Ward Secretariat
-
AP: పింఛన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు, బయో మెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే: సజ్జల -
మేము సైతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..(వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంలో ఇప్పటి దాకా ‘మేము సైతం..’ అంటూ 4,23,821 కుటుంబాలు భాగస్వామ్యమయ్యాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మధ్యలో దీపావళి కారణంగా మూడు రోజులు విరామం ఏర్పడింది. 9న 664 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో, 10న మరో 689 సచివాలయాల పరిధిలో, 14న 647 సచివాలయాల పరిధిలో, 15న మరో 504 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గృహసారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు, వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో కార్యక్రమం ప్రారంభమైన రోజునే.. ఏ సచివాలయం పరిధిలో ఎంత మందికి ఏయే పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్న వివరాలతో కూడిన సంక్షేమ, అభివృద్ధి బోర్డులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. బుధవారం వరకు ఇలా 2,504 సచివాలయాల వద్ద సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించారు. వీటి ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజు నుంచే ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున కలుస్తున్నారు. ఇప్పటి వరకు (మధ్యలో 3 రోజులు సెలవులు పోను) 16,169 మంది 4,23,821 కుటుంబాల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి కలిగిన ప్రయోజనం, ఆ ఊరు మొత్తానికి కలిగిన ప్రయోజనాన్ని వివరించి చెప్పారు. -
సీఎం వైఎస్ జగన్ లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
-
అలవోకగా అబద్ధాలు ఈనాడుకే చెల్లు
విశాఖపట్నం: లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు సృష్టిస్తోంది. వార్డు సచివాలయాలకు సహాయకుల నియామకాలు.. అందుకు రూ.3 లక్షల చొప్పున వసూళ్లు.. గుంటూరు కేంద్రంగా ఓ కన్సల్టెన్సీ ద్వారా చేపడుతున్న ప్రక్రియతో జీవీఎంసీపై రూ.10.4 కోట్ల భారం అంటూ లేని వార్తను ఈనాడు వండి వార్చింది. సచివాలయాలకు గతంలో జరిగిన నియామకాలు తప్పితే.. ప్రస్తుతం ఎటువంటి పోస్టుల భర్తీ లేదు. అయినప్పటికీ గాలి వార్తలు రాస్తూ.. లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై కట్టు కథలు అల్లి.. బురద జల్లుతోంది. లేని పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా.. వాటిని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు అమ్ముకుంటున్నట్లుగా ఓ అవాస్తవ కథనాన్ని అచ్చేసింది. వాస్తవానికి 2019, 2020లో మినహా ఇప్పటి వరకు వార్డు సచివాలయాలకు సంబంధించి ఎటువంటి నియామక ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం ప్రతీ సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించే అవకాశం లేదు. అయినప్పటికీ సహాయకుల నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు ఈనాడు తప్పుడు కథానాన్ని అల్లేసింది. ఈ వార్తను జీవీఎంసీ ఉన్నతాధికారులు ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవం ఇలా.. జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 2019, 2020లో సచివాలయ కార్యదర్శుల నియామకాలు జరిగాయి. అలాగే ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా గౌరవ వేతనంపై వార్డు వలంటీర్లను నియమించారు. మరే ఇతర సిబ్బందిని ఏ ప్రాతిపాదికపైనా కూడా జీవీఎంసీ నియామకాలు చేపట్టలేదు. ప్రస్తుతం చేపట్టే అవకాశం కూడా లేదని జీవీఎంసీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఈనాడులో ప్రచు రించిన విధంగా ఎటువంటి సహాయకుల నియామకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఇక ఆప్కాస్ విషయానికొస్తే.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆప్కాస్‌ను ప్రారంభించింది. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను విలీనం చేసిన నాటి నుంచి 2022 డిసెంబర్ నాటికి 482 అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని ఆప్కాస్ నియమావళి ఆధారంగా రోస్టర్ పాయింట్/రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో జీవీఎంసీ కౌన్సిల్, కలెక్టర్, ఇన్చార్జి మంత్రి ఆమోదంతో అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను నియమించి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగు కోసం తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ వేతనంపై జీవీఎంసీ కౌన్సిల్, స్థాయీ సంఘం ఆమోదంతో స్థానిక మహిళా సహాయ సహకార సంఘాల ద్వారా అదనపు కార్మికులను నియమించుకున్నట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తాత్కాలికంగా నియమించిన వీరిని.. పారిశుధ్య పనులు పూర్తయిన వెంటనే నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పరంపర
-
21 లక్షల మందికి.. ఒక్కరోజులోనే 'కుల ధ్రువీకరణ పత్రాలు'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయి. ముఖ్యంగా కుల వీకరణ పత్రాల జారీలో సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానం వారి కష్టాలు తీరుస్తోంది. ఎందుకంటే.. ఈ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 30 రోజుల్లోగానీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఆ తర్వాత ఏదేని కారణంతో మళ్లీ అవసరమైనా మరోసారి 30రోజులు నిరీక్షించాల్సిందే. ఈ ఇబ్బందుల్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి వారికి సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి, మళ్లీ దాని అవసరం ఎప్పుడైనా ఏర్పడితే కొత్తగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా అంతకుముందు తీసుకున్న వివరాల ప్రకారం అడిగిన రోజునే గ్రామ, వార్డు సచివాలయాల్లో మరోసారి ఆ పత్రాలిచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. దీని ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 21,00,888 మంది దరఖాస్తు చేసుకున్న రోజునే కుల ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. గతంలో ఒకసారి తీసుకున్న వారికి.. సాధరణంగా.. విద్యార్థుల స్కూళ్లలో లేదంటే కాలేజీల్లో చేరే సమయంలోనూ.. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగ యువతకు.. వివిధ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ దానిని జారీచేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది గతంలో ఒకసారి తీసుకున్నా.. సరిగ్గా కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో వివిధ కారణాలతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సైతం ఏడాది క్రితం వరకు గరిష్టంగా 30 రోజులకు గానీ అవి జారీ అయ్యేవి కావు. ఫలితంగా సకాలంలో అవి అందక అక్కడక్కడ కొందరు తమ అవకాశాలను కోల్పోయేవారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అలాంటి వారికి అప్పటికప్పుడే సర్టిఫికెట్ల జారీచేయాలని సంకల్పించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, వివిధ పథకాల లబ్ధిదారులు కీలక సమయాల్లో రెండోసారి అవసరమైతే దరఖాస్తు చేసుకున్న రోజునే ఆ పత్రాలు అందించేలా వీలు కల్పించింది. భవిష్యత్తులోనూ కోటి మందికి అడిగిన రోజునే.. మీ–సేవా కేంద్రాల ద్వారా 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అందులో కొందరు నాలుగైదుసార్లు కూడా వాటిని పొంది ఉండొచ్చని.. అయితే, వాటిని ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు దాదాపు 75 లక్షల మంది ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్లుగా తాము గుర్తించామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అంటే.. 2020 జనవరి 26 నుంచి ఇంకో కోటిన్నర మందికి ఈ పత్రాలు జారీ అయినట్లు వారు తెలిపారు. ఈ పత్రాలను కూడా ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు 75 లక్షల మంది వివరాలను గుర్తించామన్నారు. ఇలా మీ–సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన 75 లక్షల మంది.. గ్రామ సచివాలయాల ద్వారా వాటిని పొందిన 75 లక్షల మంది కలిపి కోటిన్నర దాకా ఉన్నా, కొంతమంది రెండుచోట్ల తీసుకుని ఉండొచ్చన్న భావనతో కనీసం కోటి మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న వారి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల అన్లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ భవిష్యత్‌లో వీటి అవసరం ఎప్పుడు ఏర్పడినా, గతంలో మాదిరిగా 30రోజులు వేచి ఉండే పరిస్థితి లేకుండా దరఖాస్తు చేసుకున్న రోజే వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రం జారీచేసే అవకాశం ఉంటుందన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేశారు
-
AP: ప్రభుత్వ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్‌తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్ సూచించారు. -
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
గ్రామ స్వరాజ్యానికి నాలుగేళ్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్‌డబ్ల్యూఎస్) వ్యవస్థ ద్వారా సమర్థమైన సేవలను ప్రారంభించి సోమవారానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జీఎస్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర భారతావనిలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన సంక్షేమరాజ్య నిర్మాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి.. 1.30 లక్షలకుపైగా యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. పేదలకు సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడంలో తమను భాగస్వాముల్ని చేయడంపై జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల అంకమ్మరావు, నిఖిల్‌కృష్ణ, కిషోర్ సంతోషం వ్యక్తం చేశారు. -
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి -మంత్రి బుగ్గన
-
గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులివే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పోస్టుల భర్తీకి టైమ్‌లైన్.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించిన సీఎం వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు
-
సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు..!
-
గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది. జిల్లాలో బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10 కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు, తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9 జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ: జూన్ 10 రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి చదవండి: Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమిది.. సీఎం జగన్ చేసిన మేలును మరువం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
Grama, ward Sachivalayam: సేవల్లో రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 25న ఒక్క రోజులో ఏకంగా 2.88 లక్షల మంది వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలెవరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలు లేదంటే దగ్గర్లోని పట్టణాలు లేదా జిల్లా కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి సొంత ఊర్లోనే ఆయా పనులయ్యేలా ఓ వినూత్న, విప్లవాత్మక ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఈ పనులు దాదాపు పరిష్కారమయ్యేలా 2020 జనవరి 26 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకు గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలను పొందారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలను మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది. కానీ, గత బుధవారం ఒక్కరోజే 2.88 లక్షల మంది వివిధ రకాల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో అదేరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అది లేకుండా ఉంటే సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు తెలిపారు. 65 శాతానికి పైగా రెవెన్యూ సేవలే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లల్లో ప్రజలకు అందించిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా.. ఈ నెల 25న పరిష్కరించిన 2.88 లక్షల వినతులను చూసినా.. అందులో 65–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం ఒక రైతు తన సొంత పొలం వివరాలను పాస్ పుస్తకంలోగానీ, రెవెన్యూ శాఖ మీ–భూమి రికార్డులోగానీ నమోదు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవారు. నెలల తరబడి మండలాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని పరిస్థితి. లంచాల బెడద వీటికి అదనం. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులో భూమి బదిలీకి సంబంధించి జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వారి సొంత గ్రామాల్లోని గ్రామ సచివాలయాలోనే అత్యంత సులువుగా, ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోనే పూర్తిచేసి ఆ సమాచారాన్ని సంబంధిత యజమానికి మెసేజ్ పంపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఈసీ జారీ కూడా సచివాలయాల ద్వారానే లభిస్తోంది. అలాగే, ఆదాయ, కుల ధృవీకరణ ప్రతాలు వంటి వాటికి గతంలో 30 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సగటున ఐదు రోజుల వ్యవధిలో సంబంధిత తహసీల్దార్ ఆమోదం పూర్తయి, సర్టిఫికెట్లను కూడా సచివాలయాల్లోనే జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 25న అందజేసిన సేవలలో కూడా రెవెన్యూ సంబంధిత సేవలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జగనన్న చేదోడు పథకం తుది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ రోజు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. సేవల సంఖ్య, నాణ్యతలో పెరుగుదల ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కాలేదు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, సేవల నాణ్యత పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టింది. ఉదా.. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఆధార్ వివరాలతో అనుసంధానం చేసి అమలుచేస్తుండడంతో ప్రభుత్వం కొత్తగా సచివాలయాల్లో ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ► రాష్ట్రంలోని ప్రతి ఐదు గ్రామ సచివాలయాల్లో ఒకచోట చొప్పున 2,377 సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటిదాకా ఆధార్ సేవలు లేని ప్రాంతాలను గుర్తించి ఆయా సచివాలయాల్లోనే ముందుగా వీటిని ఏర్పాటుచేశారు. ► అలాగే, ఇళ్లు, భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను సైతం ప్రభుత్వం సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది. 1,537 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్థానిక సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేసింది. వీటిల్లో 51చోట్ల ఇప్పటికే ఆ సేవలు ప్రారంభయ్యాయి. ► గత ఏడాది కాలంలో కొత్తగా మున్సిపల్ ప్రాంతాలకు సంబంధించి నీటి, ఆస్తిపన్నులు, ట్రాఫిక్ చలానాలు, రైతుల నీటి తీరువా బిల్లుల చెల్లింపులనూ ప్రభుత్వం సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు నాంది పలికిన తర్వాత ప్రభుత్వంతో ఏ చిన్న పనిపడినా రోజుల తరబడి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెరిగి లంచాలకు తావులేకుండా పోయింది. రాబోయే రోజుల్లో సచివాలయాల్లో మరిన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడు సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడే వాటిని పరిష్కరించడానికి జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏర్పాటుచేస్తోంది. అలాగే, సేవలు అందజేసే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన శిక్షణనూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంటినుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సంబంధిత సర్టిఫికెట్ల సాఫ్ట్ కాపీలను వాట్సాప్ లింక్ ద్వారా పంపేందుకు యత్నిస్తున్నారు. -
సచివాలయాల ఉద్యోగులకు ‘ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పని తీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఉద్యోగి పనితీరు సూచికలు)ను రూపొందిస్తోంది. సచివాలయాల్లో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్చార్ట్ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ ఆధారంగా మండల స్థాయి అధికారులు ప్రతి నెలా వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. సంతృప్తికరం (గుడ్), తృప్తికరం (ఫెయిర్), పర్వాలేదు (శాటిస్ఫై), అసంతృప్తికరం (నాట్ శాటిస్ఫై)గా రేటింగ్ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్ పొందే ఉద్యోగులకు మెళకువలు పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు పనితీరు అంచనా వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్లలోనే ఉద్యోగుల పని తీరు నిరంతర అంచనా అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జాబ్ చార్ట్‌లను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఇటీవల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉద్దేశించిన కొన్ని సుస్థిర అభివృద్ధి సూచికలు (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్)ను రూపొందించుకొని ఆ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన సచివాలయాల ఉద్యోగులకు కూడా ఈ సుస్థిర అభివృద్ధి సూచికల ప్రకారం పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందిస్తోంది. వీటి రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఆయా ఉద్యోగుల విధులకు సంబంధించిన శాఖలకే అప్పగించింది. ఇప్పటివరకు ఆరు శాఖలు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను రూపొందించి, ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు పశు సంవర్ధక శాఖ, మహిళా పోలీసు ఉద్యోగులకు హోం శాఖ, ఏఎన్ఎంలకు వైద్య, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆరు కేటగిరీల ఉద్యోగులకు పట్టణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రూపొందించాయి. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరికీ వారి జాబ్ చార్ట్ ప్రకారం వంద మార్కులు ఉంటాయి. పని తీరు ఆధారంగా మార్కులు వేస్తారు. డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా రేటింగ్ ఇచ్చారు. 90కిపైగా మార్కులు తెచ్చుకొనే డిజిటల్ అసిస్టెంట్లకు ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తారు. 75 – 90 మార్కులు వచ్చేవారికి గుడ్ రేటింగ్, 50 – 75 మధ్య మార్కులు వచ్చేవారికి ఫెయిర్, 50 మార్కులకు కన్నా తక్కువ తెచ్చుకునే వారికి పూర్ రేటింగ్ ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన శాఖలు కూడా త్వరలో ఇండికేటర్స్ రూపొందిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది. అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్ (ఓఎమ్మార్ షీట్– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మూడో విడతలో పలు మార్పులు – గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. – తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు. – ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. 8 లక్షల దరఖాస్తులు అంచనా.. – వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు. – మొదటి విడత నోటిఫికేషన్లో గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. – 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. – ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. – మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు çపరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి. కేటగిరీల వారీగా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖలు రోస్టర్– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. -
బాబు వ్యాఖ్యలు దారుణం
సాక్షి, అమరావతి: మహిళా పోలీసులు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా అవమానించారని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే వ్యక్తి.. ఈ విధంగా మహిళలను కించపరచడం దారుణమని పేర్కొంది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గురువారం మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి.మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్ దుర్గా, గౌసియాబేగం, గీత తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. చదవండి: (Fact Check: ప్రాణాలు పోతున్నా టీడీపీ ప్రచార యావ.. ఈ వీడియోలే నిదర్శనం) -
సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం
-
క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి
సాక్షి, అమరావతి: ఇక్కడ కూర్చుని అంకెలతో అంతా బాగుందనే గత పాలకుల మూస ధోరణికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలు సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలి దశలో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల క్లస్టర్ల వారీగా వలంటీర్లు 1.52 కోట్ల కుటుంబాల ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఆ సర్వే ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. వీటి ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రగతి లక్ష్యాల అమలు తీరు తెన్నులను తెలుసుకొనేందుకు, వాటిని మరింత మెరుగ్గా అమలు చేసి, లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పదిహేను రోజులకో సారి ఒక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా తనిఖీలకు వెళ్లాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు నెలకు కచ్చితంగా రెండు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలని తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా తొలి దశలో మహిళా శిశు సంక్షేమం, విద్యకు సంబంధించిన 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పింది. వాటి అమలులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది, సమర్ధంగా అమలయ్యేలా సచివాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిగా సఫలమయ్యాక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని తెలిపింది. సచివాలయాల నుంచి సేకరించిన వివరాలు, ఇంటింటి సర్వే సమాచారంతో పాటు వారు గమనించిన పరిస్థితులపైన కూడా రిమార్కు రూపంలో ఇవ్వాలని తెలిపింది. సచివాలయం నుంచి సేకరించాల్సిన సమాచారమిది.. ► సచివాలయం పరిధిలో కౌమారదశలో ఉన్న (10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు) మహిళలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి రక్తహీనత ఉంది? వారు ఎంత శాతం ఉన్నారు? రక్తహీనత ఉన్న వారికి ఐఎఫ్ఏ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందిస్తున్నారా? ► గర్భిణులు ఎంత మంది ఉన్నారు? 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత మంది? వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం రెగ్యులర్‌గా అందిస్తున్నారా ? ► ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు? ఎదుగుదల లేక కుంచించుకపోయిన పిల్లలు ఎంత మంది? వారికి సకాలంలో టీకాలు, నులిపురుగుల నివారణ మందులు, పోషకాహారం అందిస్తున్నారా? మహిళా పోలీసులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారా లేదా? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు? ఈ పిల్లలకు పూర్తిగా టీకాలు వేశారా? పోషకాహారం, మందులు అందిస్తున్నారా లేదా? ► ప్రాథమిక విద్యలో 1 నుంచి 8వ తరగతి వరకు నికర నమోదు రేషియో ఎలా ఉంది? 6 నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంత మంది ఎలిమెంటరీ స్కూల్స్‌లో నమోదయ్యారు? డ్రాపవుట్లు ఉంటే అందుగల కారణాలు ఏమిటి? ► ఉన్నత సెంకడరీ విద్య 11 – 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి విషయంలో సంక్షేమ, విద్యా అసిస్టెంట్ ఎలా పనిచేస్తున్నారు? 16 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల వారు ఎంత మంది ఉన్నారు? వీరిలో ఎంత మంది ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐలో నమోదు అయ్యారు? డ్రాపవుట్స్ ఉంటే అందుకు కారణాలు ఏమిటి? ► ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని స్కూల్స్‌కు కనీస వసతులైన మంచినీరు, విద్యుత్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేవు? వసతుల్లేకపోవడానికి కారణాలు ఏమిటి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఎన్ని స్కూళ్లకు బాలికల కోసం విడిగా టాయిలెట్లు ఉన్నాయి? ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణాలు ఏమిటి? -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పరిధిలోకి తీసుకొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్‌కార్డుల జారీప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ కార్యాలయం మూడురోజుల కిందట ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ రాసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. ఒకేసారి రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి వాటిని భర్తీచేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్‌ను ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది. -
AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తోంది. కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ తదితర కొన్ని రకాల సర్టిఫికెట్ల కోసం పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సరికొత్త సేవలు ప్రవేశపెట్టనుంది. మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపి జారీ చేసిన సర్టిఫికెట్లు మళ్లీ కావాల్సి వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పటికప్పుడు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను ఒకసారి ఒక వ్యక్తికి జారీ చేసే వివిధ రకాల సర్టిఫికెట్ల వివరాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ సర్టిఫికెట్లకు సంబంధించి దరఖాస్తుదారుడు కోరుకుంటే ఒకేసారి మూడు నాలుగు ఒరిజనల్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసే విధానం తీసుకురాబోతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒకసారి జారీ చేస్తే.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయని, ఆ నిర్ణీత గడువు మేరకు ఆ సర్టిఫికెట్లు జారీకి ఈ విధానం వర్తిస్తుందని చెబుతున్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం ద్వారా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఎక్కువగా అవసరమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సర్టిఫికెట్లలో నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి ఈ విధానం వర్తింపచేసేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా సర్టిఫికెట్లు.. ఆన్లైన్లో బస్సు, రైలు టిక్కెట్లు వంటివి బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ కాపీ లింకు మెసేజ్ రూపంలో సంబంధిత దరఖాస్తుదారుడు వాట్సాప్‌కు చేరుతోంది. ఆ తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న సరిఫికెట్లను కూడా సంబంధిత అధికారుల ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుదారుల మొబైల్ నంబర్లకు కాపీ లింకును కూడా పంపే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: విశాఖపై విద్వేషాల కబ్జా పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. ఆయా సచివాలయాల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎవరైనా మ్యారేజి సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లయిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు తర్వాత మ్యారేజి సర్టిఫికెట్ అవసరమైన వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మ్యారేజి సర్టిఫికెట్ జారీకి సంబంధించి యూజర్ మాన్యువల్‌ను గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారులు అన్ని సచివాలయాలకు పంపారు. పెళ్లి జరిగిన ప్రాంతానికి సంబంధించిన సచివాలయంలోనే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దంపతుల ఆధార్ నంబరు, ఇతర వివరాలతో ఈ కార్డులు జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా కొత్త దంపతుల పేరుతో రేషన్‌కార్డు విభజన ప్రక్రియ సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో రేషన్‌కార్డు విభజన ప్రక్రియలో ఆయా వ్యక్తుల ఆధార్ నంబరు ఆధారంగా ఏపీసేవ పోర్టల్‌లో గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యారేజి సర్టిఫికెట్‌ను ధ్రువీకరించుకునే వీలును కూడా కల్పించినట్టు చెప్పారు. -
పదేళ్లకోసారైనా ఆధార్ అప్డేట్!
సాక్షి, అమరావతి: మీరు ఆధార్ తీసుకొని పదేళ్లు పైనే అయ్యిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ కార్డులో మీ వివరాలను అప్డేట్ చేసుకోలేదా? అయితే, వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో మీ తాజా ఫొటో, అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఇందుకు గాను ఆధార్ ఆన్లైన్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశముందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆధార్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ ద్వారా ఫొటో, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించి.. వివరాలు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత ఇటీవల ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల ద్వారా.. రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల ద్వారా వీలైనంత త్వరగా అందరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్ల ద్వారా సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు దీని గురించి సమాచారమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు ఆధార్ కార్డులలో వారి వివరాలు అప్డేట్ చేసేందుకు సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయం ఆదేశించింది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
CM YS Jagan: సీఎం జగన్ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు. అయితే 2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. గొప్ప మనస్సు ఉన్న సీఎం.. సర్వీస్ నిబంధనలను సడలించి ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప మనస్సుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో కొనియాడింది. మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌కు సచివాలయాల ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్ తేజ్, ఉపాధ్యక్షుడు బీఆర్ఆర్ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గ్రామాలు, వార్డుల్లో పనుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుర్తించిన మరుసటి రోజే పనులు అప్లోడ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
కళ్లెదుటే మార్పు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలోని కుగ్రామాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏకంగా 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 2.65 లక్షల మంది వలంటీర్లు ఈ వ్యవస్థలో భాగస్వాములై ప్రజల గడప వద్దకే సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ వ్యవస్థకు అనుసంధానంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు ప్రజారోగ్య సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా ఏర్పడ్డ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విత్తనం మొదలు పంట విక్రయం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. గ్రామ గ్రామాన ఇంగ్లిష్ మీడియం చదువులు పేదల ఇళ్లలో విద్యా వెలుగును నింపుతున్నాయి. డిజిటల్ లైబ్రరీలతో యావత్ ప్రపంచం కుగ్రామాలకు మరింత చేరువైంది. తద్వారా ఎంతో మంది యువతీ యువకులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా సొంత గ్రామం నుంచే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. నభూతో అన్న రీతిలో ఏకంగా 37,181 శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా ఆస్తుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం మూడంటే మూడేళ్లలోనే మన కళ్లెదుటే ఇలా ఎన్నో అనూహ్య మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజలకు సేవలందించే విషయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేదనడం అతిశయోక్తి కాదు. ఏకంగా 4.70 కోట్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతగా లబ్ధి కలిగించిందనేది అంచనాలకు అందనిది. ఎంతలో ఎంత తేడా! ► అవ్వాతాతలు పింఛను కోసం ఒకప్పటిలా.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఆ ఊళ్లో పెద్దలు.. అధికార పార్టీ రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ► ఒకేసారి రూ.15 – 20 వేలు ప్రభుత్వ లబ్ధి కలిగేటప్పుడు కూడా లక్షల సంఖ్యలో ఉండే లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం అడిగే పరిస్థితి అసలే లేదు. ► పింఛనే కాదు మరే ప్రభుత్వ సంక్షేమ పథకం కోసమైనా పేదలెవరూ పైరవీ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ► నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ఆపసోపాలు పడుతూ ప్రతి నెలా తమ పింఛను డబ్బులు తీసుకోవడానికి ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరమే లేదు. ► ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి చిన్నా.. పెద్దా పని పడినా మారుమూల కుగ్రామాల్లో ఉండే ప్రజలు ఊరు దాటి మండలానికో, పట్టణా నికో వెళ్లాల్సిన పని అంతకంటే లేదు. ► సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇలాంటి అనేక స్పష్టమైన మార్పులను తీసుకొచ్చింది. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక రీతిలో శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వ్యవస్థ ద్వారా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా వాటిని భర్తీ చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇప్పుడు ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకొని.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే– స్కేళ్లతో కూడిన వేతనాలు అందుకుంటున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లందుకు.. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందజేస్తున్నారు. మొత్తంగా.. ఒక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం ద్వారానే ప్రభుత్వం నాలుగు లక్షల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పించింది. 11,354 ప్రభుత్వ భవనాల నిర్మాణం ► సచివాలయ వ్యవస్థ.. కేవలం ఉద్యోగుల నియామకం, ప్రజలకు సేవలు అందించడానికే పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవలు అందజేసేందుకు శాశ్వత గ్రామ సచివాలయాల భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు మొత్తం 37,181 నిర్మాణం కూడా చేపట్టింది. ► అందులో 11,354 భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, మిగిలిన వాటిలో చాలా వరకు శ్లాబ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామ సచివాలయ, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. ► ఈ వ్యవస్థకు అనుబంధంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. ప్రజలు, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పేదల స్థితిగతులను సమూలంగా మార్చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. కుగ్రామాల్లోనూ ప్రతి రోజూ ‘స్పందన’ ► గ్రామాల్లో బడి కాకుండా ఉండే ప్రభుత్వ ఆఫీసు ఒక్క పంచాయతీ కార్యాలయమే. సగానికి పైగా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఏడాదికి ఓ 12 నుంచి 15సార్లు మించి తెరుచుకోని పరిస్థితి ఉండేది. మూడేళ్ల క్రితం వరకు అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. ఉన్నా.. నాలుగైదు గ్రామాలకు ఒకరు ఇన్చార్జిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒక్కో గ్రామంలో పదేసి మంది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. ► రైతులకు వ్యవసాయ సలహాలిచ్చేందుకు ప్రతి చోట ఓ వ్యవసాయ అసిస్టెంట్ పని చేస్తున్నారు. అనారోగ్యం పాలైన పశువులకు వైద్యం చేసేందుకు మరో ఉద్యోగిని నియమించారు. కరెంట్ అంతరాయాలను వెంటనే సరిచేయడానికి ప్రతి గ్రామానికీ ఓ ఎనర్జీ అసిస్టెంట్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. ఏ ఊరికి ఆ ఊరిలో అక్కడి ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతి రోజూ సాయంత్రం 3–5 గంటల మధ్య ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇంటర్నెట్ లేని గ్రామాలు 110 లోపే.. ► మూడేళ్లకు ముందు రాష్ట్రంలో మూడొంతుల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. కంప్యూటరు ఉన్న చాలా గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఇంటర్నెట్ వసతి లేక అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండేవి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి కొత్తగా రెండేసి కంప్యూటర్లు, కరెంటు లేని సమయంలో అది పనిచేయడానికి ఓ యూపీఎస్, ఇతరత్రా ఫర్నిచర్‌ను అందజేసింది. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ నమోదుకు ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కానర్లను కూడా అందజేశారు. సచివాలయంలోనే లబ్ధిదారులకు పింఛను కార్డు, ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రతి సచివాలయానికి ప్రింటర్, లామినేషన్ మిషన్లను సరఫరా చేశారు. ► సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆ సచివాలయానికి అందే దరఖాస్తులు ఆయా శాఖల వెబ్సైట్లలో నమోదు చేయడానికి ప్రతి సచివాలయానికి ఇంటర్ నెట్ వసతిని కూడా కల్పించారు. రాష్ట్రంలో కుగ్రామంలో ఉండే సచివాలయంలో కూడా ఇప్పుడు డిజిటల్ సేవలే కొనసాగుతున్నాయి. ► రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, కొండ ప్రాంతాల్లో ఉండే కేవలం 110 సచివాలయాల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఆయా సచివాలయాల్లో మొదట మాన్యువల్‌గా ఆ సేవలు అందజేస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు చెప్పారు. సచివాలయాల ద్వారానే ఐదు కోట్ల ప్రభుత్వ సేవలు ► నగరాల్లో ఉండే వార్డు సచివాలయాలు, కుగ్రామంలో ఉండే సచివాలయం అన్న తేడా లేకుండా 2020 జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ► కొన్ని ఎంపిక చేసిన సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు కూడా మొదలయ్యాయి. దశల వారీగా అన్ని సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తర్వాత దశలో పాస్‌పోర్టు, ఆధార్ సేవలు వంటి దాదాపు 200కు పైగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కార్పొరేట్ సంస్థల సేవలను కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ► ఇప్పటి దాకా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4.70 కోట్ల వినతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో 10.50 లక్షల మంది ఆధార్ సేవలను కూడా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమాకు సంబంధించి 8.93 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సచివాలయాల ద్వారానే ఈ– శ్రమ్ కార్డులను అందజేశారు. యూనిసెఫ్ గుర్తింపు ► ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యూనిసెఫ్ సంస్థ సైతం మన రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రశంసలు తెలిపింది. రాష్ట్రంలో ఆ సంస్థ అందజేసే సేవల్లో గ్రామ, వార్డు సచివాలయాలను, వలంటీర్లను భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా యూనిసెఫ్‌కు చెందిన యూఎన్ వలంటీర్ల విభాగం ప్రతినిధుల బృందం కూడా పని చేస్తుండటం విశేషం. ► దీనికి తోడు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి.. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ► పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు వలంటీర్ల వ్యవస్థ స్థితిగతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం కావాలని తెలుసుకొని, వాటిని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నాయి. -
శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు(బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మూడు నెలలకోసారి నగదు పేద ఆడ బిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం కోరుతూ ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రతి మూడు నెలలకోసారి(క్వార్టర్లీ) పరిశీలించి అప్పటి వరకూ నిర్ణయించిన అర్హులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు తమ జీవిత భాగస్వామిగా తమ కులానికి చెందిన వారిని ఎంచుకుంటే నిర్దేశిత మొత్తం, ఇతర కులాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటే అంతకంటే అధిక పారితోషికం వస్తుంది. దివ్యాంగులకు సంబంధించి ఇద్దరూ వైకల్యం ఉన్నవారైనా, ఒక్కరే వైకల్యం ఉన్నావారైనా సరే ఆడపిల్లకు మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గాంధీజీ కలలు సాకారం చేసిన సీఎం
నరసరావుపేట: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ఉద్యోగాల ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేలు నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనచంద్ర టౌన్‌హాలులో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆత్మీయ సభ నిర్వహించారు. సభకు అసోసియేషన్ కార్యదర్శి షేక్ మహమద్ ఆలీ అధ్యక్షత వహించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎటువంటి హాని చేయబోరని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపించాలనే ఆలోచనతోనే సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సచివాలయాల ఏర్పాటు ఓ చరిత్ర: గోపిరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక సచివాలయం ఉండే దశ నుంచి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 10,700 సచివాలయాలను తీసుకురావటం ఒక చరిత్ర అన్నారు. ప్రజల ముగింటకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పరిపాలన తీసుకురావటం సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇక అతిథులు కేక్ కట్‌చేయగా, వారిని ఉద్యోగులు సన్మానించారు. -
‘చేయూత’కు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇందుకు గాను ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 –60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 2020 ఆగస్టు 12వ తేదీ తొలి విడతలో 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు పంపిణీ చేసింది. రెండు విడతల్లో కలిపి రూ.9179.67 కోట్లను ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు అందజేసింది. తిరిగి ఇప్పుడు సెప్టెంబర్‌లో మూడో విడతగా ఈ పథకం లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా అర్హత పొందిన వారి పేర్ల నమోదుతో పాటు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల తాజా స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకొని.. అనంతరం ఆయా దరఖాస్తులపై 8వ తేదీ లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. -
CM YS Jagan: ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా
వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కలెక్టర్లూ పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి పనుల్లో మంచి ప్రగతి ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి. గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి.. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. రహదారులకు భూసేకరణపై దృష్టి రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..? స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్డీజీ యధావిధిగా పెరుగుతుంది. ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
AP: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఆర్థిక పరమైన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,000.80 కోట్లు మంజూరు చేసింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానిక ప్రజలకు అవసరమైన, అత్యధిక ప్రభావం చూపే పనులను మంజూరు చేయడానికి ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ.3,000.80 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఎలాంటి పనులు మంజూరు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులనే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కనిష్టంగా ఒక్కో సచివాలయ పరిధిలో రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులనే అనుమతించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో నోడల్ అధికారులుగా వ్యవహరించే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్లు పనులను గుర్తించాలని చెప్పింది. సచివాలయాల సందర్శన తప్పనిసరి ► ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ప్రతి సచివాలయాన్ని 2 రోజుల పాటు సందర్శించాలి. ఎమ్మెల్యే సందర్శన షెడ్యూల్‌ను పది రోజుల ముందుగానే నోడల్ అధికారులకు తెలియజేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు పాల్గొనాలి. ► సచివాలయ సందర్శన రెండు రోజుల్లో ఎమ్మెల్యేతో కూడిన అధికారుల బృందం అత్యధిక ప్రభావం చూపే పనులను గుర్తించాలి. ప్రజల వినతుల ఆధారంగా లేదా స్థానిక ప్రజల అవసరాల ఆధారంగా అత్యధిక ప్రభావం చూపే పనులు గుర్తించాలి. పారిశుద్ధ్యం, నిర్వహణ, మరమ్మతులు వంటి సాధారణ పనులను సంబంధిత సచివాలయాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. ఆస్తుల కల్పనకు సంబంధించి గుర్తించిన అత్యధిక ప్రభావం చూపే పనులను నోడల్ బృందం తనిఖీ చేయాలి. ► రెండో రోజు పర్యటన ముగిసేలోగా అత్యధిక ప్రభావం చూపే ఏ పనులు చేపట్టాలో ఖరారు చేయాలి. నోడల్ అధికారి మిగతా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రూ.20 లక్షల లోపు పనులను ఖరారు చేయడంతో పాటు తీర్మానం చేయాలి. నోడల్ అధికారి ఆ పనులకు ఏజెన్సీని కూడా గుర్తించి లైన్ ఎస్టిమేట్స్ కూడా పూర్తి చేయాలి. ► ఖరారు చేసిన పనుల జాబితాను గడప గడపకు మన ప్రభుత్వం పోర్టల్‌లో నోడల్ అధికారి అప్లోడ్ చేయాలి. పనులకు సంబంధించిన తీర్మానం, లైన్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌తో పాటు సమస్య ఫొటోను నిర్ణీత ఫార్మెట్లో పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. మొత్తం ఈ పనుల ప్రక్రియను, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పర్యవేక్షిస్తుంది. చేపట్టాల్సిన పనులు ఇలా.. ► తాగునీటి సరఫరా పనులు: తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్మాణాల స్థాయి పెంపు, తాగు నీటి సరఫరా పైపు లైన్లు, ట్యాంక్‌లు. ► రహదారుల పనులు: సిమెంట్ కాంక్రీట్ రహదారుల నిర్మాణం, సిమెంట్ కాంక్రీట్ రహదారుల స్థాయి పెంపు, తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల స్థాయి పెంపు. ► డ్రైన్స్: ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి డ్రైన్స్ నిర్మాణం. ► విద్యుత్: కొత్త ఎలక్ట్రికల్ లైన్, పోల్, కమ్యూనిటీకి అవసరమైన కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ► కల్వర్టులు: కల్వర్టుల నిర్మాణం, కమ్యూనిటీ కోసం డ్రైనేజీలను దాటే నిర్మాణాలు. ► ఇతర సివిల్ పనులు: కమ్యూనిటీ షెల్టర్ భవనాలు, కమ్యూనిటీ భవనాలకు ప్రహారీ గోడల నిర్మాణం, కమ్యూనిటీకి సంబంధించి వరద నివారణ, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు. 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన ఈ ఏడాది మే 11వ తేదీన ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్శనలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం వారికి అందించిన పథకాల వివరాలను వివరించడంతో పాటు ఏమైనా సమస్యలుంటే అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా ఈ నెల 18వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన పూర్తి చేశారు. ఇప్పటి వరకు అత్యధిక ప్రభావం చూపే 4,174 పనులను గుర్తించారు. మూడు కేటగిరీలుగా సమస్యల పరిష్కారం మంత్రులు, ఎమ్మెల్యేల గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా ప్రజల నుంచి వచ్చే వినతులను మూడు కేటగిరీలుగా.. పథకాలకు సంబంధించి, పథకేతరాలకు సంబంధించి, అత్యధిక ప్రభావం చూపే పనులుగా వర్గీకరించాం. వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – అజయ్ జైన్, ప్రత్యేక సీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చదవండి: సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు! -
2 లక్షల ప్రమాద బీమా: ‘ఈ–శ్రమ్’లో పేర్లు నమోదు చేసుకోండి
సాక్షి, అమరావతి: చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ, వలస కూలీలు సహా అన్ని రకాల అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈ–శ్రమ్’ ఆన్లైన్ పోర్టల్‌లో అర్హులందరి పేర్లు నమోదుకు ఈ నెల 17, 18 తేదీల్లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ– శ్రమ్ పథకంలో పేర్లు నమోదు చేసుకునే వారు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ బీమా పథకం ద్వారా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన దాదాపు 1.21 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. కాగా రాష్ట్రంలోని పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల పేర్లను ఈ – శ్రమ్ పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మిగతా అర్హులందరి పేర్లు పోర్టల్‌లో నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ సాగిలి షాన్మోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల భాగస్వామ్యం ఉపాధి హామీ పథకంలో కూలీలు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు అసంఘటిత కార్మికుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవడంలో వలంటీర్లను భాగస్వాములను చేశారు. వలంటీర్లు వారి పరిధిలో అర్హులను గుర్తించి 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. 23, 24 తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పలు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. గత రెండు నెలలుగా ప్రతి నెలా రాష్ట్రంలోని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. -
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త హెడ్ల ఏర్పాటుకు ఆదివారమూ పనిచేశారు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఆర్థిక శాఖ అధికారులు సెలవు దినమైనప్పటికీ ఆదివారం రోజు కూడా వచ్చి సచివాలయాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్‌ను రూపొందించారని, పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని చెప్పారు. ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్ ప్రకారం జీతాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్.కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. జాని పాషా వేరొక ప్రకటనలో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎంకు ఉద్యోగుల ధన్యవాదాలు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు చెప్పారు. సోమవారం గుంటూరు డొంక రోడ్డులో ఉన్న సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కిషోర్, కో ఆర్డినేటర్ తోట మహేష్ ,గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ రాథోడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ రామవరప్పాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తొలుత సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ సభ్యులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్ ఢిల్లీరావు.. సంతోష్ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు. చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్వవస్థలో వలంటీర్ల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. దిశ యాప్ గరించి.. దిశ యాప్‌ను సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్ ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. గ్రామ సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ మెహరా కోరారు. జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సునీత, డీపీవో కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
AP: లక్ష ఇళ్లలో పెద్ద పండుగ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే. 2022 పే– రివిజన్‌కే సీఎం జగన్ ఆమోదం 2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు. ఆ ప్రకారం.. గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్ షాన్మోహన్ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రొబేషన్ డిక్లేర్ చరిత్రాత్మకం రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షన్నర నూతన ఉద్యోగాలు సృష్టించి శాశ్వత ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. సీఎం ఇచ్చిన మాట మేరకు పరీక్ష పాస్ అయిన వారందరి సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ, వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. ప్రొబేషన్ డిక్లరేషన్ చరిత్రాత్మకం. లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. – ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) అనంతపురం జిల్లా గుత్తి 11వ వార్డు సచివాలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో కలసి సంతోషం పంచుకుంటున్న సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం సంతోషం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. – కాకర్ల వెంకటరామి రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. థ్యాంక్యూ సీఎం సార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలు మరవలేనిది. థ్యాంక్యూ సీఎం సార్. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. – జాని పాషా, మనోహర్, బి.శ్వేతా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్‌కు సంబంధించి జీఓ విడుదల చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం నింపినందుకు ధన్యవాదాలు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు – గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నేతలు సాయినాథ్‌రెడ్డి, అర్లయ్య, సమీర్ హుస్సేన్, సల్మాన్ బాషా, రాజశేఖర్‌బాబు కాకినాడ మూడో డివిజన్ సురేష్‌నగర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు మాలో సీఎం ధైర్యాన్ని నింపారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ఒకేసారి లక్ష మంది ప్రొబేషన్ ఖరారు చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. – అంజన్‌రెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరింత ఉత్సాహంగా పని చేస్తాం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాం. – గునిపే రాజేష్, షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 5ను జారీ చేసింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది. -
గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారమే జూన్ నెలాఖరుకల్లా అర్హులైన ‘సచివాలయ’ ఉద్యోగుల ప్రొబేషన్‌ను డిక్లేరు చేసి సీఎం జగన్మోహన్రెడ్డి తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ కొనియాడింది. ‘సచివాలయ’ ఉద్యోగ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలçహాదారు ధనుంజయరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ) -
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేశారు కూడా. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. -
సచివాలయాల్లో ఆధార్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. తొలిసారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది. అయితే, ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఐదు సచివాలయాలకు ఒకటి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు షాన్ మోహన్ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఆధార్ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైస్, వైట్ స్క్రీన్, ఫోకస్ లైట్, జీపీఎస్ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్డీఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు సరఫరా చేస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో మొత్తం 1,100 సచివాలయాలకు ఆ కిట్లను కూడా అందజేశారు. మిగిలిన చోట్లకి సరఫరా ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కిట్లు అందుకున్న సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ.. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ సేవలకు మాత్రమే పరిమితం చేయాలని, వారికి మరే ఇతర సేవలు కేటాయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఆధార్ సేవలందించే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోతే.. సమీపంలోని మరో సచివాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న సచివాలయాల వివరాలను లోకల్ టీవీ చానళ్లు ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు నిర్వహించి ఆధార్ నమోదు, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ తదితర సేవలు అందజేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. -
ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరూ మురిసిపోతున్న వేళ మహాత్మాగాంధీ ఒక మాటన్నారు. మన దేశాన్ని మనమే పాలించుకోబోతున్నాం.. మంచిదే కానీ.. మనం గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని అన్నారు. ఆయన సంకల్పానికి, ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ విధానపరమైన నిర్ణయం తీసుకొని అమల్లోకి తీసుకొచ్చారు. చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం పరిపాలన అనేది ప్రజలందరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా.. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐదు వందలదాకా సేవల్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వ సేవ కావాలంటే ఒకప్పుడు మండల జిల్లా కేంద్రాలకు పరిగెత్తే ప్రజలు ఇప్పుడు తమ ఊర్లోనే అనేక సేవల్ని పొందుతున్నారు. దాంతో ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా.. పథకం ఏదైనా సరే అర్హత వుంటే చాలు ప్రజలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తేవడంలో గ్రామ వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని 30వ డివిజన్లో సేవలందిస్తున్న వార్డు సచివాలయాన్ని మూడు సంవత్సరాల క్రితం ఉప్పుటేరు వాగు సమీపంలో నిర్మించారు. దీని పరిధిలోగల 909 కుటుంబాలవారికి అర్హత వుంటే చాలు వివిధ సంక్షేమ పథకాలను అందించడంలో ఈ సచివాలయం కీలకంగా పని చేస్తోంది. అంతే కాదు పలు రకాల సర్కార్ సేవలను అతి తక్కువ సమయంలో అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలు తమ ఇంటి వద్దకే నేరుగా వస్తున్నాయని స్థానికులు సంతోషంగా చెబుతున్నారు. ఒక పథకం అందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా రోజుల తరబడి తిరిగే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వీరు అంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా తొందరగా అయిపోవడమే కాకుండా.. లంచాలు లేకుండానే పనులు చాలా సులువుగా అవుతున్నాయని వారు చెబుతున్నారు. చదవండి: జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు కాకినాడ నగరంలో 3 లక్షలకు పైగా జనాభా వుంది. వీరికి సేవలందించేందుకు 101 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటైన 30 వ డివిజన్ వార్డు సచివాలయంలో మొత్తం 10 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో వాలంటీర్లు వుంటారు. వారు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్ళి లబ్ధిదారుల వివరాలు సేకరించి సచివాలయానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తమ పరిధిలోని ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇలా సమాజ అభివృద్ధిలో భాగమవ్వడంద్వారా వృత్తిపరమైన సంతృప్తి కలుగుతోందని ఇక్కడ సంక్షేమ విభాగ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీనివాస్ అంటున్నారు. అన్ని అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొని సచివాయాల వ్యవస్థ నానాటికీ బలోపేతమవుతోంది. స్థానిక ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ప్రజాదరణ పొందుతోంది. దాంతో ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన సచివాలయాల వ్యవస్థను అధ్యయనం చేయడమే దీనికి నిదర్శనం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మధ్యనే ఈ వ్యవస్థను ప్రశంసించారు. మహత్ముని గ్రామ స్వరాజ్య కలలను సాకారం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ వ్యవస్థ అందించే సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని స్థానిక నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వేలాది గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వంతెనలాగా మారాయి. ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా అవతరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ప్రకారం.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వందలాది ప్రభుత్వ సేవల్ని తక్కువ సమయంలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయం. ఇక్కడ ఏడుగురు సచివాలయ సిబ్బంది, 17 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎంతో హుందాగా అత్యంత సుందరంగా కార్పొరేట్ కార్యాలయంలా కనిపిస్తున్న ఈ సచివాలయంలోలోకి అడుగు పెట్టగానే ఇక్కడ ధనమ్మ అనే వృద్ధురాలు కనిపించారు. సచివాలయ సేవలను ఆమె కొనియాడారు. పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయ పరిధిలో 949 కుటుంబాలున్నాయి. వీటికి సంబంధించిన సంక్షేమ పథకాలను, స్థానికులకు అవసరమయిన పౌర సేవలను అందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, డిమాండ్లను బట్టి దాదాపు ఐదువందల రకాల సేవలు ఈ గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. ఇవి కేవలం అందడమే కాదు, నాణ్యంగా వుండాలని, అంతే కాదు సమయానికి అందడం ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు అధికార్లకు దిశానిర్దేశం చేశారు. అది కాలక్రమంలో ఫలితాలనిస్తోంది. అవినీతి, వివక్షత, రాజకీయ ప్రమేయం లేకుండా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న గ్రామవార్డు సచివాలయాలు.. ప్రజల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాయి. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వారు అందుకుంటున్న సేవల్లో గణనీయమైన తేడా కనిపిస్తోంది. పింఛను కావాలంటే గతంలోలాగా వారం పదిరోజులు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎక్కడకో వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం ఆరుగంటలు అయ్యీ కాకముందే లబ్ధిదారుల ఇంటి ముందు వాలంటీర్లు ప్రత్యక్షమవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మరెంతో దార్శనికతతో ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్లు అంటున్నారు. ఈ వ్యవస్థ కారణంగా తమకు సమాజంలో గౌరవం పెరిగిందని.. కరోనా సంక్షోభ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రజలకు మేలు చేయడం జరిగిందని.. ఇది ఎంతో గొప్ప విషయమని మరో వాలంటీరు విజయ్ కుమార్ అంటున్నారు నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ వెంకటరెడ్డి నగర్ సచివాలయంలో పదిమంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితో పాటు 19 మంది వాలంటీర్లు ఇక్కడ సేవలందిస్తున్నారు. వేయికి పైగా కుటుంబాలు ఈ సచివాలయ పరిధిలో వున్నారు. మరణ ధృవీకరణ పత్రం కోసం గతంలో కాళ్లరిగేలా తిరిగిన సుభద్రమ్మ సచివాలయాలు వచ్చిన తర్వాత పెద్దగా సమయం పట్టకుండానే ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండానే చాలా వేగంగా తమకు కావాల్సిన పత్రాలు వస్తున్నాయని అంటున్నారు. వైఎస్ జగన్ పాలన మొదలై మూడు సంవత్సరాలవుతోంది. ముప్పయికిపైగా పథకాలు ప్రజాదరణ పొందాయి. ప్రతి పథకానికి ఒక విశిష్టత వుంది. కేజీ నుంచి పీజీదాకా విద్యార్థులకు పథకాలున్నాయి. విద్య వైద్య వ్యవసాయ రంగాలకు చెందినవారితో పాటు బీసీ ఎఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఆర్థిక కష్టాలనుంచి బైటపడేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క పథకం కూడా దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే చేరాలనే తపనతో గ్రామవార్డు సచివాలయాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఈ మహాయజ్ఞంలో భాగం కావడం సంతోషంగా వుందని వాలంటీర్లు చెబుతున్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలను తమ కుటుంబాలుగా భావిస్తున్నారు. అంతే కాదు ఆయా కుటుంబాలు కూడా తమకు సంబంధించిన వాలంటీర్లను తమ కుటుంబ సభ్యులుగా బావించి ఆదరిస్తున్నాయి. ఇది ఈ మూడేళ్లలో సమాజంలో కనిపిస్తున్న మానవీయ బంధమని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్ నిమ్మల అరుణ అంటున్నారు. సచివాలయంలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా పని చేసే సతీష్ గతంలో ఒక సాప్ట్వేర్ కంపెనీలో పని చేశారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెక్రటరీగా ఉద్యోగం సాధించాడు. ఉపాధ్యాయురాలిగా పని చేయాలని భావించిన ప్రియాంక మనసు మార్చుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం సాధించారు ప్రభుత్వ సంకల్పం ప్రకారం పని చేస్తున్నామని సంతోషంగా వుందని ఈమె అంటున్నారు. గ్రామవార్డు సచివాలయాల కారణంగా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించడం ఒక మార్పు.. అంతే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా వున్న వేలాది సచివాలయాలద్వారా ప్రజల ముంగిటకే పాలన వెళ్లిపోతోంది. గతంలో పలు సేవలకోసం సమయం, డబ్బు వృధా చేసుకున్నవారికి ఇప్పుడా సమస్యలు లేవు. పనులు తొందరగా, సులువుగా, కళ్ల ముందే అయిపోతున్నాయి. ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంది. -
జూన్ చివరికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్.షాన్మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీపాషా సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు) -
సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన పలు విషయాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘‘ఈనెల 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరగనుంది. ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం. డీఎంకే అధికారంలోకి వచ్చినపుడల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాదికి ఒకరోజు స్థానిక సంస్థల దినంగా జరుపుకోవాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూచించాను. ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. గ్రామీణుల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా ఇకపై ఏటా నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తాం. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేలా గ్రామ సచివాలయాలకు ఇప్పటికే అనేక అధికారాలు, బాధ్యతలు ఇచ్చాం. 1998లో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టం తీసుకొచ్చాం. ఇక ఈ ఏడాది నుంచి ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు ‘‘ ఉత్తమర్ గాంధీ అవార్డు’’ను ప్రదానం చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తామ’’ని వివరించారు. చదవండి👉🏾 సోనియా చేతికి నివేదిక అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రోజుకు 17,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 13,100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేనందున సరఫరాలో అంతరాయం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ విమర్శలకు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బదులిస్తూ, రాష్ట్రపరిధిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ గ్రిడ్ నుంచి రావాల్సిన 796 మెగావాట్లు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తక్కువ ధరతో 3వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ఎడపాడి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. అసెంబ్లీలో అవీ ఇవీ.. ►పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరూ చేరడం లేదని.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకే నాన్ ముదల్వన్ పథకాన్ని తీసుకొచ్చామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చెప్పారు. ►సీఎం స్టాలిన్‌ను మరో కామరాజర్గా భావిస్తున్నానని ప్రతిపక్ష పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కీర్తించడం విశేషం. -
‘సచివాలయ’ సిబ్బందికి శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ధారించుకున్న అంశాలలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై బుధవారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే దాదాపు 15 వేల మంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి 11.45 గంటల మధ్య ఆన్లైన్ విధానంలో శిక్షణ అందజేయనున్నారు. 45 నిమిషాల వీడియోను మంగళవారం సాయంత్రం నుంచే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. వీలున్న వారు ముందుగానే దానిని వీక్షించి, ఆన్లైన్ శిక్షణలోనూ పాల్గొనవచ్చు. శిక్షణ అనంతరం 12.10 గంటల నుంచి 12.25 మధ్య పది ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కనీస మార్కులు తెచ్చుకోవాలి. కనీస మార్కులు సాధించని వారికి దఫాల వారీగా శిక్షణ కొనసాగుతుందే తప్ప.. వేరే ఎలాంటి చర్యలు ఉండవు. కాగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు దాదాపు ఏడాది మొత్తం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని జె.మురళీ ఆ ప్రకటనలో వివరించారు. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తాము సమర్థిస్తున్నామని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. అయితే అవి పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు వంటి ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థికభారం మోపుతోందని విమర్శించారు. ప్రజలపై పడే భారం గురించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా సమర్థించేరీతిలో వ్యవహరిస్తోందని చెప్పారు. సంఘ్ పరివార్ శక్తులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నించటంలేదని, మౌనంగా ఉంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని, విద్యుత్తు ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని చెప్పారు. నరేంద్రమోదీ పాలనతో బీజేపీ ప్రజల నుంచి వేరుపడిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. -
టీడీపీ ఆరోపణలు పచ్చ కామెర్ల సామెతను గుర్తు చేస్తున్నాయి:మంత్రి అనిల్
-
నెల రోజుల్లో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం 54వ డివిజన్లో సచివాలయాన్ని మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నెల రోజుల్లో నెల్లూరు సిటీలో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేస్తున్నాము. టీడీపీ ఆరోపణలు పచ్చ కామెర్ల సామెతను గుర్తు చేస్తున్నాయి. నోరుంది కదా అని ఇంగిత జ్ఞానం లేకుండా మట్లాడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో కమీషన్లకు కక్కుర్తిపడ్డ టీడీపీ నేతలకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. సినిమా రిలీజ్‌కి కటౌట్ కట్టాలని చిల్లర దండుకునే బ్యాచ్ టీడీపీది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదు' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
కొత్త పే స్కేలు.. ఉద్యోగ భద్రత
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న లక్ష మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మరో కల కూడా నెరవేరబోతుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ ఏడాది జూన్ 30లోగా ప్రొబేషనరీ ప్రకటించి పే స్కేల్ వర్తింపజేస్తామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన తర్వాత ప్రస్తుతం రూ.15 వేల చొప్పున నెల వారీ జీతం అందుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత పే స్కేలు పరిధిలోకి వస్తారు. దీనికి తోడు వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను పొందడంతో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు వివరించాయి. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో 1.34 లక్షల ఉద్యోగాలు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలపై ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన విధంగా అప్పటికప్పుడు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను స్పష్టించారు. జూలైలో నోటిఫికేషన్.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాత పరీక్షలు... 20 రోజుల్లో ఫలితాల ప్రకటన.. ఆ తరువాత మరో వారం రోజుల్లో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా పూర్తయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. మొదటి విడతలో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి 2020 ఆరంభంలో తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఏడాది చివరి కల్లా రెండో దశ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన మేరకు జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. -
డిసెంబర్ 21న ‘సచివాలయ’ దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు) సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. (చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు) గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు. చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్ -
AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలకు వారి చెంతనే అన్ని రకాల సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యంత్రాంగం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎన్ని ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యను గడువులోగా పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు.. ఎవరి వద్ద పెండింగ్ ఉంది.. పెండింగ్‌లో ఉండడానికి కారణం.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టారు. వార్డు/గ్రామ సచివాలయాలు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ అంశాలపై రోజూ బులెటిన్ జారీ చేస్తారు. ఇందులో పేర్కొన్న సమస్య ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో గుర్తించి.. సంబంధిత అధికారికి పరిష్కారం కోసం పంపుతారు. గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పెండింగ్ సమస్యలకు సంబంధించిన బులెటిన్‌ను అధికారులకు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించకపోతే చర్యలు నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించనివారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బులెటిన్‌లో తహసీల్దార్‌కు వచ్చిన మొత్తం అర్జీల సంఖ్య, పరిష్కరించిన అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువులోపు ఉన్న అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువు దాటిన అర్జీల సంఖ్య, 24 గంటలు, 48 గంటలలోపు పరిష్కరించాల్సినవి ఉంటాయి. బులెటిన్‌ను ఆరు కేటగిరీలుగా విభజించారు. మండల రెవెన్యూ అధికారి (రెవెన్యూ), అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్), మండల రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు) సబ్ రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు), అసిస్టెంట్ ఇంజనీర్ (రవాణా, రోడ్లు, భవనాలు) కేటగిరీలుగా విభజించి.. ఎందులో ఎన్ని అర్జీలు వచ్చింది పొందుపరుస్తారు. జవాబుదారీతనం కోసమే.. గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట గడువులోగా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. – వివేక్‌యాదవ్, కలెక్టర్, గుంటూరు జిల్లా -
వార్డు సచివాలయానికి మారు వేషంలో డిప్యూటీ కలెక్టర్
చిత్తూరు అర్బన్(చిత్తూరు జిల్లా): ఓ మహిళ శనివారం ఉదయం చిత్తూరులోని 36వ వార్డు సచివాలయంలో అడుగుపెట్టింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వద్దకు వెళ్లి తనకు సొంతిల్లు లేదని వాపోయింది. ఏడాది కిందట తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చానని తెలిపింది. దరఖాస్తు చేసి.. ఇల్లు మంజూరు చేయించాలని కోరింది. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయానికి రావడంతో విషయం బయటపడింది. తమ ముందు నిల్చొని ఉన్నది డిప్యూటీ కలెక్టర్, గృహ నిర్మాణ ప్రత్యేకాధికారి పల్లవి అని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. చిత్తూరు డివిజన్ గృహ నిర్మాణ ప్రత్యేకాధికారిగా ఉన్న పల్లవి.. లక్ష్యం మేరకు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని ఇటీవల ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు సామాన్యురాలిగా శనివారం ఆమె రంగంలోకి దిగారు. 36వ వార్డు సచివాలయానికి వెళ్లి.. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ అనే విషయం బయటపడిన తర్వాత.. సచివాలయంలోని రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రజలకు సొంతిళ్లు నిర్మించడమే లక్ష్యంగా పని చేయాలని వారిని ఆదేశించారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి: డీజీపీ ఆదేశాల మేరకు డీఐజీలు, ఎస్పీలు ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుంచి స్వయంగా వివరాలను తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను పరిశీలిస్తున్నారు. సచివాలయాల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబర్ నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు, కార్యాచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు. -
గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న ఊరు దాటకుండానే ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందించి రికార్డు సృష్టించారు. రెండేళ్లు దాటక ముందే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 2.22 కోట్ల సేవలను ప్రజలకు అందించారు. ఇది దేశంలోనే రికార్డు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇలా గ్రామ, వార్డు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందిస్తున్న దాఖలాలు లేవు. 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేశారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవస్థ ద్వారా ఉన్న ఊరు, వార్డు దాట కుండా అక్కడి ప్రజలకు 544 ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమానికి గత ఏడాది జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పథకాలు, సేవల కోసం 2.27 కోట్ల దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటి వరకు 2.22 కోట్ల దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని నిరూపించారు. అర్హతే ప్రామాణికంగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉన్న ఊరు, వార్డుల్లోనే ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువీకరణపత్రం నుంచి బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు, ఇంటి స్థలం పట్టా, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రైతులకు అవసరమైన భూ రికార్డులు, విద్యుత్, మంచినీటి కనెక్షన్ వంటి మొత్తం 544 సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1.29 కోట్ల వినతులను గ్రామ, వార్డు సచివాలయాలు తీర్చాయి. పౌర సరఫరాల శాఖకు చెందిన 37.02 లక్షల వినతులను, ఇంధన శాఖకు చెందిన 15.62 లక్షల వినతులను, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన 7.61 లక్షల వినతులను, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన 7.48 లక్షల వినతులను ఈ వ్యవస్థ తీర్చింది. గతంలో ప్రభుత్వ సేవలతో పాటు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీలతో పాటు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసినా మంజూరు అయ్యేవి కావు. పైగా లంచాలు ఇచ్చిన వారికి, పార్టీకి చెందిన వారికే అరకొర మంజూరు అయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా సేవలు అందుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్ గడువులోగా వచ్చింది ఇదివరకు ఉద్యోగ విషయమై బర్త్ సర్టిఫికెట్ కోసం కళ్యాణదుర్గంలోని తహసీల్దార్ కార్యాయానికి వెళ్లాను. పట్టణ వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్ నివేదికలు ఇచ్చాకే సర్టిఫికెట్ వస్తుందని, ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నారు. నాకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం సర్టిఫికెట్ వెంటనే అవసరం అయ్యింది. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. నానా తిప్పలు పడినా సర్టిఫికెట్ రాలేదు. చివరికి వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇటీవల పాస్‌పోర్ట్ కోసం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. 9వ వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశాను. 15 రోజుల్లోనే సర్టిఫికెట్ వచ్చింది. – అరుణ్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా సచివాలయ వ్యవస్థతో ఆధారం నేను 20 సంవత్సరాల క్రితం ఆర్డీసీ డిపోలో శ్రామిక్ (కూలీ)గా పని చేసి, రిటైరయ్యాను. ప్రస్తుతం రూ.1,100 మాత్రమే పింఛన్ వస్తోంది. వృద్ధాప్యంలో నేను, నాభార్య జీవనోపాధి లేక ఇబ్బందులు పడేవాళ్లం. ఆధార్ కార్డు నమోదు చేసిన కొత్తలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేశారు. దీంతో నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా రాని పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల పుణ్యమా అని ప్రస్తుతం నా భార్య నాగమణికి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ మంజూరు అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. – విల్లా కృష్ణ, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా ఆరేళ్ల ఎదురు చూపు.. సచివాలయంతో నెరవేరింది నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాం. ఊరూరా గాజులు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాను. నాకు పెళ్ళై ఆరేళ్లు అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటే నా భార్య పేరు లేకుండా నా ఒక్కడికే వచ్చింది. పేరు చేర్చాలని ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఐదు కిలోల బియ్యంతోనే సరిపెట్టుకున్నాం. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్ కార్డులో నా భార్య, ఇద్దరు పిల్లల్ని చేర్చాలని రమణయ్యపేట గ్రామ సచివాలయం–1లో దరఖాస్తు చేశాను. రెండు రోజుల్లోనే కార్డు మంజూరు అయ్యిందని వీఆర్వో సత్యనారాయణ ఫోన్ చేశారు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించాం. సచివాలయం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. – బత్తుల శ్రీనివాస్, రమణయ్యపేట, తూర్పుగోదావరి జిల్లా ఉన్న ఊరిలోనే సేవలకు సచివాలయ వ్యవస్థ కేంద్ర బిందువు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందుతున్నాయి. ప్రతి సేవకు ముఖ్యమంత్రి నిర్ధిష్ట గడువు విధించారు. ఆ గడువులో 85.36 శాతం ప్రజల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. సచివాలయాల వ్యవస్థతో గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలు, సేవలు అందుతున్నాయి. గతంలో రేషన్ కార్డు పొందడానికే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా నిర్ణీత గడువులోనే గ్రామ సచివాయాల్లో కార్డు మంజూరు చేస్తున్నారు. ఉన్న కార్డుల్లో సభ్యుల సంఖ్య పెంచడం గతంలో జరిగేది కాదు. ఇప్పుడు అలాంటి 21.70 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ తిప్పలు తప్పాయి గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల ప్రతి చిన్న పనికి మండల కేంద్రాలకు వెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. నాకు 70 ఏళ్ల వయసు ఉండటంతో పింఛన్ కోసం గతంలో అనేక సార్లు మా గ్రామానికి 13 కిలో మీటర్ల దూరంలోని పుట్లూరుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఇప్పుడు మా గ్రామానికి ఆనుకొని ఉన్న తక్కళ్లపల్లిలో ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అక్క డికి వెళ్తే రేషన్‌కార్డుతోపాటు పింఛన్ అందే లా వలంటీర్లు, సచివాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. – ఎస్. రామాంజులు, తిమ్మాపురం, అనంతపురం జిల్లా -
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్
ప్రతి నెలా ఒకటో తేదీ పొద్దున్నే.. సూర్యోదయం కాకముందే అవ్వాతాతల దగ్గరకు వెళ్లాలి.. వారి చేతిలో పెన్షన్ పెట్టాలి. ఈ పెన్షన్ డబ్బులు వాళ్లకు చేరకపోతే ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడతారని తెలిసిన నిస్వార్థ సేవా సైనికులు వలంటీర్లు. రూపాయి లంచం లేకుండా.. వారి నుంచి ఒక చిరునవ్వు, దీవెన పొందుతూ పని చేస్తున్న మనసున్న గొప్ప సైనికులు నా వలంటీర్లు.. మన వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నా. ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఆల్ ద బెస్ట్. వలంటీర్ల సత్కారం కోసం ప్రభుత్వం దాదాపు రూ.241 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ సత్కారాలు ఈ ఒక్క ఏడాదితోనే ఆగిపోవు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది ‘సేవామిత్ర’ అవార్డు పొందిన వారు వచ్చే ఏడాది ‘సేవారత్న’ కోసం.. ‘సేవారత్న’ పొందిన వారు ‘సేవావజ్ర’ కోసం ప్రయత్నించాలి. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: సంక్షేమ ఫలాలను అర్హులందరికీ ఇంటి గడప వద్దే చేరవేస్తూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పరిపాలన అంటే ఇలా ఉండాలనే విధంగా దేశమంతా మనవైపు చూసేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. ఉగాది పండుగ సందర్భంగా వలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ప్రారంభించారు. ఆదివారమైనా.. సెలవు రోజైనా.. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా వలంటీర్లు సేవా దృక్పథంతో విధి నిర్వహణలో పాల్గొంటున్నారని ప్రశంసించారు. సూర్యోదయానికి ముందూ సూర్యాస్తమయం తర్వాత కూడా విధి నిర్వహణలో నిమగ్నమవుతున్న వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోందని తెలియచేసేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. లంచాలు అన్నదే లేకుండా, కులం, మతం, వర్గం, రాజకీయాలని ఎక్కడా వివక్ష చూపకుండా, ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా, మంచి ఆగకూడదనే తపనతో సేవలందిస్తున్న ప్రతి వలంటీర్‌ను సత్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. మనసున్న మనుషులు.. నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఆగస్టు, సెప్టెంబరు నాటికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబరు నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 20 నెలల కాలంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా చేయవచ్చు అనే విధంగా దేశమంతా మనవైపు చూసేలా వలంటీర్లుగా విధుల్లో ఉన్న నా చెల్లెమ్మలు, నా సోదరులు పని చేస్తున్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సహాయపడే మంచి మనుషులు, మనసున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు నిండు మనసుతో అభినందనలు తెలియజేస్తున్నా. మానవత్వాన్నే మంచితనంగా, మంచితనాన్నే కులంగా మార్చుకుని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలకు గ్రామగ్రామానా వాడవాడలా సంధానకర్తలా ఒకవైపు సచివాలయాలు మరోవైపు వలంటీర్లు ఉన్నారు. ఎక్కడా వివక్ష,, లంచానికి తావులేకుండా కులం, మతం, పార్టీ, రాజకీయం చూడకుండా చివరికి అధికార పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ మనసారా సెల్యూట్ చేస్తున్నాం. మీ అందరికీ పేదల బాధలు తెలుసు కాబట్టే.. రాష్ట్రంలో దాదాపు 2.60 లక్షల మంది పైచిలుకు వలంటీర్లు ప్రతి చోటా పనిచేస్తున్నారు. వీరిలో 97 శాతం మంది 35 ఏళ్ల లోపు యువకులు, సేవాభావం ఉన్నవారే. ఇందులో 53 శాతం చెల్లెమ్మలే ఉన్నారు. మొత్తం వలంటీర్లలో దాదాపు 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన వారున్నారు. పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్ధం చేసుకున్న వారు. ఆ బాధలు పేదలకు రాకూడదని తాపత్రయపడే సైనికులు. మరో 1.40 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో, గ్రామానికి పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో కూడా దాదాపు 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందినవారే ఉన్నారు. కోవిడ్ కట్టడిలో కీలక పాత్ర దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా, మరి కొన్నింటిలో అవసరం మేరకు పని చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వలంటీర్ల పాత్ర అంతా ఇంతా కాదు. మరో రెండు చోట్ల కూడా పాల్గొంటా.. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపట్నుంచి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు చొప్పున వలంటీర్లందరికీ అవార్డుల ప్రదానం, సత్కారాల కార్యక్రమం కొనసాగుతుంది. మంగళవారం ఉగాది పండగ కాబట్టి అధికారులు ఒక్కరోజు సెలవు తీసుకోవచ్చు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సత్కార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ భాగస్వాములవుతారు. నేను కూడా మూడు ప్రాంతాలలో పాల్గొంటా. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో నిర్వహించే సత్కార కార్యక్రమాలకు కూడా హాజరవుతా. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వలంటీర్లు వారి ఖర్మకు వదిలేయండి.. సేవాభావంతో పని చేస్తున్న వలంటీర్ల మీద, ఈ వ్యవస్థ మీద ఎల్లో మీడియా, కొందరు విపక్ష నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం చూస్తున్నాం. మీకు ఒకటే చెబుతున్నా. మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు వెరవద్దు. పండ్లు కాసే చెట్టు మీదే రాళ్లు పడతాయని గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వారేదో అంటున్నారని చెప్పి ఎవరూ వెరవద్దు. వారి పాపానికి, వారి ఖర్మకు వారిని వదిలేయండి. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని గట్టిగా చెబుతున్నా. ఉద్యోగం కాదు.. మీరు చేసేది సేవ మానవ సేవే మాధవసేవ అని గుర్తు పెట్టుకోండి. మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు సేవ అన్నది కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవాళ మీరు ఇంత నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారనే ఆ 50 కుటుంబాల వారు మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు. ఇంతగా మీపై ఆప్యాయత చూపిస్తున్నారని మరిచిపోవద్దు. ఈ పని ద్వారా మీరు సాధించేది, మీకు జరిగే మంచి ఏమిటంటే.. ఆ 50 ఇళ్లలో అవ్వాతాతల దీవెనలు మన ఆస్తి అని మర్చిపోవద్దు. దేవుడి దయ మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి అందేలా, మీ అందరి పనితీరు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. మీ సేవలకు ఇవిగో ఉదాహరణలు.. కొందరు వలంటీర్లు చేసిన పనులను చాలామంది చూసే ఉంటారు. పేపర్లలో కూడా చదివి ఉంటారు. వారు ఎంత నిస్వార్థంగా, సేవా దృక్పథంలో పని చేశారో తెలియచేసేందుకు నేను కొన్ని ఉదాహరణలు చెబుతున్నా.. ► శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురానికి చెందిన ఓ అవ్వ రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంటే మన వలంటీర్ రమణ ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ డబ్బులు అందచేశాడు. ► ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడుకు చెందిన బి.వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రిలో ఉంటే మన వలంటీర్ సిద్ధారావు అక్కడకు వెళ్లి మరీ పెన్షన్ ఇచ్చి వచ్చాడు. ► చిత్తూరు జిల్లా కంబంవారిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి పక్షవాతంతో బెంగళూరులో చికిత్స పొందుతుంటే మన వలంటీర్ భానుప్రకాష్ అక్కడికి వెళ్లి పెన్షన్ ఇచ్చాడు. ► విజయనగరం జిల్లా గజపతినగరంలో గ్యాస్ స్టవ్ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక గాయపడితే వలంటీర్లు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడమే కాకుండా తమ జేబు నుంచి రూ.2 వేలు కూడా ఆర్థిక సాయం చేశారు. ► గుంటూరు జిల్లా రొంపిచర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మన వలంటీర్ శివకృష్ణ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పిల్లలు, వృద్ధులను కాపాడాడు. ► ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత తపనపడతారు? ఇంత సహాయ పడతారు అంటే కారణం.. వలంటీర్లు తమ పరిధిలోని ఆ 50 ఇళ్లను ఒక కుటుంబంగా భావించారు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. 2.22 లక్షల మంది వలంటీర్లకు సత్కారం.. మూడు కేటగిరీలలో మొత్తం 2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తోంది. మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు అవార్డులు అందచేస్తోంది. లెవల్–1.. ‘సేవామిత్ర’ ఈ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 2,18,115 మంది వలంటీర్లను సత్కరిస్తున్నాం. రూ.10 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి ప్రదానం చేసి మీరు చేసిన మంచి పనిని ప్రభుత్వం గుర్తిస్తోంది అని చెబుతూ ప్రతి వలంటీర్‌ను ప్రోత్సహించేందుకు చేస్తున్న మంచి కార్యక్రమం ఇది. లెవెల్ –2.. ‘సేవారత్న’ మాములుగా కంటే కాస్త ఎక్కువగా, స్ఫూర్తిదాయకంగా పనిచేసిన వారిని ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 10 మంది చొప్పున మొత్తం 4 వేల మందిని ‘సేవా రత్న’ అవార్డుతో సత్కరిస్తున్నాం. ‘సేవారత్న’ అవార్డు గ్రహీతలు రూ.20 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి అందుకుంటారు. లెవెల్ –3.. ‘సేవావజ్ర’ ఇంకా ఎక్కువ కష్టపడిన వారికి మూడో కేటగిరీలో సత్కారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేసి మొత్తం 875 మంది వలంటీర్లకు సేవా వజ్ర అవార్డు ప్రదానం చేస్తున్నాం. ఈ అవార్డు గ్రహీతలకు రూ.30 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ప్రదానం చేస్తారు. వలంటీర్ల విజయాలతో బుక్లెట్ ఆవిష్కరణ.. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ తొలిరోజు 18,576 మంది వలంటీర్ల ఖాతాల్లోకి రూ.18,93,36,000 నగదు ప్రోత్సాహకాన్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలో 9 మంది వలంటీర్లకు సీఎం జగన్ స్వయంగా శాలువా, పతకం, బ్యాడ్జి అందజేసి సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వలంటీర్ల విజయాలను తెలియచేస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, సింహాద్రి రమేష్, మేకా ప్రతాప అప్పారావు, డి.నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మల్లాది విష్ణు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘ఒక వ్యవస్థలో అవినీతి, వివక్షకు తావులేకుండా ఓ కార్యక్రమం చేయగలమా?.. ఇది సాధ్యమేనా? అని గతంలో అందరికీ సందేహాలుండేవి. వాటిని తొలగిస్తూ కేవలం అర్హత ఉంటే చాలు కచ్చితంగా ప్రభుత్వ పథకం డోర్ దగ్గరకే వచ్చి చేరుతుందని చేసి చూపించిన వ్యక్తులు వలంటీర్లు’’ -
సచివాలయాల్లో రోజూ ‘స్పందన’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పని దినాల్లో గ్రామ, వార్డు సచివాలయాలన్నింటిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బంది అంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లే ముందు తప్పనిసరిగా బయోమెట్రిక్ పంచ్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని, ఈ హాజరు ఆధారంగానే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. 2.6 లక్షల మంది వలంటీర్లకు గుర్తింపు కార్డులు ► గ్రామ, వార్డు వలంటీర్లందరికీ గుర్తింపు కార్డులతో పాటు నవరత్నాల లోగోతో కూడిన బ్యాడ్జిలను వీలైనంత త్వరగా ఇవ్వాలి. సంబంధిత శాఖ వలంటీర్ల బ్యాడ్జ్‌ను రూపొందించి సీఎం కార్యాలయం ఆమోదం పొందిన వెంటనే 2.6 లక్షల మంది వలంటీర్లకు వాటిని అందజేయాలి. ► గ్రామ, వార్డు వలంటీర్ల క్లస్టర్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల ఆయా వలంటీర్ల పరిధిలో లబ్ధిదారులు తమకు ఏయే పథకాలు అందింది.. లేనిది తెలుసుకోగలుగుతారు. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిర్ణీత కాల వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలనేది తప్పనిసరిగా నూటికి నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్ణీత సమయంలో పథకాలందాలి ► అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయాలి. దరఖాస్తు చేసుకున్న అర్హులకు పది రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేయాలి. అర్హులైన వారికి 21 రోజుల్లోనే (గతంలో పది రోజులు) పెన్షన్ కార్డులను మంజూరు చేయాలి. 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను మంజూరు చేయాలి. ► ఈ నాలుగు.. నిర్ణీత కాల వ్యవధిలోగా అర్హులైన వారికి మంజూరయ్యేలా చూసేందుకు సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తరుచూ సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త మంజూరులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా అర్హులైన వారికి నిర్ణీత కాల వ్యవధిలో ఆయా పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. తమ పరిధిలోని ప్రజల సమస్యలు, అవసరాల పట్ల సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వలంటీర్లను తొలగించాలి. -
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై కసరత్తు
సాక్షి, అమరావతి: గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సీసీఎల్ఏ, మహిళా శిశు సంక్షేమ, సర్వే అండ్ ల్యాండ్ రికారŠుడ్స, సాంఘిక సంక్షేమ శాఖల కమిషనర్లు, డైరెక్టర్లు సమావేశంలో పాల్గొంటారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరగని రీతిలో కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలో కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి అప్పటికప్పుడే వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. కాగా, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య పేర్కొంది. -
పుట్టిన రోజు వేడుకలు.. రెవెన్యూ సెక్రటరీ సరెండర్
సాక్షి, తెనాలి అర్బన్: వార్డు సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ విధులు పక్కన పెట్టి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. జేసీ స్పందించి విచారణకు ఆదేశించారు. నిజమేనని తేలడంతో ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు రెవెన్యూ సెక్రటరీని కలెక్టర్‌కు సరెండర్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. స్థానిక ఐదో వార్డు సచివాలంలో పి.స్రవంతి రెవెన్యూ సెక్రటరీగా పని చేస్తున్నారు. గత నెల 19న ఆమె పుట్టిన రోజు వేడుకల్ని వార్డు వలంటీర్లు నిర్వహించారు. దాన్ని ఓ వలంటీర్ సెల్లో రికార్డు చేసి రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. చదవండి: (ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం) ఇది వైరల్ కావడంతో జేసీ వెంటనే స్పందించి విచారణ జరపాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావును ఆదేశించారు. ఆయన శనివారం సంబంధిత వార్డు రెవెన్యూ సెక్రటరీ స్రవంతి, వలంటీర్లు తాడిబోయిన రత్నకుమారి, సోముపల్లి అలేఖ్య, ఎం.ప్రభుకుమార్, షేక్ రేహమున్నీసా, ఎం.లావణ్య, టి.లీలా హరీష్‌ను పిలిపించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి లిఖితపూర్వంగా వివరణ తీసుకున్నారు. విధులకు అటంకం కలిగిస్తూ వేడుకలు జరుపుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల్ని నుంచి ఆదివారం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డు రెవెన్యూ సెక్రటరీని జిల్లా కలెక్టర్‌కు సరెండర్ చేశారు. చదవండి: (42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు) -
ప్రతి నెలా వలంటీర్ పోస్టుల భర్తీ..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 5,154 గ్రామ వలంటీర్ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. (చదవండి: సచివాలయ వ్యవస్థ సూపర్) తప్పుడు ప్రచారం.. నమ్మవద్దు 35 ఏళ్లు నిండిన వలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని కమిషనర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించడానికి చేపట్టిన చర్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మిగిలిన వారెవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు. -
‘సచివాలయ’ నియామకాలు: కంట్రోల్ రూం నెంబర్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ నియామకాలకు సంబంధించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు కమాండ్ కంట్రోల్ రూం నంబర్లు 9121296051/52/53కు ఫోన్ చేయవచ్చు. ఇక గ్రామ సచివాలయం వెబ్సైట్లో ఇచ్చిన ఇ-మెయిల్ ద్వారా అభ్యర్దులు తమ ఫిర్యాదులను లిఖిత పూర్వక౦గా పంపాల్సి ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖ మెయిల్‌కు మాత్రమే పంపించాలి. మెయిల్ ఐడీ వివరాల కోసం.. http://gramasachivalayam.ap.gov.in/లేదా http://vsws.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/సైట్లను సందర్శించవచ్చు. కాగా కరోనా కష్టకాలంలోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నెల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా.. జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులనూ భర్తీ చేయనున్నారు. (చదవండి: ‘సచివాలయ’ పరీక్షల ఫలితాల వెల్లడి) -
‘సచివాలయ’ పరీక్షల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నెల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా.. జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులనూ భర్తీ చేయనున్నారు. ఫలితాలను www. sakshieducation.comలో చూడవచ్చు. ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ వారంలో భర్తీ ప్రక్రియ షురూ – ర్యాంకుల ఆధారంగా జిల్లాల్లో మరో వారం రోజుల్లో కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. – జిల్లాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్స్ పంపుతారు. – ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు వారి సర్వీస్‌ను బట్టి గరిష్టంగా 15 మార్కులు కలిపి జాబితాలను రూపొందిస్తారు. – అనంతరం ప్రతి పోస్టుకూ క్వాలిఫైయింగ్ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్ణయిస్తాయి. – ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రతులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. – తరువాత కలెక్టర్లు ప్రకటించే తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. మహిళలే ఎక్కువ – గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న పంచాయతీరాజ్, పురపాలక శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. – రాత పరీక్షలకు ·7,68,965 మంది హాజరయ్యారు. వీరిలో 3,84,229 మంది పురుషులు కాగా, 3,84,736 మంది మహిళలు ఉన్నారు. – పరీక్షలు రాసిన వారిలో ఓసీలు 1,00,854 మంది, బీసీలు 3,88,043 మంది, ఎస్సీ కేటగిరీలో 2,24,876 మంది, ఎస్టీ కేటగిరీలో 55,192 మంది ఉన్నారు. వెబ్సైట్లో ఫలితాల వివరాలు పరీక్షలకు హాజరైన 7,68,965 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాలు గ్రామ సచివాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాన్ని ఈ దిగువ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. http:// gramasachivalayam.ap.gov.in/ http:// vsws.ap.gov.in/ http:// wardsachivalayam.ap.gov.in/ రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటే నిరుద్యోగ యువతలో ఆశలు నింపుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 1.26 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్మెంట్ ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంత పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. -
సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. (చదవండి: ఐరాస దృష్టికి సచివాలయ సేవలు) టాపర్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: అర్హులందరికీ తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందలేదని ఎవరైనా దరఖాస్తు చేస్తే.. దానిని ఆరు పాయింట్ల ఆధారంగా ధ్రువీకరణ చేయాలి. భూ రికార్డులు, విద్యుత్ బిల్లు, 4 చక్రాల వాహనం, ఆదాయ పన్ను, ప్రభుత్వ ఉద్యోగి, పట్టణాల్లో ఆస్తి డేటాను పరిశీలించి అర్హులా లేదా అనర్హులా అనేది తేల్చాలి. ఒకవేళ అనర్హులని తేలినా కూడా.. వారు మళ్లీ తమకు 4 చక్రాల వాహనం లేదని గానీ లేదా భూమి లేదని గానీ దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించాలి. దరఖాస్తుదారుడు చెప్పింది నిజమేనని తేలితే.. అతన్ని అర్హుడిగా ప్రకటించి 17 రోజుల వ్యవధిలో సంక్షేమ ఫలాలను మంజూరు చేయాలి. అలాగే డేటాలో కూడా రికార్డులను సవరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు.. ► గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు స్పందన లేదంటే 1902కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే దాన్ని నమోదు చేయాలి. ► సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ఆ ఫిర్యాదును ఒక్క రోజులోనే.. సచివాలయంలోని సంబంధిత సంక్షేమ సహాయకుడికి పంపాలి. ► ఆ సహాయకుడు 3 పనిదినాల్లో క్షేత్రస్థాయి తనిఖీ చేసి.. నివేదికను గ్రామ, వార్డు కార్యదర్శికి అందజేయాలి. ► దానిని గ్రామ, వార్డు కార్యదర్శి మరోసారి పరిశీలించి నివేదికను మరో 3 పనిదినాల్లో ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు పంపాలి. ► వాటిని ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరీశీలించి.. 3 పనిదినాల్లో నివేదికను జిల్లా జేసీ(అభివృద్ధి విభాగం)కి అందజేయాలి. ► జాయింట్ కలెక్టర్ వాటిని పరిశీలించి.. 4 పనిదినాల్లో ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఆదేశాలివ్వాలి. ► ఆ ఆదేశాలు అందిన తర్వాత.. ఆ ఫిర్యాదుదారుడు అర్హుడని తేలితే 3 పనిదినాల్లో సంబంధిత శాఖ డేటాను సవరించి, అర్హుల జాబితాలో చేర్చాలి. ఈ ప్రక్రియ అంతా 17 రోజుల్లో పూర్తి చేయాలి. ► ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను, జేసీలు కనీసం ఒక శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే.. డేటాలో తప్పులుంటే.. ఆ తప్పులను సరి చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అర్హులెవ్వరూ సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ఆరు పాయింట్స్ ధ్రువీకరణను తీసుకువచ్చాం. క్షేత్రస్థాయి పరీశీలన చేసి.. అర్హులకు 17 రోజుల్లో సంక్షేమ పథకాలను మంజూరు చేస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి -
15లోగా 'సచివాలయ' ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీ కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని తెలిపాయి. ఆ తర్వాత మరో వారం రోజుల వ్యవధిలోనే జిల్లా సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు. ► రాతపరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీని ఏపీపీఎస్సీ అధికారులు గురువారం ప్రకటిస్తారు. కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ► జవాబుల ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థుల జవాబుల వివరాలతో పైనల్ కీ అనుసంధానం చేసి మార్కుల జాబితాలను తయారు చేయనున్నారు. ► ఈ ప్రక్రియ ముగియగానే ర్యాండమ్‌గా కొందరు అభ్యర్థుల మార్కులు కంప్యూటరీకరణ ప్రక్రియ ద్వారా, ప్రత్యక్ష పరిశీలనలోనూ అదే అభ్యర్థుల మార్కుల వివరాలను సరిపోల్చనున్నారు. ఆ తర్వాత రాతపరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. -
సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ భారీ ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక దశను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్ బుక్లెట్ సిరీస్ కోడ్ వారీగా కీలను విడుదల చేశారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్ధులు ఈనెల 29వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌లో చూడవచ్చు. ► మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ పరీక్షలకు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ► రాత పరీక్షల కోసం 10,57,355 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయగా.. వీరిలో 9,51,016 మంది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో 7,69,034 మంది పరీక్షలు రాశారు. ► ఇదిలా ఉండగా, సచివాలయ ఉద్యోగాల కోసం ఇన్ సర్వీస్ అభ్యర్ధులుగా దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్ మార్కులు పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్సైట్ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని.. ఆ పత్రాలను తిరిగి వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా అప్ లోడ్ చేయాలని అధికారులు సూచించారు. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది. అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 అధికరణలో గల క్లాజ్(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఆరులోని సబ్ రూల్(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్, గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది. -
పరీక్షలన్నీ పూర్తయ్యాకే ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 19 కేటగిరీలలో పారదర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పోటాపోటీగా... ► ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు. ► 1,025 పోస్టులకు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 3,40,386 మంది రాతపరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ► సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. వారికి ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు.. ► తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించారు. ► పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు, తర్వాత సోడియం హైపో క్లోరైట్‌తో పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. ► పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ► రాతపరీక్షలు ముగియగానే అన్నిచోట్ల నుంచి జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఏపీ: పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు
-
నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తాం. కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వివరించారు. (రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు) -
రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్ మార్కులుంటాయన్నారు. పరీక్షల తర్వాత కూడా బస్సులు విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం కూడా సిటీ బస్సులు నడుపుతామన్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే.. ► మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి. ► ఓఎంఆర్ షీట్లో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్‌తో నింపకూడదు. ► కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు. ► అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్ రూముకు వెళ్లాలి. -
నిర్దిష్ట సమయంలో సేవలు
ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట సమయంలో 91 శాతం రైస్ కార్డులను ఇస్తున్నాం. 76.60 శాతం ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. 97 శాతం పెన్షన్ల మంజూరు జరుగుతోంది. ఇవన్నీ నూరు శాతం జరిగేలా చూడాలి. ఇంటి స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు 90 రోజుల్లో పూర్తి కావాలి. అర్హత ఉన్న వారికి నిర్దిష్టమైన సమయంలో మంజూరు చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి సేవకు నిర్దిష్ట సమయం పెట్టామని, ఆ సమయంలోగా పూర్తి అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీని ఆధారంగానే కలెక్టర్లు, జేసీల పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారికి నిర్దిష్ట సమయంలో సేవలు అందించకపోతే కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఫీల్డ్ విజిట్ ► కలెక్టర్లు వారానికి రెండుసార్లు గ్రామ సచివాలయాలకు కచ్చితంగా వెళ్లాలి. వారానికి నాలుగు సార్లు జేసీలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి. సంబంధిత విభాగాల అధిపతులు (హెచ్ఓడీ), కార్యదర్శులు కూడా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి. ► ఇది కచ్చితంగా జరగాలి. దీన్ని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం. కాల్ సెంటర్.. పోస్టుల భర్తీకి పరీక్షలు ► 200 మందితో కాల్ సెంటర్ పని చేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ► సచివాలయం, మండల, జిల్లా స్థాయి వరకు ఆ కాల్ సెంటర్ పరిధిలోకి వచ్చారు. హెచ్‌వోడీ, సెక్రటరీ స్థాయి వరకు కూడా దాని పరిధిలోకి తీసుకురాబోతున్నాం. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 16,208 పోస్టులకు ఈనెల 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించబోతున్నాం. మొత్తం 10.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 228 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. వైఎస్సార్ ఆసరా ► ఈ పథకం ద్వారా దాదాపు 90 లక్షల మందికి ఆర్థిక సహాయం. అక్క చెల్లెమ్మలకు వ్యాపారంలో తోడ్పాటు అందించే విధంగా పలు సంస్థలతో ఒప్పందం. బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలి. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ► రాష్ట్రానికి 4.25 కోట్ల పని దినాలు అదనంగా వచ్చాయి. రూ.4 వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్‌కు అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో ప్రతి వారంలో రూ.10 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పేమెంట్లు పెండింగ్ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ కాంపౌండ్ నిర్మాణాలను నెలాఖరుకు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ► అక్టోబర్ నుంచి డ్రైన్స్.. గతంలో ఒక శాతం పనులు జరిగి, నిలిపివేసిన వాటికి కూడా అనుమతి ఇవ్వాలి. ఒక శాతం కన్నా ఎక్కువ ఖర్చు చేసినవి రూ.2 వేల కోట్ల విలువైన పనులు ఉన్నాయి. వాటికి కూడా అనుమతులు ఇస్తాం. ► అర్బన్ హెల్త్ క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలి. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను నిర్మించబోతున్నాం. వచ్చే నెలలో వాటికి టెండర్లు జరుగుతాయి. మొత్తంగా 27 టీచింగ్ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి. నాడు–నేడు ► స్కూళ్లలో నాడు–నేడుకు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్ కూడా జత చేశాం. అక్టోబర్ 5న స్కూల్స్ తెరిచే అవకాశం ఉంది కాబట్టి, నాడు–నేడులో చేపట్టిన పనులను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలి. ► పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి. 1,085 టాయిలెట్లపై శ్లాబ్ వేయాల్సి ఉంది. వాటిని కూడా పూర్తి చేయాలి. అంగన్వాడీ కేంద్రాలు ► 55,607 అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మార్చబోతున్నాం. ఈ కేంద్రాల్లో 10 అంశాల్లో నాడు – నేడు పనులు చేపడతాం. ► అద్దె భవనాల్లో ఉన్న 22,979 కేంద్రాలకు నూతన భవనాలను సమకూర్చాలి. 11,961 చోట్ల స్థలం గుర్తించారు. 12,018 చోట్ల స్థలం కేటాయింపు ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి. ► ప్రైమరీ స్కూళ్లలో స్థలం అందుబాటులో ఉంటే, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 1,200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయి. టీచింగ్ ఆస్పత్రులు.. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ► రాష్ట్రంలో కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఏలూరు, పులివెందుల, ఆదోని, పిడుగురాళ్ల, మదనపల్లి, అమలాపురంలో వెంటనే భూసేకరణపై కలెక్టర్లు చొరవ చూపాలి. ► అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు, 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ► ఎరువులకు ఈ నెలలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందువల్ల వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలి. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగనన్న తోడు – వైఎస్సార్ బీమా ► వచ్చే నెల జగనన్న తోడు పథకం ప్రారంభిస్తున్నాం. వీ«ధుల్లో చిల్లర వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. వారికి రూ.10 వేల రుణం వడ్డీ లేకుండా మంజూరు చేస్తాం. ► ఈ పథకం కోసం ఇప్పటి వరకు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్ బీమా లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయాలి. లబ్ధిదారులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించాలి. -
30 కి.మీ. పరిధిలోనే పరీక్ష కేంద్రం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30 కి.మీ. దూరం మించకుండా పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్న కేటగిరి–1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకొక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాతపరీక్ష కేంద్రాల ఎంపిక ఇప్పటికే దాదాపు పూర్తయినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 20 – 26వ తేదీల మధ్య ఏడు రోజుల పాటు రెండు పూటలా 14 రకాల రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ► మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు ఉదయం కేటగిరి –1 పోస్టులకు 2,228 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.57 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.24 లక్షల మంది 1,067 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. ► రెండో రోజు నుంచి ఒక్కొక్క రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మేరకు గరిష్టంగా 516, కనిష్టంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. ► కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలోనూ కనీసం ఒక గదిని ఐసోలేషన్ కోసం కేటాయించి, అక్కడ ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ► రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉందని, ఈ మేరకు హాల్‌టికెట్‌లో కూడా స్పష్టమైన సూచన చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
12 నుంచి ‘సచివాలయ’ హాల్‌టికెట్లు
సాక్షి,అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’) ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
మళ్లీ ఉద్యోగ ‘సంబరం’
అరసవల్లి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కానుకను అందించనుంది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి.. భారీగా నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాదిమంది నిరుద్యోగులను ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వికేంద్రీకరణలో సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో ఇంకా ఖాళీగా ఉన్న సచివాలయాల ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈమేరకు అదనపు నోటిఫికేషన్‌ను ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా నిరుద్యోగుల కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల వాయిదాతోపాటు సచివాలయాల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వచ్చే నెల మూడో వారంలో అర్హత రాత పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 1187 పోస్టుల భర్తీ కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో జి.చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ ఈ నియామకాలకు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాలుండగా, వీటిల్లో 19 విభాగాల్లో 7884 పోస్టులను గుర్తించారు. గతేడాది 6697 పోస్టులను భర్తీ చేయగా, వివిధ కారణాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పలు పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఇలా ఖాళీగా ఉన్న 1187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు 70 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48,756 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు వచ్చే నెల 20 నుంచి ఓ వారం రోజులపాటు రాతపరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాలో 19 విభాగాల్లో 1187 పోస్టులను భర్తీ చేసే క్రమంలో పరీక్షలను విభాగాల వారీగానే నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ స్ప్రే చేయాలని, థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణ రెండో విడత సచివాలయాల్లో పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేస్తున్నాం. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైనన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. తొలి విడత కంటే అభ్యర్థులు తగ్గినప్పటికీ వైరస్ ప్రభావం పడకుండా పరీక్ష కేంద్రాలను ఎక్కువగానే ఏర్పాటు చేస్తాం. 1187 పోస్టులకు 48,756 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. – జి.చక్రధరరావు, జిల్లా పరిషత్ సీఈవో -
రా..రమ్మంటున్న.. ఉద్యోగాలు!
విజయనగరం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల గుర్తింపు పూర్తయినట్లు రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను చేపట్టారు. రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ప్రకారం కొందరు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది రెండో విడతగా జనవరి 11న ప్రభుత్వ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్‌లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా జరగలేదు. ఆ తరువాత ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారని భావించినా కోవిడ్ ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో మరోసారి వాయిదాపడింది. తాజాగా సెప్టెంబర్ 20వతేదీ నుంచి సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించడంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ తక్కువమంది అభ్యర్థులనే కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి అధిక పోటీ: జాతిపిత మహాత్మా గాం«ధీ కలలుకన్న గ్రామ స్వరాజ్య పాలన అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సచివాలయ వ్యవస్థకు అనూహ్య స్పందన లభిస్తోంది. గతేడాది నుంచి ప్రారంభమైన వ్యవస్థ ద్వారా ప్రజలకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సేవలు సులభంగా అందుతున్నాయి. ఈనేపథ్యంలో గతంలో భర్తీ కాని మిగులు పోస్టులను ఈ ఏడాది భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెండవ విడతగా రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో వివిధ పోస్టులు 1134 ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఆన్లైన్లో 48,276 దరఖాస్తులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పరీక్షల ద్వారా 18 రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో గ్రామీణ పరిధిలో 12, పట్టణ ప్రాంతాల్లో 6 ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి నిర్దేశిత విద్యార్హతలు తప్పక ఉండాలి. ప్రతి ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచారు. గత ప్రకటనతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. రాత పరీక్ష షెడ్యూల్ ఖరారు విజయనగరం రూరల్: గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో పంచాయతీరాజ్ శాఖా మంత్రి పి.రామచంద్రారెడ్డి, కమిషనర్లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పరీక్షల నిర్వహణపై పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. అలాగే వివిధ విభాగాల ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలను వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నిర్వహించనున్నారు. -
ఆ పరీక్షలను సవాల్‌గా తీసుకోండి: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సవాల్‌గా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు. ( ‘ఆ రోజు వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు’) మొత్తం 10,63,168 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయం ఉండేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల ఎంపికలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రూట్ ఆఫీసర్లు, జోనల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. గతంలో విజయవంతంగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, ఈసారి కూడా అదే తరహాలో పరీక్షలను నిర్వహించాలని అన్నారు.