
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలకు ఇళ్లు నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతమున్న 400 పాత ఇళ్లను పడగొట్టి ఆ వ్యర్థాలతో వాటి స్థానంలోనే కొత్తవి నిర్మించాలని నిర్ణయించింది. 60 ఏళ్ల కిందట నిర్మించిన రాష్ట్రపతి భవన్‌కు ఇరువైపులా ఉన్న నార్త్ ఎవెన్యూ, సౌత్ ఎవెన్యూల్లో ఈ కొత్త భవనాలను నిర్మించనున్నట్లు కేంద్ర ప్రజా పనుల విభాగాధికారి ఒకరు తెలిపారు. పాత ఇళ్లనన్నింటినీ పడగొట్టి, ఆ వ్యర్థాలను కొత్త ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు. దీనికి సుమారు రూ. 57.32 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 36 డూప్లెక్స్ ఇళ్లను రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించింది. వీటిని కొత్త ఎంపీలకు ఇవ్వనున్నారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 300 మంది మొదటిసారిగా ఎంపీలుగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment