houses
-
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
కూల్చడం కుదరదు.. ఇళ్లకు ‘స్టే’ బోర్డులు
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇళ్ళు కూల్చివేయవద్దంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యనగర్, కొత్తపేటలో పలు ఇళ్ళ ముందు హైకోర్టు స్టే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని 400 మంది ఇళ్ల యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం మా ఇళ్లు ఇవ్వం అంటూ బాధితులు ఇటీవల ఆందోళన కూడా నిర్వహించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు నోటీసులిచ్చారు. దీంతో ఆయా కట్టడాల యజమానులు కోర్టుకు వెళ్లి కూల్చివేలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సోమవారం(సెప్టెంబర్30) తెల్లవారుజామున బీరుట్ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.బీరుట్‌లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: లెబనాన్ నిరాశ్రయులు..10 లక్షలు -
Video: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు
బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024 -
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్‌లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్‌తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్‌ఆర్‌పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్‌పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్‌లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్‌లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్‌లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
రియల్టీ మార్కెట్లో భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్‌లలో భాగంగా విక్రయించింది. → డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి. → ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్‌లు నమోదు చేసింది. → గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్‌లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం. → బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి. → బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్‌లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. → ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్‌లు సాధించాయి. → ముంబైకి చెందిన మరో సంస్థ సన్‌టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి. బలమైన డిమాండ్.. కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్‌లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్‌లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్లిస్టెడ్లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. -
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
హిమాయత్‌నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్‌రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్‌లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలపై పంతం
-
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
-
సోలార్‌ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్‌మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్‌ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు శనివారం హైదరాబాద్‌లో మరోమారు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఏడుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం మాదాపూర్ డీఎస్ఆర్ అపార్ట్మెంట్స్లోని కవిత ఆడపడుచు అఖిల ఫ్లాట్‌తోపాటు ఇతర బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కవిత ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు సందర్భంగా హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలోనూ కవిత భర్త అనిల్‌తోపాటు శరణ్ సైతం అక్కడే ఉన్నారు. సోదాల సమయంలో ఈడీ అధికారులు కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తోపాటు కవిత పీఏలు రాజేశ్, రోహిత్‌రావు ఇతరుల ఫోన్లను సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలు ఉండటంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కాంకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. తమ కస్టడీలో కవిత నుంచి సేకరించిన సమాచారం.. గతంలో ఫోన్లలో వెలుగు చూసిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ప్రధానంగా గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి హైదరాబాద్ నుంచే రూ. కోట్లు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె నుంచి సేకరిస్తున్న సమాచారంతో మరికొందరి పాత్రను బయటకు తెస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలన్నీ కవిత ఆడపడుచు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తే కొత్త కోణాలు వెలుగు చూస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు. -
‘రియల్’ మోసాలు రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. కస్టమర్ల సొమ్మే యజమానికి.. నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్లో బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. మోసాల విలువ రూ.10 వేల కోట్లు.. సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి చిన్నా, పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ (టీపీడీఎఫ్ఈఏ) చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ఆర్ధిక స్తోమత ఆ సంస్థకు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. దీనికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా..లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితేనే ఉత్తమం. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ ఎండీ -
వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు
సాధారణంగా మంచి మాటలు, మంత్రాలు, కొటేషన్స్‌ను బడులు, గుడులలో చూస్తుంటాం. వాటినిప్పుడు ఇళ్లల్లోనూ ప్లేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. ఎలాగంటే.. రీడింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఏదైనా ఒక గోడను ఎంపిక చేసుకుని.. సానుకూల ఆలోచనలను ప్రేరేపించే మంచి మాటలతో ఒక వాల్ పేపర్‌ను ఆ గోడ మీద అలంకరించవచ్చు. ఇది పెద్దల పెంపకాన్నీ.. పిల్లల ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఆ గది వాతావరణాన్ని మారుస్తుంది. ఫొటో ఫ్రేమ్స్.. కోట్స్ లేదా చాంట్స్‌తో ఫొటో ఫ్రేమ్స్‌ను తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో లభించే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటివల్ల ఆ గది హుందాగా కనపడుతుంది. పూజ గది.. ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గది ఉంటే.. నచ్చిన శ్లోకాలతో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అందమైన అక్షరాలతో కార్నర్ ప్లేస్‌లో గోడను తీర్చిదిద్దుకోవచ్చు. ఈ అలంకరణల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి చదవండి: ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త! -
Fact Check: కళ్లకు చత్వారం... చెవులకు బధిరత్వం
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది. చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది. టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది. అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి. రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి ♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. ♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. ♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. ♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. ♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. ♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా... బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ♦ రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. ♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది. ♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. -
కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే తాను భూములను కబ్జాచేసి, చట్టాలను ఉల్లంఘించి కట్టుకున్న ఫిలిం సిటీ, సహా తన కోటలకు బీటలు వారుతాయన్న ఆందోళనతో రామోజీరావు కల్లు తాగిన కోతిలా చెలరేగిపోతున్నారు. ఏదో ఒకటి చేసి తన పార్ట్నర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనతో సీఎం జగన్ ప్రభుత్వంపై తన అక్కసును నిత్యం వెళ్లగక్కుతున్నారు. తాజాగా.. పేదలకు ‘సొంతిళ్లు నమ్మక ద్రోహం’.. ‘ఏ నిమిషానికి ఏమి కూలునో!’ అంటూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై విషం చిమ్ముతూ గురువారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో వాస్తవాలకు దూరంగా అవాస్తవ కథనాలను వండి వార్చడం ఇందులో భాగమే. జగనన్న ఇళ్లు ఏ నిమిషంలో కూలుతాయో.. తద్వారా పేదల ప్రాణాలకు ముప్పు అంటూ ఓ సరికొత్త డ్రామాకు ఈ కథనం ద్వారా రామోజీరావు తెరతీశారు. నిజానికి.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఖరీదైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వాటిల్లో సొంతిళ్లు సమకూరుస్తుంటే సిగ్గూశరం లేకుండా ఈ రాతలు ఏమిటి రామోజీ అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో పేదల గూటికి, పేదోడికి ఏ ఢోకాలేదు.. అసలు ఈ రాష్ట్రంలో పేదలకు పట్టిన ఏలినాటి శని నువ్వు, మీ బాబే రామోజీ అని పేదలు చెబుతున్నారు. దీంతో పేదలు ఈ జన్మలో బాబుకు ఓటు వేయరని.. అదే జరిగితే తన కోటలు కూలుతాయని రామోజీ బెంబేలెత్తి కట్టుకథలు, కాకమ్మ కబుర్లతో ఈనాడులో చేతికొచ్చింది నిస్సిగ్గుగా రాసిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పేదల గూడుపై ఈనాడులో ప్రచురించిన దుర్మార్గపు రాతల వెనుక వాస్తవాలు ఏమిటంటే.. ఈనాడు ఆరోపణ: అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు నెలైనా కాకముందే కూలింది. కాంట్రాక్టర్ శ్లాబ్ వేస్తున్న సమయంలో సిమెంట్ తక్కువ వాడాడు.. వాస్తవం: రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండే హేమజ్యోతి, ఆనందు దంపతులకు మల్లాపురం లేఅవుట్లో ఇల్లు మంజూరైంది. వీరు తమ ఇంటిని తామే నిర్మించుకునే ఆప్షన్ 1, 2 ఎంచుకున్నారు. ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరుచేయడంతో పాటు, 15 టన్నుల ఇసుకను ఉచితంగా, 55 బస్తాల సిమెంట్, 270 కిలోల స్టీల్ సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసింది. లబ్ధిదారులే ఒక తాపీ మేస్త్రీని గుర్తించి ఇంటి నిర్మాణం చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఇల్లు ఆప్షన్–3 (ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లు) కింద నిర్మించినది కాదు. పైగా.. కూలింది శ్లాబ్ కాదు. ఇంటి ముందు భాగంలో ఉండే మూడు అడుగుల సన్‌షేడ్ భాగం. ఎక్కడ ఏం జరిగినా దానిని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ఈ వ్యవహారంలోనూ తన దగుల్భాజితనాన్ని ప్రదర్శించారు. ఆరోపణ: పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చుచేస్తోంది. వాస్తవం: ఇల్లులేని నిరుపేదలందరికీ రూ.15 లక్షల వరకూ మార్కెట్ విలువైన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో లెవెలింగ్, తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.రెండు వేల కోట్లు వెచ్చించారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు.. ఒక్కో యూనిట్‌కు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు. ఇందులో పట్టణాల పరిధిలో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.78 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి అదనంగా పావలా వడ్డీకి రూ.35వేలు బ్యాంకు లోన్ సమకూరుస్తున్నారు. రూ.15 వేలు విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు, రూ.40వేల వరకూ మేలుచేస్తూ స్టీల్, సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇంత పెద్దఎత్తున మేలు చేస్తుంటే కేవలం రూ.30 వేలు ఖర్చుచేస్తున్నారని రామోజీరావు రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఆరోపణ: ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం కేవలం ఒక శాతం మాత్రమే పూర్తయింది. ఇళ్ల నిర్మాణాల కేటాయింపులో కేవలం ఒక ఏజెన్సీకే మేలు చేశారు.. వాస్తవం: ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని 3,55,256 మంది ఎంచుకున్నారు. వీరందరినీ స్థానికంగా గుర్తించిన లేబర్ ఏజెన్సీలకు అనుసంధానం చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 72,906 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఆప్షన్–3 ఇళ్లలో 20 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. కానీ, ఈనాడు మాత్రం ఒక శాతం మాత్రమే పూర్తయ్యాయని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాతలు రాశారు. లబ్ధిదారుల అంగీకారం మేరకు లేబర్ ఏజెన్సీలతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 897 ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో 57 ఏజెన్సీలు వివిధ జిల్లాల్లో పనులు చేస్తున్నాయి. గరిష్టంగా ఒక్కో ఏజెన్సీకి 40,590 ఇళ్లను కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే ఒక ఏజెన్సీకే మేలు చేసినట్లు ఎక్కడాలేదు. -
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్
CM Jagan Public Meeting At Ongole Updates ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్ పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్ ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం: సీఎం జగన్ ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్ చురకలు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట! ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని ప్రసంగం పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు? పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? ఒంగోలులో సీఎం జగన్.. ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ సీఎం జగన్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఒంగోలులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని ►ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం ► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్ సీఎం జగన్ ఒంగోలు పర్యటన ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్ 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. -
నెరవేరిన నిరుపేదల ఏళ్లనాటి ఎదురుచూపులు
-
రూ.1కే టిడ్కో ఇళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సొంతిల్లు లేని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని, అందరినీ ఒక ఇంటివారిని చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం సోనియానగర్‌లో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రూ.1కే లబ్ధిదారులకు అందజేశారు. అందుకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను వారి చేతికి ఇచ్చారు. దీంతో పట్టలేని సంతోషంతో లబ్ధిదా రులు సీఎం జగన్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. మంత్రి బొత్స మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ఒక్కో లబ్ధిదారుతో రూ.500 చొప్పున డీడీ తీయించారని, రూ.5 లక్షల బ్యాంకు రుణానికి అంగీకరింపజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లును అందించిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఏ ఒక్కరి నుంచి డబ్బు వసూలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో అన్ని పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. అంగరంగ వైభవంగా... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,056 టిడ్కో ఇళ్లలో మంగళవారం గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రూ.82.85 కోట్లతో ఈ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారని, ఒక్కొక్కటీ రూ.12 లక్షల విలువైన సొంత ఆస్తిని అక్కచెల్లెమ్మలకు కేవలం రూ.1కే అందించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లబ్ధిదారులకు ఇంటితాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, టిడ్కోబోర్డు డైరెక్టర్ నాగేశ్వరి పాల్గొన్నారు. -
జగనన్న మా దేవుడు