AP CM YS Jagan Gudivada Tour Live Updates Distribution Of Tidco Houses To Beneficiaries - Sakshi
Sakshi News home page

CM Jagan Gudivada Tour Updates: ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు: సీఎం జగన్‌

Published Fri, Jun 16 2023 10:09 AM | Last Updated on Fri, Jun 16 2023 1:13 PM

Cm Jagan Gudivada Tour Updates Distribution Tidco Houses - Sakshi

Updates:

► చంద్రబాబు పేదల వ్యతిరేకి: సీఎం జగన్‌
► మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు.
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా మంచి చేశారా?.
► మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు.
► మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలంటున్న బాబు అప్పుడు ఏం చేశారు?
► మంచి చేశాను కాబట్టి ఓటు వేయండి అని అడగడం లేదు.
► ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబు దగ్గర లేదు.

► టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశారు.
► పేదలు నెలకు రూ. 3వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలన్నారు.
► ఈ ప్రభుత్వం 300 చ.అ ఇళ్లను రూపాయికే అందిస్తోంది.
► చంద్రబాబు తాను చేయని పని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు.
►అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు
►సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలను ఇవ్వగలిగాం.

► ప్రతి లబ్ధిదారునికి రూ. 7లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం: సీఎం జగన్‌
► 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తాం.
► రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.
► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి.
► రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారునికి ఇచ్చిన ఇంటిస్థలం విలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షలు
► గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కానీ ఇవ్వలేదు.

►రాష్ట్ర సర్కార్‌ నిర్మిస్తుంది జగనన్న కాలనీలు కాదు.. ఊర్లు: సీఎం జగన్‌
►అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చాం.
►జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి.
►గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం.

►ప్రజలకుసీఎం జగన్‌ మేలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడు: మంత్రి ఆదిమూలపు సురేష్‌
►పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదు.
►ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారు.
►సీఎం జగన్‌ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయి.
►జగనన్న సంకల్పం ముందు దుష్టశక్తుల శక్తులన్నీ పటాపంచలయ్యాయి.
► చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారు.
►చంద్రబాబు హయాంలో దోపిడిని ఎల్లో మీడియా ప్రశ్నించదు.

►సీఎం జగన్‌ ప్రభంజనంతో పచ్చపార్టీలో వణుకు పడుతోంది. 
►అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను సీఎం జగన్‌ పూర్తి చేశారు.
►నాయకుడు ఎలా ఉంటాడనే వారిని ఉదాహరణసీఎం జగన్‌

►20 ఏళ్ల కల నెరవేర్చడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే కొడాలి నాని
►గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్సార్‌ రాజశేఖరరెడ్డి చలవే.
►రూ.800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు చెల్లించిన డబ్బు రూ. 180 కోట్లు. అందులో రూ.160 కోట్లు కేంద్రం ఇచ్చింది.
►టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి జగన్‌ సర్కార్‌ ఇచ్చింది రూ. 400 కోట్లు.
►గుడివాడ వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతాడు.
►ఎన్టీఆర్‌ సొంత గ్రామానికి చంద్రబాబు చేసిందేమీ లేదు.

►చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలి.
►చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లు 3 నెలలకే గోతులమయంగా మారేవి.
►గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చిన మహానుభావుడు దివంగత వైఎస్సార్‌.
►చంద్రబాబు మాట నేను వింటే చరిత్రహీనుడిని అయ్యేవాడిని.
►రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు లక్ష ఎకరాలను ఇంటి స్థలాల కింద ఇచ్చిన సీఎం జగన్‌
►రాష్ట్రంలో నిరుపేదలకు రూ.15 లక్షల కోట్లు సీఎం జగన్‌ వెచ్చిస్తున్నారు.
►గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఒక ఎకరం కొనుగోలు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా.

టిడ్కో గృహ సముదాయాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

►టిడ్కో గృహ సముదాయంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

► మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌లోని టిడ్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో కొనసాగుతోంది. రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు గుడివాడ ప్రజలు జేజేలు పలికారు.

►గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. సీఎంకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ తదితరులు ఘనస్వాగతం పలికారు. టిడ్కో గృహాలను సీఎం సందర్శించారు. అనంతరం టిడ్కో ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాసేపట్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

►తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ గుడివాడ బయల్దేరారు.

► 20 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న ఇళ్లు లేని పేదలు..
►టిడ్కో గృహాల పంపిణీతో తీరనున్న పేదల సొంతింటి కల.
►గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 10 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం 2007లో పాదయాత్ర చేసిన కొడాలి నాని.
►గుడివాడ నుంచి హైదరాబాద్‌ వరకూ 320 కి.మీ పాదయాత్ర చేసిన కొడాలి నాని.
►అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్సార్‌కు వినతిపత్రం అందించిన కొడాలి నాని.
►రెండవసారి సీఎం అవ్వగానే మల్లాయపాలెంలో 77.46 ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేసిన వైఎస్సార్‌, కొడాలి నాని.
► సీఎం అయితన తర్వాత మల్లాయపాలెంలో పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేసిన చంద్రబాబు.
►2019 ఎన్నికల ముందు పూర్తికాకుండానే అబ్ధిదారులకు చంద్రబాబు టిడ్కో ఇళ్ల పంపిణీ
►జగన్‌ సీఎం అయిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి.

►ఇళ్ల నిర్మాణం కోసం రూ.799.19 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. 
►టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 178.63 ఎకరాలు సేకరించి.. 7,728 మంది పేదలకు పంపిణీ
►టిడ్కో ఇళ్ల పక్కనే శరవేగంగా జరుగుతున్న 4,500 ఇళ్ల నిర్మాణాలు

సాక్షి, అమరావతి/విజయవాడ: రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో లే–అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.

మరో రూ.4,626 కోట్లను సబ్సిడీ
గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 20 ఏళ్లపాటు నెలకు రూ.3 వేల చొప్పున అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి. అంటే నిరుపేదలు చెల్లించాల్సిన అక్షరాల రూ.10,339 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 365 చ.అ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 74,312 మంది 430 చ.అ. లబ్దిదారులకు రూ.50 వేల చొప్పున ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా జగనన్న ప్రభుత్వమే భరించడంతోపాటు మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా ఇచ్చింది.

ఉచితంగా రిజిస్ట్రేషన్‌
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లు ప్రతిపాదించిన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యంగా వదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాకే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తోంది. దీంతో ఒక్కో లబ్దిదారుడికి అదనంగా మరో రూ.60 వేల వరకు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ రూపంలో రూ.11,672 కోట్లు, ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ.482 కోట్లు, ఉచిత రిజి్రస్టేషన్ల రూపంలో రూ.1,200 కోట్లు, మౌలిక వసతులకు మరో రూ.3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ.16,601 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

రూ.657 కోట్లతో 13,145 ఇళ్ల పట్టాలు
గుడివాడ నియోజకవర్గంలో 84 వైఎస్సార్‌–జగనన్న లేఅవుట్లలో రూ.657 కోట్ల విలువైన 13,145 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల కింద రూ.239 కోట్లు విలువైన 8,859 ఇళ్లు మంజూరు చేసింది. మౌలిక వసతులకు మరో రూ.87 కోట్లు వెచ్చించింది. గుడివాడలో రూ.983 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులకు ఖర్చు చేసింది.   

లక్షల ఇళ్ల పంపిణీ సీఎం జగన్‌కే సాధ్యం: టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ 
సాక్షి, అమరావతి: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప సాహసం మన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేశారని, లక్షల మందికి ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయించడం పేదల ప్రగతి పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం తుళ్లూరులో రెండోవిడతగా మూడువేల మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సీఎం జగన్‌ మొక్కవోని దీక్షతో పేదప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పారు. న్యాయపరమైన సమస్యలను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్లస్థలాలు కేటాయించారన్నారు. ఇన్ని వేలమందికి ఇంటిపత్రాలు ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసమని పేర్కొన్నారు.

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. అంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, వైఎస్సార్‌సీపీ స్థానిక కో ఆర్డినేటర్‌ కత్తెర సురేష్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement