
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తాం.
కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వివరించారు. (రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment