TIDCO
-
ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట ఏపీ టిడ్కో సహా, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్ డీడ్స్ ఇస్తామని తెలిపింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇళ్ల స్థలం ఇవ్వాలని, కేటాయించిన రెండేళ్ల లోపు ఇల్లు కట్టుకోవాలని, ఆధార్ కార్డుతో పట్టాను లింకు చేయాలని స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ లబ్ధిదారులు, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం లేనివారు, గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీం కిందకు రాని వారు, ఐదు ఎకరాలకు మించి మెట్ట వ్యవసాయ భూమి, 2.5 ఎకరాలకు మించి మాగాణి వ్యవసాయ భూమి, లేదా రెండు కలిపి 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇళ్ల స్థలాలకు అర్హులని స్పష్టం చేసింది. గతంలో ఇళ్ల పట్టా పొంది కోర్టు కేసుల వల్ల ఇల్లు పొందని వారికి దాన్ని రద్దు చేసి కొత్తగా పట్టా ఇవ్వవచ్చని పేర్కొంది. గతంలో ఇళ్ల పట్టా పొంది అక్కడ ఇల్లు కట్టుకోని వారికి పట్టాలు రద్దు చేసి తిరిగి మరొక చోట ఇవ్వాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని వీఆర్వో, ఆర్ఐలు అర్హతలకు అనుగుణంగా విచారణ జరిపి జాబితాను తయారు చేసి అక్కడ అంటించాలని సూచించింది. లబి్ధదారుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాలకు తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని పేర్కొంది. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల్ని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని స్పష్టం చేసింది. -
ఖజానాలో డబ్బుల్లేవు.. ఇప్పుడేమీ చేయలేం
పాలకొల్లు సెంట్రల్: ఖజానాలో డబ్బుల్లేవని.. ఇప్పట్లో పనులేవీ చేయలేమని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. వీటిని సరిచేద్దామంటే ఖజానాలో నిధులు లేవని, ఇప్పట్లో ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.నిధులు లేనందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. డబ్బులుంటే అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేసేవాళ్లమని, డబ్బులు లేకపోవడంతో చంద్రబాబు చాణక్యంతో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7,150 మంది టిడ్కో లబ్ధిదారుల్లో 640 మంది బ్యాంకు రుణాలు తీసుకోలేదని, వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
Fact Check: కళ్లకు చత్వారం... చెవులకు బధిరత్వం
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది. చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది. టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది. అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి. రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి ♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. ♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. ♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. ♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. ♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. ♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా... బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ♦ రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. ♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది. ♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. -
నెరవేరిన నిరుపేదల ఏళ్లనాటి ఎదురుచూపులు
-
రూ.1కే టిడ్కో ఇళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సొంతిల్లు లేని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని, అందరినీ ఒక ఇంటివారిని చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం సోనియానగర్‌లో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రూ.1కే లబ్ధిదారులకు అందజేశారు. అందుకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను వారి చేతికి ఇచ్చారు. దీంతో పట్టలేని సంతోషంతో లబ్ధిదా రులు సీఎం జగన్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. మంత్రి బొత్స మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ఒక్కో లబ్ధిదారుతో రూ.500 చొప్పున డీడీ తీయించారని, రూ.5 లక్షల బ్యాంకు రుణానికి అంగీకరింపజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లును అందించిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఏ ఒక్కరి నుంచి డబ్బు వసూలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో అన్ని పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. అంగరంగ వైభవంగా... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,056 టిడ్కో ఇళ్లలో మంగళవారం గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రూ.82.85 కోట్లతో ఈ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారని, ఒక్కొక్కటీ రూ.12 లక్షల విలువైన సొంత ఆస్తిని అక్కచెల్లెమ్మలకు కేవలం రూ.1కే అందించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లబ్ధిదారులకు ఇంటితాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, టిడ్కోబోర్డు డైరెక్టర్ నాగేశ్వరి పాల్గొన్నారు. -
జగనన్న మా దేవుడు
-
లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకూ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇప్పటివరకూ లక్ష ఇళ్లను పేదలకు అందజేసింది. ఈనెల 22కల్లా మరో 25,456 ఇళ్లను అందించనుంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 15,504 యూనిట్లను బుధవారం లబ్ధిదారులకు అందించేందుకు టిడ్కో అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 66 ప్రాంతాల్లో నిర్మించిన 1,00,200 ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, తాజాగా నెల్లూరు, అనంతరం సాలూరు 1,056, విజయనగరం 1,120, పెద్దాపురం 1,584, మచిలీపట్నం 2,304, చిత్తూరు 2,016, మదనపల్లి 1,872 టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారుచేశారు. ఈ మొత్తం ప్రక్రియ ముగియగానే 18 యూఎల్బీల్లో 24,812 యూనిట్లను మార్చిలో లబ్ధిదారులకు అందిస్తారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫేజ్–1లో 1,51,298 టిడ్కో ఇళ్లు పూర్తిచేస్తారు. ఇలా రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరలను పక్కనబెట్టి, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను అందిస్తోంది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాన్ని సగం తగ్గించి ఇళ్లను కేటాయించింది. అన్ని వసతులతో ఆధునిక పట్టణ ఇళ్లు.. జీ+3 విధానంలో నిర్మంచిన టిడ్కో ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్ సదుపాయం, రోడ్లు వంటి అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ తర్వాతనే లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 15 వేలకు పైగా ఉన్నాయి. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తుండగా, బుధవారం 15,504 యూనిట్లను అందిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేసి, అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడి వారికి ఎలాంటి ఇబ్బందిలేకుండా జగనన్న నగరాల్లో (టిడ్కో ఇళ్లు) పట్టణ స్వయం సహాయక సంఘాలు స్వయంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను మెప్మా ఏర్పాటుచేస్తోంది. లబ్ధిదారులకు జగన్ సర్కారు మేలు.. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ప్రభుత్వం మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు.. 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు.. 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. 300 చ.అ. ఇంటిని నిరుపేదలకు రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు రూ.10,339 కోట్ల ప్రయోజనం చేకూర్చింది. అలాగే, 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించడంతో పాటు వారు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు తగ్గిపోయింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటే జగన్ సర్కారు రూ.3,237 కోట్లతో సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాక.. రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692కు తగ్గించడంతో పాటు, అన్ని పనుల్లోను దాదాపు రూ.4,368 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఇక అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తంగా రూ.5,487.32 కోట్ల మేర లబ్ధిపొందారు. టిడ్కో ప్రాంగణాల్లో జేఎంఎం, కమ్యూనిటీ హాళ్లు మరోవైపు.. టిడ్కో నివాసాల వద్ద పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటు స్థానికుల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లను సైతం నిర్మిస్తున్నారు. తొలివిడతలో 21 యూఎల్బీల్లోని టిడ్కో నివాసాల వద్ద వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు ఇళ్ల ప్రాంగణాల్లో టిడ్కో విభాగం 1,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తోంది. ఇక్కడ 4 వేల చదరపు అడుగుల్లో రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో జగనన్న మహిళా మార్టు, రెండో అంతస్తులో కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి తేనున్నారు. టిడ్కో నివాసితుల్లో అధిక శాతం మెప్మా సభ్యులే. దాంతో అక్కడి వారికి ఉపాధితో పాటు ఆదాయ మార్గాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి నిర్వహణను సైతం స్థానిక టిడ్కో నివాసితులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకే అప్పగించనున్నారు. జేఎంఎం నిర్మాణానికి ఇప్పటికే విజయనగరంలో పనులు ప్రారంభించగా, మంగళవారం తాడిపత్రిలోను, బుధవారం నెల్లూరు, గురువారం మదనపల్లిలోను పనులు చేపట్టనున్నారు. ఇళ్ల పేరిట పేదలను ముంచిన చంద్రబాబు.. ఇక టిడ్కో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాదిస్థాయి దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతో పాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారుచేశారు. అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టి రూ.3,805 భారం మోపింది. అలాగే, 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. -
వెంకటగిరిలో నేడు 1,008 టిడ్కో గృహాల ప్రారంభోత్సవం
-
వెంకటగిరి వైఎస్ఆర్ నగర్లో టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో ఛైర్మన్ ప్రసన్నకుమార్
-
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
-
అనకాపల్లిలో టిడ్కో గృహాలు: సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: సత్యనారయణపురంలో 2,744 టిడ్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా, 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఈ సారి మీ సొంత ఇంట్లో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలుపుకున్నారు. లబ్ధిదారులకు రిజస్ట్రేసన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కామెంట్స్ చేశారు. -
సత్యనారాయణపురంలో పూర్తయిన 2,744 టిడ్కో గృహాలు
-
పట్టణ పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కష్టాలు తీరనున్నాయి. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 82,080 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 4 నుంచి మరో 73,580 ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 61,684 యూనిట్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక ధరలను మోపగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో మొదటి దశలో 1,51,298 వంద శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది పేద మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు అదనం. అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు.. ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఎస్టీపీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాకే ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తుండటం విశేషం. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఫ్లాట్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండడం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండు చోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా పేరు పెట్టారు. వీటి నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. ఇళ్ల పేరిట పేదలపై చంద్రబాబు బండ టిడ్కో ప్రాజెక్టులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాది స్థాయిని మాత్రమే దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతోపాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. తద్వారా ప్రతి నెలకు రూ.3,805 భారం మోపింది. ఇక 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల వాటా కింద వసూలు చేసింది. లబ్ధిదారులకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10,339 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. 365 చ.అ ఇళ్లకు 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లకు 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని జగన్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. అంతేకాకుండా లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను కూడా ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులు గత ప్రభుత్వ ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వ చర్యలతో ఆ మొత్తం రూ.4,590 కోట్లకు దిగివచ్చింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు కేవలం రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ సర్కారు రూ.3,237 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించడంతో పాటు అన్ని పనుల్లోనూ దాదాపు రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్లు మేలు పొందారు. ఇళ్ల పంపిణీ తాజా షెడ్యూల్.. ► జనవరి 4న అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురం 2,744 గృహాలు. ► 6న గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 4,192, వెంగళాయపాలెంలో 1,888. ► జనవరి రెండో వారంలో మచిలీపట్నంలో 864, పెద్దాపురంలో 1,584. ►మూడో వారంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15,552, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 1,008, మదనపల్లి మున్సిపాలిటీలో 1,872, చిత్తూరు మున్సిపాలిటీలో 2,832. ► నాలుగో వారంలో విజయనగరం జిల్లా సారిపల్లిలో 352, సోనియానగర్‌లో 1,088, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 548, విశాఖ జిల్లా దబ్బందలో 1,920, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 1,248, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో 480, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 192, పలాసలో 912. రెండో దశలో 6,500 ఇళ్లను కూడా పంపిణీ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 800, పాలకొల్లులో 1,024, తాడేపల్లిగూడెంలో 1,124, కడపలో 9,912, విశాఖపట్నంలోని 11 ప్రాంతాల్లో 6,048. ► ఫిబ్రవరి మొదటి వారంలో పార్వతీపురం మున్సిపాలిటీలో 768 ఇళ్లు. -
టిడ్కో ఇళ్లపై దుర్మార్గపు రాతలు
-
‘ఇంటి’ దొంగల ఏడుపు!
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లంటూ హడావుడిగా టెంకాయలు కొట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ ఒక్కరికీ గృహ యోగం కల్పించకుండా దగా చేశారు! పేదలకు ఇళ్లంటూ రెండు దశాబ్దాల పాటు గృహ రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి కల్పించారు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పేదలు తలెత్తుకుని ఆత్మ గౌరవంతో జీవించేలా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ యజ్ఞాన్ని చేపట్టారు. 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను పేదలకు ఉచితంగా అందించడంతో పాటు ఇతర టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు భారీ ఊరట కల్పించారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తుంటే ఈనాడు రామోజీ కడుపు మంటతో రగిలిపోతున్నారు. పేదల గూడుపై తన కరపత్రికలో బురద చల్లుతున్నారు. ‘ఇక్కట్ల ఇళ్లు.. జగన్‌కే చెల్లు!’ తొమ్మిది చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ఓ రోత కథనాన్ని రాసుకుని సంబరపడ్డారు! నిజానికి ఆయన చెబుతున్న తొమ్మిది చోట్ల వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, నీటి సరఫరా, సెప్టిక్ ట్యాంక్‌లు ఇతర పనులన్నీ పూర్తి అయ్యాయి. విశాఖపట్నం ఏఎస్ఆర్ కాలనీలో సిమెంట్ రోడ్లు లేవని, మురుగు కాల్వలు మచ్చుకైనా కనిపించడం లేదంటూ కన్నీళ్లు కార్చారు. అక్కడ 280 ఇళ్లలో లబ్ధిదారులు నిక్షేపంగా నివాసం ఉంటున్నారు. -
ఇళ్ల సౌకర్యాలు బాగుండాలి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంటినీ ఆడిట్ చేయండి జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటిని ఆడిట్ చేయాలి. అందులో భాగంగా విద్యుత్, తాగునీరు కనెక్షన్లు ఇచ్చారా? ఇంకుడు గుంత ఉందా? తదితర అంశాలను పరిశీలించాలి. ఇంటి నిర్మాణంలో పేదలపై భారం పడకూడదు అదనపు సాయం కింద పావలా వడ్డీకి బ్యాంకు రుణాలను మంజూరు చేశాం. మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలి. గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరికి మరో ఐదు లక్షల ఇళ్లు నవరత్నాల పథకం కింద 21.25 లక్షల పేదల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేదింటి అక్కచెల్లెమ్మలకు అందించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. గత సమీక్షలో సీఎం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేసినట్లు వివరించారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను సమకూర్చడంతోపాటు ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం అదనపు సాయం కింద 12,72,143 మంది మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున రుణాలను అందించామన్నారు. ఇలా రూ.4,483 కోట్ల మేర రుణాలను మహిళలు అందుకున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పట్టణ ప్రాంత పేదలకు అందించిన టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థంగా పనిచేసేలా చూడాలి. వారికి తగిన అవగాహన కల్పించి ప్రభుత్వం అందించిన రూ.లక్షల విలువైన ఆస్తిని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో దిశానిర్దేశం చేయాలి. తద్వారా భవనాలు నాణ్యతగా ఉండటంతోపాటు పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ ఉంటుంది. -
టిడ్కో లబ్ధిదారులను తప్పుదోవ పట్టించడానికి నిమ్మల యత్నాలు
-
ఉత్సాహంగా టిడ్కో గృహ ప్రవేశాలు
కాకినాడ : టీడీపీ పాలనలో జరిగిన అసంపూర్ణ నిర్మాణాలు, లోపాలను సరిచేసి ప్రైవేటు లేఅవుట్లలో ఉండే బహుళ అంతస్తుల భవనాల తరహాలో రూపుదిద్దుకున్న టిడ్కో గృహాలను శుక్రవారం జిల్లా కేంద్రం కాకినాడలో లబ్ధిదారులకు అప్పగించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి విడత 1,152 మందికి ఇళ్ల పత్రాలు, తాళాలు అప్పగించారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఇళ్లను చూసుకుని లబ్ధిదారులు మురిసిపోయారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్న చొరవ వల్ల లబ్ధిదారుల సొంతింటి కల సాకారమైందన్నారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రూ.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమకూర్చిన రెండు ఉచిత బస్సులను మంత్రి సురేష్ ప్రారంభించారు. అవినీతిపరుడిని వెనుకేసుకొస్తున్న పవన్ టీడీపీ, జనసేన పొత్తుకు ఎలాంటి అజెండా లేదని, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబును పవన్‌కళ్యాణ్ వెనకేసుకురావడాన్ని మంత్రి తప్పుబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలిస్తున్నట్టు చెప్పారు. అమ్మఒడి వంటి ప్రయోజనాలు కల్పించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
కదిలిన అవినీతి పునాది!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి రూ.వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఎలా కాజేశారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా తరలించిన రూ.118.98 కోట్లను లెక్క చూపని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. 46 పేజీల ఆ సుదీర్ఘ లేఖలో నగదును ఏ విధంగా తరలించారు? బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మెసేజ్‌లు, ఎక్సెల్ షీట్లు, కోడ్ భాషలో రాసుకున్న సంకేతాలను విశదీకరిస్తూ అన్ని సాక్ష్యాధారాలతో మరీ నోటీసులిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అత్యధిక కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను చంద్రబాబు స్వయంగా పరిచయం చేశారు. పీఎస్ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తనకు చేరవేస్తుంటారని, అతడి ద్వారా తాను సూచనలు చేస్తుంటానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ముడుపులపై మనోజ్ వాసుదేవ్ పార్థసానికి దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబుకు ముడుపులు ఏ రూపంలో, ఎలా ఇవ్వాలో ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పేవారని, లేదంటే తమ బిల్లులు పాస్ కాకుండా పెండింగ్‌లో పెట్టేవారని పార్థసాని వాంగ్మూలంలో వెల్లడించాడు. చంద్రబాబుకు రూ.వందల కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు మనోజ్ పార్థసాని తన వాంగ్మూలంలో ఐటీ శాఖకు తెలియచేశాడు. వితండ వాదనతో మళ్లీ నోటీసులు.. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అదే ఏడాది నవంబరు 1, 5వ తేదీల్లో అతడిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2020లో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు వితండ వాదన చేయడంతో ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ ఆయనకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జత చేయటంతో చంద్రబాబు ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు వెల్లడైంది. అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబుకు ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నందున దీన్ని అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. పేదల ఇళ్లలోనూ.. తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన చంద్రబాబు పేదల ఇళ్లను సైతం వదల్లేదు. రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ దోపిడీకి వేసిన పథకం ఐటీ నోటీసుల్లో బయటపడింది. ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదలకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని సూచించినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. లోకేశ్‌కూ అవినీతి సొమ్ము ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపారు. ఈమేరకు చంద్రబాబుకు జారీ చేసిన సుదీర్ఘ నోటీసుల్లో నారా లోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేశ్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నిస్తూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్షాట్ల రూపంలో జత చేసి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్‌లన్నీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వా«దీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవి కావడం గమనార్హం. వీటిని శ్రీనివాస్ ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజే‹Ùకు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి ప్రస్తావించగా కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను టీడీపీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్‌కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. -
టిడ్కో ఇళ్లకూ రూ.8,929 కోట్ల ‘టెండర్’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లోని టిడ్కో ఇళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో ఎక్కడా లేనంతగా నిర్మాణ వ్యయాన్ని చూపించి దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లులేని 5 లక్షల మంది పేదలకు ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, ఎక్కువ ముడుపులు చెల్లించిన కంపెనీకి అధిక ధరకు.. తక్కువ ఇచ్చిన కంపెనీకి ఆ మేర తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ఎంతగా అంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ కూడా వసూలుచేయనంత ధర నిర్ణయించారు. ఇచ్చుకున్నోడికి ఇచ్చుకున్నంత.. నిజానికి.. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.వెయ్యి కంటే తక్కువే ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలు ఇచ్చుకున్న ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చి చంద్రబాబు సర్కారు రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. వ్యాట్ నుంచి గడ్డి వరకు.. సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానా అంతా అవినీతి, అక్రమాలే. రాష్ట్ర విభజన నాటికి రైసు మిల్లర్లకు బకాయి పడిన రూ.500 కోట్ల వ్యాట్ బకాయిలను మాఫీ చేస్తూ 2015లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక లోకేశ్ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపణలు విన్పించాయి. మిల్లర్లతో లోకేశ్ రాయబేరాలు సాగించి బకాయిలు రద్దు చేయాలంటే రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో బియ్యం ఎగుమతులపై కూడా వ్యాట్ రద్దు చేస్తే, అడిగింది ఇచ్చేందుకు సిద్ధమని మిల్లర్లు చెప్పారు. దీంతో మిల్లర్ల వ్యాట్ బకాయిల మాఫీ అతి వేగంగా జరిగిపోయింది. పత్తి రైతుల పేరిట రూ.200 కోట్లు స్వాహా నాసిరకం పత్తిని సీసీఐకు అమ్మేసి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు రూ.200 కోట్లు తినేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సగభాగం చంద్రబాబుకు ముట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పుల్లారావు ఓ వ్యాపారితో కలిసి రైతుల పేరిట నాసిరకం పత్తిని కొన్నారు. దీనిని బంధువులు, దళారుల పేర్లతో సీసీఐకు అమ్మేశారు. అంతేకాదు సీసీఐ సేకరించిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి కొన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా తేల్చింది. పచ్చిగడ్డిలోనూ పచ్చ నేతల మేత పశువుల గడ్డిలోనూ టీడీపీ నేతల మేత బాగానే ఉంది. సైలేజ్ (పాతర గడ్డి) పేరిట ‘కోట్లు’ స్వాహా చేశారు. ప్రభుత్వం ఏటా 75 శాతం సబ్సిడీపై రైతులకు పశుగ్రాసం సరఫరా చేస్తుంటుంది. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె సాయికృపా పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ పేరుతో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సబ్సిడీ సొమ్మును కాజేశారు. రైతులు చెల్లించాల్సిన వాటాను బినామీల పేరిట చెల్లించి 75 శాతం సబ్సిడీ సొమ్మును స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన విజిలెన్స్ విచారణను సైతం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. చంద్రన్న కానుక పేరిట కోట్లు స్వాహా 2015 సంక్రాంతి పండుగ వేళ చంద్రన్న కానుక పేరిట నాణ్యత లేని రేషన్ సరుకులను కార్డుదారులకు పంచిపెట్టారు. ఈ పథకం కింద ఒక్కో కార్డుదారునికి కానుక కోసం రూ.270 చొప్పున కాంట్రాక్టర్లకు రూ.430 కోట్లు ఇచ్చారు. అయినా ఎందుకూ పనికిరాని రేషన్ సరుకులు సరఫరా చేశారు. పురుగులు పట్టిన కందిపప్పు, పనికిరాని బెల్లం, దుర్వాసన కొట్టే గోధమ పిండి పంచి పెట్టి రూ.100 కోట్లకు పైగా వెనకేసుకున్నారు. కార్మికుల సొమ్మూ తినేశారు సాక్షి, అమరావతి: నెలనెలా జీతం నుంచి ఈఎస్ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మునూ కాజేశారు టీడీపీ నేతలు. 2014 – 2019 మధ్య రూ.150 కోట్లకు పైగా కార్మికుల సొమ్మును తినేశారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలతో నామినేషన్‌పై ఆర్డర్లు ఇచ్చి ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 2020లో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్ సీకే రమేష్‌కుమార్, డాక్టర్ జి.విజయ్‌కుమార్ సహా పలువురిని కూడా అప్పట్లో అరెస్టు చేశారు. ఈ కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరింది. త్వరలో ఏసీబీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయనుంది. కార్మికుల సొమ్ము తినేశారిలా.. నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండర్లు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎవరికి ఏ కాంట్రాక్టు ఇవ్వాలో అధికారులను ముందే ఆదేశించారు. ఈమేరకు లెటర్‌హెడ్‌పై సిఫార్సులు చేస్తూ అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఆయన సూచించిన కంపెనీలకు మందులు, వైద్య పరికరాల సరఫరా, ఇతర కాంట్రాక్టులు అప్పజెప్పారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాల్ సెంటర్, టోల్‌ఫ్రీ, ఈసీజీ కాంట్రాక్టు ఇచ్చారు. ఎక్కడైనా రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. కాల్ సెంటర్లో కాల్స్‌కి కాకుండా సర్వీస్ ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీ, ఫేక్ కాల్ లాగ్స్‌కి కూడా రూ.1.80 చొప్పున బిల్ క్లెయిమ్ చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన రూ.89.58 కోట్ల విలువైన మందులు కొన్నారు. లెజెండ్ ఎంటర్‌ప్రై జెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు. లేబొరేటరీ కిట్ల కోసం రూ.237 కోట్లు ఖర్చు చేశారు. రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్ మెషీన్లను రూ.70 వేలకు కొన్నారు. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొన్నారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు అప్పగించారు. కార్మికులకు షాంపూలు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు ఖర్చు చేశారు. ఏటా బడ్జెట్టే రూ. 300 కోట్లు ఉండగా, రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. -
పేదల ఇళ్లలోనూ పేలాలు ఏరుకున్న చంద్రబాబు
-
టిడ్కోలో కూడా చంద్రబాబు ‘డబుల్’ దోపిడీ!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా సాగిన దోపిడీ, ప్రజాధనం లూటీకి టిడ్కో ఇళ్లే నిలువెత్తు సాక్ష్యం. ఈ నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది.. ఇసుక ఉచితం.. నిర్మాణ అనుమతులకు ఎలాంటి ఫీజులూ లేవు. వసతులు, సదుపాయాలు కల్పించాలన్న నిబంధన కూడా టెండర్లలో లేదు. అలాంటప్పుడు మార్కెట్ రేటు కంటే టిడ్కో ఇళ్ల నిర్మాణ ధర తగ్గాల్సింది పోయి రెట్టింపు కావడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. నిరుపేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది. ఎనిమిది కంపెనీలకు కాంట్రాక్టు.. పట్టణాల్లో సొంత ఇల్లు లేని సుమారు 5 లక్షల మందికి జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో టిడ్కో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ. విస్తీర్ణంలో కట్టే టిడ్కో ఇళ్లకు నాటి మార్కెట్ ధర కంటే రెండింతలు పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. కంపెనీని బట్టి చ.అడుగుకు రూ.2,534.75 నుంచి రూ.2034.59 మధ్య నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. సగటున చ.అడుగు నిర్మాణ ధర రూ.2,203.45 చొప్పున టెండర్లు అప్పగించారు. అంటే బయట మార్కెట్ కంటే అదనంగా రూ.1203.45 పెంచారు. తొలి విడతలో 2,08,160 టిడ్కో యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించే కాంట్రాక్టును ఎనిమిది కంపెనీలకు కేటాయించారు. నిజానికి అప్పుడు పట్టణాల్లో ప్రైవేట్ అపార్ట్మెంట్లను చ.అడుగు రూ.1,000 లోపే నిర్మిస్తుండటం గమనార్హం. టిడ్కో ఇళ్లకు నాడు ఇసుక ఉచితం. సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా తక్కువే కాబట్టి వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపైంది. టిడ్కో ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో నిర్మిస్తున్నందున గరిష్టంగా చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.1000కి మించదని ఈ విధానంలో ఎన్నో ఏళ్లుగా అపార్ట్మెంట్లు కడుతున్న కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రివర్స్ టెండర్లతో ఖజానాకు ఆదా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రివర్స్ టెండరింగ్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో 2020 ఏప్రిల్‌లో 54,056 టిడ్కో యూనిట్లకు చ.అ. నిర్మాణానికి సగటున రూ.1,655.31 చొప్పున టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయించిన దానికంటే చ.అడుగుకు రూ.548.14 తక్కువ ధరకు టెండర్లు చేయడంతో ఖజానాకు దాదాపు రూ.321 కోట్లు ఆదా అయ్యాయి. పైగా ఈ నిర్మాణాలకు ఇసుక ఉచితం కాదు. సిమెంటు, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి, కూలీల రోజువారి వేతనాలు అన్నీ గత ప్రభుత్వ హయాం కంటే ఎక్కువే ఉన్నా ధర తగ్గించి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును చంద్రబాబు బృందం తమ అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నదనేందుకు ఇది నిదర్శనం. ఇంటికి రూ.2 వేలు.. ఫ్లాట్‌కి రూ.1,500 సాధారణంగా వ్యక్తిగత ఇల్లు, అపార్ట్మెంట్ నిర్మాణాల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంటికి అయిన ఖర్చులో అపార్ట్‌మెంట్‌కు సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు వ్యక్తిగత ఇల్లు నిర్మాణ ధర చ.అ రూ.2 వేలు ఉంటే అపార్ట్మెంట్లో చ.అ. రూ.1500 వరకు ఉంది. ఇవన్నీ ఎక్కువ మంది కోరుకునే ప్రాంతాల్లో చెబుతున్న సరాసరి ధరలు. అదే పట్టణాలకు దూరంగా నిర్మిస్తే గరిష్టంగా రూ.700 నుంచి రూ.900 మించదు. – వీవీఎన్ యుగంధర్, భవన నిర్మాణ సంస్థ యజమాని, కాకినాడ రూ.1,200 మించదు కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. టిడ్కో ఇళ్లు ప్రారంభించినప్పుడు కాకినాడలో అపార్ట్మెంట్లు కట్టా. స్థలంతో కలిపి అన్ని సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఫ్లాట్లను చ.అడుగు రూ.1,900 నుంచి రూ.2,000 మధ్యనే ఇచ్చాం. అలాంటిది ప్రభుత్వ స్థలంలో ఉచిత అనుమతులు, ఉచితంగా ఇసుక ఇస్తే చ.అడుగుకు గరిష్టంగా రూ.800 మాత్రమే అవుతుంది. టిడ్కో ఇళ్లకు అప్పుడు ఇన్ని వసతులు కూడా లేవు. అన్ని వసతులతో అద్భుతంగా కడితే చ.అ రూ.1,200కి మించే అవకాశం లేదు. – బసవా ప్రసాద్, బిల్డర్(కాకినాడ) అక్రమాలు జరిగినట్లే.. పట్టణంలో ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఫీజుల రూపంలో చ.అడుగుకు రూ.270 వరకు చెల్లించాలి. ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి అధికంగా ఖర్చవుతుంది. స్థలంతో కలిపి 2016–17లో విశాఖలో మేం కట్టిన అపార్ట్మెంట్లో చ.అ. రూ.2వేల నుంచి రూ.2200కే ఇచ్చాం. అన్ని వసతులు కల్పించాం. పేరున్న కంపెనీల వస్తువులనే వాడాం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. నాడు ఇసుక కూడా ఉచితం. ఇంటీరియర్ సొబగులు లేవు. మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి నిర్మాణాల్లో చ.అ రూ.700కి మించి ఖర్చుకాదు. ఆ ధర దాటిందంటే అక్రమాలు జరిగినట్టే. – బర్కత్ అలీ, బిల్డర్ (విశాఖపట్నం) ఇప్పుడూ అంత ధర లేదు ఎన్నో ఏళ్లుగా కాకినాడలో నిర్మాణాలు చేస్తున్నాం. అ పార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల ధర అన్ని సదుపాయాలు, స్థల ంతో కలిపి ఇప్పుడైతే చ.అ. రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. విశాఖలో మరో రూ.2 వందలు ఎక్కువ ఉంది. నాలుగైదేళ్ల క్రితం అయితే ఇందులో సగం కూడా లేదు. ప్రభుత్వ ప్రాజెక్టులైతే ఫీజులు ఉండవు కాబట్టి రూ.వందల్లోనే ఉండాలి. – ఎం.గంగబాబు, బిల్డర్ (కాకినాడ) -
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
అసత్యమే సిరా.. సత్యం వధ.. నాడు కళ్లకు గంతలు.. నేడు పిచ్చిరాతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ సత్యాన్ని వధించి, అసత్యమనే సిరాతో తన ఈనాడు పత్రికలో మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ‘ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు’ శీర్షికన విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో పరిస్థితి ఇదంటూ టీడీపీ పాలనలో చేసిన మోసాలను కప్పిపుచ్చి, ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు రాతలతో విషం చిమ్మారు. వాస్తవం ఏమిటంటే.. 2019 ఎన్నికల్లో ఎలా అయినా గెలుపొందాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తెరపైకి తీసుకొచ్చింది. కేవలం 6,500 ఇళ్లు (ఫ్లాట్లు) మాత్రమే నిర్మించేందుకు భూమిని సేకరించింది. టిడ్కో ఇళ్లు ఇస్తామంటూ ఏకంగా 11,917 మంది పేదల నుంచి రూ.38.33 కోట్లు వసూలు చేసింది. మరో వైపు టీడీపీ కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల దరఖాస్తులను బ్లాకులో విక్రయించారు. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు టీడీపీ చేసిన మోసాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివ్వెరపోయింది. పక్కాగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 5,341 మంది బాధితులకు వారు చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వడంతో పాటు, వారి పూర్తి అంగీకా రంతో ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. టిడ్కో ఇళ్ల కోసం 5,341 మంది లబి్ధదారులు డీడీల రూపంలో టిడ్కోకు రూ.16 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును లబి్ధదారులకు తిరిగి చెల్లిస్తున్నారు. నిర్మించని ఇళ్లకు నంబర్లు వేసి మరీ మోసం పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో 12 వేల ఇళ్ల నిర్మాణానికి 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాద గ్రామంలో 74 ఎకరాలు మాత్రమే తీసుకుంది. అది కొండ ప్రాంతం కావడంతో అధికారులు, ఇంజినీర్లు అహరి్నశలూ శ్రమించి చివరకు 6,576 ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన 11,917 మందికి ఇళ్లు కావాలంటే మరో 100 ఎకరాల వరకు అవసరం. ఎకరం రూ.కోటి చొప్పున 100 ఎకరాలు కొనేందుకు నాడు సర్వేలు చేపట్టిన చంద్రబాబు ఆ రూ.100 కోట్లను రైతులకు చెల్లించకుండానే చేతులు ఎత్తేశారు. కొండ ప్రాంతంలో 6,576 ఇళ్ల నిర్మాణమే సాధ్యమని తెలిసినా.. ఎన్నికల్లో గెలుపొందాలనే దురాశతో 11,917 మంది లబి్ధదారులకు ఏకంగా ఇంటి నంబర్లతో స్లిప్పులు తయారు చేయించారు. ఇళ్లు నిర్మించకుండా, సరిగ్గా ఎన్నికల ముందు 2019 జనవరి 17వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి, ఆ స్లిప్పులు పంపిణీ చేసి మోసగించారు. ఇది ఈనాడుకు కనిపించదా? విజయవాడ నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని, పేదల నుంచి టీడీపీ కార్పొరేటర్లు, వారి అనుచరులు నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో నమ్మించి నగదు వసూలు చేశారు. రెండు వేల మందికిపైగా లబ్ధిదారుల నుంచి రూ.70 కోట్లు వసూలు చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ టీడీపీ నాయకులు మోసం చేశారంటూ స్పందన కార్యక్రమంలో ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యవహా రంపై ఈనాడు పెన్నెత్తి ఒక్క వార్తా రాయదు. మేలు చేసిన ప్రభుత్వంపై విషం టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసిందనే విషయం ఏ బాధితుడిని అడిగినా చెబుతారు. ‘ఈనాడు’కు ఆ విషయా లేవీ కనబడకపోవడం, బాధితుల గోడు వినబడకపోవడం విడ్డూరంగా ఉంది. లబి్ధదారులు చెల్లించిన ప్రతి రూపాయి సహా లెక్కలు సేకరించిన ఆ పత్రికకు, ఆ డబ్బులు నాడు ఎలా మాయమయ్యాయి, టీడీపీ కాజేసిన ఆ డబ్బుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లించింది, బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించి ఎలా బాసటగా నిలిచింది అన్న వాస్తవాలు కనబడకపోవడం సిగ్గుచేటు. టీడీపీకి కొమ్ముకాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇలా అవాస్తవాలతో విషం చిమ్మడం, సత్యం ముందు బొక్కబోర్లాపడి ప్రజా కోర్టులో దోషిగా నిలిచి నవ్వులపాలవడం ఆ పచ్చ పత్రికకు సర్వసాధారణమైంది. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాం ఇప్పటికే లాటరీ ద్వారా 6,576 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటా యించాం. గతంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక లేకుండానే 11,917 మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికే ఇళ్లు కేటాయించగా, మిగిలిన వారు నష్టపోకుండా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం చేపడు తున్నాం. వారు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తున్నాం. ఇప్పటికే రూ.13.5 కోట్లు వెనక్కు ఇచ్చాం. మరో రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఇందులోనూ రూ.1.5 కోట్లకు సంబంధించిన బిల్లులపై సంతకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ -
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అక్కచెల్లెమ్మలకు రూపాయికే టిడ్కో ఇళ్లు
-
పేదల సొంతింటి స్వప్నం.. సాకారం చేసిన జగనన్న ప్రభుత్వం
-
జగనన్న వల్లే టిడ్కో ఇల్లు వచ్చింది.. అన్ని మౌలిక వసతులతో నిర్మించి ఇస్తున్నారు
-
వైద్య రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే వైద్య కళాశాలలను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. కేంద్ర మంత్రి గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో గృహాలను సందర్శించి అక్కడ స్థానికులతో, భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 387 నుంచి 648కి పెంచారని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. దేశంలో 2014 వరకు 60 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 3.50 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అయినా మోదీ చిత్రపటం ఎక్కడా లేదని అన్నారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, ఇక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండాలని, ప్రధాని ఆవాస్ యోజన అని రాసి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ 6,144 గృహాలు మంజూరవ్వగా 1854 మందికే ఇళ్లు అప్పగించారని, సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు. తాను మళ్లీ వచ్చేసరికి మిగిలిన ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పారు. సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతమని, రాష్ట్ర ప్రభుత్వం వాటా 35 శాతమని, లబ్ధిదారుల వాటా 45 శాతం ఉందని తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి ఎదుట రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించాలని కొందరు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమస్యలున్న వారు చేతులెత్తాలని వారు ప్రజలను కోరగా, ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఖంగుతిన్నారు. -
30 ఏళ్ల క్రితమే సీఎం అయిన వ్యక్తి రాష్ట్రానికి చేసిందేంటి ?
-
జగనన్న వల్లే టిడ్కో ఇల్లు వచ్చింది.. అన్ని మౌలిక వసతులతో నిర్మించి ఇస్తున్నారు
-
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్‌తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్‌కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్‌కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్‌ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్‌లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు..!
-
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ
-
ఇది మహాయజ్ఞం.. దేవుడు నాకిచ్చిన అవకాశం: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: రాష్ట్ర సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం. ప్రతీ లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 16,240 కుటుంబాలు.. ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే కాలనీలో నివాసం ఉండబోతోంది. రూ. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 178 ఎకరాల్లో 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. ► ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8వ తేదీన 8,859 ఇళ్ల పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం. ఇదే గుడివాడకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మనం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు 17,000.. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. ► అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల పట్టాల మీద 75,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం. ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు లక్ష ఖర్చు.స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 - 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ► దేవుడు నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా. కొంత మందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువయ్యాయి. నిరుపేదలకు నివాసం ఉండే 300 చ.అ. ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2వేలు. ఒక్కో ప్లాట్ కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో లక్ష. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం 1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోంది. మిగిలిన 3 లక్షల రూపాయలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. ► చంద్రబాబు హయాంలో.. నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు. అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు. వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నాం. ► 365 చదరపు అడుగలకి సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చ.అ. వాటికి 50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం లక్ష, మరో 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి 4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 430 చ.అ. తీసుకున్న ప్రతి పేద వాడికీ 3 లక్షలు కాకుండా, డిపాజిట్ లక్ష నుంచి 50 వేలకు తగ్గించాం. రూ. 4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. ► టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రభుత్వం 16,601 కోట్లు ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం. అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతున్నా. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి?. నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. ఆలోచన చేయాలి.మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ► అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు. అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్లు సంవత్సరాల కాలంలో 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా వెళ్తున్నాయి. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతు భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు ఇవ్వగలిగాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం 19,674 కోట్లు. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం. చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు రూ. 14,129 కోట్లు ఇవ్వగలిగాం. అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని విద్యాదీవె, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగాం. మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు? అని సీఎం జగన్ గుడివాడ బహిరంగ సభగా నిలదీశారు. -
CM Jagan Gudivada Tour Photos: గుడివాడలో గృహయజ్ఞం.. సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
Updates: ► చంద్రబాబు పేదల వ్యతిరేకి: సీఎం జగన్ ► మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు. ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా మంచి చేశారా?. ► మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు. ► మరోసారి ఛాన్స్ ఇవ్వాలంటున్న బాబు అప్పుడు ఏం చేశారు? ► మంచి చేశాను కాబట్టి ఓటు వేయండి అని అడగడం లేదు. ► ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబు దగ్గర లేదు. ► టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశారు. ► పేదలు నెలకు రూ. 3వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలన్నారు. ► ఈ ప్రభుత్వం 300 చ.అ ఇళ్లను రూపాయికే అందిస్తోంది. ► చంద్రబాబు తాను చేయని పని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. ►అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు ►సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలను ఇవ్వగలిగాం. ► ప్రతి లబ్ధిదారునికి రూ. 7లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం: సీఎం జగన్ ► 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తాం. ► రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. ► రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారునికి ఇచ్చిన ఇంటిస్థలం విలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షలు ► గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కానీ ఇవ్వలేదు. ►రాష్ట్ర సర్కార్ నిర్మిస్తుంది జగనన్న కాలనీలు కాదు.. ఊర్లు: సీఎం జగన్ ►అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చాం. ►జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. ►గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ►ప్రజలకుసీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదు. ►ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారు. ►సీఎం జగన్ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయి. ►జగనన్న సంకల్పం ముందు దుష్టశక్తుల శక్తులన్నీ పటాపంచలయ్యాయి. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారు. ►చంద్రబాబు హయాంలో దోపిడిని ఎల్లో మీడియా ప్రశ్నించదు. ►సీఎం జగన్ ప్రభంజనంతో పచ్చపార్టీలో వణుకు పడుతోంది. ►అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను సీఎం జగన్ పూర్తి చేశారు. ►నాయకుడు ఎలా ఉంటాడనే వారిని ఉదాహరణసీఎం జగన్ ►20 ఏళ్ల కల నెరవేర్చడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే కొడాలి నాని ►గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి చలవే. ►రూ.800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు చెల్లించిన డబ్బు రూ. 180 కోట్లు. అందులో రూ.160 కోట్లు కేంద్రం ఇచ్చింది. ►టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి జగన్ సర్కార్ ఇచ్చింది రూ. 400 కోట్లు. ►గుడివాడ వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతాడు. ►ఎన్టీఆర్ సొంత గ్రామానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. ►చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలి. ►చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లు 3 నెలలకే గోతులమయంగా మారేవి. ►గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చిన మహానుభావుడు దివంగత వైఎస్సార్. ►చంద్రబాబు మాట నేను వింటే చరిత్రహీనుడిని అయ్యేవాడిని. ►రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు లక్ష ఎకరాలను ఇంటి స్థలాల కింద ఇచ్చిన సీఎం జగన్ ►రాష్ట్రంలో నిరుపేదలకు రూ.15 లక్షల కోట్లు సీఎం జగన్ వెచ్చిస్తున్నారు. ►గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఒక ఎకరం కొనుగోలు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా. టిడ్కో గృహ సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ►టిడ్కో గృహ సముదాయంలో వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ► మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌లోని టిడ్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో కొనసాగుతోంది. రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు గుడివాడ ప్రజలు జేజేలు పలికారు. ►గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. సీఎంకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ తదితరులు ఘనస్వాగతం పలికారు. టిడ్కో గృహాలను సీఎం సందర్శించారు. అనంతరం టిడ్కో ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాసేపట్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ►తాడేపల్లి నుంచి సీఎం జగన్ గుడివాడ బయల్దేరారు. ► 20 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న ఇళ్లు లేని పేదలు.. ►టిడ్కో గృహాల పంపిణీతో తీరనున్న పేదల సొంతింటి కల. ►గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 10 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం 2007లో పాదయాత్ర చేసిన కొడాలి నాని. ►గుడివాడ నుంచి హైదరాబాద్ వరకూ 320 కి.మీ పాదయాత్ర చేసిన కొడాలి నాని. ►అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్సార్‌కు వినతిపత్రం అందించిన కొడాలి నాని. ►రెండవసారి సీఎం అవ్వగానే మల్లాయపాలెంలో 77.46 ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేసిన వైఎస్సార్, కొడాలి నాని. ► సీఎం అయితన తర్వాత మల్లాయపాలెంలో పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేసిన చంద్రబాబు. ►2019 ఎన్నికల ముందు పూర్తికాకుండానే అబ్ధిదారులకు చంద్రబాబు టిడ్కో ఇళ్ల పంపిణీ ►జగన్ సీఎం అయిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి. ►ఇళ్ల నిర్మాణం కోసం రూ.799.19 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. ►టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 178.63 ఎకరాలు సేకరించి.. 7,728 మంది పేదలకు పంపిణీ ►టిడ్కో ఇళ్ల పక్కనే శరవేగంగా జరుగుతున్న 4,500 ఇళ్ల నిర్మాణాలు సాక్షి, అమరావతి/విజయవాడ: రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో లే–అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. మరో రూ.4,626 కోట్లను సబ్సిడీ గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 20 ఏళ్లపాటు నెలకు రూ.3 వేల చొప్పున అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి. అంటే నిరుపేదలు చెల్లించాల్సిన అక్షరాల రూ.10,339 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 365 చ.అ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 74,312 మంది 430 చ.అ. లబ్దిదారులకు రూ.50 వేల చొప్పున ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా జగనన్న ప్రభుత్వమే భరించడంతోపాటు మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా ఇచ్చింది. ఉచితంగా రిజిస్ట్రేషన్ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లు ప్రతిపాదించిన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యంగా వదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాకే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. దీంతో ఒక్కో లబ్దిదారుడికి అదనంగా మరో రూ.60 వేల వరకు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ రూపంలో రూ.11,672 కోట్లు, ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ.482 కోట్లు, ఉచిత రిజి్రస్టేషన్ల రూపంలో రూ.1,200 కోట్లు, మౌలిక వసతులకు మరో రూ.3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ.16,601 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. రూ.657 కోట్లతో 13,145 ఇళ్ల పట్టాలు గుడివాడ నియోజకవర్గంలో 84 వైఎస్సార్–జగనన్న లేఅవుట్లలో రూ.657 కోట్ల విలువైన 13,145 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల కింద రూ.239 కోట్లు విలువైన 8,859 ఇళ్లు మంజూరు చేసింది. మౌలిక వసతులకు మరో రూ.87 కోట్లు వెచ్చించింది. గుడివాడలో రూ.983 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులకు ఖర్చు చేసింది. లక్షల ఇళ్ల పంపిణీ సీఎం జగన్‌కే సాధ్యం: టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సాక్షి, అమరావతి: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప సాహసం మన సీఎం జగన్మోహన్రెడ్డి చేశారని, లక్షల మందికి ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయించడం పేదల ప్రగతి పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం తుళ్లూరులో రెండోవిడతగా మూడువేల మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సీఎం జగన్ మొక్కవోని దీక్షతో పేదప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పారు. న్యాయపరమైన సమస్యలను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్లస్థలాలు కేటాయించారన్నారు. ఇన్ని వేలమందికి ఇంటిపత్రాలు ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసమని పేర్కొన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. అంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, వైఎస్సార్సీపీ స్థానిక కో ఆర్డినేటర్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. -
Fact Check: టిడ్కో ఇళ్లపై పచ్చ పైత్యం!
సాక్షి, అమరావతి: పట్టణ నిరుపేదలు ఇళ్లు పొందాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలని షరతు విధించి టిడ్కో లబ్ధిదారులపై బ్యాంకు రుణాల భారాన్ని మోపిన చంద్రబాబు ఏ ఒక్కరికీ సొంత గూడు కల్పించిన దాఖలాలు లేవు. ప్రచార ఆర్భాటం మినహా ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు. పేదల కనీస అవసరాల పట్ల అంత దారుణంగా వ్యవహరించినా ఎల్లో మీడియా నాడు ప్రశ్నించిన పాపాన పోలేదు! ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను తీర్చిదిద్ది పేదలకు అప్పగిస్తుంటే బరి తెగింపు రాతలకు తెగబడుతోంది! నాడు గత ప్రభుత్వంలో లబ్ధిదారుల పేరిట బ్యాంకు రుణాలను తీసుకున్నారు. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం లబ్ధిదారులు 7,510 మందికి రూ.95 కోట్లు, 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారులు 5,058 మందికి మరో రూ.87 కోట్లు చొప్పున మొత్తం రూ.182 కోట్లు తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎన్పీఏగా మారింది చంద్రబాబు సర్కారు హయాంలోనే కావడం గమనార్హం. నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,43,600 మంది 300 చ.అ. లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే అందిస్తోంది. మరో 65,671 మంది (365, 430 చ.అ.) లబ్ధిదారులకు రూ.1,778 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. టీడీపీ సర్కారు ఎన్పీఏగా మార్చిన 300 చ.అ లబ్ధిదారుల రుణాలు రూ.110 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021, 2022లో చెల్లించింది. 365, 430 చ.అ. లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం తీసుకున్న బ్యాంకు రుణాలపై రూ.40 కోట్ల వడ్డీని లబ్ధిదారుల తరఫున ఏపీ టిడ్కో చెల్లించింది. దీంతో పాటు చంద్రబాబు జమానాలో రుణాలు తీసుకున్న 5,058 మంది 365, 430 చ.అ. లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇళ్లను ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వంలో ఎన్పీఏగా మారినవారి సంఖ్య 3,058కి తగ్గింది. నాడు గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇళ్లను కేటాయించలేదు. నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 65,671 మంది 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారుల్లో 31,558 మందికి ఇళ్లను అప్పగించడంతో వారెవరూ ఎన్పీఏలుగా మారలేదు. బ్యాంకు రుణాలు తీసుకున్న మరో 33,752 మందికి ఇళ్లను ఆగస్టు నాటికి అందజేయాలని నిర్ణయించారు. అంటే వారు కూడా ఎన్పీఏ పరిధిలో లేరు. ఫేజ్–2 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో 361 మంది మాత్రమే నవంబర్ నాటికి రూ.12.65 కోట్ల మేర ఎన్పీఏగా మారనున్నట్లు అంచనా. వీరికి డిసెంబర్లో ఇళ్లను ఇవ్వనున్నారు. అంటే కేవలం ఒక్క నెల మాత్రమే ఎన్పీఏగా మారే అవకాశం ఉంది. అయితే ఆ భారం లబ్ధిదారులపై పడకుండా ప్రభుత్వమే చెల్లించనుంది. తప్పుడు కథనాలు.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను పట్టణ పేదలకు అందిస్తోంది. ఇందులో 300 చ.అడుగుల్లో నిర్మించిన 1.43 లక్షల ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే ఇస్తున్నాం. వీటిపై ఎలాంటి రుణం తీసుకోలేదు. మిగిలిన 1.19 లక్షల ఇళ్లల్లో 60 వేల యూనిట్ల నిర్మాణం పూర్తైంది. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం. మిగిలిన ఇళ్ల విషయంలో కూడా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ కేటగిరిలోనూ ఇళ్ల లబ్ధిదారులపై భారం ఉండదు. ఎల్లో మీడియా పనిగట్టుకొని తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల్లో అయోమయం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నిర్లక్ష్యం, తప్పిదాలను కూడా ప్రచురించాలి. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి -
పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్
-
టిడ్కో ఇళ్ల ద్వారా మా సొంతింటి కల నెరవేరింది
-
సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శుక్రవారం) గుడివాడ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, సీఎం జగన్ రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించాల్సి ఉంది. -
మారీచులపై నిరుపేదల విజయమిది
మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25 లే అవుట్లలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం వారం పాటు పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతి అక్కచెల్లెమ్మను లే అవుట్ వద్దకు తీసుకెళ్లి, అక్కడే ఇంటి పత్రాలు అంద జేస్తారు. ఆ స్థలంలో ఫొటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తయ్యాక ఇళ్లు కట్టించే కార్యక్రమానికి బీజం పడుతుంది. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశామని.. రాష్ట్రంలో మాత్రం పేదలకు వాటిని ఇవ్వొద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోందని చెప్పారు. ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నామని తెలిపారు. ఇది మారీచులపై నిరుపేదల విజయమని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పోరాటాలు వందలు, వేలు చూశామన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే మారీచు, సుభాహులు అడ్డు పడుతున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా తన పయనం ధర్మం వైపే ఉంటుందని, ప్రభుత్వం నిరుపేదల పక్షానే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు మంజూరు చేసి.. జూలై 8.. నాన్నగారి (దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి) జయంతి రోజున ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారని, దాదాపు 232 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ ఇళ్ల పట్టాలు.. సామాజిక న్యాయ పత్రాలు ♦ ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సభకు, ఈ సందర్భానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రభుత్వ తాపత్రయం ఒకవైపు.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని అడ్డుపడుతున్న పరిస్థితులు ఇంకోవైపు.. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. ♦ ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. ♦మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్‌ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఎంతుంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో జరిగిన వేలంలో గజం రూ.17 వేలకు అమ్ముడుపోయిందని.. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుందన్నారు. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు.. వారికిస్తున్న సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇకపై ఇదే అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుంది. మనందరి అమరావతి అవుతుంది. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.3 లక్షల కోట్లు ♦ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్లో సొంతంగా తామే కట్టుకుంటామంటే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తాం. రెండో ఆప్షన్‌గా వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణ కూలి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్న వాళ్లకు మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు. ♦ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నట్టే.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తాం. సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ మార్కెట్ రేట్ల కంటే తక్కువకే ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో రాజీ పడేది లేదు. దీంతో పాటు రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్లు కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. ♦ మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీరిలో 21 లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా.. 30.75 లక్షల ఇంటి స్థలాల్లో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు విలువ చేసే ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ♦ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు.. మీ అన్నగా, మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నా. గత ప్రభుత్వంలో పాలకులు ఇలాంటి ఆలోచన చేసే సాహసమైనా చేశారా? గతానికీ, ఇప్పటికీ మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు ♦ఈ 50,793 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సీఆర్డీఏ పరిధిలో 8 చోట్ల జగనన్న కాలనీల్లో పీఎంఏవై కింద జీ ప్లస్ 3 విధానంలో నిర్మించిన 5,024 మందికి టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహ ప్రవేశాలు చేయించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీగా రూ.75 కోట్లు ఇస్తే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. ♦ టిడ్కో ఇళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్‌కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుగుకి రూ.2 వేలు వేసుకుంటే.. దాదాపు రూ.5.75 లక్షలు అవుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష అవుతుంది. ♦ అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తే మిగిలిన రూ.3 లక్షల డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున కట్టాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపెడై మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలి. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? కానీ మీ బిడ్డ ఈ ఫ్లాట్‌ను అక్కచెల్లెమల పేరుపై రూ.1కే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు, వారి గజ దొంగల ముఠా, ఎల్లో మీడియా వక్రభాష్యాలు చెబుతూనే ఉంది. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ♦ రెండేళ్లు కోవిడ్ కష్టాలు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా మాకున్న కష్టం కన్నా మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరుగెత్తాడు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. ♦మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. మేనిఫెస్టోలో 98 శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా చేపడుతూ పరిగెత్తిస్తున్నాం. ♦ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.11 లక్షల కోట్లు జమ చేశాం. మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయింది. ఒక్కో ఇంటి స్థలం రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్ల విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. మిగిలిన గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటివి కలిపి అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం. మంచి జరుగుతుంటే తట్టుకోలేక.. ♦ ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా.. అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు దత్తపుత్రుడు కలిసి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం చూశాం. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. అప్పుల పెరుగుదల కూడా ఇప్పుడే తక్కువ. ♦లంచాలు, వివక్ష లేకుండా మరి ఇన్ని లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇప్పుడు ఎలా వెళ్లింది? చంద్రబాబు హయాంలో అలా ఎందుకు జరగలేదని ఆలోచించండి. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. వారి తపన, తాపత్రయం అంతా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి అధికారంలోకి రావడం మాత్రమే. వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ♦ చంద్రబాబు తన పాలనలో 2014–2019 మధ్య ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి, కనీసం ఒక ఇంటి పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి.. రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలు సమీపిస్తుంటే కొత్త మోసాలతో ముందుకొస్తారు జాగ్రత్త. రాష్ట్రంలో క్లాస్ వార్ ♦ ఇప్పుడు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. ♦ ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదో ఒక రూపేణా అడ్డుకుంటూనే ఉన్నారు. ♦ పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడుతుంటే గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడానికే వీల్లేదని అడ్డుకుంటున్నారు. మనం వేసే ప్రతి మంచి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. కానీ మీ జగన్ మాత్రం మీ వెంటే ఉన్నాడు. అమ్మఒడి, ఆసరా, చేయూతతో నా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు. ♦ జగన్ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీల్లో డిబేట్లు పెడతారు. రాబోయో రోజుల్లో పేదలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ♦ మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో ప్రతి కాలనీలోనూ అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా వస్తాయి. ఇక్కడే నవులూరిలో లేక్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. మోసం చేసేవాడిని ఎప్పుడూ నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో గాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు. – సీఎం వైఎస్ జగన్ -
అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు
పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్ షిప్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన సీఎం జగన్.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో ఇళ్లపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో పేదల ప్రగతి కోసం నూరు శాతం పనిచేసే ప్రభుత్వం సీఎం జగనన్నదేనని, ఇది చూసి ఓర్వలేని టీడీపీ.. వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని టిడ్కో గృహాలను మంగళవారం ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో 5,024 టిడ్కో ఇళ్లను అన్ని వసతులతో సిద్ధంచేశామన్నారు. గత ప్రభుత్వం సగం చేసిన పనులను తాము పూర్తిచేశామని, కరోనా కష్టకాలంలో కొన్ని నెలలు పనులు ఆగినా అనంతరం వేగంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాయడం సరికాదని ప్రసన్నకుమార్ హితవు పలికారు. మంచినీరు లేనిచోట ఇళ్లా!? ఇక తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు లేకుండా గత ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వంపై దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడినప్పటికీ అన్ని వసతులు కల్పించి టిడ్కో ఇళ్లను సిద్ధంచేశామన్నారు. నిజానికి.. గత ప్రభుత్వం మంచినీరు దొరకని ప్రదేశాలను టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిందన్నారు. తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నవులూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో వాటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి నీరు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరున లబ్దిదారులకు అందిస్తామని ఆయన ప్రకటించారు. పచ్చ మీడియా అసత్య ప్రచారాలు మానుకుని ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలేగాని, ప్రభుత్వ కృషికి ఆటంకంగా నిలువరాదని ప్రసన్నకుమార్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసిన జగన్ సర్కార్
-
నెల్లూరు కావలిలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం
-
ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనకాపల్లి యూఎల్బీలో.. అనకాపల్లి యూఎల్బీలో జూన్ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు. రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే.. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా హౌసింగ్ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్‌లోని టిడ్కో హౌసింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. – జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్ -
టిడ్కో ఇళ్లతో సెల్ఫీ ఆటలా? ఇదేం రాజకీయం.? ఇదేం దుర్మార్గం?
పట్టణ, నగరాల్లో పేదలకు పక్కా గృహాల నిర్మాణాల్లో గత టీడీపీ ప్రభుత్వం మాయాజాలం చేసింది. పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతోందని చంద్రబాబు ఆర్భాటపు ప్రకటనలు . సాధారణ ఎన్నికలు వచ్చే వరకూ కాలక్షేపం చేసింది. ఆంధ్రప్రదేశ్ పట్టణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామని నటిస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించే సమయంలో హడావుడిగా తూతూ మంత్రంగా పనులు చేపట్టి గాలికొదిలేసి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులతో మాత్రమే పనులు చేపట్టి చేతులు దులుపుకుంది. వాటిని చక్కటి మౌలిక వసతులతో పూర్తి చేసి పేదలకు అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూనుకుంది. టిడ్కో ఇళ్లపై వాస్తవం ఇదీ.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9,568 టిడ్కో గృహాలకు నిర్మించేందుకు రూ.482 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు రూపొందించింది. ఒంగోలు నగరంతోపాటు కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి మున్సిపాలిటీల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాలని భావించింది. ఒంగోలు నగరంలో చింతల, కొప్పోలుల్లో కలిపి 4,128 గృహాలు నిర్మించాలని స్థలాల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మార్కాపురంలోని పెద్దనాగులాపురం రోడ్డులో 912 మందికి, గిద్దలూరు మోడెంపల్లిలో 1248 మందికి, కనిగిరి చాకిరాలలో 912 మందికి, అద్దంకి శింగరకొండలో 960 మందికి, కందుకూరు ఉప్పుచెరువు వద్ద 1408 మందికి టిడ్కో గృహాలు నిర్మించి ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు. 30 శాతం కూడా నిర్మాణం పూర్తి చేయని టీడీపీ ప్రభుత్వం: జిల్లాలోని టిడ్కో గృహాల నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం కనీసం 30 శాతం కూడా పూర్తి చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో పునాదులు లేపి వదిలేశారు. కొన్నింటిలో మాత్రం స్లాబులు మాత్రమే వేశారు. మొత్తం రూ.482 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అందులో కేవలం రూ.145.32 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. అదికూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన మొత్తాన్ని ఖర్చుచేసి తాము టిడ్కో గృహాలను దాదాపు పూర్తి చేశామని డప్పు కొట్టుకుంది. 6,112 గృహాలు ఉచితంగా ఇస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో 300 చదరపు గజాల టిడ్కో ఇంటిని ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించిన లబ్ధిదారులు దాదాపు 6,112 మంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి రూ.350 కోట్లు కేటాయించింది. రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేపట్టింది. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసింది. మొదటి విడతగా 2,640 గృహాలకు రివర్స్ టెండర్లో 11 శాతం లెస్‌కు టెండర్లు కోట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.23.34 కోట్లు మిగిలింది. వీటి నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా గృహాలకు ఫేజ్–2, ఫేజ్–3 కింద పనులు చేపట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. రూ.12.72 కోట్లు పసుపు, కుంకుమకు: టిడ్కో గృహాల్లో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.12.72 కోట్లను చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమకు ఖర్చు చేశారు. ఆ నిధులను టిడ్కో గృహాల కోసం వెచ్చించాల్సి ఉంటే వాటిని కూడా పసుపు–కుంకుమకు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఇళ్లపేరుతో నాడు పేద ప్రజలను మోసం చేసిన టీడీపీ నేతలు నేడు సెల్ఫీల పేరుతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కాలక్షేపం చేసి నేడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సెల్ఫీ చాలెంజ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. సిగ్గులేకుండా దామచర్ల సెల్ఫీనా.... "ఒంగోలు నగరంలో ఇళ్లు నిర్మిస్తామని 15,500 మంది వద్ద నుంచి టీడీపీ నేతలు డబ్బులు కట్టించుకున్నారు. కేవలం 4 వేల ఇళ్లు మాత్రమే ప్రారంభించారు. ప్రజల నుంచి కట్టించుకున్న డబ్బును ఏం చేశారో తెలియదు. కానీ టీడీపీకి చెందిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోమవారం టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి సిగ్గులేకుండా సెల్ఫీ వీడియో దిగటం సరికాదు. అప్పట్లో ప్రజల వద్ద వసూలు చేసిన సొమ్మును ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి ప్రజలకు అందజేస్తోంది. తగుదనమ్మా అంటూ దామచర్ల సెల్ఫీ వీడియో దిగి ప్రజలకు ఏమని సంకేతాలు ఇద్దామనుకుంటున్నాడో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒంగోలు నగరంలోని చింతలలో రూ.98 కోట్లు ఖర్చుచేసి 1392 ఇళ్లు టీడీపీ హయాంలో పూర్తి చేశామని టీడీపీ వాళ్లు చెబుతున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఆ ప్రాజెక్టు మొత్తం వ్యయ అంచనాలు రూపొందించిందే రూ.81.80 కోట్లు. అందులో రూ.45.18 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 55.23 శాతం పనులు జరగాల్సి ఉంది. ఇకపోతే కొప్పోలు ప్రాజెక్టులో 4656 గృహాలకు నిర్మాణ పనులు చేపట్టి రూ.450 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అన్నీ అబద్దాలే చెబుతూ ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నారు." – బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే -
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
నిరుపేదల టిడ్కో గృహాలపై ఎల్లో మీడియా విషం
-
టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పథకంపై చేస్తున్న అసత్య, విష, దుష్ప్రచారం అంతా ఇంతా కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి చేసి, చక్కటి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్ల రూపంలో 2.62 లక్షల మంది పట్టణ ప్రాంత పేద, మధ్య తరగతి లబ్ధిదారులకు ఏకంగా రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖ, టిడ్కోపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనుల గురించి, వెచ్చించిన సొమ్ము గురించి విశదీకరించారు. ఇళ్ల ఖర్చు చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని గృహ నిర్మాణ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఈ లెక్కన రోజుకు రూ.28 కోట్ల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.43 కోట్ల చొప్పున రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికమని తెలియజేశారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని, స్లాబ్ పూర్తి అయిన, స్లాబ్‌కు సిద్ధంగా ఉన్న ఇళ్లు మరో 4,67,551 ఉన్నాయన్నారు. కొద్ది రోజుల్లో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటుక, సిమెంటు, స్టీలు, ఇతర సామగ్రికి నాణ్యత పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 4,529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. నాణ్యతలో రాజీపడొద్దు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీరు సహా ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఇంటికీ సోక్పిట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్తులో వాన నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేయొచ్చని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి: రూ.56,102.91 కోట్లు ► కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం: రూ.36,026 కోట్లు (ఇందులో తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాలకు : రూ.32,909 కోట్లు) ► శాశ్వత సదుపాయాల్లో నీటి సరఫరా: రూ.4,128 కోట్లు ► విద్యుత్, ఇంటర్నెట్: రూ.7,989 కోట్లు ► డ్రైనేజీ, సీవరేజ్: రూ.7,227 కోట్లు ► రోడ్లు, ఆర్చ్‌లు : రూ.10,251 కోట్లు ► పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన: రూ.3,314 కోట్లు ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీలు: రూ.13,758 కోట్లు -
బందరులో భయపడ్డ బాబు..
-
టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్‌కు బాబు వెనుకడుగు
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచనాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్రబాబు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు. నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్‌ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్‌లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్‌ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్‌లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు రుద్రవరంలోనూ అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్‌ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్‌ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్‌లకు సంబంధించి ఫుట్టింగ్ లెవల్ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్‌ల్లో జీ+3 గృహాలను నిర్మించింది. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు బ్లాక్‌ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్ వర్క్స్ వద్ద నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పంపిణీకి సిద్ధం చేశాం.. గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. – ఎం.గణేష్‌బాబు, ఏఈ -
పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ అన్నారు. విశాఖలోని 52వ వార్డు గౌరీనగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకుల ఆరోపణలు శుద్ధ అబద్ధమన్నారు. టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినా అవి పూర్తి కాలేదన్నారు. వాటిని ఒక యజ్ఞంలా పూర్తి చేశామన్నారు. రూపాయికే ఇల్లు రాష్ట్రంలో 2.62 లక్షల గృహాలు నిర్మాణం జరుగుతుండగా.. అందులో 1,43,600 గృహాలు కేవలం ఒక్క రూపాయికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అందిస్తున్నారని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జీవోలో ప్రతి 300 చదరపు గజాల గృహ లబ్దిదారుడు రూ.2.65 లక్షలు చెల్లించాలని ఉందని గుర్తు చేశారు. ఈ సొమ్ము బ్యాంకుల్లో అప్పు తీసుకుని వాయిదాలు కడితే 20 ఏళ్లకు సుమారు రూ.7.20 లక్షలు కట్టాల్సి వచ్చేదన్నారు. పాదయాత్ర సందర్భంగా కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను ఉచితంగా అందజేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారమే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో బీ కేటగిరీ ఇళ్లు రూ.50 వేలు ఉండగా.. దాన్ని రూ.25 వేలు చేశారన్నారు. సీ కేటగిరీ ఇళ్లు రూ.లక్ష ఉండగా.. దాన్ని రూ.50 వేలు చేశారని వివరించారు. ఇప్పటికే 22 పట్టణాల్లో 50 వేల గృహాలను లబ్ధిదారులకు అందించామన్నారు. అందులో 25 వేల గృహాలు ఒక్క రూపాయికే అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ కృష్ణ, సింహాచలం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు శ్రీదేవి వర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు జియ్యాని మారుతి పాల్గొన్నారు. -
‘సెల్ఫీతో చంద్రబాబు సెల్ఫ్ గోల్’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాలకు అలవాటుపడిన టీడీపీ నాయకులు ఇంకా మోసాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఫైరయ్యారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమని జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాగా, వరుదు కళ్యాణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీతో చంద్రబాబు సెల్ప్ గోల్లో పడ్డారు. టిడ్కో ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 50వేల టిడ్కో ఇళ్లు ఇచ్చాం. రెండు నెలల్లో మరో 40వేల టిడ్కో ఇళ్లు ఇస్తాం. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిన క్యాన్సర్ గడ్డ మీరు కాదా?. ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చింది మీరు కాదా?. మ్యానిఫెస్టోను చెత్తబుట్టతో వేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. -
అప్పుడు కాదు.. ఇప్పుడు లక్షల ఇళ్లు
రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏ ఒక్క చోట చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం స్తంభాలు కూడా పాతలేదు. మంచి నీటి కుళాయిల ఊసే లేదు. చాలా వాటికి దారి కూడా సరిగా లేదు. సగం ఇళ్లకు పునాదులు కూడా వేయలేదు. అయినా అన్నీ పూర్తయిపోయాయని ఎలా చెబుతున్నారు? అలాంటి చోట మనుషులనే వారు ఎలా నివశిస్తారు చంద్రబాబూ? ఇవన్నీ విస్మరించి తగుదునమ్మా అంటూ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ల వద్ద నిస్సిగ్గుగా సెల్ఫీ దిగడం మీకే చెల్లింది. సాక్షి, అమరావతి: నిజాలు చెప్పాలన్నా, చూపించాలన్నా ఆధారాలు కావాలి.. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం అవేవీ అక్కర్లేదు. చీమ దూరేంత సందు ఉంటే చాలు.. అందులోంచి ఏనుగు వెళ్లిందని జనాన్ని నమ్మించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇందుకు టిడ్కో ఇళ్ల నిర్మాణమే ప్రత్యక్ష ఉదాహరణ. జనం ఏమనుకుంటారోనన్న ఆలోచన ఇసుమంతైనా లేకుండా కళ్లార్పకుండా అబద్ధం చెప్పేస్తుండటం ఆయనకే చెల్లింది. ప్రజలకు అన్ని విధాలా మంచి చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతూ రాగం తీస్తే.. దానికి ఎల్లో మీడియా తాళం వేస్తుంది. పట్టణ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లపై తాజాగా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి తెరతీశారు. వాస్తవానికి అప్పట్లో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా బాబు అడుగులు ముందుకు వేశారు. ఇందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. బాబు ఆరోపణ టిడ్కో ఇళ్లన్నీ మా హయాంలో కట్టినవే వాస్తవం: టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు హయాంలోని అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. 2019 మే నాటికి 1,22,888 ఇళ్లను పునాదుల్లో, మరో 38,416 యూనిట్లు సగం శాతం కంటే తక్కువ పనులు చేసి వదిలేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు ఖరారు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా దానిని రూ.2,840 కోట్లకు తగ్గించింది. అంటే రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. దీనికి తోడు 1,33,480 యూనిట్లను నూరు శాతం పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే 48,416 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. మరో 40 వేల టిడ్కో ఇళ్లను రెండు నెలల్లో ఇచ్చేందుకు సిద్ధం చేస్తోంది. బాబు ఆరోపణ అంతటా అవినీతే వాస్తవం: పట్టణ పేదలు 300 చ.అ. ఇల్లు పొందాలంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపింది. అదీ 20 ఏళ్లపాటు వాయిదాలు కట్టేలా షరతు పెట్టింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అదే పేదలకు 1.43 లక్షల టిడ్కో ఇళ్లను రూ.1కే ఇస్తోంది. పైగా ఇళ్లను అక్క చెల్లె్మమల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. 365 చదరపు అడుగుల్లో నిర్మించే 44,304 యూనిట్లకు, 430 చదరపు అడుగుల్లో నిర్మించే 74,312 యూనిట్లకు గత ప్రభుత్వం లబ్ధిదారుల వాటా కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది. అయితే, ఆ వాటాను ప్రస్తుత ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది. బాబు ఆరోపణ నెల్లూరులో మేమే అన్ని ఇళ్లు నిర్మించాం వాస్తవం: చంద్రబాబు హయాంలో నెల్లూరులో మొత్తం ఏడు ప్రాంతాల్లో టిడ్కో గృహాలను నిర్మించాలని భావించారు. అలిపురంలో 11,376 ఇళ్లు, అక్కచెరువుపాడులో 3,696, కల్లూరుపల్లిలో 2,496, కొండలపూడి ఫేజ్ –1, 2లో 2,496, వెంకటేశ్వరపురం ఫేజ్–1లో 4,800, వెంకటేశ్వరపురం ఫేజ్–2లో 3,024, ఇరుకులమ్మ టెంపుల్ ఫేజ్–2లో 48 ఇళ్లు నిర్మించాలని తలపెట్టారు. ఇందులో కేవలం వెంకటేశ్వరపురం ఫేజ్–1లో చేపట్టిన ఇళ్లలో కొన్ని మాత్రమే చంద్రబాబు హయాంలో నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మిగిలిన ఆరు ప్రాంతాల్లోనూ పనులు పూర్తిగా వదిలేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ ‘షో’లో భాగంగా వెంకటేశ్వరపురం ఫేజ్–1 నివాస సముదాయాలను ప్రారంభించారు. వాటికి తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. అందువల్లే ఒక్క కుటుంబం కూడా అక్కడ దిగలేదు. ఇప్పుడు వాటన్నింటినీ దాచిపెట్టి చంద్రబాబు సెల్ఫీతో రాజకీయం చేస్తున్నారు. ఒక్క చోట ఫొటో దిగి.. ‘మొత్తం నేనే కట్టేశా’నని చెప్పుకోవడం చూసి నెల్లూరు వాసులు ఇదేం రాజకీయం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడు ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్ల కోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.628.5 కోట్లు ఖర్చు చేసింది. పైగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించని రూ.90 కోట్ల బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. -
జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..?
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చేశారో చర్చిద్దామా? అని ప్రశ్నించారు. 1.50 కోట్ల ఇళ్ల దగ్గరకు రావడానికి చంద్రబాబు సిద్దమా? అని మంత్రి సవాల్ చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః బాబు పిల్ల చేష్టలుః నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిది. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి. 74 ఏళ్ళ వయసు, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం- దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది. మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నాం. టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్ల కు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు. బాబుకు ఛాలెంజ్ః చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చేసిన ట్వీట్ కు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలానే, మా హయాంలో నిర్మిస్తున్న 17, 005 జగనన్న కాలనీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ కాలనీలలో లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఏ విధంగా కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో తెలుసుకోవడానికి మాతో పాటు చంద్రబాబు వచ్చినా సరే, లేకుంటే ఆయనతో పాటు మేము అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నా. స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?. మీ అబ్బాయి నారా లోకేష్‌కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతున్నాడు. బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని అడుగుతున్నాం. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు రేపో, మాపో మూర్ఛ రోగం వస్తోంది. చంద్రబాబు తన పాలనలో చెప్పుకోవడానికి అయినా ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టి అమలు చేశాడా? అభివృద్ధి కార్యక్రమం చేశాడా? తన అయిదేళ్ల పాలనలోకాలక్షేపం, కబుర్లు చెప్పబట్టే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిర్మాణంలో ఉన్న 17 వేల జగనన్న కాలనీలు మాతో పాటు వచ్చి చంద్రబాబు చూస్తే గుండె ఆగి చస్తాడు. ఇవాళ 17వేల జగనన్న లే అవుట్లు...ద్వారా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నాం. కొన్నిచోట్ల పదివేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక మున్సిపాల్టీయే ఏర్పడుతుంది. ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యక్షంగా చూసేందుకు రమ్మని మరోసారి చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నాం. 14 ఏళ్ళ సీఎంగా నీవు చేసిందేమోటో చెప్పగలవా బాబూ? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన మేలు ఏమిటి..? ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి? నాలుగేళ్లల్లోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటో మేం జగన్ మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి చెబుతున్నాం. నీవు ఏమైనా మంచి చేసి ఉంటే.. ప్రజల గడపల వద్దకు వెళ్ళి చెప్పే ధైర్యం ఉందా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసి ఉంటే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయింది...?. గడిచిన మూడేళ్ల పది నెలల కాలంలో ప్రతి గడపకు మేము మంచి చేశాం కాబట్టే.. ఆ గడపకు వెళ్లి అక్కా చెల్లి, అవ్వాతాత, అన్నాతమ్ముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రతి గడపకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇవాళ మా ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి చేసింది కాబట్టే, వారి ఆశీస్సుల కోసం మేమంతా ఆ గడప దగ్గరకు నేరుగా వెళుతున్నాం. ప్రతి గడపకు వెళ్లడమే కాకుండా ప్రభుత్వ పథకాలు సంతృప్తిగా ఉన్నాయా? వారికి రావాల్సిన లబ్ధి గురించి అడుగుతున్నాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, డీబీటీ ద్వారా నేరుగా తమ ఖాతాల్లోకి నగదు జమ కావడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము ముఖ్యమంత్రిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా, తమ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా, మేనమామగా చూస్తున్నామని, ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఏ నాయకుడికైనా ఇంతకన్నా కావల్సిందేముంది. అదే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ఒక కంసుడుగా, ఒక నరకాసురుడుగా ప్రజలు భావిస్తున్నారు. అమ్మ ఒడిలాంటి పథకం పెట్టాలని బాబు బుర్రకు ఏనాడైనా తట్టిందా..? మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఓర్వలేని చంద్రబాబు నాయుడు సెల్ఫీలు అంటూ మాకు ఛాలెంజ్ లు విసరడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చీమూ, నెత్తురు ఉంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలి. గత నాలుగేళ్ళుగా మేము చేసిన మేలుతో పాటు, చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలకు చేస్తామని ఎగ్గొట్టిన రుణమాఫీపైనా, రైతులు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని మోసం చేసిన విషయంలో చర్చకు సిద్ధమా?. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బుర్రలో.. పిల్లల చదువుకోసం తల్లులు ఖాతాల్లో నగదు వేసే ఆలోచన ఎన్నడైనా తట్టిందా? ఇవాళ జగన్ మోహన్ రెడ్డిగారు తన మానస పుత్రికగా, అమ్మ ఒడి పథకం ద్వారా ఆ కార్యక్రమం చేపట్టారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం ఇస్తున్నాం. అలాగే ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి మరీ అవ్వా తాతల చేతుల్లో పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం. మీ పాలనలో ఇటువంటివి ఏమైనా చేశారా చంద్రబాబూ..? అని అడుగుతున్నాం. నారా లోకేష్ కు మాతో పోటీపడే దమ్ము, ధైర్యం లేదు. కేవలం సెల్ఫీలు తీసి, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టి హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకుగా పాదయాత్ర చేస్తున్నావో, లేక మాజీమంత్రిగా పాదయాత్ర చేస్తున్నావో మాకు తెలియదు కానీ... జగనన్న కాలనీల పురోగతి, పనితీరు మీద చర్చకు ఎక్కడకు రమ్మన్నా నేను వచ్చేందుకు సిద్ధం. ఒకవేళ మాతో నారా లోకేష్ వచ్చినా తీసుకువెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు అయినా నారా లోకేష్ అయినా గుడ్డ కాల్చి మొహాన వేసి తుడుచుకుని వెళ్లిపోయే రకాలు. మీ ట్వీట్లకు స్పందించాం. మా ఛాలెంజ్ కు మీరు సిద్ధమా? మీకు స్పందించే గుణం ఉంటే.. తండ్రికొడుకులు వచ్చేందుకు సిద్ధమా? మీ పాదయాత్రలో ఎక్కడైనా పాల్గొనేందుకు నేను సిద్ధం. ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రతి అక్కచెల్లెమ్మను అడుగుదాం. మీ హయాంలో చేసిన అభివృద్ధి, మేలు- మా నాలుగేళ్ల పాలనలో జరుగుతున్న మేలుపై వారినే నేరుగా అడుగుదాం. మా నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగారు నేరుగా బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు కామన్ మెన్ ఖాతాలోకి జమ అయ్యాయంటే అది పరిపాలన. మీకులా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మాకు చేతకాదు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించడమే మా జగనన్న విధానం. దమ్ముంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలని చంద్రబాబుకు ఆయన కొడుకు లోకేష్ కు ఛాలెంజ్ చేస్తున్నాం. 175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ బాబుకు ఉందా..? మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...-2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించబోతోంది. వై నాట్ 175, వై నాట్ కుప్పం.. ఇవే మా టార్గెట్ లు. 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తామంటున్న చంద్రబాబు నాయుడుకు అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఉందా? అదే ఉంటే పొత్తుల కోసం పొర్లాడటం ఎందుకు? దమ్ము, ధైర్యం లేని చవటలు, సన్నాసులు జగన్ గారితో పోటీనా? ఒక వీరుడిని ఎదుర్కొనేందుకు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా.. సింహం ముందు దిగదుడుపే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ గుర్తుతో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. -
అబద్ధాల ‘బాబు’ తీరు ఇది.. ఇదేం సెల్ఫీ చంద్రబాబు!
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించిన వారు లేరు. చేయని పనిని చేసినట్లుగా చెప్పడం ఆయన నైజం. ఇది మరోసారి నిరూపితమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో కట్టిన టిడ్కో ఇళ్లంటూ బాబు సెల్ఫీ దిగారు. అయితే ఆ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిన ఘనత గత ప్రభుత్వానిది. నిజం ఏంటంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలను లబ్ధిదారులకు అందించింది. ఇంకా వేలాదిమంది మహిళలకు పట్టాలిచ్చి గృహాలు కట్టిస్తోంది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు. వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్దకు శుక్రవారం ఆయన చేరుకుని సెల్ఫీ తీసుకున్నారు. ‘చూడు జగన్ మా ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన వేలాది ఇళ్లు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా?’ అని ట్వీట్ చేశారు. అసలు విషయం తెలిసిన వారందరూ చంద్రబాబు అబద్ధాల కోరంటూ మండి పడుతున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో టిడ్కో గృహ సముదాయంలో నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 2019లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇళ్లు పూర్తి కాకపోయినా టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా హడావుడిగా కొందరు లబి్ధదారులకు తాళాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే లబ్ధిదారులు స్పందించలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అన్ని వసతులు కలి్పంచి లబి్ధదారులకు అందజేసింది. ఇప్పటికే వేలాదిమంది ఈ గృహాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన అప్పటి పాలకులు పేదల నెత్తిన అప్పుల భారాన్ని మోపారు. సింగిల్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు డిపాజిట్ రూపంలో నగదు వసూలు చేశారు. అంతేకాక బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి లబ్ధిదారులు నెల వాయిదాలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. సింగిల్ బెడ్రూం ఇల్లు పొందిన లబి్ధదారు క్రమం తప్పకుండా 20 సంవత్సరాలపాటు నెలకు రూ.3,500 చొప్పున చెల్లించేలా ఒప్పంద పత్రాలను తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సింగిల్ బెడ్రూం లబ్ధిదారుల నుంచి ఎటువంటి డిపాజిట్ రుసుం వసూలు చేయకుండా రూ.1కే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. అదేవిధంగా అప్పట్లో డబుల్ బెడ్రూం లబి్ధదారుల నుంచి కట్టించుకున్న డిజిపాట్లలో నేటి ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇచ్చింది. నేడు అక్కడే ఏడు వేలకు పైగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నాడు 4 వేల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయగా.. నేటి ప్రభుత్వం వాటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అదే జనార్దనరెడ్డి కాలనీలోనే జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఏడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సొంతింటి కల సాకారం చేసేందుకు.. నెల్లూరు(అర్బన్): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిలువ నీడ లేని నిరుపేదలు వేలాది మంది తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో 494 జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 56,734 మందికి స్థలాలు మంజూరు చేసింది. ఇళ్లు కూడా తామే కట్టిస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను జిల్లాలోనే ఖర్చు చేస్తోంది. కేవలం స్థలాలను ఇవ్వడమే కాకుండా ఆ కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు పదివేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. పలుచోట్ల పేదలు ఇళ్లలో చేరి ఆనందంగా ఉంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి ఒక్కో లబి్ధదారు సొంతం కానుంది. ఈ ఇంటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నందున వారి భవిష్యత్ అవసరాలకు విక్రయించుకోవచ్చు. రిజి్రస్టేషన్ వల్ల విలువ పెరుగుతుంది. కాగా ఏప్రిల్ 15వ తేదీ నాటికి 16 వేల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేశారు. అవి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్స్ తప్పనిసరి. సభ్యులకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అసలు వాస్తవాలు ఇవైతే ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ఇప్పుడు ఇళ్ల పేరుతో డ్రామా ఆడుతున్నారని లబి్ధదారులు మండి పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో నాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. అయితే నిర్మాణ పనులు అప్పుడు పూర్తికాకపోవడంతో ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఒక్క రూపాయితో రిజి్రస్టేషన్ చేయించి ఇచ్చారు. – జోత్స్న, టిడ్కో ఇల్లు లబి్ధదారు -
అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై బాబు విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బాధ్యత వాలంటీర్లది కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చారంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చంద్రబాబు ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే టిడ్కో ఇళ్ల నిర్మించారని.. సిగ్గులేకుండా టిడ్కో ఇళ్ల వద్ద నిలబడి బాబు సెల్ఫీ దిగారని ధ్వజమెత్తారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ. ‘దరిద్రం, కరువులకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు రాష్ట్రానికి దరిద్రం అని సొంత మామే చెప్పారు. పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తోక ముడిచి వెళ్ళిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతానని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా? పార్టీని నడపలేని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ తన పక్కనే ఉన్నారని చెప్పిన చంద్రబాబు 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు? చివరికి కొడుకును కూడా గెలిపించుకొలేకపోయారు. రౌడీయిజం గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదం. బాబు లాంటి వ్యక్తి సమాజంలో జీవించే అర్హత ఉందా’ అని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. చదవండి: సీఎం జగన్ పెట్టిన పేరును పవన్ కల్యాణ్ సార్థకం చేస్తున్నాడా! కాకపోతే.. -
నిజాలను దాచి, అబద్ధాల కథనాలు.. ఇంటిపైనా ‘ఎల్లో’ విషం
సాక్షి, అమరావతి: నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న తీరులో ఉంది ఎల్లో మీడియా. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు రాసి ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఉంది. ఇదే భ్రమలతో టిడ్కో ఇళ్లపై ఈనాడు ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, వేగం, లబ్ధిదారులకు కలిగిస్తున్న ప్రయోజనాలను వదిలేసి తప్పుడు ప్రచారానికి తెరతీసింది. నంద్యాల ఎన్ఎం నగర్, ఎస్సార్బీసీ కాలనీ, అయ్యలూరిమెట్ట ప్రాంతాల్లో మొత్తం 10 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న 2 వేల యూనిట్లను గత నెలలో లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. వీటికి రూ.88.84 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వీటిని జూన్ నెలలో లబ్ధిదారుకులకు అందించే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. వీటినే ఫొటోలు తీసి ‘పైన హుషారు.. లోపల ఉసూరు’ అంటూ ఈనాడు తప్పుడు ప్రచారానికి తెగబడింది. పునాదుల స్థాయిలోనే వదిలేసిన గత ప్రభుత్వం పట్టణ పేదల కోసం ఉద్దేశించిన 2,62,216 టిడ్కో ఇళ్లను మూడు కేటగిరీల్లో ప్రారంభించారు. 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ. విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే 1 నాటికి 1,22,888 టిడ్కో ఇళ్లను పునాదుల స్థాయిలోనే వదిలేసింది. వీటిలో 63,744 ఇళ్లకు రూ.3,232 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించింది. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానంతో వీటి నిర్మాణంలో రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. టీడీపీ ప్రభుత్వం సగంలో వదిలేసిన ఇళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీటిని లబ్ధిదారులకు అందజేసింది కూడా. దీంతో పాటు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి 1,29,480 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పన చకచకా జరుగుతోంది. గతంలో రూ.306 కోట్లు.. ఇప్పుడు రూ.3,237 కోట్లు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 163 ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.306 కోట్లతో మౌలిక వసతులు తూతూమంత్రంగా కల్పించి చేతులు దులుపుకొంది. అయితే, ఆ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,237 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటి దాకా రూ.800 కోట్లు విలువైన పనులు పూర్తయ్యాయి. టీడీపీ మోపిన భారాన్ని తీసేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం 300 చ.అ. ఇళ్లను పొందిన నిరుపేదలపై గత ప్రభుత్వం లబ్ధిదారుల వాటాగా రూ.3,805 భారం మోపింది. ఒక్కో ఇంటికి రూ.2.65 లక్షలు ధర నిర్ణయించి లబ్ధిదారే 20 ఏళ్లపాటు రుణాన్ని నెలనెలా ఈఎంఐల రూపంలో చెల్లించాలని షరుతు పెట్టింది. దీనిప్రకారం ఒక్కో ఇంటికి వడ్డీతో కలిపి 20 ఏళ్లకు రూ.7.20 లక్షలు లబ్ధిదారే చెల్లించాలి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లను ఒక్క రూపాయికే కేటాయించింది. దీనిద్వారా 1,43,600 మంది లబ్ధిదారులు రూ.10,339 కోట్ల మేరకు ప్రయోజనం పొందారు. 365 చ.అ., 430 చ.అ. ఇళ్లలో లబ్ధిదారుల కొంత వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే, వారు ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. అంతేకాకుండా ఆ ఇళ్లకు 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఆ ఇళ్లకు గత ధరల ప్రకారం మొత్తం రూ.10,797 కోట్లు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడా మొత్తం రూ.4,590 కోట్లకు తగ్గిపోయింది. బ్యాంకు రుణాలనూ ఇప్పిస్తోంది. అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించింది. దీనిద్వారా 365 చ.అ, 430 చ.అ లబ్ధిదారులు దాదాపు రూ.1200 కోట్ల మేర అదనంగా లబ్ధి పొందుతున్నారు. మొత్తం అన్ని ఫీజులు కలిపి లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు జరిగేలా చేసింది. ► వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.4,939.10 కోట్లు, మౌలిక వసతులకు రూ.570 కోట్లు, భూ సేకరణకు మరో రూ.11 కోట్లు వెచ్చించింది. ► గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ. 3 వేల కోట్ల బకాయిలు తిరిగి చెల్లించింది. ► పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇంత మేలు జరిగినా విషప్రచారం! టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగడుగునా మేలు చేస్తోంది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తోంది. నిరుపేదలకు ఒక్క రూపాయికే ఇళ్లు ఇస్తోంది. మరికొందరికి భారీ సబ్సిడీ ఇస్తోంది. బ్యాంకు రుణాలూ ఇప్పిస్తోంది. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తోంది. నిర్మాణంలో, వసతుల్లో నాణ్యతలో రాజీ పడకుండా లబ్ధిదారుల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. అయినా, పూర్తికాని ఇళ్ల చిత్రాలతో మసిపూసి మారేడుకాయ చేసి, విషప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించడానికే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. మొత్తం ఇళ్ల పంపిణీకి షెడ్యూల్ ఇప్పటిదాకా 35 ప్రాంతాల్లో రోడ్లు, తాగు నీరు, సెప్టిక్ డ్రైనేజీ, విద్యుత్ వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వం మిగిలిన ఇళ్లను అందించేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇప్పటిదాకా పంపిణీ చేసినవి 50 వేలు మార్చి లక్ష్యం 1 లక్ష జూన్‌లో 50 వేలు డిసెంబర్లో పంపిణీ 62,616 మొత్తం 2,62,216 -
నాలుగో విడత టిడ్కో ఇళ్లు పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో (జీ+3) ఇళ్లు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ పనులపైనా టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్ అధ్యక్షతన బుధవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు. నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నవాటిని అందజేయనున్నారు. ఇందులో నంద్యాల 5 వేలు, శ్రీకాకుళం 1,280, పొన్నూరు 2,368, అడవి తక్కెళ్లపాడు(గుంటూరు) 2,500, సాలూరు 1,200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయి. కాగా, పంపిణీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని పూర్తయితే అన్నింటినీ అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో ప్రభుత్వం రూ. 1కే అందిస్తున్న 300 చ.అడుగుల యూనిట్లు మినహా మిగిలిన 365, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల విషయంలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కానివారికి నాలుగైదు రోజుల్లో మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, జనవరి చివరినాటికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన 1.20 లక్షల యూనిట్ల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 75 నుంచి 80 శాతం పూర్తయిన బ్లాకులకు యుద్ధప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను ఆదేశించారు. బోర్డు సమావేశంలో చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటు టిడ్కో బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రజిని
చిలకలూరిపేట: పేదలందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 2,272 గృహాలను మంత్రి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఫేజ్–1 కింద నిర్మించిన 4,512 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 2,272 గృహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మిగిలిన గృహాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మరో 1,008 గృహాల పనులు త్వరగా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, దుష్టచతుష్టయం ఓర్వలేక విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, టిడ్కో ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ జి.ప్రసాదరావు, మెప్మా పీడీ వెంకటనారాయణ, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకే ఫ్లాట్ల నిర్వహణ పగ్గాలు
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇళ్లులేని పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు) పథకంలో నిర్మించిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మనకు ఇక్కడ అనువైన నిబంధనావళిని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో 88 యూఎల్బీల్లో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో జీ+3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 12 వేల వరకు ఉన్నాయి. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక సంక్షేమ సంఘం చొప్పున ఫ్లాట్ల యజమానులతోనే కమిటీ ఏర్పాటుచేసి వీటి అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కమిటీల ఏర్పాటు తర్వాత ఒక్కో ఫ్లాట్‌కు రూ.100 నుంచి రూ.150 మధ్య నిర్వహణ రుసుం వసూలు చేసి, వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు.. పీఎంఏవై–యు కింద భోపాల్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించగా, రాజ్‌కోట్‌లో అంతకుమించి అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి, దిగువ, మధ్యాదాయ వర్గాలకు కేటాయించారు. వాటి నిర్వహణను సైతం వాటి యజమానులకే కేటాయించినప్పటికీ, నిర్వహణ రుసుం భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భోపాల్‌లో రూ.850, రాజ్‌కోట్‌లో రూ.200 ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్మించిన పీఎంఏవై–యూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్‌కు రూ.850 చొప్పున సంక్షేమ సంఘం వసూలుచేస్తుండగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రతి ఫ్లాట్ యజమాని రూ.30 వేల డిపాజిట్‌తో పాటు ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నారు. ఈ నగదుతో ఆయా సంఘాలు అపార్ట్మెంట్ ప్రాంగణంలోని అంతర్గత పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి మోటార్ల నిర్వహణ, రక్షణ వంటి అంశాలకు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా భోపాల్‌లోని నివాసాలను టిడ్కో చైర్మన్ జమాన్న ప్రసన్నకుమార్, గృహనిర్మాణ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. గృహాల నిర్మాణం, సౌకర్యాల విషయంలో మన రాష్ట్రమే మెరుగ్గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ పట్టణ పేదల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్ చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి నివాసితులతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటుచేసిన తరువాత లబ్ధిదారులు భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటికోసం భోపాల్‌లో ప్రతి ఇంటి నుంచి రూ.850 వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అవి నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – జమాన్న ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
ఈ ఆనందం వెలకట్టలేనిది!
(నానాజీ అంకంరెడ్డి), సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ జగనన్న నగర్ (టిడ్కో)లో వందల కుటుంబాల వారు తమ సొంతింటి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్మించిన 1,728 టిడ్కో ఇళ్లల్లో దాదాపు 400 మంది ఉంటున్నారు. డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉండడంతో మిగిలిన వాళ్లు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఇళ్లు పొందిన వారి పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా సోమవారం టిడ్కో ప్రాంగణంలోని తమ ఫ్లాట్లలో కలియదిరుగుతూ గదుల్లోని గోడలను తడిమి చూసుకుని ఆనందంగా గడిపారు. విశాలమైన 60, 40 అడుగుల రోడ్లు.. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, ప్రతిబ్లాక్‌కు 20 అడుల సెట్‌బ్యాక్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 0.8 ఎంఎల్డీ సామర్థ్యమున్న ఎస్టీపీతో చక్కటి ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. సిరామిక్ టైల్స్‌తో ప్రతి గదినీ ముచ్చటగా తీర్చిదిద్దారు. ‘ఇలాంటి చోట ఇంతమంచి ఇల్లు మా జీవితంలో కట్టుకోలేం’ అని లబ్ధిదారులు అంటున్నారంటే వారెంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దగ్గర్లోనే పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మంచిగా వైద్యం చేస్తున్నారంటూ స్థానిక మహిళ జ్యోతి చెప్పారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం సిద్ధమవుతోంది. అందరికీ ఉపయోపడేలా పార్కును కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలో 88 స్థానిక సంస్థల్లో నిర్మిస్తున్న 163 జీ+3 టిడ్కో అపార్ట్మెంట్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పచ్చదనం కోసం త్వరలో మొక్కలు విశాలమైన ఈ ఇళ్ల ప్రాంగణంలోని ప్రతి అపార్ట్మెంట్ సెట్బ్యాక్లోను పళ్ల మొక్కలు, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. నివాసితుల అవసరాలకు అనుగుణంగా దుకాణాల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ జగనన్న నగరాల నిర్వహణకు సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లల్లో ఇన్ని వసతులు ఉంటాయని ఊహించలేదని, ఇక్కడి నిర్మాణాలు చూశాక జగనన్న ప్రభుత్వం తమకెంత మేలుచేసిందో తెలిసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. ‘జగనన్న మాకు సొంతిల్లు ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు అందులో ఆనందంగా అడుగుపెట్టాం. బయటి వారు ఎవరో వచ్చి మా ఆనందాన్ని నాశనం చేయాలని చూస్తే ఎలా సహిస్తాం!’ అంటూ గుంటి రాజలక్ష్మి (బి–6 బ్లాక్) అన్నారు. చిన్న రేకుల షెడ్డులో ఉండేవాళ్లం తెనాలి రోడ్డులోని రేకుల షెడ్డులో ఉండేవాళ్లం. చిన్నపాటి వర్షానికి కారిపోయేది. మా నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. మాకు ఇక్కడ బి–21 బ్లాక్‌లో ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నాం. దగ్గర్లోనే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చాలా ఆనందంగా ఉంది. – ఎండీ యాకూబ్ బేగ్, 8వ తరగతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా అమ్మ షాపులోను, నాన్న టైలర్గాను పనిచేస్తారు. చిన్న గది, ఇంటికి ఎవరొచ్చినా ఉండేందుకు అవకాశం ఉండేదికాదు. నా స్నేహితుల సొంతిళ్లను చూసినప్పుడు అలాంటి ఇల్లు మేం కొనుక్కోగలమా అని అనిపించేంది. జగన్నన పుణ్యమా అని ఇప్పుడు మాకూ ఇల్లు వచ్చింది. – గుమ్మడి జ్యోతిక, ఇంటర్ సెకండియర్ మాటల్లో చెప్పలేని ఆనందం ప్రైవేటు ఆస్పత్రిలో క్లర్క్‌గా పనిచేసే నేను సొంతిల్లు సంపాదించడం అసాధ్యం. చిన్న గదిలో అద్దెకుండేవారం. బంధువులొస్తే ఉండే అవకాశంలేదు. ఇప్పుడు అన్ని వసతులతో ఇల్లు ఇచ్చారు. మా అబ్బాయి ఎంతో మురిసిపోతున్నాడు. జగనన్న పుణ్మమాని అద్దె ఇంటి కష్టాలు తప్పాయి. – షేక్ పర్హీన్, ప్రైవేట్ ఉద్యోగి చిత్రంలో కనిపిస్తున్నామె పేరు షేక్ షహీనా. మంగళగిరి ఇస్లాంపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఈమె తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సొంతిల్లు లేదు. ఇప్పుడు మంగళగిరిలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న నగర్‌లోని బి–16 బ్లాక్‌లో ఫ్లాట్ పొందారు. ఇద్దరు పిల్లలతో సరైన ఇల్లులేక ఏడ్చిన సందర్భాలను ఈమె గుర్తుచేసుకున్నారు. ‘నా భర్త నిస్సార్ చెప్పుల దుకాణంలో పనిచేస్తారు. అరకొర జీతం. బంధువులు రాకూడదని షరతు. దీంతో ఎన్ని ఇళ్లు మారానో అల్లాకే తెలుసు. ఇప్పుడు నా సొంతిట్లో ఉంటున్నాను. ఇదంతా జగనన్న చలవే’ అని చెమర్చిన కళ్లతో చెప్పారు. ఇక షహీనా తల్లి ఫైజాన్ మాట్లాడుతూ.. ‘అద్దె ఇంట్లో నీరు ఎక్కువ వాడుతున్నారని తిట్టేవారు. దాంతో మనవలను చూడాలన్న ఆశ ఉన్నా వెళ్లడానికి ఉండేది కాదు. ఇప్పుడు నా బిడ్డకు జగన్‌బాబు ఇల్లిచ్చారు. నేను ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చు. ఆయన మా పాలిట అల్లాహ్’.. అన్నప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. – ఈ తల్లీ బిడ్డల ఆనంద బాష్పాలకు ఖరీదుకట్టే షరాబు ఉన్నాడా? నేను స్వేచ్ఛగా ఆడుకోవచ్చు.. ఇక్కడ చిత్రంలోని తల్లి జె.రాజ్యలక్ష్మితో కనిపిస్తున్న పిల్లాడి పేరు మోక్షజ్ఞ. ఏడో తరగతి. వీరు గతంలో చిన్న గదిలో అద్దెకుండేవారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తల్లి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు వీరికి టిడ్కో ప్రాజెక్టులో ఏ–7 బ్లాక్‌లో ఇల్లిచ్చారు. దీనిపై మోక్షజ్ఞ స్పందిస్తూ.. ‘ఇంతకుముందు ఆడుకునేందుకు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడిక్కడ ప్లేగ్రౌండ్ ఉంది. పార్కు కూడా కడతారట’.. అన్నప్పుడు బాబు కళ్లల్లో కనిపించిన మెరుపు వెలకట్టలేం. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘జగనన్న వచ్చాక నాకుంటూ సొంతిల్లు వచ్చింది’ అని చెప్పింది. – ఈ తల్లీకొడుకుల్లో సంతోషం, ధీమా కనిపించాయి. ఇరుకు గది నుంచి విశాల ప్రపంచానికి.. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కరిష్మా. నాలుగో తరగతి చదువుతోంది. నాన్నలేని ఈ బిడ్డకు ఓ తమ్ముడు ఉన్నాడు. వంట పనిచేసి తల్లి తెచ్చే కొద్దిపాటి సంపాదనతో మంగళగిరి ఐదో వార్డులోని చిన్నరేకుల షెడ్డులో వీరుంటున్నారు. ఇక్కడ బి–37లో ఫ్లాట్ ఇచ్చారు. ఈ చిన్నారిని పలకరించినప్పుడు ‘మేం అద్దెకుండే రేకుల ఇల్లు వర్షం వస్తే కారిపోయేది. ఇక్కడ ఇల్లు వచ్చిందని తెలియగానే అమ్మ ఎంతో సంతోషపడింది. అమ్మను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’. – ఆ చిన్నారి కళ్లల్లో వెలకట్టలేని వెలుగు కనిపించింది. మా పిల్లలకు గర్వంగా చెబుతున్నా.. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షేక్ జానీది కష్టాల కథే. పదుల సంఖ్యలో ఇళ్లు కట్టిన ఈ మేస్త్రీకి నిన్నా మొన్నటిదాకా సొంత గూడులేదు. ‘మనం సొంతిల్లు కట్టుకోలేమా నాన్నా.. అని నా పిల్లలు అడిగినప్పుడు మనసు చివుక్కుమనేది. ఎన్నో ఇళ్లు కట్టిన నేను నా పిల్లలకు సమాధానం చెప్పలేకపోయేవాడిని. జగనన్న చలవవల్ల ఇప్పుడు నాకు పది లక్షల విలువైన ఇల్లు (బి–5)వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా జగన్ బాబు పుణ్యమే’ అంటున్నప్పుడు మేస్త్రీ జానీ కళ్లలో కృతజ్ఞత కనిపించింది. -
ఇళ్లపై కుళ్లు రాజకీయం ఆపండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్ష పార్టీలు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడి తరుముతారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేస్తూ జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమంపై ఆదివారం ఓ ప్రకటనలో మంత్రి మండిపడ్డారు. మంగళగిరిలో టిడ్కో లబ్ధిదారులు జనసేన నేతలను నిలదీసి వెళ్లిపోవాలని చెప్పడమే అక్కడ అన్ని వసతులు సమకూరాయనడానికి నిదర్శనమన్నారు. టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆ పార్టీ నేతలను తరిమికొడతారన్నారు. అన్ని వసతులతో రాష్ట్రంలో ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, డిసెంబర్ నాటికి మరో 1,10,672 ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. ఇంటిని కేవలం రూపాయికే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోందని తెలిపారు. సకల వసతులతో సుందరంగా ఇళ్లను తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందజేస్తుంటే, జనసేన తమ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటికైనా కుళ్లు రాజకీయాలు ఆపాలని హితవుపలికారు. -
శాటిలైట్ సిటీలుగా వైఎస్సార్ జగనన్న నగరాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు కొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని అనువైన ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 88 యూఎల్బీలలో పేదల కోసం 2,62,212 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 163 ప్రాంతాల్లో ఉన్న వీటికి ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేశారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్న ఈ ఇళ్లు శాటిలైట్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 40 వేలకు పైగా యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్ని వసతులతో ఆధునిక ఇళ్లు చక్కటి రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, ఎస్టీపీలు వంటి సకల వసతులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుండటం గమనార్హం. ప్రాంతాన్ని బట్టి ఈ గ్రూప్ హౌస్‌లు వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండటం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. త్వరలో ఈ ప్రాంతాలు శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, గత నెలలో కొందరు యజమానులు వారికి కేటాయించి ఇళ్లలో చేరగా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మిగిలినవారు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, సరఫరా వంటి పనుల కోసం మునిసిపాలిటీల్లోని ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీపీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని ఇళ్ల అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇక నగరాల పరిధి దాటి పంచాయతీల్లో మరో 38 చోట్ల టిడ్కో ఇళ్లు నిర్మించగా, వాటి అవసరాలను తీర్చేందుకు మునిసిపల్ శాఖ పంచాయతీ విభాగంతో సంప్రదింపులు చేపట్టింది. ఇవన్నీ కొద్దిరోజుల్లో కొలిక్కి రావడంతో పాటు ఆయా కొత్త టిడ్కో పట్టణాల అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
మా కాలనీల్లోకి రావొద్దు.. మా ఇళ్లు మాకు కాకుండా చెయ్యొద్దు
మంగళగిరి/కశింకోట/పెంటపాడు: వైఎస్సార్ జగనన్న కాలనీలలో పర్యటించి రాజకీయాలు చేయాలనుకున్న జనసేన నాయకులకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. తమ నివాసాలలో ఎవరు పర్యటించాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. ఇంకోసారి తమ కాలనీల్లోకి వస్తే మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతామని ముక్తకంఠంతో లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి ఇలా వ్యతిరేకత వస్తుండడంతో జనసేన నేతలు చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. రాజకీయాల కోసం రావొద్దు.. వెళ్లిపోండి గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీ (టిడ్కో) ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. వీరి పర్యటనను ముందుగానే తెలుసుకున్న లబ్ధిదారులు సమావేశమై జనసేన నాయకులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన లబ్ధిదారులు అనుకున్నట్లుగానే వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లకు అన్ని వసతులు కల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దారని.. గృహప్రవేశాలు కూడా చేసుకున్నామని చెప్పారు. అసలు జనసేన నాయకులు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజకీయాల కోసం ఎవరూ తమ దగ్గరకు రావాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు తాము సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే వచ్చామని చెప్పారు. అంతేకాక.. ప్రజాస్వామ్యంలో తమకు ఇలా వచ్చే హక్కు ఉందని కొందరు జనసేన కార్యకర్తలు లబ్ధిదారులైన మహిళలతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లబ్ధిదారులు సమస్యలుంటే తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మీరు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. అలాగే, రాజకీయం చేసి మా పొట్ట కొట్టొద్దని కోరారు. దీంతో ఏంచేయాలో పాలుపోని జనసేన నేతలు లబ్ధిదారులకు దండం పెట్టి వెనుదిరిగారు. అనంతరం.. సి–3 బ్లాక్‌లో ఎఫ్ఎఫ్–8 ప్లాట్‌లో నివాసముంటున్న జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇది గమనించిన లబ్ధిదారులు మళ్లీ అక్కడకు చేరుకుని అసలు ఏ ఇంటినీ పరిశీలించాల్సిన అవసరంలేదని వెంటనే వెళ్లిపోవాలని కోరడంతో మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో పట్టణ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకోవడంతో చేసేదిలేక జనసేన శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం ఏ పార్టీ పర్యటించినా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల కోసం జగనన్న ఇళ్ల వద్దకు వస్తే మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. సంతృప్తికరంగానే ఉంటున్నాం.. అలాగే, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట, తేగాడ గ్రామాల వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న గృహ నిర్మాణ లేఅవుట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సమస్యలు చెప్పమని అడిగారు. అయితే, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయడంతో సంతృప్తికరంగా నిర్మించుకుంటున్నామని వారు బదులిచ్చారు. తేగాడ లేఅవుట్లో కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుందని బదులివ్వడంతో తాము ఆశించిన ఫలితం రాలేదంటూ జనసేన శ్రేణులు నిరాశతో వెనుదిరిగారు. గోబ్యాక్ నినాదాలతో తోకముడిచిన జనసేన ‘జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్మల్ని సంప్రదించకుండా కాలనీలోకి రావడాన్ని సహించం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన నేతలు వచ్చి ఇక్కడ కిరికిరీలు పెట్టొద్దు.. జగనన్న ప్రభుత్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు’.. అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన శ్రేణులకు అడ్డుతగిలారు. జనసేన గోబ్యాక్ అంటూ మహిళలు నినదించారు. తమకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. దీంతో జనసేన శ్రేణులు తమ జెండాలను ముడిచి వెనుదిరిగారు. -
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
పవన్ పై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ ఫైర్
-
పేదలకు ఇళ్ళు ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట : మంత్రి జోగి రమేష్
-
కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరు యువతను పెడదోవ పట్టించేటట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. 651 లే ఔట్లలో నిర్మించిన 79వేల ఇళ్లను పరిశీలించారు. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. రాజకీయాల్లో కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదని మండిపడ్డారు. ఇవాళ పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి నా మీద కేసులు ఉన్నాయి. మీ మీద కేసులు వచ్చినా పోరాడండి అంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆయనను సినిమా నటుడిగా ప్రజలు గౌరవిస్తారు కానీ, ఓట్లు వేయరు అనే సంగతి గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు. పైసా అవినీతి లేకుండా టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. చదవండి: (విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్) -
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం మాకు అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లు అందిస్తుంటే.. మీరెందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా అంటూ జనసేన నాయకులను లబ్ధిదారులు నిలదీశారు. జగనన్న నగర్ నుంచి జనసేన నాయకులు వెంటనే వెళ్లిపోవాలని లబ్ధిదారులు నినాదాలు చేశారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
జనసేన నాయకులను అడ్డుకున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
-
AP: గృహ యజ్ఞం.. పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్క చెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందచేస్తోంది. ఇది ఎంత పెద్ద యజ్ఞమంటే.. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతోపాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ సగటున కనీసం రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను సృష్టిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను కొనసాగించి పనులు కల్పించడం ద్వారా కోవిడ్ సమయంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. డిసెంబర్‌కు ఐదు లక్షల ఇళ్లు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. దశాబ్దాలుగా గూడు లేక అవస్థలు పడుతున్న లక్షల మందికి ఊరటనిస్తోంది. పథకం కింద రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 17.24 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, టిడ్కో ఇళ్లు 1.5 లక్షలు ఈ గడువులోగా పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు సమకూరుస్తోంది. మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, దుస్తులు లాంటి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు నిలువ నీడ లేదు. ఆ నిరుపేదల గోడును 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విన్నారు. నేను ఉన్నానని హామీ ఇచ్చారు. మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ద్వారా ఏకంగా 30.25 లక్షల మంది నిరుపేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తూ ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీన్ని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా పక్కా ఇళ్లను నిర్మించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ మహాయజ్ఞం పూర్తయితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా కోర్టులకెక్కి పలు అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రభుత్వ దృఢ సంకల్పం ముందు ఆ పాచికలు పారలేదు. దీంతో తాజాగా దత్తపుత్రుడిని రంగంలోకి దింపి డిజిటల్ క్యాంపెయిన్ పేరిట పేదల ఇళ్లపై బురద జల్లే మరో కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది. దర్జాగా ఉంటున్నాం నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. ఇద్దరు పిల్లలు. సొంతిల్లు లేదు. అద్దె కట్టే స్తోమత లేక బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లు పైకప్పు సరిగా లేక వర్షాలు పడినప్పుడు అవస్థలు ఎదుర్కొన్నాం. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి దరఖాస్తుకే స్థలం, ఇంటిని కూడా మంజూరు చేశారు. రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం. – షేక్ ఫాతిమాబీ, ఫణిదం, సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా సదుపాయాలన్నీ కల్పించారు.. సొంతిల్లు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద దరఖాస్తు చేసుకోవడంతో గ్రామం వెలుపల స్థలం కేటాయించారు. ఊరికి దూరంగా ఇవ్వడంతో భయపడ్డాం. ఇంటి నిర్మాణానికి చేయూత ఇవ్వడంతో పాటు కాలనీలో విద్యుత్, తాగు నీరు తదితర సదుపాయాలన్నీ సమకూర్చారు. మా జగనన్న లేఅవుట్లో 400 మందికిపైగా పేదలు ఇళ్లు కట్టుకున్నారు. – పి. దుర్గాదేవి, జేగురుపాడు, కడియం మండలం, తూర్పుగోదావరి రూ.3 లక్షల విలువైన స్థలం జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మాకు రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల యూనిట్‌కు గానూ ఇప్పటి వరకు రూ.48వేల బిల్లు వచ్చింది. కాలనీలో వసతులు కల్పిస్తున్నారు. – కొల్లి కనకమ్మ, కొత్తమూలకుద్దు, అనకాపల్లి జిల్లా గతంలో ఎన్నడూ చూడలేదు పేదలకు పక్కా ఇళ్ల కోసం సీఎం జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. జగనన్న కాలనీలో నాకు స్థలం కేటాయించారు. నిర్మాణ బిల్లులు కూడా సకాలంలో అందించారు. ఇప్పటికే ఇల్లు పూర్తి కావచ్చింది. జగనన్న ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా లబ్ధి చేకూరుతోంది. కాలనీలో విద్యుత్, రహదారులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా చేపడుతున్నారు. – మండల్ క్రిష్ణ, నగర పంచాయతీ పాలకొండ మూడు దశాబ్దాల కల మూడు దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. సీఎం జగన్ ప్రభుత్వం మా సొంత ఇంటి కలను నెరవేరుస్తోంది. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యింది. రూ.50 వేల వరకు బిల్లు కూడా వచ్చింది. – జంగం అన్నపూర్ణ, మంత్రాలయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మాది పశ్చిమ గోదావరి జిల్లా. 30 ఏళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చాం. మూడు దశాబ్దాలు అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ సొంతింటి కల మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే నెరవేరింది. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది. – కె. భానుమతి, పుట్టపర్తి ఇన్నాళ్లకు కల నెరవేరింది ఉప్పలూరు గ్రామానికి 13 ఏళ్ల క్రితం వచ్చాం. సొంత స్థలం లేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ స్థలం కోసం తిరిగినా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉప్పలూరు లే అవుట్‌లోనే స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేశాం. ఎన్నో ఏళ్లకు సొంతింటి కల తీరింది. చాలా ఆనందంగా ఉంది. కాలనీలో తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉంది. – పోసిన శివనాగమల్లేశ్వరి, ఉప్పలూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి– రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు (రూ.15 వేల విలువ చేసే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రూ.40 వేల విలువైన సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కన్నా తక్కువకు రాయితీతో సరఫరా చేస్తోంది.) జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాల కల్పన వ్యయం రూ.కోట్లలో నీటి సరఫరా– 4,128 విద్యుత్, ఇంటర్నెట్– 7,989 డ్రైనేజీ, సీవరేజ్– 7,227 రోడ్లు, ఆర్చ్‌లు– 10,251 పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన – 3,314 ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చు (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకూ) లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు– రూ.6149,10,54,963 నిర్మాణ సామగ్రి– రూ.1629,99,83,047 ఇతర ఖర్చు– రూ. 656,68,14,937 మొత్తం– రూ.8435,78,52,947 రూ.10 లక్షల ఇంటికి యజమాని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తాకాసి దేవీ సత్యనారాయణ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా కనికరించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి అర్జీ పెట్టుకున్నారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. కొద్ది రోజులకే స్థలం మంజూరై ఇంటి పట్టా అందింది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తైంది. రూ.10 లక్షల విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ అందించారని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది. ఫిబ్రవరిలో గృహప్రవేశం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వి.రమాదుర్గ వాలంటీర్ కాగా ఆమె భర్త కార్పెంటర్. ఇద్దరి సంపాదన నెలకు రూ.20 వేల లోపే. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల పైమాటే ఉండటంతో సొంతిల్లు కలేనని రమాదుర్గ వేదనకు గురయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ఆమెకు ఉచితంగా ఇంటి స్థలం అందింది. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందడంతో వేగంగా కొనసాగుతోంది. ఇటీవల స్లాబ్ కూడా వేశారు. ప్రస్తుతం గోడలకు ప్లాస్టింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, ఆ నెలలో మంచి రోజులు ఉన్నందున గృహ ప్రవేశం చేస్తామని రమాదుర్గ చెబుతోంది. ఆమెతో పాటు బుల్లియ్యరేవులోని వైఎస్సార్ జగనన్న లేఅవుట్లో పేదలకు ప్రభుత్వం 170 ఇళ్లను మంజూరు చేసింది. 60 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కాగా మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయి. -
టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేద ప్రజల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల మెరుగైన నిర్వహణకు ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు’ ఏర్పాటు చేయనున్నారు. సొసైటీల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మొత్తం 88 యూఎల్బీల్లో 2,62,212 ఇళ్లను జీ+3 అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 163 ప్రాంతాల్లో ఉన్న వీటిని వైఎస్సార్ జగనన్న నగరాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 11,500 ఇళ్ల వరకు నిర్మిస్తున్నారు. ఇవి అపార్టుమెంట్లే అయినప్పటికీ ఒక్కో ప్రాంగణం చిన్న తరహా పట్టణాన్ని తలపిస్తోంది. దీంతో ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెత్త సేకరణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్వహణ లాంటి పనులను స్థానిక మున్సిపాలిటీలే నిర్వర్తిస్తాయి. అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగిస్తారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మాదిరిగా టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు ఈ తరహా కమిటీల ఏర్పాటు ఇదే తొలిసారి. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లతో పాటు ఆర్జేడీలకు ఏపీ టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ లేఖ పంపారు. కమిటీల విధులపై నివాసితులతో చర్చించి ఈనెల 10లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. గృహ నిర్మాణ రంగంపై ఇటీవల గుజరాత్లో నిర్వహించిన సదస్సుకు హాజరైన టిడ్కో అధికారులు అక్కడ అపార్ట్మెంట్ల నిర్వహణను పరిశీలించి ముసాయిదా సిద్ధం చేశారు. కాగా, అక్టోబరు చివరి నాటికి 40,575 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెరుగ్గా అంతర్గత నిర్వహణ.. కమిటీలు ఉంటే అంతర్గత నిర్వహణ సులభతరమవుతుంది. కారిడార్లు, ప్రాంగణాల నిర్వహణ, మోటార్ల నిర్వహణ లాంటివి ఇళ్ల యజమానులే పర్యవేక్షించేందుకు కమిటీలు ఉంటే మంచిది. ఇవి ఏకరీతిన ఉండాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో 2.62 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున మొత్తం 262 రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటవుతాయి. తద్వారా దేశంలో ఈ తరహా కమిటీలను నియమించిన తొలి రాష్ట్రం ఏపీ అవుతుంది. – చిత్తూరి శ్రీధర్, టిడ్కో ఎండీ -
విశాఖలో టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి : విశాఖపట్నం మురికివాడల్లోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు అందిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీలోని మొత్తం 13 ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించనుంది. ఇటీవల మంగళగిరి, తెనాలిలలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించిన టిడ్కో అధికారులు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనూ నేడు తొలి విడతగా 2,632 యూనిట్లను లబ్ధిదారులకు అందించనున్నారు. విశాఖ మహానగరంలో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా, తొలి విడతలో రాజీవ్ కాలనీ, పైడిమాంబ కాలనీ, చిలకపేట, ఆదర్శ గ్రామం, సీహార్స్ కాలనీ, గౌరీనగర్, సుద్దగెడ్డ, ఏఎస్ఆర్ కాలనీ, టీఆర్ ముత్యమాంబ కాలనీ, రాతిచెరువు, అగనంపూడి, పరవాడ, చినముషిడివాడ ప్రాంతాల్లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రజలు జీవించేందుకు అవసరమైన కనీస వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ 13 కాలనీల్లో నేడు పక్కా ఇళ్లతోపాటు రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించి నిరుపేదలు సగౌరవంగా జీవించే స్థాయిలో ఇళ్లను నిర్మించారు. అన్ని వసతులతో పూర్తిచేసిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లుచేసినట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని శనివారం లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వివరించారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో పంపిణీ ఏర్పాట్లను శుక్రవారం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. డిసెంబర్లో మరో 8 వేలు మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నాం. శనివారం మొదటి విడతగా 2,632 యూనిట్లను 13 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందిస్తాం. డిసెంబర్లో మరో 8 వేల ఇళ్లను పంపిణీ చేస్తాం. మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందిస్తాం. టిడ్కో ఇళ్లు నిర్మించిన అన్నిచోట్లా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు కల్పించాకే ఇళ్లను అప్పగిస్తున్నాం. – చిత్తూరు శ్రీధర్, టిడ్కో ఎండీ -
జోరుగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. కోనసీమ జిల్లా మండపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన ఇళ్లలో 2,720 యూనిట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 15న మంగళగిరి పరిధిలో, 21న జీవీఎంసీలో కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేశారు. వీటితోపాటు తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట నంద్యాలతోపాటు మొత్తం తొమ్మిది పట్టణాల్లో 20,176 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 23న విజయనగరంలో ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆగస్టు నాటికి 39,820 యూనిట్లను టిడ్కో అధికారులు అందజేశారు. అలాగే, సెప్టెంబర్‌లో ఆదోనిలో 2,500, ఎమ్మిగనూరులో రెండువేల యూనిట్లను పంపిణీ చేశారు. నిజానికి వర్షాల కారణంగా పంపిణీ ఆలస్యమైనా ఆ తర్వాత నిర్మాణాలు పూర్తిచేసుకున్న చోట అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మౌలిక వసతులు కల్పించి నెలన్నర వ్యవధిలో 39,820 యూనిట్లను పంపిణీ చేశారు. మొత్తం రెండు నెలల వ్యవధిలో 44,320 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ నెలలో మరో 20,176 యూనిట్లను అందించనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది నిర్మాణం మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేసిన టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు పునరుద్ధరించి 88 పట్టణ స్థానిక సంస్థల్లో 2,62,216 ఇళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణం చేపట్టింది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంగల 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే అందించడంతో పాటు వీటికయ్యే ఆర్థిక భారం రూ.3,805 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇక 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణం కలిగిన 1,18,616 ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేస్తోంది. అంతేకాక, లబ్ధిదారులు అందరికీ ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోంది. టిడ్కో ఇళ్ల పత్రాలు, తాళాలు గృహ సముదాయ ప్రాంగణాల్లోనే అందజేస్తున్నామని, ఇకపైనా అదే విధానం కొనసాగుతుందని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్టోబర్ నెల పంపిణీ ప్రక్రియ మండపేట నుంచి ప్రారంభించామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ చెప్పారు. ఇళ్ల పంపిణీ ప్రాంగణంలోనే ఇంటి తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పేదలకు అండగా ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసింది. మా ప్రభుత్వం 2.62 లక్షల ఇళ్లల్లో 1.43 లక్షల యూనిట్లు నిరుపేదలకు చెందినవే. వీటికి గత పాలకులు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి, బ్యాంకు రుణాలు మంజూరు చేశాక, ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని చెప్పింది. అలా చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 1.43 లక్షల మందిపైనా సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. కానీ, సీఎం వైఎస్ జగన్ 300 చ.అ. ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చారు. అంతేకాక.. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. డిసెంబర్ నాటికి మొత్తం 2.62లక్షల యూనిట్లను అందజేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి -
గృహ ప్రవేశాలకు వేళాయె
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంత పేదలు త్వరలోనే గృహప్రవేశం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల సొంతింటి కల సాకారం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం కార్పొరేషన్, గుడివాడ, ఉయ్యూరు మునిసిపాలిటీల పరిధిలో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి, డిసెంబర్ నాటికి వాటిలో లబ్దిదారులతో పాలు పొంగించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గృహ సముదాయాల్లో రూ.139.29 కోట్లతో రహదారులు, అండర్ డ్రెయిన్ల నిర్మాణం, విద్యుదీ్ధకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అసంపూర్తిగా వదిలేసిన టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో నాటి పాలకులు టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా వదిలేశారు. లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తోంది. మచిలీపట్నం, గుడివాడలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఉయ్యూరులో 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. రుణాలతో ఆర్థిక చేయూత గృహ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వీలుగా లబి్ధదారులకు తక్కువ వడ్డీతో ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 365 చదరపు గజాల విస్తీర్ణం గల గృహానికి రూ.3.15 లక్షలు, 430 ఎస్ఎఫ్టీ గృహాలకు రూ.3.65 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంకులను నిర్దేశించింది. మెప్మా అధికారులకు బాధ్యతలు అప్పగించటంతో లక్ష్యసాధన కోసం ప్రస్తుతం రుణ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఒక్కరే కావటంతో రుణాల లక్ష్యసాధనలో తడబాటు నెలకొంది. రూ.356.81 కోట్లు రుణ లక్ష్యం గుడివాడలో ఫేజ్–1 కింద మంజూరైన 2,912 మంది, ఫేజ్–2 కింద మంజూరైన 7,328 మందికి, మచిలీపట్నంలో 960 మందికి, ఉయ్యూ రులో 1,776 మందికి అవసరమైన రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ బ్యాంక్, యూకో బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించేలా కార్పొరేషన్, మునిసిపాలిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 10,064 మందికి మొత్తం రూ.356.85 కోట్ల రుణాలను ఇప్పించాలనేది లక్ష్యం. ఈ నెల 21వ తేదీ నాటికి 8,615 మంది లబ్దిదారులతో బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్చేయించారు. లోన్ డాక్యుమెంటేషన్ పూర్తయిన 8,583 మందిలో ఇప్పటి వరకు 4,323 మందికి వివిధ బ్యాంకుల రుణాలు మంజూరు చేశారు. 4,309 మంది బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే రుణాలు జమయ్యాయి. సకాలంలో పూర్తి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నతాధికారులు సైతం తరచూ సమీక్షిస్తున్నారు. డిసెంబర్లో ఇళ్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులపై దృష్టి సారించాం. లబి్ధదారులకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు ఉపయోపగపడుతున్నాయి. మునిసిపల్, మెప్మా అధికారుల సమన్వయంతో దీనిపై ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయి. – చిన్నోడు, టిడ్కో జిల్లా ప్రాజెక్టు అధికారి -
నెరవేరుతున్న పేదల సొంతింటి కల... రూపాయికే రిజిస్ట్రేషన్
కడప కార్పొరేషన్(వైఎస్సార్ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలు జరుగుతోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు అధికారులు టిడ్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. తద్వారా ఒక్కో ఇంటిపై రిజిస్ట్రేషన్‌కు అయ్యే సుమారు రూ.50 వేలను ప్రభుత్వమే భరిస్తోంది. పదిరోజులుగా జిల్లాలో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ∙గత ప్రభుత్వం పేదల కోసమని చెప్పి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో 300, 365, 425 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచించింది. అయితే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ నిర్మాణాలు ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి. ప్రజా సంకల్పయాత్రలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లలో మొదటి కేటగిరికి చెందిన 300 చదరపు అడుగుల ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో మొండిగోడలు, వసతుల లేమితో ఉన్న టిడ్కో ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కరెంటు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, కాలువలు వంటి మౌళిక వసతులు సమకూర్చి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ చేపట్టారు. టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకొని ఎవరైనా మరణించి ఉంటే వారి వారసులకు ఇళ్లను ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.కడపలో 2432, జమ్మలమడుగులో 1440, ఎర్రగుంట్లలో 1584, ప్రొద్దుటూరులో 144 ఇళ్ల చొప్పున మొత్తం 5,556 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో మొదటి విడతగా కడపలో 1776, జమ్మలమడుగులో 576, యర్రగుంట్లలో 1584 ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా కడప, జమ్మలమడుగులో మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఆగష్టు 25వ తేది నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సాధారణంగా ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరోజుకు 20 రిజిస్ట్రేషన్లు జరిగాయంటే చాలా గొప్పగా చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ పరిధిలో రోజుకు 30కి తక్కువగాకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కడపలో ఆగష్టు 25వ తేది 39, 26వ తేది 74, 27వ తేది 92, 28వ తేది 83, 29వ తేది 65, 30వ తేది 31 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 26, 27, 28 తేదీలలో 70 మార్కు దాటడం విశేషంగా చెప్పవచ్చు. ఇలా మొదటి దశలో 480 ఇళ్లకుగాను 384 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. అలాగే రెండవ దశలో 1200 ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి 435 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. జమ్మలమడుగులో 246 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఇంకా 330 రిజిస్ట్రేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ సొంత ఇంటికల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పదిరోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయించడం శుభ పరిణామం. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరో పది రోజులకు పూర్తి చేసేలా కసరత్తు పూర్తి చేశాం. కడపలో ఇప్పటికే 819 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాము. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. – సూర్యసాయి ప్రవీణ్‌చంద్, కమిషనర్, కడప నగరపాలక సంస్థ -
ఒక్క రూపాయికే ఇల్లు
(అనంతపురం) గుంతకల్లు టౌన్: మనిషి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. నిరుపేదలకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాలను కేటాయించిన దేశచరిత్రలో నూతన అధ్యాయానికి తెర లేపారని కొనియాడారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గుంతకల్లులో టిడ్కో ఇల్లు మంజూరైన 2,160 మంది లబ్దిదారుల పేరిట మంగళవారం మున్సిపల్ కౌన్సిల్హాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా చేస్తామంటూ గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొండిగోడలకే పరిమితమైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించడమే కాక, ఆయా కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి పరిచినట్లు వివరించారు. రోజూ 50 నుంచి 100 మంది లబ్దిదారుల పేరిట టిడ్కో ఇళ్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, మాజీ చైర్మన్ ఎన్.రామలింగప్ప, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టిడ్కో డీఈ రంగారావు, మద్దయ్య, ఏసీపీ కేఎండీ.ఇషాక్, ఆర్ఓ నాసిర్, మెప్మా టీపీఆర్వో మోహన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు. -
AP: రూపాయికే ఇల్లు ప్రభుత్వం ఘనత
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు అర్బన్(ప.గో. జిల్లా): దేశంలోనే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగుల ఇల్లు ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో సుమారు 54 ఎకరాల్లో తొలి విడత నిర్మించిన 1,856 టిడ్కో గృహాలను, భీమవరం పట్టణం గునుపూడిలో 82 ఎకరాల్లో నిర్మించిన 1,920 టిడ్కో గృహాలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పాలకొల్లులో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి కవురు శ్రీనివాస్ అధ్యక్షతన, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు సారె రూపంలో టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని, జగనన్ననగర్ పేరుతో వీటిని నిర్మిస్తూ సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లను దశల వారీగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టా మన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు టిడ్కో ఇళ్లపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. నాడు 300 చదరపు అడుగుల ఇల్లుకు రూ.2.50 లక్షల బ్యాంకు రుణం కట్టాలని టీడీపీ వారు చెప్పారా లేదా అనిప్రశ్నించారు. ఈ మేరకు పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలంటే సాధ్యమా అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో పేదలపై భారం తగ్గించేలా రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. జగనన్నకు మీ అందరి అశీస్సులు ఉండాలని ఆయన కోరారు. భీమవరంలో నాడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 82 ఎకరాల భూమిని ఒకేచోట సేకరించడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహ న్, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, కార్పొరేషన్ చైర్మన్లు పెండ్ర వీరన్న, గుబ్బల తమ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, జెడ్పీటీసీలు కాండ్రేగుల నర్సింహరావు, నడపన గోవిందరాజులనాయుడు, గుంటూరు పెద్దిరాజు, ఎంపీపీలు రావూరి వెంకటరమణ, సబ్బితి సు మంగళి, పేరిచర్ల విజయనర్సింహరాజు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం నా భర్త శ్రీనివాస్ వడ్రంగి పని, నేను కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. నాకు రూపాయి రిజిస్ట్రేషన్‌తో ఏ–59 బ్లాక్‌లో ఫ్లాట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.15 లక్షల బ్యాంక్ రుణం కట్టాలన్నారు. నెలకి రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ మొత్తంగా రూ.7 లక్షల వరకు చెల్లించాలన్నారు. సీఎం జగన్ నా కుటుంబానికి ఉచితంగా టిడ్కో ఇల్లు ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. – కీర జ్యోతి, లబ్ధిదారు, పాలకొల్లు సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నా సొంతింటి కల నెరవేర్చారు. సుమారు 30 ఏళ్లపాటు అద్దె ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్న నాకు ఈ రోజు సొంతిల్లు రావడంతో కొండంత ధైర్యం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేవలం రూపాయికే నాకు ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించడం చాలా సంతోషంగా ఉంది. పండగ పూట మా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మంత్రుల చేతులమీదుగా ఇళ్ల పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది. – కె.దానమ్మ, లబ్ధిదారు, భీమవరం సొంతింటి కల సాకారం మండలి చైర్మన్ మోషేన్‌రాజు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ భీమవరంలో తొలి విడతగా 1,920 మందికి ఇళ్లను అందించడం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో 180 ఎకరాలు సేకరించి వేల మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం పండగ రోజున టిడ్కో ఇళ్లను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత వైఎస్సార్ సాయంతో పట్టణంలో 82 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ భీమవరంలో మిగిలిన టిడ్కో ఇళ్లను రెండు, మూడు నెలల్లో అందజేస్తామన్నారు. ఇక్కడ 512 మందికి ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చామన్నారు. -
కోలాహలంగా టిడ్కో గృహప్రవేశాలు
కర్నూలు (సెంట్రల్): వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పట్టణ పేదలకు రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి కానుకగా ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల గృహాలకు రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.10,400 కోట్ల భారం పడిందన్నారు. అయినా వైఎస్ జగన్ సర్కారు పేదల కోసం ఈ భారాన్ని భరిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 30 వేల గృహాలను అందజేసినట్లు చెప్పారు. సోమవారం కర్నూలులో వైఎస్సార్ జగనన్న నగర్లో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి జయరాం ముఖ్యఅతిథులుగా హాజరై దాదాపు 5 వేల మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో 300 చదరపు అడుగులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట రూ.500 కడితేనే రిజిస్ట్రేషన్ చేసే వారని తెలిపారు. తరువాత ఆ ఇంటికి రూ.2.62 లక్షలు అప్పు ఇప్పించే వారన్నారు. దీనిని 20 ఏళ్లపాటు లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలపై మోపిన ఈ భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుందని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాన్ని పేద మహిళలకు ఆస్తిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం చంద్రబాబు 2018లో టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించగా ఎక్కడా పూర్తి కాలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరగడానికి, తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ బాదుడే బాదుడుకు బదులుగా ఏడుపే ఏడుపు కార్యక్రమాన్ని చేపడితే మంచిదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ రామయ్య, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, వై.సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
కృష్ణా (మచిలీపట్నం): పేదల సొంతింటి కల సాకారం అయ్యే తరుణం ఆసన్నమైంది. టిడ్కో గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రిజి్రస్టేషన్ పూర్తయితే ఇంటిపై సర్వ హక్కులు పొందినట్లేనని అధికారులు చెప్పటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు టిడ్కో గృహ లబ్ధిదారులతో ప్రస్తుతం సందడిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం దీనిపై దృష్టి పెట్టింది. కలెక్టర్ రంజిత్ బాషా.. మున్సిపల్, టిడ్కో, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో దీనిపై తరచూ సమీక్షించి దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణాలో 13,712 ఇళ్లు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేసి, నాటి పాలకులు నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. పేదలైన లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. 365 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల గృహానికి రూ. 3.15 లక్షలు, 430 ఎస్ఎఫ్టీ గృహాలకు రూ.3.65 లక్షలు రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. ఇందుకు రిజి్రస్టేషన్లు అవసరం దృష్ట్యా, యుద్ధ ప్రాతిపదికన వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రిజిస్టేషన్లకు ప్రత్యేక కౌంటర్లు.. టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలతో కార్పొరేషన్, మునిసిపాలిటీల అధికారులు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జత చేసిన దరఖాస్తులు వస్తుండటంతో సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా రిజిస్టర్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ రిరిజిస్ట్రేషన్ తో ఆటంకం లేకుండా టిడ్కో గృహ లబ్ధిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, గుడివాడ సబ్ రిజి్రస్టార్ల పరిధిలో ఇప్పటికే రిజి్రస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఉయ్యూరులో సోమవారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గృహ సముదాయాల్లో సకల హంగులు.. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన 13,712 ఇళ్లు నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చాయి. డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలనే లక్ష్యంగా టిడ్కో జిల్లా ప్రాజెక్టు అధికారి చిన్నోడు నేతృత్వంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గృహ సముదాయాల వద్ద మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులలో నిర్మిస్తున్న గృహ సముదాయాల వద్ద మొత్తం రూ. 139.29 కోట్లతో రహదారులు, అండర్ గ్రౌం డ్రైనేజీల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సకాలంలో రిజిస్ట్రేషన్.. టిడ్కో గృహ లబి్ధదారులకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు శ్రద్ధ తీసుకున్నాం. కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. లబి్ధదారుల వివరాలతో మున్సిపల్ అధికారులు దరఖాస్తు చేస్తే, ఎటువంటి ఆలస్యం లేకుండా రిజి్రస్టేషన్ చేస్తున్నాం. లబి్ధదారుల్లో వృద్ధులు కూడా ఉన్నందున వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – టి. ఉపేంద్రరావు, జిల్లా రిజి్రస్టార్, కృష్ణా జిల్లా -
TIDCO Houses: వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సారిపల్లిలో నిర్మించిన 800 యూనిట్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందచేసింది. ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలస–1లో మరో 800 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తాగునీరు, రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు, ఎస్టీపీలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో సిద్ధమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నాడు ఎన్నికలకు ముందు అరకొరగా... రాష్ట్రవ్యాప్తంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 36,064 ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్ ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది. 365 చ.అ విస్తీర్ణంలోవి 13,968 ఇళ్లు, 430 చ.అడుగుల్లోవి మరో 21,040 యూనిట్లు ఉన్నాయి. వీటిని 50 శాతం రాయితీతో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులపై భారం మోపుతూ ఎన్నికల ముందు అరకొరగా టిడ్కో ఇళ్లను చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి మౌలిక సదుపాయాలతో వీటిని సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు, పార్కులతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రతి నిర్మాణానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఈమేరకు సర్వ హంగులతో టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి. పేదలపై రిజిస్ట్రేషన్ల భారం పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 98 పట్టణ స్థానిక సంస్థల్లో మూడు విభాగాల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నాటికి 1.32 లక్షలకుపైగా యూనిట్లను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అన్ని సదుపాయాలతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నారు. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి ప్రభుత్వం అందిస్తోంది. ఒక్క రిజిస్ట్రేషన్ల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకుపైగా భారాన్ని భరిస్తుండటం గమనార్హం. -
'ఛీ'టింగ్ టీడీపీ నేతలు.. సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట
సాక్షి ప్రతినిధి విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు టిడ్కో ఇళ్ల పేరిట చేసిన గిమ్మిక్కులు ఫలించకపోగా ఇప్పుడు అవి వారి పాలిట శాపాలుగా మారాయి. తమ వద్ద వసూలు చేసిన నగదును తిరిగి ఇచ్చేయాలంటూ జనం ఆ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ఇందుకు టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చీటింగ్ చేసి పేద ప్రజలకు శఠగోపం పెట్టారు. 6,500 ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఏకంగా 11,917 మందికి అప్లికేషన్లు విక్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గ నాయకులు నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున అప్లికేషన్లు పంచుకుని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయితీ టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. ‘బాదుడే బాదుడు’ పేరుతో ప్రజల్లోకి వెళ్తే తమను ఎక్కడ బాదుతారోనన్న భయం వెంటాడుతోంది. దీంతో డబ్బులు వసూలు చేసిన నాయకులు ఈ కార్యక్రమానికి ముఖం చాటేస్తు న్నారు. వారి నుంచి డబ్బులు ఇప్పించాలంటూ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. 6,500 ఇళ్లకే భూమి కేటాయింపు 2019 ఎన్నికల ముందు కేవలం 6,500 టిడ్కో ఇళ్లు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ పనులు చూపించి ఏకంగా 11,917 మంది అమాయక ప్రజల నుంచి నగదు జమ చేసుకుంది. 12 వేల ఇళ్ల నిర్మాణానికి సుమారు 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాదులో కేవలం 74 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం టిడ్కోకు అప్పగించింది. ఇచ్చిన భూమి కొండ ప్రాంతం కావడంతో ఇళ్ల నిర్మాణానికి కొండను తవ్వలేక అధికారులు, కాంట్రాక్టర్లు నానాయాతన పడ్డారు. చివరకు 6,576 ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లను చూపి టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 17వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. నిర్మించిన ఇళ్లను బ్లాకులుగా విభజించినట్లు చూపి, స్లిప్పులపై బ్లాకు, ఇళ్ల నంబర్లు వేసి ప్రజలకు పంచింది. చదవండి: (వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్) అయితే ఆ ఇళ్లు అసలు లేవని తెలుసుకున్న బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని మూడేళ్లుగా టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ప్రజలు తమ నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు, పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. డబ్బులు తిరిగిచ్చేందుకు గడువు విధించారు. ఆ గడువు ముగియడంతో కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీఎన్టీయూసీ నాయకుడిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ముగ్గురు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండానే దోపిడీ విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో వారి అనుచరులు, టీడీపీ డివిజన్ ఇన్చార్జులు టిడ్కో ఇళ్ల పేరిట ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. కనీసం స్థలం సేకరించకుండా, ఇళ్లు నిర్మించినట్లు, వాటిని బ్లాకులుగా విభజించినట్లు చూపి ప్రజలను నమ్మించారు. రూ.5 వేల అప్లికేషన్‌ను రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చదవండి: (ఇళ్లపై కుళ్లు రాతలు!) సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చేసిన మోసాలకు తోడు, అప్పటి ప్రభుత్వం సైతం దరఖాస్తుదారులతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డీడీలు తీయించింది. ఈ మోసాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు పంపిణీచేసి, మిగిలిన 5,341 మంది బాధితులకు వారు డీడీలు తీసిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయించారు. అంతేకాకుండా బాధితులకు ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చిన విధంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రెట్టింపు మేలు చేశారు. -
టిడ్కో ఇళ్లకు లైన్ క్లియర్
పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకపక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే.. మరోపక్క టిడ్కోలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్ల పాటు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగా ఉండడంతో వేగంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భీమవరం(ప్రకాశం చౌక్): ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం టిడ్కో అధికారులు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో టిడ్కో ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ల పనులు ముమ్మరం చేశారు. ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితం... నూతన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో 20,784 టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఏ కేటగిరీలో 300, బీ కేటగిరీలో 365, సీ కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లు నిర్మించగా, ఇవన్నీ కలిపి 20,784 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో నాలుగు పట్టణాల్లో కలిపి 300 చదరపు అడుగుల ఇళ్లు 6944 నిర్మించగా, ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను ఫేజ్–1లో లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగవంతం జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్లాట్లను లబ్ధిదారుల పేరిట ఉచిత రిజస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మెప్మా విభాగం అధికారులు ఆయా పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించడంతో రిజస్ట్రేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా రిజస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించడంపై లబ్దిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఇలా... ఇప్పటివరకు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 3758 మందికి ప్లాట్లు రిజస్ట్రేషన్ చేశారు. అందులో భీమవరంలో 900, పాలకొల్లులో 1458, తాడేపల్లిగూడెంలో 1400 చొప్పున ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేపట్టారు. మూడు పట్టణాల్లోని ఫేజ్–1 లబ్ధిదారుల్లో 2577 మంది రూ.68.39 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు. ఫేజ్–1 కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జిల్లాలో ఫేజ్–1లో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు కేటగిరీల ఇళ్లూ ఈ ఫేజ్‌లో ఉన్నాయి. – ఎం.స్వామినాయుడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్ -
సత్వర సేవలు..
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. అధికారులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పట్టణ పేదలకు 1.39 లక్షల యూనిట్ల టిడ్కో ఇళ్లను అన్ని మౌలిక సదుపాయాలతో జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. గత సర్కారు నీరు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలను కూడా కల్పించకపోగా అరకొరగా పనులు చేపట్టి సగం ఇళ్లను కూడా పూర్తి చేయలేదని చెప్పారు. మౌలిక వసతులు శూన్యమని, కరెంట్ కూడా లేదన్నారు. అలాంటి దశలో ఉన్న ఇళ్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో నిర్మిస్తోందని తెలిపారు. టిడ్కో ఇళ్లకు మూడేళ్లలో రూ.5,500 కోట్లు వ్యయం చేశామని, అవసరాన్ని బట్టి ఇంకా ఖర్చు చేస్తామని చెప్పారు. దాదాపు రూ.14 వేల కోట్ల వ్యయంతో విశాఖలో తలపెట్టిన 76.9 కి.మీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్లను మరిన్ని అందుబాటులోకి తేవడంపై పరిశీలన చేయాలని సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా మధ్య తరగతి ప్రజల కోసం ఉద్దేశించిన ఎంఐజీ లే అవుట్లను ప్రతి నియోజకవర్గంలో అన్ని వసతులతో ఆదర్శంగా రూపొందించాలన్నారు. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అన్ని పట్టణాల్లో గుంతలు లేని రహదారులు ఉండాలని నాడు – నేడు ద్వారా వాటిని తీర్చిదిద్ది వ్యత్యాసాన్ని ఫొటోల ద్వారా ప్రజలకు తెలియచేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తమ జీవన ప్రమాణాలతో టిడ్కో ఇళ్లు గత పాలకులు పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేశారని, కనీస మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, మురుగు శుద్ధి లాంటి సదుపాయాలు లేకుండా అస్తవ్యస్థంగా చేశారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీటి కోసం ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవి లేకపోతే ఆయా ప్రాంతాలు మురికివాడలుగా మారే అవకాశం ఉందన్నారు. పట్టణ పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే దిశగా టిడ్కో ఇళ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. జూన్ నాటికి 1.39 లక్షల యూనిట్లు పూర్తి చేసేలా రూ.1,685 కోట్లు సమకూరుస్తామన్నారు. వడివడిగా విశాఖ మెట్రో విశాఖపట్నంలో సమారు 76.9 కిలోమీటర్ల మేర తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీనిపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను అదేశించారు. దాదాపు రూ.14 వేల కోట్లతో నాలుగు కారిడార్లలో నిర్మించే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని, కోచ్‌ల డిజైన్‌తో పాటు మెట్రో స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు, వసతులతో నివేదిక సమగ్రంగా సమర్పించాలన్నారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణ హిత విధానాలకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రాజెక్టుకు అవసరమైన వనరుల సమీకరణపైనా అధికారులతో చర్చించారు. ప్రజలు కోరుకునేలా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పట్టణ ప్రాంత ప్రజలకు అనువుగా ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్‌ను మోడల్ మాదిరిగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. క్లియర్ టైటిల్ డీడ్‌తో పాటు న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించాలని, ప్రజలు కోరుకునే రీతిలో తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఈ లే అవుట్లు ఆదర్శంగా ఉండాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటిదాకా 82 అర్బన్ నియోజకవర్గాల్లో 6,791 ఎకరాలను గుర్తించామని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్లు పనులు పూర్తయ్యాయని, మరో 864.29 ఎకరాల్లో ఈ నెల చివరినాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. తాగునీరు, పారిశుధ్యంపై ట్రాకింగ్ సిస్టమ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పారిశుధ్యం మెరుగుపడేలా అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చెత్త వేసేందుకు అందచేసిన డస్ట్బిన్లలో ఏ రంగు డబ్బాలో ఎలాంటి చెత్త వేయాలో సూచిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంచాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించి ఎస్‌వోపీలు రూపొందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ట్రాకింగ్ సిస్టమ్ తేవాలని సూచించారు. చెత్త తొలగింపు ఎప్పటికప్పుడు జరుగుతోందా? లేదా?.. తాగునీటి సరఫరా సజావుగా జరుగుతోందా? అనే అంశాలను పరిశీలించాలన్నారు. తద్వారా ఏవైనా ఇబ్బందులుంటే గుర్తించి వెంటనే పరిష్కరించే వీలుంటుందన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేయగా మరో 8 లక్షల డబ్బాల పంపిణీని ఈనెల 22 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో 2,426 ఆటోలు సేవలు అందిస్తుండగా మరో 400 ఆటోలు ఈ నెలాఖరు నాటికి, 1,123 ఈ–ఆటోలు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. డిసెంబర్ నాటికి గార్బేజ్ ట్రాన్స్పర్ స్ట్రేషన్లు (జీటీఎస్) పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మరిన్ని మహిళా మార్ట్‌లపై పరిశీలన పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్లను మరిన్ని తేవడంపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ అదేశించారు. మార్ట్ల కోసం అనువైన ప్రాంతాల్లో భవనాలను గుర్తించి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని సూచించారు. కృష్ణా కరకట్ట విస్తరణ పనులు వేగవంతం విజయవాడలో కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని, ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపైనా దృష్టిపెట్టామన్నారు. రాయపూడి వద్ద నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కార్యదర్శి వి.రామ మనోహరరావు, కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూన్‌కి రోడ్ల మరమ్మతులు పూర్తి కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో రహదారులపై అధికారులు దృష్టి పెట్టాలని, అన్ని చోట్లా గుంతలు లేని రోడ్లు కనిపించాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు–నేడు ద్వారా బాగు చేసిన రోడ్ల పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. జూన్ నాటికి రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. -
మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్
సాక్షి, విశాఖపట్నం: అర్హులైన పేదలకు కేవలం ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్‌తో మే నెలాఖరు నాటికి 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టిడ్కో ఇళ్ల పనుల పురోగతిపై విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా అసత్యాల్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం హేయమన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తామని చెప్పి టెండర్ల దశలో 4,54,706కి కుదించి.. గ్రౌండింగ్ సమయానికి 3,13,832కు తగ్గించిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో 90 శాతం ఇళ్లు పూర్తయిపోయాయంటూ అబద్ధపు ప్రచారాలు చేశారనీ, తాము అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 1.22 లక్షల ఇళ్లు బేస్మెంట్, దానికంటే కింద స్థాయిలో ఉన్నాయనీ, 81 వేల ఇళ్లు 90 శాతం పూర్తయినా అందులో కేవలం 10 శాతం ఇళ్లకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో ఒక్క టిడ్కో ఇల్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు అందించారా అని ప్రశ్నించారు. డిమాండ్ లేని ప్రాంతాల్లో నిర్మించదలచిన 51,616 ఇళ్లని రద్దు చేశామని, మొత్తంగా 2,62,216 టిడ్కో ఇళ్లని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిసెంబర్ నాటికల్లా అన్ని ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమీక్షలో టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, టిడ్కో చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జూన్‌లో 1.34 లక్షల టిడ్కో ఇళ్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పురపాలక, పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎన్నికల సమయంలో హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం పది శాతం పనులు కూడా చేయలేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరుతో రూ.3,082 కోట్ల అప్పులు మిగిల్చిందన్నా రు. ఆ అప్పులను తీరుస్తూనే రూ.4, 287 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ పూర్తి సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. భారం పడినా మాట ప్రకారం.. సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల దాదాపు రూ.10 వేల కోట్లకుపైగా భారం పడుతున్నా మాట ప్రకా రం అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, డిసెంబర్ ఆఖరుకు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 30 వేల ఇళ్ల చొ ప్పున పూర్తి చేసి అందిస్తామన్నారు. వచ్చే నె లలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్లు్ల కేటాయిస్తామని మంత్రి తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ ముమ్మరం
-
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సాంకేతిక అడ్డంకులు
సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను విశాఖ జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఫిబ్రవరి 11న రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాపురం నుంచి రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టినా ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇక్కడ 4,800(నూరు శాతం) ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి అందుబాటులో ఉంచారు. అయితే ఇళ్లు నిర్మించిన స్థలాన్ని ప్రభుత్వం నుంచి మునిసిపాలిటీకి బదలాయించడం ఆలస్యమవడంతో ఇక్కడ ఐదు యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలిగారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్న రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు ఫేజ్–1లో 2,528 ఇళ్లు పూర్తిచేశారు. ఇక్కడ శనివారం నాటికి 401 యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని పెనుకులపాడు పెదగరువు వద్ద చేట్టిన 6,144 ఇళ్ల నిర్మాణంలో 70 శాతం యూనిట్లు పూర్తవగా.. 502 ఇళ్ల రిజిస్ట్రేషన్లను పూర్తిచేశారు. భీమవరం సమీపంలోని గునుపూడి మెంటేవారి తోటలో రెండు ఫేజుల్లో 8,352 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 75 శాతం దాకా నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై అధిక పని ఒత్తిడి కారణంగా 10 యూనిట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తయింది. దీంతో పాటు విజయనగరం జిల్లాలోనూ ఇదే తరహా ఒత్తిడి కారణంగా 21 యూనిట్లకు, శ్రీకాకుళం జిల్లాలో 22 యూనిట్లకు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. కాగా, మొత్తం నాలుగు జిల్లాల్లో ఐదు చోట్ల ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారానికి 961 యూనిట్లను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించారు. ప్రస్తుతం ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను సరిచేసి ఇతర జిల్లాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మార్చి నెలాఖరుకు 20 వేల యూనిట్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి అందించే లక్ష్యంతో అధికారులున్నారు. -
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ మరింత వేగవంతం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జగనన్న కాలనీల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందించింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సైతం సొంతింటి కలను నిజం చేస్తూ వివిధ కేటగిరీల్లో టిడ్కో ఇళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల క్రితం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి పట్టణ పేదల కలను నిజం చేస్తోంది. జి+3 విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 88 మునిసిపాలిటీల్లో 2,62,216 ఇళ్లను రూ.21,167.86 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లు, 365 చ.అడుగుల్లో 44,304 ఇళ్లు, 430 చ.అడుగుల్లో 74,312 ఇళ్లను కడుతోంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన యూనిట్లను లబ్ధిదారులకు అందించడంలో కీలకమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన మునిసిపాలిటీల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని ఒత్తిడికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు.. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 2,62,216 ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో మార్చి చివరినాటికి 20 వేల ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి హక్కులతో అందించాలన్న లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉంటాయని ఆ రోజుల్లో టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. అయితే, లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండడంతో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారంలో ఒకటి లేదా రెండు రోజులు, ఒత్తిడి తక్కువగా ఉండే చిన్న పట్టణాల్లోని కార్యాలయాల్లో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నారు. కాగా 2.62 లక్షల ఇళ్లను దాదాపు రూ.800 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తోంది. వేగవంతం చేయండి.. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లను అందజేయాలని ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సూచించారు. విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల టిడ్కో అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పరిధిలో 3,100 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. బ్యూటిఫికేషన్ కింద టిడ్కో ఇళ్ల సముదాయాల పరిసరాల్లో 35 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టీడీపీ నాయకులు చేసిన అవినీతిని సరిచేసి ఇస్తున్నాం: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు సరఫరా విషయంలో సాంకేతిక అంశాలు ఉంటాయి. దానిని పట్టుకొని టీడీపీ, బాబు అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. చెత్త పన్ను మీద రాద్ధాంతం తగదు. క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా పారిశుధ్యం చేపట్టాం. పేదల నుండి పన్ను వసూలు చేయడం లేదు. ఇళ్ల గురించి మేనిఫెస్టోలో ఏం చెప్పామో టీడీపీ నాయకులు చూసూకోవాలి. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతిని సరిచేసి ఇస్తున్నాం. పేదల ఇళ్ల విషయంలో అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు ఆడటం కరెక్ట్ కాదు. ఇళ్ల నిర్మాణంలో వైఎస్సార్ కాలం, టీడీపీ కాలం కంటే జగన్ ప్రభుత్వమే ఎక్కువ విస్తీర్ణం ఇస్తుంది. వాస్తవాలపై అచ్చెన్నాయుడు చర్చ చేయాలి. టిడ్కో పథకంలో ఒక్క ఇళ్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు ఇచ్చారా. ఎందుకు ఇవ్వలేదు. ఇళ్లనిర్మాణంలో కమిషన్ కోసమే నిర్మాణం చేసి వదిలేశారు. చదవండి: (హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం) టిడ్కో నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ చేసి ప్రభుత్వానికి నాలుగు వందల కోట్లు మిగిల్చాము. టిడ్కో ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కరెంట్, రోడ్లు, నీరు, మరుగుదొడ్లు వంటివి చంద్రబాబు నిర్మించకపోవడం వలన లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదార్లుకి అప్పగిస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
టిడ్కో ఇళ్లపై ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్లపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలు వండి వారుస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడి యా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడా రు. సమాచారం కావాలంటే, ప్రభుత్వ అధికారుల ను, మంత్రిగా తననైనా వివరణ అడిగి రాయాలన్న కనీస సంప్రదాయాన్ని పాటించకుండా ఇష్టం వచ్చి నట్లు అసత్యాలతో కూడిన వార్తలను రాయడం మంచి పద్ధతికాదన్నారు. పత్రిక యాజమాన్యం ఉ ద్దేశాలను, దురుద్దేశాలను టిడ్కో ఇళ్లపై రుద్ది అబ ద్ధపు వార్తలు రాయటం సరికాదని మండిపడ్డారు. బాబు హయాంలో లబ్ధిదారులతో భారం ఇక టిడ్కో ఇళ్లల్లో మూడు కేటగిరీలున్నాయని.. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్ల రుణాలను పూ ర్తిగా లబ్ధిదారులే చెల్లించాల్సి ఉండేదన్నారు. 20 ఏళ్లపాటు అసలు, వడ్డీతో సహా కట్టాల్సి వచ్చేదని. అప్పు తీరిన తర్వాతే ఆ ఇంటిపై వారికి సర్వ హ క్కులు వచ్చేవన్నారు. కా నీ, సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేర కు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఇళ్లకు ఒక్క రూపాయి కట్టించుకుని పేదలకు రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో ఇస్తున్నామన్నారు. ఇక టిడ్కో ఇళ్లు మొత్తం 2.62 లక్షలు ఉంటే.. వాటిల్లో 300 చద రపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 1.43 లక్షల ఇళ్లను ఉచితంగా ఇచ్చి, వారిని సొంత ఇంటిదారులను చేస్తున్నామన్నారు. వారికి, ఏ అప్పులేకుండా వెంట నే సర్వహక్కులతో ఇల్లు సొంతమవుతుందని, మిగి లిన రెండు కేటగిరీలకు సంబంధించిన గృహాలను లబ్ధిదారుని పేరిట ఇచ్చే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు. పథకం ఇంతా పక్కాగా, పేదలకు న్యాయం జరిగేలా అమలు చేస్తుంటే, లబ్ధిదారుల పేరిట రుణాలు అంటూ..ఆంధ్రజ్యోతి తప్పుడు సమాచారంతో రా తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లబ్ధిదారులను ఆందోళనకు గురిచేయవద్దని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి బొత్స హితవు పలికారు. -
టిడ్కో ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మేలు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తక్కువ ఆదాయ వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు సిద్ధమవడం.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే నిర్ణయమని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ చెప్పారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 2.62 లక్షలకు పైగా గృహాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రసన్నకుమార్ గురువారం మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల లబ్ధిదారులకు వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వమే భరించడం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమంటూ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణను సత్కరించారు. మంత్రిని కలిసినవారిలో టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ ఉన్నారు. సోమవారం నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్లు టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని, బ్యాంక్ లింకేజీ పూర్తయిన యూనిట్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తొలుత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి పేదలపై ఎలాంటి భారం లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేసి ఈ నెల చివరి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న 45 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని పూర్తిగా భరించి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 1.18 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వీటిలో జనవరి చివరి వారంలో 45 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. -
క్రిస్మస్ తర్వాత టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం ఉద్దేశించిన ఈ గృహాలను ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్ సెలవులు పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, సాధ్యమైనంత వేగంగా వాటిని లబ్ధిదారులకు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకారం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈసారి 1.18 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్, లాక్డౌన్ కారణంగా నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత పనులు చేపట్టి 75,784 యూనిట్లను పూర్తి చేశారు. వీటిని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందిస్తారు. క్రిస్మస్ సెలవుల తర్వాత నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ ఇళ్లకు డిసెంబర్ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని టిడ్కో ఎండీ తెలిపారు. కాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెనువెంటనే లబ్ధిదారులకు అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పూర్తయిన నిర్మాణాలకు బ్యాంకు లింకేజీ పూర్తిచేసి వెనువెంటనే రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని ఆదేశించారు. -
పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు: బొత్స
సాక్షి, నెల్లూరు: భగత్‌సింగ్ నగర్లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని.. పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ పాలనాదక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు. (చదవండి: ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు) గత ప్రభుత్వం మోసం చేసింది: మంత్రి అనిల్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు -
వల్లకాడే ఊరు.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు
నెల్లూరు(అర్బన్): అక్షరం ముక్క రాని అభాగ్యులు. దారిద్ర్యంలో అతి దరిద్రులు. నిత్యం శవాల కాలే చమురు వాసనలే వారికి సువాసనలు. మనిషి పుర్రెలతోనే పసిబిడ్డలు ఆటలాడుకుంటారు. సమాధులే వారికి పట్టు పరుపులు.. ఉండేందుకు జానెడు జాగా లేక వల్లకాడు(శ్మశానం)లోనే దశాబ్ధాల తరబడి కాపురాలు ఉంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు. విక్రమసింహపురిగా ఖ్యాతి గాంచిన నెల్లూరు బోడిగాడితోట శ్మశానంలో కాపురాలుంటున్న నిరుపేదల దయనీయ స్థితి. నెల్లూరు పెన్నానది ఒడ్డున విశాలమైన బోడిగాడితోట హిందువుల అతిపెద్ద శ్మశాన వాటిక. సుమారు 8 లక్షల జనాభ ఉండే నగరంలో మనిషి మరణిస్తే ఎక్కువ భాగం బోడిగాడితోటలోనే ఖననం చేస్తారు. ఆ శ్మశాన వాటికను ఆనుకుని ఒక వైపు పెద్ద, పెద్ద భవంతులున్నాయి. ఎంతో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయి. శ్రీమంతులున్నారు. మరో వైపు నివాస స్థలం లేకపోవడంతో శ్మశానంలో సమాధులనే ఇళ్లుగా చేసుకుని పట్టలు కట్టుకుని, పూరి కప్పు వేసుకుని నివసించే వందలాది కుటుంబాలున్నాయి. వీరి బాధలు చూసిన వారి మనస్సు చివుక్కు మనిపించక మానదు. జానెడు పొట్ట నింపుకునేందుకు ఇన్ని బాధలా.. ఇంత దుర్భరమైన బతుకా అని మనస్సు కలత చెందడం ఖాయం. (చదవండి: బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం) బతుకు దుర్భరం ఈ శ్మశానంలో సుమారు 500 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. చిన్న పూరింట్లోనే నలుగురైదుగురు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న వీరు వారి తాత, ముత్తాతల కాలంలో ఇక్కడికి వలస వచ్చారు. అందరూ తమిళం మాట్లాడుతారు. వీరిలో ఎక్కువ భాగం చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకోవడం వాటిని అమ్ముకోవడం ద్వారానే బతుకు బండి లాగిస్తున్నారు. మరికొంతమంది మంది మహిళలు వీధి, వీధి తిరుగుతూ చిక్కు వెంట్రుకలు సేకరించి వాటిని అమ్మడం చేస్తారు. ఇంకొంతమంది ఇళ్లలో పాచి పని చేసి బతుకీడిస్తున్నారు. వచ్చే అరకొర సంపాదనతో ఏపూటకాపూట బతుకుతున్నారు. (చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!) ఇది చాలదన్నట్టు చదువు సంధ్య లేని వారు కావడంతో మద్యం లాంటి అలవాట్లతో ఎదుగూ బొదుగూ లేకుండా జీవిస్తున్నారు. వర్షం వస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఒక వైపు తడుస్తూ.. మరో వైపు పనులు లేక పస్తులతో గడుపుతుంటారు. జబ్బు చేస్తే దవాఖానాకు పోయేందుకు పైసలు లేక అల్లాడి పోతుంటారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు అవుతున్నా వారికి చీకటి బతుకుల్లో వెలుగు రావడం లేదు. (చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం) తమ ఓట్లు పొందుతున్న నాయకులు తమకు పక్కా ఇళ్లు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధలు స్వయంగా పరిశీలించిన నెల్లూరు సిటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారికి టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి ప్రభుత్వం ద్వారా హౌసింగ్‌బోర్డు కాలని వద్ద టిడ్కో ఇళ్లు కట్టించి ఇవ్వడంతో కొంతమంది ఆ ఇళ్లలోకి కాపురం మార్చారు. త్వరగా పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి: శాంతి, స్థానికురాలు మాతాత, ముత్తాతల నుంచి తాము ఇక్కడే నివాసం ఉంటున్నాం. మా బిడ్డలకు కూడా పెళ్లిళ్లు చేశాం. ఘోరిల మధ్యనే ఉంటున్నాం. కడుబీదరికంలో బతుకుతున్నాం. ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించింది. వారు వెళ్లారు. మిగతా వారికి కూడా ఇళ్లు కట్టిస్తామంటున్నారు. త్వరగా ఇళ్లు కట్టించి ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తాం. చదవండి: విధి ఆట.. గెలుపు బాట -
టిడ్కో గృహాల పంపిణీలో అలసత్వం వద్దు
సాక్షి, అమరావతి: టిడ్కో గృహాల లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు విషయంలో అలసత్వం వహించొద్దని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తులకు, మంజూరైన రుణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా రుణాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టిడ్కో చైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఉన్నతాధికారులతో పాటు జిల్లాల్లోని బ్యాంకుల సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
లోకేశ్‌వి అవగాహన లేని మాటలు
సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్ల గురించి, బీసీ వర్గాలకు ప్రభుత్వం అందించే పథకాల గురించి లోకేశ్ అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వారు ఏం చేశారు, ఎలా చేశారు, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సర్కారు ఏమేమి ఇస్తుందన్న విషయం పోల్చిచెబితే బాగుండేదన్నారు. చేయూత, నేతన్న నేస్తం వంటి ఎన్నో పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. వారి జీవన విధానం మారడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు. వారి ఆర్థిక, జీవనస్థితి మారేలా కృషిచేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. చదవండి: తుపాను ముందు.. ప్రశాంతత! రాజధాని కేసుపై రోజువారీ విచారణ అన్నప్పుడు పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకే తాము పనిచేస్తామన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలతోనే వెళతామని చెప్పారు. జగనన్నకాలనీల నిర్మాణం, టిడ్కో ఇళ్ల కేటాయింపులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారని, పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. దేశంలోని అన్ని నగరాల్లో స్వచ్ఛ్ భారత్ కింద వ్యర్థాల మేనేజ్మెంట్లో సర్వే చేశారన్నారు. కేంద్రం తొమ్మిది నగరాలను గుర్తిస్తే మన రాష్ట్రం నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని చెప్పారు. అన్ని పట్టణాలను ఇలాగే తయారు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లను రేపటి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఆరునెలల్లో 80 వేలు, మరో ఆరునెలల్లో ఇంకో 80 వేలు, మిగిలినవి తర్వాత ఆరునెలల్లో ఇస్తామని స్పష్టం చేశారు. చదవండి: 'అగ్రిగోల్డ్' అసలు దొంగ చంద్రబాబే -
వచ్చేనెలలో టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చేనెలలో లబ్ధిదారులకు అందచేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇంటి వసతి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించి పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన పనుల పురోగతి, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాలపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చే పక్షం రోజుల్లో (శ్రావణ మాసంలో) లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు/ఫ్లాట్లను పూర్తి ఉచితంగా అందచేయనున్నామన్నారు. మిగిలిన అన్ని కాలనీల్లో నిర్మాణ పనులతో పాటు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. అగ్రిమెంటు కుదుర్చుకున్న ఈ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా అధికారులు, బ్యాంకుల అధికారులు సమన్వయంతో చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై ప్రతి వారం టిడ్కో, మెప్మా అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని ఆయన నిర్దేశించారు. -
త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స
అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. -
ప్రగతిపథంలో 'పురం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో నగర, పట్టణ ప్రాంతాలు అభివృద్ధిపథంలో నడుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నగరపాలక సంస్థతోపాటు పట్టణాల్లో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుమారు 60 వేలమందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు ఇవ్వనున్నారు. ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 29 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవికాకుండా 6,480 టిడ్కో ఇళ్లను త్వరలో ఇవ్వనున్నారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ది, సంక్షేమం వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. చాలాచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు లేక విపక్షాలు నిరాశలో ఉన్నాయి. నరసాపురంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చీకటిపొత్తులకు తెరతీస్తున్నాయి. నరసాపురంలో.. 14వ ఆర్థికసంఘం నిధులు, జనరల్ ఫండ్స్ నుంచి మొత్తం రూ.13 కోట్లతో 31 వార్డుల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. రూ.8 కోట్లతో చేపట్టనున్న రహదారులు, మంచినీటి పైప్లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.28 కోట్లు వెచ్చించి 50 పడకల ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచుతున్నారు. దీన్లో రూ.13 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయి. రూ.3 కోట్లతో బస్టాండ్ ఆధునికీకరణకు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.400 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి డీపీఆర్ రూపొందించారు. స్థల సేకరణకు ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరు చేసింది. నిడదవోలులో.. 2,705 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుండగా, 1,248 మందికి టిడ్కో గృహాలు కేటాయించనున్నారు. నాడు–నేడు కింద 8 పాఠశాలల్లో రూ.2.08 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.6.24 కోట్లతో 55 సీసీ రోడ్లు, డ్రైయిన్ల పనులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.97.06 లక్షలతో 8 పనులు చేపట్టారు. పురపాలకసంఘం సాధారణ నిధులు రూ.3.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు పనులు జరుగుతుండగా, పట్టణంలో నూతన జగనన్న కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.89.58 లక్షలు మంజూరయ్యాయి. జంగారెడ్డిగూడెంలో.. ఇప్పటివరకు రూ.6 కోట్లతో సీసీరోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తికాగా మరో రూ.3 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి 14వ ఆర్థికసంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వెచ్చించారు. పట్టణంలో 2,266 మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. 588 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. 231 ఇళ్లను త్వరలో పంపిణీ చేయనున్నారు. కొవ్వూరులో.. నాడు–నేడు పథకం కింద రూ.40 లక్షలు వెచ్చించి పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. రూ.2 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. రూ.4 కోట్లతో శ్రీనివాసపురం అవుట్‌ఫాల్ డ్రెయిన్ పనులు జరుగుతున్నాయి. గోదావరి నీటిని శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రపంచబ్యాంకు నిధులు రూ.53 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 15వ ఆర్థికసంఘం నిధులు రూ.1.78 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.45 లక్షలు వచ్చాయి. రూ.వందల కోట్లతో పనులు ఏలూరు నగరంలో రూ.200 కోట్లతో సుమారు 573 ఎకరాల స్థలం సేకరించి 29 వేలమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.44 కోట్లతో 142 అభివృద్ధి పనులు, 15వ ఆర్థికసంఘం నిధులు రూ.22 కోట్లతో 20 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.8 కోట్లతో నగరంలోని 14 పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. రూ.59.80 కోట్లతో 281 సీసీ రోడ్లు, రూ.52.75 కోట్లతో 188 సీసీ డ్రైన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరంలో నిర్మించే వైద్యకళాశాల కోసం 54 ఎకరాల స్థలాన్ని సేకరించారు. నగరపాలక సంస్థలో మొత్తం 2,47,631 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 1,27,890 మంది, పురుషులు 1,19,741 మంది. -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. చదవండి: ఎన్నికల ఘట్టం.. వైఎస్ కుటుంబానికే పట్టం.. -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. -
69 పట్టణాల్లో 54,056 ఇళ్లు
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టులు ఖరారు చేసిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) వేగవంతం చేసింది. 69 పట్టణాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో చేపట్టిన 54,056 ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో అత్యధిక రేట్లకు ఖరారు చేసిన యూనిట్లకు ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తిచేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం 12 దశల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.392.23 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. వీటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.3,239.39 కోట్లకు టెండర్లు కట్టబెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.2,847.16 కోట్లకు టెండర్లు ఖరారు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీకి) రూ.1,815 వ్యయంగా నిర్ణయించగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1,593కే ఖాయం చేసింది. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టుల్లో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు కూడా సమకూర్చనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ 54,056 ఇళ్ల నిర్మాణ పనుల్ని నాలుగు కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఇళ్లను మూడుదశల్లో ఏడాదిన్నరలో పూర్తిచేయాలని ఇటీవల కాంట్రాక్టు సంస్థల వారితో సమావేశమైన టిడ్కో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. టిడ్కో క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇళ్ల నిర్మాణ నాణ్యతను తరచు పరీక్షిస్తున్నారు. (చదవండి: స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..) టిడ్కో నిర్మించే ఇళ్లలో మూడు రకాలు టిడ్కో నిర్మిస్తున్న 54,056 ఇళ్లల్లో మూడు రకాలున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల వంతున ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. 300 ఎస్ఎఫ్టీ ఇళ్లు 47,832 ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్టుగా ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందిస్తారు. 365 ఎస్ఎఫ్టీ ఇళ్లు 288 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు వాటా రూ.50 వేలు భరిస్తే మిగిలినది బ్యాంకు లోన్‌గా నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.50 వేలలో సగం అంటే రూ.25 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.25 వేలు చెల్లిస్తే చాలు. ప్రభుత్వం రూ.25 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. 430 ఎస్ఎఫ్టీ ఇళ్లు 5,936 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారు వాటా రూ.లక్ష చెల్లించాలని, మిగిలినది బ్యాంకు లోన్ అని నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.లక్షలో సగం అంటే రూ.50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.50 వేలు భరిస్తే చాలు. ప్రభుత్వం రూ.50 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. ఆ విధంగా ఖరారు చేసిన 54,056 ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశించాం. - శ్రీధర్, టిడ్కో ఎండీ -
ఊరూరా ఇంటి పట్టాల జాతర
సాక్షి నెట్వర్క్: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం 27వ రోజైన బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటంతో అక్కచెల్లెమ్మల ఆనందం అవధులు దాటుతోంది. ఎక్కడికక్కడ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో కలిసి వస్తుండటంతో అక్కడ కోలాహలం జాతరను తలపిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల వద్ద ఎవరికి వారు సెల్ఫీలు దిగుతుండగా.. కొందరైతే పట్టాలు అందుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,818 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 1,03,026 మంది ఇళ్ల పట్టాలు పొందారు. చిత్తూరు జిల్లాలో 58,122 మందికి పట్టాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 2,396 మంది ఇళ్ల స్థలాలు, 1,077 మంది టిడ్కో ఇళ్ల పత్రాలు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 4,973 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం 70,949 మందికి లబ్ధి కలిగింది. మరో 4,252 మందికి టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఒంగోలు మండలం కరవదిలో జగనన్న కాలనీ వద్ద ముగ్గు వేస్తున్న గ్రామస్తులు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో బుధవారం 651 మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. పశి్చమగోదావరి జిల్లాలో 662 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 318 మందికి పట్టాల పంపిణీ చేయగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బుధవారం 2,263 మంది పట్టాలు అందుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85,689 మందికి లబ్ధి చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,187 ఇళ్ల పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 62 వేల మందికి పైగా లబ్ధి పొందారు. -
కొనసాగుతున్న కోలాహలం
సాక్షి నెట్వర్క్: ‘వదినా.. నీ స్థలం ఎక్కడొచ్చింది. రాఘవత్తా.. నీకు ప్లాటెక్కడిచ్చారు. పోనీలే భార్గవీ ఇన్నాళ్లకు నీకు ఇల్లొచ్చింది. నీ కల నెరవేరింది. ఇక నీ దిగులు పోయినట్టే..’ ఊరూరా ఎక్కడ చూసినా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 17వ రోజైన ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కోలాహలంగా సాగింది. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 80,985 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, 15 వేల మందికి టిడ్కో ఇంటి పత్రాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 72 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,02,225 మంది పట్టాలు పొందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 7,239 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో హక్కు పత్రాలు అందజేశారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 1,751 టిడ్కో ఇళ్ల పత్రాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 17వ రోజున 917 మందికి పట్టాలిచ్చారు. వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 669 మంది పట్టాలు అందుకోగా.. ఇప్పటివరకు 2,41,400 మంది లబ్ధి పొందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2,506 ఇళ్ల పట్టాలను అందించారు. 17 రోజుల్లో 60,101 మంది పట్టాలు అందుకున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం 250 మందికి ఇళ్లపట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో 77,676 మంది లబ్ధి పొందారు. నేడు విరామం అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో ఏడాది సొమ్ము జమ చేయనున్న దృష్ట్యా సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. అధికారులంతా అమ్మఒడి కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో పట్టా అందుకుంటున్న మహిళ పేరు సజ్జల హేమలత. అనంతపురంలోని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్. ఈమె టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా.. అర్హులందరికీ పథకాలను వర్తింప చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఆదివారం అనంతపురం సమీపంలోని కురుకుంట లే–అవుట్లో సజ్జల హేమలతకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పట్టా అందజేశారు. పార్టీలు చూడకుండా, పూర్తి పారదర్శకతతో టీడీపీ నేతకూ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వ తీరును అంతా ప్రశంసించారు. -
ఉత్సాహంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు’ పథకం కింద 15వ రోజు శుక్రవారం కూడా వీటి పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఆయా లే అవుట్ల వద్ద వేలాదిమంది ప్రజలతో కోలాహలం నెలకొంది. స్థలం వచ్చినవాళ్లు, ఇళ్లు మంజూరైనవాళ్లు, టిడ్కో ఇళ్లు వచ్చినవాళ్లు పట్టాలు, పత్రాలు తీసుకుని ఉత్సాహంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 41,913 మందికి పట్టాలు, పత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో 16,475 మందికి పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 7,630 ఇళ్లపట్టాలను పేదలకు అందజేశారు. మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు రక్షణనిధి, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 4,246 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 3,639 మందికి పట్టాలు అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,383 మందికి ఇంటి స్థలం పట్టాలు, 469 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,900 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,805 మందికి పట్టాలిచ్చారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 2,133 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 1,236 పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, డాక్టర్ జె.సుధాకర్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 956 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. -
స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..
సాక్షి నెట్వర్క్: బెలూన్లు ఎగురవేసేవారు.. మిఠాయిలు పంచేవారు.. పరస్పరం అభినందించుకునేవారు.. పట్టాలను పైకి చూపిస్తూ చేతులు జోడించేవారు.. జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నవారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తున్నవారు.. వైఎస్సార్ జగనన్ననగర్ పేరుతో వేసిన ముగ్గులు.. ఎటు చూసినా కోలాహలమే. పండుగ వాతావరణమే. కొత్తబట్టలు ధరించి సంబరంగా స్థలాలు చూసుకుంటూ ‘ఈ స్థలం మాది..’ అనుకుంటూ భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లతో కనిపించినవారు లెక్కలేనంతమంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం 12వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ జరిగిన గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అందరూ తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరెవరికి స్థలాలు వచ్చాయి, ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అంటూ చర్చించుకోవడం కనిపించింది. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా కనిపించారు. కొందరు తమ స్థలాల్లో శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 43,937 స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 39,203 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, గుడివాడ అమర్నాథ్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, యూవీ రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 35,124 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 22,968 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీతా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 11,743 మందికి, కర్నూలు జిల్లాలో 8,831 మందికి పట్టాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,649 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 7,881 పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 7,787 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4,762 స్థలపట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 4,417 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3,776, శ్రీకాకుళం జిల్లాలో 3,357 మందికి పట్టాలు, ఇళ్ల పత్రాలు అందజేశారు. సీఎంకు రుణపడి ఉంటాను నేను దివ్యాంగుడిని. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్నమ్మ ఇంట్లో ఉంటున్నా. సొంతిల్లు లేదు. తల్లిదండ్రులు ఉన్న సమయంలోనూ అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. గతంలో పలుసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ మా ఇంటికి వచ్చి స్థలం కోసం దరఖాస్తు చేయించాడు. ప్రస్తుతం ఇంటి పట్టా మంజూరు అయ్యింది. ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరుతోంది. జగనన్నకు రుణపడి ఉంటాను. – మహేశ్వరరెడ్డి, తుమ్మలపెంట, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా ఐదేళ్ల కల తీరింది మా ఇద్దరిదీ నక్కలదిన్నె గ్రామమే. ఐదేళ్ల కిందట పెళ్లయింది. మేం ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా మంజూరైంది. ఐదేళ్ల సొంతింటి కల నెరవేరుతోంది. స్థలం, ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – చిరంజీవి, నవీన దంపతులు, నక్కలదిన్నె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
‘చంద్రబాబు ఇప్పటికే రాజకీయ సమాధి అయ్యారు’
సాక్షి, పశ్చిమగోదావరి : అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అని చెప్పి టిడ్కో గృహాల ద్వారా అడుగుకి ధర పెట్టీ పేద ప్రజల డబ్బులను స్వాహా చేశారన్నారు. ఆరు నెలల్లో సగం పూర్తయిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి జిల్లాలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలు విని అధికారంలోకి వచ్చాక నవరత్నాలు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చదవండి: దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేశామన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్‌ను చంద్ర బాబు, లోకేష్ బురద చల్లడం సిగ్గు చేటన్నారు.. తండ్రికి తగ్గ తనయుడులా సీఎం జగన్ అభివృద్ది పథంలో దూసుకుపోతున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఇప్పటికే రాజకీయంగా సమాధి అయ్యారని, చంద్రబాబు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. -
పండుగలా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం తొలిరోజు కూడా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 8వ రోజైన శుక్రవారం 950 పట్టాలను పంపిణీ చేశారు. నందివాడ మండలం జనార్ధనపురంలో మంత్రి కొడాలి నాని పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి ఇళ్లకు భూమిపూజ చేశారు. కైకలూరు మండలంలో 586 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ► గుంటూరు జిల్లాలో శుక్రవారం 329 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 86,879 మందికి పట్టాలు అందజేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఎమ్మెల్యే విడదల రజిని, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ మండలం ఇప్పటంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మొత్తం 785 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 59,962 మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లయింది. ► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 7,169 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70,553 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లాలో మొత్తం 1,271 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు శుక్రవారం పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో 1,021 మందికి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగులలో 150 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ► విజయనగరం జిల్లాలో శుక్రవారం 1,043 ఇళ్ల పట్టాలు, 500 టిడ్కో ఇళ్లు, 236 పీసీ/ఈఆర్ పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శుక్రవారం 32 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల్ని పంపిణీ చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో మొత్తం 32,592 మంది పేదలు పట్టాలు అందుకున్నారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,371 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం 35 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులో మంత్రి శంకరనారాయణ 95 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ► కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఆదోని మండల పరిధిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు మండలం పంచలింగాలలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. -
తండ్రి ప్రాణం నిలబెడితే.. కొడుకు నీడనిచ్చాడు
సాక్షి, మంగళగిరి: ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి నా భర్తకు ప్రాణం పోస్తే నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చి నీడ కల్పించార’ని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. పట్టణంలోని పీఎంఏవై వైఎస్సార్ జగనన్న నగర్లో మంగళవారం టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్లు అందజేశారు. అపార్ట్మెంట్లోని బీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో వృద్ధ దంపతులు అన్నం మంగమ్మ, వెంకటేశ్వరరావుల వద్దకు ఆయన వచ్చినప్పుడు వారు కన్నీరు పెట్టుకున్నారు. 2008లో తనకు గుండెపోటు రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3 లక్షల విలువయ్యే గుండె ఆపరేషన్‌ను కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా చేయించి, ప్రాణం నిలబెట్టారని చెప్పారు. నేడు రూ.20 లక్షల విలువయ్యే ఇంటిని ఆ మహానుభావుడి కుమారుడు, సీఎం వైఎస్ జగన్ ఒక్క రూపాయికే ఇచ్చి నీడ కల్పించారని ఆనందభాష్పాలతో చెప్పారు. మగ్గం నేస్తూ వచ్చిన ఆదాయం కుటుంబ పోషణ, అద్దెలకు అంతంత మాత్రంగానే సరిపోయేదన్నారు. వైఎస్సార్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చదవండి: (దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు) ఇంటి పట్టా అందుకున్న కంఠమనేని శ్రీనివాసరావు చంద్రబాబు వద్ద ఎన్నోసార్లు మొత్తుకున్నాం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలువూరులో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో పట్టాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ఒకసారి పేదలందరం కలిసి ఇళ్లు వేసినా, వాటిని కూల్చివేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నా. ఇలాంటి సంక్షేమ పథకాలను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయం. – కంఠమనేని శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ కార్యకర్త, చిలువూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
మధ్యంతర ఉత్తర్వులకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించారని, పాత జాబితా ప్రకారమే కేటాయింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఇళ్ల కేటాయింపులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనకాపల్లికి చెందిన దొడ్డి వీఎస్ జగదీశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై ధర్మాసనం విచారణ జరిపింది.(చదవండి: టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పక్కాగా వ్యవహరించాలి) ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. 904 మందిని తొలగించడానికి గల కారణాలను కోర్టుకు తెలిపారు. గతంలో పలువురు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు పొందారని, మరికొందరు అసలు టిడ్కో ఇళ్లు పొందేందుకు ఏ మాత్రం అర్హులు కారని, ఇలా పలు కారణాలతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. -
రాష్ట్రంలో గృహశోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి’ అని చెప్పారు. ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాను ► ‘‘అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చాను. 18 నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,352 కోట్లు వారి చేతిలో పెట్టాం. విద్యా దీవెన పథకం ద్వారా 18.52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4 వేల కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద 15.56 లక్షల తల్లులకు రూ.1,221 కోట్లు ఇచ్చాం. ► ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు తొలి ఏడాదిలో 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు ఇచ్చాం. చేయూతలో వారి చేయి పట్టుకుని నడిపిస్తూ 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు చేతికి అందించాం. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకంలో 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం పథకంలో 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.492 కోట్లు ఇచ్చాం. ఆ కష్టాలు స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో సొంతిల్లు లేని వారి కష్టాలు స్వయంగా చూశాను. 25 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. కానీ ఇవాళ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తున్నాం. మొత్తంగా 1.24 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ► ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టిస్తాం. ఊళ్లు రాబోతున్నాయి ► 17 వేల రెవెన్యూ గ్రామాల్లో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి, గతంలోలా 224 చదరపు అడుగుల్లో కాకుండా, 340 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టిస్తున్నామంటే అవి కాలనీలు కావు.. ఊళ్లు రాబోతున్నాయి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల్లో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు. అంత ఆస్తిని 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్ ఉంటాయి. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం.. టిడ్కో ఇళ్లు ► తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది మొదలు పెడతాం. ఇవి కాక 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒకే ఒక్కరు చంద్రబాబు స్కీమ్ కోరారు. ► 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. మొత్తంగా టిడ్కో ఇళ్లకు ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.4,287 కోట్ల భారం పడుతున్నా చిరునవ్వుతో భరిస్తున్నాం. ఎందరికో ఉపాధి.. ఆర్థిక పురోగతి ► ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఆటో వాళ్లు.. ఇలా 30 రకాల వృత్తుల వారు లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ► తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది’’ సీఎం జగన్ అన్నారు. ► అనంతరం లబ్ధిదారులు పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు సీఎం ఇంటి పట్టాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, ఊరందూరు లేఅవుట్లోని మోడల్ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మదుసూధనరెడ్డి, భూమన, రోజా, చెవిరెడ్డి, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకూడదా? ► అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైతే, డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (కులపరమైన అసమతుల్యం) వస్తుందని చంద్రబాబు మనుషులు కొందరు కొన్ని చోట్ల కోర్టుకు వెళితే, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 3.74 లక్షల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ► విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం తెలుపలేదు. వాటితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వాటిపై స్టే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఆవ భూములు అని చెప్పి స్టే తెచ్చారు. దాని వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అవరోధం ఏర్పడింది. ► నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు దుర్మార్గులు, రాక్షసులు. అవి ఏపీఐఐసీ భూములని, మైనింగ్ భూములంటూ కోర్టుకు పోయారు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ మేరకు ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. వీళ్లందరికీ దేవుడు మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలో మిగిలిపోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అన్నా మీరు విన్నారు.. ఆదుకున్నారు అన్నా.. నా పేరు పుష్ప. మా ఆయన తిరుమల్‌రావు కూలీ పని చేస్తాడు. మాకిద్దరు చిన్న పిల్లలు. మాకు సొంతిల్లు లేదు. దీంతో నా బిడ్డ పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. నాకు అన్నదమ్ములు లేరు. ఈ పరిస్థితిలో సొంత అన్నలా ఆదుకుంటూ మీరు నాకు ఇంటి పట్టా ఇస్తున్నారు. మీ వల్ల నాలాగే రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. మీ పాదయాత్రలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటూ నవరత్నాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వైఎస్సార్ ఆసరా, చేయూత ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షల మందికి పైగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించడం లేదు. పైగా మా (మహిళలు) పేరుతోనే ఇస్తున్నారు. – పుష్ప, ఏర్పేడు, చిత్తూరు మాకు అడ్రస్ ఇచ్చారన్నా.. నా పేరు జ్యోతి. మాకు ఇద్దరు పిల్లలు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు ‘నేను ఉన్నాను చెల్లెమ్మా’ అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. అన్నా.. మేము చెరువు కట్టపై ఉంటున్నాం. వానకు, ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నాళ్లూ ఎవరూ ఏమీ చేయలేదు. నా ఊరు ఇది అని చెప్పుకునేందుకు అడ్రస్ లేని వాళ్లం. అటువంటి సమయంలో మీరు మాకు అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరుపేరు ‘జే సిటీ’. నా ఇంటి నంబర్ 305. (భావోద్వేగానికి లోనవుతూ) నాలాగే ఆ కట్టపై ఉన్న మరో 25 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కట్టిస్తున్నారు. ‘నీకేమి మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు. మీ అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది’ అని మా ఆయన మా బిడ్డతో అంటున్నాడు. మీ వల్లే నాకు ఈ గౌరవం. పండుగ అంటే ఇదే అన్నా. – జ్యోతి, అమ్మపాలెం చెరువు కట్ట అన్ని పథకాల్లో అక్కచెల్లెమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్చు జమ చేశాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నాం. ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్లలో, రాజకీయ నియామకాల్లో 50 శాతం వారికే చెందాలని చట్టాలు చేశాం. ఇది మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. అని గర్వంగా చెబుతున్నాను. సీఎం వైఎస్ జగన్ -
‘ఇళ్ల పట్టా’భిషేకం
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ యోగం కల్పించే బృహత్తర యజ్ఞానికి సమయం ఆసన్నమైంది. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ భూమి పూజలను పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారు. 26 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పట్టాల పంపిణీ చేయడంతోపాటు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అత్యంత పారదర్శకంగా, ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగని విధంగా ఇప్పటికే టిడ్కో ఇళ్లతో కలిపి 30.75 లక్షల మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. ఎంపికైన వారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించారు. జాబితాలో పేరు లేని అర్హులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించి, అలా వచ్చిన అర్జీలను కూడా పరిశీలించి అర్హులైతే లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. లబ్ధిదారుల ఎంపిక ఇంత పకడ్బందీగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించిన తర్వాత కూడా సోషల్ ఆడిట్ నిర్వహించారు. అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉదాత్త ఆశయంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల విలువైన 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించింది. భూమిని చదును చేసి వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో 17,004 కాలనీల్లో లేఅవుట్లు సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖకు క్రిస్మస్ సెలవు రద్దు ఈ నెల 25న క్రిస్మస్/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సెలవుగా ప్రకటించినప్పటికీ, టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలన్నీ మామూలుగా పని చేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. పొజిషన్ సర్టిఫికెట్లు కూడా.. ► 25వ తేదీ ఒక్కరోజే 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేసింది. వీరందరికీ ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇంటిని అప్పగిస్తారు. అదేవిధంగా 365 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు తన వాటాగా రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికైతే రూ.లక్ష చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అందులో సగం (365 చ.అ ఇంటికి రూ.25 వేలు, 430 చ.అ ఇంటికి రూ.50 వేలు) చెల్లిస్తే చాలని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. మొత్తంగా టిక్కో ఇళ్లకు ప్రభుత్వంపై రూ.7,251.80 కోట్ల భారం పడుతోంది. ► ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని క్రమబద్ధీకరణ అర్హత పొందిన వారికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇళ్లపట్టాలతోపాటు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి లబ్ధిదారుకు స్థలం పట్టా/టిడ్కో ఇంటి రిజిస్ట్రేషన్ పత్రంతోపాటు సీఎం జగన్మోహన్రెడ్డి సంతకంతో కూడిన లేఖను అందజేస్తారు. కొమరగిరిలో చకచకా ఏర్పాట్లు ► తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో వైఎస్సార్ జగనన్న కాలనీ మోడల్ కాలనీగా రూపుదిద్దుకోనుంది. ఇక్కడి నుంచే ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. వేదిక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మోడల్ హౌస్, పైలాన్ ఏర్పాటు చేశారు. ► కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీ కోసం మొత్తం 367.58 ఎకరాలు సేకరించారు. ఇందులో 60 ఎకరాలను సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలు, పార్కులు, ఆట స్థలం కోసం కేటాయించారు. ► కాకినాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 16,500 మంది లబ్ధిదారులకు ఇక్కడ ప్లాట్లు ఇవ్వనున్నారు. మొదటి దశలో ఇక్కడ 12,500 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కాలనీ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో, అంతర్గత రోడ్లు 20 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు. -
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పక్కాగా వ్యవహరించాలి
సాక్షి, విశాఖపట్నం: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న టిడ్కో రిజిస్ట్రేషన్ల విషయంలో పక్కాగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లను పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టిడ్కో ద్వారా మంజూరైన గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం జారీచేసిన నూతన నియమావళిని అనుసరించి మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 25న కాకినాడలో, 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారని చెప్పారు. మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావు, సీడీఎంఏ విజయ్‌కమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో ఇళ్ల పండుగకు అంతా రెడీ
సాక్షి, అమరావతి: ‘అందరికీ ఇళ్ల పథకం’ కింద ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) సన్నద్ధమవుతోంది. ఈ పథకం కింద 300 ఎస్ఎఫ్టీ ఉన్న టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే అందివ్వనుంది. టీడీపీ ప్రభుత్వంలో పునాదుల దశ కూడా దాటని టిడ్కో యూనిట్ల స్థానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయనుంది. రూ.9,995 కోట్ల టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ ► వీటికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం 300 ఎస్ఎఫ్టీ టిడ్కో యూనిట్లను లబ్ధిదారులకు ఈ నెల 25న సేల్ అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ► దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 88 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,43,600 మంది లబ్ధిపొందనున్నారు. ► జి+3 నమూనాలో నిర్మించిన ఆ టిడ్కో ఇళ్ల మొత్తం విలువ రూ.9,995 కోట్లు. భూమి, మౌలిక సదుపాయాలతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ.6.65లక్షలు. వారికి పట్టాలు.. ఉచితంగా ఇళ్లు ► గతంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పనులను ఆర్భాటంగా ప్రారంభించి తరువాత వదిలేసింది. దాంతో పునాదుల దశలోనే 51 వేల యూనిట్లు నిలిచిపోయాయి. ► ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దుచేసింది. ► వాటి స్థానంలో ఆ లబ్ధిదారులకు ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ► ఈ నెల 25 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారు. ► ఆ స్థలాల్లో ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. ► 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ యూనిట్లకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ► గత టీడీపీ ప్రభుత్వంలో 365 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు రూ.50వేలు లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉండేది. అందులో రూ.25వేలు తమ ప్రభుత్వం భర్తిస్తుందని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. రూ.7.55 లక్షల విలువ చేసే 365 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను సమకూరుస్తుంది. దీనివల్ల 44,304 మంది లబ్ధి పొందనున్నారు. ► అదే విధంగా.. 430 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుని వాటా రూ.లక్ష ఉండేది. అందులో రూ.50వేలు తమ ప్రభుత్వం భరిస్తుందని జగన్ ప్రకటించారు. రూ.8.55 లక్షలు విలువ చేసే 430 యూనిట్‌కు మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం సమకూరుస్తారు. దీనివల్ల 74,312మందికి ప్రయోజనం కలగనుంది. ► పై రెండు కేటగిరీల లబ్ధిదారులకు కూడా ఈనెల 25 నుంచి సేల్ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. పక్కాగా ఏర్పాట్లు 300 ఎస్ఎఫ్టీ లోపు టిడ్కో యూనిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పునాదుల దశ దాటకపోవడంతో రద్దుచేసిన 51వేల టిడ్కో ఇళ్ల స్థానంలో ఆ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం. అనంతరం ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. – శ్రీధర్, ఎండీ, ఏపీ టిడ్కో -
ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు
సాక్షి, అమరావతి: ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. మూడేళ్ల పాటు ప్రాజెక్టు ► రూ.2,500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టనున్నాం. ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం. డిసెంబర్ 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. ► ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం రూ.9,550 కోట్లు వ్యయం చేస్తుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ► పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. జగన్ స్కీమ్ కావాలనుకున్న వారికి డిసెంబర్ 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవుతుంది. ఎవరి స్కీమ్ కావాలి? ► వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకువెళతారు. మీకు చంద్రబాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. ఇదీ బాబు స్కీమ్.. ► లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది. ఇది జగన్ స్కీమ్.. ► డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. -
త్వరలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలు
నెల్లిమర్ల: టిడ్కో గృహాలను త్వరలో లబ్ధిదారులకు అప్పగించనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజలతో నాడు–ప్రజల కోసం నేడు’ పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. రూ 2.08 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాలను, రామతీర్థం దేవస్థానం ఆర్చ్(ముఖద్వారం)ను ప్రారంభించారు. రూ.4 కోట్లతో నిర్మించే సీహెచ్‌సీ అదనపు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం చదరపు అడుగుకు సుమారు రూ.500 అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా వేలా కోట్ల ప్రజాధనం దోపిడీకి పథక రచన చేసిందన్నారు. ఆ భారం లబ్ధిదారులపై పడకూడదన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబించి, ప్రజాధనాన్ని కాపాడినట్టు తెలిపారు. ఈ రివర్స్ టెండరింగ్ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ఆలస్యమైందన్నారు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
దుష్టశక్తులు అడ్డుకోవడం వల్లే ‘పేదలకు ఇల్లు’ ఆలస్యం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నిరుపేదల అభివృద్ధి గిట్టని కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం వల్లే ‘పేదలకు ఇల్లు’ కార్యక్రమం ఆలస్యమవుతోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా పేదలకు ఇల్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కచ్చితంగా పూర్తి చేస్తారని పునరుద్ఘాటించారు. టిడ్కో ఇళ్లపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆయనకు ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం 6 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు కాగా, కేవలం 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని, అందులో 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. -
‘రివర్స్ టెండరింగ్‌లో మరో రూ. 30.91 కోట్లు ఆదా’
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కోలో(టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) సత్ఫలితాలు సాధించామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.275.7 కోట్లకు ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందని తెలిపారు. (రూ.103.89 కోట్లు ఆదా) ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి.. ప్రజా ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ఇంతవరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అయ్యిందని ఆయన వివరించారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156 నుంచి రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు. చదవండి : ‘రివర్స్’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా ‘రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’ -
రెండో దశలో 35,000 ఇళ్లకు ‘రివర్స్’
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండో దశ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) వేగవంతం చేసింది. మొదటి దశలో 14,368 ఇళ్లకు ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ప్రభుత్వ ఖజానాకు రూ.105.91 కోట్లు ఆదా కావడం తెలిసిందే. రెండు, మూడో దశలను జనవరి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. రెండో దశలో 35,000 ఇళ్లకు ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు రివర్స్ టెండర్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో కూడా ప్రజాధనం ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. ఉగాదికి పనులు ప్రారంభం మూడో దశ కింద మరో 14,000 ఇళ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు టిడ్కో ప్రణాళిక రూపొందించింది. మొత్తం టెండరింగ్ ప్రక్రియను జనవరి చివరికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. -
టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్లో రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: టిడ్కో (ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టామని, ఇప్పటికే తొలిదశ టెండర్ల ప్రక్రియ పూర్తైందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలి దశ టిడ్కో ఇళ్ల రివర్స్ టెండర్లలో రూ.105.91 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. బొత్స శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 65,968 ఇళ్లకు రూ.3,253 కోట్లతో రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో అన్నీ అబద్దాలే.. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా అన్నీ అబద్ధాలే వల్లె వేశారని బొత్స పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.9,060 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆయన హయాంలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనన్నారు. ఇందులో కన్సల్టెంట్లకు రూ.845 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని రూ.321 కోట్లు చెల్లింపులు జరిపారన్నారు. రాజధాని బాండ్లు, హడ్కో రుణాలకు వడ్డీ కింద తాము రూ.330 కోట్లు చెల్లించామని తెలిపారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని, సీఆర్డీఏ పేరుతో అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ కింద పప్పు బెల్లాల్లా పంచారని విమర్శించారు. బాబు సర్కారు దోపిడీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బొత్స - గత ప్రభుత్వం 14,368 ఇళ్ల నిర్మాణానికి రూ.707.03 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా వీటికి రివర్స్ టెండర్లలో రూ.601.12 కోట్లకు కోట్ చేసి నిర్మాణ సంస్ధలు ఎల్ – 1గా నిలిచాయి. అంటే రివర్స్ టెండర్ల ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. - పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? - మిగతా ఇళ్లకు డిసెంబరు 13, 20, 26వతేదీల్లో మూడు విడతలుగా రివర్స్ టెండర్ల నిర్వహణ. - గత సర్కారు మాదిరిగా ఇళ్ల నిర్మాణానికి పాత రేట్లతో టెండర్లు పిలిచి ఉంటే ప్రతి లబ్ధిదారుడికి రూ.75 వేల నుంచి రూ.95 వేల వరకు భారం పడేది. - టీడీపీ సర్కారు అవినీతిని ఎండగట్టి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. - టిడ్కోలో రివర్స్ టెండర్ల ద్వారా ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 చొప్పున ప్రజాధనం ఆదా. -
ఇళ్లలో రివర్స్‌టెండరింగ్ రూ.105.91కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఏపీ టిడ్కోలో(ఏపీ టౌన్షిప్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మొదటి దశలో 14,368 హౌసింగ్ యూనిట్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. ఈమేరకు రివర్స్ టెండర్లను గురువారం ఖరారు చేశారు. నాలుగు జిల్లాల్లో రివర్స్ టెండర్లు టీడీపీ హయాంలో పట్టణాల్లో ’అందరికీ ఇళ్ల పథకం’ కింద ఏపీ టిడ్కో 65,969 హౌసింగ్ యూనిట్లతో ప్రాజెక్టులు చేపట్టింది. టీడీపీ పెద్దలకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేలా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కంటే అత్యధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాధనాన్ని ఆదా చేస్తూ పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్ యూనిట్లకు దశలవారీగా రివర్స్ టెండరింగ్ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రధాన టెండర్లు పిలిచిన మర్నాడే రివర్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏపీ టిడ్కో మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 14,368 హౌసింగ్ యూనిట్లకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ‘రివర్స్’తో ఆదా ఇలా.. ►చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెండర్లు దాఖలు చేశాయి. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎల్–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్ దాఖలు చేసింది. చదరపు అడుగు రూ.1,321 చొప్పున టెండరు ఖరారు చేశారు. తద్వారా రూ.40.85 కోట్లు ఆదా అయ్యాయి. ►కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, కేఎంవీ ప్రాజెక్ట్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ బిడ్లు దాఖలు చేశాయి. ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.14.35 కోట్లు ఆదా అయ్యాయి. చదరపు అడుగు రూ.1,312 చొప్పున టెండరు ఖరారు చేశారు. ►విశాఖపట్నం జిల్లాలో 3,424 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి టాటా ప్రాజెక్టŠస్ లిమిటెడ్, ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్ స్ట్రక్షన్స్ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా రూ.28.83 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. చదరపు అడుగుకు రూ1,304 చొప్పున ఈ టెండరు ఖరారు చేశారు. ►విజయనగరం జిల్లాలో 3,072 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి వీఎన్‌సీ లిమిటెడ్, ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రివర్స్ టెండర్లలో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థ రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు కోట్ చేసింది. తద్వారా ఖజానాకు రూ.21.88 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సంస్థకు చదరపు అడుగు రూ.1,315 చొప్పున టెండరు ఖరారు చేశారు. -
టిడ్కోపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో (రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ)పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై రివర్స్ టెండరింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన టెండర్లు తెరిచిన మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రజాధనం ఆదా, పారదర్శక, అవినీతిరహిత విధానాల్లో వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఈనెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్‌కు వెళ్తున్నామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి మరుసటిరోజే రివర్స్‌టెండరింగ్‌ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకూ కూడా త్వరలోనే టెండర్లను పిలుస్తామని అధికారులు వివరించారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఫ్లాట్లు కన్నా పట్టణపేదలకు ప్లాట్లు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల ఫ్లాట్లలో నిర్వహణ పరంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా పేదలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
డిసెంబర్ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద మంజూరైన గృహాల్లో నిర్మాణంలో ఉన్న వాటిలో 70 వేల గృహాల నిర్మాణం డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ పరిపాలన, ఏపీటిడ్కో అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో పీఎంఏవై పథకంపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా నిధులతో తక్కువ పెట్టుబడితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆ ఇళ్లకు అవసరమైన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటర్నల్ రహదారుల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు మాట్లాడుతూ.. పట్టణాల్లో పీఎంఏవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 లక్షల గృహాలను కేటాయించగా, 3.93 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైందని, డిసెంబరులోగా 70 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం సంబంధిత అధికారులతో సమీక్షించారు. తొలి విడతలో 60,693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలను ఎప్పటిలోగా అమలు చేసేది స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పట్టణంలో ప్లాస్టిక్ పొట్లాల్లో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి దానిని పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అర్బన్ హౌసింగ్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
‘అందరికీ ఇళ్లు’ అందేదెప్పుడు?
సాక్షి, అమరావతి: టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) ఇంజినీర్ల దోపిడీ కారణంగా ‘అందరికీ ఇళ్లు’ అందుబాటులోకి రావడం లేదు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలు సకాలంలో ఇళ్లు నిర్మించకపోయినా ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. సరైన కారణం లేకుండా ఇళ్లను సకాలంలో నిర్మించని నిర్మాణ సంస్థలకు జరిమానా విధించాలి. కానీ, టిడ్కో ఇంజినీర్లు జరిమానా విధించకుండా నిర్మాణ సంస్థల నుంచి పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం వెనుక నిర్మాణ సంస్థల తప్పు లేదని, భూ సేకరణ పూర్తి కాలేదని, డిజైన్లు ఆమోదం పొందలేదని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వీటి ఆధారంగా ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగిస్తోంది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5.24 లక్షల ఇళ్లు (ఫ్లాట్లు) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యయం, విస్తీర్ణాన్ని బట్టి ఇంటి విలువను రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని బట్టి నెలకు రూ.2,500, రూ.2,900, రూ.3,500 వాయిదాగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ప్రదేశంలో జీ+3 విధానంలో నిర్మాణాలు జరిపేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పనులు పొందిన నిర్మాణ సంస్థలు ఒప్పందం ప్రకారం సకాలంలో ఇళ్లను నిర్మించలేకపోయాయి. 80,238 ఇళ్లకు గాను ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 1,500 ఇళ్లనే నిర్మించాయి. నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయని సంస్థలకు ఈపీసీ విధానం ప్రకారం జరిమానా విధించాలి. కానీ, ప్రభుత్వం ఎలాంటి జరిమానా విధించకుండా ఒప్పందం గడువును పలుమార్లు పొడిగించింది. టిడ్కో ఇంజినీర్ల అవినీతి కారణంగానే నిర్మాణ సంస్థలు జరిమానా నుంచి తప్పించుకున్నాయన్నది బహిరంగ రహస్యమే. లబ్ధిదారులు నిర్మాణ సంస్థలు, ఇంజినీర్ల అవినీతిపై ప్రభుత్వానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు భారం రాష్ట్రంలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, వాటిలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది లబ్ధిదారులు ఇంకా గృహప్రవేశం చేయలేదు. సొంత డబ్బులు వెచ్చించి, మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని టిడ్కోకు చెందిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నివేదిక పంపినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వడ్డీతో సహా రాబట్టుకోవాలట! ఇతర ప్రభుత్వ శాఖల నుంచి టిడ్కోకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మూడేళ్ల డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు అందినంత దోచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడకు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టామని, అదంతా వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
‘ఇంటి’గుట్టు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని నగరాలు, మునిసిపాలిటీలలో అర్బన్ హౌసింగ్ పేరిట పేదల కోసమంటూ నిర్మిస్తున్న ఇళ్లను పేదలకు రుణంపై ఇస్తుండడంతో సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం పేదలకు రుణంపై ఇళ్లను మంజూరు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఇళ్లను విక్రయిస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలలో అర్బన్ హౌసింగ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించి 300 చ.గ, 365 చ.గ, 430 చ.గ. విస్తీర్ణంలో నిర్మిస్తోంది. మొదటి కేటగిరి ఇంటి విలువ రూ.5.65 లక్షలు, రెండవ కేటగిరి ఇంటికి రూ. 6.65 లక్షలు, మూడో కేటగిరి ఇంటికి రూ.7.65 లక్షలు ధరగా నిర్ణయించింది. ఇందులో ప్రతి కేటగిరికి రూ.3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించింది. మిగిలిన మొత్తం రుణంగా పేర్కొంటూ బ్యాంకు నుంచి ప్రభుత్వమే లబ్ధిదారుని పేరిట రుణం తీసుకుని దానిని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారు చెల్లించాలని పేర్కొంది. 300 చ.గ. ఇంటికి లబ్ధిదారు రూ.500, 365 చ.గ. ఇంటికి రూ.50వేలు, 430 చ.గ. ఇంటికి రూ.లక్ష డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కల్లో మొదటి కేటగిరి లబ్ధిదారుకి రూ.2,64,500, రెండవ కేటగిరి లబ్ధిదారుకు రూ.3,15,000, మూడవ కేటగిరి లబ్ధిదారుకి రూ.3,65,000లు రుణంగా ఉంటుంది. మొదటి కేటగిరి లబ్ధిదారుడు ప్రతి నెలా రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లబ్ధిదారు ఇంటి కోసం రూ.6 లక్షలు చెల్లించినట్లవుతుంది. రెండవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.3,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉండడంతో ఈ ఇంటి విలువ లబ్ధిదారు రుణం తీరే సరికి రూ.8,40,000లు, మూడవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.4500 చొప్పున 20 ఏళ్లు చెల్లించడం వల్ల ఇంటి ధర రూ.10,80,000లు అవుతోంది. ఇంతటి పెద్ద మొత్తాన్ని లబ్ధిదారు నుంచి వసూలు చేస్తూ పేదల కోసం అంటుండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని బేరీజు వేసుకుంటే ప్రభుత్వం టిడ్కో పేరిట కొందరు అధికార పార్టీ అనుయాయులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తూ పేదలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజాంలో.. రాజాంలో నిర్మాణంలో బ్లాకులు రాజాం: రాజాంలో స్మార్ట్ సిటీ నిర్మాణం చేస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరలు ఉంటాయని, పట్టణ పరిధిలో నిర్మాణాలు ఉంటాయని 15 నెలల క్రితం సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా కంచరాం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ ఇచ్చిన 34 ఎకరాలలో రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలు ఇటుక, సిమెంట్ రాళ్లతో నిర్మిస్తారు. ఇక్కడ మాత్రం పూర్తిగా సీర్వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో మాత్రం ఆరు అంగుళాల వెడల్పుతో గోడలన్నీ కాంక్రీట్‌తో నిర్మాణమవుతున్నాయి. ఈ స్మార్ట్‌సిటీ నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన విజయనిర్మాణ్ కంపెనీకి అప్పగించారు. ఇక్కడికి వచ్చిన రాతిచిప్స్తో పాటు ఇసుకలో నాణ్యతా ప్రమాణాలు మందగించినట్లు తెలుస్తోంది. పునాదుల నిమిత్తం వేసిన పిల్లర్లలో అప్పుడే బీటలు కనిపిస్తున్నాయి. ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తికాకముందే బీటలు వస్తుండడంతో ఫ్లాట్లు పూర్తయిన తరువాత, ఈ ఇంట్లో దిగిన వారి పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణాల నిమిత్తం లబ్ధిదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నిర్మితమవుతున్న బ్లాకులను చూసి లబ్ధిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మొత్తం 23 బ్లాకులు నిర్మించాల్సి ఉంది. ఒక్కో బ్లాక్‌లో 48 ఫ్లాట్ల నిర్మాణాలు ఉండాలి. ఇందులో డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూంతో పాటు పెద్ద సైజులోని సింగిల్ బెడ్రూం నిర్మాణం జరపాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఒక్క బ్లాక్ కూడా నిర్మాణం జరగలేదు. గతంలో ఈ ఫ్లాట్ల నిమిత్తం మొత్తం 3,900 మంది దరఖాస్తు చేసుకోగా, 1600 మందిని మాత్రమే రాజాం నగరపంచాయతీ అధికారులు అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో 893 మంది డీడీలు తీయగా, 211 మంది డీడీలు తీయాల్సి ఉంది. ఇంతవరకూ ఈ 211 మంది డీడీలు తీయలేదు. డీడీలు చెల్లించిన వారిలో వారం రోజుల క్రితం లాటరీ ద్వారా 90 మందిని ఎంపికచేసి ఫ్లాట్లు కేటాయించారు. వీరంతా నిర్మాణాలు వద్దకు చేరుకుని చూసి విస్తుపోయారు. బ్లాక్‌ల నిర్మాణాలు జరగకుండానే తమకు ఫ్లాట్లు కేటాయించడంపై మండిపడుతున్నారు. పలాసలో.. పలాసలో నిర్మాణమవుతున్న ఏహెచ్‌పీ ఇళ్లు కాశీబుగ్గ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు రాష్ట్ర పథకాలుగా పేర్లు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు పలాస ఎమ్మెల్యే కలిసి ఇష్టానుసారం కేటాయింపులు జరుపుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, టీడీపీలో వివిధ పదవుల్లో ఉన్నవారు ఈ ఇళ్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా పలాసలో నిర్మితమైన 198 హుద్‌హుద్ ఇళ్ల అమ్మకాలు జరుపుకున్నారు. డబ్బున్నవారు ఇళ్లను కొనుగోలు చేసుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25వార్డుల్లోని 400 కుపైగా వీధులలో నివసిస్తున్న 60వేల మందికి కేవలం 1948 ఏహెచ్‌పీ ఇళ్లు మంజూరు చేసి టాటా కంపెనీకి ప్రాజెక్టు అందించారు. ఇందుకు ముందస్తు దరఖాస్తులు 7వేల వరకు వచ్చి చేరాయి. ఇందులో అనర్హులు తొలగించగా 4వేల మంది సిద్ధమయ్యారు. ఇందులో స్క్రూటినీ చేసి వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆఖరికి డీడీలు స్వీకరించే పక్రియలో వీటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ‘ఆమదాలవలసలో..’ భైరిశాస్త్రుల పేట వద్ద నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు (అర్బన్ హౌసింగ్) ఆమదాలవలస: పేదోడిపై పిడుగు పడిన విధంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన అర్బన్ హౌసింగ్ స్కీం ఇళ్ల మంజూరు ఉంది. నిరుపేదలకు ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ప్రతి లబ్ధిదారు ఒక్కో ఇంటికి రూ.4లక్షల వరకు తమ వాటా చెల్లించాలని నిబంధన పెట్టి, లబ్ధి దారు పేరు మీద బ్యాంకులో లోన్ అప్పుగా ఇస్తూ పేదోడి నెత్తిన గుదిబండ మోపింది. ఆమదాలవలసలో జగ్గు శాస్త్రుల పేట, భైరిశాస్త్రుల పేట గ్రామాల వద్ద తొలివిడతగా మున్సిపాలిటీలోని 520మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారితో డీడీలు తీయించి, బ్యాంకుల నుంచి లోన్ అందిస్తామని చెబుతూ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్మాణాలు పూర్తి కాకుండా బ్లాక్‌లను కూడా కేటాయించారు. రుణమాఫీపై జగన్ హామీతో అర్బన్ హౌసింగ్‌కు డిమాండ్ పేదల ఇళ్లను రుణంపై ఇస్తుండడాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతూ జిల్లాకు ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు శ్రీకాకుళం నగరంలో జరిగిన సభలో అర్బన్ హౌసింగ్ ఇళ్లకు సంబంధించిన రుణాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని ప్రకటించడంతో అర్బన్ హౌసిం గ్‌కు డిమాండ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ ప్రకటించిన వెంటనే లబ్ధిదారుల్లో కదలిక వచ్చి దరఖాస్తు చేసుకోవడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల సామూహిక గృహ ప్రవేశాలు అంటూ హడావుడి చేసినప్పటికీ అది ఆ రోజుతోనే అయిపోయింది. వారికి ఇప్పటివరకు ఇళ్లను స్వాధీనం చేయలేకపోయారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను ఇప్పటికీ కల్పించలేదు. వాటిని కల్పించిన తరువాత లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవం ఇది కాదని మరికొందరు అధికారులు అంటున్నారు. ఈ ఇళ్లకు రుణాలను ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదని ఈ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేయడం లేదని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది అటుంచితే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటారని లబ్ధిదారులు విశ్వసిస్తున్నారు. -
పూలింగ్ పితలాటకం
సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న జనాభాకనుగుణంగా భవిష్యత్‌లో విశాఖ పరిసరాల్లో కనీసం 30 వేల ఇళ్లు అవసరమవుతాయని అంచనా. దీనికి తోడు ప్రతిపాదనల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ఈ కారణంతో అమరావతి తరహాలోనే ఇక్కడా ల్యాండ్ పూలింగ్ అమలు చేయాలని నిర్ణయించారు. భూముల కొరత కారణంగా భారీ టౌన్‌షిప్‌లు నిర్మించాలని తలపోశారు. ’సరసమైన గృహ నిర్మా ణం’ పేరిట అమలు చేస్తున్న ఈ పథకానికి విశాఖ జిల్లానే ప్రయోగా త్మకంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఏడాదిగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న కసరత్తులు కొలిక్కి వచ్చాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసర మైన అనుమతులను సత్వరమే మంజూరు చేస్తారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రాయితీలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. సరసమైన గృహ నిర్మాణ పథకం కింద ఆర్థికంగా వెనుకబడినవర్గాల లబ్దిదారుల ఎంపిక, రాయితీ చెల్లింపు రుణ కల్పన, ఈఎంఐ ఖరారు తదితర ప్రక్రియలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇక్కడే ప్రైవేట్ జోక్యం ఈ టౌన్‌షిప్‌ల్లో 70 శాతం స్థలంలో వాణిజ్య అవసరాలకు, 30 శాతం స్థలంలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చోటు కల్పించాలన్నది ప్రభుత్వ పన్నాగం. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాల బాధ్యతను తమకు అనుకూలమైన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చాలన్న ది పెద్దల పన్నాగంగా కనిపిస్తోంది. కాగా ఇప్పుడున్న జీవో ప్రకారం అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో అర్హులైన డీ పట్టాదారులకు 1200 చదరపు గజా లు, ఆక్రమణదారులకు 500 గజాలు చొప్పున స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంత పెద్ద స్థలాలు కాకుండా డీ పట్టాదారులకు 900 గజాలు, ఆక్రమణదారులకు 250 గజాలు చొప్పున మాత్రమే ఇచ్చేలా కొత్త జీవో జారీ కానుంది. ట్రై జంక్షన్లో పూలింగ్ గాజువాక–సబ్బవరం–పరవాడల మధ్య ట్రై జంక్షన్లో ఉన్న 1600 ఎకరాలను మెగా టౌన్‌షిప్‌ల కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరదేశీపాలెం, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఓక్కో చోట 60 నుంచి 80ఎకరాల చొప్పున సుమారు 400 ఎకరాలు గు ర్తించారు. ట్రై జంక్షన్‌లోని 1600 ఎకరాల్లో 700 ఎకరాల వరకు కొండ ప్రాంతాలున్నాయి. 900 ఎకరాల్లో డి పట్టాదారులు, ఆక్రమణదారులున్నా రు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తున్నామన్న విషయాన్ని తెలియనీయకుండా ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి అనుభవదారులు, ఆక్రమణదారులు 300 మందికి పైగా ఉన్నారని ఇప్పటికే గుర్తించారు. కాగా ల్యాండ్ పూలింగ్ గైడ్‌లైన్స్ రూపొందించిన రెవెన్యూ, ఫైనాన్స్, లా సెక్రటరీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక డిప్యూటీ సీఎం వద్ద ఉంది. ఎవరెవరికి ఎంత భూమి ఇవ్వాలనేది కేబినెట్లో చర్చించిన నిర్ణయం తీసుకుంటారు. నెలాఖరులోగా జీవో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే భూ సమీకరణ ప్రారంభమవుతుంది. ట్రై జంక్షన్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ట్రై జంక్షన్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించే భూముల్లో 150 ఎకరాలు అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కేటాయించనున్నారు. తొలుత స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 250 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని భావించారు. కానీ భూములిచ్చేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఇచ్చినా అందుకు రెట్టింపు విస్తీర్ణంలో భూములు తమకు ఇవ్వాలని మెలిక పెట్టింది. దీంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే భూముల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి వీలుగా ఆనందపురం మండలం వేములవలస వద్ద వందెకరాలు, పాలవలసలో 83 ఎకరాలు, మునగపాక మండలం పంచదార్లలో 90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం రాజుకోడూ రు, వేల్చేరు, కృష్ణపాలెం గ్రామాల్లోని 70 ఎకరాలు, అచ్యుతాపురంలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించారు. వీటిలో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ తదితర కేటగిరీల్లో టౌన్‌షిప్‌లు ని ర్మిస్తారు. ల్యాండ్ పూలింగ్‌ద్వారా సమీకరించనున్న భూములతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో మెగా టౌన్ షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) సంస్థకు అప్పగించనుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా టెండర్లు ఖరారు చేయనున్నారు. -
పట్టణ గృహ నిర్మాణాలు టిడ్కో చేతికి..
ఏలూరు (మెట్రో) : పట్టణాల్లో పేదల కాలనీల నిర్మాణం, లే–అవుట్ల అభివృద్ధి, ఇళ్ల సముదాయాల నిర్మాణ బాధ్యత టిడ్కో చేపట్టనుంది. ఇందుకోసం కొత్తగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టౌన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్–టిడ్కో) ఏర్పాటైంది. ఇప్పటివరకూ ఈ బాధ్యతల్ని గృహ నిర్మాణ శాఖ చూస్తుండగా.. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. లే–అవుట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల పేదలకు అనుకున్న స్థాయిలో గృహాలు నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికే అన్ని పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం, లే–అవుట్ల వివరాలను టిడ్కోకు అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పట్టణాల్లో పేదల కోసం సేకరించిన స్థలాలకు సంబం ధించి రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములను సైతం జిరాయితీ భూములంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. కొన్నిచోట్ల పట్టాలిచ్చి స్థలాలు అప్పగించినా లేఅవుట్లు అభివృద్ధి కాలేదు. జీ–ప్లస్ పద్ధతిలో గృహాలు మంజూరైనా.. నిర్మించేందుకు ఇబ్బందులు వల్ల ముందుకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నిటినీ ఇకపై టిడ్కో పరిష్కరించనుంది. ఇదిలావుంటే.. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలకు 23 వేల గృహ నిర్మాణాలు మంజూరు కాగా.. వీటిలో 1,910 గృహాలను గృహ నిర్మాణ శాఖ నిర్మించనుంది. మిగిలిన 21,090 గృహాలను జీ–ప్లస్ పద్ధతిలో టిడ్కో నిర్మించనుంది. మేజర్ పంచాయతీల్లోనూ.. జిల్లాలో 202 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ ఇకపై టిడ్కో ద్వారానే గృహ నిర్మాణాలు చేపడతారు. ఆకివీడు, చింతలపూడి, శనివారపుపేట, తంగెళ్లమూడి, వట్లూరు, సత్రంపాడు, వెంకటాపురం, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ఉండి వంటి మేజర్ పంచాయతీల్లోనూ టిడ్కోయే నిర్మాణాలు చేపడుతుంది. మున్సిపల్ శాఖ చూస్తుంది పట్టణాలు, మేజర్ పంచాయతీల పరిధిలో గృహ నిర్మాణాల బాధ్యత ఇకనుంచి టిడ్కో చేపడుతుంది. ఈ నిర్మాణాలకు సంబంధిత మున్సి పాలిటీలు, నగరపాలక సంస్థలు, మేజర్ పంచాయతీలు బాధ్యత వహిస్తాయి. నిధులు విడుదల వంటివి విషయాలను మున్సిపల్ శాఖ చూస్తుంది. – ఈ.శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ