
మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ
పాలకొల్లు సెంట్రల్: ఖజానాలో డబ్బుల్లేవని.. ఇప్పట్లో పనులేవీ చేయలేమని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. వీటిని సరిచేద్దామంటే ఖజానాలో నిధులు లేవని, ఇప్పట్లో ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.
నిధులు లేనందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. డబ్బులుంటే అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేసేవాళ్లమని, డబ్బులు లేకపోవడంతో చంద్రబాబు చాణక్యంతో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7,150 మంది టిడ్కో లబ్ధిదారుల్లో 640 మంది బ్యాంకు రుణాలు తీసుకోలేదని, వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment