోని ఐటమ్స్ గ్రిల్ చేసుకోవడానికి ఉపయోగించే గ్రిల్.. నలువైపులా ఎత్తుగా ఉండి మధ్యలో కిందకు వాలి, అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దాంతో గ్రిల్ అవుతున్నప్పుడు వ్యర్థాలు కిందకు చేరతాయి. దీనిలో ఇతర వంటకాలకు వీలుగా సమాంతరంగా ఉండే ప్రత్యేకమైన పాన్ కూడా ఉంటుంది. వాటిని అమర్చుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం.
-ధర : 239 డాలర్లు (రూ.17,859)
చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే!
Comments
Please login to add a commentAdd a comment