village secretariat
-
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట!
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి.. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా?ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల.. తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారుతుంటే తమలో అభద్రతా భావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంత మంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల.. జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయి.. పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప.. రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే..గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌కు సంబంధించి.. సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. రేషనలైజేషన్‌ను మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా.. వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలి’ అని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ షాక్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరులుగా విభజించి ఉద్యోగులను కుదిరించింది.గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్ కోతపెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.ఇక, ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించింది. ఈ క్రమంలో ఏ-కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, బీ-కేటగిరి సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు. సీ-కేటగిరి సచివాలయంలో సిబ్బంది ఎనిమిదికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా, ఏర్పాటై ఉంటే అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమాచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. -
34 వేల ప్రభుత్వ పోస్టులకు మంగళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే దిశగా చంద్రబాబు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరాలన్న సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేయబోతోంది. ఎందుకంటే.. తాజాగా, శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే... ప్రభుత్వంలో ఒకేసారి దాదాపు 34వేల ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో మొన్న జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. 2.66 లక్షల మంది ఉన్న వలంటీర్ల వ్యవస్థకు ఇప్పటికే దాదాపు మంగళం పాడేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేపట్టి అందులో పనిచేసే ఉద్యోగులను భారీగా కుదించనుంది. 1.49 లక్షల ఉద్యోగాలకు 1.15 లక్షలతో సరి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం, సంక్షేమ పథకం ఎలాంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సంతృప్త స్థాయిలో చేరవేయాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సచివాలయంలో 10–11 మంది చొప్పున మొత్తం 1,49,235 మంది పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించి దిగ్విజయంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో వీటిల్లో సిబ్బంది సంఖ్యను భారీగా కుదిస్తోంది. ఎంతలా అంటే.. 2,500 కన్నా తక్కువ జనాభా ఉండే 3,562 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరుగురు చొప్పున.. 2,500–3,500 మధ్య జనాభా ఉండే 5,388 సచివాలయాల్లో ఏడుగురు చొప్పున.. 3,500 పైబడి జనాభా ఉండే 6,054 సచివాలయాల్లో ఎనిమిది మంది చొప్పున మాత్రమే కొనసాగించాలన్న నిర్ణయానికి శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా మొత్తం సచివాలయాల్లో ఉద్యోగాల సంఖ్యను 1,15,226 మందికే పరిమితం చేయాలని నిర్ణయించారు. అంటే.. 34వేల పోస్టులకు ఎసరు పెట్టనున్నారు. 15,496 మంది వేరే శాఖలకు బదిలీ నిజానికి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లూచేశారు. కానీ, ఎన్నికలతో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు చేపడుతున్న హేతుబద్ధీకరణ ప్రక్రియ తర్వాత ఆ ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు.. వాటిల్లో 15,496 మంది అదనంగా పనిచేస్తున్నట్లు లెక్కగట్టింది. ఇప్పుడు వీరందరినీ వేరే శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.పాత రోజులు పునరావృతం..గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు 3–4 ఊళ్లకు ఒక్క పంచాయతీ కార్యదర్శి.. ఐదారు ఊర్లకు ఒక వీఆర్వో మాత్రమే ఉన్న పరిస్థితి ఉండేది. వ్యవసాయ అసిస్టెంట్లు అయితే ఎక్కడో ఒకరు ఉండేవారు. ఇక సర్వేయర్లు మండలానికి ఒకరు.. చాలా మండలాలకు ఇన్చార్జి సర్వేయర్లు ఉండేవారు. కానీ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ప్రతి ఊర్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు నియమితులయ్యారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో చాలా గ్రామాల్లో కీలకమైన ఉద్యోగులు 2–3 ఊళ్లకు ఒకరు చొప్పున ఉండే పరిస్థితి మళ్లీ రానుంది. అలాగే, వీఆర్వో సంఖ్య 11,162 నుంచి 5,562కు తగ్గిపోనుంది. అంటే.. సగం గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు ఉండని పరిస్థితి దాపురించబోతోంది. సర్వేయర్లదీ ఇదే పరిస్థితి. ఇక ఈ సచివాలయాల్లో ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ ఉద్యోగులు 10,475 మంది ఉండగా, హేతుబద్ధీకరణతో ఆ సంఖ్య 7,524కు పరిమితమవుతుంది. ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు కూడా 8,138 నుంచి 6,359కి తగ్గిపోనున్నాయి. -
విజయవాడలో 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన నగరపాలక సంస్థ
-
సచివాలయ వ్యవస్థే దిక్కయ్యింది!
బెజవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గడచిన ఐదేళ్ల పాలనలో జరిగిన మంచిని అడుగడుగునా గుర్తుచేసింది. ఇదే ఇప్పుడు చంద్రబాబు సహా కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ప్రజల్లో తమకు లేని ఆదరణ జగన్‌కు వస్తుంటే కడుపు మంట రెట్టింపైంది. జగన్ ఇడుపులపాయ నుండి వస్తుంటే మార్గమధ్యంలో కృష్ణలంక వాసులు ఆయన కారును ఆపేసి రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్లే తాము బతికి ఉన్నామంటూ దండాలు పెట్టారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. అదేరోజు మధ్యాహ్నం జగన్ సింగ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటి వరకూ బోట్లలో తిరుగుతూ కాలక్షేపం చేసిన చంద్రబాబు... జగన్ నీటిలోకి దిగి ప్రజలతో మమేకమయ్యేసరికి ఉండ బట్టలేక పోయారు. జగన్ నీళ్లలోకి దిగాడని తాను కూడా నీళ్లలో దిగి ఫీట్లు చేయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇక జగన్ ఈ క్రమంలోనే అడిగిన అనేక ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేక ఇప్పటి వరకూ ఊరుకుని... ఇప్పటికిప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. అసలు వీడియోలే లేవంటూ ఆడపిల్లల ఆందోళనను అవమానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడం వల్ల సింగ్‌నగర్, పాయకాపురం, ఆర్ఆర్ పేట, కండ్రిక... ఇలా అనేక ప్రాంతాలు కేవలం రెండు గంటల వ్యవధిలో చెరువుల్లా మారి పోయాయి. శనివారం సాయంత్రం నుండి ఈ పరిస్థితి ఉంటే సోమవారం సాయంత్రం వరకూ సహాయక చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లిన టీవీ రిపోర్టర్ల వద్ద ప్రజల నుండి ఆగ్రహవేశాలు వ్యక్తమవడం చూసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిన్నమొన్నటి వరకూ రేషన్ సరుకులు సరఫరా చేసే వ్యాన్లను వద్దంటే వద్దన్న బాబు అండ్ కో ఇప్పుడా వ్యాన్లలోనే ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేసింది. సచివాలయాలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడదే సచివాలయాలను కేంద్రంగా చేసుకుని సహాయక చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే సహాయక చర్యల్లోనూ ముమ్మా టికీ అవినీతే కనిపిస్తోంది. పడవ పంపాలంటే రూ. 2 వేల నుండి రూ. 10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఇక ఆహారం కూడా చివరి ప్రాంతాలకు అందలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన ఆహారం కూడా పురుగులు, కుళ్లిన వాసన వస్తోందని మండిపడ్డారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండమే పునరావాస కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేకపోవడానికి కారణమని అర్థమవుతోంది. చంద్రబాబు తన నివాసమే కృష్ణా నదిలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయారు. శనివారం నుండి వరద ఉధృతి ఉంటే బుధవారం తన ఇంటిపై అప్పుడెప్పుడో రెండు రోజుల క్రితం జగన్ ఆరోపించిన అంశాలను లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అందరి ఇళ్లు మునిగిపోయినట్లే తన ఇల్లూ మునిగిపోయిందని చంద్రబాబు ఎందుకన్నారన్న ప్రశ్నకు కనీసం ఆయన దగ్గర కూడా సమాధానం దొరకుతుందో లేదో! అందరి ఇళ్లు ప్రభుత్వం నీటిని విడుదల చేయడం వల్ల మునిగాయి. కానీ, చంద్రబాబు ఇల్లు మాత్రం కృష్ణా నదిలో ఉన్నందువల్ల మునిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు... బుడమేరు ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరీ ముఖ్యంగా బుడమేరు 2019 నుండి ఆక్రమణలకు గురైందంటూ వైసీపీ మీదకు నెట్టేందుకు పన్నాగం పన్నారు. నిజానికి చంద్రబాబు పాలనా కాలంలోనే బుడమేరు ఆక్రమణలకు గురయిందన్నది బహిరంగ రహస్యం.ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రా తరహా సంస్థను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహా సంస్థలు నెలకొల్పితే ముందు చంద్రబాబు నాయుడి నివాసం నుండి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ మేరకు పవన్ కల్యాణ్‌కు ధైర్యం ఉందా అనేది చూడాలి. జన సైనికులు తమ నేత ప్రశ్నించాల్సిన సమయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98484 05455 -
ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.ముద్ర వేసి ఇబ్బందులు..ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. -
మాజీ సీఎం జగన్ చిత్రం తొలగింపు
కరప: పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆ ఏడాది అక్టోబర్ నెల 2 గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరప నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరప గ్రామసచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌కు నీలం, తెలపు, ఆకుపచ్చ రంగులు వేసి, పైభాగంలో నాలుగుపక్కలా నవరత్నాల చక్రం లోగోలో జగన్ ముఖచిత్రం ఉండేలా విద్యుద్దీపాలతో గ్రామసర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఏర్పాటు చేశారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ పార్టీ మండల నాయకులు పైలాన్‌ను తొలగించాలని చూడగా గ్రామ కార్యదర్శి ఎస్కే నాగేంద్రకుమార్ జీఓ లేకుండా పైలాన్ తొలగించడానికి వీలులేదని చెప్పారు. తర్వాత నాగేంద్రకుమార్‌కు గ్రేడ్–1 కార్యదర్శిగా పదోన్నతి రాగా, బదిలీపై వెళ్లారు. తర్వాత మళ్లీ జేఎస్పీ నాయకులు పైలాన్‌పై ఉండే జగన్ చిత్రాన్ని తొలగించాలని పట్టుబట్టి తొలగించారు. పైలాన్ పైభాగంలో నాలుగుసింహాల బొమ్మను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వైఎస్సార్ సీపీ జెండా రంగులు తొలగించి టీడీపీ, జనసేన రంగులు వేస్తే ఊరుకోబోమని, జాతీయజెండా రంగులు వేస్తే అభ్యంతరం లేదని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఉన్న శిలాఫలకం తొలగించినా అంగీకరించమని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. పనులు పూర్తయ్యాక, రంగులు ఏమి వేస్తారో వేచి చూస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్‌గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్‌లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్‌తో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్‌ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
కాసేపట్లో ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
పడిగాపులు.. చంద్రబాబుపై పెన్షన్‌దారుల ఆగ్రహం
Live Updates.. చంద్రబాబు కుట్రతో పెన్షన్‌దారులకు అష్టకష్టాలు ►పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం ►సచివాలయాలకు మంచాల్లో వృద్ధులు, వికలాంగులు ►పెన్షన్ పంపిణీ సజావుగా సాగకుండా పచ్చ కుట్రలు ►ఐదేళ్ల నుంచి ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ►చంద్రబాబు కుట్రలకు ఓటుతోనే జావాబిస్తామంటున్న ప్రజలు కాకినాడ: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ సచివాయాలకు వచ్చి పింఛన్లు అందుకుంటున్న పెన్షన్ దారులు జిల్లా వ్యాప్తంగా 2,83,544 మంది పింఛన్ దారులకు రూ.84.02 కోట్లు మూడు రోజుల పాటు పంపిణీ ► ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. ►ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ►ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ►తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ చేపడతారు. ►ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ►వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ►సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ► పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ► సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ►ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ►పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ►ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్‌ను పాటించాలి. ►సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. -
రాష్ట్రమంతా ఒకెత్తు ఆ గ్రామం ఒకెత్తు
-
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
చంద్రగిరి(తిరుపతి జిల్లా): ‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే... అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం..’ అని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ‘హెల్తీ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీలో ఛండీగఢ్, జమ్ము–కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, కేరళకు చెందిన 49 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు 47మంది, చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన 48మంది ప్రతిని«దులు పర్యటించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్ ఎస్‌డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలతోపాటు డిజిటల్ క్లాసులు, ట్యాబుల ద్వారా విద్యాబోధన ఒక అద్భుతమని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొండవాడ పంచాయతీలో పర్యటించిన బృందం వెంట ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. -
AP: నేటి నుంచి కుల గణన
సాక్షి, అమరావతి: నేటి నుంచి ఏపీలో కుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్‌గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్‌లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్‌లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. -
ఏపీ: ఊరిస్తున్న ఊరు
సాక్షి, అమరావతి: గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు.. మరో నాలుగు అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా ఆర్బీకేలు.. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్.. ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలలు.. ఆ పక్కనే అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు.. సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ప్రతి గ్రామంలో పది మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు.. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధులు పొందుతూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు.. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్రంలో వికేంద్రీకరణతో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో కూలిపోయే దశలో ఉన్న సర్కారు స్కూళ్ల భవనాలు మినహా ఇతర ప్రభుత్వ భవనాలేవీ కానరాని దుస్థితి నుంచి అన్ని సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పలు కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మితమవుతున్నాయి. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఏ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులైనా గ్రామాల నుంచే పని చేసుకోవచ్చు. ► ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. బంధువులను చూడడానికి మాత్రమే ఇప్పుడు పొరుగూళ్లకు వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు, సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని, వ్యయ ప్రయాసలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాయాల ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్‌గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య సేవలను అందజేస్తోంది. రక్త పరీక్షలు అక్కడే నిర్వహిస్తూ అవసరమైన మందులూ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ► ఐదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన 2019కి ముందు వరకు దాదాపు 3 వేల పంచాయతీలలో కనీసం కార్యాలయం భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండవు. కార్యదర్శుల కొరతతో అవి నెలల తరబడి మూసివేసి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది. ఇప్పటికే 7,144 భవనాల నిర్మాణం పూర్తి కాగా మరో 1,888 భవనాలు నెల రోజుల్లో పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మాగ్యజైన్లు ఉంటాయి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునే డిజిటల్ కియోస్క్‌లు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ► గతంలో విత్తనాలు కావాలన్నా ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. కాల్ సెంటర్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను చేరువ చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఒక్కో ఊరిలో రూ.23.94 లక్షలు ఖర్చు పెట్టి 1,360 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. పశువైద్య సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ► గ్రామాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి రూ.17.50 లక్షల వ్యయంతో 1,185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసింది. వీటిలో 3,388 నిర్మాణం పూర్తి కాగా మరో 1705 ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే దశలో ఉన్నాయి. విలేజీ హెల్త్ కిన్లిక్లలో 14 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం అందించింది. డెంగ్యూ, మలేరియా సహా హెచ్ఐవీ, సిఫిలిస్ లాంటి వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను అన్ని హెల్త్ క్లినిక్‌లోనూ అందుబాటులో ఉంచింది. వీటికి తోడు ప్రతి హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచింది. ► నాడు – నేడు ద్వారా రూ.11,000 కోట్ల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూళ్లకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రూ.612 కోట్లు ఖర్చు చేసి ప్రహరీ గోడలను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీలను కూడా నిర్మిస్తోంది. ► ప్రభుత్వం కేవలం కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిల్లో అన్ని మౌలిక వసతులను కల్పించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్లను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లుతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించేందుకు 2,91,590 స్మార్ట్ ఫోన్లను, సిమ్ కార్డులను అందజేసింది. ► 2020లో పలు భవన నిర్మాణాలకు అనుమతులు లభించగా వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులను స్తంభించాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16,081 భవన నిర్మాణాలు పూర్తి కాగా మరో 5095 భవనాలు నెల నుంచి నెలన్నర లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరుకైన పంచాయతీ భవనాలు మినహా రైతులకు, ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారత బాట పట్టారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాప్‌లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఆమూల్, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. నాలుగు నెలల్లో నియామకాలు.. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డు కాగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది సచివాలయాల ఉద్యోగులు ఈ నాలుగేళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. -
అభివృద్ధిలో సరికొత్త నమూనా
భారత్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలకు అనుసంధానించడంలో విద్యదే కీలక పాత్ర. ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు: 1. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. 2. పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులను ఖర్చు చేయడం. దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. 2024 సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని పథంలోకి మార్చింది. సాధారణంగా అభివృద్ధి అంటే... ఎత్తయిన భవనాలు, మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో నయా ఉదార వాద ఆర్థికవేత్తలు అలాంటి ఖర్చును మంచి అభివృద్ధిగా పరిగణి స్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నమూనానే అనుసరిస్తోంది. సోషలిస్ట్ ఎకానమీ నుండి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది. వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, దాని అసాధారణమైన కుల అడ్డంకులు ప్రజల కేంద్రిత అభివృద్ధికి అనేక అవరోధాలను సృష్టించాయి. రెండవది, భారతీయ గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి పూర్తిగా వ్యవసా యాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రజలను జాతీయ, ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి... గ్రామీణ పిల్లలకు, యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభు త్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఐదేళ్లలో తన బడ్జెట్లో ఎక్కువ భాగం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ స్కిల్స్‌ను నిర్మించడం కోసం కేటాయించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లలో టీడీపీ, వైఎస్సా ర్సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని, రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడా నికి సిద్ధమైంది. పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయనీ, వెలుపలి నుంచి వచ్చే పెట్టుబడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన. ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు. అందుకే, ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి. ఆ ప్రైవేట్ పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలో కొనసాగాలి. గ్రామీణ వ్యవసాయాధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరలేరు. విప్లవాత్మక అభివృద్ధి నమూనా భారీ మల్టీ లేన్ రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు, ఓడరేవులతో కూడిన ‘హైవే ఎకానమీ’, ప్రభుత్వ రంగ పరిశ్రమలను భారీగా ప్రైవేటీకరించడం ఆర్ఎస్ఎస్ దృక్పథానికి బాగా సరిపోతుందని మితవాద ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆరెస్సెస్‌కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థలో శూద్ర ఉత్పాదక ప్రజానీకానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు. ఈ నమూనాతో చంద్రబాబు శ్రుతిమించి పోయారు. వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధి నమూనానే మార్చేశారు. దీన్ని నేను శూద్ర అభివృద్ధి నమూనా అని పిలుస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాలు, కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ, చేతివృత్తుల ఉత్పాదక ప్రజానీకానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను శూద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను. మొత్తం వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పాదక ప్రజానీకంలో (ఆదివాసీ, దళిత వర్గాలు, రిజర్వుడ్ శూద్ర ఓబీసీలు, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్‌రిజర్వుడ్ శూద్రులు అందరూ ఇందులో ఉంటారు) నైపుణ్యాలు, వనరుల పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల, కళాశాల విద్య, గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది. వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు: 1) ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. ఇది నైపుణ్యం, జ్ఞానం రెండింటిలోనూ గ్రామాన్ని ప్రపంచంతో కలుపుతుంది. విద్యా ఖర్చుల కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడాన్ని కూడా దీనికి జోడించారు. 2) పాఠశాల మౌలిక సదుపాయాలను, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం. ప్రధాన వ్యాపారాలు లేని, శ్రమతో పని చేసే సాంప్రదాయ శూద్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యాలు, ప్రపంచ భాషతో వ్యవహరించడానికి ప్రవేశం లభిస్తుంది. దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. పెట్టుబడుల కేంద్ర మార్పు ఈ నమూనా... పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది. ఇది పట్టణ బ్యాంకుల్లోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది. ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం, వ్యయం, ఉత్పత్తి, విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది. మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ప్రజానీకానికి బదలా యిస్తుంది. ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు. ఇది భవిష్యత్ విప్లవా నికి సంబంధించిన పెట్టుబడి. సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల–సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. బెంగాల్లో వారి 34 ఏళ్ల పాలన గ్రామీణ ప్రజానీకాన్ని ప్రపంచీకరణ ప్రక్రియతోనూ, ఆంగ్ల విద్యతోనూ ముడిపెట్టకుండా ఎలా దూరంగా ఉంచిందో నిరూపించింది. ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంది. చారిత్రాత్మకంగా జ్ఞాన వ్యవస్థను నియంత్రిస్తున్నందున సంపద మొత్తంగా ద్విజ సంఘాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. పురాతన కాలంలో ఇది సంపదను, సంస్కృత భాషను నియంత్రించింది. మధ్యయుగ కాలంలో ద్విజులు ముస్లిం పాలకులతో కలిసి సంపదను, పర్షియన్ భాషను నియంత్రించారు. గత 75 ఏళ్లుగా వారు సంపదను, ఆంగ్ల భాష ఆధారిత జ్ఞానాన్ని నియంత్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను, విజ్ఞానాన్ని వ్యవసాయ, చేతివృత్తుల వారి చేతుల్లోకి తెచ్చింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రికార్డు సృష్టించిన ఏపీ..
-
వలంటీర్ల సమ్మె అవాస్తవం
సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్/పటమట (విజయవాడ తూర్పు)/వీరఘట్టం: నిన్న మొన్నటిదాకా వలంటీర్లను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించిన విపక్ష పార్టీలు, వారి అనుకూల పచ్చ మీడియా ఇప్పుడు వలంటీర్లలో కొందరినైనా చీల్చి వారిలో ప్రభుత్వ విద్వేషాన్ని రగిల్చి సమ్మెబాట పట్టించాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. తామెలాంటి సమ్మెలో పాల్గొనడంలేదని వలంటీర్ల సంఘాలు తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా.. ఆయా వలంటీర్లు తమ వృత్తి సంబంధిత అంశాలపై తలెత్తే సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జిల్లాల వారీగా లేదా ఎక్కడికక్కడ అనధికారికంగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటుచేసుకున్నారు. కొన్నింటిలో ఎవరికి వారే ఆ గ్రూపుల్లో చేరే అవకాశం ఉండడంతో.. వివిధ ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు కొందరు వలంటీర్ల ముసుగులో ఆ గ్రూపుల్లోకి దూరి వలంటీర్లను రెచ్చగొట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వంపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ వచ్చారని వలంటీర్లు చెప్పారు. ఆ తర్వాత వీరే ప్రభుత్వం జీతాలు అప్పుడు పెంచబోతోంది, ఇప్పుడు పెంచబోతోందని అంటూ గ్రూపుల్లో అనవసర చర్చ పెట్టి, అనంతరం సమ్మె అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ వచ్చేవారని వారు చెప్పారు. కానీ, అసలైన వలంటీర్లు వాటిని ఎప్పటికప్పుడు ఖండించడమో లేదంటే వాటిని అసలు పట్టించుకోకపోవడం చేసేవారన్నారు. నిజానికి.. వలంటీర్లకుగానీ, వలంటీర్ల సంఘాల ప్రతినిధులకు గానీ సమ్మె చేయాలని ఎలాంటి ఆలోచన లేకపోయినా ప్రేరేపిత పోస్టులకు స్పందించే ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు సమ్మెకు దిగుతున్నారని మిగిలిన వలంటీర్లను రెచ్చగొట్టి వారితో సమ్మె ముసుగులో ఆందోళన చేపట్టేందుకు తెలుగుదేశం సహా మరికొన్ని రాజకీయ పక్షాలు యత్నిస్తున్నాయి. ఎక్కడా ఎవ్వరూ విధులు బహిష్కరించలేదు.. వలంటీర్ల సమ్మెను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు కొట్టిపారేశారు. రాష్ట్రంలో వలంటీర్లు ఎక్కడా విధులు బహిష్కరించినట్లుగానీ, ఆందోళనలు చేపట్టినట్లుగానీ ఎలాంటి సమాచారంలేదని వారు పేర్కొంటున్నారు. ఇక.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో వలంటీర్లు పూర్తిస్థాయిలో పాల్గొన్నారని వారు స్పష్టంచేశారు. మరోవైపు.. సమ్మె ప్రచారంపై చాలాచోట్ల వలంటీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాల్లోని వివిధ వలంటీర్ల సంఘాల నాయకులు కూడా సమ్మె ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. తాము సమ్మె చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి సత్యదూరమని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు వలంటీర్ల ప్రతినిధులు బి. మల్లికాదేవీ, బి. రాజకల్పన మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనాడులో వచ్చిన వార్త అసత్యమని, తాము పూర్తి చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు పనిచేస్తున్నామని, ఇలాంటి వార్తలకు తాము ప్రభావితం కాలేమని వారు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని వారు తేల్చిచెప్పారు. మేమెలాంటి సమ్మెలో పాల్గొనడంలేదు.. వలంటీర్ల సమ్మె నోటీసులు అంటూ కొన్ని దినపత్రికల్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. చిత్తూరు జిల్లాలోని వలంటీర్లు అందరం ఎలాంటి ఆందోళనలను కానీ, సమ్మెలోగానీ పాల్గొనడంలేదు. చిత్తూరు జిల్లా వలంటీర్ల సంఘం తరఫున మేమందరం సీఎం ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మేం ఎలాంటి సమ్మెలో పాల్గొనడంలేదు. – చిత్తూరు జిల్లా గ్రామ, వార్డు వలంటీర్ల సంఘం ఈనాడు తప్పుడు రాతలపై వలంటీర్ల ఆగ్రహజ్వాల సీఎం జగన్ ప్రభుత్వానికి, వలంటీర్లకు మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో ఈనాడులో ప్రచురించిన తప్పుడు కథనంపై వలంటీర్లు మండిపడ్డారు. ఆడుదాం–ఆంధ్రా కార్యక్రమానికి వచ్చిన వారు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని సీపీఎస్ రోడ్డులో మంగళవారం ఈనాడు ప్రతులతో ఆందోళన చేశారు. రామోజీరావు డౌన్‌డౌన్ అంటూ నినదిస్తూ ఈనాడు ప్రతులను దగ్థంచేశారు. వలంటీర్లు మాట్లాడుతూ.. గత టీడీపీ పాలనలో పింఛన్ తీసుకోవాలంటే వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు నానా కష్టాలు పడేవారని.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థతో ఆ కష్టాలన్నీ దూరమై ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. వలంటీర్ వ్యవస్థకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈనాడు కుళ్లుకుంటోందని.. ఈ వ్యవస్థను చూసి ఈనాడు, టీడీపీ, జనసేన భయపడుతున్నాయని, అందుకే మా మీద కుట్రలు చేస్తున్నాయని వలంటీర్లు అన్నారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టడంలేదు తామెలాంటి ఆందోళనలు చేపట్టడంలేదని.. సమ్మెలోనూ పాల్గొనడంలేదని చిత్తూరు జిల్లా వలంటీర్లు ఆ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, డీఆర్ఓ రాజశేఖర్‌లకు లిఖితపూర్వకంగా తెలిపారు. అనంతరం డీఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లపై సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక మంగళవారం జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో, ఇతర కార్యక్రమాల్లో వలంటీర్లు పాల్గొన్నారన్నారు. వలంటీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ.. వలంటీర్ల సమ్మెబాట వార్త అవాస్తవమన్నారు. తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. – విధుల్లోనే ఉన్నామని కలెక్టర్‌కు చిత్తూరు జిల్లా వలంటీర్లు వెల్లడి వలంటీర్ వ్యవస్థతో జరిగే మంచిని జీర్ణించుకోలేకే.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ వ్యవస్థ వలన జరుగుతున్న మంచిని కొంతమంది రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేక తమ ఉనికికోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఇందులో భాగంగానే.. వలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారని, విధులు బహిష్కరిస్తున్నారని కొన్ని పత్రికలు, సోషల్ మీడియా గ్రూపుల్లో దుష్ప్రచారం చేపట్టాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఇలాంటి వార్తల్లో నిజంలేదు. రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ తరఫున మేం దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. సమ్మెబాట పట్టిన వలంటీర్లు అని.. జగన్‌తో వలంటీర్లు యుద్ధం అని కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాం. – పీటా నాగమల్లేశ్వరరావు (వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు), – మద్దిలి కాళిదాసు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), – కొమ్ము సురేష్‌బాబు (జాయింట్ సెక్రటరీ), – పూజారి ఉదయ్‌కుమార్ (రాష్ట్ర ఉపాధ్యక్షుడు) -
మేము సైతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..(వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంలో ఇప్పటి దాకా ‘మేము సైతం..’ అంటూ 4,23,821 కుటుంబాలు భాగస్వామ్యమయ్యాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మధ్యలో దీపావళి కారణంగా మూడు రోజులు విరామం ఏర్పడింది. 9న 664 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో, 10న మరో 689 సచివాలయాల పరిధిలో, 14న 647 సచివాలయాల పరిధిలో, 15న మరో 504 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గృహసారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు, వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో కార్యక్రమం ప్రారంభమైన రోజునే.. ఏ సచివాలయం పరిధిలో ఎంత మందికి ఏయే పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్న వివరాలతో కూడిన సంక్షేమ, అభివృద్ధి బోర్డులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. బుధవారం వరకు ఇలా 2,504 సచివాలయాల వద్ద సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించారు. వీటి ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజు నుంచే ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున కలుస్తున్నారు. ఇప్పటి వరకు (మధ్యలో 3 రోజులు సెలవులు పోను) 16,169 మంది 4,23,821 కుటుంబాల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి కలిగిన ప్రయోజనం, ఆ ఊరు మొత్తానికి కలిగిన ప్రయోజనాన్ని వివరించి చెప్పారు. -
21 లక్షల మందికి.. ఒక్కరోజులోనే 'కుల ధ్రువీకరణ పత్రాలు'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయి. ముఖ్యంగా కుల వీకరణ పత్రాల జారీలో సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానం వారి కష్టాలు తీరుస్తోంది. ఎందుకంటే.. ఈ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 30 రోజుల్లోగానీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఆ తర్వాత ఏదేని కారణంతో మళ్లీ అవసరమైనా మరోసారి 30రోజులు నిరీక్షించాల్సిందే. ఈ ఇబ్బందుల్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి వారికి సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి, మళ్లీ దాని అవసరం ఎప్పుడైనా ఏర్పడితే కొత్తగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా అంతకుముందు తీసుకున్న వివరాల ప్రకారం అడిగిన రోజునే గ్రామ, వార్డు సచివాలయాల్లో మరోసారి ఆ పత్రాలిచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. దీని ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 21,00,888 మంది దరఖాస్తు చేసుకున్న రోజునే కుల ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. గతంలో ఒకసారి తీసుకున్న వారికి.. సాధరణంగా.. విద్యార్థుల స్కూళ్లలో లేదంటే కాలేజీల్లో చేరే సమయంలోనూ.. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగ యువతకు.. వివిధ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ దానిని జారీచేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది గతంలో ఒకసారి తీసుకున్నా.. సరిగ్గా కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో వివిధ కారణాలతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సైతం ఏడాది క్రితం వరకు గరిష్టంగా 30 రోజులకు గానీ అవి జారీ అయ్యేవి కావు. ఫలితంగా సకాలంలో అవి అందక అక్కడక్కడ కొందరు తమ అవకాశాలను కోల్పోయేవారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అలాంటి వారికి అప్పటికప్పుడే సర్టిఫికెట్ల జారీచేయాలని సంకల్పించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, వివిధ పథకాల లబ్ధిదారులు కీలక సమయాల్లో రెండోసారి అవసరమైతే దరఖాస్తు చేసుకున్న రోజునే ఆ పత్రాలు అందించేలా వీలు కల్పించింది. భవిష్యత్తులోనూ కోటి మందికి అడిగిన రోజునే.. మీ–సేవా కేంద్రాల ద్వారా 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అందులో కొందరు నాలుగైదుసార్లు కూడా వాటిని పొంది ఉండొచ్చని.. అయితే, వాటిని ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు దాదాపు 75 లక్షల మంది ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్లుగా తాము గుర్తించామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అంటే.. 2020 జనవరి 26 నుంచి ఇంకో కోటిన్నర మందికి ఈ పత్రాలు జారీ అయినట్లు వారు తెలిపారు. ఈ పత్రాలను కూడా ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు 75 లక్షల మంది వివరాలను గుర్తించామన్నారు. ఇలా మీ–సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన 75 లక్షల మంది.. గ్రామ సచివాలయాల ద్వారా వాటిని పొందిన 75 లక్షల మంది కలిపి కోటిన్నర దాకా ఉన్నా, కొంతమంది రెండుచోట్ల తీసుకుని ఉండొచ్చన్న భావనతో కనీసం కోటి మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న వారి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల అన్లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ భవిష్యత్‌లో వీటి అవసరం ఎప్పుడు ఏర్పడినా, గతంలో మాదిరిగా 30రోజులు వేచి ఉండే పరిస్థితి లేకుండా దరఖాస్తు చేసుకున్న రోజే వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రం జారీచేసే అవకాశం ఉంటుందన్నారు. -
వచ్చే నెల 15 తర్వాత రాష్ట్రంలో ‘కుల గణన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే(కుల గణన)కు ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా ఈ సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటి వివరాలు సేకరిస్తారు. పారదర్శకత కోసం.. సచివాలయాల వారీగా జరిగిన సర్వేపై మండల స్థాయిలో శాంపిల్‌గా అక్కడక్కడా పది శాతం ఇళ్లకు సంబంధించి సంబంధిత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)ఆధ్వర్యంలో పునః పరిశీలన జరుపుతారు. మూ డో స్థాయిలోనూ.. కింది స్థాయిలో జరిగిన సర్వేపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో అక్కడి స్థానిక ఆర్డీవో ఆధ్వర్యంలోనూ శాంపిల్ పునఃపరిశీలన చేపడతారు. రాష్ట్ర ప్రణాళిక శాఖతో పాటు బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ కుల గణనకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలపై రూపకల్పన జరుగుతోంది. మరో పక్క క్షేత్ర స్థాయిలో సమర్థంగా సర్వే చేపట్టేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం మొబైల్ యాప్‌ను సిద్ధం చేస్తోంది. కులగణన ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కీలక అధికారుల స్థాయిలో రెండు విడతల సమావేశాలు కూడా ముగిశాయి. జనాభా ప్రాతిపదికన సమాన అవకాశాలు పొందేలా దేశ వ్యాప్తంగా కులగణన జరపాలంటూ బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా..ఏపీలో ప్రత్యేకంగా కుల గణన చేపట్టేందుకు సీఎం జగన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే, నవంబర్ 15కు ముందే రాష్ట్రంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు
పేరు కె.పూర్ణచంద్ర. నాలుగేళ్ల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. నెల క్రితం రాయచోటి మండలంలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2019 ఉద్యోగ నియామక రాత పరీక్షలో సంబంధిత కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం కోటప్పనగర్కు చెందిన పులి శ్రీధర్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 2019లో బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. 20 రోజుల క్రితం తెనాలి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. తాను పీహెచ్డీ చేస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందని, అప్పట్లో ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావని కొందరు బెదరగొట్టారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తు చేసుకోవడంతో మంచి జరిగిందన్నారు. తన భార్య కూడా గ్రామ ఉద్యాన సహాయకురాలిగా పనిచేస్తోందన్నారు. కాగా, అప్పట్లో ఇతను రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పదోన్నతులు పొందారు. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్ (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్)గా నియామకమైన వారిలో కొందరు నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. కొత్త బాధ్యతల్లో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 53 ఖాళీ ఉండగా, ఆ పోస్టులన్నింటినీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియను ఉద్యానవన శాఖ నెల రోజుల క్రితమే చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన.. శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితమే పదోన్నతులు పొందగా, మిగిలిన జిల్లాల్లోనూ 35 మందికి పదోన్నతుల ప్రక్రియ పురోగతిలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అంటే.. ఆ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడగానే, ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మండల వ్యవస్థలో 13 ఏళ్లకు ఎంపీడీవో నియామకం నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకం చేపట్టినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు ఇవేవీ శాశ్వత ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఊడతాయేమోనని భయపెట్టాయి. ఆ మాటలు నమ్మని నిరుద్యోగులు అప్పట్లో ఏకంగా 21 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో దాదాపు అందరూ ఏడాది కిందట ప్రొబేషన్ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలుతో కూడిన వేతనం అందుకుంటున్నారు. వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఆ మండలాల్లో పని చేసేందుకు ఉద్దేశించిన కీలక స్థాయి ఎంపీడీవోల ఉద్యోగాలకు తొలివిడత 13 ఏళ్ల తర్వాత 1999లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీడీవోలు పదోన్నతులు పొందడానికి సంబంధించిన సర్వీసు రూల్స్‌కు సైతం 2022 వరకు అతీగతీ లేదు. అప్పడు ఎంపీడీవోగా నేరుగా ఉద్యోగం పొందిన వారికి సైతం 23 ఏళ్ల తర్వాత గానీ పదోన్నతి దక్కలేదు. ఉద్యోగాల భర్తీ ఓ రికార్డు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం ఒక రికార్డు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయడం మరో రికార్డు. ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త శాశ్వత పోస్టు మంజూరు చేయాలంటే నెలలు, ఏళ్లు పడుతుంది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,524 కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేయడం.. ఒకే విడతలో వాటి భర్తీకి నోటిఫికేషన్.. ఏకంగా 21,69,529 మంది దరఖాస్తు.. 35 రోజుల్లోనే రాత పరీక్షల నిర్వహణ.. ఆ తర్వాత 11 రోజులకే ఫలితాల వెల్లడి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. సమస్యల పరిష్కారంపై దృష్టి గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఆయా శాఖల ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో అంత పెద్ద సంఖ్యలో పని చేస్తున్న 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. – లక్ష్మీశ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
Aadhaar Special Camps: 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులుచేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్టు లక్ష్మీశ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు. -
గ్రామ సచివాలయాల్లో ‘సమాచారహక్కు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత తీసుకొస్తూ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయాల స్థాయిలోను సమాచారహక్కు(ఆర్టీఐ) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచారహక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ జీవో నంబరు 437 జారీచేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో సమాచారహక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–ఏపీఐవో), సమాచార హక్కు సంబంధిత అధికారి(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–పీఐవో)లను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐవోగాను, పంచాయతీ కార్యదర్శి పీఐవోగాను కొనసాగుతారని కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా ఆ మండల ఎంపీడీవో పనిచేస్తారని తెలిపారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు
-
ఉద్యమంలా ‘జగనన్న సురక్ష’ .. అక్కడికక్కడే.. 'అప్పటికప్పుడే'
వెంటనే సర్టిఫికెట్లు.. ఈమె పేరు సునీత. వీళ్లది విజయవాడ శివారులోని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామం. జగనన్న సురక్ష క్యాంపులో కుల ధ్రువీకరణ, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం సచివాలయంలో దరఖాస్తు చేశారు. వలంటీర్లు వెంటనే ఇంటికి వచ్చి ఈమెకు అవసరమైన సర్టిఫికెట్ల గురించి వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి ప్రారంభించిన జగనన్న సురక్ష క్యాంపులో అధికారులు వీటిని అక్కడికక్కడే ఉచితంగా అందజేశారు. గతంలో ఒక సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలా ప్రజల వద్దకే పాలనను తీసుకురావడంతో ఇప్పుడు ఆ ఇక్కట్లు తప్పాయి. సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా శనివారం (జులై 1) నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న క్యాంపుల్లో తొలిరోజే భారీ స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే మొత్తం 3,69,373 వినతులను అప్పటికప్పుడే పరిష్కరించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే మండల స్థాయి అధికారులందరూ వచ్చి క్యాంపుల్లో పాల్గొని నిబంధనల మేరకు వాటిని పరిష్కరించారు. సాధారణంగా వారం నుంచి 30 రోజుల వ్యవధిలో జారీచేయాల్సిన వాటిని కూడా రెండు, మూడు గంటల వ్యవధిలోనే అధికారులు అర్జీదారులు కోరిన సర్టిఫికెట్లను అందజేశారు. నిజానికి.. నాలుగేళ్ల క్రితం వరకు ప్రభుత్వాఫీసుల్లో పని కావాలంటే వాటిచుట్టూ రోజులు లేదా నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వినూత్న రీతిలో ప్రభుత్వ పాలనను గడప వద్దకే తీసుకొచ్చేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా.. రాష్ట్రంలో ఎవరికి ఏ పని ఉన్నా వారి సొంత ఊరిలోని సచివాలయాల్లోనే దాదాపు 600 పైగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమ పథకంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా సంతృప్తస్థాయిలో పూర్తి పారదర్శకంగా అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఫలితంగా.. ఇప్పుడు అర్హులెవ్వరూ మిగిలిపోకూడన్న ఆశయంతో ‘జగనన్న సురక్ష’ను చేపట్టింది. ఇందులో భాగంగా.. జులై 31 వరకు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ జూన్ 23న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం నుంచి ప్రారంభమైన సురక్ష క్యాంపుల్లో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలిరోజే 3.69 లక్షలకు పైగా అర్జీల పరిష్కారం.. రాష్ట్రవ్యాప్తంగా 14.28 లక్షల కుటుంబాలు నివాసం ఉండే 1,305 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం ఆయా మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు జరిగాయి. వీటిల్లో 4,42,840 రకాల వినతుల పరిష్కారం కోసం అర్జీదారులు దరఖాస్తు చేసుకోగా, వాటిల్లో 3,69,373 వినతులను అక్కడికక్కడే పరిష్కరించి, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఆయా అర్జీదారులకు అందజేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. తొలిరోజు క్యాంపుల్లో అక్కడికక్కడే పరిష్కరించిన సమస్యల్లో అత్యధికం కొత్త బియ్యం కార్డుల మంజూరు, హౌస్ హోల్డు లిస్టులో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్ధులకు సంబంధించి ఇన్‌కం, కుల ధృవీకరణ పత్రాల జారీ, పలు రకాల ఆధార్ సేవలు వంటివి ఉన్నాయి. కొత్త కార్డుల మంజూరుకు వీలుగా ముందే.. హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఉమ్మడి కుటుంబాలుగా నమోదై ప్రస్తుతం వేరుగా ఉంటున్న వారు కొత్త కార్డుకు అవకాశంలేక ఇబ్బందుల పడుతున్న వారి సమస్యను ప్రభుత్వం ఈ సందర్భంగా జగనన్న సురక్ష పరిష్కరిస్తోంది. స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ (ప్రభుత్వ డేటాలోని కుటుంబ వివరాల్లో కొంతమంది సభ్యుల పేర్ల తొలగింపు) కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దాదాపు 82 వేల వినతులను జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రభుత్వం పరిష్కరించింది. 11 రకాల సేవలు ఉచితంగా.. మండల స్థాయి అధికారులు నిర్వహించే క్యాంపుల్లో అన్ని రకాల వినతులు, ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. అయితే, ఇందులో 1) ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధృవీకరణ) 2) ఆదాయ ధృవీకరణ 3) పుట్టిన రోజు 4) మరణ ధృవీకరణ 5) మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూ కొనుగోలు అనంతరం అన్లైన్లో నమోదు) – మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (అన్లైన్లో భూ వివరాల నమోదులో మార్పులు చేర్పులు) 6) వివాహ ధృవీకరణ (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) 7) ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు 8) ఆధార్‌కార్డులో మొబైల్ నెంబరు అప్డేట్ 9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) 10) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన 11) స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సంబంధింత సర్వీసులకు ఈ క్యాంపుల్లో ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ప్రభుత్వం వీటిని జారీచేస్తోంది. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇక ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి అనేకమంది రైతులు సీసీఆర్సీ కార్డులు పొందారు. క్యాంపులు తమకు బాగా ఉపయోగపడ్డాయని వారు ఎక్కడలేని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆధార్ డెస్‌్కలో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింకింగ్ సేవలూ అనేకమంది అందుకున్నారు. అలాగే, మ్యుటేషన్ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్ చేసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరిస్తున్నారు. సేవలు మరింత విస్తృతం ఈ ప్రభుత్వం రాకముందు గతంతో 2–3 గ్రామాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వోద్యోగులు ఉండేవారు. కానీ, నేడు సచివాలయ పరిధిలో కనీసం 10–11 మంది ఉండడంతో ఇలాంటి క్యాంపుల ద్వారా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. అంతేకాక, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయి. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్య సేవలు కూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు. -
‘జగనన్న సురక్ష’ క్యాంపులు ఖరారు
సాక్షి, అమరావతి: ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీన రాష్ట్రవ్యాప్తంగా 1,297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఏ సచివాలయం పరిధిలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తారనే వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే తెలియజేశారు. తొలిరోజు జూలై 1వతేదీన 1,297 సచివాలయాల వద్ద ఈ క్యాంపులు ప్రారంభమవుతాయి. జూలై 3వతేదీన 410 సచివాలయాల వద్ద, నాలుగో తేదీన 934 సచివాలయాల వద్ద క్యాంపులు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 15,004 సచివాలయాల వద్ద నిర్దేశిత తేదీల్లో క్యాంపులు జరుగుతాయి. జూలై 31వ తేదీతో ఈ క్యాంపుల నిర్వహణ పూర్తి కానుంది. మైకులో ప్రచారం.. వాట్సాప్.. ఎస్సెమ్మెస్‌లు ఏ సచివాలయం పరిధిలో ఏ తేదీన క్యాంపు జరుగుతుందన్న వివరాలను వారం రోజుల ముందే మైక్ ద్వారా ప్రచారం చేస్తారు. అదే రోజు వలంటీర్లు ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి క్యాంపు వివరాలను వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు అర్హులకు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమో ముందుగా తెలియజేస్తారు. క్యాంపు జరగటానికి నాలుగు రోజుల ముందు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పనిచేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికీ సమాచారం ఇస్తారు. దీంతోపాటు క్యాంపు నిర్వహణకు ఒక్క రోజు ముందు ఆయా సచివాలయాల పరిధిలో నమోదైన ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా కూడ సమాచారం చేరవేస్తారు. ఈ మేరకు క్యాంపుల నిర్వహణ, ఇంటింటికీ వలంటీర్ల సందర్శనకు సంబందించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందించి అన్ని జిల్లాలు, మండల స్థాయి అధికారులకు పంపింది. ఏడు రోజుల ముందు ఆన్లైన్ టోకెన్లు.. సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులు సజావుగా కొనసాగేలా క్యాంపు నిర్వహణకు ఏడు రోజుల ముందు అర్జీదారుల నుంచి వినతుల స్వీకరణతో పాటు వరుస క్రమంలో టోకెన్లను జారీ చేస్తారు. ఈమేరకు ఏడు రోజుల ముందు ఆన్లైన్లో టోకెన్లు జారీ చేసేలా సచివాలయ ఉద్యోగులకు సాఫ్ట్వేర్ అందుబాటులో వస్తుంది. ఒక దరఖాస్తుదారుడు రెండు రకాల వినతులు అందజేస్తే సంబంధిత వ్యక్తికి రెండు టోకెన్లు జారీ చేస్తారు. ముందుగా టోకెన్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే క్యాంపుల్లో సర్వీసు చార్జీ మినహాయింపు ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేసిన ఎస్‌వోపీలో స్పష్టం చేసింది. 13 ప్రశ్నలతో వలంటీర్ల ఇంటింటి సర్వే.. ఈ కార్యక్రమంలో భాగంగా వలంటీర్ల ఇంటింటి సందర్శన సమయంలో ప్రతి ఇంటి నుంచి వివరాల సేకరణకు మొత్తం 13 రకాల ప్రశ్నలతో గ్రామ, వార్డుసచివాలయాల శాఖ యాప్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి వివరించడంతోపాటు అర్హులు ఆయా పథకాలను పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అని పరిశీలిస్తారు. ప్రభుత్వం జారీచేసే వివిధరకాల ధ్రువీకరణ పత్రాల గురించి తెలియచేసిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. -
AP: బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్‌లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీ శుక్రవారం శాఖ అధికారులతో సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యే సమయానికి ముందే జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. బదిలీల ప్రక్రియ షెడ్యూల్ (జిల్లా పరిధిలో) ఇలా.. - జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది : మే 28 - ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ : జూన్ 3 - ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ : జూన్ 6 - వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది : జూన్ 6 - తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడి : జూన్ 6 - బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు : జూన్ 8, 9, 10 - బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివరాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేది : జూన్ 8, 9, 10 - బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ : జూన్ 10 వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారి కోసం.. - జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేది : మే 28 - ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేది : జూన్ 3 - వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది : జూన్ 8 (ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండలం లేదా పట్టణం వివరాలు నమోదు) - బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీ : జూన్ 8, 9, 10 - కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ : జూన్ 8, 9, 10 - బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేది : జూన్ 10. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు..
సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ శనివారం ఉత్తర్వులిచ్చారు. గ్రామాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని ఆదేశాలిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ.1,750 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా అందజేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మేరకు పింఛన్ డబ్బులను ఆయా సచివాలయాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఒకరు బ్యాంక్‌కు వెళ్లి ఆ డబ్బులను తీసుకువచ్చి.. వలంటీర్లకు అప్పగిస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నగదు విత్ డ్రా చేసి తీసుకెళ్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మళ్లీ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ 3న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఓ సచివాలయ మహిళా ఉద్యోగి బ్యాంక్ నుంచి రూ.16.15 లక్షలు తెస్తుండగా.. దొంగలు దోచుకెళ్లారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసిన దగ్గర నుంచి వలంటీర్లు నగదు పంపిణీ చేసే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులిద్దరూ నగదుకు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలోనే సొమ్మును విత్ డ్రా చేయాలన్నారు. ఇది కూడా చదవండి: ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా.. -
ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమిది.. సీఎం జగన్ చేసిన మేలును మరువం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఆధార్ తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?
సాక్షి, అమరావతి: ‘ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్‌లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్ కార్డును అదే అడ్రస్ ప్రూఫ్‌తో అప్డేట్ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చింది. ‘ఆధార్‌ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూఐడీఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్‌ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్డేట్ చేయకపోవచ్చు. కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్ కుమార్ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ సమయంలో ప్రతి ఆధార్ కార్డుదారుడు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్డేట్ కాని కార్డులు 1.65 కోట్లు.. 2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్‌కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్ అప్డేట్ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేక క్యాంపులు ఆధార్ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
సచివాలయాల ద్వారా 3.64 కోట్ల సేవలు
యడ్లపాడు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తమ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు 3.64 కోట్ల సేవలను అందించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఇది మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఉపాధిహామీ పథకం కింద రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలను నిర్మించారని, ఇది దేశ చరిత్రలోనే మహాయజ్ఞమని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం 1.34 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వీరిలో 85 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమన్నారు. ప్రతి సచివాలయం ద్వారా 540 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామన్నారు. 50 కుటుంబాలకు ఒక వలంటీర్ వంతున లక్షలమందిని నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఒక్క వంకాయలపాడు సచివాలయం పరిధిలోనే నాలుగువేలకుపైగా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించినట్లు చెప్పారు. టీడీపీ హయాంలో అంతా దుర్మార్గమేనని చెప్పారు. అప్పట్లో జన్మభూమి కమిటీలకు నచ్చిన, వారి పార్టీకి చెందిన, లంచం ఇచ్చిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేవన్నారు. -
AP: 63.87 లక్షల మందికి రూ.1,759.99 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 63,87,275 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,759.99 కోట్లను పంపిణీ చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదురోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్
సాక్షి, అమరావతి: వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ చార్ట్ ఇచ్చింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్–1, 2, 3 గ్రామ సర్వేయర్లకు జాబ్ చార్ట్‌లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులిచ్చారు. వీఆర్వోల జాబ్ చార్ట్.. తుపాన్లు, వరదలు, ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వహణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల రీ సర్వే కార్యకలాపాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం లాంటి పనుల్ని నిర్దేశించారు. పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ, రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్‌కు నివేదించడంతోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్‌లో పేర్కొన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధాన్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలతోపాటు అనుమతించిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్‌లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు) స్వీకరించి పరిష్కరించాలి. సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే. గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అందే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు రిఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరి చేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్ని తనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేయించి నిర్వహణ చేపట్టాలి.నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే సెటిల్మెంట్ కమిషనర్‌కు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్, డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. -
Grama, ward Sachivalayam: సేవల్లో రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 25న ఒక్క రోజులో ఏకంగా 2.88 లక్షల మంది వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలెవరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలు లేదంటే దగ్గర్లోని పట్టణాలు లేదా జిల్లా కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి సొంత ఊర్లోనే ఆయా పనులయ్యేలా ఓ వినూత్న, విప్లవాత్మక ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఈ పనులు దాదాపు పరిష్కారమయ్యేలా 2020 జనవరి 26 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకు గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలను పొందారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలను మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది. కానీ, గత బుధవారం ఒక్కరోజే 2.88 లక్షల మంది వివిధ రకాల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో అదేరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అది లేకుండా ఉంటే సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు తెలిపారు. 65 శాతానికి పైగా రెవెన్యూ సేవలే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లల్లో ప్రజలకు అందించిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా.. ఈ నెల 25న పరిష్కరించిన 2.88 లక్షల వినతులను చూసినా.. అందులో 65–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం ఒక రైతు తన సొంత పొలం వివరాలను పాస్ పుస్తకంలోగానీ, రెవెన్యూ శాఖ మీ–భూమి రికార్డులోగానీ నమోదు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవారు. నెలల తరబడి మండలాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని పరిస్థితి. లంచాల బెడద వీటికి అదనం. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులో భూమి బదిలీకి సంబంధించి జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వారి సొంత గ్రామాల్లోని గ్రామ సచివాలయాలోనే అత్యంత సులువుగా, ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోనే పూర్తిచేసి ఆ సమాచారాన్ని సంబంధిత యజమానికి మెసేజ్ పంపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఈసీ జారీ కూడా సచివాలయాల ద్వారానే లభిస్తోంది. అలాగే, ఆదాయ, కుల ధృవీకరణ ప్రతాలు వంటి వాటికి గతంలో 30 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సగటున ఐదు రోజుల వ్యవధిలో సంబంధిత తహసీల్దార్ ఆమోదం పూర్తయి, సర్టిఫికెట్లను కూడా సచివాలయాల్లోనే జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 25న అందజేసిన సేవలలో కూడా రెవెన్యూ సంబంధిత సేవలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జగనన్న చేదోడు పథకం తుది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ రోజు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. సేవల సంఖ్య, నాణ్యతలో పెరుగుదల ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కాలేదు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, సేవల నాణ్యత పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టింది. ఉదా.. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఆధార్ వివరాలతో అనుసంధానం చేసి అమలుచేస్తుండడంతో ప్రభుత్వం కొత్తగా సచివాలయాల్లో ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ► రాష్ట్రంలోని ప్రతి ఐదు గ్రామ సచివాలయాల్లో ఒకచోట చొప్పున 2,377 సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటిదాకా ఆధార్ సేవలు లేని ప్రాంతాలను గుర్తించి ఆయా సచివాలయాల్లోనే ముందుగా వీటిని ఏర్పాటుచేశారు. ► అలాగే, ఇళ్లు, భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను సైతం ప్రభుత్వం సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది. 1,537 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్థానిక సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేసింది. వీటిల్లో 51చోట్ల ఇప్పటికే ఆ సేవలు ప్రారంభయ్యాయి. ► గత ఏడాది కాలంలో కొత్తగా మున్సిపల్ ప్రాంతాలకు సంబంధించి నీటి, ఆస్తిపన్నులు, ట్రాఫిక్ చలానాలు, రైతుల నీటి తీరువా బిల్లుల చెల్లింపులనూ ప్రభుత్వం సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు నాంది పలికిన తర్వాత ప్రభుత్వంతో ఏ చిన్న పనిపడినా రోజుల తరబడి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెరిగి లంచాలకు తావులేకుండా పోయింది. రాబోయే రోజుల్లో సచివాలయాల్లో మరిన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడు సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడే వాటిని పరిష్కరించడానికి జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏర్పాటుచేస్తోంది. అలాగే, సేవలు అందజేసే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన శిక్షణనూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంటినుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సంబంధిత సర్టిఫికెట్ల సాఫ్ట్ కాపీలను వాట్సాప్ లింక్ ద్వారా పంపేందుకు యత్నిస్తున్నారు. -
సచివాలయాల ఉద్యోగులకు ‘ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పని తీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఉద్యోగి పనితీరు సూచికలు)ను రూపొందిస్తోంది. సచివాలయాల్లో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్చార్ట్ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ ఆధారంగా మండల స్థాయి అధికారులు ప్రతి నెలా వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. సంతృప్తికరం (గుడ్), తృప్తికరం (ఫెయిర్), పర్వాలేదు (శాటిస్ఫై), అసంతృప్తికరం (నాట్ శాటిస్ఫై)గా రేటింగ్ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్ పొందే ఉద్యోగులకు మెళకువలు పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు పనితీరు అంచనా వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్లలోనే ఉద్యోగుల పని తీరు నిరంతర అంచనా అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జాబ్ చార్ట్‌లను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఇటీవల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉద్దేశించిన కొన్ని సుస్థిర అభివృద్ధి సూచికలు (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్)ను రూపొందించుకొని ఆ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన సచివాలయాల ఉద్యోగులకు కూడా ఈ సుస్థిర అభివృద్ధి సూచికల ప్రకారం పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందిస్తోంది. వీటి రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఆయా ఉద్యోగుల విధులకు సంబంధించిన శాఖలకే అప్పగించింది. ఇప్పటివరకు ఆరు శాఖలు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందించి, ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు పశు సంవర్ధక శాఖ, మహిళా పోలీసు ఉద్యోగులకు హోం శాఖ, ఏఎన్ఎంలకు వైద్య, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆరు కేటగిరీల ఉద్యోగులకు పట్టణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రూపొందించాయి. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరికీ వారి జాబ్ చార్ట్ ప్రకారం వంద మార్కులు ఉంటాయి. పని తీరు ఆధారంగా మార్కులు వేస్తారు. డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా రేటింగ్ ఇచ్చారు. 90కిపైగా మార్కులు తెచ్చుకొనే డిజిటల్ అసిస్టెంట్లకు ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తారు. 75 – 90 మార్కులు వచ్చేవారికి గుడ్ రేటింగ్, 50 – 75 మధ్య మార్కులు వచ్చేవారికి ఫెయిర్, 50 మార్కులకు కన్నా తక్కువ తెచ్చుకునే వారికి పూర్ రేటింగ్ ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన శాఖలు కూడా త్వరలో ఇండికేటర్స్ రూపొందిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది. అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్ (ఓఎమ్మార్ షీట్– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మూడో విడతలో పలు మార్పులు – గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. – తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు. – ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. 8 లక్షల దరఖాస్తులు అంచనా.. – వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు. – మొదటి విడత నోటిఫికేషన్లో గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. – 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. – ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. – మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు çపరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి. కేటగిరీల వారీగా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖలు రోస్టర్– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. -
AP: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..
సాక్షి, అమరావతి: ఆధార్‌లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేస్తోంది. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
ప్రతి సచివాలయం ఒక రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు, సచివాలయం ఒక రిజిస్ట్రార్ కార్యాలయంగా మారబోతోందని, తద్వారా మరింత పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి, సత్ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని సాహసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. వీటి ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్ధవంతమైన, వివాదరహితమైన సేవలు అందుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే) ద్వారా అనేక భూముల వివాదాలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కోస్తాంధ్ర జిల్లాల రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతల్లో చూపించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రజల ముంగిటకే పారదర్శక పాలన తెచ్చారని, దీన్ని ప్రజలు ఎంతగానో స్వాగతిస్తున్నారని చెప్పారు. అసైన్డ్ భూములపై అధ్యయనానికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల రీసర్వేలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల చొరవ అభినందనీయమని అన్నారు. భూ వివాదాలు పరిష్కారమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలవారికి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే), ఇళ్ల పట్టాల పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాదాలు, సాదా బైనమా, ఆర్వోఆర్, ఆర్వోఎస్ఆర్ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణ, అనాధీన భూములు, ఈ–పంట తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించనున్నట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖకు జవసత్వాలను తీసుకొచ్చి సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చాలనే ఏకైక లక్ష్యంగా పనిచేద్దామన్నారు. వెబ్‌ల్యాండ్ ఎంట్రీలపై గతంలో కొన్ని విమర్శలు వచ్చేవని, రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటోమ్యుటేషన్ చేసి విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, తర్వాతి సదస్సు విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాబు వ్యాఖ్యలు దారుణం
సాక్షి, అమరావతి: మహిళా పోలీసులు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా అవమానించారని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే వ్యక్తి.. ఈ విధంగా మహిళలను కించపరచడం దారుణమని పేర్కొంది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గురువారం మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి.మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్ దుర్గా, గౌసియాబేగం, గీత తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. చదవండి: (Fact Check: ప్రాణాలు పోతున్నా టీడీపీ ప్రచార యావ.. ఈ వీడియోలే నిదర్శనం) -
30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్’ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
సచివాలయాల సేవలూ ఇంటి వద్దకే!
సాక్షి, అమరావతి: ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో సినిమా, బస్, రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టే.. గ్రామ, వార్డు సచివాలయాల సేవలు కూడా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రజలు ఇంటి వద్దనే ఉండి దరఖాస్తు చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతోంది. దీని ద్వారా ప్రభుత్వం సచివాలయాల్లో అందజేస్తున్న 545 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. ఇంట్లో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ ఉంటే చాలు.. ఎవరైనా తమ వ్యక్తిగత మెయిల్ ఐడీల ద్వారా 545 రకాల ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి వద్దే ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత గ్రామం దాటి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే 545 రకాల ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసే పింఛన్లు, రేషన్ వంటివాటిని ఇప్పటికే వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వం చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి సచివాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లనుంది. ఈ క్రమంలో ఎవరైనా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు నేరుగా ఆయా శాఖల సిబ్బందికి చేరతాయి. వాటి ఆమోదం అనంతరం తిరిగి మెయిల్ ఐడీ ద్వారా ఆ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటి వద్దనే పొందే వీలుంటుందని అధికారులు వెల్లడించారు. -
Fact Check: బాండ్లు లేకున్నా బీమాకు అర్హులే.. ‘ఈనాడు’ మరో తప్పుడు కథనం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా కార్యక్రమంపై ఈనాడు దుర్బుద్ధితో అసత్య కథనాలను ప్రచురించింది. ‘దక్కని భరోసా’ శీర్షికతో సోమవారం ఎల్లో మీడియా ప్రచురించిన కథనంలో ఏమాత్రం నిజం లేదు. ‘ఈనాడు’ ఆరోపణ గ్రామ, వార్డు సచివాలయాల్లోని 80 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రతి నెలా రూ.6.80 కోట్ల సొమ్మును గ్రూపు ఇన్సూరెన్స్ ప్రీమియంగా తీసుకుంటున్న ప్రభుత్వం వారికి బాండ్లను మాత్రం జారీ చేయలేదు. అనుకోని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవం: ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి ప్రీమియాన్ని మినహాయించి చెల్లించిన నాటి నుంచి ఆ ఉద్యోగులందరికీ బీమా వర్తిస్తుంది. బీమా చట్టం 1938 సెక్షన్ 64 (వి)(బి) అధికారికంగా బాండ్ జారీ చేసే వరకూ జీతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రమే బాండ్‌గా పని చేస్తుందని స్పష్టం చేస్తోంది. ఈ నిబంధన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుందని సచివాలయ శాఖ పేర్కొంది. ‘ఈనాడు’ ఆరోపణ ఒక్కో ఉద్యోగి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు రూ.850 చొప్పున మినహాయించుకుంటున్నారు. వాస్తవం: ఈ ఏడాది జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 5 ప్రకారం 1,00,724 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు పూర్తయింది. ఈ ఉద్యోగులందరికీ జీతం నుంచి ప్రీమియం మినహాయించి ఏపీజీఎల్ఐకి చెల్లిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 18న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో 198 ప్రకారం నెలవారీ ప్రీమియం రూ.500 నుంచి రూ.800కి పెరిగింది. ‘ఈనాడు’ ఆరోపణ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్న నాటి నుంచి ఐదు నెలల వ్యవధిలో పది మంది ఉద్యోగులు మృతి చెందారు. తాము ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదని బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు. వాస్తవం: ఈ మధ్య కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన 8 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించినట్లు అధికారులు గుర్తించారు. ప్రీమియం చెల్లించే ఉద్యోగులలో ఎవరైనా చనిపోయినా, బాండ్లు జారీ కాకపోయినా సంబంధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం బీమా పరిహారం చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వ జీవిత బీమా శాఖ (ఏపీజీఎల్ఐ) డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతం నుంచి ప్రీమియం మినహాయించి చెల్లించిన నాటి నుంచి ఆ ఉద్యోగులందరికీ బీమా వర్తిస్తుందని గతంలోనే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొనడంతో పాటు బాండ్లు లేవన్న కారణంగా దరఖాస్తులను నిరాకరించరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి బీమా పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే బాండ్లు లేకపోయినా జిల్లాలో సంబంధిత విభాగాల అధికారులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ‘ఈనాడు’ ఆరోపణ సచివాలయాల శాఖ అధికారులను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. వాస్తవం: బాండ్లు లేకపోయినా ఇప్పటికే చనిపోయిన వారికి నిబంధనల ప్రకారం బీమా పరిహారం అందజేసే అంశంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రీమియం చెల్లిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బీమా పాలసీ బాండ్లు జారీ చేయాలని ఏపీజీఎల్ఐ డైరెక్టర్‌కు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం నవంబరు 1వ తేదీనే లేఖ రాసింది. దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి ప్రత్యక్ష పద్ధతిలో బాండ్ల జారీ కంటే అందరికీ సీఎఫ్ఎంఎస్ ద్వారా డిజిటల్ బీమా బాండ్ల జారీకి ప్రభుత్వ బీమా శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి చర్యలు చేపట్టింది. -
సచివాలయ సిబ్బందికి ‘బోధనేతర’ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిలో పలు బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా విడుదల చేసింది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్త, ప్రాథమిక వైద్యాధికారులు వివిధ పర్యవేక్షణ బాధ్యతల్లో పాల్గొంటారని పేర్కొంది. వారు తమ పరిధిలోని స్కూల్‌ను సందర్శిస్తూ బోధనేతర కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలోని పాఠశాలను కనీసం వారానికొకసారి సందర్శించి పిల్లల హాజరును పరిశీలించాలి. హాజరు తక్కువగా ఉన్న పిల్లల తలిదండ్రులతో మాట్లాడి.. వంద శాతం హాజరుకు అవసరమైన కృషి చేయాలి. పాఠశాలలోని పరిస్థితులే కారణమైతే.. వాటిని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. పౌష్టికాహారం అందేలా.. మధ్యాహ్న భోజన రికార్డులను కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలే పరిశీలించాల్సి ఉంటుంది. వారానికొకసారి స్కూల్‌ను సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజన రికార్డుల పరిశీలనతో పాటు మెనూ ప్రకారం భోజనం రుచిగా, శుచిగా ఉందా అనే వివరాలను సేకరించాలి. ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్ కమిటీతో కలిసి పరిష్కారానికి కృషి చేయాలి. ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ పరిధిలోని స్కూళ్లను సందర్శించి.. పిల్లల పౌష్టికాహార పరిస్థితులు అంచనా వేయాలి. వ్యాధి నిరోధక టీకాలతో పాటు స్థానిక వైద్యాధికారి, ఆశా వర్కర్‌తో కలిసి పిల్లలకు వైద్య సహాయం అందించాలి. భద్రతపై విద్యార్థినులకు అవగాహన.. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేసి.. దానిని సచివాలయ మహిళా పోలీస్ పర్యవేక్షించాలి. అలాగే విద్యార్థినులకు తరుచూ సమావేశాలు నిర్వహించి.. వారి భద్రతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించాలి. అలాగే నాడు–నేడు పనులను సంబంధిత పాఠశాల పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తారు. పిల్లల అభిప్రాయాల మేరకు పాఠశాలలో అవసరమైన మరమ్మతులను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గుర్తించి.. పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల భాగస్వామ్యంతో నాడు–నేడులో ఆ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రతపై నెలవారీ సమీక్ష బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. వీరు ఉన్నతాధికారుల సహాయంతో నీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. -
వద్దంటున్నా పెళ్లి సంబంధాలు.. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: దేవరాపల్లికి చెందిన సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వద్దని వారించినా కుటుంబీకులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో వరుణ్‌కుమార్ దేవరాపల్లిలోని తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలివి. దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌కుమార్ (31) ఇదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌కుమార్ నిరాకరించాడు. అయినా కుటుంబసభ్యులు తనకు సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి రెండో అంతస్తులో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వరుణ్‌కుమార్ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతను ఫోన్ ఎంతకీ తీయకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి శ్లాబ్ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. చదవండి: (Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్) ఊపిరి ఉందేమోనన్న ఆశతో తాడు తొలగించి కిందికి దించారు. అప్పటికే వరుణ్‌కుమార్ మృతి చెందాడని నిర్ధారించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లితో పాటు కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. తోటి సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామస్తులు వరుణ్‌కుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పరామర్శ వరుణ్ కుమార్ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతదేహానికి అనకాపల్లిలో పోస్టుమార్టం నిర్వహించి త్వరగా పంపించాలని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్లో డిప్యూటీ సీఎం ఆదేశించారు. -
క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి
సాక్షి, అమరావతి: ఇక్కడ కూర్చుని అంకెలతో అంతా బాగుందనే గత పాలకుల మూస ధోరణికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలు సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలి దశలో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల క్లస్టర్ల వారీగా వలంటీర్లు 1.52 కోట్ల కుటుంబాల ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఆ సర్వే ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. వీటి ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రగతి లక్ష్యాల అమలు తీరు తెన్నులను తెలుసుకొనేందుకు, వాటిని మరింత మెరుగ్గా అమలు చేసి, లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పదిహేను రోజులకో సారి ఒక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా తనిఖీలకు వెళ్లాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు నెలకు కచ్చితంగా రెండు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలని తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా తొలి దశలో మహిళా శిశు సంక్షేమం, విద్యకు సంబంధించిన 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పింది. వాటి అమలులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది, సమర్ధంగా అమలయ్యేలా సచివాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిగా సఫలమయ్యాక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని తెలిపింది. సచివాలయాల నుంచి సేకరించిన వివరాలు, ఇంటింటి సర్వే సమాచారంతో పాటు వారు గమనించిన పరిస్థితులపైన కూడా రిమార్కు రూపంలో ఇవ్వాలని తెలిపింది. సచివాలయం నుంచి సేకరించాల్సిన సమాచారమిది.. ► సచివాలయం పరిధిలో కౌమారదశలో ఉన్న (10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు) మహిళలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి రక్తహీనత ఉంది? వారు ఎంత శాతం ఉన్నారు? రక్తహీనత ఉన్న వారికి ఐఎఫ్ఏ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందిస్తున్నారా? ► గర్భిణులు ఎంత మంది ఉన్నారు? 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత మంది? వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం రెగ్యులర్‌గా అందిస్తున్నారా ? ► ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు? ఎదుగుదల లేక కుంచించుకపోయిన పిల్లలు ఎంత మంది? వారికి సకాలంలో టీకాలు, నులిపురుగుల నివారణ మందులు, పోషకాహారం అందిస్తున్నారా? మహిళా పోలీసులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారా లేదా? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు? ఈ పిల్లలకు పూర్తిగా టీకాలు వేశారా? పోషకాహారం, మందులు అందిస్తున్నారా లేదా? ► ప్రాథమిక విద్యలో 1 నుంచి 8వ తరగతి వరకు నికర నమోదు రేషియో ఎలా ఉంది? 6 నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంత మంది ఎలిమెంటరీ స్కూల్స్‌లో నమోదయ్యారు? డ్రాపవుట్లు ఉంటే అందుగల కారణాలు ఏమిటి? ► ఉన్నత సెంకడరీ విద్య 11 – 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి విషయంలో సంక్షేమ, విద్యా అసిస్టెంట్ ఎలా పనిచేస్తున్నారు? 16 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల వారు ఎంత మంది ఉన్నారు? వీరిలో ఎంత మంది ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐలో నమోదు అయ్యారు? డ్రాపవుట్స్ ఉంటే అందుకు కారణాలు ఏమిటి? ► ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని స్కూల్స్‌కు కనీస వసతులైన మంచినీరు, విద్యుత్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేవు? వసతుల్లేకపోవడానికి కారణాలు ఏమిటి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఎన్ని స్కూళ్లకు బాలికల కోసం విడిగా టాయిలెట్లు ఉన్నాయి? ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణాలు ఏమిటి? -
‘ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలే’
విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారని బొత్స కొనియాడారు. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల సంస్థ ఆవిర్భావ సభలో బొత్స మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలే. గ్రామ సచిలాలయ ఉద్యోగులు నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పనులు జరుగుతున్నాయి. నీతి ఆయోగ్ బృందం సచివాలయ వ్యవస్థను అభినందించింది. ఆర్బీఐ కేంద్రాలను దేశమంతటా ఏర్పాటు చేయాలని కేంద్రం చూస్తోంది. సచివాలయ ఉద్యోగులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని బొత్స పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘గ్రామ సచివాలయ ఉద్యోగుల భవిష్యత్‌కు రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నాం. గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయం’ అని పేర్కొన్నారు. -
ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు
గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన, వినూత్న చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం ఒక సాహసోపేతమైన ప్రయోగం. మొత్తంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. – కేంద్రానికి నిపుణుల బృందం నివేదిక నిన్న ఆర్బీకేలు.. నేడు గ్రామ సచివాలయాలు!.. వ్యవసాయ ఉపకరణాల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల దాకా.. అవసరం ఏదైనా సరే ఆగమేఘాలపై సేవలు అందిస్తున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం సాకారమైంది.. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నదాతలకు ఆర్బీకేలు అందిస్తున్న సేవల పట్ల ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు సమర్ధంగా ప్రజలకు చేరే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిఫుణుల కమిటీ సూచించింది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి ఆరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ నేతృత్వంలో సామాజిక, ఆర్థికాభివద్ది, సోషల్ ఇంజనీరింగ్ తదితర రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది ఓ కమిటినీ నియమించింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఫిబ్రవరి 17 – 27వ తేదీల మధ్య నలుగురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీల్లో పర్యటించింది. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సొంత పథకాలతో మరింత సాయం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సహా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న విధానాలను అనుసరిస్తూ ప్రత్యేక స్థానంలో నిలిచిందని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. రెండు విధానాలు మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ఆంధ్రప్రదేశ్ పలు సొంత పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం ఇందులో ఒకటి. ఇక రెండోది.. కేంద్ర పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అదనపు సాయాన్ని జోడిస్తోంది. తద్వారా కేంద్రం నిర్దేశించిన దానికంటే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నట్లు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. పింఛన్ల పంపిణీ విధానం అనుసరణీయం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే రూ.2,500 – రూ.10,000 చొప్పున వివిధ కేటగిరీల వారికి సామాజిక పింఛన్లను టంచన్‌గా పంపిణీ చేయడాన్ని నిపుణుల కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో సైతం లేని విధంగా భారీ స్థాయిలో ప్రతి నెలా దాదాపు 62 లక్షల మందికి సక్రమంగా పింఛన్ల పంపిణీ జరుగుతున్న విషయాన్ని నివేదికలో ఉదహరించింది. పేదలకు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోందని తెలిపింది. ప్రతి నెలా ఒకటవ తేదీ సాయంత్రం 3 – 4 గంటలకే 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతోందని, ఎలాంటి పడిగాపులు లేకుండా వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే డబ్బులు అందిస్తున్నారని ప్రశంసించింది. వివిధ కారణాలతో మిగిలిపోయిన మరో పది శాతం మందికి రెండు మూడు రోజుల్లోగా ఇళ్ల వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీలో ఈ విధానాన్ని అమలు చేయడం పేదలకు ఎంతో ప్రయోజనకరమని కమిటీ కేంద్రానికి సూచన చేసింది. సచివాలయ ఉద్యోగుల సేవలతో.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల తరహాలో దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు కోసం సిబ్బంది నియామక నిష్పత్తిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో దాదాపు పది మంది ఉద్యోగులు పని చేస్తుండడాన్ని కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం, కార్యక్రమాన్ని అమలు చేసినా క్షేత్రస్థాయిలో సమర్ధంగా అందాలంటే గ్రామ స్థాయిలో తగినంత మంది సిబ్బంది అవసరమని కమిటీ పేర్కొంది. ‘పంచాయతీల స్థాయిలో సచివాలయ భావనతోపాటు ఉద్యోగులు రోజూ నిర్ణీత సమయం కార్యాలయంలో అందుబాటులో ఉండడం వల్ల ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
సచివాలయాలు భేష్
తగరపువలస (భీమిలి): రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందని న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్ (ఐఐపీఏ) బృందం కితాబిచ్చింది. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యులున్న ఈ బృందం గురువారం విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు వీరు రెండు బృందాలుగా విడిపోయి టి.నగరపాలెం, దాకమర్రి పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, మిషన్ అంత్యోదయ, పీఎంఏవై, ఎస్బీఎం, ఎన్‌ఆర్‌ఐఐఎం, ఎస్ఎస్ఏ అమలు తీరుపై లబ్ధిదారులతో విడివిడిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. స్థానిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులను పిలిచి వారి బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచనని చెప్పారు. రెండు వారాలకు ఒకసారి ఫ్యామిలీ ఫిజీషియన్ సందర్శించడం బాగుందన్నారు. సామాజిక పింఛన్లు డీఎం అండ్ హెచ్‌వో పెన్షన్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవై హౌసింగ్ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో పంచాయతీల వారీగా మృతులు, వ్యాక్సినేషన్, తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల్లో అమలవుతున్న ఆహారం, పౌష్టికాహార కిట్ల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలని పేర్కొన్నారు. బృందంలో అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు బృందంలో కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు ఉన్నారు. ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎంపీడీవో ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శోభారాణి, సర్పంచ్‌లు పొట్నూరు ఛాయాగౌతమి, చెల్లూరు పైడప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, చెల్లూరు నగేష్, పీహెచ్సీ వైద్యుడు ఎ.బి.మల్లికార్జునరావు, కార్యదర్శులు రఘునాథరావు, శంకర్ జగన్నాథ్, లోకేశ్వరి, తెలుగు అనువాదకుడు టి.ఎస్.వి.ప్రసాదరావు ఈ బృందానికి, ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించారు. -
రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సర్వే
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు ఆసక్తిగల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహిస్తోంది. వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి నిరుద్యోగ యువత పేర్లను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అభ్యర్థికి ఆసక్తిగల కోర్సు, ఏ ప్రాంతంలోని స్కిల్ హబ్‌లో శిక్షణ పొందాలనుకుంటున్నారో కూడా నమోదు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండటంతోపాటు అవసరమైనచోట వారి సేవలను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,655 మంది పేర్లను స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13,056 మంది అభ్యర్థుల పేర్లు స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదయ్యాయి. ఈ సర్వేకి సంబంధించి విస్త్రత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ సర్వే పురోగతిని ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. -
రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు ముందు ఓ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
లక్ష్యం.. వాస్తవ ప్రగతి
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి.. అందమైన అంకెల రూపంలో చూపడం కాదు. ప్రతి అంశంలోనూ సాధించాల్సిన ప్రగతిపై క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేపట్టాలి. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, లక్ష్య సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుంది. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, తాగునీటిపై శ్రద్ధ చూపాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరును మండలాల వారీగా ఆయా విభాగాలకు చెందిన అధికారులు పర్యవేక్షించేలా ఎస్‌వోపీలను రూపొందించాలని సూచించారు. మండల స్థాయిలో అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు నెలకు రెండుసార్లు ఆయా సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సిబ్బంది సమర్థత పెంచాలని నిర్దేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి ఎప్పటికప్పుడు నమోదు గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తెచ్చింది. అలాంటి సచివాలయాలపై నిరంతర పర్యవేక్షణ, ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా కీలకం. లేదంటే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. నిశిత దృష్టి, జవాబుదారీతనం.. ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటాను నిక్షిప్తం చేయడంతోపాటు వచ్చిన మార్పులు చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలుంటే సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. తద్వారా ఆ సమస్య ఇక పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి. సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. వివిధ ప్రభుత్వ విభాగాల తరపున గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు సచివాలయాలను చోదక శక్తిలా వినియోగించుకునేలా సిబ్బందిని çపూర్తి స్ధాయిలో భాగస్వాములుగా చేయాలి. సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌వోపీలను మరోసారి పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేయాలి. సమర్థత పెంచేలా సచివాలయాల సందర్శన.. మండల స్థాయిలో ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన అధిపతి ప్రతి నెలా రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సమర్థత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సిబ్బంది ఎఫిషియన్సీ పెంపొందించేలా చూడాలి. ఆయా శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఎలా కృషి చేస్తున్నారో పరిశీలన చేయాలి. ప్రతి విభాగంలోనూ పర్యవేక్షణ ఉండాలి. ఏ విభాగంలోనైనా సంబంధిత అధికారి లేకుంటే ఆయా విభాగాలకు మండలాలవారీగా వెంటనే నియమించాలి. వీలైనంత త్వరగా దీన్ని చేపట్టాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందికి సరైన మార్గ దర్శకత్వం లభిస్తుంది. అవగాహన కలుగుతుంది. ఎప్పటికప్పుడు వివరాల నమోదు సమగ్రంగా జరుగుతుందో లేదో పర్యవేక్షణ ఉంటుంది. లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, జేసీలు పరిశీలన చేయాలి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతోంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు పరిశీలన చేయాలి. సచివాలయాలను తమవిగా భావించాలి. ప్రతి స్థాయిలోనూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకు పడతాయి. దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. ప్రతి నెలా వివరాలు నమోదు వ్యవసాయం, విద్య, మహిళ, శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాలపై మనం ఖర్చు చేస్తున్నట్లు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వీటిపై సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రగతి లక్ష్యాల సాధనపై నెల రోజులకు ఒకసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. డ్రాపౌట్స్ ఉండకూడదు పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూడదు. డ్రాపౌట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వలంటీర్ల వారీగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాపౌట్ గురించి సమాచారం అందితే అధికారులు వెంటనే స్పందించాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరు పరిశీలించాలి. ఎవరైనా వరుసగా మూడు రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరా తీయాలి. పిల్లలు బడికి రాకపోతే తప్పనిసరిగా ఎస్ఎంఎస్ పంపాలి. ఇవన్నీ కచ్చితంగా జరిగాలి. కళ్యాణమస్తుతో.. కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు నిర్దేశించిన అర్హతలు బాల్య వివాహాల నివారణ, అక్షరాస్యత పెరిగేలా దోహదం చేస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించాం. పెళ్లి కుమార్తె కనీస వయసు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్దేశించినందున ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు విద్య సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయి. ఇంగ్లీషు మీడియం సహా పలు సంస్కరణల ద్వారా పరిస్థితులను సమూలంగా మార్చేసే మహా యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు ఉజ్వల భవిష్యత్తు కలిగిన తరాలుగా సమాజానికి అందుతాయి. చదువుల యజ్ఞం కొనసాగుతుంది.. ఇంగ్లీషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలే ఇంగ్లీషు మీడియంలో చదవాలి, పేద బిడ్డలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదనే వైఖరిని పదేపదే చాటుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందకూడదన్నదే వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. తద్వారా చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది. సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పరిధిలోకి తీసుకొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్‌కార్డుల జారీప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ కార్యాలయం మూడురోజుల కిందట ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ రాసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. ఒకేసారి రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి వాటిని భర్తీచేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్‌ను ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది. -
AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తోంది. కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ తదితర కొన్ని రకాల సర్టిఫికెట్ల కోసం పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సరికొత్త సేవలు ప్రవేశపెట్టనుంది. మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపి జారీ చేసిన సర్టిఫికెట్లు మళ్లీ కావాల్సి వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పటికప్పుడు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను ఒకసారి ఒక వ్యక్తికి జారీ చేసే వివిధ రకాల సర్టిఫికెట్ల వివరాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ సర్టిఫికెట్లకు సంబంధించి దరఖాస్తుదారుడు కోరుకుంటే ఒకేసారి మూడు నాలుగు ఒరిజనల్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసే విధానం తీసుకురాబోతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒకసారి జారీ చేస్తే.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయని, ఆ నిర్ణీత గడువు మేరకు ఆ సర్టిఫికెట్లు జారీకి ఈ విధానం వర్తిస్తుందని చెబుతున్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం ద్వారా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఎక్కువగా అవసరమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సర్టిఫికెట్లలో నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి ఈ విధానం వర్తింపచేసేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా సర్టిఫికెట్లు.. ఆన్లైన్లో బస్సు, రైలు టిక్కెట్లు వంటివి బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ కాపీ లింకు మెసేజ్ రూపంలో సంబంధిత దరఖాస్తుదారుడు వాట్సాప్‌కు చేరుతోంది. ఆ తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న సరిఫికెట్లను కూడా సంబంధిత అధికారుల ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుదారుల మొబైల్ నంబర్లకు కాపీ లింకును కూడా పంపే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. ఆయా సచివాలయాల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎవరైనా మ్యారేజి సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లయిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు తర్వాత మ్యారేజి సర్టిఫికెట్ అవసరమైన వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మ్యారేజి సర్టిఫికెట్ జారీకి సంబంధించి యూజర్ మాన్యువల్‌ను గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారులు అన్ని సచివాలయాలకు పంపారు. పెళ్లి జరిగిన ప్రాంతానికి సంబంధించిన సచివాలయంలోనే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దంపతుల ఆధార్ నంబరు, ఇతర వివరాలతో ఈ కార్డులు జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా కొత్త దంపతుల పేరుతో రేషన్‌కార్డు విభజన ప్రక్రియ సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో రేషన్‌కార్డు విభజన ప్రక్రియలో ఆయా వ్యక్తుల ఆధార్ నంబరు ఆధారంగా ఏపీసేవ పోర్టల్‌లో గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యారేజి సర్టిఫికెట్‌ను ధ్రువీకరించుకునే వీలును కూడా కల్పించినట్టు చెప్పారు. -
పదేళ్లకోసారైనా ఆధార్ అప్డేట్!
సాక్షి, అమరావతి: మీరు ఆధార్ తీసుకొని పదేళ్లు పైనే అయ్యిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ కార్డులో మీ వివరాలను అప్డేట్ చేసుకోలేదా? అయితే, వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో మీ తాజా ఫొటో, అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఇందుకు గాను ఆధార్ ఆన్లైన్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశముందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆధార్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ ద్వారా ఫొటో, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించి.. వివరాలు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత ఇటీవల ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల ద్వారా.. రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల ద్వారా వీలైనంత త్వరగా అందరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్ల ద్వారా సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు దీని గురించి సమాచారమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు ఆధార్ కార్డులలో వారి వివరాలు అప్డేట్ చేసేందుకు సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయం ఆదేశించింది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
CM YS Jagan: సీఎం జగన్ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు. అయితే 2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. గొప్ప మనస్సు ఉన్న సీఎం.. సర్వీస్ నిబంధనలను సడలించి ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప మనస్సుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో కొనియాడింది. మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌కు సచివాలయాల ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్ తేజ్, ఉపాధ్యక్షుడు బీఆర్ఆర్ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గ్రామాలు, వార్డుల్లో పనుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుర్తించిన మరుసటి రోజే పనులు అప్లోడ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
కళ్లెదుటే మార్పు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలోని కుగ్రామాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏకంగా 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 2.65 లక్షల మంది వలంటీర్లు ఈ వ్యవస్థలో భాగస్వాములై ప్రజల గడప వద్దకే సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ వ్యవస్థకు అనుసంధానంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు ప్రజారోగ్య సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా ఏర్పడ్డ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విత్తనం మొదలు పంట విక్రయం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. గ్రామ గ్రామాన ఇంగ్లిష్ మీడియం చదువులు పేదల ఇళ్లలో విద్యా వెలుగును నింపుతున్నాయి. డిజిటల్ లైబ్రరీలతో యావత్ ప్రపంచం కుగ్రామాలకు మరింత చేరువైంది. తద్వారా ఎంతో మంది యువతీ యువకులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా సొంత గ్రామం నుంచే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. నభూతో అన్న రీతిలో ఏకంగా 37,181 శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా ఆస్తుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం మూడంటే మూడేళ్లలోనే మన కళ్లెదుటే ఇలా ఎన్నో అనూహ్య మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజలకు సేవలందించే విషయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేదనడం అతిశయోక్తి కాదు. ఏకంగా 4.70 కోట్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతగా లబ్ధి కలిగించిందనేది అంచనాలకు అందనిది. ఎంతలో ఎంత తేడా! ► అవ్వాతాతలు పింఛను కోసం ఒకప్పటిలా.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఆ ఊళ్లో పెద్దలు.. అధికార పార్టీ రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ► ఒకేసారి రూ.15 – 20 వేలు ప్రభుత్వ లబ్ధి కలిగేటప్పుడు కూడా లక్షల సంఖ్యలో ఉండే లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం అడిగే పరిస్థితి అసలే లేదు. ► పింఛనే కాదు మరే ప్రభుత్వ సంక్షేమ పథకం కోసమైనా పేదలెవరూ పైరవీ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ► నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ఆపసోపాలు పడుతూ ప్రతి నెలా తమ పింఛను డబ్బులు తీసుకోవడానికి ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరమే లేదు. ► ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి చిన్నా.. పెద్దా పని పడినా మారుమూల కుగ్రామాల్లో ఉండే ప్రజలు ఊరు దాటి మండలానికో, పట్టణా నికో వెళ్లాల్సిన పని అంతకంటే లేదు. ► సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇలాంటి అనేక స్పష్టమైన మార్పులను తీసుకొచ్చింది. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక రీతిలో శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వ్యవస్థ ద్వారా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా వాటిని భర్తీ చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇప్పుడు ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకొని.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే– స్కేళ్లతో కూడిన వేతనాలు అందుకుంటున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లందుకు.. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందజేస్తున్నారు. మొత్తంగా.. ఒక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం ద్వారానే ప్రభుత్వం నాలుగు లక్షల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పించింది. 11,354 ప్రభుత్వ భవనాల నిర్మాణం ► సచివాలయ వ్యవస్థ.. కేవలం ఉద్యోగుల నియామకం, ప్రజలకు సేవలు అందించడానికే పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవలు అందజేసేందుకు శాశ్వత గ్రామ సచివాలయాల భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు మొత్తం 37,181 నిర్మాణం కూడా చేపట్టింది. ► అందులో 11,354 భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, మిగిలిన వాటిలో చాలా వరకు శ్లాబ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామ సచివాలయ, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. ► ఈ వ్యవస్థకు అనుబంధంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. ప్రజలు, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పేదల స్థితిగతులను సమూలంగా మార్చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. కుగ్రామాల్లోనూ ప్రతి రోజూ ‘స్పందన’ ► గ్రామాల్లో బడి కాకుండా ఉండే ప్రభుత్వ ఆఫీసు ఒక్క పంచాయతీ కార్యాలయమే. సగానికి పైగా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఏడాదికి ఓ 12 నుంచి 15సార్లు మించి తెరుచుకోని పరిస్థితి ఉండేది. మూడేళ్ల క్రితం వరకు అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. ఉన్నా.. నాలుగైదు గ్రామాలకు ఒకరు ఇన్చార్జిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒక్కో గ్రామంలో పదేసి మంది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. ► రైతులకు వ్యవసాయ సలహాలిచ్చేందుకు ప్రతి చోట ఓ వ్యవసాయ అసిస్టెంట్ పని చేస్తున్నారు. అనారోగ్యం పాలైన పశువులకు వైద్యం చేసేందుకు మరో ఉద్యోగిని నియమించారు. కరెంట్ అంతరాయాలను వెంటనే సరిచేయడానికి ప్రతి గ్రామానికీ ఓ ఎనర్జీ అసిస్టెంట్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. ఏ ఊరికి ఆ ఊరిలో అక్కడి ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతి రోజూ సాయంత్రం 3–5 గంటల మధ్య ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇంటర్నెట్ లేని గ్రామాలు 110 లోపే.. ► మూడేళ్లకు ముందు రాష్ట్రంలో మూడొంతుల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. కంప్యూటరు ఉన్న చాలా గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఇంటర్నెట్ వసతి లేక అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండేవి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి కొత్తగా రెండేసి కంప్యూటర్లు, కరెంటు లేని సమయంలో అది పనిచేయడానికి ఓ యూపీఎస్, ఇతరత్రా ఫర్నిచర్‌ను అందజేసింది. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ నమోదుకు ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కానర్లను కూడా అందజేశారు. సచివాలయంలోనే లబ్ధిదారులకు పింఛను కార్డు, ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రతి సచివాలయానికి ప్రింటర్, లామినేషన్ మిషన్లను సరఫరా చేశారు. ► సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆ సచివాలయానికి అందే దరఖాస్తులు ఆయా శాఖల వెబ్సైట్లలో నమోదు చేయడానికి ప్రతి సచివాలయానికి ఇంటర్ నెట్ వసతిని కూడా కల్పించారు. రాష్ట్రంలో కుగ్రామంలో ఉండే సచివాలయంలో కూడా ఇప్పుడు డిజిటల్ సేవలే కొనసాగుతున్నాయి. ► రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, కొండ ప్రాంతాల్లో ఉండే కేవలం 110 సచివాలయాల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఆయా సచివాలయాల్లో మొదట మాన్యువల్‌గా ఆ సేవలు అందజేస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు చెప్పారు. సచివాలయాల ద్వారానే ఐదు కోట్ల ప్రభుత్వ సేవలు ► నగరాల్లో ఉండే వార్డు సచివాలయాలు, కుగ్రామంలో ఉండే సచివాలయం అన్న తేడా లేకుండా 2020 జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ► కొన్ని ఎంపిక చేసిన సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు కూడా మొదలయ్యాయి. దశల వారీగా అన్ని సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తర్వాత దశలో పాస్‌పోర్టు, ఆధార్ సేవలు వంటి దాదాపు 200కు పైగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కార్పొరేట్ సంస్థల సేవలను కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ► ఇప్పటి దాకా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4.70 కోట్ల వినతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో 10.50 లక్షల మంది ఆధార్ సేవలను కూడా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమాకు సంబంధించి 8.93 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సచివాలయాల ద్వారానే ఈ– శ్రమ్ కార్డులను అందజేశారు. యూనిసెఫ్ గుర్తింపు ► ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యూనిసెఫ్ సంస్థ సైతం మన రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రశంసలు తెలిపింది. రాష్ట్రంలో ఆ సంస్థ అందజేసే సేవల్లో గ్రామ, వార్డు సచివాలయాలను, వలంటీర్లను భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా యూనిసెఫ్‌కు చెందిన యూఎన్ వలంటీర్ల విభాగం ప్రతినిధుల బృందం కూడా పని చేస్తుండటం విశేషం. ► దీనికి తోడు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి.. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ► పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు వలంటీర్ల వ్యవస్థ స్థితిగతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం కావాలని తెలుసుకొని, వాటిని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నాయి. -
శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు(బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మూడు నెలలకోసారి నగదు పేద ఆడ బిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం కోరుతూ ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రతి మూడు నెలలకోసారి(క్వార్టర్లీ) పరిశీలించి అప్పటి వరకూ నిర్ణయించిన అర్హులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు తమ జీవిత భాగస్వామిగా తమ కులానికి చెందిన వారిని ఎంచుకుంటే నిర్దేశిత మొత్తం, ఇతర కులాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటే అంతకంటే అధిక పారితోషికం వస్తుంది. దివ్యాంగులకు సంబంధించి ఇద్దరూ వైకల్యం ఉన్నవారైనా, ఒక్కరే వైకల్యం ఉన్నావారైనా సరే ఆడపిల్లకు మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
కమలాపురం : అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 1,949 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ బి.శివరాం తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలోని సబ్ రెజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నెట్ వర్క్, స్కానింగ్, వెబ్‌క్యామ్‌లతో పాటు రిజిస్ట్రేషన్లు, సెటిల్ మెంట్లు, పార్టీషియన్లు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పొందవచ్చన్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం సంబటూరు, జంభాపురం గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ చెన్నకేశవరెడ్డి, సబ్ రెజిస్ట్రార్ డీఎం బాషా పాల్గొన్నారు. -
అన్నదాతను అనుసంధానించాలి
ఇది సమాచార విప్లవ యుగం. సరైన సమాచారం ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ ఉంటే ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతన్నకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. చాలా సందర్భాలలో ఉత్పత్తి దారులూ, వినియోగదారులూ ఒకే ప్రాంతంలో ఉన్నా ఆ విషయం వారికి తెలియక దూర ప్రాంతాల వారితో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఉదాహరణకు నా దృష్టికి వచ్చిన ఉదంతం చెబుతాను. సత్యసాయి జిల్లా కదిరిలో పండిన వేరుశనగ వంగడాన్ని నల్లగొండ జిల్లా వాసి కొనుగోలు చేశాడు. కదిరి ప్రక్కనే ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండల వాసికి కదిరిలో ఆ వంగడం ఎవరిదగ్గర ఉందో తెలియక దళారీ ద్వారా నల్లగొండ జిల్లా వాసి నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుబాటులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సహజంగా ఏ వస్తువైనా ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అమ్మకపుదారు నుండి ధరలో రాయితీ లభిస్తుంద న్నది వాస్తవం. మన చుట్టు పక్కల వినియోగదారులను కలిపే ఒక అప్లికేషన్ లాంటిది ఉంటే ఒక వీధిలోనో లేదా ఊరులోనో ఉన్నవారందరూ ఉమ్మడిగా తక్కువ ధరకు కొని సరుకును పంచుకోవచ్చు. అలాగే అమ్ముకునేవారికీ ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయి లాభం కలుగుతుంది. చాల సందర్భాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రత్యేకత ఉన్నా దానిని లాభదాయకంగా అమ్ము కోవడంలో రైతు విఫలమవుతున్నాడు. రైతుల ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియజేసే ఒక సమాచార వ్యవస్థ ఉంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నా ఇంకొక ప్రాంతం వారికి అంతగా తెలియడం లేదు. ఉదాహరణకు రుచికరమైన కోనసీమ చక్కరకేళి అరటిపండ్లు నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తారు. 2015 సంవత్సరంలో నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వాటిని ఎగుమతి చేయలేక, రోడ్ల మీద పడవేయ వలసి వచ్చింది. నిజానికి రాయలసీమ ప్రాంతంలో వాటి గురించి చాలా తక్కువగా తెలుసు. ఒక వేళ తెలిసి ఉంటే కనీస ధరకన్నా కోనసీమ రైతుల దగ్గర రాయలసీమ వినియోగదారులు కొనుక్కుని ఉండేవారు. పైన పేర్కొన్నట్లు రైతులకూ, వినియోగదారులకూ సరైన సమాచారం అందించడానికి సచివాలయ వ్యవస్థను బాగా వాడుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రైతు భరోసాకేంద్రాలను అనుసంధానించాలి. ఆయా గ్రామాల్లో పండించే పంటల వివరాలను, రైతు ఫోన్ నంబరుతో సహా సచివాలయ వెబ్సైట్లో ఉంచాలి. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలన్నింటినీ అనుసంధానించి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచే సమాచార వ్యవస్థను రూపొందించగలిగితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఆయా సచివాలయ సిబ్బందితోగానీ లేదా రైతుతోగానీ సంప్రదించి కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇందులో దళారీల ప్రమేయం లేదు కాబట్టి అటు రైతుకూ, ఇటు కొనుగోలుదారునికీ కూడ ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను ఉపయోగించి ఒక్కో సచివాలయం పరిధిలోని ప్రజలను ఒక కొనుగోలు దారుల గ్రూపుగా తయారుచేయవచ్చు. ఉదాహరణకు సచివాలయ పరిధిలోని ప్రజలు కలసి టమోటా అవసరమనుకుంటే వాటిని ప్రక్క గ్రామంలో ఉన్న రైతే నేరుగా సరసమైన ధరకు అందించవచ్చు. గూగుల్ యాప్‌లో తమకు కావలసిన వస్తువులు దగ్గరలో ఎక్కడ దొరకుతాయో వెబ్సైట్లో వెతికి తెలుసుకునే సౌకర్యం ఉంది. అటువంటి సౌకర్యమే ఈ అప్లికేషన్లో పొందు పరచవచ్చు. కేవలం రైతు పండించే పంటలకే కాక చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల వివరాలనూ ఈ సమాచార వ్యవస్థలో భాగం చేయాలి. ఇందువల్ల రాష్ట్రంలో ఏఏ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయో తెలియడమే గాక వాటికి ఉన్న డిమాండ్ కుడా తెలుసుకోవచ్చు. ఇలా సప్లయ్, డిమాండ్ల సమాచారం తెలియడం వల్ల వాటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా అయితే ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ మేలు చేకూరుతుంది. - డాక్టర్ జి.వి. సుధాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు -
అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఆదర్శం
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ‘కళ్లెదుటే సచివాలయం.. పక్కనే రైతు భరోసా కేంద్రం.. చెంతనే నూతన హంగులతో రూపుదిద్దుకున్న సర్కార్ బడులు.. మరోవైపు హెల్త్ క్లినిక్.. నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ.. సమీపంలోనే పాల సేకరణ కేంద్రం.. ఇది సీఎం వైఎస్ జగన్ మూడేళ్ల క్రితం కన్న కల. దీన్ని సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి రాష్ట్ర వ్యాప్తంగా మహా వృక్షంలా ఎదిగింది. రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్తులను ప్రజలకే అంకితం చేసిన గొప్ప పాలనాదక్షుడు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం సోమలాపురంలో మోడల్‌గా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ ఇతర కార్యాలయాలను ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ప్రభుత్వ విప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శనరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విప్ కాపు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఒక్క సోమలాపురంలోనే వివిధ పథకాల కింద రూ.8.62 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికీ రూ.1.50 లక్షలకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.65 లక్షల కోట్లను జమచేసిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించిందన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.41 కోట్లతో 39 గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తాగునీరందించబోతున్నామన్నారు. ఇందులో ఒక్క డీ హీరేహాళ్ మండలంలోనే 22 గ్రామాలు ఉన్నాయని ప్రకటించారు. దోపిడీపైనే కాలవ దృష్టి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజా ధనం దోపిడీ చేయడం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. నాడు ‘నీరు– చెట్టు’ పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, ఇసుక, మట్టిని కొల్లగొట్టారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడేదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్నట్లు రాయదుర్గంలో నాటకాలకు తెరలేపారన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో కాలవ శ్రీనివాసులు అనంతపురానికి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి తలదాచుకున్నారని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలూ సమగ్రాభివృద్ధి చెందుతాయని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని టీడీపీ అధినేతపై ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇది రుచించడం లేదని, అందుకే సంక్షేమ పథకాల తమాషా అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పథకం ఆపాలో ప్రజల్లోకొచ్చి చెప్పే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాబాను, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వన్నూర్‌స్వామి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, పార్టీ నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు. -
గాంధీజీ కలలు సాకారం చేసిన సీఎం
నరసరావుపేట: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ఉద్యోగాల ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేలు నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనచంద్ర టౌన్‌హాలులో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆత్మీయ సభ నిర్వహించారు. సభకు అసోసియేషన్ కార్యదర్శి షేక్ మహమద్ ఆలీ అధ్యక్షత వహించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎటువంటి హాని చేయబోరని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపించాలనే ఆలోచనతోనే సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సచివాలయాల ఏర్పాటు ఓ చరిత్ర: గోపిరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక సచివాలయం ఉండే దశ నుంచి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 10,700 సచివాలయాలను తీసుకురావటం ఒక చరిత్ర అన్నారు. ప్రజల ముగింటకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పరిపాలన తీసుకురావటం సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇక అతిథులు కేక్ కట్‌చేయగా, వారిని ఉద్యోగులు సన్మానించారు. -
సచివాలయ వ్యవస్థ భేష్.. మిట్టర్‌సైన్ ప్రశంసలు
తిరుపతి రూరల్: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ భేషుగ్గా ఉందని, గ్రామాల అభివృద్ధికి ఈ వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తోందని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మిట్టర్‌సైన్ ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీ సచివాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. చిన్న పంచాయతీలో తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించడం, నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ పరిపాలన వ్యవస్థగా సచివాలయాలను అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సచివాలయంలోని సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాశారు. ఈ సందర్భంగా మిట్టర్ సైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది దోహదపడుతున్నారని తెలిపారు. తమ ఇంటికే వచ్చి వలంటీర్లు అందిస్తున్న సేవలను లబ్ధిదారులు ఈ సందర్భంగా ఏడీజీకి వివరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని మల్లంగుంట పంచాయతీలో మిట్టర్ సైన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానకమ్మ, డీపీవో రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీఎల్డీవో సుశీలాదేవి, ఎంపీడీవో వెంకటనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు. -
‘చేయూత’కు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇందుకు గాను ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 –60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 2020 ఆగస్టు 12వ తేదీ తొలి విడతలో 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు పంపిణీ చేసింది. రెండు విడతల్లో కలిపి రూ.9179.67 కోట్లను ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు అందజేసింది. తిరిగి ఇప్పుడు సెప్టెంబర్‌లో మూడో విడతగా ఈ పథకం లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా అర్హత పొందిన వారి పేర్ల నమోదుతో పాటు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల తాజా స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకొని.. అనంతరం ఆయా దరఖాస్తులపై 8వ తేదీ లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. -
CM YS Jagan: ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా
వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కలెక్టర్లూ పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి పనుల్లో మంచి ప్రగతి ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి. గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి.. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. రహదారులకు భూసేకరణపై దృష్టి రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..? స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్డీజీ యధావిధిగా పెరుగుతుంది. ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను ఘనంగా సన్మానిస్తాం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో భారీ సభ నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించినట్టు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చెప్పారు. శుక్రవారం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం, నాలుగు నెలల్లో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేయడంతో పాటు వాటిని భర్తీ కూడా చేశారని చెప్పారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులైన ఉద్యోగులందరి సర్వీసును ఈ ఏడాది జూన్ 30 నాటికి పర్మినెంట్ కూడా చేశారని వివరించారు. తాజాగా సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్‌కి మానస పుత్రిక లాంటివని, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని చెప్పారు. మనందరికీ మంచి చేసే ప్రభుత్వం ఉందని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరం సక్రమంగా పని చేద్దామన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వెంకట్రామిరెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కొన్ని వ్యవస్థలు సైతం కంట్రోల్ చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎలా వ్యవహరించారో చూశామన్నారు. కడపలో సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి కోరారు. సచివాలయాల ఉద్యగులను ప్రభుత్వం పర్మినెంట్ చేయదని కొందరు చేసిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సీఎం అందరినీ పర్మినెంట్ చేశారని సంఘం ప్రధాన కార్యదర్శి బి.అంకమరావు చెప్పారు. ఉద్యోగులతో మంచిగా ఉండే సీఎం ఉండటం మన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆర్ఆర్ కిషోర్ భార్గవ్ సుతేజ్, విపర్తి నిఖిల్‌కృష్ణ, సుధాకర్, రామకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు. -
AP: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఆర్థిక పరమైన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,000.80 కోట్లు మంజూరు చేసింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానిక ప్రజలకు అవసరమైన, అత్యధిక ప్రభావం చూపే పనులను మంజూరు చేయడానికి ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ.3,000.80 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఎలాంటి పనులు మంజూరు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులనే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కనిష్టంగా ఒక్కో సచివాలయ పరిధిలో రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులనే అనుమతించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో నోడల్ అధికారులుగా వ్యవహరించే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్లు పనులను గుర్తించాలని చెప్పింది. సచివాలయాల సందర్శన తప్పనిసరి ► ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ప్రతి సచివాలయాన్ని 2 రోజుల పాటు సందర్శించాలి. ఎమ్మెల్యే సందర్శన షెడ్యూల్‌ను పది రోజుల ముందుగానే నోడల్ అధికారులకు తెలియజేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు పాల్గొనాలి. ► సచివాలయ సందర్శన రెండు రోజుల్లో ఎమ్మెల్యేతో కూడిన అధికారుల బృందం అత్యధిక ప్రభావం చూపే పనులను గుర్తించాలి. ప్రజల వినతుల ఆధారంగా లేదా స్థానిక ప్రజల అవసరాల ఆధారంగా అత్యధిక ప్రభావం చూపే పనులు గుర్తించాలి. పారిశుద్ధ్యం, నిర్వహణ, మరమ్మతులు వంటి సాధారణ పనులను సంబంధిత సచివాలయాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. ఆస్తుల కల్పనకు సంబంధించి గుర్తించిన అత్యధిక ప్రభావం చూపే పనులను నోడల్ బృందం తనిఖీ చేయాలి. ► రెండో రోజు పర్యటన ముగిసేలోగా అత్యధిక ప్రభావం చూపే ఏ పనులు చేపట్టాలో ఖరారు చేయాలి. నోడల్ అధికారి మిగతా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రూ.20 లక్షల లోపు పనులను ఖరారు చేయడంతో పాటు తీర్మానం చేయాలి. నోడల్ అధికారి ఆ పనులకు ఏజెన్సీని కూడా గుర్తించి లైన్ ఎస్టిమేట్స్ కూడా పూర్తి చేయాలి. ► ఖరారు చేసిన పనుల జాబితాను గడప గడపకు మన ప్రభుత్వం పోర్టల్‌లో నోడల్ అధికారి అప్లోడ్ చేయాలి. పనులకు సంబంధించిన తీర్మానం, లైన్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌తో పాటు సమస్య ఫొటోను నిర్ణీత ఫార్మెట్లో పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. మొత్తం ఈ పనుల ప్రక్రియను, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పర్యవేక్షిస్తుంది. చేపట్టాల్సిన పనులు ఇలా.. ► తాగునీటి సరఫరా పనులు: తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్మాణాల స్థాయి పెంపు, తాగు నీటి సరఫరా పైపు లైన్లు, ట్యాంక్‌లు. ► రహదారుల పనులు: సిమెంట్ కాంక్రీట్ రహదారుల నిర్మాణం, సిమెంట్ కాంక్రీట్ రహదారుల స్థాయి పెంపు, తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల స్థాయి పెంపు. ► డ్రైన్స్: ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి డ్రైన్స్ నిర్మాణం. ► విద్యుత్: కొత్త ఎలక్ట్రికల్ లైన్, పోల్, కమ్యూనిటీకి అవసరమైన కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ► కల్వర్టులు: కల్వర్టుల నిర్మాణం, కమ్యూనిటీ కోసం డ్రైనేజీలను దాటే నిర్మాణాలు. ► ఇతర సివిల్ పనులు: కమ్యూనిటీ షెల్టర్ భవనాలు, కమ్యూనిటీ భవనాలకు ప్రహారీ గోడల నిర్మాణం, కమ్యూనిటీకి సంబంధించి వరద నివారణ, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు. 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన ఈ ఏడాది మే 11వ తేదీన ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్శనలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం వారికి అందించిన పథకాల వివరాలను వివరించడంతో పాటు ఏమైనా సమస్యలుంటే అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా ఈ నెల 18వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన పూర్తి చేశారు. ఇప్పటి వరకు అత్యధిక ప్రభావం చూపే 4,174 పనులను గుర్తించారు. మూడు కేటగిరీలుగా సమస్యల పరిష్కారం మంత్రులు, ఎమ్మెల్యేల గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా ప్రజల నుంచి వచ్చే వినతులను మూడు కేటగిరీలుగా.. పథకాలకు సంబంధించి, పథకేతరాలకు సంబంధించి, అత్యధిక ప్రభావం చూపే పనులుగా వర్గీకరించాం. వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – అజయ్ జైన్, ప్రత్యేక సీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చదవండి: సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు! -
గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు
తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరోవైపు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్నారు. ఇదీ చదవండి: CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై.. -
2 లక్షల ప్రమాద బీమా: ‘ఈ–శ్రమ్’లో పేర్లు నమోదు చేసుకోండి
సాక్షి, అమరావతి: చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ, వలస కూలీలు సహా అన్ని రకాల అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈ–శ్రమ్’ ఆన్లైన్ పోర్టల్‌లో అర్హులందరి పేర్లు నమోదుకు ఈ నెల 17, 18 తేదీల్లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ– శ్రమ్ పథకంలో పేర్లు నమోదు చేసుకునే వారు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ బీమా పథకం ద్వారా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన దాదాపు 1.21 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. కాగా రాష్ట్రంలోని పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల పేర్లను ఈ – శ్రమ్ పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మిగతా అర్హులందరి పేర్లు పోర్టల్‌లో నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ సాగిలి షాన్మోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల భాగస్వామ్యం ఉపాధి హామీ పథకంలో కూలీలు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు అసంఘటిత కార్మికుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవడంలో వలంటీర్లను భాగస్వాములను చేశారు. వలంటీర్లు వారి పరిధిలో అర్హులను గుర్తించి 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. 23, 24 తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పలు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. గత రెండు నెలలుగా ప్రతి నెలా రాష్ట్రంలోని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులకు.. కొత్త పే స్కేల్ వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వోద్యోగుల మాదిరిగా తొలిసారి పే–స్కేల్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్‌లో పాసైన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై 1వతేదీ నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వారంతా జూలై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు 1వ తేదీ నుంచి అందుకోబోతున్నారు. పీఆర్సీ కమిటీ చెప్పకున్నా.. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కోసం 2018లో కమిటీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అన్నదే లేదు. 2019 మే నెలాఖరున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. పీఆర్సీ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ నివేదికలో ఎలాంటి పెరుగుదలను సూచించలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తెచ్చి ప్రొబేషన్ ఖరారైన సచివాలయ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా పే – స్కేల్ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం పొందుతున్నారు. వాటి స్థానంలో పే– స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ నెల 20వతేదీ నుంచే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రభుత్వానికి సమర్పించే డ్రాయింగ్, డిస్పర్స్‌మెంట్ ఆఫీసర్స్–డీడీవోలు ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ఆయా డీడీవోల పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారైంది? ఎంత బిల్లులు అప్లోడ్ అయ్యాయనే వివరాలు సేకరించి ఇబ్బందులుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇటీవల డీడీవోల బదిలీల కారణంగా బిల్లుల సమర్పించడంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల డీడీవోలు వివిధ కారణాలతో బిల్లులు అందించడం ఆలస్యమైనా 30వతేదీ వరకు వచ్చే బిల్లులను కూడా అనుమతించారు. ఆది నుంచి ఆటంకాలు సృష్టిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచే ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించాయి. ఇంటర్వ్యూలు లేకుండా రాతపరీక్ష ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని దుష్ప్రచారం చేశాయి. పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులే అందులోనిజం లేదని తేల్చారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయటాన్ని సహించలేక అవి తాత్కాలికమేనని, జీతాలు పెరగవంటూ ఉద్యోగులను కించపరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేశారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్షాలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ప్రతిసారీ సీఎం జగన్ సానుకూల వైఖరే.. ‘సచివాలయాల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు వీలు కాదని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం వారిపై ఉన్న అభిమానంతో పెరిగిన కొత్త వేతనాల ప్రకారమే వారికి జీతాలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తమకు సంబంధించిన అన్ని అంశాల్లో మేలు చేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రొబేషన్ ఖరారు అనంతరం తొలిసారి పే స్కేలు ప్రకారం వేతనాలు అందుకోనున్న ఉద్యోగులకు అభినందనలు’ – కాకర్ల వెంకట్రామిరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గుండె నిండా అభిమానంతో సెల్యూట్ ‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే జీవిత ఆశయం నెరవేరుతున్న వేళ గుండె నిండా అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నూతన పేస్కేల్ వర్తింపజేయడంతో ఇన్నాళ్లూ విమర్శలు చేసిన వారి నోర్లు మూగబోయాయి. సచివాలయ ఉద్యోగులకు ఇది శుభవార్త కాగా కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచింది. –ఎం.డి.జాని పాషా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మేలు మరువలేం.. ఒకేసారి 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు ముఖ్యమంత్రి జగన్. ఆయనకు సచివాలయాల ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ జీవిత కాలం రుణపడి ఉంటాయి. ఈ మేలు ఎప్పటికీ మరువలేం. –భీమిరెడ్డి అంజనరెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ (గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్) -
సచివాలయాల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం సాకారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలనలో పెను మార్పులు తెచ్చి గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెప్పిన సచివాలయాల వ్యవస్థ ఎంతో బాగుందని, ముందుచూపుతో ఏర్పాటైన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకూ ఎంతో ఉపయోగకరమని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. సచివాలయాలపై పట్టణ ప్రాంత ప్రజల మనోగతం అనే అంశంపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సోషల్ వర్క్ చదువుతున్న విద్యార్థిని తాటిపూడి తనూజ స్రవంతి ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వలంటీర్ల ద్వారా చేరవేశారని తెలిపారు. సచివాలయాల్లో ఉద్యోగులు మరింత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్భుతమైన సచివాలయ వ్యవస్థ నిర్వహణలో చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 51వ వార్డులోని గాంధీనగర్ సచివాలయ పరిధిలో ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ప్రశ్నలకు సచివాలయ పరిధిలోని వంద మందితో సమాధానాలు రాబట్టారు. ప్రాజెక్టు వర్క్‌ను ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి ఈ నెల 28వ తేదీన విద్యార్థిని అందచేసింది. 83 మంది పురుషులు, 17 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 9 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 48 మంది, వేతన కూలీలు 24 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ► సచివాలయాల ఏర్పాటు మంచి నిర్ణయమని, దీనివల్ల భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగం ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా సచివాలయానికి వెళుతున్నట్లు 78 శాతం మంది సర్వేలో చెప్పారు. ► నవరత్నాల పథకాల గురించి సమగ్ర అవగాహన ఉందని 77 మంది పేర్కొనగా 23 మంది కొన్ని పథకాలు గుర్తున్నాయని చెప్పారు. ► అమ్మ ఒడి పథకం భేష్ అని 53 శాతం మంది వెల్లడించారు. ఇది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా తమ సొంతింటి కల నెరవేరిందని 62 మంది తెలిపారు. ఆ పథకానికి అర్హత లేనందున తమకు అందలేదని 38 మంది చెప్పా రు. ► 86 శాతం మందికి హెల్త్‌కార్డులుండగా 14 శాతం మంది హెల్త్ కార్డులు లేవని తెలిపారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయని 64 శాతం మంది పేర్కొన్నారు. ► కోవిడ్ సమయంలో సచివాలయ సిబ్బంది తమ ఇంటిని సందర్శించారని 74 శాతం మంది పేర్కొనగా 26 శాతం మంది మాత్రం రాలేదని చెప్పారు. సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని 83 శాతం మంది తెలిపారు. ► సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నకు 52 శాతం మంది అవునని పేర్కొనగా 48 శాతం మంది మాత్రం సరిగా ఉండటం లేదని చెప్పారు. వార్డు శానిటరీ సెక్రటరీ నిరంతరం విధుల్లో ఉంటున్నట్లు 32 మంది బదులిచ్చారు. ఆ తర్వాత వెల్ఫేర్ సెక్రటరీలు 18 శాతం, హెల్త్ సెక్రటరీలు 14 శాతం మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వంద మందిలో ఒక్కరు కూడా టౌన్‌ప్లానింగ్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీలు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పలేదు. ► సచివాలయాల ద్వారా అందచేసే సేవలపై 51 శాతం మందికి అవగాహన ఉండగా 49 శాతం మంది మాత్రం పూర్తిస్థాయి అవగాహన లేదని చెప్పారు. మీ వలంటీర్ ఎవరు? తెలుసు – 89 తెలియదు – 11 మీ సచివాలయం ఎక్కడ? తెలుసు – 92 తెలియదు –08 సచివాలయాల ద్వారా ఆదాయం, నివాస దృవపత్రం పొందారా? అవును –93 లేదు –07 సచివాలయాల ద్వారా జనన, మరణ సర్టిఫికెట్లు పొందారా? అవును –86 లేదు – 14 గ్రామ స్వరాజ్యం సాకారం ఎమ్మెస్సీ సోషల్ వర్క్‌లో నా సబ్జెక్టు కమ్యూనిటీ డెవలప్మెంట్. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోంది. – తాటిపూడి తనూజ స్రవంతి, ఎంఎస్సీ, సోషల్ వర్క్, ఏయూ ఇదీ చదవండి: Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి -
AP: 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆగస్టు 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ విధానంపై ఆశా వర్కర్, ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీ నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల వారీగా మాస్టర్ ట్రైనర్లను గుర్తించి, వారికి బుధవారం విజయవాడలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. సచివాలయాలే కేంద్ర బిందువు ► గ్రామ సచివాలయాలు కేంద్రంగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి నెలలో ఒక రోజు 104 వాహనాలు వెళుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం వరకు 104 వైద్యుడు, సిబ్బంది ఓపీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గృహాలను సందర్శించి, మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు. ► ఇలా 656 ఎంఎంయూలు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో అదనంగా అవసరమయ్యే 432 కొత్త 104 వాహనాలు కొనుగోలుకు వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. పీహెచ్సీ వైద్యులతో మ్యాపింగ్ ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిని సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్‌సీల్లో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలో ఉన్న సచివాలయాలను కేటాయిస్తారు. ► ఈ క్రమంలో ఒక వైద్యుడు పీహెచ్సీలో ఉంటే, మరో వైద్యుడు 104 వాహనంతో గ్రామాలకు వెళ్లి తనకు కేటాయించిన సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలా రోజు మార్చి రోజు ఒక వైద్యుడు పీహెచ్సీలో మరో వైద్యుడు 104 వాహనం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తారు. వైద్యుడితో పాటు, సంబంధిత వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ), సచివాలయ ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రజలకు గ్రామాల్లోనే 104 ఎంఎంయూ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. ► 104 వాహనం ఏ రోజు ఏ గ్రామానికి వస్తుంది? తమ సచివాలయానికి కేటాయించిన వైద్యుడు, అతని ఫోన్ నంబర్, ఇతర వివరాలతో కూడిన విలేజ్ క్లినిక్/సచివాలయంలో ప్రదర్శిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమగ్ర వివరాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైనట్లు వైద్యుడు భావిస్తే, దగ్గరలోని పెద్ద ఆస్పత్రి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. ఏఎన్ఎం/ఎంఎల్‌హెచ్‌పీ ఆ రోగిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడం వంటి అంశాలను సమన్వయం చేస్తారు. తొలుత ఒక సందర్శనతో ప్రారంభం.. ► గ్రామాల్లో నెలలో రెండు సందర్శనలు చేపట్టడానికి వీలుగా 432 ఎంఎంయూలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు ఒక సందర్శన ద్వారానే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ► వీలున్న చోట వీటి ద్వారానే రెండు సందర్శనలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాక నెలలో రెండు సందర్శనల ద్వారా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అంటే? ► సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాల వారు ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుంటారు. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వెంటనే ఆ వైద్యుడిని సంప్రదిస్తారు. అతను జబ్బును గుర్తించడం, చిన్న చిన్న జబ్బులు అయితే ప్రాథమిక వైద్యం చేయడం, స్పెషలిస్ట్ వైద్యం అవసరం ఉంటే రెఫర్ చేయడం.. ఇలా వారి ఆరోగ్యం పట్ల వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటాడు. ► తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై వైద్యుడికి సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ సమకూరుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త హెడ్ల ఏర్పాటుకు ఆదివారమూ పనిచేశారు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఆర్థిక శాఖ అధికారులు సెలవు దినమైనప్పటికీ ఆదివారం రోజు కూడా వచ్చి సచివాలయాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్‌ను రూపొందించారని, పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని చెప్పారు. ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్ ప్రకారం జీతాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్.కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. జాని పాషా వేరొక ప్రకటనలో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎంకు ఉద్యోగుల ధన్యవాదాలు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు చెప్పారు. సోమవారం గుంటూరు డొంక రోడ్డులో ఉన్న సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కిషోర్, కో ఆర్డినేటర్ తోట మహేష్ ,గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ రాథోడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సచివాలయాలకు’ చట్టబద్ధత తెస్తున్నాం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత తెచ్చేందుకు ఓ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంక్షేమ కార్యదర్శులను పోలీసు శాఖలో అంతర్భాగం చేయడం కూడా ఈ చట్టంలో ఉంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో వివాదాలకు ఆస్కారం లేకుండా చట్టపరమైన పరిష్కారాలు చూపుతామన్నారు. ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను ఆగస్టుకు వాయిదా వేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, సిలబస్, జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీసు నిబంధనలు ఖరారు చేస్తూ ఇచ్చిన రెండు జీవోలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. తమను మహిళా పోలీసులుగా పరిగణించడం సరైనదేనని, తమ వాదనలు కూడా వినాలంటూ కొందరు మహిళా సంరక్షణ కార్యదర్శులు వేసిన అనుబంధ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ చట్ట విరుద్ధ చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తరువాత తన తప్పులను సరిదిద్దుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే చట్టాలు తెస్తోందన్నారు. మరో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ, పోలీసు యూనిఫాం వేసుకోవాలని మహిళా కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇష్టం లేని వారిని మరో చోట సర్దుబాటు చేయవచ్చు కదా అని ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. వినతిపత్రాలు సమర్పిస్తే పరిశీలిస్తామని ఏజీ చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని నర్రా కోరగా ధర్మాసనం నిరాకరించింది. మీరు వినతిపత్రాలు సమర్పించకుండా తామెలా ఉత్తర్వులు ఇవ్వగలమని ప్రశ్నించింది. -
త్వరలో ఈ–స్టాంప్ డ్యూటీ విధానం
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను ప్రజలు మరింత సులభంగా ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేందుకు స్టాంప్ వెండర్లు, గ్రామ–వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్లైన్లో చార్జీలను కట్టించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత కొందరు స్టాంప్ వెండర్ల వద్ద ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 71 మంది స్టాంప్ వెండర్లకు అవకాశం ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్ (ఏసీసీ) అనుమతిని వారికి మంజూరు చేశారు. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకు చలానాలు కాకుండా స్టాంప్ వెండర్ల వద్ద ఆన్లైన్లో స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కట్టేయవచ్చు. వాటి రశీదులను (స్లిప్‌లు) వారికిస్తారు. వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తారు. ఎస్‌హెచ్‌సీఐ ద్వారా అమలు ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ సంస్థతో అనుసంధానమై ఉంటాయి. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో విడిగా ఒప్పందం కుదుర్చుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను కట్టించుకునేందుకు వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఏరోజు కట్టించుకున్న చార్జీల మొత్తాన్ని ఆ రోజే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీనివల్ల వినియోగదారులు చలానాలు కట్టేందుకు డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే నకిలీ చలానాల సమస్య కూడా ఉండదు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో అధికారికంగా స్టాంప్ వెండర్ల వద్ద స్టాంప్ డ్యూటీ కట్టే సౌలభ్యం అందుబాటులోకి రానున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చెల్లింపులు మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి స్టాంప్ వెండర్ల కంటే ముందు వాటిలోనే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు. సాంకేతిక అంశాల కారణంగా తర్వాత దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్టాంప్ డ్యూటీని కట్టించుకునే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆసక్తిగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. వినియోగదారులు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందడానికి వీలుగా ఈ–స్టాంప్ డ్యూటీ విధానాన్ని తీసుకువస్తున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. -
సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ రామవరప్పాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తొలుత సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ సభ్యులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్ ఢిల్లీరావు.. సంతోష్ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు. చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్వవస్థలో వలంటీర్ల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. దిశ యాప్ గరించి.. దిశ యాప్‌ను సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్ ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. గ్రామ సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ మెహరా కోరారు. జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సునీత, డీపీవో కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్..!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీంతో వీరంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ‘థ్యాంక్యూ సీఎం సార్’ నినాదంతో అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిజానికి.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా వీరిని విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అవసరమైన శిక్షణనివ్వడంతో వీరు పట్టణాలు, గ్రామాల్లో అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక్కో అసిస్టెంట్ 1,500 కనెక్షన్ల బాధ్యత మరోవైపు.. రాష్ట్రంలో 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1.52 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30–40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను పర్యవేక్షించవచ్చు. 5–10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగుచేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా అతని పరిజ్ఞానం మేరకు బాగుచేస్తాడు. వీలుకాని పక్షంలో అధికారులకు వెంటనే సమాచారం అందించి నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తాడు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా వీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించారు. విద్యుత్ సరఫరా ఇబ్బందులకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ లేదా నేరుగాగానీ గ్రామ/వార్డు సచివాలయానికి ఫిర్యాదు వసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరించేలా వీరికి విధులు నిర్ధేశించారు. భారీగా తగ్గిన అంతరాయాలు సచివాలయాల వ్యవస్థ రాకతో విద్యుత్ సమస్యలు భారీగా తగ్గుతున్నాయి. గతంలో రెండు, మూడు ఊళ్లకు ఒక లైన్మెన్ ఉండేవారు. సమస్య వస్తే వారు దూరం నుంచి వచ్చి సరిచేయడానికి సమయం పట్టేది. కానీ, ఇప్పుడు అలా కాదు. ఊరిలోనే అందుబాటులో ఎనర్జీ అసిస్టెంట్ ఉంటున్నారు. ఫిర్యాదు రాగానే వాలిపోతున్నారు. 2019లో విద్యుత్ అంతరాయాలపై 6,98,189 ఫిర్యాదులొస్తే.. 2020లో వీటి సంఖ్య 4,36,837గా నమోదైంది. 2021లో అయితే సగానికిపైగా తగ్గిపోయాయి. కేవలం 2,02,496 అంతరాయాలు మాత్రమే వచ్చాయి. 2019తో పోలిస్తే 2021 నాటికి దాదాపు 4.95 లక్షలు, 2020తో పోల్చితే 2.34 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. -
సచివాలయ కార్యదర్శులకు గోరుముద్ద, టీఎంఎఫ్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జగనన్న గోరుముద్ద, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా.. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ మహమ్మద్ దివాన్ మైదాన్ ఆయా కార్యదర్శులు నిర్వర్తించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసీజర్ (ఎస్ఓపీ)లను విడుదల చేశారు. మహిళా పోలీసుల పాత్ర ఎమర్జెన్సీ నెంబర్లయిన 112, 100లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పాఠశాల పిల్లలకు పోలీసుల సహకారం అందుబాటులో ఉండేలా ఉపయోగకరమైన మెటీరియల్‌ని అందించాలి. పాఠశాలలను నెలనెలా సందర్శిస్తూ, అవగాహన శిబిరాలు నిర్వహించాలి. విద్యా, సంక్షేమ కార్యదర్శి పాత్ర వారానికి మూడుసార్లు పాఠశాలలను సందర్శించి గోరుముద్ద నాణ్యతను పరిశీలించాలి. ఐఎంఎంఎస్ యాప్‌లో ఫీడ్‌బ్యాక్ రాసి ఫొటోలను అప్లోడ్ చేయాలి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించాలి. పాత్రల పరిశుభ్రతను గమనించి హెచ్ఎంలకు సహకరించాలి. అలాగే, తల్లిదండ్రుల కమిటీతో చర్చించాలి. టాయిలెట్లు, వాష్బేసిన్లు, యూరినల్స్ ఇతర అనుబంధ వస్తువుల శుభ్రతను గమనించాలి. యాప్‌లో ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాత్ర పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఇంజినీరింగ్ అసిస్టెంట్ నెలకొకసారి పాఠశాలను సందర్శించాలి. ఫీడ్‌బ్యాక్‌ను డేటాబేస్‌లో అప్లోడ్ చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన పరికరాలు, క్లీనింగ్ మెటీరియల్‌ను పరిశీలించాలి. మరమ్మతులు చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ భౌతికంగా అందుబాటులో ఉండాలి. ఏఎన్ఎమ్ పాత్ర ఆశా, జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బందితో పాటు ఏఎన్ఎంలు నెలవారీగా పాఠశాలలను సందర్శించాలి. పిల్లల ఎత్తు, బరువు వయస్సుకు తగిన పెరుగుదలను తనిఖీ చేయాలి. పిల్లల రక్తహీనత లక్షణాలు గుర్తించాలి. బలహీనంగా ఉన్న వారి పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందికి సూచనలు చేయాలి. మురుగునీరు నిలవ ఉండకుండా చూడాలి. మంచినీరు, పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలి. -
AP: లక్ష ఇళ్లలో పెద్ద పండుగ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే. 2022 పే– రివిజన్‌కే సీఎం జగన్ ఆమోదం 2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు. ఆ ప్రకారం.. గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్ షాన్మోహన్ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రొబేషన్ డిక్లేర్ చరిత్రాత్మకం రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షన్నర నూతన ఉద్యోగాలు సృష్టించి శాశ్వత ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. సీఎం ఇచ్చిన మాట మేరకు పరీక్ష పాస్ అయిన వారందరి సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ, వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. ప్రొబేషన్ డిక్లరేషన్ చరిత్రాత్మకం. లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. – ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) అనంతపురం జిల్లా గుత్తి 11వ వార్డు సచివాలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో కలసి సంతోషం పంచుకుంటున్న సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం సంతోషం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. – కాకర్ల వెంకటరామి రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. థ్యాంక్యూ సీఎం సార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలు మరవలేనిది. థ్యాంక్యూ సీఎం సార్. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. – జాని పాషా, మనోహర్, బి.శ్వేతా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్‌కు సంబంధించి జీఓ విడుదల చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం నింపినందుకు ధన్యవాదాలు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు – గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నేతలు సాయినాథ్‌రెడ్డి, అర్లయ్య, సమీర్ హుస్సేన్, సల్మాన్ బాషా, రాజశేఖర్‌బాబు కాకినాడ మూడో డివిజన్ సురేష్‌నగర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు మాలో సీఎం ధైర్యాన్ని నింపారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ఒకేసారి లక్ష మంది ప్రొబేషన్ ఖరారు చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. – అంజన్‌రెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరింత ఉత్సాహంగా పని చేస్తాం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాం. – గునిపే రాజేష్, షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 5ను జారీ చేసింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది. -
AP: ప్రొబేషన్ డిక్లరేషన్‌పై హర్షం
సాక్షి, అమరావతి/మద్దిలపాలెం: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు మరిచిపోలేమంటూ కృతజ్ఞతలు తెలియజేశాయి. ఆదివారం విశాఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అస్కారరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే లక్షలాది మందికి ఉద్యోగాలివ్వడం గొప్ప విషయమన్నారు. వారి సర్వీసును రెండున్నరేళ్లలోనే క్రమబద్ధీకరించడం చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు పొడిగించాలని.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. జీవో 64ను రద్దు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్‌లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 117ను రద్దు చేయాలని టీచర్లు చేపడుతున్న ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు చెప్పారు. సంఘం నాయకులు ఎస్వీ రమణ, జవహర్లాల్, శ్రీకాంత్‌రాజు పాల్గొన్నారు. కాగా, ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారమే జూన్ నెలాఖరుకల్లా అర్హులైన ‘సచివాలయ’ ఉద్యోగుల ప్రొబేషన్‌ను డిక్లేరు చేసి సీఎం జగన్మోహన్రెడ్డి తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ కొనియాడింది. ‘సచివాలయ’ ఉద్యోగ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలçహాదారు ధనుంజయరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ) -
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేశారు కూడా. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. -
AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు
కాకినాడ: ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకెంతో మేలు చేస్తోందని కేంద్ర మత్స్యకార, పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ప్రశంసించారు. బుధవారం ఆయన కాకినాడలో పర్యటించి.. 36వ డివిజన్ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను, ప్రతి డివిజన్‌కు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసి.. వాటికి కార్యదర్శులను నియమించి.. వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దళారీ వ్యవస్థకు దూరంగా.. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరుస్తుండటం వ్యక్తిగతంగా కూడా తనకెంతో నచ్చిందని చెప్పారు. అంతకుముందు 36వ డివిజన్ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఫోన్ నుంచి దిశ యాప్ పనితీరును ఆయన పరిశీలించారు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. ‘నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్ బటన్ నొక్కాను’ అని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దిశ యాప్‌తో పాటు కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేయర్ సుంకర శివప్రసన్న తదితరులున్నారు. -
సచివాలయాల్లో ఆధార్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. తొలిసారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది. అయితే, ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఐదు సచివాలయాలకు ఒకటి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు షాన్ మోహన్ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఆధార్ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైస్, వైట్ స్క్రీన్, ఫోకస్ లైట్, జీపీఎస్ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్డీఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు సరఫరా చేస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో మొత్తం 1,100 సచివాలయాలకు ఆ కిట్లను కూడా అందజేశారు. మిగిలిన చోట్లకి సరఫరా ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కిట్లు అందుకున్న సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ.. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ సేవలకు మాత్రమే పరిమితం చేయాలని, వారికి మరే ఇతర సేవలు కేటాయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఆధార్ సేవలందించే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోతే.. సమీపంలోని మరో సచివాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న సచివాలయాల వివరాలను లోకల్ టీవీ చానళ్లు ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు నిర్వహించి ఆధార్ నమోదు, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ తదితర సేవలు అందజేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. -
నెరవేరబోతున్న కల!: ప్రభుత్వ ఉద్యోగులుగా సచివాలయ సిబ్బంది
సచివాలయ కొలువులకు భద్రత లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలన్న సిబ్బంది కల సాకారం కానుంది. ఉద్యోగుల భవితకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రొబేషన్‌ను పూర్తి చేసుకున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు అధికారం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందిన వారి జాబితాను సిద్ధం చేసింది. దీంతో సచివాలయ సిబ్బంది ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ప్రజలకు సేవలందించే భాగ్యంతోపాటు భవితకు భరోసా లభించిందని హర్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతూ జిల్లా వ్యాప్తంగా 1,312 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో 11,969 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,319 మంది ఉద్యోగాలు సాధించారు. 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో 11 పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–6, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వీఆర్వో, మహిళా పోలీస్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల్లో ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. వార్డు సచివాలయాల్లో 10 పోస్టుల్లో అడ్మిని్రస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, హెల్త్సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, అమెనిటీస్ సెక్రెటరీ, ఎనర్జీ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రొబేషన్ కసరత్తును ఉన్నతాధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ ఇటీవల ఈ కసరత్తుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమా వేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. ప్రొబేషన్ వివరాల నివేదికను ఈ నెల 31లోపు ప్రభుత్వానికి పంపనున్నారు. రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో సచివాలయ ఉద్యోగుల యాంటిసిడెంట్ వెరిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రెండవ విడత పరీక్షలో ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో వారికి వచ్చే దశలో ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, అర్బన్ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ పర్యవేక్షించాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీగా కసరత్తు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. మొదటి దశలో ఉద్యోగాల్లో చేరిన వారికి నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌కు అర్హులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీగా కసరత్తు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించాం. ఇటీవల సమావేశం నిర్వహించి ప్రొబేషన్ కసరత్తుపై పలు సూచనలు చేశాం. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు నా పేరు హరిబాబు. పూతలపట్టు నియోజకవర్గం నాగవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నా. ప్రొబేషన్ పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. ప్రజల ఇంటి వద్దకే పరిపాలన కోసం సచివాలయాలను ఏర్పాటు చేసి మాకు ఉద్యోగాలు కల్పించిన సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయడంలో పారదర్శకత పాటిస్తాం. నా పేరు జీఎస్.మధురవాణి. ఎంఎస్సీ పూర్తయింది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం–2 గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. గతంలో ప్రైవేట్ కళాశాలలో పనిచేశా. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నా జీవితానికి భరోసా దక్కింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నేను విధుల్లో చేరి రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్నా. త్వరలో నన్ను రెగ్యులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల మేరకు రైతు భరోసా కేంద్రం ద్వారా దేశానికి వెన్నెముక అయిన రైతులకు సేవ చేయడం ఆనందంగా ఉంది. -
ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరూ మురిసిపోతున్న వేళ మహాత్మాగాంధీ ఒక మాటన్నారు. మన దేశాన్ని మనమే పాలించుకోబోతున్నాం.. మంచిదే కానీ.. మనం గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని అన్నారు. ఆయన సంకల్పానికి, ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ విధానపరమైన నిర్ణయం తీసుకొని అమల్లోకి తీసుకొచ్చారు. చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం పరిపాలన అనేది ప్రజలందరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా.. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐదు వందలదాకా సేవల్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వ సేవ కావాలంటే ఒకప్పుడు మండల జిల్లా కేంద్రాలకు పరిగెత్తే ప్రజలు ఇప్పుడు తమ ఊర్లోనే అనేక సేవల్ని పొందుతున్నారు. దాంతో ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా.. పథకం ఏదైనా సరే అర్హత వుంటే చాలు ప్రజలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తేవడంలో గ్రామ వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని 30వ డివిజన్లో సేవలందిస్తున్న వార్డు సచివాలయాన్ని మూడు సంవత్సరాల క్రితం ఉప్పుటేరు వాగు సమీపంలో నిర్మించారు. దీని పరిధిలోగల 909 కుటుంబాలవారికి అర్హత వుంటే చాలు వివిధ సంక్షేమ పథకాలను అందించడంలో ఈ సచివాలయం కీలకంగా పని చేస్తోంది. అంతే కాదు పలు రకాల సర్కార్ సేవలను అతి తక్కువ సమయంలో అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలు తమ ఇంటి వద్దకే నేరుగా వస్తున్నాయని స్థానికులు సంతోషంగా చెబుతున్నారు. ఒక పథకం అందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా రోజుల తరబడి తిరిగే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వీరు అంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా తొందరగా అయిపోవడమే కాకుండా.. లంచాలు లేకుండానే పనులు చాలా సులువుగా అవుతున్నాయని వారు చెబుతున్నారు. చదవండి: జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు కాకినాడ నగరంలో 3 లక్షలకు పైగా జనాభా వుంది. వీరికి సేవలందించేందుకు 101 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటైన 30 వ డివిజన్ వార్డు సచివాలయంలో మొత్తం 10 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో వాలంటీర్లు వుంటారు. వారు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్ళి లబ్ధిదారుల వివరాలు సేకరించి సచివాలయానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తమ పరిధిలోని ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇలా సమాజ అభివృద్ధిలో భాగమవ్వడంద్వారా వృత్తిపరమైన సంతృప్తి కలుగుతోందని ఇక్కడ సంక్షేమ విభాగ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీనివాస్ అంటున్నారు. అన్ని అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొని సచివాయాల వ్యవస్థ నానాటికీ బలోపేతమవుతోంది. స్థానిక ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ప్రజాదరణ పొందుతోంది. దాంతో ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన సచివాలయాల వ్యవస్థను అధ్యయనం చేయడమే దీనికి నిదర్శనం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మధ్యనే ఈ వ్యవస్థను ప్రశంసించారు. మహత్ముని గ్రామ స్వరాజ్య కలలను సాకారం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ వ్యవస్థ అందించే సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని స్థానిక నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వేలాది గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వంతెనలాగా మారాయి. ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా అవతరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ప్రకారం.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వందలాది ప్రభుత్వ సేవల్ని తక్కువ సమయంలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయం. ఇక్కడ ఏడుగురు సచివాలయ సిబ్బంది, 17 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎంతో హుందాగా అత్యంత సుందరంగా కార్పొరేట్ కార్యాలయంలా కనిపిస్తున్న ఈ సచివాలయంలోలోకి అడుగు పెట్టగానే ఇక్కడ ధనమ్మ అనే వృద్ధురాలు కనిపించారు. సచివాలయ సేవలను ఆమె కొనియాడారు. పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయ పరిధిలో 949 కుటుంబాలున్నాయి. వీటికి సంబంధించిన సంక్షేమ పథకాలను, స్థానికులకు అవసరమయిన పౌర సేవలను అందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, డిమాండ్లను బట్టి దాదాపు ఐదువందల రకాల సేవలు ఈ గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. ఇవి కేవలం అందడమే కాదు, నాణ్యంగా వుండాలని, అంతే కాదు సమయానికి అందడం ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు అధికార్లకు దిశానిర్దేశం చేశారు. అది కాలక్రమంలో ఫలితాలనిస్తోంది. అవినీతి, వివక్షత, రాజకీయ ప్రమేయం లేకుండా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న గ్రామవార్డు సచివాలయాలు.. ప్రజల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాయి. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వారు అందుకుంటున్న సేవల్లో గణనీయమైన తేడా కనిపిస్తోంది. పింఛను కావాలంటే గతంలోలాగా వారం పదిరోజులు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎక్కడకో వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం ఆరుగంటలు అయ్యీ కాకముందే లబ్ధిదారుల ఇంటి ముందు వాలంటీర్లు ప్రత్యక్షమవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మరెంతో దార్శనికతతో ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్లు అంటున్నారు. ఈ వ్యవస్థ కారణంగా తమకు సమాజంలో గౌరవం పెరిగిందని.. కరోనా సంక్షోభ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రజలకు మేలు చేయడం జరిగిందని.. ఇది ఎంతో గొప్ప విషయమని మరో వాలంటీరు విజయ్ కుమార్ అంటున్నారు నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ వెంకటరెడ్డి నగర్ సచివాలయంలో పదిమంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితో పాటు 19 మంది వాలంటీర్లు ఇక్కడ సేవలందిస్తున్నారు. వేయికి పైగా కుటుంబాలు ఈ సచివాలయ పరిధిలో వున్నారు. మరణ ధృవీకరణ పత్రం కోసం గతంలో కాళ్లరిగేలా తిరిగిన సుభద్రమ్మ సచివాలయాలు వచ్చిన తర్వాత పెద్దగా సమయం పట్టకుండానే ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండానే చాలా వేగంగా తమకు కావాల్సిన పత్రాలు వస్తున్నాయని అంటున్నారు. వైఎస్ జగన్ పాలన మొదలై మూడు సంవత్సరాలవుతోంది. ముప్పయికిపైగా పథకాలు ప్రజాదరణ పొందాయి. ప్రతి పథకానికి ఒక విశిష్టత వుంది. కేజీ నుంచి పీజీదాకా విద్యార్థులకు పథకాలున్నాయి. విద్య వైద్య వ్యవసాయ రంగాలకు చెందినవారితో పాటు బీసీ ఎఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఆర్థిక కష్టాలనుంచి బైటపడేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క పథకం కూడా దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే చేరాలనే తపనతో గ్రామవార్డు సచివాలయాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఈ మహాయజ్ఞంలో భాగం కావడం సంతోషంగా వుందని వాలంటీర్లు చెబుతున్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలను తమ కుటుంబాలుగా భావిస్తున్నారు. అంతే కాదు ఆయా కుటుంబాలు కూడా తమకు సంబంధించిన వాలంటీర్లను తమ కుటుంబ సభ్యులుగా బావించి ఆదరిస్తున్నాయి. ఇది ఈ మూడేళ్లలో సమాజంలో కనిపిస్తున్న మానవీయ బంధమని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్ నిమ్మల అరుణ అంటున్నారు. సచివాలయంలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా పని చేసే సతీష్ గతంలో ఒక సాప్ట్వేర్ కంపెనీలో పని చేశారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెక్రటరీగా ఉద్యోగం సాధించాడు. ఉపాధ్యాయురాలిగా పని చేయాలని భావించిన ప్రియాంక మనసు మార్చుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం సాధించారు ప్రభుత్వ సంకల్పం ప్రకారం పని చేస్తున్నామని సంతోషంగా వుందని ఈమె అంటున్నారు. గ్రామవార్డు సచివాలయాల కారణంగా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించడం ఒక మార్పు.. అంతే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా వున్న వేలాది సచివాలయాలద్వారా ప్రజల ముంగిటకే పాలన వెళ్లిపోతోంది. గతంలో పలు సేవలకోసం సమయం, డబ్బు వృధా చేసుకున్నవారికి ఇప్పుడా సమస్యలు లేవు. పనులు తొందరగా, సులువుగా, కళ్ల ముందే అయిపోతున్నాయి. ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంది. -
జూన్ చివరికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్.షాన్మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీపాషా సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు) -
చరిత్రాత్మక పరిపాలన
దగదర్తి (కావలి): రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా, పాలనలో పారదర్శకత ఉండేలా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ చరిత్రలో నిలిచిపోనుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దగదర్తి మండలం కొత్తపల్లికౌరుగుంటలో స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆదాల, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని 719 సంఘాలకు సంబంధించి రూ.97 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనను, సంక్షేమ పథకాలను పేదల ముంగిటకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. మూడు విడతల్లో రూ.25 కోట్లు పంపిణీ కావలి నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద మూడు విడతల్లో రూ.25 కోట్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రైతాంగానికి అండగా నిలబడేందుకు డీఎం చానల్, డీఆర్ చానల్, కావలి కాలువ అభివృద్ధి పనులకు చేపడుతున్న చర్యలను వివరించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుని పేదలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నాయకులు తప్పుడు కేసులతో కోర్టులను అడ్డు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క దగదర్తి మండలంలోనే కోర్టు కేసుల కారణంగా ఎనిమిది గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకులు ఏర్పడ్డాయని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడు, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డైరెక్టర్ అనిల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోగుల వెంకయ్యయాదవ్, పలువురు అధికారులు, సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్‌కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
ఫలితాలిచ్చిన ఆస్తి పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే 55 శాతం అధికంగా పన్ను చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని, ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. పలు దఫాలుగా ఆస్తి పన్ను చెల్లింపులపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన రూ.320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి 55 శాతం అధికంగా రూ.496.51 కోట్లు వసూలైందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరించారు. -
సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు
సాక్షి, అమరావతి: మూరుమూల పల్లెటూళ్లో బాగా చదువుకున్న చాలా మంది యువతకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నది పెద్ద కల. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడం వీరికి ప్రయాసతో కూడుకున్న పనే. దగ్గరలో ఉన్న పెద్ద పట్టణానికో, నగరానికో వెళ్లాలి. అక్కడ అన్లైన్లో ఎలాంటి తప్పుల్లేకుండా పాస్‌పోర్టుకు దరఖాస్తు (స్లాట్ బుకింగ్) చేయాలి. వీటి కోసం దళారులు ఒక్కో పాస్‌పోర్టుకు 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తారు. దరఖాస్తులో తప్పులు దొర్లితే మళ్లీ ప్రయత్నించాలి. గ్రామీణ ప్రజలకు ఇప్పుడా అవస్థలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల్లోనే పాస్పోర్టుతో పాటు పాన్‌కార్డు, రైల్వే టిక్కెట్ బుకింగ్ వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా వీటిలో పొందవచ్చు. ఎల్ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించొచ్చు. ఇప్పటివరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం సచివాలయాల ద్వారా పొందే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఇప్పటికే 98 మందికి పాస్‌పోర్టు సేవలు రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. అన్ని సచివాయాలల్లోనూ అదనపు సర్వీసులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సేవలపై సచివాలయానికి ఒకరికి చొప్పున సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి 1,600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. వీటికి స్పందన కూడా బాగుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 98 మంది పాస్‌పోర్టు సేవలను వినియోగించుకున్నట్టు వెల్లడించారు. మరో 484 మంది పాన్‌కార్డు సేవలు వినియోగించుకున్నారు. సచివాలయాల్లో కొత్త సేవల గురించి ‘సిటీజన్ ఔట్ రీచ్’ పేరుతో ప్రతి నెలా రెండు రోజుల పాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్టున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. జూన్ నుంచి మరిన్ని సచివాలయాల్లో ఆధార్ సేవలు దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ– స్కానర్, బయోమెట్రిక్ డివైస్ తో కూడిన ఆధార్ కిట్లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు చేయిస్తామని అధికారుల తెలిపారు. ఇప్పటికే ఆధార్ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు వెల్లడించారు. -
సచివాలయ వ్యవస్థ అద్భుతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక, 540 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటనే అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అద్భుతమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సేవలను వారి గ్రామాల్లోనే అందించడం కూడా అభినందించదగ్గదని అన్నారు. ఆయన మంగళవారం రెండో రోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్దదైన విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న లేఅవుట్‌ను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ హౌసింగ్ కాలనీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అభివర్ణించారు. అనంతరం మన బడి నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన బొండపల్లి మండలం గొట్లాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాల ఫొటో ప్రదర్శనను తిలకించారు. పూసపాటిరేగ మండలం కుమిలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సేవలను ఆయనకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సచివాలయ వ్యవస్థ అద్భుతమని ప్రశంసించారు. ఆర్బీకేల సేవలను కలెక్టర్ ఎ.సూర్యకుమారి వివరించారు. అనంతరం విజయనగరంలోని మహారాజా జిల్లా కేంద్రాస్పత్రిలో పీడియాట్రిక్ ఐసీయూను కేంద్ర మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్ రోగుల కోసం బ్లాక్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో రోడ్లకు అనుమతులు ఇప్పించండి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేక గిరిజనులు అత్యవసర వైద్యాన్ని, విద్యను పొందలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారులకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు. రెండేళ్లలో ఇంత అభివృద్ధా? సంక్షేమ పథకాలపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, స్టాళ్లను కేంద్ర మంత్రి తిలకించారు. నీతిఆయోగ్, యాస్పిరేషన్ జిల్లా సూచీలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అభివృద్ధిని అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెండేళ్లలో ఇంత అభివృద్ధి జరగడంపై కేంద్ర మంత్రి అభినందించారు. జిల్లా మరింతగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. తాను మరోసారి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లాల సరసన విజయనగరం ఉండాలని అభిలషించారు. 2025 నాటికి క్షయ, కుష్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు సాఫ్ట్వేర్ సహా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, రఘురాజు, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!
ఎప్పుడూ ముందుతరం కన్నా తర్వాతి తరం తెలివిగా ముందంజ వేస్తుంది. శ్రీశ్రీ ‘నేను తిక్కన కన్నా గొప్పవాడిని– ఎందుకంటే నాలాగా తిక్కనకి వేమన తెలీదు, గురజాడ తెలీదు’ అన్నారు. అలాగే యువకులైన ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రలో జగన్ పాలనలో కొత్త సంస్కరణలు వేగంగా అమలు జరుపుతున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ బడులు తీర్చిదిద్దిన విధానం చక్కని ఉదాహరణ. కేంద్రీకృత విధానం అవలంబిస్తే అన్ని ప్రాంతాలకీ న్యాయం జరగదని భావించి, వికేంద్రీకరణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ముందుకు వెళుతోంది జగన్ ప్రభుత్వం. వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాలు, కొత్త జిల్లాలు, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు సచివాలయాల వలన ఎంత సౌఖ్యంగా ప్రజలున్నారో మనకు తెలుసు. ఒక వాలంటీర్‌కు 50 కుటుంబాలను అప్పజెప్పడంతో వారు వాట్సాప్ గ్రూప్ పెట్టి రేషన్ వచ్చిందనీ, వ్యాక్సిన్ వేయించుకోమనీ, పన్ను కట్టమనీ మెసేజ్‌లు ఇస్తున్నారు. ఇటు ఆ ప్రజలకి కూడా ఇంటి ముందు చెత్త ఉందనీ, పెన్షన్ రాలేదనీ వెంటనే అడిగే అవకాశం వచ్చింది. ఈ వ్యవస్థ వల్ల జవాబుదారీతనం పెరిగింది. ఉత్తమ మేనేజ్మెంట్కి ఉదాహరణగా... ఉద్యోగులకు ‘సేవా మిత్ర’, ‘సేవా రత్న’, ‘సేవా వజ్ర’ అవార్డులు ఇస్తున్నారు. నిజంగా దిగువ స్థాయి ఉద్యోగుల శ్రమని ఇంతలా గుర్తించిన ముఖ్యమంత్రులు నేటి దాకా ఎవరూ లేరనే చెప్పాలి. ఒకప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ అంటే మంత్రులూ, వారి పీఏలూ వారి చుట్టూ ఊరి పెద్దలూ, కుల పెద్దలూ తిరుగాడుతుండేవారు. ఇప్పుడు ఆ దృశ్యాలు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికీ, ప్రజలకూ గ్యాప్ లేకుండా పాలన అందుతోంది. ఇది వికేంద్రీకరణ ఫలితమే. ఇక నూతన జిల్లాల ఏర్పాటు విషయానికొస్తే... నిజానికి చిన్న జిల్లాల ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మన్యం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాలుగా విభజించడం వలన అమాయక గిరిజన ప్రజలనూ, ఆ ప్రాంతాల్నీ అసాంఘిక శక్తుల బారిన పడకుండా మరింతగా రక్షించే అవకాశం వస్తుంది. దగ్గర్లోనే కలెక్టర్, ఎస్పీ, పోలీసు బలగం ఉన్నందువల్ల కచ్చితంగా ‘లా అండ్ ఆర్డర్’ అమలు జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రాజధానులు అనే కొత్త ఆలోచన వచ్చినందుకు... ‘వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు’ అని వినీ వినీ విసిగి వేసారిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కాస్త ఊరట కలిగింది. కర్నూలులో హైకోర్టు ఉంటే అవసరమున్నవారు కర్నూలు వెళ్తారు. అమరావతిలోనే హైకోర్టు కూడా ఉంటే అక్కడ హోటల్ సేవలు ఖరీదు అవుతాయి. ఆటోలు దొరకవు. ట్రాఫిక్ పెరిగి పోతుంది. దీనివల్ల జనసామాన్యానికి చాలా ఇబ్బంది. అవసరాన్ని బట్టి కర్నూలుకు కొంతమందీ, విశాఖకి కొంతమందీ వెళ్తే అక్కడ కూడా అనేక వ్యాపారాలు పెరుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాల అభివృద్ధీ, అన్ని రకాల మనుషుల అభివృద్ధీ చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) ప్రభుత్వ పనుల్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రతిపక్షాలు కృష్ణ, గుంటూరు జిల్లాల మీద లేని ప్రాంతీయ అభిమానం చూపిస్తూ... విశాఖ, కర్నూలు రాజదానులుగా పనికిరావు అంటే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆనందం అభివృద్ధి వచ్చే విధంగా నూతన చట్టం తెచ్చి అయినా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఆశిద్దాం. (క్లిక్: జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!) - డాక్టర్ అయ్యగారి సీతారత్నం తెలుగు ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
కలిసి 'సాగు'దాం
రైతు భరోసా కేంద్రం... ఓ విప్లవం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వేటికీ ఊరు దాటివెళ్లాల్సిన పనిలేకుండా... ఆఖరికి పంట విక్రయానికి కూడా అక్కరకొచ్చేలా ఊళ్లో వెలసిన సేద్యాలయం. రైతాంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చే శక్తి కలిగిన ఈ ఆర్బీకే.. యావత్తు దేశానికీ ఓ రోల్‌మోడల్. దీనికి అనుబంధంగా రైతులకు పనిముట్లు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... తదుపరి అడుగుగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయాలు... ఇవన్నీ ఇప్పుడు యావద్దేశాన్నీ ఆకర్షిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏపీకి వచ్చి వెళ్లాయి. ఏపీ మాదిరి సేంద్రియ సాగుకు ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సిద్ధంకాగా... మరో ఏడు రాష్ట్రాలు ఇదే బాటలో నడవనున్నాయి. దీనిపై ఏపీతో కలసి పనిచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ త్వరలోనే ఒప్పందం చేసుకుంటోంది కూడా!!. ఇక వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అద్దె ప్రాతిపదికన రైతన్నలకు వ్యవసాయ ఉపకరణాలను అందిస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ప్రత్యక్షం కానున్నాయి. ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అద్దెకు యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే... వైఎస్ జగన్ ఏపీలో ఆరంభించినట్లే తామూ ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని శుక్రవారం అసెంబ్లీ ముఖంగా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రకటించటం మరో ఎత్తు. ఏపీలో విమర్శలు మాత్రమే తెలిసిన విపక్షాలకు ఇవన్నీ అర్థం కాకున్నా... యావత్తు దేశమూ బాగానే అర్థం చేసుకుంటోంది.!! ప్రతి ఆదివారం... ప్రత్యేకం ‘నిన్నటికంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటామనే ఆశ కల్పించటం’ ఇదే అభివృద్ధికి నిర్వచనమంటూ విద్య, వ్యవసాయ, ఆరోగ్య రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా చేసుకుని... సమూల సంస్కరణలతో ముందుకెళుతున్న ఏపీ ఇపుడు పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. సచివాలయాల నుంచి మొదలుపెడితే... సంచార పశువైద్య శాలలు, సేంద్రియ సాగు విధానాలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, రేషన్ డోర్ డెలివరీ, సరికొత్త ఆక్వా కల్చర్ చట్టం, ఆర్బీకేలు, విద్యాసంస్థలు– ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు... ఇవన్నీ పలు రాష్ట్రాల్లో అమల్లోకి రాబోతున్నాయి. పొరుగునున్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అధికారులు వచ్చి వీటిని అధ్యయనం చేసి వెళుతున్నారు. కొన్నింటిని ఏకంగా కేంద్రమే దేశవ్యాప్తంగా తేవాలనుకుంటోంది. ఆ వివరాలతో... ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఇస్తున్న కథనాల్లో రెండవ కథనమిది. నెల్లూరు జిల్లా అల్లూరు ఆర్బీకే సీహెచ్‌సీలో రైతు కమిటీకి ఇచ్చిన యంత్ర పరికరాలు ఏపీలో అద్భుత ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సాగు అమలవుతున్న తీరును పరిశీలించాం. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే తరహాలో ఎరువులు, రసాయన పురుగు మందులను వినియోగించకుండా సహజసిద్ధ ఆహార ఉత్పత్తులను పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎంవోయూ కుదుర్చుకోనుంది. ఖరీఫ్ నుంచి దశలవారీగా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తాం. ఇందుకు అవసరమైన క్షేత్ర స్థాయి వ్యవస్థ ఏర్పాటులో ఏపీ రైతు సాధికారసంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. సిబ్బందితో పాటు రైతులకు కూడా శిక్షణ ఇవ్వనుంది. – భగవాన్‌దాస్ బైసర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మాండ్లా జిల్లా, మధ్యప్రదేశ్ మనవైపు దేశం చూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం వల్ల ప్రకృతి సాగులో అద్భుత ఫలితాలు నమోదవుతున్నాయి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంఓయూ చేసుకోనుంది. రాష్ట్రంలో ప్రకృతి సాగును పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అమలు దశకు చేరుకోగా మరో ఏడు రాష్ట్రాలు చర్చల దశలో ఉన్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ మోడల్.. మోడర్న్ సాగుబాట వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వినూత్న విధానాలు జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అద్దెకు గ్రామాల్లో యంత్ర పరికరాలు సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఆర్బీకేలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ.1,615 కోట్లతో గ్రామ స్థాయిలో 10,750 సీహెచ్‌సీ (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), వరి సాగయ్యే జిల్లాల్లో రూ.404 కోట్లతో క్లస్టర్ స్థాయిలో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో సీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం కింద ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన యంత్రాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.645 కోట్లతో 4,061 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.161.50 కోట్లతో 142 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే స్థాయిలో మరో 4,105 సీహెచ్‌సీలతో పాటు 491 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక మిగిలిన సీహెచ్‌సీలను జూన్ కల్లా గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో విత్తనం నుంచి నూర్పిడి వరకు అన్నదాతలు ఎదుర్కొంటున్న కూలీల కొరతకు ప్రభుత్వం చెక్ పెట్టగలిగింది. పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతోంది. ట్రాక్టర్లు కూడా.. ఆర్బీకేల స్థాయిలోనే ట్రాక్టర్లను కూడా అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతగా 3,500 ట్రాక్టర్లను మే నెలలో రైతు కమిటీలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ తరహాలో అండగా నిలిచేలా.. గ్రామాల్లో రైతు గ్రూపులకు యంత్ర పరికరాలను అందించి అద్దె ప్రాతిపదికన మిగిలిన అన్నదాతల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఇదే రీతిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)కు అద్దె ప్రాతిపదికన యంత్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పరిధి పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో అండగా నిలవాలని నిర్ణయించింది. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా చేశారు. యాంత్రీకరణ దిశగా శిక్షణ.. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహించడం, హై ప్రొడక్టివ్ ఫామ్ మిషనరీ అందుబాటులోకి తేవడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. 40–50 శాతం రాయితీని కొనసాగిస్తూ బ్యాంకుల ద్వారా ఆర్ధిక చేయూతనందించేలా కేంద్ర వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో డిమాండ్ ఉన్న ఆర్బీకేల్లో అదనంగా రెండో సీహెచ్‌సీ ఏర్పాటుతోపాటు రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో 40 శాతం సబ్సిడీపై వీటిని నెలకొల్పనున్నారు. ‘ప్రకృతి’లో ఆదర్శం ప్రకృతి సాగు విధానాలలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంవోయూ చేసుకోనుంది. సేంద్రియ సేద్యంపై యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేయగా కేరళ, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ మన రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే మన రాష్ట్రంతో ఒడిశా ప్రభుత్వం ఎంవోయూ చేసుకోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నెలాఖరులో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సాగు ఇలా.. రాష్ట్రంలో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కింద రూపుదిద్దుకున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. గత ఖరీఫ్‌లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో దీన్ని అనుసరించారు. ప్రస్తుత రబీలో 71 వేల మంది రైతులు 76 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశారు. మధ్యప్రదేశ్‌లో వంద గ్రామాల్లో.. మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో 4 బ్లాకుల (మండలాలు) పరిధిలో సహజ వ్యవసాయ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలుత బిచియా బ్లాకులోని 3 క్లస్టర్స్, నివాస్ బ్లాకులోని ఓ క్లస్టర్‌ను ఇందుకు ఎంపిక చేసి వంద గ్రామాల్లో అమలు చేస్తున్నారు. 18,750 ఎకరాల్లో 15 వేల మందికిపైగా గిరిజన రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ రైతు సాధికార సంస్థ టెక్నికల్ ఏజెన్సీగా, వాసన్ సంస్థ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా వరి, ఉల్లి, కందులు, శనగలు (చనా), అరికెలు (కోడా), సామలు (కుట్కి), కూరగాయలు సాగవుతాయి. గ్రామ స్థాయిలో సీఆర్పీ వ్యవస్థ ప్రకృతిసాగు అమలు కోసం మధ్యప్రదేశ్‌లో సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున కనీసం 200 మందిని సిద్ధం చేస్తారు. సీఆర్పీలతో పాటు క్లస్టర్, బ్లాకు స్థాయిలో సమన్వయం కోసం ఐసీఆర్పీ(ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్)తో పాటు ఎఫ్ఈఎస్ (ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ), ఎంపీఎస్ ఆర్ఎల్ఎం (మధ్యప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)కు చెందిన సీబీఓ(కమ్యూనిటీ బేస్ట్ ఆర్గనైజషన్) సభ్యులకు సహజ వ్యవసాయ నమూనాలు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణనిస్తారు. ఎంపిక చేసిన 8 గ్రామ పంచాయతీల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో ఇన్పుట్ కమ్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఘన జీవామృతాలు, కషాయాల తయారీ విధానంతో పాటు వినియోగంపై రైతులకు శిక్షణనిస్తారు. రెండు రౌండ్లలో 45 రోజుల పాటు మరో రెండు రౌండ్లలో 30 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. -
సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన పలు విషయాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘‘ఈనెల 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరగనుంది. ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం. డీఎంకే అధికారంలోకి వచ్చినపుడల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాదికి ఒకరోజు స్థానిక సంస్థల దినంగా జరుపుకోవాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూచించాను. ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. గ్రామీణుల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా ఇకపై ఏటా నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తాం. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేలా గ్రామ సచివాలయాలకు ఇప్పటికే అనేక అధికారాలు, బాధ్యతలు ఇచ్చాం. 1998లో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టం తీసుకొచ్చాం. ఇక ఈ ఏడాది నుంచి ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు ‘‘ ఉత్తమర్ గాంధీ అవార్డు’’ను ప్రదానం చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తామ’’ని వివరించారు. చదవండి👉🏾 సోనియా చేతికి నివేదిక అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రోజుకు 17,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 13,100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేనందున సరఫరాలో అంతరాయం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ విమర్శలకు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బదులిస్తూ, రాష్ట్రపరిధిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ గ్రిడ్ నుంచి రావాల్సిన 796 మెగావాట్లు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తక్కువ ధరతో 3వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ఎడపాడి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. అసెంబ్లీలో అవీ ఇవీ.. ►పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరూ చేరడం లేదని.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకే నాన్ ముదల్వన్ పథకాన్ని తీసుకొచ్చామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చెప్పారు. ►సీఎం స్టాలిన్‌ను మరో కామరాజర్గా భావిస్తున్నానని ప్రతిపక్ష పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కీర్తించడం విశేషం. -
సకలం.. సచివాలయం
రేషన్ కార్డు రావాలంటే జన్మభూమి కమిటీ తేల్చాలి. ఇళ్ల పట్టా కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పడిగాపులు కాయాలి. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాలి.. ఇలా సమస్యలకు పరిష్కారమే దొరికేది కాదు. ఇదంతా గతం. అలాంటి పరిస్థితులకు చెల్లుచీటీ పాడింది ప్రస్తుత ప్రభుత్వం. పాలనలో కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఇంటిముంగిటకే ప్రభుత్వ సేవలు తీసుకురావడంతో గ్రామీణ ప్రజలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాలకు 90 వేలకు పైగా వినతులు వచ్చాయి. పైసా లంచం లేకుండా, ఇంటికి కిలోమీటరు దూరం కూడా లేని పది నిమిషాల నడకతో సమస్య పరిష్కారం అవుతుండటంతో పట్టణ ప్రాంతాలే కాదు గ్రామీణులూ ఆనందపడుతున్నారు. పారదర్శక పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/ వార్డు సచివాలయ– వలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సేవలన్నీ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే వచ్చాయి. సమస్య ఏదైనా సచివాలయ స్థాయిలోనే పరిష్కారం లభిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు సచివాలయాలకు అక్షరాలా 90,095 వినతులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవే 63,701 వినతులు వచ్చాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్నిబట్టి చూస్తే మొత్తం వినతుల్లో 70 శాతం పైగా రెవెన్యూ సమస్యల మీద వచ్చినవే. భూములకు సంబంధించి 1బీ కోసం వచ్చిన వారు 23వేల మందికి పైగా ఉండగా, అడంగల్ కోసం వచ్చిన వారు 14 వేల మంది పైచిలుకు ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 90వేల పై చిలుకు వినతులు రాగా, 72,302 పరిష్కారమయ్యాయి. కొన్ని వినతుల్లో స్పష్టత లేకపోవడం, సరైన సమాచారం లేకపోవడం కారణంగా పరిష్కారానికి నోచుకోలేదు. పింఛన్లకు వెల్లువలా దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల నుంచి పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. గడిచిన నాలుగున్నర నెలల్లో 7,519 మంది వృద్ధాప్య, 4,706 మంది వితంతు, 686 మంది ఒంటరి మహిళలు, వైకల్య పింఛన్ల కోసం 2433 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత ఉన్న వాళ్లందరికీ ఆన్లైన్ ద్వారానే మంజూరు చేశారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా రెండు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 90 శాతం వినతులకు పరిష్కారం లభించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు కోసం 1,315 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 1,279 మందికి మంజూరు చేశారు. గతంలో వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు రావాలంటే చాలాకాలం వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా సదరం కింద 881 వినతులు రాగా అన్నింటికీ పరిష్కారం చూపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే మెజారిటీ సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు అక్కడికొస్తున్న లబ్ధిదారులు చెబుతున్నారు. నెల రోజుల్లోనే బియ్యం కార్డు మా ఊర్లో సచివాలయం వచ్చిన తర్వాత అధికారులు ఇక్కడే ఉండి పనులు చేస్తున్నారు. బియ్యం కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకొన్నాం. తర్వాత ఏ కార్యాలయాలకూ వెళ్లకుండా నెల రోజుల్లోనే అధికారులు మాకు బియ్యంకార్డు మంజూరు చేశారు. –ఎం. సరోజమ్మ, ఓబులంపల్లి, చెన్నేకొత్తపల్లి మండలం సచివాలయాల్లోనే అర్జీలు సమస్యలపై అధికారులకు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లకుండా గ్రామ సచివాలయంలోనే అర్జీలు ఇస్తున్నాం. సర్టిఫికెట్ల మంజూరుతో పాటు సమస్యల పరిష్కారం కూడా గ్రామస్థాయిలోనే అవుతోంది. సచివాలయ వ్యవస్థ వచ్చాక గ్రామీణులకు మేలు కలుగుతోంది. – లక్ష్మీనారాయణ,బాలేపాళ్యం, కనగానపల్లి మండలం -
‘సచివాలయ’ సిబ్బందికి శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ధారించుకున్న అంశాలలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై బుధవారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే దాదాపు 15 వేల మంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి 11.45 గంటల మధ్య ఆన్లైన్ విధానంలో శిక్షణ అందజేయనున్నారు. 45 నిమిషాల వీడియోను మంగళవారం సాయంత్రం నుంచే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. వీలున్న వారు ముందుగానే దానిని వీక్షించి, ఆన్లైన్ శిక్షణలోనూ పాల్గొనవచ్చు. శిక్షణ అనంతరం 12.10 గంటల నుంచి 12.25 మధ్య పది ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కనీస మార్కులు తెచ్చుకోవాలి. కనీస మార్కులు సాధించని వారికి దఫాల వారీగా శిక్షణ కొనసాగుతుందే తప్ప.. వేరే ఎలాంటి చర్యలు ఉండవు. కాగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు దాదాపు ఏడాది మొత్తం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని జె.మురళీ ఆ ప్రకటనలో వివరించారు. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తాము సమర్థిస్తున్నామని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. అయితే అవి పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు వంటి ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థికభారం మోపుతోందని విమర్శించారు. ప్రజలపై పడే భారం గురించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా సమర్థించేరీతిలో వ్యవహరిస్తోందని చెప్పారు. సంఘ్ పరివార్ శక్తులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నించటంలేదని, మౌనంగా ఉంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని, విద్యుత్తు ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని చెప్పారు. నరేంద్రమోదీ పాలనతో బీజేపీ ప్రజల నుంచి వేరుపడిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. -
ఇక సచివాలయాల్లోనే నీటితీరువా చెల్లింపులు
సాక్షి, అమరావతి: ఉన్న ఊళ్లో.. సమీప గ్రామ సచివాలయంలోనే నీటి తీరువా చెల్లించే సదుపాయాన్ని ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వీటి వసూలు బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్‌కు అప్పగించింది. అలాగే, గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయకట్టు రైతుల వివరాలను ఏపీ సేవ పోర్టల్‌లో ఇప్పటికే నమోదు చేసిన సర్కార్.. వాటి ఆధారంగా రైతుల నుంచి నీటి తీరువా వసూలుచేసి, అక్కడికక్కడే రసీదు ఇవ్వనుంది. అత్యంత పారదర్శకంగా వీటిని వసూలు చేయడంవల్ల రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోనే నీటి తీరువా తక్కువ.. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని చిన్న ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగుకు నీటిని సరఫరా చేసినప్పుడు.. ఖరీఫ్ పంటకు రూ.200, రబీ పంటకూ రూ.200 చొప్పున నీటి తీరువాగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నీటి తీరువా అత్యంత తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. మండల కేంద్రాలకు వెళ్లక్కర్లేదు ఇక నీటి సరఫరా ఆధారంగా ఆయకట్టు రైతుల నుంచి ఇప్పటిదాకా తహసీల్దార్ నేతృత్వంలో వీఆర్వోలు, ఆర్ఐలు ఈ నీటి తీరువాను వసూలు చేస్తున్నారు. తీరువా చెల్లించాలంటే రైతులు ఇప్పటివరకు మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా దేశంలో ఎక్కడాలేని రీతిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే 543కి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా నీటి తీరువా చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. -
మా హామీ!
చిత్తూరు కలెక్టరేట్: ‘భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. పచ్చని గ్రామాల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా చూడాలి. అన్నదాతల మధ్య అనుబంధాన్ని నెలకొల్పాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి వారి భూములకు సర్వహక్కులు కల్పించాలి. ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలి. రికార్డులను సైతం సమూలంగా మార్పు చేయాలి’.. అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూ రక్ష– శాశ్వత భూ హక్కు పథకానికి శ్రీకారం చుట్టింది. వందేళ్ల తర్వాత దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర భూ రీ సర్వేని ప్రారంభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి దశ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసి.. రెండో దశ సర్వేకు శ్రీకారం చుట్టింది. 27 రెవెన్యూ గ్రామాల్లో రెండో దశ ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, గుడిపాల, జీడీనెల్లూరు, వాల్మీకిపురం మండలాల్లోని నరసింగాపురం, ముత్తుకూరుపల్లె, అగరమంగళం, జమ్మాలపల్లెల్లో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ రీసర్వే పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో దశలో 27 రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించగా, ఇప్పటికి ఆరు గ్రామాల్లో పూర్తిచేశారు. రోవర్లకు సంబంధించి జిల్లాలో 7 కార్స్బేస్ స్టేషన్లు అనుసంధానం చేశారు. 2023 డిసెంబర్ నాటికి సచివాలయాల్లో రికార్డులు, సేవలు అందుబాటులోకి రావడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నారు. మొదటి దశలో పూర్తి చేసిన భూ రికార్డులను గత జనవరి 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతికత భూ రీ సర్వేకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌కోడ్‌తో కూడిన భూ కమత పటాన్ని జారీచేస్తారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులను క్రోడీకరించి, మ్యాప్‌లు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచనున్నారు. మీ భూమి మా హామీ (మహాయజ్ఞాన్ని) చేపట్టి భూములు, ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతున్నారు. ప్రయోజనం ఇలా... శాశ్వత భూహక్కు: సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీచేస్తారు. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు సులభం అవుతాయి. భూ రక్ష : ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు వేస్తారు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు తావుండదు. దళారీ వ్యవస్థ కనుమరుగు అవుతుంది. లంచాలకు చోటుఉండదు. భద్రత : నకిలీ పత్రాలకు ఇక తావు ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులకు వీలుపడదు. అవసరమైన చోట సబ్ డివిజన్ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు. పారదర్శకత : సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం, మండల మొబైల్ మేజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం, తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్థిరాస్తులు సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. గ్రామాల చెంతకే సేవలు : ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా, సబ్‌డివిజన్ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కరించనున్నారు.గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా పొందవచ్చు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఇక తీరినట్లే. రీ సర్వే బృహత్తర పథకం జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత చేపట్టిన ఒక బృహత్తర పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రైతులకు శాశ్వత భూ హక్కుతో పాటు వారి భూములకు రక్షణ కల్పించే పథకం ఇది. ఈ సర్వేని మూడు దశల్లో 1/3 వంతు గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – హరినారాయణన్, కలెక్టర్ నాలుగు బృందాల ద్వారా సర్వే గుడిపాల మండలం, పాపసముద్రం గ్రామంలో నాలుగు బృందాలు రీ సర్వే చేస్తున్నాయి. రోజుకు కనీసం ఒక బృందం 20 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్లు నాటడం, వాటిలో గ్రామ సరిహద్దులు తెలిపే విధంగా, గ్రామాల కూడలి అయితే సరిహద్దు తెలిపే విధంగా మూడు సరిహద్దు రాళ్లు నాటి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, కాలువలు, చెరువులు గుర్తింపు చేసి సంబం«ధిత శాఖకు సమాచారం అందిస్తున్నాం. – కిరణ్‌కుమార్, సర్వేయర్, పాపసముద్రం, గుడిపాల మండలం. -
గ్రామ సచివాలయానికి టీడీపీ రంగులు
కొత్తపట్నం: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో టీడీపీ నాయకులు దుశ్చర్యకు తెగబడ్డారు. అక్కడి గ్రామ సచివాలయానికి టీడీపీ రంగు పసుపు వేశారు. అంతటితో ఆగక దాన్ని టీడీపీ కార్యాలయంగా తీర్చిదిద్దారు. అక్కడే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మంగళవారం రాత్రి పది గంటల దాకా అక్కడే ఉండి సంబరాలు చేసుకున్నారు. కొత్తపట్నం మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 13 చోట్ల వైఎస్సార్సీపీ, ఒక చోట సీపీఐ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందగా.. గమళ్లపాలెంలో టీడీపీ మద్దతుదారు బలగాని రమణమ్మ గెలుపొందారు. దీంతో టీడీపీ నేతలు దుశ్చర్యకు ఒడిగట్టారు. సచివాలయం ముందు జాతీయ జెండా ఎగురవేయడానికి ఏర్పాటు చేసిన 3 రంగుల ఇనుప రాడ్డుకు కూడా పసుపు రంగు వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. సచివాలయం ముందు భారీ ఫ్లెక్సీలు కూడా కట్టారు. వివిధ పనుల కోసం సచివాలయానికి వచ్చే వారికి ఫ్లెక్సీలు ఇబ్బందిగా ఉంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, గ్రామ సచివాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సచివాలయాల్లో అవినీతి రహిత సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయిలోనే అవినీతి రహిత, సత్వర సేవలను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 15,004 సచివాలయాల ద్వారా 34 శాఖలకు చెందిన 543 సేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు కైలే అనిల్‌కుమార్, అంబటి రాంబాబు, రాజన్నదొర, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్‌లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 3.54 కోట్ల సేవల కోసం ప్రజల నుంచి సచివాలయాలకు వినతులు అందగా, వాటిల్లో 3.52 కోట్ల వరకు పరిష్కారమయ్యాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలు, సర్టిఫికెట్లు, కేంద్రం ఇచ్చే ఆధార్, పాసుపోర్టు సేవలతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు గోడల మీద రాయించారని, కానీ సీఎం జగన్ 1.35 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులుగా.. 2.65 లక్షల మందికి వలంటీర్లుగా మొత్తం దాదాపు 4 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారన్నారు. ఉత్తమ వలంటీర్లకు పురస్కారాలు వలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, సేవామిత్ర కింద రూ.10,000, సేవారత్న కింద రూ.20,000, సేవావజ్ర కింద రూ.30,000 చొప్పున నగదు ప్రోత్సాహం, ఒక సర్టిఫికెట్, బ్యాడ్జి, శాలువతో సన్మానిస్తున్నామని.. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.258.37 కోట్లు కేటాయించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో వారి సేవలు వెలకట్టలేనివన్నారు. మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం కింద రూ.1,650 కోట్లకు పరిపాలనా అనుమతి జారీచేసినట్లు తెలిపారు. దీని ద్వారా 1,603 ప్రాంతాలకు రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పాఠశాల మూతపడదు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదని ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సభలో వెల్లడించారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రతీ సబ్జెక్టుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండాలనే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లను బట్టి తరగతులను విలీనం చేస్తున్నాం కానీ పాఠశాలలు మూయడంలేదని స్పష్టంచేశారు. ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.970.90 కోట్లు రాష్ట్రంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ రూ.1.50లకే సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనికి ఏటా రూ.970.90 కోట్లు వ్యయం అవుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో యూనిట్ విద్యుత్ రేటు రూ.3.86గా ఉండేదన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో వారికి రూ.2,113 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చిందన్నారు. గిరిజనులకు రూ.4,968.25 కోట్లు.. ఇక గిరిజనులకు ‘నవరత్నాల’ ద్వారా రూ.4,968.25 కోట్ల లబ్ధిచేకూర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రకటించారు. ఈ పథకాల ద్వారా మొత్తం 13,22,266 మందికి ప్రయోజనం లభించిందన్నారు. సెల్ఫోన్లు, రికార్డర్లకు అనుమతిలేదు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన తర్వాత సభాపతి తమ్మినేని సీతారాం పలు అంశాలపై రూలింగ్‌లు ఇచ్చారు. సభలోకి సభ్యులు సెల్ఫోన్లు, రికార్డర్లు తీసుకురావడం, కాగితాలు చింపి విసరడం, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఇతర సభ్యులు అంతరాయం కలిగించడాన్ని అనుమతించబోమన్నారు. టీడీపీ సభ్యులు మార్చి 16న ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు నిబంధనలకు లోబడి లేకపోవడంతో తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నాటుసారా, నాణ్యతలేని మద్యం అంశాలపై అదే పార్టీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్నీ తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. -
సచివాలయ వ్యవస్థ పనితీరు సూపర్
తిరుపతి అర్బన్: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరును మహారాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది. పుణే డిప్యూటీ సీఈవో మలిందే టొనపే నేతృత్వంలో మహారాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో కూడిన బృందం శనివారం తిరుపతిలో చిత్తూరు జిల్లా అధికారులతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి ద్వారా జిల్లావ్యాప్తంగా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు? తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు ఎలా మారాయనే అంశాలపై అధ్యయనం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, పనితీరును కూడా తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు మంచి వ్యవస్థను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బృందం సభ్యులు అభినందించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. -
గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం
సాక్షి, అమరావతి/విజయవాడ రూరల్: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళుతున్న మన గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల వైపు పలు రాష్ట్రాలు ఆకర్షితమవుతున్నాయి. ఈ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు, తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు 500 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వా రా అందజేస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు మహారాష్ట్ర అధికారుల బృందం బుధవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేతృత్వంలో అధికారుల బృందం 7నెలల కిందట రాయలసీమలో పర్యటిం చి సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్ అధికారులు సుధీర్ భగవత్ నాయకత్వంలో బుధవారం విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామ సచివాలయం–3ను పరిశీలించారు. అనంతరం అంబాపురంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వానపాముల ద్వారా ఎరువులను తయారుచేసే విధానాన్ని తిలకించారు. చివరిగా గొల్లపూడిలో వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించారు. పంచాయతీరాజ్ కమిషనర్‌తో భేటీ.. మహారాష్ట్ర అధికారులు బుధవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు గురించి కోన శశిధర్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, వాటి భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును కూడా నియమించినట్లు తెలిపారు. -
సచివాలయ మహిళా పోలీస్ దేశానికే ఆదర్శం
సాక్షి, మచిలీపట్నం: గ్రామ సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ, తక్షణమే పరిష్కరించే కార్యక్రమం చేపడుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలను పలు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు ప్రశంసించారు. గ్రామ సచివాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు అందించడంపై శిక్షణ తరగతి (ట్రైనింగ్ సెషన్) నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ శిక్షణ కార్యక్రమంపై నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన 87 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బ్రీఫింగ్ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఎస్పీ రూపొందించిన ‘ప్రత్యక్ష స్పందన’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు తిలకించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా, వారి గ్రామంలోనే మహిళా పోలీసుల ద్వారా సచివాలయాల నుంచి టైం స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయంలో వచ్చి ఎస్పీతో వారి సమస్యలను చెప్పుకొనేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఎస్పీతో పాటు వారి ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ద్వారా పోలీస్ అధికారులతో వారి సమస్యను నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఎస్పీ ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వారి ఎదురుగానే సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదును బదిలీ చేసి, పూర్తి పారదర్శకంగా పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు పురోగతి గురించి బాధితులు మహిళా పోలీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. సచివాలయ వ్యవస్థను, మహిళా పోలీసుల ఏర్పాటును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లోనే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని చెప్పారు. -
ఆదాయం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయడంతో పాటు ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయ ఆర్జనకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంతగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించ కూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి ► ఇదివరకెన్నడూ లేని విధంగా ఓటీఎస్ పథకం ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా మరో రూ.1,230 కోట్ల మేర (మొత్తంగా రూ.1630.55 కోట్లు) లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు. ► గతంలో ఎన్నడూ ఇలా పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ కంపెనీలకు కేటాయించే స్థలాలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు. ► ఇప్పటి వరకు 3.70 లక్షల ఓటీఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. -
సచివాలయాల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాల్లో కూడా ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇక రాష్ట్రంలో 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,95,925 మందికి ఆధార్ సేవలందించారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. సచివాలయాల్లో తొలిదశ కింద ఇప్పటికే 51చోట్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా రెండో దశలో మరో 613చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశల వారీగా ఏటీఎంలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి. క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ -
కర్ణాటకకు ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ
సాక్షి బెంగళూరు: ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాల తరహా వ్యవస్థను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వ సేవలన్నీ గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందేలా సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం గత నెల 27న ‘గ్రామ వన్ సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేసింది. వీటిద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు, ధ్రువీకరణ పత్రాలను ఒకేచోట ప్రజలకు అందజేస్తున్నారు. కర్ణాటకలోని 12 జిల్లాల్లో 3,024 పంచాయతీల్లో ఈ గ్రామ వన్ సేవా కేంద్రాలు సేవలందిస్తున్నాయి. మార్చి చివరి నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా గ్రామ వన్ ఒక సాంకేతిక ఆధారిత కార్యక్రమం. ప్రజలు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామస్థాయిలోనే దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఈ కేంద్రాల వల్ల కలుగుతోంది. బ్యాంకింగ్ సేవలు, ఆధార్ కార్డు, ఆయుష్మాన్ కార్డు, ఏపీఎల్, బీపీఎల్ కార్డు తదితర 100 సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్థితిగతులను తెలుసుకునేందుకు మొబైల్ నంబర్‌కు ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నారు. -
Andhra Pradesh: వడివడిగా నిర్మాణాలు
నా పాదయాత్ర సమయంలో గ్రామాల దుస్థితి చూసి ఆవేదన కలిగింది. అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించకూడదు. నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండరాదు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఎఫ్ఎస్టీపీ (మురుగు వ్యర్థాల శుద్ధి) ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపైనా దృష్టి సారించాలని సూచించారు. అమూల్ పాల సేకరణ చేస్తున్న జిల్లాలు, ప్రాంతాలకు అనుగుణంగా బీఎంసీయూలను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మురుగు నీటి శుద్ధి ప్రణాళిక జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం కాగా ప్రస్తుతం 61.5 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న దాదాపు 582 ప్రాంతాలను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి బయో, వెట్ ల్యాండ్ ట్రీట్మెంట్, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ తదితర విధానాల్లో రూపొందించిన శుద్ధి ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి కావాలని, నిర్వహణపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.50 కోట్ల చెక్కును ఏపీ అధికారులకు అందిస్తున్న తమిళనాడు అధికారులు వైఎస్సార్ జలకళ.. వైఎస్సార్ జలకళ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు అప్పగించి వాటి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు తవ్వాలని సూచించారు. బోరు తవ్విన వెంటనే మోటారు కూడా బిగించాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ.. గత సర్కారు హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు విస్తారంగా వర్షాలు కురిశాయని, అప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లు దీంతో బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేపట్టాల్సిన నిర్వహణను గత సర్కారు విస్మరించడంతో అన్ని రహదారులకు ఒకేసారి మరమ్మతులు, నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉత్పన్నమైందన్నారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ రూపొందించి ఏ దశలోనూ నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికి మౌలిక సదుపాయాల కల్పనపై ధ్యాస పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విధానం తేవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్‌కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
మే నాటికి సచివాలయాల్లో ఆధార్ సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆయన గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో హార్డ్ వేర్ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నెలకోసారి కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని, ఆ మేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సేవలు అందించడంలో ఉత్తమ పనితీరు ► ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు, సమర్థత కనబరచాలి. ఇందుకోసం ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరు పట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలి. ► నిర్దేశించిన ఎస్ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశం. సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండాలి. దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందు పరచాలి. ఇందుకు అనుగుణంగా పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలి. ► ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి కావాలి. ► సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగాలి. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. ► సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలి. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
గ్రామ స్వరాజ్యం ఇదే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ మారు మూల గ్రామాలకు వేగంగా సేవలందించేందుకు ఏపీ సేవ పోర్టల్–2ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రెండేళ్లలో గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ అని కళ్ల ముందు కనిపించేలా అమలు చేసి చూపించామని చెప్పారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే అర్థం బహుశా ఉండదన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి (ఏపీ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్) ఏపీ సేవ 2.0 (టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (సీఎస్పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ► గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్లముందే కనిపించేలా రెండేళ్లుగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 540కి పైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. అక్కడ పది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, మున్సిపల్ స్థాయిలో ప్రతి 100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. మొత్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఇంటింటికి వెళ్లి నిరంతరం పని చేస్తున్నారు. ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరందరికీ అభినందనలు. ► ఇలా సేవలందించే కార్యక్రమాన్ని 2020 జనవరి 26న ప్రారంభించాం. ఈ రెండేళ్ల పయనంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించేలా, పారదర్శకంగా ఉండేలా మార్పులు తీసుకొచ్చి ఏపీ సేవ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. 540కి పైగా సేవల్లో వేగం ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కి పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన రీతిలో అందుబాటులోకి వస్తాయి. గత రెండేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3.46 కోట్ల మందికి సేవలు అందించాం. ఈ లెక్కన ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో ఇట్టే తెలుస్తోంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త పోర్టల్ ద్వారా మరింత వేగంగా పనులు జరుగుతాయి. ► తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాన్ని నేరుగా ప్రజలు తెలుసుకోవచ్చు. సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. లంచాలు, అవినీతికి తావుండదు ► కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది. ► ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రజల మధ్య వారధిగా అంటే ముఖ్యమైన హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు ఏపీ సేవ పోర్టల్ ఉపకరిస్తుంది. ► ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుంది. భౌతికంగా, డిజిటల్ పద్ధతుల్లో రశీదులు వస్తాయి. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఆయా దరఖాస్తుల ప్రాసెస్‌ను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్ఎంఎస్లు వస్తాయి. ► ఫీజులు చెల్లించాల్సి ఉంటే.. ఏపీ సేవ పోర్ట్ల్ సహాయంతో రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది. యూపీఐ, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్, క్యాష్ పేమెంట్ లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేయొచ్చు ► ఏపీ సేవ పోర్టల్ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం. మునిసిపాలిటీలకు సంబంధించి 25 సేవలు, పౌర సరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలను పోర్టల్ కిందకు తీసుకు వచ్చాం. ► దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలు ఏంటో చెబుతారు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్ద్వారా అందుబాటులోకి వస్తాయి. ► ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల స్థాయి, మునిసిపాలిటీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయంలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరూ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంపై పని చేస్తారు. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి డిజిటల్ సిగ్నేచర్ అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదని పై అధికారులు, దరఖాస్తుదారులు ప్రశ్నించ గలుగుతారు. తద్వారా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల జారీలో జాప్యం ఉండదు. అవినీతికి తావుండదు. – సీఎం వైఎస్ జగన్ -
కరోనా పరిస్థితుల్లోను మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి: భారత గణతంత్రదిన వేడుకలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను, వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషకృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషిచేస్తోందని కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ధి, అంకితభావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపు మ్యూజియంలో.. విజయవాడ బాపు మ్యూజియంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య 1921లో ఆ జెండాను మహాత్మాగాంధీకి బాపు మ్యూజియం ప్రాంగణంలో అందజేశారు. బస్ భవన్లో.. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం విజయవాడలోని బస్‌భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, ఆర్థిక సలహాదారు ఎన్.వి.రాఘవరెడ్డి, ఏడీ (విజిలెన్స్–సెక్యూరిటీ) శోభామంజరి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఉత్తమ ఉద్యోగులకు సత్కారం ఈ ఏడాది చివరినాటికి టిడ్కో ద్వారా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందజేసేందుకు కృషిచేయాలని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, ఎండీ సీహెచ్ శ్రీధర్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఏపీ టిడ్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో వారు ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, జీఎం హరినాథ్, లైసనింగ్ అధికారి విజయకుమార్, వివిధ విభాగాలకు చెందిన 40 మంది అధికారులు, సిబ్బందిని సత్కరించారు. టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ, ఎస్సెస్సీ బోర్డుల్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎ.వి.రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యుడు సలాంబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ బోర్డులో డైరెక్టర్ దేవానందరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డు అధికారులు పాల్గొన్నారు. పవన్‌కళ్యాణ్ పతాకావిష్కరణ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ఏపీ సేవగా పేరు మార్చాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఓ అర్జీ పరిష్కారానికి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఏ దశలో ఉందన్న వివరాలను దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేసే ప్రక్రియను తెచ్చింది. దీనికి సంబంధించి ‘ఏపీ సేవ పోర్టల్’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ఏపీ సేవ పేరును ఈ పోర్టల్‌కు పెడుతున్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీ తనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగుపరచే గొప్ప కార్యక్రమం ఇది. ఏపీ సేవా పోర్టల్ ఓ గొప్ప ముందడుగు. గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారు. గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 4 లక్షలమంది సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేవలను మరింత మెరుగు పరుస్తూ ముందడుగు వేస్తూ 2.0ను ప్రారంభిస్తున్నామ'ని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీసేవలో లేనివి సైతం.. నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలనే తేడా లేకుండా ప్రజలకు సొంతూరిలోనే దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. మీ–సేవా కేంద్రాలలో సైతం అందుబాటులో లేని 220కి పైగా కొత్త సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. 2020 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయి. గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది (ఫైల్) ఒకే పోర్టల్ పరిధిలోకి.. ప్రజల నుంచి అందే అర్జీలను ప్రస్తుతం సచివాలయాల సిబ్బంది ఎప్పటికప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. అర్జీ పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఆ సమాచారం సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు. కేవలం సంబంధిత శాఖ పరిధిలోనే ఆ వివరాలు ఉంటాయి. దీనివల్ల అర్జీదారుడికి దరఖాస్తు స్థితిగతులను సచివాలయ సిబ్బంది తెలియచేయలేకపోతున్నారు. ఈ ఇబ్బందులన్నీ తొలగిస్తూ వివిధ శాఖలు ఆన్లైన్ ద్వారా అందజేసే సేవలన్నింటిని ఒకే పోర్టల్ పరిధిలోకి తెస్తున్నారు. తద్వారా సచివాలయాల సిబ్బందికి తమ పరిధిలోని అర్జీల పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరి వద్ద, ఎంతకాలం పెండింగ్? సచివాలయాల ద్వారా ప్రజలు అందజేసే దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం అంశాలవారీగా నిర్దిష్ట కాలపరిమితి విధించింది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఎన్ని రోజుల్లో వినతి పరిష్కరించారో మాత్రమే తెలుస్తోంది. ఏ అధికారి వద్ద అర్జీ ఎంత కాలం పెండింగ్‌లో ఉందన్న వివరాలు తెలియడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ పోర్టల్ ప్రకారం ఒక అధికారి వద్ద అర్జీ ఎంత కాలం పెండింగ్‌లో ఉందన్న వివరాలను సచివాలయ శాఖ తెలుసుకునే వీలుంటుంది. నిర్దిష్ట కాలపరిమితికి మించి అర్జీని ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచే అధికారి వివరాలు పోర్టల్ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు కనిపిస్తాయి. ఇది వేగంగా అర్జీల పరిష్కారానికి దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. 20 రోజులుగా ట్రయల్ రన్.. సచివాలయాల ద్వారా పొందుతున్న సేవలలో 90 శాతం దాకా ఉండే ఐదు శాఖల సేవలను కొత్త సాఫ్ట్వేర్ పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రెవెన్యూ–సీసీఎల్ఏ, పట్టణాభివృద్ధి, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖలకు సంబంధించి 135 సేవలను కొత్త పోర్టల్‌కు అనుసంధానించి గత 20 రోజులుగా ట్రయల్ రన్ నిర్వహించారు. సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. శాఖల వారీగా మిగిలిన సేవలను కూడా కొత్త పోర్టల్‌కు అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
‘మీ కుమారుడు చనిపోయినట్లు చూపుతోంది.. మేమేం చేయలేం’
Anantapur: రేషన్ కార్డులో కుమారుడి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే.. మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోందని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. హంప గ్రామానికి చెందిన దూదేకుల కుల్లాయమ్మ, మస్తాన్‌వలి మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం అనంతపురానికి వెళ్లారు. ఇంటర్ చదువుతున్న కుమారుడు కుల్లాయప్ప పేరు రేషన్‌కార్డులో నమోదు చేయించుకునేందుకు వారు స్వగ్రామానికి వచ్చారు. జనన ధృవీకరణ పత్రం తీసుకుని అనంతపురం సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది. మేమేం చేయలేం’ అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్డులో పేరు నమోదు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) -
Andhra Pradesh: భూమికి భరోసా
ప్రతి గ్రామంలోనూ భూముల సమగ్ర సర్వే చేపట్టి భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా పరిష్కరిస్తాం. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కాకుండా.. ఏకంగా మీ గ్రామంలోనే, మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఆస్తుల లావాదేవీలు కళ్లెదుటే మీకు కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఎవరో, ఎక్కడో మీకు తెలియకుండా మీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతున్నాం. ఇదొక పెద్ద సంస్కరణ. – సీఎం వైఎస్ జగన్ కష్టార్జితం వివాదాల్లో చిక్కుకుంటే.. రూపాయి రూపాయి దాచుకుని.. రాత్రనకా పగలనకా కష్టపడి కొనుక్కున్న ఒక ప్లాటో, ఇల్లో భూ వివాదాల్లోకి వెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ పరిస్థితులను నివారించి ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే తపనతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు విస్తరిస్తాం. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు. సర్వే పూర్తి అయ్యాక దశలవారీగా అన్ని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించారు. సమగ్ర భూముల సర్వే కింద మొదటి దశలో 51 గ్రామాలలో రీ సర్వే, అభ్యంతరాల పరిష్కారం, భూ రికార్డులు ప్రజలకు అంకితం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. స్వతంత్ర భారతంలో తొలిసారిగా.. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన తొలిదశ సమగ్ర భూసర్వేని 51 గ్రామాలలో పూర్తి చేశాం. 37 గ్రామ సచివాలయాల్లో ఇవాళ్టి నుంచే భూములు, స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియచేసేలా ఈ రోజు మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. వందే?ళ్ల తర్వాత సమగ్ర సర్వే.. దేశంలో సుమారు 100 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. 1983 వరకు జమాబందీ విధానంలోనే భూములకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించారు. ఆ తర్వాత కరణాల వ్యవస్ధ రద్దు కావడం, సరైన ప్రత్యామ్నాయం లేక జమాబందీ కార్యక్రమాలు ఆగిపోయాయి. మన భూమిని మన కళ్లెదుటే ఇతరుల పేరిట రాసుకుంటున్నారు. ట్యాంపరింగ్ జరుగుతోందని తెలుస్తున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితి నెలకొంది. నా పాదయాత్ర సమయంలో 13 జిల్లాలోనూ ప్రజలు ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య వ్యత్యాసాలు సివిల్ వివాదాలకు దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన భూమి విస్తీర్ణాన్ని కొలత వేస్తే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటోంది, మరికొన్నిసార్లు తక్కువగా చూపిస్తోంది. శాశ్వత భూహక్కు–భూరక్ష రిజిస్టేషన్లను ప్రారంభించి అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ సబ్ డివిజన్ కావట్లేదు.. భూ వివాదాలాన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఓ సర్వే నంబర్లో అమ్మకాలు జరిగిపోతాయి కానీ సబ్ డివిజన్ మాత్రం ఉండదు. పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. నిర్దిష్ట హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారు అయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సింహభాగం సివిల్ వివాదాలే.. సివిల్ వివాదాల్లో దాదాపు 80 – 90 శాతం కేసులు భూమి తగాదాలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సరైన వ్యవస్థ లేకపోవడం, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద చేజారిపోయే పరిస్థితి రావడం ఎవరికైనా బాధాకరమే. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్ నంబర్ సివిల్ వివాదాలకు ముగింపు పలికేలా భూములన్నీ కొలత వేసి అక్షాంశాలు, రేఖాంశాలు (లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్) ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తున్నాం. ప్రతి కమతాన్ని డిజిటల్‌గా నిర్ణయించి క్యూఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాప్ ఇస్తున్నాం. సరిహద్దు రాళ్లు పాతి మరీ ఇస్తున్నాం. దీనివల్ల భూ వివాదాలు ఉండవు. ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, లంచాలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇది సాకారం కావాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు –భూరక్ష పథకాన్ని దాదాపు 13 నెలల క్రితం ప్రారంభించాం. 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరి భూమిని 2023 కల్లా ఆధునిక పద్ధతుల్లో సమగ్రంగా రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రీసర్వే చేయడమే కాకుండా యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, డేటా మొత్తం సబ్డివిజన్లతో పూర్తిగా అప్డేట్ చేస్తున్నాం. ఆ తర్వాత పక్కాగా పట్టా డాక్యుమెంట్స్ భూ యజమానుల చేతుల్లో పెడతాం. రూ.1,000 కోట్ల వ్యయంతో 2020 డిసెంబరు 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టాం. కార్స్, డ్రోన్స్ టెక్నాలజీ లాంటి 50 అంశాలపై 10,158 మందికి సర్వే కోసం శిక్షణ ఇచ్చాం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4,500 సర్వే బృందాలను నియమించాం. 2 వేల రోవర్లు, 75 కార్స్ బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. తొలిదశలో... సమగ్ర సర్వే తొలిదశ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలకు సంబంధించి 29,563 ఎకరాల రీసర్వే పూర్తైంది. 3,304 అభ్యంతరాలు, సివిల్ వివాదాలను పరిష్కరించాం. హద్దులు మార్పు చేసి మ్యాపులు, యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, క్యూఆర్ కోడ్‌లో భద్రపరచడంతో పాటు భూముల రికార్డులన్నీ పర్మినెంట్ టైటిల్స్‌తో భూ యజమానుల చేతుల్లో పెడుతున్నాం. అందరి సమక్షంలో.. భూముల సమగ్ర సర్వే వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులను మార్చే అవకాశం ఉండదు. ఆస్తులు అమ్ముకున్నా సబ్‌డివిజన్ చేసిన తర్వాతే ఆ లావాదేవీల ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. ఇతరుల ఆస్తిని కాజేసేందుకు ఆస్కారం ఉండదు. సర్వే చేసేటప్పుడు ప్రతి అడుగులోనూ భూయజమానులను భాగస్వాములుగా చేస్తున్నాం. వారి సమక్షంలోనే మంచి చేస్తున్నాం. అభ్యంతరాలను మండల స్ధాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. గ్రామ కంఠాలకు కూడా.. తొలిసారిగా గ్రామకంఠాల్లోని ఇళ్లు, స్ధిరాస్తులను కూడా సర్వే చేసి యాజమాన్య ధృవీకరణ పత్రాలు అందచేస్తున్నాం. అవసరమైతే అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించాం. సబ్‌డివిజన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని ఇదే వేదిక నుంచి అధికారులను ఆదేశిస్తున్నాం. సింగిల్ విండో విధానంలో... సింగిల్ విండో విధానంలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మనం ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్ధ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా భూ సమాచారాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.లక్ష్మి,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ(సర్వే, సెటిల్మెంట్స్) కమిషనర్ సిద్ధార్ధ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరక్టర్ ఎంఎం నాయక్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి.రామకృష్ణ, ఏపీఎండీసీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిరసనలొద్దు.. వెంటనే విధుల్లో చేరండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి చాలా దారులున్నాయి. మీరు ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాలి. మొదట్లోనే ఇలా చేస్తే మీపై తప్పుడు భావనలు వెళతాయి. మీరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈ మూడు రోజుల పరిణామాలు తప్పు దారిలో వెళ్తున్నాయి. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, రోడ్లపైకి వచ్చి స్లోగన్లు వంటివి ఉద్యోగులకు కుదరదు. మీరు ఆశిస్తున్నవి కొంతవరకైనా జరగాలంటే మంచి వాతావరణం తేవాలి. పరిస్థితులు చక్కబడితేనే మీరు చెప్పిన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలను. 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై 2018 నుంచి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు అన్నిసార్లూ చర్చలు, వినతుల ద్వారా డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మీరు మంచిగా అడిగితే సీఎం ఒకటికి రెండు చేసే అవకాశం ఉంటుంది. తలకు బులెట్ పెట్టి ఇవ్వాలని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వరు’ అని స్పష్టం చేశారు. అధికారులు అక్టోబరన్నా, సీఎం జూన్ కల్లా ఇవ్వాలన్నారు గతంలో ప్రొబేషన్‌పై జరిగిన సమావేశంలో 60 వేల మంది ఉద్యోగులే డిపార్టమెంట్ పరీక్షలు పాసయ్యారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా అందరికీ ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేద్దామని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి జూన్ 30వ తేదీ ప్రొబేషన్ ప్రకటనకు చివరి తేదీ కావాలని చెప్పారు. ఉద్యోగులు మంచిగా అడిగితే ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరూ అడగకుండా ఒకేసారి 1.34 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి.. మంచి విధానంలో అడిగితే మీ మాట వినే అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఒకే రోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అది అర్ధం చేసుకోకుండా తప్పు దారిలో వెళితే చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మీకు ప్రొబేషన్ ప్రకటించరంటే నమ్మకండి. ఈ సీఎం ఉండగా మీ ప్రొబేషన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఇలాంటివి చేసుకొని మీకు మీరే ప్రొబేషన్‌ను ఆపుకొనే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. ఇందుకే ప్రొబేషన్ ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రికి నేరుగా మెసేజ్ చేయలేదని, కానీ, కొందరు సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా నేరుగా మేసేజ్‌లు పంపారని జైన్ తప్పుపట్టారు. తాము ఏ సమాచారాన్నయినా సీఎంవో అధికారులు, సీఎస్ ద్వారా సీఎంకు చేరవేస్తామన్నారు. ఇలాంటి సర్వీసు రూల్స్‌పై అవగాహన కలిగించి, విధుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రొబేషన్ ఉంటుందని చెప్పారు. 77 వేల మంది విధులకు హాజరు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే 55,515 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారని ఆ శాఖ ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి మొత్తం 77,409 మంది విధుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి. సీఎం జగన్‌పై మాకు నమ్మకం ఉంది: అంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి నిధి అంజన్‌రెడ్డి చెప్పారు. అజయ్‌జైన్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు వాటి జోలికి పోకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ఎవరికీ నష్టం జరగదు: జానీ పాషా ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరికీ ఎలాంటి నష్టం జరగదని అజయ్‌జైన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల మరో ప్రతినిధి జానీ పాషా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులెవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అందోళనలు చేయవద్దని సూచించారు. -
AP: లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు మేలు!
తల్లి గర్భంలో పురుడు పోసుకునే పిండం ఈ లోకంలోకి రావాలంటే నవమాసాలూ నిండాల్సిందే!! అమ్మకు ప్రసవ వేదన, బిడ్డకు ఆరాటం తప్పవు..ఆదుర్దా ఎంత ఉన్నా.. కాల పరీక్షలో నెగ్గాల్సిందే!! పక్వానికి వచ్చిన కాయను ముందుగానే కోసేస్తే..? చేదు అనుభవాన్ని చవిచూడక తప్పదు!! సచివాలయ ఉద్యోగుల 25 నెలల నిరీక్షణ మరి కొద్ది నెలల్లోనే ఫలించనుంది... చెప్పాలంటే నిండా ఐదు నెలలు కూడా లేవు.1.14 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ప్రొబేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు. మిగతావారికీ జూన్ కల్లా పూర్తి కానుంది.. ఇంతలోనే హైరానా ఎందుకు మరి? ఒకేసారి చేరిన ఉద్యోగుల్లో అంతరాలను సృష్టించడం సబబేనా? కొంతమందికే కొత్త పే స్కేల్ వర్తింప చేయడం ఏం ధర్మం?.. బంతి భోజనంలో కొందరికి మాత్రమే వడ్డించి మిగతావారు ఆకలి కళ్లతో చూస్తుంటే బాగుంటుందా? ప్రభుత్వ ఉద్యోగికి ప్రొబేషన్, అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.. ఐఏఎస్‌లైనా ఇందుకు మినహాయింపు కాదు.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని చట్టం కూడా అనుమతించదు. రెచ్చగొట్టే వారి మాయలో పడిపోయి చిక్కుల్లో ఇరుక్కుంటే ఎవరు బాధ్యులు? సచివాలయాల వ్యవస్థ.. ముఖ్యమంత్రి మానస పుత్రిక. ఉద్యోగుల ప్రొబేషన్‌పై అధికారులకు ఆయన డెడ్‌లైన్ విధించారు. ఇందుకు విరుద్ధంగా వెళ్లే అవకాశమే లేదు.. అలాంటప్పుడు మరి కొద్ది నెలల్లో ముగిసే ప్రక్రియకు ఆదుర్దా ఎందుకు? సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు స్థాయిలో ఒకేసారి కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యంతోపాటు పరిపాలనను పల్లె ముంగిటికే తెచ్చారు. ఉద్యోగుల్లో భేద భావాలు తలెత్తకుండా అందరి మేలును కాంక్షిస్తూ, ఒకేసారి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై నిర్ణయం తీసుకున్నారు. కొందరిలో మాత్రమే సంతోషాన్ని నింపి మిగతావారిని నిరాశకు గురి చేయకుండా ఒకేసారి విధుల్లో చేరిన వారంతా సంతృప్తి చెందాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఒకరిద్దరికి మాత్రమే కాకుండా.. ఒకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరిద్దరు మాత్రమే కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు తీసుకుంటూ మిగతా నలుగురు ప్రొబేషనరీ పూర్తి కాక మనోవ్యధకు గురి కారాదనే జూన్‌కల్లా అందరికీ ప్రొబేషనరీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రొబేషన్ తరువాత వెంటనే ఇతర ఫార్మాలిటీస్, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి కొత్త పే స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే కొన్ని శక్తులు సచివాలయాల ఉద్యోగులను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి 1.34 లక్షల ఉద్యోగాలను కల్పించింది. విద్యుత్ అసిస్టెంట్ ఉద్యోగులు కాకుండా 1,14,092 మంది సచివాలయాల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 60,385 మంది ఉద్యోగ ప్రావీణ్యతపై శాఖాపరంగా నిర్వహించే అంతర్గత (డిపార్ట్మెంట్) పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఏఎస్ అధికారులు మొదలు ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి వరకు డిపార్ట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే విధానం ఉంది. 2019లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రకారమే సచివాలయాల ఉద్యోగులు అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు వారిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవంటూ పోలీసుల ద్వారా ఆయా శాఖలు అంతర్గతంగా తెప్పించుకునే యాంటిసిడెంట్ నివేదిక కీలకం. మిగిలిన వారూ అర్హత సాధించేలా.. కుగ్రామాల్లో నివసించే ప్రజలు సైతం సొంతూరి దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే వినూత్నంగా సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సచివాలయాల భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. తన మానస పుత్రిక లాంటి సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ఒకేసారి ప్రొబేషనరీకి అర్హత జూన్ కల్లా సాధించేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 14 వేల మందికి పైగా ఉన్న మహిళా పోలీసులకు డిపార్ట్మెంట్ పరంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మిగిలిన కేటగిరీలోనూ గతంలో డిపార్ట్మెంట్ పరీక్షలు రాయని వారు, రాసినా ఉత్తీర్ణులు కానివారికి మరో విడత నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియ జూన్ కల్లా పూర్తై మరింత ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉందని వెల్లడించారు. మళ్లీ ఆ శక్తుల పనే!? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును ఆదినుంచి వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ప్రొబేషనరీని బూచిగా చూపిస్తూ రెచ్చగొడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వలంటీర్లను కూడా గౌరవ వేతనాలపై రెచ్చగొట్టిన ఉదంతాన్ని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు విపక్ష టీడీపీ నిరుద్యోగ యువతలో అపోహలు రేకెత్తించేలా దుష్ప్రచారానికి దిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో 19.20 లక్షల మంది నిరుద్యోగులు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు తావు లేకుండా ఇంటర్వ్యూలు కాకుండా రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టినప్పుడు కూడా టీడీపీ తప్పుడు ప్రచారానికి పాల్పడింది. ఇప్పుడు కూడా అదృశ్య శక్తులు సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై క్షుణ్నంగా విచారణ జరపాలని కొందరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్‌పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు. -
ఆంధ్రప్రదేశ్ ‘సచివాలయ’ ఉద్యోగులకు బొనాంజా..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని.. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పీఆర్సీ ‘సచివాలయా’ల ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సమయంలో వారిని వదిలి వేయడం సబబు కాదన్న ఉద్దేశంతో తుదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ సిఫార్సులను వర్తింపజేయాలన్న ప్రతిపాదన చేస్తున్నట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రొబేషనరీ ప్రకటన అనంతరం ‘సచివాలయ’ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 1,800 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో వివరించింది. 19 రకాల క్యాడర్ ఉద్యోగులకు రెండు రకాల పే స్కేల్ నిర్ణయం... ► గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. ► గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్–2 అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఆర్టీసీలో అదృష్టవంతులు) ► వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్–డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వెల్ఫ్‌ర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు) సలాం సీఎం సర్ 11వ పీఆర్సీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానం కల్పించడం అత్యంత గొప్ప విషయం. రూ.1,800 కోట్ల ఆర్థిక భారాన్ని సైతం ఖాతరు చేయకుండా ఉద్యోగులకు మేలు చేయాలన్న ఆలోచన చరిత్రాత్మకం. సీఎం జగన్ 15,004 సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి జీవితంలో మరువలేని మేలు చేశారు. సచివాలయ ఉద్యోగులపై చిన్నచూపు చూసిన రాజకీయ పక్షాలకు ప్రభుత్వ ప్రకటన చెంపపెట్టు. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని సచివాలయ ఉద్యోగులు నిలబెట్టుకుంటారు. – ఎండీ జానీపాషా, అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ -
యూనిఫాంతోనే సమాజంలో గుర్తింపు
సాక్షి, అమరావతి : పోలీస్ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు. తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. -
భారం పెరిగినా తీరం చేర్చాం
ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తద్వారా లావాదేవీల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఈ దృష్ట్యా ఏటీఎంలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వేదిక కావాలి. ఆ మేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది గొప్ప మార్పునకు దారితీస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం.. అంటే రూ.1,71,520 కోట్ల రుణాలు పంపిణీ చేశాయి. ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం.. అంటే రూ.1,00,990 కోట్లు రుణాలుగా పంపిణీ చేశాయి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు, పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించి.. ఆర్థిక చక్రానికి ఊతమివ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందని తెలిపారు. కోవిడ్‌తో ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడంతో పాటు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించగలిగిందన్నారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా చొరవ చూపినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల లబ్ధిదారులకు మూడు శాతం వడ్డీతో రుణాలు ► ‘నవరత్నాలు–అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ► దీని వల్ల ఆర్థికంగా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ► కేంద్రం పీఎంఏవై ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చింది కాబట్టి, బ్యాంకులు ఆ రుణం మంజూరు చేయాలి. ► బ్యాంకులు ఇచ్చే రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు చొరవ చూపితే అన్ని విధాలా ఆర్థిక ప్రగతికి చేయూత ఇచ్చినట్లుగా ఉంటుంది. 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ► వ్యవసాయ స్వల్పకాలిక పంట రుణాలలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం పంపిణీ చేశాయి. అయితే వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించి 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాలివ్వడం నిరాశాజనకం. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలి. ► వార్షిక రుణ ప్రణాళిక తొలి ఆరు నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్లు పెంచడానికి 4.52 శాతం, ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. ► బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు (గత ఏడాది 42.50 శాతం) ఈ ఏడాది 38.48 శాతానికే పరిమితమయ్యాయి. దీనిపై దృష్టి పెట్టాలి. అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను ఆర్బీకేల స్థాయిలో వెంటనే జారీ చేయాలి. ► ఈ–క్రాప్ ఆధారంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. రా>ష్ట్రంలో దాదాపు ఇంకా 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాలి. వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం ► వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్ కాలేజీలు కడుతున్నాం. ► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. ► ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తోంది. ► ఆరోగ్యశ్రీ పథకంలో 2,432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చాం. ఈ పథకం కింద ఇకపై పీహెచ్సీలలో కూడా చికిత్స పొందవచ్చు. విద్యా రంగానికి చేయూత ఇవ్వాలి ► విద్యా రంగంలో నాడు–నేడు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి సదుపాయాలు కల్పించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ తీసుకొచ్చాం. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మార్చాం. ► మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చేస్తాం. ఈ ప్రక్రియలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్పొచ్చు. ఎంఎస్ఎంఈల ఓటీఆర్‌ను అమలు చేయాలి ► రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్ఎంఈల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ (ఓటీఆర్) ప్రకటించింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్ వ్యవస్థీకరణకు నోచుకున్నాయి. ఈ దృష్ట్యా వీలైనన్ని రుణ ఖాతాలు ఓటీఆర్ వినియోగిచుకునేలా చూడాలి. తద్వారా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదేళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్ సమయంలో అండగా నిలిచాం. బ్యాంకులు కూడా సానుకూలంగా ఆలోచించాలి. చిరు వ్యాపారులకు అండగా నిలవాలి ► వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారి వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. ► రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలి. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ► 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది వలంటీర్లు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) తగ్గించడంలో మీకు తోడుగా నిలుస్తారు. మహిళల జీవనోపాధి పెంపునకు సహకారం ► ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయక బృందాలలో 18.36 శాతం ఎన్పీఏలు ఉండేవి. వారికి వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంతో వారి రుణాలు, ఎన్పీఏ ఒక శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది. ► మహిళలకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్ వ్యవస్థను కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, దశల వారీగా విస్తరిస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. -
సచివాలయాలు, ఆర్బీకేలు భేష్
సాక్షి, అమరావతి/గన్నవరం: సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ఆలోచన అని అభినందించారు. గత రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామసీమల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో గ్రామ సచివాలయం, ఆర్బీకేని సందర్శించి వాటి ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. తిరిగే తిప్పలు లేకుండా అన్ని సేవలు.. పౌర సేవలను ప్రజల చెంతకు చేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించిందని, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఏర్పాటయ్యాయన్నారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు వారి గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందుతున్నాయన్నారు. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగిపోయి వేగంగా పనులు జరుగుతున్నట్లు పలువురు నీతి ఆయోగ్ బృందానికి తెలియచేశారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా ఇస్తున్నారని, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేవడం బాగుందని చెప్పారు. మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయం ప్రకృతిసాగులో మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయమని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు సాగు చేస్తున్న పెరటి తోటల క్షేత్రాన్ని నీతి అయోగ్ బృందం సందర్శించింది. తనకున్న ఐదు సెంట్ల స్థలంలో పసుపుతో పాటు 18 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఇంట్లో వినియోగం, ఖర్చులు పోనూ మిగిలిన వాటిని విక్రయించి నెలకు రూ.1,000 సంపాదిస్తున్నానని పొదుపు సంఘం మహిళ జన్యావుల ధనలక్ష్మి తెలిపింది. కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వరరావు, సీనియర్ సలహాదారులు డాక్టర్ నీలం పటేల్, సీహెచ్‌పీ శరత్‌రెడ్డి, అవినాష్మిశ్రాతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకేల పనితీరు చాలా బాగుంది ఆర్బీకేల వ్యవస్థ చాలా బాగుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ టీవీ, కియోస్క్, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ కిట్లతో పాటు రైతుల కోసం అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆయన పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సొంతూరిలోనే రైతులకు అందించడం, ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నా వడ్డీకే పంట రుణాలు, బ్యాంకింగ్ సేవలు ఇలా ఆర్బీకేల ద్వారా అంది స్తోన్న సేవలన్నీ బాగున్నాయన్నారు. -
AP: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గ్రామ సచివాలయాలు
సాక్షి, అమరావతి: వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో పలు మార్పులు చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పరిగణిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. చదవండి: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు! కేవలం వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలు వరకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్దిదారులకు చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీలు మినహాయిస్తూ మరో రెండు నోటిఫికేషన్లను జారీ చేశారు. -
గిన్నిస్ బుక్‌లోకెక్కిన ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి
నరసాపురం: పెన్సిల్ లెడ్‌పై అతుకులు లేకుండా, ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూదిమొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న కొప్పినీడి విజయమోహన్‌కు సూక్ష్మ కళాకారుడిగా పేరు ఉంది. సూదిమొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. రాష్ట్రీయ యువగౌరవ్ సమ్మాన్ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. 50 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. విజయమోహన్ తండ్రి వరహాలరావు ఆటో డ్రైవర్. తల్లి నాగ సుశీల గృహిణి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయమోహన్ 2019 అక్టోబర్‌లో గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. -
గ్రామ సచివాలయాలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: పాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్న సత్ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల పనితీరును కేంద్ర జలశక్తి శాఖ కీర్తించింది. వీటి సేవలు ప్రశంసిస్తూ జలజీవన్ సంవాద్ అక్టోబరు సంచిక ఈ–బుక్‌లో కథనాన్ని ప్రచురించింది. జల్‌జీవన్ మిషన్ లక్ష్యాలు చేరుకునేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్‌లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది. ప్రధానాంశాలు ఏమిటంటే.. 2 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటుచేయాలని 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సచివాలయం ముఖ్యోద్దేశం ఏమిటంటే.. గ్రామ పంచాయితీ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అన్ని ప్రభుత్వ సేవలను గ్రామస్తులకు వారి ఇంటి వద్దే అందుబాటులో ఉండేలా చూడటం. వారికి 318 సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది. పరిపాలన మీ ఇంటి వద్దే అనే 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని అనుసరించి ఏపీ ప్రభుత్వం ఇలా ప్రత్యేకమైన ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా.. ప్రజలకు మెరుగైన సేవలను వారి ఇంటి వద్దే అందించడానికి గ్రామ సచివాలయం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ అసిస్టె¯Œంట్, విలేజ్ టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లను నియమించింది. ఈ ఉద్యోగుల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ పోర్టల్ కూడా రూపొందించింది. ఇది గ్రామస్థాయిలో భారీ ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రతీ 50 కుటుంబాలకు ఓ వలంటీర్ ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున భారీస్థాయిలో వలంటీర్లను చేర్చుకుంది. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందేలా సహకరిస్తారు. ఏపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద గ్రామస్తులకు ఏటా రూ.50వేల నుంచి రూ.60వేల వరకూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకాల ఫలితాలు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని దీర్ఘకాలం పాటు అందించడం అనే ‘జల్‌జీవన్ మిషన్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి. -
వలంటీర్లపై టీడీపీ దాడి
వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఘటనలు గంగాధర నెల్లూరు(చిత్తూరు )/గాలివీడు (వైఎస్సార్ జిల్లా): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం కొర్లకుంట గ్రామ సచివాలయంలో తలముడిపి వలంటీర్ మల్లికార్జునపై టీడీపీ నాయకులు పేరం సోదరులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. తలముడిపి, కొర్లకుంటకు ఒకే సచివాలయం కావడంతో తలముడిపి సర్పంచ్ మద్దిరాల జ్యోతి, కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లికార్జునపై కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక బంధువులు పేరం ప్రభాకర్‌రెడ్డి, ఆనందరెడ్డి, మురళీరెడ్డి, చిన్న ఎరుకల్‌రెడ్డి మూకుమ్మడిగా దాడి చేశారు. వలంటీర్ ఫిర్యాదు మేరకు పేరం సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా గాంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లి వలంటీర్ గాయత్రి ఇంటిముందు టీడీపీ నేతల ఇళ్ల నుంచి వచ్చిన మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై ప్రశ్నించినందుకు గాయత్రి, కుటుంబీకుడు మాధవమందడిపై గురువారం మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు లోకనాథనాయుడు, కమలేష్‌నాయుడు, హేమాద్రినాయుడు, కిషోర్‌నాయుడు, యుగంధర్‌పై కేసు నమోదైంది. -
సచివాలయ ఉద్యోగి దుర్మరణం.. రెండు నెలల క్రితమే వివాహం..
సాక్షి, బెళుగుప్ప (అనంతపురం): మండలంలోని నారింజ గుండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండాకు చెందిన పార్వతీబాయి, కృష్ణానాయక్ దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్ నాయక్ (26).. శ్రీరంగాపురం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహమైంది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్ నాయక్.. వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. గుండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా రాయదుర్గం వైపు వెళుతున్న కారు (ఏపీ02 బీఆర్ 0735) వేగాన్ని డ్రైవర్ నియంత్రించుకోలేక ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనంతో పాటు రాజశేఖర్‌నాయక్‌నీ 80 మీటర్ల దూరం కారు లాక్కెళ్లింది. ఘటనలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పెద్దన్న, ఎంపీడీఓ ముస్తాఫా కమాల్‌బాషా అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..) రాజశేఖర్‌నాయక్ (ఫైల్) -
Andhra Pradesh: పల్లె పటిష్టం
కళ్లెదుటే గ్రామ సచివాలయం.. కళకళలాడుతున్న స్కూలు భవనాలు ఓ వైపు.. రైతుల సేవకు వెలసిన రైతు భరోసా కేంద్రం మరో వైపు.. ఆపద వేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న హెల్త్ క్లినిక్ ఇంకో వైపు.. అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ భవనం.. ఇంకో నాలుగడుగులు వేస్తే పాల సేకరణ కేంద్రం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఇదీ సీఎం వైఎస్ జగన్ కల. ఈ కలను సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి.. వృక్షంగా ఎదుగుతోంది. కళ్లెదుటే ఫలాలూ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ ఫలాల విలువ లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. సాక్షి నెట్వర్క్,ఆంధ్రప్రదేశ్: గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు ప్రగడ రాంబాబు చెబుతున్నారు. 5400 మంది జనాభా గల తమ ఊళ్లో రెండు చొప్పున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. గతంలో ఏమ్మెల్యేను అడిగినా, ఏ భవనం మంజూరు చేసే వారు కాదని.. ఇప్పుడు అడగకుండానే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు అన్నీ ఉన్న ఊళ్లోనే ఇస్తున్నారని.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయానికి వెళితే చాలని చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని తమ గ్రామం కొత్త శోభను సంతరించుకుందని, గ్రామాలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయని తెలిపారు. తనకు ఊహ తెలిశాక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం ఇదే ప్రథమం అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి ఎవరిని కదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని ఊళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కావడంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకోగా, మరి కొన్ని ఊళ్లలో ఈ భవనాల నిర్మాణాలతో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలి సారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, జరుగుతున్నాయని జనం చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించలేదని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక్కో ఊరికి రూ.కోటికి పైగా వ్యయం చేస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద ఊళ్లలో రూ.రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే రూ.12,510 కోట్లతో మౌలిక వసతుల కల్పన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఆయా గ్రామాల్లోనే కల్పించేందుకు పెద్ద పీట వేశారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించేలా పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సింహ భాగం పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ ప్రజల అవసరాలను తీర్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, బల్క్‌మిల్క్ యూనిట్లు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలతో పాటు నాడు–నేడు కింద పాఠశాలలను బాగు చేయడం తదితర పనులు చేపట్టారు. రూ.12,510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో 15,000 స్కూల్స్ రూపు రేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మంచి నీటి వసతి పనులు కొనసాగుతున్నాయి. మండల, జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులు వీటికి అదనం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు ఇలా.. ► రూ.4,199.70 కోట్లతో 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 3,273 పూర్తి. మరో 2,683 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 1,840 సచివాలయాలు రెండవ అంతస్తు దశలో ఉన్నాయి. ► రూ.2,303.47 కోట్లతో 10,408 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటు. ఇందులో ఇప్పటికే 1,746 పూర్తి. మరో 2,860 గ్రౌండ్ ఫ్లోర్ స్లాబుతో పాటు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 5,803 బేస్మెంట్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► రూ.1,475.50 కోట్లతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు. ఇందులో 702 క్లినిక్స్ నిర్మాణం పూర్తి. మరో 2,008 గ్రౌండ్ ఫ్లోర్ ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. ఇంకా 5,875 బేస్మెంట్ స్థాయి దాటి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► పాడి రైతుల కోసం తొలి దశలో రూ.416.23 కోట్ల వ్యయంతో 2,541 బల్క్ మిల్స్ యూనిట్ల నిర్మాణం మొదలైంది. వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ.724.80 కోట్లతో 4,530 వైఎస్సార్ విలేజ్ డిజిటల్ ల్రైబరీల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ► నాడు–నాడు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని రూ.3,400 కోట్లతో 15,000 స్కూల్స్‌లో మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది మా ఊళ్లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. రూ.25 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. రూ.14.95 లక్షలతో విలేజ్ క్లినిక్ భవనం నిర్మాణంలో ఉంది. విద్యార్థుల కోసం రూ.15 లక్షలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బల్క్ మిల్క్ సెంటర్ కోసం రూ.17.67 లక్షలు మంజూరు చేసింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూల్లో రూ.18 లక్షలతో పనులు చేపట్టారు. పెయింటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, టైల్స్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, క్లాసు రూములో లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయం వల్ల మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పింది. గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉంది. సంక్షేమంతో పాటు ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుంది. – చిటికెల జగదీష్, భీమ బోయిన పాలెం, మాకవరపాలెం మండలం, విశాఖ జిల్లా ఊహించలేదు.. కలలా ఉంది నల్లమల అడవికి సమీపంలోని మా ఊరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 జనాభా. పక్కనే ఉన్న కొత్తూరును కలుపుకుని సచివాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అధికారులు మా ఊళ్లోనే మాకు అందుబాటులో ఉంటున్నారు. పనుల కోసం మేము ఏ ఊరికీ పోనవసరం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పథకం కావాలన్నా అర్హత ఉంటే చాలు వెంటనే అందిస్తున్నారు. వలంటీర్ల తోడుతో చదువురాని వారు సైతం పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నారు. రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21.80 లక్షలతో ఆర్బీకే, 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, రూ.36 లక్షలతో సిమెంట్ రోడ్లు, స్కూల్లో అదనపు గదుల కోసం రూ.11 లక్షలు, ఇళ్లకు కుళాయిల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇలా చకచకా అన్నీ కళ్లెదుటే ఏర్పాటై పోతున్నాయి. అంతా కలగా ఉంది. ఇంత త్వరగా ఇంత అభివృద్ధి జరుగుతుందని మేమెవ్వరమూ ఊహించలేదు. – షేక్ పెద్ద దాదావలి, ఆరవీటికోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా విశాఖ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం -
గ్రామ సచివాలయాలే.. ఇక కోవిడ్ చికిత్స కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్లో కీలక పాత్ర పోషించిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు మరో చరిత్ర సృష్టించనున్నాయి. వికేంద్రీకరణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కేర్ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. కోవిడ్ తీవ్రత తక్కువగా ఉండి, సాధారణ మందులతోనే నయమయ్యే పరిస్థితులున్నప్పుడు.. వారికి గ్రామ సచివాలయాల కోవిడ్ కేర్ సెంటర్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కోవిడ్ సోకితే చిన్న చిన్న కుటుంబాలు, చిన్న ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. అందుకే గ్రామ సచివాలయాల్లోనే 5 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, మూడో వేవ్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిరక్షణ ఏఎన్ఎంలకు.. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసే పడకల్లో చేరే కోవిడ్ బాధితుల ఆరోగ్య పర్యవేక్షణ ఏఎన్ఎంలకు అప్పగిస్తారు. నిర్వహణ బాధ్యతలు మాత్రం వార్డు సెక్రటరీ చూసుకుంటారు. భోజనం, మందులు సచివాలయ సిబ్బందే అందజేస్తారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ తీవ్రత ఎక్కువైతే పంచాయతీ సెక్రటరీ లేదా తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే.. అధికారులే దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసే కోవిడ్ కేర్ సెంటర్‌కు అవసరమైన వైద్య ఉపకరణాలను కుటుంబ సంక్షేమశాఖ అందజేస్తుంది. 11,789 గ్రామ సచివాలయాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 11,789 గ్రామ సచివాలయాల్లో పడకలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో కోవిడ్ కేంద్రంలో 4 నుంచి 5 పడకలు ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,186 మైనర్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మూడో వేవ్ వస్తే ముందస్తు అంచనాలను బట్టి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. -
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది. హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్, లాగిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో హాజరు డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. డ్యాష్‌బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆధికారులు అప్లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్‌జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆర్బీకేల తనిఖీ తప్పనిసరి
ఆర్బీకేల తనిఖీల్లో.. ఇ– క్రాపింగ్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా.. లేదా? అనేది చూడాలి. గ్రామంలో ప్రతి ఎకరా కూడా ఇ– క్రాపింగ్ జరగాల్సిందే. సాగుదారు ఎవరు? ఏ పంట సాగుచేస్తున్నారన్నది ప్రధానం. ఆ వివరాలనే నమోదు చేయాలి. ఇ– క్రాపింగ్ ఉంటేనే పంటల బీమా, సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్పుట్ సబ్సిడీ.. ఇలాంటివన్నీ సవ్యంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి. 56 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధం కావాలి. ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీని మీదే ఆధారపడి ఉంది. సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు కలెక్టర్లు, జేసీలు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)ను కూడా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎటువంటి డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలని స్పష్టం చేశారు. సీడ్ కార్పొరేషన్లో ఎంప్యానెల్ అయిన కంపెనీలు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని.. మరెవరైనా ఎంప్యానెల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో రబీ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, కౌలు రైతులకు రుణాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇ– క్రాపింగ్ చేయించడమనేది ఆర్బీకేల ప్రాథమిక విధి అని చెప్పారు. దీనిపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సీఎం–యాప్ పై కూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశాజనక పరిస్థితులు ఉన్నాయో సీఎం –యాప్ ద్వారా పర్యవేక్షించి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ, మార్కెటింగ్ శాఖ అలాంటి పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. జేడీఏలు, డీడీఏలు కూడా 20 శాతం ఇ– క్రాప్ తనిఖీలు చేయాలని.. అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు తప్పనిసరిగా 30 శాతం ఇ–క్రాప్ తనిఖీ నిర్వహించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరిగేలా చూడాలని చెప్పారు. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో, నాలుగో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనం గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని మరవద్దు ► ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయాలి. నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి. సీడ్ కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి. సీడ్ కార్పొరేషన్లో ఎంప్యానెల్ అయిన కంపెనీలు మాత్రమే సరఫరా చేయాలి. ► మరెవ్వరూ ఎంప్యానెల్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే సహించేది లేదు. ఆర్బీకేల ద్వారా ఇస్తున్న సీడ్, ఫెర్టిలైజర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. కలెక్టర్లు మొదలుకుని అందరూ కూడా సమష్టిగా బాధ్యత వహించాలి. ► పదిహేను రోజులకొకసారి కలెక్టర్లు ఆర్బీకేలపై సమీక్ష నిర్వహించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటి వరకు స్టోరేజీ కోసం.. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి. నాకు ఫలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా కావాలి. అందుకే వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేయొద్దు ► ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచాలని చెప్పాం. వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి. అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి. ► కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చాం. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. వారికి రైతు భరోసా సహా.. అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. బీమా ఇస్తున్నాం. పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం. ► ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు. అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కనీస మద్దతు ధరకు సంబంధించి మనం హామీ ఇస్తున్న పోస్టర్‌ను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. అధికారులు సందర్శనకు వెళ్లినప్పుడు ఇది కూడా తనిఖీ చేయాలి. తద్వారా ఏ పంటకు ఎంత రేటు ఇస్తున్నామన్నది రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుంది. -
ఉద్యోగులూ.. శభాష్
గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాల విషయమై నెలలో నాలుగు బుధవారాల్లో ఒక్కో వారం ఒక్కో దశలో (సచివాలయాలు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో) ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం వస్తుందా.. లేదా? ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేస్తుందా.. లేదా? సచివాలయంలో కనెక్టివిటీ ఉందా.. లేదా? అన్నది తెలుస్తుంది. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. సమగ్ర భూ సర్వే తొలి దశలో నిర్ణీత కాల పరిమితితో 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది. 2023 జూన్ నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రక్రియ ముగుస్తుంది. సర్వే అవగానే రికార్డులు అప్డేట్ అవుతాయి. యజమానులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఆ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వస్తుంది. ఈ దృష్ట్యా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దాదాపు 80 శాతం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మిగిలిన 20 శాతం మంది పనితీరును కూడా మెరుగు పరిచేలా వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూత ఇవ్వాలని, ఈ విషయంలో కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలపై దృష్టి పెట్టాలని, వారు మెరుగైన సేవలు అందించేలా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. వారు అప్‌గ్రేడ్ అయ్యేలా చేయూతనిచ్చి, తీర్చిదిద్దాలని చెప్పారు. అప్పటికీ సేవలు అందించడంలో ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలని, ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘స్పందన’పై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదులు పరిష్కరించాలి ► గ్రామ, వార్డు సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి. ► అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలి. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలి. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు.. బృందాలుగా వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి. సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు ► ప్రతినెలలో తొలి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి. సిబ్బంది, వలంటీర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. మొబైల్స్, గౌరవ వేతనం, సీఎఫ్ఎంఎస్ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి. ► నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్బీ స్థాయిలో సమావేశం జరగాలి. నెలలో మూడో బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమావేశం కావాలి. నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి. అప్పుడే మనకు ప్రతి సచివాలయంలో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు మెరుగుపడ్డాయి. దీనిని కొనసాగించాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి. గతంలో వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా.. లేదా? అన్నది చూడాలి. ► ఏటా జూన్, డిసెంబర్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు కచ్చితంగా అమలు చేయాలి. సమగ్ర భూ సర్వే విప్లవాత్మకం ► జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 సంవత్సరాల తర్వాత సర్వే, రికార్డులను అప్డేట్ చేస్తున్నాం. సర్వే పూర్తయితే గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది. ► గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది. ఇది పూర్తవగానే జాతికి అంకితం చేస్తాం. సమగ్ర సర్వే పూర్తి చేసి, కొత్త పాసుపుస్తకాలు, రికార్డులు ఇస్తాం. మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది. గృహ హక్కులతో 47.4 లక్షల మంది పేదలకు లబ్ధి ► జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ► ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ► గ్రామాల్లో తొలి విడతలో 4,314 వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను నిర్మిస్తున్నాం. వీటిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ► అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత కార్యక్రమం, 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాల కార్యక్రమం ఉంటుంది. అర్హులెవరూ మిగిలిపోకూడదు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 10 రోజుల పాటు ఆసరా కార్యక్రమాలను బాగా నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు. -
పనితీరు బాగుంది.. సచివాలయాలు భేష్..
సాక్షి, అమరావతి: ఉన్నతాధికారుల తనిఖీలతో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు మరింతగా మెరుగు పడుతున్నట్టు స్పష్టమైంది. నిత్యం ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడమే లక్ష్యంగా కలెక్టర్ల నుంచి మున్సిపల్ కమిషనర్ల వరకు తనిఖీలు తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోంది. ఒక్కో స్థాయి అధికారి.. వారానికి ఇన్ని సచివాలయాల పనితీరును పరిశీలించాలని, ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో కలెక్టర్ల నుంచి సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల వరకు ప్రతి వారం గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు సంబంధిత అధికారులు 1,352 తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా, 1,462 తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల పనితీరుతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల వివరాలు, సంక్షేమ కేలండర్ ప్రదర్శన వంటివి పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో 96.51 శాతం సచివాలయాల పనితీరు బాగుందని, 3.22 శాతం సచివాలయాల పనితీరు సాధారణంగా ఉందని తేలింది. కేవలం 0.27 శాతం సచివాలయాల పనితీరు మాత్రమే బాగోలేదని స్పష్టమైంది. 95.42 శాతం వలంటీర్ల పనితీరు బాగుండగా, 4.17 శాతం వలంటీర్ల పనితీరు సాధారణంగా ఉందని, 0.41 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని తేలింది. కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని నిర్ధారించిన విషయం తెలిసిందే. -
సచివాలయాల సేవలను మరింత విస్తరించాలి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరచాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థపై మంత్రులు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. సచివాలయాల్లో ఆధార్ సేవలతో సహా అన్ని పౌరసేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సచివాలయ సిబ్బంది వృత్తి నైపూణ్యాలను పెంచడం కోసం శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఏటా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపడుతున్నామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం స్థాయిలో పర్యవేక్షిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సచివాలయాల స్థాయిలోకి తీసుకొచ్చి మంచి పాలనను చేరువ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది జనవరి 26 నుంచి ఈ నెల 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.08 కోట్లమంది వివిధ సేవల కోసం సచివాలయాలను ఆశ్రయించగా, 3.06 కోట్లమంది సేవలను పొందారని వివరించారు. రైస్ కార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక వంటి పథకాలను సచివాలయాల ద్వారానే పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
YS Jagan: సచివాలయాలు సందర్శిస్తా
ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి వారం సమావేశం కావాలి. ప్రైవేటు వ్యాపారుల దుకాణాలు పరిశీలించాలి. నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా? ధరలు అదుపులో ఉన్నాయా? లేవా? గమనించాలి. రైతులకు అవసరమైన ఎరువులు ఇతరత్రా వస్తువులు సరిపడా అందుబాటులో ఉన్నాయా? లేవా? చూడాలి. అప్పుడే నకిలీల బెడద తగ్గుతుంది. ఉపాధి హామీ పనులకు సంబంధించి గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులను ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా దృష్టి పెడుతున్నాం. కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టి.. ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: డిసెంబర్ నుంచి తాను సచివాలయాలను సందర్శిస్తానని, ప్రతి పర్యటనలో సచివాలయాల పని తీరును పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని స్పష్టం చేశారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయాల సందర్శన, ప్రజల వినతుల పరిష్కారం, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాలపై మార్గ నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల సందర్శన ద్వారా అందరిలో బాధ్యత మరింత పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కలెక్టర్లు కూడా ప్రతివారం రెండు సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలు తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పామని తెలిపారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెలలో 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలన్నారు. ఆయా పథకాలకు అర్హులైన వారు ఇంకా ఏవరైనా మిగిలిపోయి ఉంటే, కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే జూన్, డిసెంబర్ నెలల్లో మంజూరు చేయాలని చెప్పారు. ఎవరి దరఖాస్తునైనా తిరస్కరిస్తే తగిన కారణం చెప్పాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టి సారించాలి ► ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యం. ఇది నిరంతర ప్రక్రియ. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టి సారించి, 10 శాతం ఇ–క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం.. అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు 30 శాతం ఇ– క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. ► ఇ– క్రాపింగ్ కింద డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి. భూమి వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దు. అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ, పంటల ప్లానింగ్ ► అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టి పెట్టాలి. ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో ఈ సమావేశాలు జరగాలి. ఆర్బీకే స్థాయి సమావేశాల్లో వస్తున్న అంశాలపై మండల స్థాయిలో, మండల స్థాయిలో వస్తున్న అంశాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చ జరగాలి. సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. జిల్లా స్థాయిల్లో వస్తున్న అంశాలపై విభాగాధిపతులు, కార్యదర్శులు దృష్టి పెట్టాలి. ► పంటల ప్లానింగ్‌పై అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చ జరగాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా చర్చించాలి. ఆర్బీకేల పనితీరు, సీహెచ్‌సీల పనితీరుపైనా దృష్టి పెట్టాలి. సీఎం యాప్‌పై కూడా అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చ జరగాలి. ► ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అడ్వైజరీ కమిటీలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. ఆర్బీకేలను కలెక్టర్లు సందర్శిస్తున్నప్పుడు కియోస్క్‌ల పనితీరుపై దృష్టి పెట్టాలి. డెలివరీ షెడ్యూలు సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపైనా కూడా దృష్టి పెట్టాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు ► ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచుతున్నారు. వీరు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? రైతులకు వీరి నుంచి సేవలు అందుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే వీటిని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది. ► కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. వీరిని ఇ– క్రాపింగ్‌తో లింక్ చేశాం. ఇన్పుట్ సబ్సిడీ, బీమా, పంటలకు ధరలు కల్పించడం.. ఇవన్నీ కూడా కౌలు రైతులకు అందాలి. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. పంట సాగు చేస్తున్న వారందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ► ఉపాధి హామీ పనులు మెటీరియల్ కాంపొనెంట్‌కు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు దృష్టి పెట్టాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలి. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు ► డిసెంబర్ 31 నాటికి 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి వస్తుంది. వర్క్ ఫ్రం హోం సౌకర్యం గ్రామాల్లో అందుబాటులోకి వస్తుంది. ఆలోగా డిజిటల్ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ► డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను వెంటనే గుర్తించాలి. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను తరచూ సందర్శించాలి. అప్పుడే అక్కడి ఉద్యోగుల్లో బాధ్యత మరింత పెరుగుతుంది. మనం వెళ్లకపోతే, అవి ఎలా పని చేస్తున్నాయో చూడకపోతే పరిపాలన మెరుగు పడదు. మీరు ఎంతమేర సందర్శిస్తే.. అంతగా పాలన మెరుగు పడుతుంది. నేను సచివాలయాలు సందర్శించే నాటికి ఎటువంటి ఫిర్యాదులు, లోపాలు కనిపించకూడదు. -
సచివాలయాల్లోనే ‘వన్‌టైం సెటిల్మెంట్’
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్మెంట్కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించడంతోపాటు ప్రతిపాదనలను వివరించారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డేటా అప్లోడ్ చేయనుందని, వివిధ సచివాలయాలకు డేటాను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపడతారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితా ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా ఇళ్ల లే అవుట్ల సందర్శన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయినట్లు అధికారులు తెలియచేయగా గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి స్వయంగా పరిశీలన, తనిఖీల కోసం కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్ కమిషనర్లు కచ్చితంగా వారానికో లేఅవుట్‌ను సందర్శించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ జేసీ, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు లే అవుట్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారానికోసారి మంత్రుల కమిటీ సమీక్ష సమగ్ర భూ సర్వేపై నియమించిన మంత్రుల కమిటీ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కూడా వారానికోసారి సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కమిటీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా నియమించాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీ యూనిట్‌గా మౌలిక వసతులు పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుకల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్.భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ నాణ్యత పరిశీలన సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక కిట్‌లో భాగంగా వచ్చే ఏడాది అందించనున్న స్కూల్ బ్యాగ్, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, సీఎం కార్యాలయ అధికారులు చూపించారు. వచ్చే ఏడాది జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇచ్చే బ్యాగ్ నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ -
Andhra Pradesh: ‘సచివాలయ’ వ్యవస్థతో యునిసెఫ్ జత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్) ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్ పనిచేస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే యునిసెఫ్ ప్రతినిధులకు ఆ సంస్థే జీతభత్యాలు చెల్లిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి పౌష్టికాహార సంబంధ అంశాలపై.. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని పేదల కాలనీలలో కరోనా నియంత్రణపై యునిసెఫ్ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పౌష్టికాహరం, దాని ఆవశ్యకత, పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలపై వలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు యునిసెఫ్ స్టేట్ మేనేజర్ మోహనరావు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కరోనా మూడో వేవ్ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు 2.58 లక్షల మంది వలంటీర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం అన్ని పాఠశాలల్లో యునిసెఫ్ ప్రతినిధులు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. -
‘సచివాలయ’ సిబ్బంది వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: వచ్చే అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారి వివరాలతో పాటు వారి పోలీసు వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత వివరాలను సిద్ధం చేసుకుని వాటిని నిర్ణీత ఫార్మాట్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తెలియజేయాలని అజయ్ జైన్ కలెక్టర్లను కోరారు. -
ఏపీ: దరఖాస్తు చేసిన మూడు గంటల్లోనే రేషన్ కార్డు!
మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఇజ్జిరోతు సూర్యనారాయణ రేషన్‌కార్డు కోసం గ్రామ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఎం.స్వర్ణలత లబ్ధిదారుడికి సాయంత్రం 4 గంటలకల్లా రేషన్‌కార్డు అందజేయడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. దరఖాస్తు చేసిన 3 గంటల వ్యవధిలోనే కార్డు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్ -
9,988 సచివాలయాల్లో జీరో కోవిడ్ కేసులు
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 15,001గ్రామ/వార్డు సచివాలయాలుండగా 9,988 సచివాలయాల్లో ఒక్క కోవిడ్ యాక్టివ్ కేసు కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం. 2,610 సచివాలయాల్లో ఒకే ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే ఉంది. మండలాల వారీగా చూస్తే.. నాలుగు కేసులు కంటే తక్కువగా ఉన్నవి 248 ఉన్నాయి. 9 లోపు యాక్టివ్ కేసులున్న మండలాలు 145. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలుండగా.. 100, ఆపైన కేసులు నమోదైంది కేవలం 4 మండలాల్లోనే. గత వారంతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం సాయంత్రం నాటికి 14,702 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.59 శాతం ఉంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 99.24 శాతం, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 97 శాతం రికవరీ రేటు నమోదైంది. గత వారం రోజుల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 0.23 శాతం మాత్రమే పాజిటివిటీ రేటు ఉంది. కాగా, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3.72 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ప్రస్తుతం కేసుల ఉధృతి తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మాస్కు విధిగా ధరించాలని చెబుతోంది. మాస్కు ధరించినవారే కోవిడ్ నుంచి తమను తాము కాపాడుకోగలిగారని నిపుణులు పేర్కొంటున్నారు. -
లక్ష మందితో నవంబర్‌లో సీఎంకు కృతజ్ఞత సభ
సాక్షి, అమరావతి: నవంబర్‌లో లక్ష మందితో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్టు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో ఆదివారం కార్యవర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని చెప్పారు. చదవండి: Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ తదనుగుణంగా ఆ ప్రక్రియ జరుగుతోందని, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులైన ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పలు తీర్మానాలు చేశామన్నారు. డిపార్టుమెంటల్ టెస్ట్ లేని 8 శాఖలకు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగుల సెలవు దినాలను పనిదినాలుగా పరిగణించి వారిక్కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు. స్లైడింగ్‌లో శాఖ మారిన ఉద్యోగుల మొత్తం సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మహిళా పోలీసుల విషయంలో ఆప్షన్ ఇచ్చి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 35 మందితో ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడిగా భీమిరెడ్డి అంజిరెడ్డి, వర్కింగ్ అధ్యక్షులుగా నిఖిల్ కృష్ణ, సుధాకర్, భార్గవ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల అంకం రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఆర్ కిషోర్, ఉపాధ్యక్షులుగా పి.హరీష్, కిషోర్, బాజిని ఎన్నుకున్నారు. చదవండి: వడివడిగా ‘ఈ పంట’ నమోదు -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది తామిచ్చిన ఆదేశాలను అధికారులు ఇప్పటివరకు అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిర్మాణాలు చేపట్టకుండా కిందిస్థాయి అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని ప్రశ్నించింది. ఇప్పటికైనా అధికారులకు తగిన ఆదేశాలిస్తే, కోర్టు ధిక్కార వ్యాజ్యాలను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అన్యాయం గురించి ఎవరికి చెప్పుకుంటారని నిలదీసింది. ఐఏఎస్ అధికారుల్లో అత్యధిక శాతం మంది కోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన అవసరంలేదన్న భావనలో ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు అమలుకాకపోవడానికి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు కొంత గడువునివ్వాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌లు అభ్యర్థించడంతో అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను 31కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకూ ఎనిమిది మంది అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కోర్టు ఎదుట ఉన్నతాధికారుల హాజరు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలతో సహా ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై తాజాగా పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత ఏడాది ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అమలుచేయకపోవడంతో అధికారుల చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, పలు శాఖల ఉన్నతాధికారులను న్యాయమూర్తి కోర్టు ముందుకు పిలిపించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్‌లు హైకోర్టు ముందు హాజరైన వారిలో ఉన్నారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. -
సచివాలయాల్లోనే ఆధార్, పాన్ కార్డు సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. విజయవాడలో గురువారం గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సీఎం వైఎస్ జగన్ మానసపుత్రికలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందిస్తారని చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే.. అర్హులను గుర్తిస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులం కూడా సందర్శిస్తామని చెప్పారు. సీఎం జగన్ గ్రామ స్థాయి పర్యటనలు ప్రారంభించేలోపు సచివాలయాలన్నింటినీ పూర్తిగా సిద్ధం చేస్తామన్నారు. వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్మెంట్ పరీక్షలు ప్రొబేషన్ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొబేషన్ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవన్నారు. ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఆగస్టులో, సెప్టెంబర్‌లో డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమని పుదుచ్చేరి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తేని.విజయకుమార్ కొనియాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సాయినగర్ గ్రామ సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సర్పంచ్ డీవీ రమణ, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. తక్కువ సమయంలో పారదర్శకంగా ప్రజలకు సేవలందించడంలో సచివాలయ వ్యవస్థ సంజీవనిలా పనిచేస్తుందని అక్కడి సిబ్బందిని ప్రశంసించారు. చెవిరెడ్డి సేవలు ఆదర్శం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సేవలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని మంత్రి విజయకుమార్ కొనియాడారు. ఫోన్లో చెవిరెడ్డిని అభినందించారు.