సాక్షి, అనకాపల్లి: సత్యనారయణపురంలో 2,744 టిడ్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా, 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఈ సారి మీ సొంత ఇంట్లో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలుపుకున్నారు. లబ్ధిదారులకు రిజస్ట్రేసన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment