సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) పరిధిలోకి తీసుకొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ హెల్త్‌కార్డుల జారీప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ కార్యాలయం మూడురోజుల కిందట ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ రాసింది.
ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. ఒకేసారి రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి వాటిని భర్తీచేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్‌ను ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్‌ఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment