
టీడీపీ నాయకుడి అండదండలతో ఓ ప్రైవేటు వ్యక్తి దందా
అనకాపల్లి: గ్రామ సచివాలయం.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల చెంతకే పౌర సేవలను తీసుకువెళ్లేందుకు ఏర్పరచిన వ్యవస్థ. గ్రామ స్వరాజ్యం కలను నిజం చేసే ఈ సచివాలయాల కోసం నాటి సర్కారు పక్కా భవనాలను నిర్మించింది. అక్కడి నుంచే దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన వ్యవస్థ నడిచింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడది తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.
రోలుగుంటలో మరో అడుగు ముందుకేసి ఓ ప్రైవేటు వ్యక్తికి నివాసంగా కూడా మారింది. స్థానిక టీడీపీ నాయకుడి అండదండలతో ఏకంగా ఆ వ్యక్తి సచివాలయంలో సంసారమే నడిపేస్తున్నాడు. సదాశయానికి గండి కొడుతున్నాడు. ఆయన కుటుంబంతో గత 8 నెలలుగా నివాసం ఉంటున్నా.. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. అధికారులు ఏం చేస్తున్నారో.. కూటమి నాయకులు ఏం చెబుతారో!