![Handover of pattas and locks to beneficiaries of TIDCO houses - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/21/tidco.jpg.webp?itok=Ed-V7Ovz)
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సొంతిల్లు లేని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని, అందరినీ ఒక ఇంటివారిని చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం సోనియానగర్‌లో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రూ.1కే లబ్ధిదారులకు అందజేశారు. అందుకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను వారి చేతికి ఇచ్చారు. దీంతో పట్టలేని సంతోషంతో లబ్ధిదా రులు సీఎం జగన్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు.
మంత్రి బొత్స మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ఒక్కో లబ్ధిదారుతో రూ.500 చొప్పున డీడీ తీయించారని, రూ.5 లక్షల బ్యాంకు రుణానికి అంగీకరింపజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లును అందించిందని చెప్పారు.
గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఏ ఒక్కరి నుంచి డబ్బు వసూలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో అన్ని పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు.
అంగరంగ వైభవంగా...
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,056 టిడ్కో ఇళ్లలో మంగళవారం గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రూ.82.85 కోట్లతో ఈ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారని, ఒక్కొక్కటీ రూ.12 లక్షల విలువైన సొంత ఆస్తిని అక్కచెల్లెమ్మలకు కేవలం రూ.1కే అందించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లబ్ధిదారులకు ఇంటితాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, టిడ్కోబోర్డు డైరెక్టర్ నాగేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment