Vijay Kumar
-
సనాతన ధర్మం గురించి నాతో చర్చించే దమ్ముందా..?
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్‌రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్‌రెడ్డి పెనుమూరు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్‌రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్‌రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు
-
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
యాక్టర్ విజయ కుమార్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్
టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రముఖ నటుడు విజయ కుమార్. ఆయన మనుమరాలి పెళ్లి ఈ నెలలో జరగనుంది. ఆ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయ కుమార్‌కు రెండు వివాహాలు జరిగాయి. ఆయన మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు కవిత, అనిత ఉన్నారు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లతో పాటు కుమారుడు అరుణ్ ఉన్నాడు. అతను నటుడిగా స్థిరపడితే ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి కొన్ని సినిమాలలో నటించారు. వీరందరికీ వనిత విజయ కుమార్ మాత్రం ఒంటరిగా దూరంగా ఉన్నారు. (భర్త గోకుల్ కృష్ణన్‌తో అనిత విజయ కుమార్) విజయ్ కుమార్ పిల్లలు అందరూ సినిమా పరిశ్రమకు దగ్గర్లో ఉన్న వారే.. కానీ ఆయన మొదటి భార్య కుమార్తె అయిన అనిత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె కూతురు ధియాకు వివాహం కానుంది. 1973లో జన్మించిన అనితా విజయకుమార్ ప్రముఖ డాక్టర్‌గా ఉన్నారు. గోకుల్ కృష్ణన్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుని ఖతార్‌లో ఆమె స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనిత కూతురు థియా కూడా డాక్టర్‌గా స్థిరపడింది. గతేడాదిలో తిలాన్ అనే యువకుడితో థియా నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియా- తిలాన్ జంట ఈ నెలలో ఒకటి కానున్నారు. వారి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది. ఈ పెళ్లికి అనిత తన తండ్రి విజయకుమార్, సోదరి కవితతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఆ విధంగా రజనీ, సూర్య, ధనుష్ కుటుంబాలను అనిత స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె విడుదల చేశారు. తాజాగా తన కూతురు ఖతార్ నుంచి చెన్నైకి వచ్చింది. ఆ వీడియోను అనిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో థియా అమ్మమ్మ హారతి ఇవ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: మెట్రోనగరాల్లో తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ స్టాన్లీ ఉదోకాఇయూలను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ నాబ్) అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.8 కోట్ల విలువైన ఎనిమిది రకాలైన మాదకద్రవ్యాలు స్వాదీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డీసీపీ ఎం.విజయ్‌కుమార్ చెప్పారు. ఎస్పీ కేసీఎస్ రఘువీర్, ఏసీపీఎస్.మోహన్‌కుమార్, ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తో కలిసి పంజగుట్ట ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బిజినెస్ వీసాపై ముంబై వచ్చి... గోవాలో స్థిరపడి నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009 నవంబర్‌లో బిజినెస్ వీసాపై ముంబైకి వచ్చాడు. తొలినాళ్లలో రెడీమేడ్ వ్రస్తాల వ్యాపారం చేశాడు. వ్యాపార విస్తరణలో భాగంగా 2012లో తన మకాం గోవాకు మార్చాడు. అక్కడి కండోలిమ్ ప్రాంతంలో కొందరు స్నేహితులతో కలిసి ఉంటూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేశాడు. పాస్‌పోర్టు పోగొట్టుకొని, వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేశాడు. ఈ విషయం పసిగట్టిన గోవా పోలీసులు అరెస్టు చేయడంతో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కండోలిమ్లోనే ఉండే రాజస్తానీ యువతి ఉషాచండేల్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భర్త నుంచి వేరుపడిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్టాన్లీ గ్రోసరీ పేరుతో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడకు సరుకులు ఖరీదు చేయడానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లతో స్టాన్లీకి పరిచయమైంది. ఓ దశలో ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న స్టాన్లీకి ఈ ఇద్దరూ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సేల్స్ నుంచి సప్లై చైన్ వరకు... తొలినాళ్లలో స్టాన్లీ ఆ ఇద్దరు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తీసుకొని స్థానికంగా విక్రయించేవాడు. వస్త్ర వ్యాపారంలో కంటే ఎక్కువ లాభాలు వస్తుండటంతో దీనినే కొనసాగించాడు. ఇద్దరు మిత్రులు నైజీరియాకు వెళ్లడంతో వారి డ్రగ్స్ వ్యాపారాన్నీ స్టాన్లీ టేకోవర్ చేశాడు. విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించడం, స్థానికంగా ఉన్న పెడ్లర్స్‌కు సప్లై చేయడం... ఇలా ఓ డ్రగ్స్ చైన్ ఏర్పాటు చేశాడు. 2017లో ఇదే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బయటకు వచ్చాక డ్రగ్స్ దందాను మరింత విస్తరించాడు. నైజీరియాతోపాటు నెదర్లాండ్స్‌లో ఉన్న డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆర్డర్లు ఇస్తూ కొరియర్‌తో పాటు విమానాల్లో వివిధ రకాలైన డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఆయా దేశాల నుంచి కొందరు ట్రాన్స్పోర్టర్లు పెద్ద క్యాప్సూల్స్ రూపంలో కడుపులో దాచుకొని, బ్యాగుల్లోని రహస్య అరల్లో సర్దుకుని తీసుకొచ్చేవారు. మాదకద్రవ్యాలు ముంబై టు గోవా మాదకద్రవ్యాలు తొలుత ముంబై వచ్చేవి. అక్కడ ఉన్న సప్లయర్స్ ద్వారా గోవాకు తెప్పించుకునేవాడు. వీటిని కస్టమర్లతో పాటు ఇతర పెడ్లర్స్‌కు సరఫరా చేయడానికి ముగ్గురు దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రయాణ ఖర్చులతో పాటు ఒక్కో గ్రాము డెలివరీ చేసినందుకు రూ.2 వేల కమీషన్ ఇచ్చేవాడు. నైజీరియా వెళ్లిన ఇద్దరు మిత్రులు సైతం తమ పాత కస్టమర్ల ద్వారా వారికి వచ్చే ఆర్డర్స్‌ను వాట్సాప్ ద్వారా ఇతడికి పంపేవారు. ఇలా చేసినందుకు వారికీ గ్రాముకు రూ.2 వేలు కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించిన స్టాన్లీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 511 మంది కస్టమర్లు ఉండగా, వారిలో ఏడుగురు నగరానికి చెందిన వారు. ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ లేదా హవాలా రూపంలో చేస్తుంటాడు. ముంబైలో వస్త్రవ్యాపారం చేస్తుండగా పరిచయమైన నెట్‌వర్క్‌నే వాడుకుంటున్నాడు. స్టాన్లీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోవాలో రూ.కోటి ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఎస్ఆర్ నగర్లో దొరికిన తీగ లాగితే... టీఎస్ నాబ్ అధికారులు గత నెల 18న ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 38 ఎక్స్టసీ పిల్స్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కీలక నిందితుడైన బాబూసోను లోతుగా విచారించగా, డ్రగ్స్ స్టాన్లీ ద్వారా వస్తున్నాయని తేలింది. దీంతో గోవా వెళ్లిన టీఎస్ నాబ్ పోలీసులు నెల రోజులు శ్రమించి స్టాన్లీ ఆచూకీ కనిపెట్టారు. అతడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు మంగళవారం డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి పంజగుట్టకు వచ్చినట్టు తెలుసుకున్నారు. అక్కడ వలపన్ని స్టాన్లీని పట్టుకోవడంతో పాటు అతడి నుంచి 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్టసీ మాత్రలు, 21 గ్రాముల హెరాయిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 105 ఎల్ఎస్డీ బోల్ట్స్, 215 గ్రాముల చరస్, 7 గ్రాముల యాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సిటీలోని ఏడుగురు కస్టమర్ల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ దందా వివరాలు తెలిసిన వారు 8712671111కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్
-
ఓ తండ్రి తీర్పు సినిమా ట్రైలర్ లాంచ్
-
సంఘటితంగా రైతుల ప్రకృతి సాగు
-
అడిషనల్ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్‌కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మిల్లెట్స్‌తో మెరిసిన చిత్రాలు
విశాఖ (ఏయూ క్యాంపస్): గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్‌కుమార్ చూపించారు. జీఐఎస్‌కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్నాథ్ చిత్రకారుడు విజయ్‌కుమార్‌ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్‌లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు. వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్‌బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేష్‌కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. -
Arun Vijay: ప్లీజ్.. వదంతులను ప్రచారం చేయొద్దు.. అదంతా అబద్ధం
వదంతులను ప్రచారం చేయొద్దని నటుడు అరుణ్ విజయ్ కోరారు. ఆయన సీనియర్ నటుడు విజయ్‌కుమార్ వారసుడన్న విషయం తెలిసిందే. ఎంజీఆర్, శివాజీ గణేషన్ కాలం నుంచి నేటి తరం నటీనటుల వరకు నటిస్తున్న విజయ్‌కుమార్ మొదట్లో హీరోగా, విలన్‌గా నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తున్నారు. ఇటీవల తన కొడుకు అరుణ్ విజయ్ కథానాయకుడిగా సినం అనే చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నటుడు అరుణ్ విజయ్ తన తండ్రి విజయకుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, వదంతులను ప్రచారం చేయవద్దని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన యానై, సినమ్ చిత్రాలు ఇటీవల విడుదలై మంచి ప్రజాదరణ పొందాయి. అదే విధంగా తమిళ రాకర్స్ అనే వెబ్‌సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈయన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి అమీజాక్సన్ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి అచ్చం యంబదు ఇల్లయే అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైంది. -
పగడ్బందీ వ్యూహంతో వీరప్పన్‌ను హతమార్చాం
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): పగడ్బందీ ప్రణాళికలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నేర్పుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను హతమార్చామని తమిళనాడు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి నాయకత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం చెన్నై తరమణిలోని ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో.. మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ రాసిన (వీరప్పన్ ఛేజింగ్ ది బ్రిగాండ్) పుస్తకం ఆధారంగా 20 ఎపిసోడ్ల ఆడియో రికార్డులను ఆసియావిల్లే వ్యవస్థాపకుడు, సీఈఓ తుహిన్ ఆవిష్కరించారు. మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ సందర్భంగా థ్రిల్లింగ్ ట్రూ–క్రైమ్ పై ఆడిబుల్ ఒరిజినల్ పాడ్‌కాస్ట్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో 1952లో గోపీనాథంలో పుట్టినప్పటి నుంచి 2004లో మరణించే వరకు వీరప్పన్ జీవితానికి సంబంధించిన అంశాలు మాజీ ఐపీఎస్ కె. విజయ్ కుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించామని వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విజయకుమార్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ను ఎలాగైనా మట్టికరిపించాలనే లక్ష్యంతో పక్కా వ్యూహంతో హతమార్చగలిగామన్నారు. ఇందులో ఏకే 47 గన్ను వినియోగించామని చెప్పారు. ఎంతో మంది పోలీసులను, సాధారణ ప్రజలను కిరాతకంగా వీరప్పన్ చంపారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్‌కు ఎవరూ భంగం కలిగించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే విషయాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాం.. అని ఆయన పేర్కొన్నారు. -
ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?
ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు భావిస్తుండవచ్చు. దీనికి మంచి సాక్ష్యం కశ్మీర్లో తీవ్రవాదుల సంఖ్య గురించిన సమాచారం. కశ్మీర్ లోయలో ఇప్పుడు 81 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులనీ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అంత కచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు? వాళ్లు ఏమైనా వస్తూపోతున్నప్పుడు ఒక రిజిస్టర్లో సంతకాలు ఏమైనా పెడుతున్నారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? వీళ్ల ఆనుపానులు కూడా ఇంత కచ్చితంగా తెలిసినప్పుడు మరి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు? ఉగ్రవాదుల గురించిన వివరాలపై మనం ఇలాంటి మామూలు ప్రశ్నలు కూడా వేయలేమా? పైగా వాటిని నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా భావిస్తుండటం మరీ విషాదం. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు చాలావరకు మనలాంటి సాధారణ ప్రజలు ఏది చెప్పినా సరే మందమతుల్లాగ తలా డించేస్తుంటారని గట్టినమ్మకం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా లేక ఆఫీసులో ఉంటున్న ఏ అధికారి విషయంలోనైనా ఇది నిజమనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడూ వాళ్లు ఇచ్చే సమాచారం ప్రతిదీ నమ్మేసేవాళ్లను కూడా ఆలోచనలో పడేస్తుంది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినంత వరకూ ఇది చాలా తరచుగా నిజమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. గత శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) విజయ్ కుమార్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు నివ్వెరపరచే వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కశ్మీర్ లోయలో 81 మంది యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? ఉగ్రవాదులు వచ్చి సంతకాలు పెట్టిపోయేలా మనం ఏమైనా ఒక రిజిస్టర్ నిర్వ హిస్తున్నామా? పైగా వారి మూలం, నేపథ్యం గురించి మనకేమైనా చెప్పారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? అంకెలు సరిపోతున్నాయా? అంతమాత్రమే కాదు. డీజీపీ ఇంకా చాలా నిర్దిష్టంగా ఉన్నారు. ‘‘బందీపుర్, కుప్వారా, గాందర్బల్ జిల్లాల్లో స్థానిక ఉగ్రవాదులు అసలు లేరు. కాగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బడ్గావ్ జిల్లాల్లో ఒక్కో ఉగ్రవాది మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సంఖ్య విషయంలో ఆయన అంత నిర్దిష్టంగా, కచ్చితంగా ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విదేశీ ఉగ్రవాదుల అంశం ముందుకు తెద్దాం. తొలి మూడు జిల్లాల్లోనే విదేశీ తీవ్రవాదులు పనిచేస్తున్నారని డీజీపీ సూచిస్తున్నారా? రెండవది, ఆయన పేర్కొన్న చివరి నాలుగు జిల్లాల్లో ఒకే ఒక స్థానిక ఉగ్రవాది ఉంటున్నాడా? వారి ఉనికిని ఇంత కచ్చితంగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే వారు ఉన్న ప్రదేశం కూడా మనకు తెలిసిపోయినప్పుడు వారిని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాస్తవానికి ఈ ప్రశ్నలు డీజీపీ విజయ్ కుమార్‌ని ఇబ్బంది పెట్టవు. ఆయన్ని తన మార్గం నుంచి వైదొలిగేలా చేయవు కూడా! పైగా ప్రతి సంవత్సరం ఎంతమంది స్థానిక కశ్మీరీలు తీవ్రవాదుల్లో చేరుతున్నారు అనేది కూడా ఆయనకు తెలిసినట్లే కనబడుతోంది. బహశా వారు తమ వివరాలు ఆయనకు తెలిపి ఉండవచ్చు లేదా వారికి అత్యంత విశ్వసనీయమైనవారు, సన్నిహితమైనవారు డీజీపీ చెవిలో ఊది ఉండవచ్చు. 2018లో 201 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఈ సంవత్సరం వారి సంఖ్య 99కి పడిపోయిందని డీజీపీ ప్రకటించారు. ఇంత కచ్చితమైన వివరాలు ఆయనకు ఎలా తెలిశాయి అని ఎవరూ డీజీపీని అడగలేరు. లేదా ఆయన బహుశా చెప్పరు కూడా! నిజానికి తనను వైరుద్ధ్యాల్లోకి లాగుతున్న ఈ 99 సంఖ్యను తాను బయటపెట్టినప్పటికీ తనను ఎవరూ నిలదీయరని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లున్నారు. ఈ సంవత్సరం కశ్మీర్ లోయలో 99 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 64 మంది హతమై పోయారనీ, 17 మందిని అరెస్టు చేయగా 18 మంది ఉగ్రవాదులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారనీ డీజీపీ వివరించి చెప్పారు. అయితే పైన చెప్పిన వివరాలకేసి చూస్తే, 29 మంది స్థానిక ఉగ్రవాదులు మాత్రమే లోయలో ఉన్నారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మిగతా 11 మంది ఉగ్రవాదులు ఎక్కడ తప్పిపోయారు? ఇవి కేవలం వివరాలు మాత్రమే కాబట్టి వీటికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే డీజీపీ మరింత ముఖ్యమైన విషయం ప్రకటించారు. అదేమిటంటే, చనిపోయిన 64 మంది ఉగ్రవాదుల్లో 57 మంది వారు చనిపోవడానికి సరిగ్గా నెల ముందే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్న సంగతి! ఈ విషయం కూడా ఆయనకు ఎలా తెలుసు? వారు ఎప్పుడు చేరిందీ ఆయనకు తెలిసి ఉంటే, వారిని ఎందుకు ఆపలేకపోయారు లేదా కనీసం వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అయితే ఈ ప్రశ్నలను నేను అడగలేదు. మొత్తం మీద ఉగ్రవాదులకు చెందిన ఇంత సున్నితమైన వివరాలు డీజీపీ చేతివేళ్లపై అంత కచ్చితంగా ఆడుతున్నప్పుడు నాకు ఒకే సందేహం ఉంది. కొంప దీసి డీజీపీ విజయ్ కుమార్ ఈ ఉగ్ర వాదుల జీవిత చరిత్రలు త్వరలో రాసినా నేనేమీ ఆశ్చర్యపోను. ప్రశ్నించరనే ధీమానా? ఇప్పుడు, కశ్మీర్ లోయలో పోలీసుల కచ్చితత్వం గురించి మూగ పోయేవారిలో నేనే మొదటివాణ్ణి కాదు. 2000 సంవత్సరపు ప్రారంభంలోకి వెళ్లి చూద్దాం. పాకిస్తాన్ నుంచి నెలకు ఎంతమంది జిహాదీలు వాస్తవాధీన రేఖను దాటి వస్తున్నారో నాటి పోలీసులు మాకు నిత్యం వివరాలు చెబుతున్నప్పుడు, ఈజిప్ట్ రాయబారి గెహాద్ మాది తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ‘‘ఈ నెలలో 241 మంది వాస్తవాధీన రేఖను దాటి వచ్చారు. గత నెలలో 225 మంది, అంతకు ముందు నెలలో 230 మంది భారత్ భూభూగంలోకి వచ్చారు అని చెబుతున్నారు. ఇంత కచ్చితంగా వారు ఎలా చెప్పగలరు? వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి అడుగుపెట్టే ముందు జిహాదీలు రిజిస్టర్లో సంతకం పెట్టివచ్చే కార్యాలయం ఏమైనా ఉందా?’’ అని ఈజిప్టు రాయబారి వ్యంగ్యంగా ప్రశ్నించారు. గెహాద్ తన దౌత్య పరిధులను దాటి బహిరంగంగా తన సందేహాలను లేవనెత్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన సంధించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు ఉగ్రవాదుల గురించి డీజీపీ విజయ్ కుమార్ చెప్పిన వివరాలపై కొన్ని మామూలు ప్రశ్నలు కూడా మనం వేయలేమా? డీజీపీ ఎవరి వద్దనయితే ఈ వివరాలు చెప్పారో ఆ జర్నలిస్టులు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకపోవడం విషాదకరమైన విషయం. వారు ఏమీ అడగలేరని ఆయనకు తెలియడమూ, పైగా ఆయన చెప్పిన వివరాలు నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా మనం కూడా ఆమోదిం చాలని డీజీపీ భావిస్తుండటమూ మరింత విషాదం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి.. -
ఏపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది: విజయ్‌కుమార్
-
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చెయ్యను
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్‌కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్‌కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్‌ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్‌చుప్‌గా ఉంటోంది. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది -
ఆ నిర్మాణ సంస్థలో రెండోసారి విజయ్ సినిమా..
Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films: 'ఉరియడి' చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కుమార్. ఆ తర్వాత సూర్య, జ్యోతికల నిర్మాణా సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'ఉరియడి-2' చిత్రం చేసిన ఈయన తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. రీల్ గుడ్ ఫిలీంస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇది ఈ సంస్థలో ఆయన చేస్తున్న రెండో చిత్రం. ప్రీతి అస్రాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి 'సేతుమాన్' చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్ జయ రాజ్ ఛాయగ్రహణం, వసంత గోవింద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ సంఘటనలతో పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ కుమార్
ఉరియడి చిత్రంతో దర్శకుడిగా, నటుడిగా పరిచయమైన నటుడు విజయ్ కుమార్ ఆ తరువాత ఉరియడి 2 మూవీ తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత సూర్య కథానాయకుడిగా నటించి, నిర్మించిన సూరరై పోట్రు చిత్రానికి సంభాషణలను అందించారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశారు. రీల్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బాస్ ఏ.రహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్‌గా విజయ్ సేతుపతి? విలన్‌గా విజయ్ సేతుపతి? కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్ -
ఆరికెలు: బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం.. పండించడం ఎలా?
ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్‌లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె (జూలై 5 వరకు) అత్యంత అనువైన కాలం. మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్ మిల్లెట్స్).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే. చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం... ఆరిక విత్తనాలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి. ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రా. చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. కషాయాలు పిచికారీ చేయాల్సిన అవసరం రాదు. ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆరికలు ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్లు, కందులు 3 క్వింటాళ్లు, ఆముదాలు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సందేహాలుంటే విజయకుమార్ (98496 48498)ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. చదవండి: ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె! -
టీడీపీతో విజయ్‌కుమార్ కుమ్మక్కు.. జన సైనికుడు కిరణ్ ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: నాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేడు జనసేన పార్టీ వరకు మెగా ఫ్యామిలీ అభిమానిగా, గ్రామ నాయకుడిగా సేవలందిస్తున్న తనపై జనసేన ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సుందరపు విజయ్‌కుమార్, అతడి అనుచరులు దాడి చేసినా అధిష్టానం స్పందించ లేదని ఎర్రిపల్లి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెడుతున్న అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల విశాఖకు వచ్చిన జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు దృష్టి తీసుకెళ్లినందుకు దాడి చేశారన్నారు. విజయ్‌కుమార్ లాంటి వారి వల్ల పార్టీ నాశనమవుతోందన్నారు. జనసైనికులుగా పార్టీపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఇలాంటి వారు భ్రష్టుపట్టిస్తున్నారని వాపోయారు. గతంలోనూ అతడి ఆగడాలను జనసేన అధ్యక్షుడికి, పార్టీ ప్రధాన కార్యాలయానికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. అయినా వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. యలమంచిలి నియోజవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్, సుందరపు సతీష్‌కుమార్, గాజువాకకు చెందిన ఏడిద భార్గవ శ్రీనివాసరావు, కాశీందేవుల సతీష్, కోఠారి నరేష్, కాళ్ల చంద్రమోహన్, ప్రకాష్, భాస్కరరావు, శివశంకర్, బొద్దపు శ్రీనివాస్ తనను గదిలో ఆరు గంటలపాటు బంధించి దాడి చేశారన్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు) -
ఉగ్రవాదులు మరో ఘాతుకం.. కుల్గామ్‌లో బ్యాంకు మేనేజర్ హత్య
-
నాకు నేను కనిపించలేదు!
‘‘జయమ్మ పంచాయితీ’కు కేటాయించిన సమయాన్ని టీవీ షోలు, ప్రీ రిలీజ్‌లకు హోస్ట్‌గా చేయడం వంటి వాటికి వినియోగించినట్లయితే మరిన్ని డబ్బులు వచ్చి ఉండేవేమో. కానీ నన్ను నేను ప్రపంచానికి ఎక్స్ప్లోర్ చేసుకోవాలను కున్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేసినందుకు నాకు నేను శెభాష్ చెప్పుకుంటున్నా’’ అని ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల అన్నారు. విజయ్ కుమార్ దర్శకుడిగా సుమ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సుమ చెప్పిన విశేషాలు.... ‘జయమ్మ పంచాయితీ’ బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ నిడికి తక్కువ ఉంటుందేమోనని ఊహించి, చదవడం మొదలుపెట్టాను. కానీ కథ మొత్తం ఆ పాత్రతోనే నడుస్తోందని స్క్రిప్ట్ చదువుతున్న కొద్దీ అర్థం అయ్యింది. అయితే టెలివిజన్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఫ్యామిలీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా చేయాలా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ చాలెంజ్‌గా తీసుకుని చేశాను. అవి నచ్చి ఈ సినిమా చేశా! కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజయ్‌గారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. మన ఊర్లో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం ఈడ్లు (చదివింపులు) వేస్తాం. జయమ్మకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే జయమ్మ ఎవరికైతే ఈడ్లు వేసిందో వారందరూ తిరిగి వేయాలి. కానీ జయమ్మ ఈడ్లు తీసుకున్నవారికీ కొన్ని సమస్యలు ఉంటాయి. మరి.. జయమ్మ సమస్య ఎలా తీరింది? అన్నదే ఈ చిత్రకథ. ఎవరూ నిరుత్సాహపడరు సుమ బాగా యాక్ట్ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యాక అందరూ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజయ్ రాసిన స్టోరీ ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేçస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ జయమ్మ పంచాయితీ హిట్ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం రెండు కథలు ఉన్నాయి. రోషన్ లాంచ్ ఈ ఏడాదే.. నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్న సమయంలో చాలా బిజీగా ఉండి వరుసగా మూడు రోజులు నేను తనకు కనిపించలేదు. ఆ సమయంలో ‘నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..’ అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. నా కొడుకు రోషన్‌కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్ చేస్తాం. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో శ్రీకాకుళంలోని పాలకొండ, చెన్నైపేట, అక్కడి అటవీ ప్రాంతం.. ఈ లొకేషన్స్‌ను ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా.. ఈ లొకేషన్స్‌లోకి యూనిట్ వెళ్లడం, సామాగ్రిని తీసుకుని వెళ్లడం కష్టమని భావించి ఎవరూ ప్రయత్నించలేదేమో కానీ ఈ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. మా ‘జయమ్మ పంచాయితీ’ సినిమా సెకండాఫ్‌లోని కొన్ని సీన్ల కోసం ట్రెక్కింగ్ చేసి మరీ ఆ లొకేషన్స్‌కు వెళ్లాం. అక్కడ కొన్ని జలపాతాలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎంత అందం ఉందో! -
యాంకర్ సుమపై ఆ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు. చదవండి: రాజీవ్‌తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమెజాన్ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్టర్ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని నటి జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా నటుడు అరుణ్‌విజయ్ కొడుకు ఆర్ణవ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. ఇందులో అరుణ్‌విజయ్, ఆయన తండ్రి సీనియర్ నటుడు విజయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషించగా, మహిమ నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కుక్కపిల్ల కీలకపాత్రలో నటించడం మరో విశేషం. నివాస్ కే.ప్రసన్న సంగీతం, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటుడు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో నటనకు మాస్టర్ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం తెలిపారు. Witness the epic and un-fur-gettable tale of Arjun & Simba in 5 Days! 🐾 Watch #OhMyDogOnPrime, April 21 @PrimeVideoIN@Suriya_offl #Jyotika @SarovShanmugam @2D_ENTPVTLTD #VijayaKumar #ArnavVijay #VinayRai #MahimaNambiar @gopinath_dop @nivaskprasanna @rajsekarpandian #MichealRaj pic.twitter.com/1DjIbjbNTr — ArunVijay (@arunvijayno1) April 16, 2022 -
ఆ తర్వాతే కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలు: విజయ్‌కుమార్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు. కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. చదవండి: (ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్) -
ఉగాది రోజున కొత్త జిల్లాల ఏర్పాటు
-
వ్యవసాయ రంగంలో 14.5% ప్రగతి నమోదు: ఏపీ ప్రణాళికశాఖ కార్యదర్శి
-
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ
-
ఈ నెలాఖరులోపు తుది నోటిఫికేషన్: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయసేకరణ గడువు గురువారంతో ముగియనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు 7,500 సలహాలు కలెక్టర్లకు అందజేశారు. ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4,500 సలహాలు, సూచనలు వచ్చాయి. తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుంచి సూచనలు అందాయి. అన్నిజిల్లాల సమీక్షలు ఈ రోజుతో ముగిశాయి. వీటన్నిటిని పరిశీలించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద తుది నిర్ణయం జరుగుతుంది. మార్చి నెలాఖరులోపు తుది నోటిఫికేషన్ ఇస్తాం. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. మొత్తం 60 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని' ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
AP: కీలక దశకు కొత్త జిల్లాల ఏర్పాటు.. ఏప్రిల్ 2 నుంచి పాలన
సాక్షి, అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని.. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. AP: సమయానికి రాకపోతే ‘సెలవే’ ఆర్డర్ టూ వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్‌కుమార్ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఉన్నతస్థాయి కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు కీలక దశకు చేరింది. ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు. -
త్వరలో కొత్త జిల్లాలపై సూచనల పరిశీలన
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను రాష్ట్ర స్థాయి కమిటీ రెండు రోజుల్లో పరిశీలించనుంది. మార్చి 3 వరకు గడువున్నా కూడా.. ఈలోపే ఒకట్రెండు సార్లు సూచనలు, అభ్యంతరాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు బుధవారం సమావేశం కానున్నారు. వచ్చిన సలహాలు, అభ్యంతరాలను తొలుత స్కూృటినీ చేయనున్నారు. ఆ తర్వాత వాటిపై కలెక్టర్లు రాసిన రిమార్కులను పరిశీలిస్తారు. అభ్యంతరాలు, సూచనల్లోని ప్రామాణికత, ఇతర అంశాలను అధ్యయనం చేసి.. చివరిగా వాటిని సీఎస్ నేతృత్వంలోని కమిటీకి సిఫారసు చేయనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. అనంతపురం నుంచి అత్యధికంగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,400కు పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. వాటిలో అనంతపురం జిల్లా నుంచే 700 సూచనలు వచ్చాయని సమాచారం. పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ.. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పోస్టుకార్డుల్లో ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా ఈ అభ్యంతరాలు పంపించినట్లు సమాచారం. అనంతపురం తర్వాత నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిలో సమంజసమైన అభ్యంతరాలు, ప్రామాణికత ఉన్న సూచనలను పరిశీలించనున్నారు. -
ప్రతి సూచనా పరిగణనలోకి..
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలపై అందే ప్రతి సూచన, అభ్యంతరాన్ని పరిశీలిస్తామని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, ఎవరైనా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్లకు తెలియచేయవచ్చన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన విజయవాడలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి అంశాన్ని ఎంతవరకు ఆమోదయోగ్యం? ప్రజలకు ఏమేరకు ఉపయోగకరంగా ఉంటుంది? అనే కోణంలో పరిశీలిస్తామన్నారు. ప్రణాళికా శాఖ, సీసీఎల్ఏ కార్యదర్శి, కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. అక్కడ వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. సుహృద్భావ వాతావరణంలో.. జిల్లాల విభజనను సుహృద్భావ వాతావరణంలో, ప్రజాస్వామ్యయుతంగా చేపట్టాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులకు సంబంధించి తొలుత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిపై దృష్టి పెడతామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయాలతో కలిపి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. -
కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకోనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3 వరకు జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇవ్వొచ్చు. అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తాం. ఏప్రిల్ 2 ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుంది. మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతాం. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్‌కి ఇబ్బందులు ఉండవు. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తాం. రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయి. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తాం. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తాం. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు నిర్మాణం జరుగుతుంది. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తాం. కేంద్రం అనుమతి జిల్లాల ఏర్పాటుకు అవసరం లేదు. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుంది' అని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. చదవండి: (అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్) -
ఆ పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి..
సాక్షి, ఆలూరు (కర్నూలు): రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆలూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న నాగేంద్ర, అనిత దంపతుల కుమారుడు విజయ్ కుమార్ (18), అదే కాలనీలో నివాసం ఉండే రమణ, అనిత దంపతుల కుమార్తె మధుప్రియ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విజయ్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఆలూరు ఐటీఐ కళాశాలలో డీజల్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మధుప్రియ ఆలూరులోని మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు చదివి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ చదివే సమయంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మధుప్రియను వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల కళాశాలలో బీటెక్ చేర్పించారు. అప్పుడప్పుడు సెల్ ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునే వారని తెలిసింది. అయితే వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విజయ్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) ఈ విషయం మధుప్రియకు తెలిసి అదే రోజు హాస్టల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు హాస్టల్ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిని అనంతపురం జిల్లా కదిరిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి తీసుకొచ్చారు. విజయ్ మరణాన్ని జీర్ణించుకోలేక మధుప్రియ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తమ పిల్లలు ఉన్నతంగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. ప్రేమికుల ఆత్మహత్యతో ఆలూరులో విషాదం అలుముకుంది. చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..) -
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు ‘అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం’ అని తెలిపారు. -
Hyderabad: వేగం పెరిగింది.. ప్రమాదాలు తగ్గాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర మహా నగరాలకు భిన్నంగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల సరాసరి వేగం పెరుగుతోందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. దీన్ని మరింత పెంచడంతో పాటు ప్రమాదాలు తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు తిరుమలగిరిలో నేరం నిరోధించడంలో, కోఠిలో ఓ ప్రాణం కాపాడటంతో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ట్రాఫిక్ చీఫ్ విజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ►నగరంలో వాహనాల సరాసరి వేగం 2016లో గంటకు 19 కిమీ, 2019లో గంటకు 22 కిమీ ఉండగా.. ఈ ఏడాది అది 25 కిమీకి చేరింది. 2022లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఏడాది సిటీ ట్రాఫిక్ పోలీసులు 36 సందర్భాల్లో లైవ్ ఆర్గాన్లు రవాణా చేయడానికి గ్రీన్ ఛానల్ ఇవ్వడం ద్వారా సహకరించారు. ఈ ఆపరేషన్లు అన్నీ విజయవంతం అయినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. ►టూ వీలర్‌పై ప్రయాణించే భర్తలతో పాటు భార్యలూ హెల్మెట్ ధరించడం పెరుగుతోంది. ఈ కారణంగా ఈ ఏడాది నాలుగు ప్రమాదాల్లో మహిళలు గాయాలతో బయటపడ్డారు. ►హెల్మెట్ ధరించని వాహనచోదకులపై 2015లో 1.3 లక్షల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. స్టాప్ లైన్ దాటిన వారిపై గతేడాది 43 వేల కేసులు, ఈ ఏడాది 75 వేల కేసులు నమోదయ్యాయి. చదవండి: టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు! ►ఈ ఏడాది ఓవర్ స్పీడింగ్‌పై 76 వేలు, నో ఎంట్రీ ఉల్లంఘనపై 17,359, సిగ్నల్ జంపింగ్‌పై 40,274, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై 34 వేలు, నెంటర్ ప్లేట్ ఉల్లంఘనపై 28,300, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 21,041 కేసులు నమోదయ్యాయి. ►ఈ ఏడాది మృతులతో కూడిన రోడ్డు ప్రమాదాల్లో సరుకు రవాణా వాహనాల వల్ల 43, ద్విచక్ర వాహనాల వల్ల 24, కార్లతో 14, ఆటోలతో 8, అంబులెన్స్‌లతో 2 జరిగాయి. అంబులెన్స్ డ్రైవర్లనూ అప్రమత్తం చేయనున్నారు. ►మృతులతో కూడిన ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తే... ఓవర్ స్పీడ్ వల్ల 178, మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల 13, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వల్ల 10, మైనర్ డ్రైవింగ్ వల్ల 6, నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల 24 జరిగాయి. -
నాన్న అందం చూసి వాళ్లు బాగా దూరం పెట్టారు
ఇంద్రుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, జనకుడు, దశరథుడు వంటి పౌరాణిక పాత్రలు.. అనేక జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో తెలుగు తెరను సుసంపన్నం చేశారు.. తెలంగాణ సాయుధ పోరాటం కోసం మా భూమి నాటకాన్ని ప్రదర్శించారు.. సాధారణ జీవితం గడుపుతూ, వెండితెర మీద వెలుగులు చిందించారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.. సైకిల్ మీదే తన ప్రయాణాన్ని ప్రారంభించిన తండ్రి గురించి కుమారుడు విజయ్ కుమార్ పంచుకున్న అనుబంధ ప్రయాణం.. నాన్నగారు కృష్ణాష్టమి రోజున, కృష్ణా తీరంలో మేనమామ ఇంట్లో పుట్టడం వల్ల రాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టారు. కోలవెన్ను స్వగ్రామం. వెంకయ్య, సౌభాగ్యమ్మ దంపతులకు నాన్న రెండో సంతానం. పెద్దాయన బలరామకృష్ణయ్య. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు పేరయ్య, రామమోహన్‌రావు, ఇద్దరు చెల్లెళ్లు లక్ష్మి, సరస్వతి. నాన్నకు ముగ్గురు పిల్లలం. అక్క మాలతి, చెల్లి రేణుక, నేను. నాన్న ఆ రోజుల్లో ప్రజానాట్యమండలి తరఫున తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ‘మా భూమి’ నాటకంలో నాన్నతో పాటు నటించిన సీతారత్నమ్మను ప్రేమవివాహం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలో నాలుగైదు సార్లు జైలుకి కూడా వెళ్లారు. నాన్న పునాదిపాడులో చదువుకునే రోజుల్లోనే పాటలు, పద్యాలు పాడుకుంటూ చదువును నిర్లక్ష్యం చేశారంటారు. కోలవెన్ను లైబ్రరీలో ఉద్యోగం చేసే రోజుల్లో పుస్తకాలు చదవటం వల్ల మంచి భాష అలవడింది. చాలా బాగా రాసేవారు. ఆయనతో అరవై సంవత్సరాలు గడిపినా మాకు అబ్బలేదు. రూపాయి టికెట్‌తో... నాన్న ‘గాలి మేడలు’ నాటకం ప్రదర్శించారు. టికెట్ వెల రూపాయి. నాన్నే విశాలాంధ్రలో పోస్టర్లు వేయించి, లైట్ స్తంభాలకు అంటించారు. థియేటర్ అంతా శుభ్రం చేసి, కుర్చీలు నాన్నే వేశారు. ఆ రోజుల్లో ఆ నాటకం హౌస్‌ఫుల్. విజయవాడ రామా టాకీస్‌లో ‘మా భూమి’ నాటకాన్ని రెండు షోలు అర్ధరాత్రి వరకు వేశారు. ఇంటికి సుమారు 40 రూపాయలు వచ్చేవి. ఆకాశవాణిలో వేసే నాటకాలకు 20 రూపాయలు వచ్చేవి. మాకు కొద్దిగా పొలం ఉంది. అందువల్ల ఏ ఇబ్బందులూ లేకుండా కుటుంబం నడిచిపోయేది. మంచి స్నేహితులు.. అప్పటికే మంచి నిర్మాతగా పేరున్న కె.ఎస్. ప్రకాశరావుగారు, నాన్న మంచి స్నేహితులు. ఆయనతో పాటు, పోతిన బెనర్జీ, వీరమాచనేని సంతాన గోపాలరావుల ప్రోత్సహంతో నాన్న చెన్నై చేరుకున్నారు. చిన్న వేషం వేసినా, పెద్ద వేషం వేసినా అందరితో చాలా మంచిగా ఉండేవారు. నాన్న అందం, పొడవు చూసి కొత్త నటులకు ఇబ్బందిగా ఉండేది. ఈయన వస్తే ఎలా ఉంటుందోనని బాగా దూరం పెట్టారు. సైకిల్ మీదే... మద్రాసులో ఏ మూలకైనా సరే నాన్న సైకిల్ మీదే వెళ్లేవారు. ఆ సైకిల్ నాన్నకు చాలా రకాలుగా ఉపయోగపడింది. ఇంటికి రాగానే సైకిల్ని లోపల దాచేసేవాడిని. నిరంతరం ఆ సైకిల్‌కి నేను కాపలా ఉండేవాడిని. నాన్న చాలా సింపుల్‌గా ఉండేవారు. పైజమా, లాల్చీ ధరించేవారు. దూరం నుంచి నాన్నను చూసి మిక్కిలినేని బ్రాండ్ అనుకునేవారు. విలన్‌గా స్థిరపడదామని, స్టంట్ మాస్టర్ని పెట్టుకుని కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. కాని సాత్విక పాత్రలకు నిలబడిపోయారు. నాన్నగారి కారు ఆయనే తుడుచుకునేవారు. సాధారణంగా ఉండేవారు.. నాన్న చాలా మితంగా మాట్లాడేవారు. ఆయన భోజన ప్రియులే కానీ, భోజనం చాలా క్లుప్తంగా ఉండేది. సినిమా మోజుతో పాటు, నాన్నను చూడటానికి చాలామంది వచ్చేవారు. మోసపోయిన ఆడవాళ్లు, బ్యాగులు పోగొట్టుకున్న వారికి అన్నం పెట్టి, సురక్షితంగా వారివారి ఇళ్లకు పంపేవారు. నేనే రైల్వేస్టేషన్‌కి తీసుకువెళ్లి, టికెట్ కొని, ఎక్కించి రావాలి. ఎవరైనా ఉండిపోతామంటే, వాళ్లవాళ్లకి ఉత్తరం రాసి, వాళ్లు స్థిరపడేవరకు సహకరించేవారు. ఫ్యాన్ మెయిల్ వస్తే, అక్షరాలు పోకుండా ఉండేలా, జాగ్రత్తగా కత్తెరతో కట్ చేసేవారు. వాటికి సమాధానాలు స్వయంగా రాసి ఇస్తే, నేను డబ్బాలో వేసేవాడిని. ఇష్ట చతుష్టయం.. పద్మనాభం, ఎస్. పి. కోదండపాణి, నాన్న, నేను బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. నాన్న స్విమింగ్కి వెళ్లేవారు. సినారె సినీ పరిశ్రమకు వచ్చిన తరవాత, ఇంచుమించు ప్రతి శుక్రవారం సాయంత్రానికి ఆయన మా ఇంటికి వచ్చేవారు. నాన్న, సి. నారాయణరెడ్డిగారు, నేరెళ్ల వేణుమాధవ్‌గారు, గుమ్మడి గారు నలుగురూ చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల నలుగురి స్నేహం చూసి అందరూ ముచ్చటపడేవారు. సి. నారాయణరెడ్డిగారు వారి నలుగురి స్నేహానికి ‘ఇష్ట చతుష్టయం’ అని పేరు స్థిరపరిచారు. నాన్నని సినారె అగ్రజా అంటే, నేరెళ్ల సినారెను అగ్రజా అనేవారు. తగ్గించుకున్నారు.. నాన్న 1998లో విజయవాడ వచ్చేశారు. నాన్నకు సన్మానం జరగని ఊరే లేదు. ఒకసారి విజయదశమి నాడు మండపేటలో దేవాలయానికి వెళ్లివచ్చారు. పండుగ పూట నగలు తీయటం ఎందుకని, అమ్మ, చెల్లాయిలు నగలు ఉంచుకునే పడుకున్నారు. తెల్లవారేసరికి మొత్తం దొంగతనం చేసేశారు. ఇక అప్పుడు నాన్నను ప్రయాణాలు తగ్గించుకోమన్నాను. నగలు పరవాలే, ఎవరైనా అఘాయిత్యం చేస్తే కష్టం కదా అనే ఆలోచనతో. నాన్న తన 95 ఏట కన్ను మూశారు. అమ్మనాన్నలు కాలం చేసేవరకు దగ్గరుండి చూసుకోగలిగాను. నాకు ఎనిమిది పదులు నిండినా ఇంకా నాకు ఆయన జ్ఞాపకాలు మదిలో మెదలాడుతూనే ఉంటాయి. నా భార్య ప్రజాకవి కోగంటి గోపాలకృష్ణ గారి కుమార్తె సరళ. మా నాన్నగారి బాటలోనే నడుస్తున్నారు నా ఇద్దరు ఆడపిల్లలు అనుపమ, అనూరాధ. బాధ్యత అనుకున్నాను మధ్యాహ్నం భోజనం చేశాక మడత మంచం మీద పడుకుని, కాళ్లు నొక్కమనేవారు. చేతులు నొప్పిగా ఉన్నాయని చెబితే, ఎక్కి తొక్కమని, తొక్కించుకునేవారు. అదొక ఆనందం. ఆయన నిద్ర పోతున్నప్పుడు ఇత్తడి బిందె మీద మూత తీసినా ‘ఊ...’ అని గంభీరంగా అనేవారు. అందుకని మాకు దాహం వేసినా మంచినీళ్లు తాగేవాళ్లం కాదు. ఎప్పుడైనా అమ్మకి అలసటగా ఉండి పడుకుంటే, నేను మెలకువగా ఉండి, వడ్డించేవాడిని. ఆ తరవాత చదువుకునేవాడిని. అది నా బాధ్యత అనుకునేవాడిని. – మిక్కిలినేని విజయ్‌కుమార్ (మిక్కిలినేని కుమారుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ -
కీచకుడిగా మారిన ప్రజాప్రతినిధి
-
ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం ఈయనకే
సాక్షి, వెబ్‌డెస్క్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కి అత్యధిక శాలరీ ఇస్తున్న ఐటీ సంస్థగా హెచ్‌సీఎల్ రికార్డు సృష్టించింది. మిగిలిన ఐటీ సంస్థలను వెనక్కి నెట్టిన కంపెనీ తమ సీఈవో వియజ్‌కుమార్‌కి అత్యధిక వేతనం కట్టబెట్టింది. ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. సీఈవో విజయ్ కుమార్ నోయిడా కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తోన్న హెచ్‌సీఎల్ దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థకు 2016 అక్టోబరు నుంచి సీఈవోగా విజయ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివకుమార్‌నాడర్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎండీగా కూడా విజయ్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హయ్యస్ట్ శాలరీ ఇటీవల హెచ్‌సీఎల్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ కంపెనీ సీఈవో విజయ్ కుమార్ మూల వార్షిక వేతనాన్ని రెండు మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం వేతనం 4.38 మిలియన్ డాలర్లుకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ 32.54 కోట్లుగా ఉంది. వార్షిక వేతనంతో పాటు 31.50 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు సైతం కట్టబెట్టింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు 10.80 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ వేతనం రూ.80.19 కోట్లగా ఉంది. 2026 మార్చి వరకు ఆయన ఈ వేతనం పొందుతారు. విప్రోని దాటి ఐటీ కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు విప్రో సీఈవో థైరీ డెలాపోర్టే 8.8 మిలియన్ డాలర్ల వార్షిక వేతనమే హయ్యస్ట్. తాజాగా హెచ్‌సీఎల్ సీఈవో దీన్ని అధిగమించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం 6.78 మిలియన్ డాలర్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథ్ వేతనం 2.8 మిలియన్ డాలర్లుగా ఉంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) గటిక విజయ్‌కుమార్ బుధవారం రాజీనామా చేశారు. సీఎం పీఆర్వో పోస్టుతోపాటు ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టుకు కూడా ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. ఈ రాజీనామాలు తక్షణమే ఆమోదం పొందాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన విజయ్‌కుమార్.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతోనే కేసీఆర్ ఆగ్రహానికి గురైనట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేసినట్టు విజయ్‌కుమార్ బుధవారం ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. గొప్ప స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారుల్లో అసంతృప్తితో.. విజయ్‌కుమార్ కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో ఆధిపత్య ధోరణిలో వ్యవహరించేవారన్న ఆరోపణలున్నాయి. దీనిపై వారు చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గతంలో వివిధ న్యూస్ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్.. ఔట్ సోర్సింగ్ విధానంలో సీఎం పీఆర్వోగా నియమితుడై.. కొద్దికాలంలోనే కేసీఆర్‌కు దగ్గరయ్యారు. ప్రగతి భవన్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. విజయ్‌కుమార్ కోసమే ట్రాన్స్‌కో యాజమాన్యం మూడేళ్ల కింద జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టును సృష్టించి, ఆయనను ఎంపిక చేసింది. ఇలా ప్రాధాన్యత పెరిగిపోవడంతో విజయ్‌కుమార్ పలు వ్యవహారాల్లో కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళకు సంబంధించిన కుటుంబ తగాదా కేసులో విజయ్‌కుమార్ జోక్యం చేసుకుని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇసుక రీచ్‌ను సైతం తన వ్యక్తులకు ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీటికితోడు ప్రగతిభవన్ నుంచి రాజకీయ అంశాలపై కొందరికి లీకులు ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. వరంగల్ జిల్లాలో పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ నుంచి సీఎంకు నివేదిక అందినట్టు సమాచారం. ఈ ఆరోపణలతోనే రాజీనామా చేయాల్సి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ‘సాక్షి’వివరణ కోరగా విజయకుమార్ స్పందించలేదు. చదవండి: నెల రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీ -
‘126 ఎన్ఓసిలపై విచారణ జరుపుతున్నాం’
సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. రూరల్ మండలాల్లో తహశీల్దార్లు నుంచి 431 నివేదికలు కోరామని, వీటిలో 140 వరకు రిపోర్ట్స్ వచ్చాయన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ్‌కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 126 ఎన్ఓసిలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నాం. అదే విధంగా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా విచారిస్తున్నాం. ఎన్ఓసి విషయంలో ఉన్నతాధికారులు తప్పిదాలపై సిట్ నివేదికలో అన్ని అంశాలు పొందుపరుస్తాం. 22/A నిషేధిత భూముల విషయంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సిట్ కాలపరిమితి ఈనెల 28 వరకు ఉంది. ఈ మధ్యలో సిట్ మిడ్ టర్మ్, ఫ్రీ ఫైనల్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ -
ఎంపీ ఇంటిపై బాంబు దాడి..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ కుటుంబీకులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ నివాసం కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఉంది. ప్రతిరోజూ వేకువ జామున ఆయన ఇంటి నుంచి కారులో బయటకు వచ్చి, సమీపంలోని క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి వ్యూహ రచన చేశారు. (కీచక ఇన్స్పెక్టర్.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..) మంగళవారం ఉదయాన్నే ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు పేల లేదు. ఇంటివద్దకు వచ్చిన కారు డ్రైవర్ బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్ బృందం రంగంలోకి దిగింది. ఎంపీ ఇంట్లో ఉన్నట్టుగా ఆగుర్తుతెలియని వ్యక్తులు భావించినట్టున్నారు. సోమవారం ఎంపీ తన కారును ఇంటి వద్దే వదలి ఢిల్లీకి బయలు దేరి వెళ్లడంతో ఈ గండం నుంచి బయటపడ్డారు. ఒక వేళ ఆ బాంబు పేలి ఉన్న పక్షంలో కారు, ఆ పరిసరాలు కొన్ని మీటర్ల దూరం మేరకు దెబ్బతిని ఉండేది. ఆ బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. (చెన్నైకు‘నివర్’ ముప్పు!) -
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తాం. కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వివరించారు. (రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు) -
ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి..
బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ..కథ బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్డీసీ ఎన్.విజయ్‌కుమార్ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్ డైరెక్ట్ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు. వెహికిల్ అలవెన్స్‌లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దొర కోసం కోళ్లు పెంచాలి క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే. నెల్లూరు వెళ్లి బాత్రూమ్లు శుభ్రం చేయాల్సిందే అటెండర్‌గా పనిచేసే మురళికి డ్రైవింగ్ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్‌గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్మెంట్లో ఎవరైనా ప్లాట్ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్ క్లీన్ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్లు, బాత్రూమ్ షింక్‌లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్‌కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అవసరానికి మించి అక్కర లేని మందులు
-
ఈఎస్ఐ స్కామ్‌కు ఆయనే ‘డైరెక్టర్’?
రాజమహేంద్రవరం క్రైం : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ గాడి విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్‌ను ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ హాస్పిటల్లో రేడియాలజిస్ట్‌గా విధులలో చేరారు. ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.(అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడంతో లబ్ధి విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పనిచేశారు. రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్ సెంటర్‌కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సమయం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్ సెంటర్లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వినికిడి. జిల్లాలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్‌లకు, 11 ప్రైవేటు ప్యానల్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులకు ఇచ్చే మందులు, మెడకు వేసే నెక్ కాలర్, ఎముకలు విరిగిన సమయంలో కట్లు వేసేందుకు ఉపయోగించే పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కుంభకోణాలు వ్యతిరేకించే వారు ఒక వర్గంగాను, సమర్ధించేవారు మరో వర్గంగా విభేదాలు వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం జగన్ ఏడాది పాలన సందర్బంగా ప్రత్యేక సదస్సులు
-
కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్ : ఈ ఏడాది జనవరి నుంచి భద్రతాబలగాలు జరిపిన మొత్తం 27 ఆపరేషన్లలో 64 మంది ఉగ్రవాదులను ఏరివేశామని కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న మరో 25 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని చెప్పారు. గత ఆరునెలలుగా కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్ రియాజ్ నైకూ(32) కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన రియాజ్ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే బుధవారం హతమయిన విషయం తెలిసిందే. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, గత నెల రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్తోపాటూ మొత్తం 18మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని విజయవాడ మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 96 శాతం ఇళ్లను సర్వే చేశామని వెల్లడించారు. 1.43 కోట్ల ఇళ్లు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే పూర్తైందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి సర్వే చేశామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 2 వేల మందికి ఎక్కడా లేని విధంగా ఏఎన్ఎన్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్టు కేంద్రం జాబితా విడుదల చేసిందని ఆయన అన్నారు. కానీ వాలంటీర్లు, ఆశ వర్కర్ల సర్వేలో మరో ఆరు వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు తేలిందని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రజలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్)ను జయించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించాలి అన్నారు. యువతీ యువకులైనా, వ్యాధి నిరోధక శక్తి ఉన్నా, ఎవరైనా సరే ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండకూడదని ఆయన తెలిపారు. ఎవరి నుంచైనా కోవిడ్-19 సంక్రమించవచ్చని జవహర్‌రెడ్డి సూచించారు. -
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్‌కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్‌కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్‌కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్‌కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్‌ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్‌కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్‌లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్‌కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్‌కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్‌కుమార్, రంగస్థల నటుడు -
ఆంధ్ర ఘనవిజయం
సాక్షి, ఒంగోలు: తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఈ రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర క్రికెట్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 74.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటై ఓడి పోయింది. ఆంధ్ర పేస్ బౌలర్ పైడికాల్వ విజయ్ కుమార్ కేవలం 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి హైదరాబాద్‌ను హడలెత్తించాడు. మరో ఇద్దరు పేసర్లు యెర్రా పృథీ్వరాజ్ (3/53), శశికాంత్ (2/25) కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాద్ జట్టులో టి.రవితేజ (144 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటవ్వగా... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 489 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. విజయ్ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇన్నింగ్స్ విజయం సాధించినందుకు ఆంధ్రకు బోనస్‌తో కలిపి ఏడు పాయింట్లు వచ్చాయి. దాంతో 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌లో ఆంధ్ర ప్రస్తుతం 21 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. పంజాబ్ (18 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... విదర్భ, కర్ణాటక 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. లీగ్ దశ ముగిశాక ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌లో టాప్–5లో ఉన్న జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 27 నుంచి కేరళతో ఆడుతుంది. విజయ్ వీడ్కోలు... ఈ మ్యాచ్‌తో ఆంధ్ర సీనియర్ పేస్ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విజయ్... హైదరాబాద్‌తో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెరీర్లో 71 రంజీ మ్యాచ్‌లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిశాక విజయ్ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధికారులు సన్మానించారు. సహచరులు బ్యాట్లు ఎత్తి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు. -
'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్'
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు మొదటి నుంచి ఉద్యోగులంటే చులకన భావం అని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రెస్టేషన్లో ఉన్న చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. విజయ్‌కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి ఏసీబీతో ఉద్యోగ సంఘాల నేతలను సీఎం బెదిరిస్తున్నారని దేవినేని ఉమా అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులను బెదిరించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని ఇంటికి పిలిపించి పోటీ చేయొద్దని బెదిరించిన చిల్లర మనిషి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారుల మీద దాడి జరిగితే దాడి చేసిన వారిని వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. భగ్గుమన్న దళిత సంఘాలు: చంద్రబాబు వ్యాఖ్యలపై కాకినాడలో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు కుల అహంకారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. చంద్రబాబు వ్యాఖ్యలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బత్తు భీమారావు, ఎం డేవిడ్, ప్రసాద్, శ్రీను పాల్గొన్నారు. చదవండి: ఇవేం మాటలు బాబూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్దం చేయడానికి యత్నం ఒక దళిత ఐఏఎస్ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి ఎస్సీ కుల సంఘాలు ప్రయత్నించాయి. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విజయకుమార్‌ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా! -
అందుకే వస్తోంది.. ఆస్తమా..
సాక్షి, హైదరాబాద్ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్ పొల్యూషన్ (దుప్పట్లు, తలదిండ్లు, పర్ఫ్యూమ్లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్ విజయ్‌కుమార్ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు. ఇంటా బయటా తంటానే.. ►గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. ►40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. ►సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్‌తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. ►ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. ► పోతపాలు, జంక్‌ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. ►ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్ పొల్యూషన్ (మస్కిటో కాయిల్స్, పర్ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఇన్హేలర్తో ఉపశమనం – డాక్టర్ విజయ్‌కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్లైజర్తో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్‌గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు. ఆస్తమా లక్షణాలివీ.. తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటికి దూరంగా ఉండాలి.. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం.. -
నేటి నుంచి ‘సచివాలయ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సచివాలయ పోస్టుల భర్తీకి చకచకా అడుగులు పడుతున్నాయి. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచగా.. నేటి నుంచి (మంగళవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టుగా మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎస్సీ (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుందని తెలిపారు. కేటగిరీల వారీగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు అర్హత, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్, క్రిమీలేయర్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సర్టిఫికెట్లన్నింటినీ డీఎస్సీ వెరిఫికేషన్ చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టులు పూర్తి చేశామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తవ్వగానే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు నిబంధన ప్రకారం పనిచేసిన ఏఎన్ఎంలకు సచివాలయ పోస్టుల్లో దక్కాల్సిన వెయిటేజీపై ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. వెయిటేజీ ఇవ్వని వారి సర్టిఫికెట్లను సంబంధిత డీఎంఅండ్‌హెచ్‌ఓ(జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి) ఆఫీసులో మంగళవారం అంజేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత వెయిటేజీ ఇస్తారని ఆయన తెలియజేశారు. సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మంగళశారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... ఆంధ్ర లయోలా కాలేజీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని 11,025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ రెండు రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. అయిదు శాఖలకు సంబంధించి అర్హత సాధించిన వారికి నేడు సర్టిఫికెట్స్ పరిశీలన చేపడుతారని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఇంతియాజ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకుగానూ తొలి రోజు 250 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. అక్టోబర్ రెండవ తేదీ కల్లా అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంతియాజ్ అన్నారు. అనంతపురం: సచివాలయ ఉద్యోగాల భర్తీ సజావుగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కాల్‌లెటర్స్ అందినవారంతా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్స్ అందనివారికి త్వరలోనే పంపుతామని స్పష్టం చేశారు. ఇక జిల్లావ్యాప్తంగా 8545 పోస్టులు మంజూరయ్యాని ఆయన పేర్కొన్నారు. -
'సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం’
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం చేశామని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్‌ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. -
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. (చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు) పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. 20లోగా ఫలితాలు : గిరిజా శంకర్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్‌కుమార్ అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. 25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్‌గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు. -
కశ్మీర్ ఎల్జీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ్ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్ గుర్తింపు పొందనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రం తరఫున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్ వ్యవహారాలను గవర్నర్ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ఆయన నియమకానికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుత్తున్నాయి. ఎవరీ విజయ్!? విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను 2004 అక్టోబర్‌లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వీరప్పన్‌ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ట్రాక్ రికార్డ్!! హైదరాబాద్ నగరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజీ, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. అందుకే ఇంతటి రికార్డ్ ఉన్న విజయ్ను కశ్మీర్‌కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఇదిలావుండగా.. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మిత్రుడు కావడంతో నరసింహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా నరసింహన్ కాకుండా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. -
బ్యాగు మోతకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై విద్యా శాఖ ఆలోచనలు మొదలు పెట్టింది. గతంలోనే బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. గతంలోనే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల బ్యాగు బరువుపై అధ్యయనం చేసిన విద్యా శాఖ బ్యాగు బరువు కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నారని గుర్తించింది. వారు మోస్తున్న బ్యాగు బరువు అంచనా వేసి, తరగతులవారీగా ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉండాలి.. ఎన్నినోటు పుస్తకాలు ఉండాలి.. బ్యాగు బరువెంత ఉండాలన్న అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటి అమలు పక్కాగా జరగలేదు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ బ్యాగు బరువు తగ్గించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాగు బరువు తగ్గింపుపై పాఠశాల విద్య కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పే ధోరణితో ముందుకు సాగాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. వీలైతే అంతకంటే ముందే విద్యా శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేసి పలు స్కూళ్లలో ఉన్న ఏర్పాట్లు, బ్యాగు బరువుపై మరోసారి పరిశీలన జరపాలని యోచిస్తున్నారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ఒక్కొక్కటిగా నిబంధనలు అమల్లోకి తేనున్నారు. విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించనున్నారు. తద్వారా విద్యార్థులపై బ్యాగు బరువు సగం వరకు తగ్గించొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. స్టేట్ సిలబస్ అమలుపైనా దృష్టి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్టేట్ సిలబస్ పుస్తకాలే వినియోగించేలా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతోంది. విద్యా శాఖ నిర్దేశిత సిలబస్ ఉన్న సేల్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండట్లేదని, అందుకే తాము ప్రైవేటు సిలబస్ పుస్తకాలను వినియోగిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖకు తెలియజేశాయి. దీంతో ముందుగా మార్కెట్లో విక్రయించే పాఠ్య పుస్తకాల ముద్రణను పక్కాగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లు నిర్ణీత పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం అనుమతి తీసుకొని, వాటికి విద్యా శాఖకు రాయల్టీ చెల్లిస్తున్నా, నిర్ణీత పుస్తకాలు ముద్రించడం లేదన్న ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సేల్ పుస్తకాల ముద్రణను పక్కాగా చేసేలా, ఆయా పుస్తకాలకు సీరియల్ నంబర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచి పాఠశాలలు వాటిని అమలు చేసేలా చూసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్య సంఘంతో (ట్రస్మా) చర్చించారు. వారు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు కచ్చితంగా పాఠశాల విద్యా శాఖ నిర్దేశిత పుస్తకాలనే వినియోగిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదే విధానం కొనసాగించడం ద్వారా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగం తగ్గించి, విద్యా ర్థుల బ్యాగు బరువును నియంత్రించొచ్చని భావిస్తోంది. ఆర్థిక భారం లేని చర్యలపై దృష్టి బ్యాగు బరువు తగ్గింపులో భాగంగా ముం దుగా ఆర్థిక భారం లేని అంశాలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది పాఠశాలల్లో ఏ రోజు ఏ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకురావాలో ముందే చెప్పడం, బ్యాగు బరువును సమానంగా పంచేలా వెడల్పాటి పట్టీలు కలిగిన బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించడం వంటి చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా ర్యాక్‌లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై పాఠశాలల యాజమాన్యాలను ఒప్పించాలని భావిస్తోంది. -
టెన్త్ ఫలితాల విడుదల ఆలస్యం
హైదరాబాద్: టెన్త్ ఫలితాల విడుదల కాస్త ఆలస్యం అవుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయకుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. టెన్త్ ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ లాగిన్లతో విద్యార్థుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రేడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఏ సబ్జెక్లోనైనా సున్నా వస్తే.. రీ చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని చెప్పారు. ఐదు అంచెలుగా పేపర్ చెక్ చేసి ఫైనల్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆలస్యం ఐనా పక్కాగా ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పేపర్ వాలువేషన్ పూర్తి అయింది.. కానీ రీచెక్ చేస్తున్నాం.. అందుకే ఫలితాల విడుదల ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల విషయంలో పెద్ద గందరగోళం నెలకొనడంతో టెన్త్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తపడుతున్నట్లుగా కనపడుతోంది. -
మాజీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, బెంగళూరు : బీదర్ జిల్లా భాల్కి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ కుమార్ ఖండ్రే(60) కన్నుమూశారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే పెద్ద అన్న అయిన విజయ్ కుమార్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆ ప్రశంసను మరచిపోలేను
‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్‌గారిలా చేస్తానని ఎవరో రామ్‌గోపాల్ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్ పంపించి ఎన్టీఆర్‌గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్‌గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్‌కుమార్. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్ కుమార్ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటించిన విజయ్ కుమార్ (ఎన్టీఆర్), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్ (బాబు) హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్‌గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వందలకొద్దీ కళా పరిషత్‌లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఎన్టీఆర్‌గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్ స్టార్ట్ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్ రాలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా. వరుసగా బయోపిక్ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్‌గా ఉంది. నేను రెగ్యులర్ యాక్టర్‌గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్ నుంచి ఇర్ఫాన్‌ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్‌ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు. యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చేశా. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్. కథ చాలా సెన్సిటివ్. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్ని పెట్టుకుని డైలాగ్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్ పాల్గొన్నారు. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ సంగీతం : కల్యాణీ మాలిక్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఈ సినిమానేనా..? కథ : లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు రావ్ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ. నటీనటులు : ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్ కుమార్‌ను ఎన్టీఆర్ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్ కుమార్ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎన్టీఆర్, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనాలు ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సూర్య నిర్మాతగా ఉరియడి 2
ఉరియడి–2 చిత్రం మిమ్మల్ని సంతోషపరచకపోవచ్చునేమో గానీ కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని ఆ చిత్ర నిర్మాత నటుడు సూర్య అన్నారు. వర్ధమాన నటుడు, దర్శకుడు విజయకుమార్ చేసిన తొలి ప్రయత్నం ఉరియడి. ఆ చిత్రం మంచి విమర్శనలతో పాటు, కమర్శియల్‌గానూ హిట్ అయి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో దానికి సీక్వెల్‌గా ఉరియడి–2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోనూ తనే కథానాయకుడిగా నటించారు. నిర్మాణ బాధ్యతలను మాత్రం నటుడు సూర్య చేపట్టారు. ఆయన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్వసంత సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఆవిష్కరించిన నటుడు సూర్య మాట్లాడుతూ ఉరియడి చిత్రం విడుదలై నాలుగైదేళ్లు కావస్తున్నా విజయకుమార్ తదుపరి చిత్రం ఇంత వరకూ తెరపైకి రాకపోవడానికి కారణం ఏమటనే ప్రశ్న తలెత్తవచ్చునన్నారు. తను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ రంగంలోకి వచ్చి విజయం సాధించారని అన్నారు. అందుకు కారణం ఆయనలోని నిజాయితీ అని పేర్కొన్నారు. ఈ ఉరియడి 2 చిత్రం కూడా విజయకుమార్ నిజాయితీగా తీసిన కథా చిత్రం అని అన్నారు. చిత్రంలోనూ తను వాస్తవాలనే చర్చించారని చెప్పారు. అలాంటి చిత్రానికి తాను నిర్మాత కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఎవరినీ సంతోషపరచకపోయినా, కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని సూర్య చెప్పారు. దీనికి ఆనంద్వసంత సంగీతాన్ని అందించారని, ఇందులో ఆయన రెండు పాటలను కూడా పాడడం విశేషం అన్నారు. ఇకపైకూడా ఆయన పనయనం తమ సంస్థలో కొనసాగుతుందని అన్నారు. ఉరియడి–2 చిత్రం సమకాలీన రాజకీయాలను చర్చించే కథాంశంతో కూడినదిగా తెలుస్తోంది. సమాజంలో సామాజిక న్యాయం మరుగున పడినప్పుడు అన్ని అవకతవకలు జరుగుతాయని, మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని, హక్కుల కోసం పోరాడడం మన బాధ్యత. రాజకీయాల్లో మన ప్రమేయం ఉండాలని, లేకుంటే రాజకీయాలు తమ జీవితంలో తలదూరుస్తాయని చెప్పే చిత్రంగా ఉరియడి–2 చిత్రం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రాన్ని మే 5న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
బాబు ఓడితేనే భవిత
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలు అబద్ధానికి..నిబద్ధతకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన జరిగిన గత ఎన్నికల్లో కేవలం సీనియర్ అని మాత్రమే చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఆ విలువ నిలుపుకోలేకపోయారు. ఐదేళ్లలో చంద్రబాబు కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడే తప్ప ఉత్తరాంధ్రకి కాదు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఉత్తరాంధ్రను కాపాడుకుంటామని సామాజిక శాస్త్రవేత్త, ఏయూ సోషయాలజీ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షి: సంక్షేమ పథకాలతో ఓటర్లను చంద్రబాబు మభ్యపెడుతున్నారా..? విజయ్‌కుమార్ : ఔను. ఐదేళ్ల పాటు గుర్తు రాని సంక్షేమ పథకాలు ఎన్నికలు రెండు నెలలుండగా ఎందుకు గుర్తొస్తున్నాయి. అంటే ప్రజలు పట్టించుకోరనే ఆలోచనలో ఈ రాజకీయనాయకులున్నారు. పవిత్రమైన ‘పసుపు–కుంకుమ’ పేరుతో ఎన్నికలకు ముందు మహిళలకు గాలం వేస్తున్నారు. సాక్షి: ఉత్తరాంధ్ర వాసులను మోసం చేస్తున్నారనుకుంటున్నారా..? విజయ్‌కుమార్ : శాఖపట్నం దేశంలోనే అద్భుతమైన నగరం. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ నిర్వహించి..ఆ ఇమేజ్‌తో విదేశీ పెట్టుబడులను అమరావతికి తరలించుకుపోతున్నారు. విశాఖలో పాలు తాగి విషం చిమ్మి తన నైజాన్ని చంద్రబాబు చాటుకుంటున్నాడు. సాక్షి: రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలనుకుంటున్నారు.? విజయ్‌కుమార్ : నిస్వార్థ సేవకుడు, మాట తప్పని నాయకుడు కావాలి. సాక్షి: రాజధాని ఎంపికలో విశాఖకు అన్యాయం జరిగిందంటారా..? వంద శాతం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ సంస్థలన్నీ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలివచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖకు రావల్సిన కార్పొరేట్ సంస్థలన్నీ విజయవాడ, తిరుపతి, చిత్తూరు, గుంటూరు నగరాలకు తరలించుకుపోయారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ వస్తే అప్పుడు నష్టపోయిన ప్రజలకు సహాయం చేయలేదు కానీ..దాన్ని బూచిగా చూపి రాజధానికి విజయవాడ అనుకూలమని చంద్రబాబు ప్రజలను నమ్మించాడు. సాక్షి: తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్టు ఏపీ ప్రజలూ సిద్ధంగా ఉన్నారా...? విజయ్‌కుమార్ : తెలంగాణ ప్రజలు చంద్రబాబు కుతంత్ర రాజకీయాలను ముందుగానే పసికట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు అసలు నైజాన్ని తెలుసుకున్నారు. కచ్చితంగా టీడీపీకి ఈ ఎన్నికలు బుద్ధి చెబుతాయి. సాక్షి: పవన్ కల్యాణ్ గురించి..? పవన్ చెప్పిన మాట వేరు. చేస్తోంది వేరు. విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణను పోటీ చేయించకూడదు. గతేడాది జూన్ 28న ఇదే పవన్‌కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ వ్యాపారం కోసం వలసదారులు ఉత్తరాంధ్రలో చొరబడి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన చేస్తోంది ఏంటీ?. సాక్షి: ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణం? విజయ్‌కుమార్ : ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ నాయకులను ఎదగనివ్వకపోవడం మొదటి కారణం. వలసలు వచ్చి ఉత్తరాంధ్రలో గెలిచి వారి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థపై ఆలోచించిన నాయకుడే కరువయ్యాడు. ఉత్తరాంధ్రలో విద్యా పరిశోధకలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి మేదస్సు మూడో తరగతి చదివే విద్యార్థి సామర్థ్యానికి సమానంగా ఉందని సర్వేల్లో వెల్లడించారు. ఇదంతా డొల్ల విద్యా విధానాలకు ప్రతీక. -
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్‌లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్‌గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్‌గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్‌గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్‌లైట్‌లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్‌గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్‌స్టార్‌కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్‌కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్‌లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్‌ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్‌రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్‌గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్‌గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్‌ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్‌గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్‌లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్‌గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్‌గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్‌లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్‌గా కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
సూర్య పూర్తి స్వేచ్ఛనిచ్చారు
సూర్య తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఉరియడి–2 చిత్ర దర్శక, నటుడు విజయ్‌కుమార్ అంటున్నారు. ఈయన ఇంతకు ముందు ఉరియడి చిత్రాన్ని లోబడ్జెట్‌లో తెరకెక్కించి మంచి ప్రశంసలను అందుకున్నారు. తాజాగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమే ఉరియడి–2. ఈ చిత్రం గురించి విజయ్‌కమార్ తెలుపుతూ ఉరియడి చిత్రంలో చర్చించిన జాతి, మత రాజకీయాలనే ఉరియడి–2లో మరింత బలంగా చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కుల, మతాలే పెద్ద సమస్యలన్నారు. వాటిని చర్చించేదే ఉరియడి–2 చిత్రం అని చెప్పారు. తనకు కమ్యూనిస్ట్‌ల భావజాలమో, పుస్తకాలు చదివే అలవాటో లేదన్నారు. తనకు నచ్చింది సినిమా అని అన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా చేయడమే తనలోని ప్రతిభకు తాను ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు. రంగంలోకి దిగి తాను ప్రజలకు చేసిందేమీ లేదని, అయితే వారిని చేరడానికి అనువైన మార్గం సినిమా అని అన్నారు. ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్, ఫర్ అజ్ సినిమా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని లెనిన్ చెప్పారన్నారు. అదేవిధంగా కళల్లో సినిమా ప్రధానం అని ఒక కళాకారుడు అన్నారన్నారు. కాగా తప్పో ఒప్పో తనకు సరైనదనిపించింది సినిమా ద్వారా చెప్పాలనుకున్నాన్నారు. అదే సమయంలో తనలోని కళాకారుడిని అది తృప్తి పరచాలన్నారు. ఉరియడి–2 చిత్రాన్ని నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకాంపై నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇక రోజు ఆ సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్‌ను కలిసి ఈ చిత్ర కథ గురించి చెప్పానన్నారు.ఆయనకు కథ నచ్చడంతో పూర్తి కథను చెప్పానన్నారు. ఆ తరువాత నటుడు సూర్యకు కథ చెప్పానన్నారు. పూర్తి వెర్షన్ విన్న తరువాత ఆయన కొన్ని సందేహాలను అడిగారని, వాటిని వివరించడంతో బాగుంది కచ్చితంగా చిత్రం చేద్దాం అని అన్నారన్నారు. దీంతో తనకు చాలా నమ్మకం కలిగిందని చెప్పారు. కారణం ఉరియడి చిత్ర నిర్మాణం సమయంలో ఆర్థిక సమస్యల కంటే మానసికంగా చాలా బాధింపునకు గురైయ్యానని అన్నారు. అలాంటిది ఉరియడి–2 చిత్రానికి సూర్య లాంటి నిర్మాత లభించడం చాలా మనశ్శాంతిగా ఉందన్నారు. ఆయన తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఎలాంటి ఒత్తిడి లేకుండా చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు. దీనికి గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తుండగా, ఉరియడి చిత్ర యూనిట్నే ఈ చిత్రానికి పని చేస్తోందని చెప్పారు. -
ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లోని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మ«ధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్ హాలిడేస్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్ 1న ప్రారంభం కానున్నాయి. -
మూసిన తలుపులు
ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించాడు. అదొక పడకగది. అందులోని సామాన్లన్నీ పొందికగానే ఉన్నాయి. గది మధ్యలోని మంచంపై ఇంటి యజమాని చలపతిరావు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. కాని ఆయన నిద్రపోవడం లేదు. శాశ్వత నిద్రలో ఉన్నాడు. చలపతిరావుకి డెబ్బయ్యేళ్లు ఉంటాయి. నగరంలో ఆయనకు రెండు రెడీమేడ్ బట్టల షాపులు ఉన్నాయి. నగర శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఆయన స్వార్జితం.చలపతిరావు భార్య రెండేళ్ల కిందటే క్యాన్సర్‌తో చనిపోయింది. భార్య పోయాక ఆయన తన రెండు షాపుల్నీ ఇద్దరు కొడుకులకు అప్పగించి, తాను ఇంటికే పరిమితమయ్యాడు. పెద్దకొడుకు రాజేష్‌కి ఐదేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్‌కి తాగుడు అలవాటు ఉంది. ఇదే విషయమై తండ్రీ కొడుకుల మధ్య నెల్లాళ్ల కిందట పెద్ద గొడవే జరిగింది. రాజేష్ తండ్రి మీద అలిగి, ఇల్లు వదిలేసి భార్యాపిల్లలతో అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు రమేష్‌కి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తండ్రికి తోడుగా అతనొక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఏడుగంటలకు చలపతిరావు ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి, చలపతిరావు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పడంతో ఇన్స్పెక్టర్ విజయ్ సిబ్బందితో సహా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తుండగా, ఓ మూల కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్న రమేష్‌ని ఇన్స్పెక్టర్ విజయ్ పలకరించాడు. ఏం జరిగిందో చెప్పమన్నాడు. ‘‘సార్! నిన్న రాత్రి పనిమనిషి వంట చేసి వెళ్లిపోయాక నేను, నాన్నగారు భోజనాలు చేశాం. నాన్నగారు పది గంటలకల్లా తన గదిలోకి వెళ్లి పడుకున్నారు. నేనొక అరగంట టీవీ చూసి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. తెల్లవారాక పనిమనిషి వచ్చి కాలింగ్ బెల్ కొడితే నేను లేచి వెళ్లి తలుపు తెరిచాను. నిజానికి రోజూ నాన్నగారే తలుపు తెరిచేవారు. ఆయన ఎందుకు లేవలేదో చూడ్డానికి నేను ఆయన గదిలోకి వెళ్లాను. నాన్నగారిని ఎంత లేపినా లేవలేదు. నేను ఆందోళన చెంది మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేశాను. ఆయన వచ్చి పరీక్షించి, నాన్నగారు పోయారన్నారు. తర్వాత ఆయనే ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచారు. ’’ అన్నాడు రమేష్.అక్కడే ఉన్న డాక్టర్, పనిమనిషి రమేష్ మాటల్ని సమర్థించారు. ‘‘మృతుని శరీరం కొద్దిగా రంగు మారింది. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానంతో నేను మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు డాక్టర్. విజయ్‌కి ఒక విషయం అర్థం కాలేదు. ఇంటి ముఖద్వారానికీ, పెరటి వాకిలికీ లోపలి నుంచి గొళ్లెం వేసి ఉంది. అలాంటప్పుడు హంతకుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? హత్య చేసి బయటకు ఎలా వెళ్లాడు? అసలిది హత్య కాదేమో! చలపతిరావు గుండెపోటు వల్ల మరణించి ఉంటాడేమో అనుకున్నాడు. తండ్రి మరణవార్త తెలియగానే చలపతిరావు పెద్దకొడుకు రాజేష్ తన భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. తండ్రి శవం పక్కన కూర్చుని భోరున ఏడవసాగాడు. తర్వాత తమ్ముడు రమేష్‌ని చూడగానే కోపంగా లేచాడు. ‘‘ఈ దుర్మార్గుడే నా తండ్రిని చంపాడు. వీడు నా సొంత తమ్ముడు కాదు. వీడొక అనాథ. నాన్నగారు జాలిపడి వీణ్ణి దత్తత తీసుకున్నారు. పెంచిన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. వీణ్ణి ప్రాణాలతో వదలను’’ అంటూ రాజేష్ రమేష్‌ని కొట్టబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని రాజేష్‌ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులు శవాన్ని పరీక్షించడం ముగించి, విషప్రయోగం వల్ల చలపతిరావు మరణించాడని ధ్రువీకరించారు. ఇన్స్పెక్టర్ విజయ్ ఇల్లంతా గాలించాడు. స్టోర్‌రూమ్‌లో ఒక క్లోరోఫాం బాటిల్‌తో పాటు దూది, విషం సీసా, వాడిన సిరంజీ దొరికాయి. హత్య ఎలా జరిగిందో విజయ్‌కి బోధపడింది. హంతకుడెవరో అర్థమైంది. వెంటనే రమేష్‌ని అదుపులోకి తీసుకున్నాడు.∙∙ పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య రాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. ముందుగా క్లోరోఫాంతో స్పృహ తప్పించి, తర్వాత సిరంజ్‌తో విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడం వల్ల మరణం సంభవించింది. సంఘటనా స్థలంతో పాటు ఇంట్లోని మిగతా చోట్ల చలపతిరావు, రమేష్, పనిమనిషి వేలిముద్రలు తప్ప ఇంకెవరి వేలిముద్రలూ లభించలేదు. మరోపక్క ఇన్స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్లో రమేష్ నిజంగానే చలపతిరావు దత్తపుత్రుడని తెలిసింది. ఒకప్పుడు రమేష్ తల్లిదండ్రులు చలపతిరావు ఇంట్లో పనిచేసేవారు. రమేష్ చిన్నతనంలో వారిద్దరూ కరెంట్ షాక్ వల్ల మరణించారు. అనాథగా మిగిలిన రమేష్‌ని చలపతిరావు దత్తత తీసుకున్నాడు. తన సొంత కొడుకు రాజేష్‌తో సమానంగా రమేష్‌ని చదివించాడు. తన భార్య పోయాక తనకు ఉన్న ఆస్తుల్ని ఇద్దరికీ చెరిసగం చెందేట్లు వీలునామా రాశాడు. ఇన్స్పెక్టర్ విజయ్ రమేష్‌పై ఎంత బలప్రయోగం చేసినా అతడు నేరాన్ని అంగీకరించలేదు. ‘‘నాలాంటి అనాథకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడులాంటి మనిషిని నేనెందుకు చంపుతాను సార్! పైగా హత్య చేశాక అంత నిర్లక్ష్యంగా ఆధారాలు వదులుతానా?’’ అని వాదించాడు. విజయ్‌కి రమేష్ మాటల్లో నిజాయతీ కనిపించింది. ఎక్కడో పొరపాటు జరిగింది. మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుని మళ్లీ చలపతిరావు ఇంటికి వెళ్లాడు. ఇల్లంతా పరిశీలించాక పెరటి వాకిలి దగ్గరకొచ్చాడు. ఆ వాకిలి పక్కన ఒక పెద్ద కిటికీ ఉంది. పెరట్లోకి వెళ్లి ఆ కిటికీని పరిశీలించాడు. కిటికీకి ఉన్న చెక్కల ఫ్రేమ్ మధ్య మెటల్ గ్రిల్ బిగించి ఉంది. ఆ గ్రిల్‌కి నాలుగు మూలల్లో నాలుగు బోల్టులు ఉన్నాయి. విజయ్ కానిస్టేబుల్ చేత స్పానర్ తెప్పించి ఆ బోల్టుల్ని విప్పించాడు. బోల్టులు విప్పగానే గ్రిల్ మొత్తం కిటికీ ఫ్రేమ్ నుంచి వేరయిపోయింది. ఇప్పుడా ఫ్రేమ్ మధ్యలోంచి ఒక మనిషి సునాయాసంగా లోపలికి దూరవచ్చు. హంతకుడు ఇంట్లోకి ఎలా దూరాడో విజయ్‌కి ఇప్పుడు బోధపడింది. హంతకుడు ఎవరో కూడా తెలిసిపోయింది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే రాజేష్‌ని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దెబ్బలకు తాళలేక రాజేష్ నిజం కక్కేశాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి రమేష్ అంటే ద్వేషం. వాడు పెంపుడు కొడుకు అయినా నాన్న వాణ్ణి నాతో సమానంగా ప్రేమించేవాడు. చివరికి తన ఆస్తిపాస్తుల్లో సగం వాడికి చెందేలా వీలునామా రాశాడు. దాంతో నాకు రమేష్‌ని చంపాలన్నంత కోపం వచ్చింది. రమేష్‌ని చంపితే ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. కానీ వాణ్ణి చంపితే పోలీసులు ముందు నన్నే అనుమానిస్తారు. అందుకే నాన్నని చంపేసి ఆ నేరం రమేష్ మీదపడేలా పథకం పన్నాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రమేష్ హత్యానేరంపై జైలుకెళితే నా పగ చల్లారుతుంది. ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. అందుకే పథకం ప్రకారం విషప్రయోగంతో నాన్నని చంపేశాను. నిజానికి మా ఇంటి వెనుక కిటికీ గ్రిల్‌ని నేను చాలా కాలం కిందటే బోల్టులతో విప్పడానికి అనువుగా మార్పించాను. నేను తాగి ఆలస్యంగా ఇంటికెళ్లినప్పుడు నాన్న నన్ను చెడామడా తిట్టేవాడు. ఆ బాధ పడలేక ఆ కిటికీని అలా మార్పించి, రాత్రిళ్లు రహస్యంగా కిటికీ తెరిచి, ఇంట్లోకి వచ్చేవాణ్ణి. ఈ రహస్యం నా భార్యకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రోజు రాత్రి ఆ కిటికీలోంచే ఇంట్లోకెళ్లి క్లోరోఫాంతో నాన్నకు స్పృహ తప్పించి, ఆయనకు విషాన్ని ఇంజెక్ట్ చేశాను. తర్వాత విషం సీసా, సిరంజిని స్టోర్‌రూమ్‌లో ఉంచి, వచ్చిన దారిలోనే వెళ్లిపోయాను. నా చేతులకు గ్లౌజ్ ఉండటం వల్ల ఎక్కడా నా వేలిముద్రలు పడలేదు. మూసిన తలుపుల వెనుక జరిగిన ఈ హత్యా రహస్యాన్ని పోలీసులు ఎన్నటికీ ఛేదించలేరనుకున్నాను. కానీ మీరు ఆ రహస్యం తెలుసుకున్నారు’’ నిరాశగా అన్నాడు రాజేష్? -
స్నేహితున్ని చంపి.. పూలతొట్టెలో పాతి..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రెండేళ్ల మిస్టరీ వీడింది. అనుమానమే పెనుభూతమై స్నేహాన్ని అంతం చేసింది. బంధువని కూడా చూడకుండా ఓ వ్యక్తిని చంపేసింది. మెదక్‌కు చెందిన జయప్రకాశ్(27), విజయ్‌కుమార్(30) సమీపబంధువులు, స్నేహితులు. బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి ఓ అద్దె ఇంట్లో నివసించారు. అపార్థంతో జయప్రకాశ్‌పై కక్షకట్టిన విజయ్ మూడేళ్ల క్రితం అతడిని అంతం చేశాడు. మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. యాదృచ్ఛికంగా జయప్రకాశ్ అస్థిపంజరం బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం విజయ్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి... జయప్రకాశ్, విజయ్‌కుమార్ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్ అనే వ్యక్తికి చెందిన అపార్ట్మెంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు పొందారు. విజయ్ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్ ఆమెతో ఫోన్ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్‌ను అంతం చేయడానికి పథకం వేశాడు. మరమ్మతుల నేపథ్యంలో వెలుగులోకి... జయప్రకాశ్, విజయ్‌లు నివసించిన తర్వాత ఆ గదిలో మరికొందరు అద్దెకు ఉండి వెళ్లారు. అధ్వానంగా మారడంతో గత ఏడాది అక్టోబర్ 8న ఆ గదికి యజమాని మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగా పూలకుండీల తొట్టెను కూలీలు తొలగిస్తుండగా ఓ అíస్థిపంజరం బయటపడింది. యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు గత ఏడాది అక్టోబర్ 9న హత్య కేసు నమోదైంది. అస్థిపంజరం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన పోలీసులు మెదక్ నుంచి జయప్రకాశ్ కుటుంబీకుల్ని రప్పించి నమూనాలు తీసుకున్నారు. ఒకటేనంటూ నివేదిక రావడంతో... డీఎన్ఏ నమూనాలనూ విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ అస్థిపంజరం జయప్రకాశ్‌దేనంటూ ఇటీవల నిర్ధారించారు. దీంతో ఈ కేసులో విజయ్ను ప్రధాన అనుమానితుడిగా చేర్చిన ఢిల్లీ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి, వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణ నేపథ్యంలో హత్యకు కారణాలను బయటపెట్టాడు. చంపేసిన తర్వాత తానే ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్ సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి పారేశానని, ఆపైనా పదేపదే అతడి సెల్‌ఫోన్‌కు కాల్స్ చేయడం, ఎస్సెమ్మెస్‌లు పెట్టానని చెప్పాడు. వాటికి స్పందించట్లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. ఫ్యాన్ మోటార్‌తో కొట్టి హత్య... అదను కోసం ఎదురు చూసిన విజయ్ 2016 ఫిబ్రవరి 12న తన పథకాన్ని అమలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్‌తో వాగ్వాదానికి దిగి తమ గదిలో ఉన్న ఫ్యాన్ మోటారు భాగంతో తలపై మోది హత్య చేశాడు. మూడో అంతస్తు బాల్కనీలో ఓ తొట్టె లాంటిది నిర్మించి శవాన్ని అందులో పూడ్చేశాడు. అదేరోజు స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి జయప్రకాశ్ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పిన విజయ్ కొన్నిరోజులకు ఢిల్లీ వదిలి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
నటి వనిత మళ్లీ అరెస్ట్
చెన్నై, పెరంబూరు: తండ్రి విజయకుమార్ ఫిర్యాదు మేరకు ఆయన కూతురు, నటి వనితను శుక్రవారం మధురవాయిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీనియర్ నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని ఆయన షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. అలా విజయకుమార్ కూతురు, నటి వనిత ఆ మధ్య షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరి.. తరువాత ఆ ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో విజయకుమార్ వనితను ఇల్లు కాళీ చేయించాలని మధురవాయిల్ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు. అయితే వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి పరారైంది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెను ఇంట్లో ఉండడాన్ని ఎవరూ అడ్డుకోరాదని, అవసరమైతే పోలీసులు వనితకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనిత గురువారం విజయకుమార్ ఇంట్లో చేరింది. శుక్రవారం నటుడు విజయకుమార్ మళ్లీ మధురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఆమెను తన ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. -
తండ్రి ఇంటికి చేరిన నటి
తమిళనాడు, పెరంబూరు: సంచలన నటి వనిత మరోసారి తన తండ్రి ఇంటికి చేరింది. ఇంతకు ముందు షూటింగ్ కోసం వచ్చి ఇంటిని ఆక్రమించుకోజూసిన ఈమె ఈ సారి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తన న్యాయవాదితో కలిసి తండ్రి ఇంటిలో పాగా వేసింది. వివరాలు చూస్తే సీనియర్ నటుడు విజయకుమార్ రెండో భార్య నటి మంజుల ముగ్గురు కూతుర్లలో ఒకరు నటి వనిత. నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో భవంతి ఉంది. దాన్ని ఆయన సినీ, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. ఆయన కూతురైన నటి వనిత ఇటీవల షూటింగ్ కోసం ఆ భవంతిలోకి వచ్చి అక్కడే మకాం పెట్టేసింది. దీంతో విజయకుమార్ స్థానిక మదురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు వనితను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో నటి వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తన తల్లి మంజుల పేరు మీద ఉన్న ఆ ఇంటిని తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన సంపాదనతో కట్టించారని, కాబట్టి ఆ ఇంటిపై తనతో పాటు తన ఇద్దరు సోదరీమణులకు హక్కు ఉంటుందని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నటి వనితకు సాధకంగా తీర్పునిచ్చింది. నటి వనితను ఆ ఇంటి నుంచి పంపే హక్కు ఎవరికీ లేదని, అవసరమైతే పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా నటి వనిత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల పత్రాలతో గురువారం విజయకుమార్ ఇంటికి వచ్చింది. తనతో పాటు తన న్యాయవాదిని కూడా వెంట తీసుకొచ్చింది. సుప్రీమ్‌కోర్టు జారీ చేసిన తీర్పు పత్రాలను చెన్నై పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఈ సందర్భంగా నటి వనిత మీడియాకు తెలిపింది. -
తాడిపత్రి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ బి. విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆర్పీ ఠాకుర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాడిపత్రిలో శాంతిభద్రతల నిర్వహణలో డీఎస్పీ విజయ్‌కుమార్ వైఫల్యం చెందడంవల్ల సస్పెన్షన్ వేటు వేసినట్టు ఆయన పేర్కొన్నారు. వినాయక నిమజ్ఞనం సందర్భంగా తలెత్తిన వివాదంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు.. ప్రబోధానంద ఆశ్రమ భక్తులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే. ఈ వివాదంలో ఇద్దరు మృతి చెందగా కొద్ది రోజులపాటు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించలేదని, సరిగ్గా వ్యవహరించలేదంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక దశలో పోలీసులు కొజ్జాలు అని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తీరిగ్గా స్పందించిన పోలీసులు కూడా ఆయన్ను హెచ్చరించారు. ఈ వివాదంపై సీఎం చంద్రబాబును కలిసిన జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కిందిస్థాయి పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసుకోగా తాజాగా డీఎస్పీని సస్పెండ్ చేయడం గమనార్హం. -
తండ్రిపై నటి వనిత ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు విజయకుమార్ కూతురు, నటి వనిత పరారయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన ఇంటిని అక్రమించుకునే ప్రయత్నం చేసిందని, కిరాయి మనుషులతో బెదిరించిందని ఆమె తండ్రి ఆదివారం మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలపాక్కం, అష్టలక్ష్మి నగర్‌లోని విజయకుమార్ ఇంటికి వచ్చి నటి వనితను విచారించిన విషయం తెలిసిందే. కాగా ఇంట్లో భాగం ఉంది.. ఇల్లు ఖాళీ చేయనని నటి వనిత పోలీసులతో వాగ్వాదం చేసింది. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అనిత అనుచరులు దాడి చేశారు. గురువారం మధ్యాహ్నం పో లీసులు మరోసారి నటి వనితను విచారించడానికి అష్టలక్ష్మీ నగర్‌కు వెళ్లారు. పోలీసులతో ఆమె ఇల్లు ఖాళీ చేయనని తెలిపింది. అనుచరులతో కలిసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నానా హంగా మా చేసింది. పోలీసుల పైనా దాడి చేయడంతో కేసు నమోదు చేసి వనిత, ఆమె అనుచరులు 7 మందిని అరెస్ట్ చేశారు. కాగా వారిలో నటి వనిత పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అమ్మ ఇంట్లోనే ఉన్నా.. కాగా పరారైన నటి వనిత గురువారం రాత్రి వడపళనిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి విజయకుమార్‌పై ఫిర్యాదు చేసింది. అందులో తండ్రి కిరాయి మనుషులతో తనను కొట్టిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. అనంతరం వనిత విలేకరులతో మాట్లాడుతూ తాను తన తల్లి ఇంట్లోనే ఉన్నానని చెప్పింది. విజయకుమార్ తనను ఇంట్లో ఉండరాదంటున్నాడని తెలిపింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయించా ల్సిందిగా మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడంది. సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదని, అలాంటిది తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించింది. అందుకే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పింది. సినిమాల్లో, టీవీ.సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న తన తండ్రి విజయకుమార్ తనను మాత్రం కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకు గెంటించేశాడని ఇదేమి న్యాయం అని వాపోయింది. -
కూతురిపై నటుడు విజయకుమార్ ఫిర్యాదు
చెన్నై ,పెరంబూరు: షూటింగ్ కోసం ఇం టిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయకుండా ఆక్రమించుకుందని సీనియర్ నటుడు విజయకుమార్ తన కూతురు వనితపై స్థానిక మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అందులో స్థానిక మధురవాయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో తనకు ఇల్లు ఉందన్నారు. దాన్ని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్లో నివశిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం తన కూతురు షూటింగ్ కోసం అపపాక్కమ్లోని ఇంటిని అద్దెకు అడగడంతో ఇచ్చానన్నారు. అయితే షూటింగ్ పూర్తి అయినా వనిత ఇంటిని ఖాళీ చేయడం లేదని, అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్ పోలీస్మిషనర్ విచారణ చేస్తున్నారు. కాగా గురువారం పోలీసులు విజయకుమార్ ఇంటికి వెళ్లి కేసు విషయమై వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు భాగం ఉందని, అందువల్ల తాను ఖాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని చెప్పారు. వనిత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేరారు. దీంతో వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు విజయకుమార్, వనితల కేసును విచారిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వనిత కుటుంబాల మధ్య గొడవలు జరిగాయన్నది గమనార్హం. -
నీ యబ్బ.. చేతకాని నా కొడుకులు!
ఆయనో ఎంపీ. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే.. రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ దుడుకు తనమే ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఇదంతా పక్కనపెడితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రబోధాశ్రమం ఘటనలో ఏకంగా పోలీసు వ్యవస్థే తాడిపత్రిలో తిష్టవేయాల్సి వచ్చింది. ఇంత చేసినా.. ఎంపీ హోదాలో ఓ డీఎస్పీ, అందునా ఎస్సీ ఉద్యోగిపై జేసీ చేసిన వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయనే చర్చ జరుగుతోంది. అనంతపురం, తాడిపత్రి: ఏం పనయ్యా.. నీ సైన్యం అంతా.. నీయబ్బా.. చేతకాని నా కొడుకులు. మా మీద ప్రతాపం చూపిస్తారా! మీరు కనబడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మీరై మీరు క్రియేట్ చేసుకుంటారు.. నీయబ్బ దొంగ (పత్రికలో రాయలేని భాష), చేతకానినా కొడుకులంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి ఇన్చార్జి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. వందలాది మంది సమక్షంలో సోమవారం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ వెలుపల తిట్ల దండకం అందుకున్నారు. పత్రికల్లో రాయడానికి వీలుకాని భాషను పోలీసులపై ఉపయోగించారు. పోలీసులను చేతకాని వాళ్లుగా తేల్చేశారు. నెట్టింట్లో జేసీ వ్యాఖ్యలు హల్చల్ చేస్తుండటంతో ఆ మాటలకు యావత్ పోలీసు యంత్రాగం విస్మయం చెందుతోంది. -
ప్రత్యేకహోదా కోసం సెల్‌టవర్ ఎక్కిన ప్రభుత్వ ఉద్యోగి
-
ప్రత్యేక హోదా : సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్
సాక్షి, అనంతరపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు విజయ్ భాస్కర్ సెల్ టవర్ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల వరంగల్‌లో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. -
జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహదారుగా కే విజయ్‌కుమార్
-
ఎస్ఎస్ఏ ఎస్పీడీగా విజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో టి.విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌కుమార్ విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
త్రిపురారం : టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగాని విజయ్‌కుమార్ విమర్శించారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యం లో చేపట్టిన చెగువేరా మోటార్ సైకిల్ యాత్ర శుక్రవారం హలియాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను విస్మరించిందన్నారు. ఈ బైక్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్యటించి నిరుద్యోగుల సమస్యలపై సర్వే చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు నరేష్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు పున్నా రాధకృష్ణ, బాబు, అజయ్ కుమార్, రాంబాబు, రాజు, వెంకట్, శ్రీను తదితరులు ఉన్నారు. -
కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో విషాదం
-
ఐపీఎల్ విజయ్‌కుమార్
ప్రపంచంలోనే విధ్యంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ తీసిన వీరుడతను.. క్రికెట్ లెజండ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ ప్రశంసలందుకున్న ఫాస్ట్‌బౌలర్.. చండప్రచండమైన వేగంతో బౌలింగ్ సంధించి వికెట్లు తీయగల ధీరుడు. అప్పట్లోనే తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాడని అందరి నోటా ఒకటే అభినందనల మూట. ఐపీఎల్లో సత్తా చాటి ఐపీఎల్‌ను తన ఇంటిపేరుగా మార్చుకున్న క్రీడా కెరటం విజయ్‌కుమార్ విజయ గాథ.. సాక్షి, కడప/స్పోర్ట్స్: పైడికాల్వ విజయ్‌కుమార్ క్రికెట్లో పరిచయం అక్కరలేని పేరు. లారీ క్లీనర్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ఎదిగిన మేటి క్రీడాకారుడు. వల్లూరు మండలం పైడికాల్వ గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే దావీద్, సరస్వతిల కుమారుడైన విజయకుమార్ తొలినాళ్లలో లారీ క్లీనర్‌గా, తర్వాత వంటమనిషిగా పనిచేసేవాడు. ఖాళీ సమయంలో పంచె కట్టుకుని మైదానంలోకి దిగి బౌలింగ్ వేస్తుంటే ప్రత్యర్థులు బెంబేలెత్తేవారు. అనంతరం అతని ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు అవకాశం కల్పించడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. అదే ఏడాది (2005–06) అండర్–22 విభాగంతో పాటు జోన్‌స్థాయి పోటీల్లో సత్తాచాటాడు. విజయ్ ప్రతిభను గుర్తించి అదే ఏడాది ఆంధ్రా క్రికెట్ సంఘం రంజీ ట్రోఫీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించింది. 200పైగా వికెట్లు తీసిన రెండో ఆంధ్రా బౌలర్ ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు అనంతపురానికి చెందిన షాబుద్దీన్ 248 వికెట్ల తీయగా ఆయన తర్వాత 228 వికెట్లను తీసిన రెండో బౌలర్‌గా పైడికాల్వ విజయ్ రికార్డు సృష్టించాడు. వైఎస్సార్ జిల్లాలో పుట్టిన విజయ్‌కుమార్ అంటే ఫాస్ట్ బౌలర్‌గానే కాకుండా వికెట్లు తీయడంలో దిట్టగా పేరొందాడు. వేగంగా బంతులను విసరడంతోపాటు రంజీ మ్యాచ్‌లలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాడు. అవతల ఎంతటి బ్యాట్స్‌మన్ అయినా తన బౌలింగ్‌తో ముప్పుతిప్పులు పెట్టగల సామర్థ్యం విజయ్ సొంతం. మూడు సీజన్లలో దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం ఆంధ్ర జట్టుకు రంజీలలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న విజయ్‌కుమార్‌కు ఊహించని విధంగా ఐపీఎల్ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. ఇక విజయ్ వెనక్కి తిరిగి చూడలేదు. 2008, 2009, 2010 సీజన్లో హైదరాబాద్ దక్కన్ చార్జర్స్‌లో కీలక బౌలర్‌గా రాణించాడు. అదే సమయంలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలు అంతర్జాతీయ బ్యాట్స్మన్ల వికెట్లను సైతం తీశాడు. విజయ్ ప్రతిభను గుర్తించిన సచిన్ సైతం ఉజ్వల భవిష్యత్తు ఉందని అభినందించాడు. అనంతరం జరిగిన పరిణామాలతో దక్కన్ చార్జర్స్ ఉనికి ప్రశ్నార్థకంగా మారటంతో తిరిగి రంజీబాట పట్టాల్సి వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే జీవితాశయం.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని క్రికెట్ అంటే ప్రాణంగా భావిస్తూ వస్తున్నా. ఎప్పటికైనా భారతజట్టులో సభ్యుడు కావాలన్నదే నా జీవితాశయం. క్రికెట్ సంఘం పెద్దలందరూ నాకు మద్దతుగా నిలుస్తుండటం నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్లు నాకు భూమిని, నివాసస్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇస్తే బాగుంటుంది. – పైడికాల్వ విజయ్‌కుమార్, రంజీ క్రికెటర్, కడప హామీల అమలు ఎప్పుడు.. ఐపీఎల్ ద్వారా జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పిన పైడికాల్వ విజయ్‌కుమార్ నేపథ్యం గుర్తించిన జిల్లా అధికారులు క్రీడా పోత్సాహం కింద ఆయనకు 5 ఎకరాల భూమి, 12 సెంట్ల నివాస స్థలం ఇస్తామని అప్పటి కలెక్టర్ కృష్ణబాబు, తర్వాత వచ్చిన శశిభూషణ్‌కుమార్‌లు ఆయనకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆదేశాలను సైతం వారు జారీచేశారు. దీంతో విజయ్ పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ దిగువస్థాయి సిబ్బంది తిప్పుకుంటుండటంతో చేసేదేమీ లేక.. తిరిగి క్రికెట్ వైపు దృష్టిసారించారు. అదే సమయంలో తనకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ వాటిని వదులుకుని క్రికెటే ప్రాణంగా కొనసాగుతూ వచ్చాడు. రాష్ట్రానికి చెందిన ఎంఎస్కే ప్రసాద్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న నేపథ్యంలో ఎప్పటికైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోదా అన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు. తన జూనియర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న విజయ్‌కుమార్‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. -
సాహిత్యోత్సవం.. అందరికీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని, ఇందులో వివిధ అంశాలపై వందకుపైగా ప్రసంగాలు, చర్చలు, ఇష్టాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్ఎల్ఎఫ్) డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ వేదికగా జరగనున్న ఈ వేడుకల్లో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళారంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొననున్నట్లు వివరించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిటరరీ ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా సాహిత్యోత్సవం హైదరాబాద్ సాహిత్యోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని, రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోందని విజయ్‌కుమార్ తెలిపారు. కవులు, రచయితలతో ప్రారంభమై ప్రస్తుతం ఇతర అనేక కళారూపాలకు కూడా విస్తరించిందన్నారు. అలాగే హైదరాబాద్ గొప్పతనాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు వేడుకలు దోహదం చేస్తాయన్నారు. సమావేశంలో హెచ్ఎల్ఎఫ్ ప్రతినిధులు అజయ్ గాంధీ, అమితాదేశాయ్, కిన్నెర మూర్తి పాల్గొన్నారు. ఇది ఎనిమిదో వేడుక.. నగరానికి చెందిన కొందరు సాహితీ ప్రియులు 2005లో ‘మ్యూస్ ఇండియా’పేరుతో ఒక వెబ్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. భారత సాహిత్యాన్ని పాఠకులకు పరిచయం చేసే లక్ష్యంతో మొదలైన ఈ మ్యాగజైన్ ఆ తర్వాత ఒక అంతర్జాతీయ సాహిత్య వేదికగా ఆవిర్భవించింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులు, రచయితలు, కళాకారులు, విమర్శకులు, ఔత్సాహికులు, పాఠకులు అందరినీ ఒక వేదికపైకి తెచ్చిన వేడుకే ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’. జర్మనీ సెంటర్ నిర్వాహకులు అమితాదే శాయ్, ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు జీఎస్పీ రావు, ఉస్మానియా వర్సిటీ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తదితరులు 2010లో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొద్దిమంది సాహితీవేత్తలతో ప్రారంభమైన ఈ లిటరరీ ఫెస్టివల్ ఇప్పుడు 8వ ఎడిషన్‌కు చేరుకుంది. ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరుకానుంది. -
మార్కెట్ల ర్యాలీ మన ఘనత కాదు!
♦ ‘సాక్షి’తో జియోజిత్ ఫైనాన్షియల్స్ స్ట్రాటజిస్ట్ విజయ్‌కుమార్ ♦ ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ నడుస్తోంది!! ♦ 25 ఎమర్జింగ్ మార్కెట్లలో 23 మన కంటే ముందే ♦ మనకన్నా అర్జెంటీనా, చైనా 30%, దక్షిణ కొరియా 21% వృద్ధి ♦ మరో 8 నెలలు ఐటీ, ఫార్మా షేర్లు కుదేలే; బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీలకు డోకాలేదు ♦ ఏడాది తర్వాతే ఆర్థిక సంవత్సరంలో మార్పు; తొలుత కాస్త ఇబ్బందులు ‘‘సరిగ్గా నెల కిందట 30 వేల పాయింట్లకు అటూ ఇటుగా ఉన్న దేశీ మార్కెట్ల బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్... నెల రోజుల్లో 32 వేలు దాటేసింది. అయితే ఈ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. నిజం చెప్పాలంటే ఇది మన ఘనతేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇదే స్థితిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన దేశంతో పోలిస్తే అర్జెంటీనా, చైనా దేశాల మార్కెట్లు 30 శాతం, దక్షిణ కొరియా 21 శాతం వృద్ధిలో ఉన్నాయి. ఇండియా, చైనా, అమెరికా, అర్జెంటీనా, రష్యా వంటి ప్రపంచంలోని 25 ఎమర్జింగ్ మార్కెట్లలో 23 దేశాలు సానుకూల వాతావరణంలోనే ఉన్నాయి. రష్యా, కెనడా మాత్రం ప్రతికూల వాతావరణంలో కొనసాగుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె.విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ అంశాలపై ఆయనింకా ఏమన్నారంటే.. సానుకూల సమయమిది 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2010–11లో యూరప్ సంక్షోభం, 2013లో అమెరికాలో రుణ సంక్షోభం, 2016లో బ్రెగ్జిట్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ మార్కెట్లు పలు సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రతికూలం నుంచి సానుకూలం వైపు అడుగులేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. గతేడాది మన దేశ ఆర్థి్థక వ్యవస్థ వృద్ధి రేటు 7.2 శాతం. ఈ ఏడాది 7.7 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక చెబుతోంది. ఇదే వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది 3.4 శాతానికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లోకి నిధుల వెల్లువ.. గతేడాదితో పోలిస్తే స్టాక్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని చెప్పాలి. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో భౌతికంగా డబ్బు దొరకడమే గగనమైంది. పోనీ, బ్యాంకుల్లో వేద్దామన్నా, తీద్దామన్నా సవాలక్ష ఆంక్షలు, ఇక జీఎస్టీతో అసంఘటిత రంగం కాస్త సంఘటితంగా మారుతుంది. చాలా మంది పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. దీంతో ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయి. ఫలితంగా జీడీపీ వృద్ధి చెందే అవకాశముంది. ఈ రెండింటితో భౌతిక పొదుపు కంటే ఆర్థిక పొదుపు వైపు జనాలు మళ్లుతున్నారు. అంటే బంగారం, రియల్ ఎస్టేట్ వంటి వాటి కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమే మేలనే నిర్ణయానికొస్తున్నారు. పోనీ, బ్యాంకుల్లో దాచుకుందామంటే.. వడ్డీ రేట్లూ తక్కువే కదా!!. æ దేశీయ మార్కెట్లో ఏడెనిమిదేళ్ల పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాల హవా కొనసాగింది. కానీ, గత కొంతకాలంగా ఈ విభాగాలు ప్రతికూల వాతావరణంలో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ 2,300 కంటే తక్కువకు వచ్చేసింది. గతేడాది 2,000లుగా ఉన్న లుపిన్.. ఇప్పుడు వెయ్యి కంటే తక్కువే. వ్యాల్యుయేషన్స్ తక్కువగా ఉంటున్నాయి. కాకపోతే వీటి వృద్ధి రేటు కూడా పడిపోతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పలు నిర్ణయాలు, ధరల తగ్గింపు వంటివి ఇందుకు కారణం. అయితే ఇలాంటి సమయంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే... కొంత రిస్కు తీసుకోవటం లాంటిదే. రిటైల్ మీద ఫోకస్ చేసే బ్యాంకులు, ఎన్పీఏ తక్కువగా ఉన్న బ్యాంకుల షేర్లు రానున్న రోజుల్లో మరింత బాగుంటాయి. ఈ రంగంలో విలీనాలు కూడా ఇన్వెస్టర్లకు కలిసొస్తాయి. వాహన, గృహం వంటి రుణాలను అందిం చే ఎన్బీఎఫ్సీ స్టాక్స్ కూడా బాగుంటాయి. సిమెంట్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే ట్రేడ్ అవుతున్నాయి. మరో 8 నెలలపాటు వీటికి ఎలాంటి ఇబ్బందులుండకపోవచ్చు. కొనుగోళ్లు, విలీన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేముందు సంబంధిత కంపెనీల షేరు ధర, స్వాప్ రేషియో, వ్యాల్యుయేషన్స్ను గమనించాలి. వీటి మీదే ఆయా షేర్ల వృద్ధి ఆధారపడి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. చిన్న షేర్ల విషయానికొస్తే వాటి వ్యాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్వెస్ట్ చేసే ముందు అవన్నీ గమనించాలి. నెలకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) పథకాల్లో రూ.4,800 కోట్లు చేరుతున్నాయి. యాక్టివ్ ఎస్ఐపీ ఖాతాలు 4.45 కోట్ల వరకూ ఉంటాయి. గతేడాదితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) తాలూకు నిధులు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. జూలైలో రూ.12,727 కోట్లు స్టాక్స్‌లో చేరాయి. స్టాక్ మార్కెట్లోని మొత్తం అసెట్స్‌లో ఒక్క ఎంఎఫ్ పరిశ్రమ వాటానే రూ.19.97 లక్షల కోట్లుంటుంది. ఏటా 31.5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది కూడా. ఆర్ధిక సంవత్సరం మార్పుతో తొలి దశలో కాసింత గందరగోళం ఏర్పడినా.. తర్వాత తర్వాత సానుకూలమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, ఇది క్యాలెండర్ ఇయర్. కానీ, మన దేశంలో మాత్రమే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. ప్రపంచ బ్యాంక్ కూడా క్యాలెండర్ ఇయర్‌నే ఫాలో అవుతుంది. దీంతో కొన్ని సమయాల్లో మన దేశానికి ఇబ్బందులొస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపించేందుకు కేంద్రం ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చే నిర్ణయాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. తొలి దశలో ఖాతాల అప్లోడింగ్ వంటి వాటిల్లో ఇబ్బందులు రావచ్చు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పాలి. పెట్టుబడుల ఆకర్షణలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. పలు విధానపరమైన నిర్ణయాలతో విదేశీ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. అయితే జీఎస్టీ కారణంగా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కాసింత విఘాతం ఏర్పడటం మాత్రం ఖాయం. దాన్ని పూరించేందుకే పన్ను రాబడులను కోల్పోయే రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం జీఎస్టీ పన్ను శ్లాబుల్లో కొన్నింటికి జీఎస్టీతో పాటూ సెస్సును జత చేశారు. ఈ సెస్సును ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు పరిహారంగా అందిస్తారు. -
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 59.93% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 59.93% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ఫలితాలను పాఠశాల విద్యా ఇన్చార్జి కమిషనర్ విజయ్‌కుమార్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలు 6.27% అధిక ఉత్తీర్ణత సాధిం చారు. బాలురు 57.24% మంది ఉత్తీర్ణులవ్వగా, బాలికలు 63.51% ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు బాలురు 50,814 మంది హాజరుకాగా, 29,085 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 38,312 మంది హాజరుకాగా, 24,332 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.33% ఉత్తీర్ణతతో వరంగల్ రూరల్ ప్రథమ స్థానంలో నిలువగా, 26.76% ఉత్తీర్ణతతో జనగామ చివరి స్థానంలో నిలిచింది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలతో పోల్చితే ఈసారి 1.34% ఉత్తీర్ణత తగ్గింది’ అని అన్నారు. పరీక్షలకు 89,126 మంది హాజరవగా.. 53,417 మంది (59.93%) ఉత్తీర్ణులయ్యారు. పది రోజుల్లో మార్కుల మెమోలు.. పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులకు 10 రోజుల్లో మార్కుల మెమోలను పంపిస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఈ నెల 7 నుంచి 15లోగా ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో పోస్టు ద్వారా లేదా స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం సంబంధిత హెడ్మాస్టర్ సంతకం చేయించుకొని ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఈ నెల 7 నుంచి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలని, http://bse.telangana.gov.inలో దరఖాస్తు ఫారం నమూనాను ఉంచినట్లు తెలిపారు. -
ప్రేమ విఫలం..యువకుడి ఆత్మహత్య
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మాధవ రెడ్డి బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన యువకుడు బోడుప్పల్‌కు చెందిన విజయ్‌కుమార్(25)గా గుర్తించారు. విజయ్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తుర్కపల్లి మండలం బాపల్లి గ్రామం. సంఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
ట్రాన్స్‌కో జీఎం ఇంటర్వ్యూకు సీఎం, మంత్రి పీఆర్వోల హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)లో జనరల్ మేనేజర్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టు భర్తీకి సోమవారం విద్యుత్ సౌథలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌రావుతో కూడిన ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ పీఆర్వో కె.విజయ్‌కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయ పీఆర్వో చెన్నమనేని కళ్యాణ్, ఏపీ ట్రాన్స్‌కో పీఆర్వో అబ్దుల్ బషీర్, సంగారెడ్డి డీపీఆర్వో యామిని, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. హ్యూమానిటీస్‌లో డిగ్రీ, జర్నలిజంలో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీలతో పాటు జర్నలిజంలో కనీసం 15 ఏళ్ల అనుభవంతో పాటు ప్రభుత్వ పీఆర్వోగా కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నిబంధన పెట్టడంతో ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశముంది. -
బెటాలియన్ డీఐజీ జిల్లాకు రాక
అనంతపురం సెంట్రల్ : బెటాలియన్ రేంజ్ –3 డీఐజీ విజయకుమార్ సోమవారం జిల్లాకు వచ్చారు. పీటీసీలోని 14వ బెటాలియన్ కార్యాలయం తనిఖీ నిమిత్తం ఆయన రెండు రోజుల పర్యటనకు వచ్చారు. తొలుత బెటాలియన్ కమాండెంట్ జగదీష్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. మంగళవారం కార్యాలయ సిబ్బందితో సమావేశం, పలు రికార్డుల పరిశీలన ఉంటుందని బెటాలియన్ అధికార వర్గాలు తెలిపాయి. -
సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత సృష్టి
► చేనేత మగ్గంపై పట్టుదారంతో.. ► కుట్టులేని ప్యాంటు, షర్ట్ ► నల్ల పరంధాములు తనయుడి ప్రతిభ ► గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన పరంధాములు సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి భారతీయ చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు విజయ్ కుమార్ చేనేత మగ్గంపై పట్టు దారాలతో కుట్టు లేని ప్యాంటు షర్టును తయారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ 45 రోజులపాటు చేనేత మగ్గంపై పట్టు పోగులతో ప్యాంటు, షర్ట్ తయారు చేశారు. తన తండ్రి నల్ల పరంధాములు చేనేత కళా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న విజయ్‌కుమార్.. కేవలం 120 గ్రాముల బరువుతో ప్యాంటు, షర్ట్‌ను నేసి ఔరా అనిపించారు. గతంలోనూ.. నల్ల విజయ్‌కుమార్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు తయారు చేశారు. అరటి నారలతో చేనేత మగ్గంపై శాలువా రూపొందించారు. చేనేత మగ్గంపై జాతీయ పతకాన్ని కుట్టులేకుండా నేశారు. బం గారం తీగలతో బ్రాస్లెట్ తయారు చేసి అబ్బురపరిచారు. 2012 నుంచి నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంతో ప్రయో గాలు చేస్తున్నారు. ఆ అద్భుతాలకు గుర్తింపుగా తెలంగాణ రికార్డుల బుక్‌లో చోటు సంపాదించారు. విజయ్‌కుమార్ తండ్రి నల్ల పరంధాములు 1990లో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కుట్టులేని జాకెట్ తయారు చేశారు. ఆయన మగ్గంపై కుట్టులేకుండా నేసిన భారతీయ త్రివర్ణ పతాకం ప్రపంచ క్రీడావేదిక అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ క్రీడోత్సవాల్లో ప్రదర్శించారు. పరంధాములు 2012 ఆగస్ట్ 13న మరణించారు. తండ్రి అడుగు జాడల్లోనే నల్ల విజయ్‌కుమార్ చేనేతమగ్గంపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. సీఎంను కలవాలని ఉంది : నల్ల విజయ్‌కుమార్ అంతరించి పోతున్న చేనేత కళావైభవాన్ని భావితరాలకు చాటి చెప్పేందుకే నేను ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నానని నల్ల విజయ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలసి చేనేత మగ్గంపై తయారు చేసిన వస్త్రాలను ఆయనకు అందిస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్ ద్వారా సీఎంను కలుస్తానని పేర్కొన్నారు. -
వీరప్పన్ ను ఇలా చంపారట!
► హత్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త సహకారం ► వీరప్పన్ శిబిరంలోకి మారువేషంలో ఎస్ఐ ► కంటి చికిత్సకని తీసుకొచ్చి కాల్పులు ► ఐపీఎస్ పుస్తకంలోని సమాచారం లీక్! సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికాడబ్బా అనే సందేహం 13 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. అతడిని మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా అందులోని కొంత సమాచారం బహిర్గతమైంది. అతడిని చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వీరప్పన్ కోసం విజయకుమార్ సాగించిన వేట, పన్నిన వ్యూహం వివరాలివి. పారిశ్రామికవేత్తతో దోస్తీ: చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టారు. వీరప్పన్ వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పథకం పన్నారు. చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్ చేసిన ఎస్ఐ వెల్లదురైని.. వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్ వస్తారన్నాడు లాటరీ ముక్కను నమ్మి..: విజయకుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చు కున్నాక ఎస్సైని వీరప్పన్ నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమెండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ వ్యాపారి ఎవరనేది కుమార్ బైటపెట్టలేదు. -
స్మార్ట్ దుష్ప్రభావం!
కేతన, ప్రాచిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింగిల్ మ్యాన్ మూవీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బి.ఎస్.ఆర్ రూపొందిస్తోన్న చిత్రం ‘అమావాస్య చంద్రులు’. 73% యూత్ అన్నది ఉపశీర్షిక. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెర కెక్కుతోన్న చిత్రమిది. స్మార్ట్ ఫోన్, వైఫై, ఇంటర్నెట్ వల్ల నేటి యువతరం ఎలా చెడిపోతోంది? వాటి వల్ల కలిగే దుష్ప్రభావం ఏంటి? అని చూపించనున్నాం. కేవలం యూత్ మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులూ చూసే అంశాలు కూడా ఉంటాయి’’ అన్నారు. గుర్రపు విజయ్‌కుమార్, సంతోషిని, అస్మితా ఖాన్, కడప జ్యోతి, లావణ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ,మాటలు: బి.ఎస్.వాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గుర్రపు విజయ్‌కుమార్. -
క్షణికావేశం నింపింది విషాదం!
► ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద దూకిన తల్లి ►అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన తల్లి ►ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు ►చికిత్స పొందుతూ మృతి చెందిన కుమారుడు ► కుమార్తె పరిస్థితి విషయం ► మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలింపు ►జాండ్రపేట రైల్వే స్టేషన్ వద్ద ఘటన చీరాల అర్బన్ : క్షణికావేశం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దంపతుల మధ్య వివాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు పసి బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లి వారిని భుజాలకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కిందకు దూకేసింది. రైలు ఢీకొట్టడంతో చిన్నారులిద్దరూ చెరోవైపు పడిపోగా తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన చీరాల మండలం జాండ్రపేట రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం పాతచీరాలకు చెందిన పులుగు విజయకుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు జీవన్‌రెడ్డి, ఏడాదిన్నర వయస్సు గల కుమార్తె మహిమ ఉన్నారు. విజయకుమార్ బేల్దారి పని చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య తర చూ వివాదాలు జరుతున్నారుు.గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగలక్ష్మి.. భర్త బయటికి వెళ్లిన సమయం లో ఇద్దరు పిల్లలను తీసుకుని జాండ్రపేట రైల్వేస్టేషన్‌కు వచ్చింది. బిడ్డలను భుజాల మీదకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడింది. ఈ సంఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఇరువురు పిల్లలు రెండు వైపులా దూరంగాపడిపోరుు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా పట్టాలు దాటుతున్న స్థానికుడు వారిని చూసి చలించిపోయాడు. 108కి సమాచారం అందించాడు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని,గాయపడిన చిన్నారులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే జీవన్‌రెడ్డి(3) మృతిచెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి మహిమను మెరుగైనవైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో అభాగ్యుల్లా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న చిన్నారుల చెంత బంధువులెవరూ లేవరూ పోవడం చూపరులను కలిచివేసింది. మృతురాలు నాగలక్ష్మి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డి తెలిపారు. -
విజయ్ విజృంభణ
కేరళతో ఆంధ్ర రంజీ మ్యాచ్ గువాహటి: ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ (6/37) మరోసారి విజృంభించాడు. ఫలితంగా సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్సలో 89.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆరంభంలో విజయ్ ధాటికి 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడిన కేరళను మహ్మద్ అజారుద్దీన్ (82) ఆదుకున్నాడు. రోహన్ ప్రేమ్ (42) రాణించాడు. అయ్యప్ప, డీబీ రవితేజ చెరో వికెట్ తీశారు. బద్రీనాథ్ సెంచరీ: హైదరాబాద్ 267/4 వల్సాడ్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ బద్రీనాథ్ (254 బంతుల్లో 134; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. సందీప్ (135 బంతుల్లో 73 బ్యాటింగ్) రాణించాడు. అభిమన్యు చౌహాన్‌కు 2 వికెట్లు దక్కారుు. ఒకే రోజు 23 వికెట్లు... రోహ్తక్: బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో వికెట్ల వర్షం కురిసింది. తొలి రోజు 73.2 ఓవర్లలోనే ఏకంగా 23 వికెట్లు నేలకూలారుు. మొదట బరోడా తొలి ఇన్నింగ్సలో 30.4 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదిత్య (17)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... బెంగాల్ బౌలర్ అశోక్ దిండా (6/45) చెలరేగాడు. తర్వాత బెంగాల్‌ది అదే తీరుగా సాగింది. 27.4 ఓవర్లలో 76 పరుగులకే తొలి ఇన్నింగ్స ముగిసింది. అతీత్ సేథ్ 36 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశాడు. 21 పరుగుల ఆధిక్యం పొందిన బరోడా అనంతరం రెండో ఇన్నింగ్సలో ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. -
తాత - మనవళ్ల కథ
‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి ఫీలింగ్ కలిగింది. టైటిల్ చక్కగా ఉంది. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్‌కు శ్రీరాముని ఆశీస్సులుండాలి’’ అని హీరో సునీల్ అన్నారు. రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి ముఖ్య పాత్రల్లో రాము దర్శకత్వంలో వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై ప్రభాత్ వర్మ నిర్మించిన చిత్రం ‘శ్రీరామ రక్ష’. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌బాబు, ఓ పాటను సునీల్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తాత- మనవడి బంధం ఇందులో హైలెట్. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి. రంగరాజు. -
కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు
ముసునూరు మండలం లోపూడి గ్రామం వద్ద తమ్మిలేరు కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు లోపూడి గ్రామానికి చెందిన చాట్ల విజయ్‌కుమార్(18), వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్(15)గా గుర్తించారు. విద్యార్థుల మృతికి ఇసుక గుంటలే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్..ఇద్దరి మృతి
మల్కాజిగిరి పరిధిలోని ఐడీఏ మౌలాలీలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో గురువారం వేకువజామున గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనతో అందులో పనిచేసే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ధీరజ్ మహతో(20)ది పశ్చిమ బెంగాల్ కాగా..విజయ్‌కుమార్(28)ది బిహార్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నయీం గ్యాంగ్ మరో ఘాతుకం..
హైదరాబాద్: నయీం ముఠా ఘాతుకం మరొకటి వెలుగులోకి వచ్చింది. 2013లో భువనగిరికి చెందిన వ్యాపారి విజయ్‌కుమార్‌ను తామే చంపినట్లు నయీం గ్యాంగ్ అంగీకరించింది. వీరిని విచారిస్తున్న సిట్ ఎదుట వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. నయీం చెల్లెలిని వివాహం చేసుకున్నాడన్న కోపంతోనే విజయ్‌కుమార్‌ను నయీంతో కలిసి చంపి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతూప్రా వద్ద దహనం చేసినట్లు వెల్లడించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సిట్ పోలీసులు మరిన్ని వివరాల కోసం నయీం గ్యాంగ్‌ను విచారిస్తున్నారు. -
వేరుశనగ రక్షణకు రెయిన్‌గన్స్
-అవసరమైతే విద్యుత్ వేళల్లో మార్పు -రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు: ధనంజయరెడ్డి భాకరాపేట రాష్ట్ర వ్యాఫ్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నుండి వేరుశనగ పంటను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల 300 రెయిన్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయు సంచాలకులు ధనంజయరెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంటకు అందిస్తున్న తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా ఎండి పోతున్న పంటకు తడిని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 160 కోట్లతో రెయిన్ గన్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడా తడి లేక పంట రాలేదన్నది వినపడకూడదని సీఎం చెప్పినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వేసిన వేరుశనగ 50 శాతం పంట మాత్రం చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చునన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. ముందుగా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలకు వారంలో నగదు వేస్తామన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్యాఫిలి మండలంలో అత్యధికంగా పంట ఎండిపోయిందన్నారు. కరెంటు వేళల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం చోరవ తీసుకుందన్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంటు ఇస్తే రెయిన్ తో నీటీని వదలితే ఎక్కువ శాతం గాలిలో కలిసి పోతుందని, ఉదయం వేళల్లోనే కరెంటు సరఫరా చేసి వేరుశనగ రైతులును ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా తెగుళ్ళు, సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు సందర్శించి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రైతులుకు వ్యవసాయబావులు దగ్గర నీటీ వసతి లేకుండా అయిల్ఇంజిన్లు సైతం సరఫరా చేసి, పైపులు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నీటీ వసతి లేక, వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోతే ఇన్సూరెన్సు చేయించుకున్నవారికి వారంలో బీమా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్సు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్, పీడీ శివనారాయణ పాల్గొన్నారు. -
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
పార్వతీపురం మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి 2 టన్నుల నల్ల బెల్లం, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా..మరో నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
-మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం. హైదరాబాద్‌సిటీ నగరంలో పలు చోట్ల ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగలను ఇద్దరిని నారాయణగూడ క్రై మ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని బుధవారం వారిని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా క్రై మ్ఇన్స్పెక్టర్ గవిడి రాంబాబు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అలియాస్ కుమార్(30), శ్రీనివాస్ అలియాస్ శీనా(32)లు జూన్ విద్యా సంవత్సరం ప్రారంభమైయ్యే సమయంలో నగరానికి చేరుకుని పలు హాస్టళ్లలోకి వేకువజామున చొరబడి ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్నారు. తాగాజా అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామ్‌సంగ్ జె-7, నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్లో మూడు ల్యాప్‌టాప్‌లను దొంగలించారు. వీరిని గుర్తించేందుకు సిబ్బంది గాలిస్తున్న తరుణంలో సాయిదత్తా హాస్టల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న విషయాన్ని డిఎసై ్స కష్ణయ్య గుర్తించారన్నారు. సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం జరిగిందన్నారు. అనంతరం విచారణలో ల్యాప్‌టాప్‌లను దొంగలించింది వీరేనని తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచనట్లు రాంబాబు చెప్పారు. ల్యాప్‌టాప్ దొంగలను పట్టుకున్న డిఐ రాంబాబు, డిఎస్సై కష్ణయ్య సిబ్బందిని అబిడ్స్ ఏసిపి జె.రాఘవేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
సెల్.. అనుకుంటే తాబేలు వచ్చింది!
మొబైల్ ఆఫర్ పేరుతో మోసం పార్శిల్లో సెల్‌కు బదులు యంత్రం, తాబేలుబొమ్మ రామసముద్రం, పుంగనూరులో జనం బెంబేలు హలో.. బ్రదర్.. మీ నంబరుకు సామ్సంగ్ జే7 మొబైల్ ఆఫర్ వచ్చింది.. రూ.14 వేలు విలువ చేసే మొబైల్‌ను కేవలం రూ.3450కే ఇస్తాం. తీసుకోండి.. అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రెండు, మూడు రోజుల్లో పోస్టాఫీసు ద్వారా పార్శిల్ వస్తుంది.. డబ్బు కట్టి తీసుకోండి.. అంటూ పెట్టేశాడు. పోస్టాఫీసులో రూ.3450 చెల్లించి పార్శిల్ తెరిచి చూడగా అందులో లక్ష్మీయంత్రం, తాబేలు బొమ్మ ఉండడంతో బాధితుడు అవాక్కయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ మోసం రామసముద్రం, పుంగనూరులో సంచలనం కలిగించింది. రామసముద్రం: ఆన్లైన్లో.. వివిధ రకాల ఆఫర్లు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లంటూ ఊరించి.. చివరికి ముంచేసే కేటుగాళ్ల మోసం మరోమారు వెలుగు చూసింది. రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ (సెల్ నంబరు 9000079948)కు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామంటూ 919311755628 నంబరుతో ఫోన్ వచ్చింది. రీసీవ్ చేసి మాట్లాడగా మీ మొబైల్ నంబరుకు బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పడంతో తమకు వద్దంటూ నిరాకరించాడు. అయినప్పటికీ పదేపదే ఫోన్లు చేస్తూ ఒత్తిడి తేవడంతో తమ వద్ద డబ్బులు లేవని తిర స్కరించినా పార్శిల్ వచ్చిన తరువాతే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఓపెన్‌చేసి చూడండని నమ్మబలికాడు. నమ్మకంతో విజయ్‌కుమార్ కొద్దిరోజుల కిందంట తన అడ్రస్‌పై పార్శిల్ రావడంతో రూ.3450 చెల్లించి పార్శిల్‌ను తీసుకుని ఓపెన్‌చేయగా అందులో మొబైల్‌కు బదులుగా లక్ష్మీయంత్రం, తాబేలు బొమ్మ ఉండడంతో అవక్కాయ్యాడు. ఢిల్లీ నుంచి వచ్చిన నంబర్‌కు విజయ్ ఫోన్‌చేసి తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు సరైన సమాధానం చెప్పలేదు. విషయాన్ని పోలీసులకు కూడా విన్నవించాడు. అనంతరం ఢిల్లీ నంబర్ నుంచి ఫోన్‌చేసి పార్శిల్ మారిపోయిందని రెండు రోజుల్లో మొబైల్ ఉన్న పార్శిల్ పంపుతామన్న మోసగాడు ఇంత వరకు పంపలేదు. దీంతో లక్ష్మీయంత్రాన్ని ఇంటికి తీసుకెళ్లాలా వద్దా అనే సంది గ్దంలో విజయ్‌కుమార్ వేరొక్కరి ఇంట్లో ఉంచాడు. పుంగనూరులోనూ.. పుంగనూరు పట్టణంలోని గోకుల్‌వీధిలో రవికుమార్ , ఆయన సతీమణి ప్రీతి ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు. పది రోజుల క్రితం రాకేష్ అనే వ్యక్తి ప్రీతి (నంబరు : 7093199219)కి ఫోన్ చేసి మీకు కంపెనీ ఆఫర్లో సెల్‌ఫోన్ వచ్చింది రూ.3500లు చెల్లించి ఫోస్టాఫీసు ద్వారా పార్శిల్ తీసుకోండంటూ సమాచారం ఇచ్చాడు. సోమవారం ఉదయం 10 గంటలకు రాకేష్ తిరిగి ఫోన్ చేసి పోస్టాఫీసుకి పార్శిల్ చేరుకుందని వెంటనే వెళ్లాలని చెప్పాడు. ప్రీతి భర్త రవికుమార్ ఫోస్టాపీసుకు వెళ్లి పార్శిల్ తీసుకుని ఓపెన్ చేయడంతో నివ్వెరపోయాడు. సెల్‌ఫోన్ బదులుగా చిన్న గాయత్రి యంత్రం పంపడంతో మోసపోయామని గుర్తించి పోస్టుమాస్టర్‌కు రిపో ర్ట్ చేశారు. ఇలాంటి పార్శిళ్లు ఒకే రోజు 15 వరకు వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
తల్లి, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేశాడు..
గూడు కోసం ఓ కుటుంబం రోడ్డెక్కింది. సొంత కుమారుడే ఇంటికి ఆక్రమించి విక్రయించే ప్రయత్నంలో ఉండడంతో కన్నతల్లి, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మమ్మ తన చిన్న కుమారుడు విజయ్‌కుమార్, అతని భార్య సుధామణితో కలసి సొంతింట్లో నివాసం ఉంటోంది. ఆమె రెండో కుమారుడు శంకరనారాయణ విడిగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి, తమ్ముడు, అతని భార్యను బయటకు గెంటేసిన శంకరనారాయణ ఇంటిని ఆక్రమించుకున్నాడు. శంకరనారాయణ తమను రౌడీలతో బెదిరిస్తున్నాడని, తమ ఇంటిని విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడని, న్యాయం చేయాలని కోరుతూ వారు ఇంటి ముందే ధర్నాకు దిగారు. -
స్నేహం వద్దన్నాడని.. బీర్ సీసాతో దాడి
తమతో స్నేహాన్ని కట్ చేశాడన్న కోపంతో ఓ యువకుడిపై.. ఆరు మంది బీర్ సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. ఈ ఘటనలో ఐదు మందిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోనిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే లింగిడి విజయ్‌కుమార్(24) ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం రహ్మత్‌నగర్‌కు చెందిన రాము, లక్ష్మణ్, షకిల్, శ్రీరాంనగర్‌కు చెందిన సలీం, సొహైల్, నిసార్లతో స్నేహం ఉండేది. ఇటీవల కొన్ని కారణాలతో విజయ్‌కుమార్ వారిని కలవడం మానేశాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి మెట్టుగూడకు చెందిన మరో స్నేహితుడు ప్రియనాథ్ విజయ్‌తో కలిసి నిమ్స్‌మే ఓపెన్ ల్యాండ్‌లో బీరుతాగుతూ కూర్చున్నారు. అదే సమయంలో రాము, లక్ష్మణ్, షకిల్, సలీం, సొహైల్, నిసార్లు అక్కడికి వచ్చి విజయ్‌కుమార్‌తో గొడవపడ్డారు. అసభ్యంగా దూషించారు. కొట్టి తరిమారు. వీరి బారి నుంచి విజయ్‌కుమార్‌తో పాటు స్నేహితుడు విజయ్ పరారవుతుండగా ఎల్ఆర్. కిషోర్ స్కూల్ వద్ద మళ్లీ వీరిద్దరినీ పట్టుకొని తమతోపాటు తెచ్చిన బీరు సీసాలను పగలగొట్టి విజయ్‌కుమార్ కడుపులో గట్టిగా పొడిచారు. లక్ష్మణ్ బీరుసీసాతో తనను పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయని వీరందరిపైన చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయిదు మందిని అరెస్టు చేశారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఖరీఫ్‌కు 8.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలు’
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు 8.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్రంలోని 13 జిల్లాల జేడీఏలు, కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ(క్రీడ) శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్‌లో 14.90 లక్షల హెక్టార్లకు సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరో 19.5 లక్షల టన్నులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఏడాదీ తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలుస్తోందన్నారు. ఏప్రిల్ నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో కొంత మేర వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందన్నారు. మే నెలలో వాతావరణ శాఖ మరోసారి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
విజయ్‌కుమార్ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ. ఐదు కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మియాపూర్ మక్తలోని విజయ్‌కుమార్‌కు చెందిన రెండు ఇళ్లతోపాటు, మరో నాలుగు ప్రాంతాల్లోని అతడి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విజయ్‌కుమార్‌కు చెందిన రెండు ఖరీదైన ఇళ్లతోపాటు రెండు కార్లు, 60 తులాల బంగారం, రూ. 50 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, పటాన్చెరువు, యాదగిరిగుట్టలోని ఖాళీ స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని... అదే బహిరంగ మార్కెట్లో రూ 5 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. -
ఎవరీ అజయ్‌కుమార్?
స్కాలర్‌షిప్పుల వ్యవహారంలో సూత్రధారి ఆయన కారులోనే దొరికిన రూ. 24 లక్షల చెక్కు బీసీ వెల్ఫేర్ పాస్వర్డ్ ట్యాంపరింగ్‌పై అనుమానాలు గిరిజన హాస్టళ్లలో ఉన్నట్టు చూపిస్తూ కొల్లగొట్టిన వైనం జిల్లాలో విద్యార్థుల ఉపకార వేతనాల్లో అక్రమాలకు సూత్రధారిగా అనుమానిస్తున్న అజయ్‌కుమార్ ఎవరు? ఆయనకు గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన గిరిజన సంక్షేమ శాఖ అధికారి సదరు అజయ్‌కుమార్‌కు రూ.24 లక్షల చెక్కు ఎందుకిచ్చారు? ఆ చెక్కుతో ఉన్న బ్యాంకు ఖాతాలోకి బీసీ సంక్షేమ శాఖ నిధులు ఎలా వెళ్లాయి? ఈ వ్యహారంలో సూత్రధారులెవరు.. ఇదీ ప్రస్తుతం జిల్లా అధికారుల్లో మెదులుతున్న ప్రశ్న. శ్రీకాకుళం : జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులు ఎస్టీ వసతి గృహల్లో ఉంటున్నట్టు చూపిస్తూ రూ.కోట్లు కొట్టేసిన వ్యవహారం బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వసతి గృహంలో లేని విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనంగా ఏడాదికి రూ.3,500లు చెల్లిస్తోంది. అయితే ఈ విద్యార్థులను వసతి గృహల్లో ఉన్నట్టు చూపించి ఒక్కొక్కరికి పేరుతో రూ.10,500లు వరకు బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బ్యాంకు ఖాతాలకు బదలాయించారు. ఈ వ్యవహరంలో అజయ్‌కుమార్ అనే వ్యక్తి కీలక పాత్రపోషించడంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి రూ.24 లక్షలు ఆయన పేరుతో చెక్కు అందజేశాడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంక్షేమాధికారిగా మెళియాపుట్టిలో పనిచేస్తున్న ఆ అధికారి సీతంపేటలో గత నెల 20న చెక్కును అజయ్ కుమార్‌కు ఇచ్చాడు. సీతంపేట నుంచి బయలుదేరిన అజయ్‌కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కారులో ఉన్న చెక్కును పాలకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అన్న అంశంపై నిగ్గు తేల్చాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎస్పీని ఆదేశించారు. విచారణ మొదలు సీతంపేటలో సోమవారం మకాం వేసిన కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. 2009-10 నుంచి 2015-16 విద్యా సంవత్సరాలకు గాను విద్యార్థుల పేరుతో బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించిన నిధులు, అందులో జరిగిన అక్రమాలు, 2013-14, 2014-15లో పాస్వర్టు ట్యాంపరింగ్ వ్యవహారాలపై శాఖల వారీగా విచారణ మొదలైయింది. గత ఏడాది డిసెంబర్లో గిరిజన సంక్షేమ శాఖ శ్రీకాకుళం వసతి గృహం వార్డెన్ ఝాన్సీరాణి అకౌంటుకు రూ.32.78 లక్షలు జమా అయితే, ఈనెల 12 వరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయకుండా నిల్వ ఉంచడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్.. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణను విచారణాధికారిగా నియమించారు. -
హెల్మెట్ పై స్పెషల్‌డ్రైవ్
మంచిర్యాల మండల కేంద్రంలో జిల్లా పోలీసులు గురువారం స్పెషల్‌డ్రైవ్ పెద్ద ఎత్తున నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరగిన ఈ డ్రైవ్‌లో సుమారు 600 పైగా ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. -
'ఏపీలో ఇంటెలిజెన్స్ బాగానే పని చేస్తోంది'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తోందని చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం విశాఖ జిల్లాలో రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. ఈ చర్చలో విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు 27 శాతం తగ్గాయని పేర్కొన్నారు. -
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం..
-
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్
పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయక్ కుమార్ మరణించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో అతని శవాన్ని పోలీసులు గుర్తించారు. ముగ్గురు అనుమానితులు విజయ్‌కుమార్‌ను చంపి కారుతో పరారయినట్టు భావిస్తున్నారు. ఈ ముగ్గురు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపడుతున్నారు. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఇటీవల ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు దాడికి ముందు ఎస్పీ కారును హైజాక్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్‌ను చంపి కారుతో పరారు కావడంతో ఇది ఉగ్రవాదుల చర్యే అని పోలీసులు భావిస్తున్నారు. -
పొదుపు.. భారీ కుదుపు!
-
పొదుపు.. భారీ కుదుపు!
గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ సహకార సంఘం చేతులెత్తేసింది. కిస్తీలు, డిపాజిట్ల పేరిట వసూలు చేసిన రూ.3.50 కోట్లకు పైగా సభ్యులకు కుచ్చుటోపి పెట్టింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన సోమవారం గద్వాలలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా గద్వాల పట్టణంలో ‘సేవా’ పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కుంటవీధి, తూర్పు దౌదర్పల్లి కాలనీల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. వార్డులలో ఎక్కడికక్కడ మహిళలతో సంఘాల ఏర్పాటు చేసి ప్రతి సభ్యురాలితో ప్రతి నెలా రూ.50 నుంచి రూ. 200 వరకు పొదుపు పేరుతో కట్టించుకుంటున్నారు. అలాగే, సభ్యురాలితో పాటు వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో వ్యక్తిగత డిపాజిట్లు సైతం సేకరించారు. మొత్తం 58 సొసైటీలను ఏర్పాటు చేసి.. సుమారు 11వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. సుమారు రూ.3.50 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సి ఉంది. అయితే కొన్నిరోజులుగా చెల్లింపులు నిలిపివేశారు. ఈ విషయమై సంస్థ నిర్వాహకులు సోమవారం గద్వాలలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. డబ్బు చెల్లించడానికి ప్రస్తుతం కుదరదని, సంస్థ నష్టాల్లో ఉందని, మరికొంత గడువు ఇవ్వాలని సంస్థ ప్రతినిధి విజయ్‌కుమార్ సదరు మహిళలను కోరారు. దీంతో ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయ్‌కుమార్‌తోపాటు సంఘం లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. రియల్ ఎస్టేట్‌లోకి డిపాజిటర్ల సొమ్ము ? సేవా పరపతి సహకార సంఘం పేరుతో ఖాతాదారుల నుంచి పొదుపు, డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును విజయ్‌కుమార్ తన సొంత రియల్ఎస్టేట్ సంస్థ అయిన అవని ప్రాపర్టీస్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. విజయ్‌కుమార్, అతని భార్య, కుటుంబ సభ్యుల పేరుమీద గద్వాల పట్టణ శివారులో నాలుగు వెంచర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై దృష్టిపెడితే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఖాతాదారులు కోరుతున్నారు. -
మహాత్మాగాంధీ వర్సిటీ ఇంచార్జీ వీసీ నియామకం
హైదరాబాద్: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి పాఠశాల విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి టి. విజయ్ కుమార్‌ను ఇంచార్జీ వైస్ చాన్సలర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, పూర్తి స్థాయి వీసీని నియమించేంతవరకు విజయ్‌కుమార్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య
-
నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) లో సోమవారం ఉదయం ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ లో ఫిజియోథెరిపీ ఇంటర్న్ షిప్ చేస్తున్న విజయ్ కుమార్(24) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిమ్స్ పాత బిల్డింగ్ లోని 6 ఫ్లోర్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా పటాన్ చెరువు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు విజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వం వర్సెస్ వ్యవసాయశాఖ
అదనపు సంచాలకుడిగా విజయకుమార్‌ను నియమించిన సర్కారు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వని వ్యవసాయ శాఖ ప్రభుత్వం జీవోకు విరుద్ధంగా అంతర్గత మెమో జారీ హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వునే వ్యవసాయశాఖ పెడచెవిన పెట్టింది. అదనపు సంచాలకులుగా విజయకుమార్‌ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవంటూ వ్యవసాయ శాఖ అంతర్గత మెమో జారీ చేయడం వివాదాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే అంతర్గత మెమోను వెనక్కు తీసుకునేలా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి సి. పార్ధసారధిలకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పది రోజుల క్రితం వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శినికి వ్యతిరేకంగా ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమెను బదిలీ చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి విన్నవించారు. ఈ ఆందోళనల్లో ఇన్చార్జీ అదనపు సంచాలకులు విజయకుమార్ కూడా పాల్గొన్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా జేడీఏగా ఉండగానే... సీనియర్ కావడంతో ఇన్చార్జీ అదనపు సంచాలకుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నెల 19న ఆయనను పూర్తిస్థాయిలో అదనపు సంచాలకుడిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ 20 వ తేదీన వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం ఆయన్ను రంగారెడ్డి జేడీఏగా తప్పించి మరొకరిని నియమించింది. అలాగే, ఇన్చార్జి అదనపు సంచాలకులుగా లేరని పేర్కొంటూ విజయ్‌కుమార్‌కు ఫైళ్లు పంపరాదని ఉద్యోగులకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ డెరైక్టర్ కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారని తెలంగాణ అగ్రి డాక్టర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు విమర్శించారు. జీవో ఉన్నా అంతర్గత జీవో ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. -
జనన రిజిస్టర్లో తప్పుల తడకలు
కర్నూలు(వెల్దుర్తి): మేజర్ గ్రామ పంచాయతీ వెల్దుర్తిలో ఆలస్యంగా బయటపడంతో డీఎల్పీఓ విజయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. 2000 సంవత్సరం వరకు జననానికి సంబందించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకొని సంబంధితులకు ఆమోద పత్రాన్ని అధికారులు అందజేసేవారు. అయితే రిజిస్టర్లో జనన నమోదుల్లో కొందరి అధికారులు మామూళ్లకు మొగ్గుచూపడంతో నిబందనలకు విరుద్ధంగా జననాలను నమోదు చేశారు. ఈ విషయంలో ఆలస్యంగా బయటికి పొక్కడంతో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది స్థానిక రెడ్డివీధిలో నివాసం ఉంటున్న గోపాల్‌రెడ్డి కుమారుడు జనార్దన్‌రెడ్డి బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 1994 సంవత్సరం నవంబర్ నెలకు సంబందించిన జనన సర్టిఫికేట్కోసం పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. ఆన్లైన్ విధానం లేకపోవడంతో కంప్యూటర్ నుంచి జనన సర్టిఫికేట్‌ను ప్రింటర్ నుంచి ఇచ్చారు. అయితే జనార్దన్‌రెడ్డి పేరుకు సంబంధించి తప్పుగా రావడంతో తప్పును సరిద్దిమని ఇటీవల పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తప్పులు సరిదిద్దడమైనదని ఆన్లైన్లో పత్రాన్ని తీసుకోమని చెప్పారు. మీ-సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ నెంబర్ 47కు సంబంధించి పరిశీలిస్తే నిల్‌గా చూపించడంతో బాధితుడు కంగుతిన్నాడు. జరిగిన విషయాన్ని ఈఓ ప్రకృద్దిన్కు వివరణ కోరగా రిజిస్టర్ నెంబర్ 47 అక్రమ జనన నమోదుగా ఉన్నట్లు తేల్చిచెప్పారు. నవంబర్ నెలలో 30 రోజులు అయితే 31గా నమోదు చేశారు నవంబర్ నెలకు 30 రోజులు మాత్రమే ఉంటాయి. వెల్దుర్తి పంచాయతీలో మాత్రం అధికారులు 31 రోజూ ఉన్నట్లు సృష్టించి, జనార్ద్రెడ్డికి సంబందించిన జనన సర్టిఫికేట్లో నమోదు చేశారు. ఇలా జననానికి సంబంధించిన తప్పుల తడకగా నమోదు చేసినట్లు బయటపడ్డాయి. -
ఇంకా ఆందోళనే!
ఉగ్రవాదుల చెరలోనే తెలుగు లెక్చరర్లు సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న నగరానికి చెందిన ఇద్దరు లెక్చరర్లను ఇంకా విడుదల చేయకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అల్వాల్‌కు చెందిన బలరాం, నాచారానికి చెందిన గోపీకృష్ణ ఉగ్రవాదుల చేతికి చిక్కి వారం రోజులు కావస్తున్నా, ఇప్పటికీ విడిచిపెట్టకపోవడంపై వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన లక్ష్మీకాంత్, అదే రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ విడుదలైనా, ఇప్పటివరకు తమవారిని వదిలిపెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం తమ వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నించాలని వేడుకుంటున్నారు. -
'టీచర్లు అంటే మాకెంతో గౌరవం... చంపం'
బెంగళూరు: లిబియాలో ఇద్దరు తెలుగు వారితో సహా నలుగురిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఎస్ ఉగ్రవాదులేనని నిర్ధారయింది. అపహరణకు గురైన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్(56) తెలిపారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన విజయ కుమార్ సిర్త్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తమను చీకటి గదిలో బంధించారని తెలిపారు. కిడ్నాపర్లు తమ పేర్లు, మతం, ఉద్యోగాల గురించి అడిగారని చెప్పారు. తాము యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నామని చెప్పగానే తమ పట్ల వారి వైఖరిలో సానుకూల మార్పు కనబడిందని వివరించారు. కిడ్నాపర్ల నాయకుడు తన పేరు షేక్ గా పరిచయం చేస్తున్నాడని తెలిపారు. ఎవరికో ఫోన్ చేసి అరబిక్ మాట్లాడారని, తర్వాత అతడి వైఖరితో మార్పు వచ్చిందన్నారు. 'టీచర్లు అంటే మాకెంతో గౌరవం. మీ కారణంగానే లిబియాలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. మీకు ఎటువంటి హాని తలపెట్టం' అని షేక్ తమతో చెప్పాడని వెల్లడించారు. సిర్త్‌యూనివర్సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తమను నలుగురు దుండగులు తమను కిడ్నాప్ చేశారని లక్ష్మీకాంత్ చెప్పారు. తర్వాత తమను పెద్ద గోడ ఉన్న పెద్ద హాల్ లోకి తీసుకెళ్లి తమదగ్గరున్న డబ్బు, వస్తువులు తీసుకున్నారని తెలిపారు. 'లిబియాను ఎందుకు విడిచి వెళుతున్నారు, ఇస్లాం గురించి మీకేం తెలుసో చెప్పాలని షేక్ తమను ప్రశ్నించాడు. ఆరు నెలల వయసున్న నా కుమార్తెను చూసేందుకు వెళ్లాలని నన్ను విడిచి పెట్టాలని కోరాను. ఇస్లాం గురించి వివరించాను. ఇండియాలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా కలిసివుంటున్నారని, మతసామర్యంతో పండుగలు జరుపుకుంటున్నారని తెలిపాను. ఆ రాత్రి మాకు ఆహారం పెట్టలేదు' అని లక్ష్మీకాంత్ తెలిపారు. వీరిద్దరినీ శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. -
ఆనందంలో మునిగి పోయిన కుటుంబ సభ్యులు
-
పరమానందయ్య శిష్యులకు పాఠాల్లా..
టీఆర్ఎస్ శిక్షణపై టీడీపీ ఎద్దేవా హైదరాబాద్: పరమానందయ్య శిష్యులకు పాఠాలు చెబుతున్నట్టుగా టీఆర్ఎస్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని టీడీపీ విమర్శించింది. ఫిరాయింపు దారులతో నిండిన పార్టీ.. నీతిమంతమైన రాజకీయాలకు మారుపేరుగా నిలుస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆదివారం ఆపార్టీ రాష్ట్ర నాయకుడు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. -
ఈ అమ్మాయి చాలా గ్రేట్..
మంచానికే పరిమితమైన కవలల్ని వివాహమాడిన యువతులు పెద్దలు కాదన్నా ఒప్పించి మరీ తాళి కట్టించుకున్న వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవాలన్నీ సక్రమంగా ఉండి, సరైన ఆదాయం ఉంటేనే వివాహమవడం కష్టం. అటువంటిది రెండు దశాబ్దాలుగా పడకకే పరిమితమైన కవలలను ఇద్దరు యువతులు వివాహమాడారు. మానవత్వం చాటారు. జీవితాంతం తోడుంటామని బాస చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్మాళ్ దంపతుల కుమారులైన విజయకుమార్, జయకుమార్ అనారోగ్యంతో పదేళ్ల వయసులోనే మంచం పట్టారు. తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం దక్కలేదు. వారిప్పుడు 30 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైపోయిన ఆ అన్నదమ్ముల గురించి తెలుసుకున్న కేరళకు చెందిన మంజూష సామియార్ మఠానికి చేరుకుని వారిపట్ల సానుభూతి ప్రకటించింది. అన్నదమ్ముల్లో పెద్దవాడైన విజయకుమార్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. తిరునల్వేలి జిల్లా నాంగునేరీకి చెందిన శివకులదేవి సెల్‌ఫోన్ ద్వారా జయకుమార్తో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం క్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దలు తొలుత తిరస్కరించినప్పటికీ శివకులదేవి వారిని మెల్లగా ఒప్పించింది. ఈ నెల 22వ తేదీన జయకుమార్ మంచంపై నుంచి లేవలేని స్థితిలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. -
దోపిడీ దొంగల అఘాయిత్యం
పొదిలి: ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు. పొదిలిలో మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్‌ను నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ దర్శిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో దర్శి నుంచి పొదిలికి వస్తుండగా... రాజంపల్లి వద్ద నలుగురు యువకులు అడ్డగించి రూ. 37 వేల నగదు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా అతడిని చెట్టుకు కట్టేసి కొట్టి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో 70 శాతం కాలిన గాయాలతో బాధితుడు విజయ్‌కుమార్ ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్!
మీ పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలనుకుంటున్నారా? చిన్నప్పుడు మీరు చదివిన ‘చందమామ’ పుస్తకాలు, రంగురంగుల సోవియట్ బొమ్మల పుస్తకాలు అందుబాటులో లేవే అని విచారిస్తున్నారా? ఈ ఇంగ్లీషు మీడియమ్ ఆధునిక చదువుల ప్రపంచంలో తెలుగు పుస్తకాన్ని మీ పిల్లలకు చేరువ చేయడమెలాగా అని లోలోపలే సందిగ్ధావస్థలో ఉన్నారా? అయితే, వీటన్నిటికీ పరిష్కారం ఇప్పుడు లభించినట్లే! ఒక తెలుగు ప్రచురణ సంస్థ (ఎమెస్కో బుక్స్), దేశ భాషల విశిష్టత, వికాసం, పరిరక్షణల మీద దృష్టిపెట్టే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు) కలసి ఆ కొరతను తీర్చేస్తున్నాయి. ఒక పేజీలో పెద్ద బొమ్మ, ఎదురుగా పేజీలోనే సులభమైన ఇంగ్లీషులో, కిందే తెలుగులో (ఇతర భారతీయ భాషల్లో కూడా) ఉన్న బొమ్మల పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి. ఏకంగా 22 భాషల్లో 1008 పుస్తకాలను తెచ్చాయి. ఇప్పటికి అర్ధ పుష్కరకాలం పైచిలుకుగా, కోటిన్నర పైగా ఖర్చుతో సాగుతున్న ఈ బాల సాహిత్య ‘సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం’పై ‘ఎమెస్కో’ మేనేజింగ్ డెరైక్టర్ డి. విజయకుమార్‌తో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు... ఇప్పటికి 30 ఏళ్ళుగా పుస్తక ప్రచురణ, విక్రయ రంగంలో ఉన్నాను. ‘ఎమెస్కో’ తరఫున దాదాపుగా 5 వేల పుస్తకాలు ప్రచురించా. అయితే, ప్రచురణకర్తగా ఇన్నేళ్ళ నా జీవితంలో చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ మాత్రం ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’. దీని మీద పెట్టినంత శ్రమ, పెట్టుబడి మరి దేని మీదా పెట్టలేదు. ఆవేదనతో వచ్చిన ఆలోచన... నిజానికి, ఈ పిల్లల పుస్తకాల ఆలోచనకు బీజం ఏడెనిమిదేళ్ళ క్రితం పడింది. ఒకసారి ‘వరల్డ్ బుక్ ఫెయిర్’ చూసినప్పుడు భారతీయ భాషల్లో బాలసాహిత్యం చాలా తక్కువని అర్థమైంది. మరీ ముఖ్యంగా మన తెలుగులో చిన్న పిల్లలకు ఉత్తమ బాలసాహిత్యం అందుబాటులో లేదు. చిన్నప్పుడు మా తరం చదువుకున్న ‘చందమామ’ లాంటి ఉత్తమ బాలసాహిత్య పత్రికలూ లేవు. ఈ క్రమంలో ఏమైనా చేయాలనే ఆవేదన పడుతున్నప్పుడు బొమ్మలతో కథల పుస్తకాలు ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ కాబట్టి, ఏకకాలంలో ఎక్కువ భాషల్లో తేవడం సరైన వ్యూహమని భావించా. కేంద్ర మానవవనరుల అబివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే సి.ఐ.ఐ.ఎల్. (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) వాళ్ళను అనుకోకుండా కలిశా. నా ఆలోచన వాళ్ళకూ నచ్చింది. వాళ్ళు కథ, భాష గురించి చూస్తే, నేను బొమ్మలు, పుస్తకాల ముద్రణ గురించి చూసేలా, ఉమ్మడి కాపీరైట్ ఉండేలా, ఆదాయం కూడా కలసి పంచుకొనేలా ఒప్పందానికి వచ్చాం. ఆరేళ్ళుగా ఎంతో శ్రమించి, ఇప్పటికి జనం ముందుకు కొంత తేగలిగాం. ఒక పేజీలో బొమ్మ... ఎదురుగా రెండు భాషల్లో కథ... ఒక్క ముక్కలో చెప్పాలంటే, కొత్తగా అక్షరాస్యులైనవారికీ, చిన్న తరగతులు చదివే పిల్లలకూ ఉపకరించే సాహిత్య సామగ్రి బ్యాంక్ ఇది. ఈ ప్రాజెక్ట్ కింద వచ్చే పుస్తకాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ 16 నుంచి 24 పేజీల లోపు పుస్తకాలే. వెల అందుబాటులో (రూ. 35) ఉంటుంది. పుస్తకంలో ఒక పేజీలో పెద్ద బొమ్మ, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులోనూ, దాని కిందే ఎంపిక చేసిన భారతీయ భాషలోనూ కథ ఉంటాయి. దీనివల్ల పిల్లలందరికీ ఒకే పుస్తకంతో ఇటు తమ మాతృభాష, అటు ఇంగ్లీషు - రెండూ నేర్చుకొనే వీలు కలుగుతుంది. పెపైచ్చు, ప్రతి పుస్తకం చివర ఆ భాషలో, ఇంగ్లీషులో కూడా చిన్న చిన్న అభ్యాసాలు ఉంటాయి. పుస్తకం చదివిన పిల్లలకు ఇటు వినోదం, వికాసంతో పాటు ఈ లాంగ్వేజ్ టూల్స్ ద్వారా రెండు భాషల మీద పట్టు వస్తుంది. సాంస్కృతిక ఏకీకరణకు మార్గం ప్రస్తుతానికి ‘పంచతంత్ర కథలు’, ‘జాతక కథలు’ లాంటి దేశవ్యాప్తంగా జనానికి తెలిసిన కథలను ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నాం. అలాగే, రామాయణ, భారతాల లాంటి దేశమంతటికీ తెలిసిన పురాణ కథలను కూడా ఇలా తేవడానికి బొమ్మలు వేస్తున్నాం. ఇక, తరువాతి దశలో ఆ యా ప్రాంతాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలనూ, జానపద కథలనూ, అక్కడి సాహిత్య, సాంస్కృతిక ప్రముఖుల జీవితగాథలనూ ఇలాగే అన్ని భాషల్లో పిల్లల పుస్తకాలుగా తెస్తాం. దీనివల్ల ఒక ప్రాంతపు కట్టూబొట్టూ, సంస్కృతి మరొక ప్రాంతానికి తెలుస్తాయి. ఇవాళ్టికీ దేశంలో పరాయివారుగా మిగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల వారిని అందరితో మమేకం చేయడానికి ఇది కచ్చితంగా తోడ్పడుతుంది. ఆరేళ్ళ శ్రమ... ఒకటిన్నర కోట్ల పెట్టుబడి... అది గ్రహించడం వల్లే ఈ పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సైతం ఈ విశిష్ట ప్రయత్నాన్ని ఎంతో మెచ్చుకున్నారు. సింధీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని భాషల్లో సైతం వీటిని తీసుకురావాల్సిందిగా కోరారు. వాటన్నిటిలో ఈ పుస్తకాలను తేవడానికి మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. పిల్లల పుస్తకాల ప్రచురణ నిజానికి ఒక బృహత్తర ఉద్యమం. కేవలం లాభనష్టాల ప్రాతిపదికన ఈ పని చేయలేం. సాధారణ పుస్తకాలు ప్రచురించడం వేరు. పిల్లల పుస్తకాలేయడం వేరు. పిల్లలకు తగ్గట్లు తేలికగా అర్థమయ్యే భాష వాడుతూ, వారికి ఆసక్తికరంగా ఉండేలా మంచి బొమ్మలు వేయించి పుస్తకాలు తేవడానికి బోలెడంత శ్రమ పడాలి. సహనం కావాలి. ఉదాహరణకు ఒక పుస్తకం గమ్మత్తై మూడు కాళ్ళ గుర్రం గురించి కథ. అయితే, ఆర్టిస్టు గుర్రమనగానే పొరబడి, నాలుగు కాళ్ళ గుర్రం వేశారు. తీరా ప్రింటయ్యాక చూసుకొని, 3 వేల కాపీలూ పక్కన పడేశాం. ఇలాంటి ఇబ్బందుల్ని భరించి, ఉన్నత ప్రమాణాల్లో పుస్తకాలు తేవడం సులభం కాదు. ఈ పుస్తకాల కోసం లోపలి పేజీలకు కూడా ముఖచిత్రాలకు వాడే ‘హైబల్క్ ఆర్ట్ కార్డ్’ పేపర్ ఉపయోగించాం. దీనివల్ల పుస్తకం కొన్నేళ్ళపాటు మన్నుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండడానికి హ్యాండ్ పెయింటింగ్‌లే వాడాం. ఏటా 150కి పైగా టైటిల్స్ ప్రచురిస్తున్న మేము ఆరేడేళ్ళుగా మా ఆదాయంలో 60 శాతం పైగా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుబడిగా పెట్టాం. ఇప్పటికి రూ. 1.5 కోట్ల దాకా వెచ్చించాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద బయటకు వచ్చినవి 130 కథలే. మరో 700 కథలకు బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి. (బీరువా తెరిచి చూపిస్తూ) ఇవన్నీ కథలకు వేయించిన వేలాదిబొమ్మలే! ఇలాంటి ప్రయత్నం మన భాషలు వేటిలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ జరగలేదు. గతంలో ‘అమర్ చిత్రకథ’ లాంటివి ఉన్నా, అవన్నీ ప్రధానంగా ఎదిగిన బాలబాలికల కోసం ఉద్దేశించిన కామిక్స్ తరహావి. పిల్లల మనోలోకంలోకి ఎదిగి, చేస్తున్న ఈ ప్రయత్నం వేరు. వీటి ద్వారా ఈ తరం పిల్లలకు మా చిన్నప్పటి ‘చందమామ’ పుస్తక పఠనం లాంటి అనుభూతి కలిగించాలని నా ఆశ. ఆ ప్రయత్నంలో ఏ కొంత సఫలమైనా ప్రచురణకర్తగా కన్నా, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా నాకెంతో సంతృప్తి, సంతోషం! ఫొటో: జి. రాజేశ్ ‘ఎమెస్కో బుక్స్’, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ అయిన మా సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు సంయుక్తంగా ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పిల్లల పుస్తకాల్లోని కథ, కథనం, భాష మేము చూసుకుంటే, ఆ పుస్తకాల డిజైనింగ్, లోపల వేసే బొమ్మలు, ముద్రణ వ్యవహారాలు ‘ఎమెస్కో’ చూస్తుంది. అలా ఒక రకంగా ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సాగుతున్న బృహత్తర ప్రయత్నం. రాజ్యాంగంలోని షెడ్యూల్డు భాషలన్నిటిలో, దేశంలోని అనేక గిరిజన భాషల్లో ఈ పుస్తకాలను అందించాలని మా ప్రయత్నం. ఈ నెల 21న ‘మాతృభాషా దినం’ సందర్భంగా 22 భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ తదితర 15 భారతీయ భాషలు, కుయి, ఆవో లాంటి 7 గిరిజన భాషలు) మొత్తం 1008 పుస్తకాలను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విడుదల చేశారు. డాక్టర్ అవదేశ్ కుమార్ మిశ్రా, డెరైక్టర్, సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు రెంటాల జయదేవ -
రూ.102 కోట్ల విలువైన పథకాలు పంపిణీ
ఒంగోలు సబర్బన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో సోమవారం కలెక్టర్ విజయకుమార్ రూ.102 కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 3,409 మంది లబ్ధిదారులకు ఈ పథకాలను అందించారు. డీఆర్డీఏ, వెలుగు పథకాల కింద సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు బ్యాంక్ లింకేజీ ద్వారా మొత్తం 3,250 మందికి లబ్ధి చేకూరేలా రూ.101 కోట్లు వివిధ పథకాలను పంపిణీ చేశారు. ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూలు గిరిజన బాలికలకు 26 సైకిళ్లు అందించారు. ఈ సైకిళ్ల విలువ రూ.1.17 లక్షలు. వికలాంగుల సంక్షేమశాఖకు సంబంధించి మూడు చక్రాల సైకిళ్లు 23 అందించారు. వీటి విలువ రూ.1.12 లక్షలు. గిరిజన కార్పొరేషన్లో వివిధ పథకాల కింద చిరువ్యాపారులు 18 మందికి రూ.2.70 లక్షల రుణాలు అందించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 24 కులాంతర వివాహాల దంపతులకు రూ.4.80 లక్షలు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. షెడ్యూల్డు కులాల కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 36 మందికి సబ్సిడీతో కూడిన రుణాలను అందజేశారు. వాటి విలువ రూ.22.25 లక్షలు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 32 మంది లబ్ధిదారులకు రూ.68.80 లక్షల రుణాలు ఇచ్చారు. మత్స్యకారులకు 63 మందికి టీవీఎస్ మోపెడ్, చేపలు విక్రయించేందుకు ఐస్‌బాక్సులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.9 వేలు సబ్సిడీతో వీటిని అందించారు. మినీట్రాక్టర్ పంపిణీకి సిద్ధంగా ఉంచటంతో కలెక్టర్ విజయకుమార్ మినీ ట్రాక్టర్‌ను నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొత్తం 19 స్టాల్స్‌ను, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఏర్పాటు చేశారు. స్టాల్స్‌ను కలెక్టర్‌తో పాటు ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, ఏఎస్పీ, జెసి, ఏఆర్ ఏఎస్పీ కృష్ణయ్య, ఒంగోలు డిఎస్పీ జి. శ్రీనివాసరావులు సందర్శించారు. -
జిల్లాలో ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా ఉండాలన్న ధ్యేయంతో పని చేసి ఆ లక్ష్యం సాధించామని కలెక్టర్ జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం సీపీఓ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కుటుంబానికీ కనీసం ఒక బ్యాంకు ఖాతా చొప్పున వంద శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,60,463 కుటుంబాలుండగా ఇప్పటి వరకు 6,63,000 మందికి బ్యాంకు ఖాతాలున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెల నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 6.63 లక్షల బ్యాంకు ఖాతాలు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద కొత్తగా తెరిపించామన్నారు. ఇంకా బ్యాంకు ఖాతా లేనివారుంటే, కొత్తగా తెరిపిస్తామని, ఈ ప్రక్రియ గణతంత్ర దినోత్సవం లోపుగా పూర్తి చేస్తామన్నారు. పధానమంత్రి జన్‌ధన్‌యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ ఖాతా, 5 కి.మీ. పరిధిలో బ్యాంకు సౌకర్యం లేనిచోట బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ ద్వారా బ్యాంకు సేవలందించే ఏర్పాటు చేస్తామన్నారు.పీఎంజెడివైకు సంబంధించి ప్రతి రూపేకార్డు (డెబిట్ కార్డు) ద్వారా లక్ష రూపాయలకు ప్రమాద బీమా కల్పించటం, ప్రతి డెబిట్ కార్డుపై కుటుంబానికి రూ.5 వేలు ఓవర్‌డ్రాప్ట్ కింద ఇచ్చే ఏర్పాటు, ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించడం ధ్యేయం గా పెట్టుకున్నామని కలెక్టర్ వివరించారు. ఆర్థిక అంశాలను తెలుసుకునే విధంగా ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఫైనాన్షియల్ లిటరసీ కేంద్రాలను ఏర్పాటు చేసి, వారిని ఆర్థిక విషయాలలో విజ్ఞానవంతులుగా చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 418 బ్యాంక్ బ్రాంచీలున్నాయని, 277 మం ది బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లను నియమించామన్నారు. నూతనంగా 3,92,747 ఖాతాలను తెరిచామని, అందులో 2,15,366 రూపే కార్డులను పంపిణీ చేశామని, మిగిలిన వాటిని ఈ నెల 26వ తేదీలోపు అందిస్తామని చెప్పారు. సిండికేట్ బ్యాంక్ డిజిఎం సిబిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రూపే డెబిట్ కార్డును వెంటనే తీసుకోవాలని, ప్రతి 45 రోజులకు ఒక సారైనా బ్యాంకు లావాదేవీలు జరపాలని, బ్యాంక్ లావాదేవీలు జరిగిన వారికి మాత్రమే ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని వివరించారు. సిండికేట్ బ్యాంక్‌లకు సంబంధించి ఏటీఎంల కనెక్టివిటీ సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. సిండికేట్ బ్యాంకు ఎల్డిఎం ఎం.నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషాఖాశీం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎంఎస్ మురళి, మెప్మా పీడీ కమలకుమారి, ఆయా బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నలుగురు దొంగలు..48 నేరాలు
అనంతపురం క్రైం : భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠాను సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 36 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు సోమవారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో కదిరి పట్టణం కుటాగుళ్లకు చెందిన పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి, రొద్దం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలియాస్ శీనా, కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన ఎరికల గంగన్న అలియాస్ పాచి గంగడు, కంబదూరుకు చెందిన ఎరికల సోమశేఖర్ ఉన్నారు. వీరి నుంచి 1.11 కిలోల బంగారం నగలు, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ ముఠా నేపథ్యం : పట్టుబడిన వారిలో పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి కీలక పాత్రదారి. పందుల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను తాగుడు, పేకాట, కోడి పందేలు తదితర జూదాలకు అలవాడు పట్టాడు. తాడిపత్రి, గోరంట్ల ప్రాంతాలకు వెళ్లి తరచూ జూదాలు ఆడేవాడు. ఈ క్రమంలో తక్కిన ముగ్గురు నిందితులు ఇతనికి పరిచయమయ్యారు. వీరికున్న వ్యసనాలు, దురలవాట్లు తీర్చుకునేందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో దొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. ఎవరూ లేని సమయంలో అదునుచూసి పగలు-రాత్రి తేడా లేకుండా ఇళ్ల తాళాలను పగలకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. ఇంట్లో దాచిన విలువైన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్తారు. వీటితోపాటు ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలు, పురుషులను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్తారు. ఏడాదిలో 48 నేరాలు : ఏడాదిలో ఈ ముఠా 48 నేరాలకు పాల్పడింది. వీటిలో అధికంగా ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి అల్మారా, బీరువాల్లో దాచిన బంగారు, వెండి ఎత్తుకెళ్లిన నేరాలే. అనంతపురం నగరంతో పాటు రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, కసాపురం, పాల్తూరు, తాడిపత్రి, కనగానపల్లి, ఉరవకొండ, గోరంట్ల, గుంతకల్లు, లేపాక్షి, గార్లదిన్నె, గుత్తి, కూడేరు, ధర్మవరం, యాడికి, హిందూపురం, తాడిమర్రి, విడపనకల్లు, రాయదుర్గం, కుందుర్పి, పెద్దవడుగూరు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. పీట్ల ఆంజనేయులు మినహా తక్కిన ముగ్గురు నిందితులూ పాత నేరస్తులే. ఎరికల సోమశేఖర్ చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడి రిమాండ్‌కు కూడా వెళ్లొచ్చాడు. ఎరికల గంగన్న గతేడాది కళ్యాణదుర్గం ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లొచ్చాడు. శ్రీనివాసరెడ్డి కర్ణాటకలోని వైఎన్హెచ్కోటలో జరిగిన ఓ దారిదోపిడీ కేసులో నిందితుడు. ఎస్పీ ఆదేశాలతో ముఠా గుట్టు రట్టు : దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచాలనే ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాలతో అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు జి.రాజశేఖర్, ఆనందరావు, అశోక్‌రెడ్డి, శుభకుమార్, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, జి.రాజు, జనార్దన్‌నాయుడు, ఏఎస్ఐలు సాదిక్‌బాషా, అంజాద్‌వలి, వరలక్ష్మి సిబ్బందితో బృందాలకు ఏర్పడ్డారు. ఈ క్రమంలో సీసీఎస్ డీఎస్పీకి పక్కా సమాచారం అందడంతో ఈ బృందాలు స్థానిక జాతీయ రహదారి సమీపంలో కక్కలపల్లిక్రాస్లో ముఠా సభ్యులను అరెస్టు చేశాయి. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పలువురికి వ్యక్తిగత రివార్డులు అందజేశారు. -
ఇది ఓ దర్శకుడి కథ
షఫీ ప్రధాన పాత్రలో విజయ్‌కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నేను తీసే సినిమాలకు సంబంధించిన కథ చెబితే అర్థం కాదు.. తెరపై ఆ కథ చూస్తేనే అర్థమవుతుంది అనే ధోరణిలో ఉండే దర్శకుడి కథతో ఈ చిత్రం సాగుతుంది. షఫి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. దర్శకుడు ఏం చెబితే అది చేశాననీ, ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయనీ షఫీ అన్నారు. రీ-రికార్డింగ్‌కి మంచి స్కోప్ ఉన్న కథ అనీ, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే చిత్రమిదనీ సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ తెలిపారు. -
జిల్లాకు భారీ వర్షసూచన
ఒంగోలు టౌన్: జిల్లాకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్టుమెంట్) నుంచి సమాచారం అందింది. దీంతో కలెక్టర్ విజయకుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అందరు జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే జిల్లా యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఇప్పటికే కోస్తాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల్లోకంట్రోల్ రూమ్‌లు భారీ వర్షాల హెచ్చరికలతో కలెక్టరేట్‌తోపాటు అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్(08592 - 231400, టోల్ ఫ్రీ నెం 1077)ను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు తోడు బలంగా గాలులు వీచే అవకాశాలు ఉండటంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది. -
లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
ఒంగోలు సెంట్రల్ : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం లోక్ అదాలత్‌తోనే సాధ్యమని కలెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు సముదాయాల ఆవరణలో శనివారం నిర్వహించిన రెండో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంఘటన జరిగినప్పుడు ఆగ్రహం, ఆవేదనతో పెట్టిన కేసులను అనంతరం ఉపసంహరించుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదన్నారు. అలాంటి కేసులతో పాటు ఇరువర్గాలు రాజీపడే కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లడం ద్వారా విలువైన సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు. ఇలా ఇరువర్గాలూ నష్టపోకుండా ఉండాలంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే సుప్రీంకోర్టులో పరిష్కారమైనట్లేనని, దానిపై మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్కే మహ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసులకు సంబంధించి రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించుకుని మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ప్రజలకు సూచించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. తద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతుందన్నారు. అనంతరం నిర్వహించిన లోక్ అదాలత్ కేసుల పరిష్కార కార్యక్రమంలో మొదటి కేసును ఎస్పీ శ్రీకాంత్ పరిష్కరించారు. కలెక్టర్ విజయకుమార్ రెండు ఐపీసీ కేసులు, ఒక వివాహ సంబంధ కేసును పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి.మోహన్‌కుమార్, ఏడో అదనపు జిల్లా జడ్జి రమణికృపావతి, జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి డి.అమ్మన్నరాజా, జూనియర్ సివిల్ జడ్జిలు టి.హరిత, శ్రీకుమార్‌వివేక్, ఎస్కే ఇబ్రహీం, షరీఫ్, జె.శ్రావణ్‌కుమార్, పి.లక్ష్మీకుమారి, డి.దుర్గారాణి, పలు ప్రభుత్వ శాఖల ఆధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
ఒంగోలు సెంట్రల్:ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా ఎయిడ్స్ ఆధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సంధర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీని శిధ్దా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్కె ఆర్. విజయ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్‌వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎయిడ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ర్యాలీ అనంతరం అంభేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్‌కు మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ సురక్షిత లైంగిక చర్యల వల్ల ఈ వ్యాధి రాదన్నారు. ఈ సంధర్బంగా పీ శాక్స్ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఎఆర్టి మందులను సక్రమంగా వాడితే మంచిదన్నారు. జిల్లా జడ్జి మోహ న్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు వివక్షతకు గురైతే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణా అధికారి డాక్టర్ పద్మావతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి టి. రమేష్, డాక్టర్ సరళాదేవి, డాక్టర్ జోసఫ్, నాగేంద్రయ్య, డెమోలు శ్రీనివాసరావు, పద్మజ, తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్: ప్రతి నెలా ఠంచనుగా వచ్చే పింఛన్‌ను రెండు నెలల నుంచి రాకుండా చేశారని కందుకూరు మండలం ఓగూరుకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాపోయారు. సోమవారం ప్రకాశం భవనం ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వారు తమ గోడును కలెక్టర్ విజయకుమార్‌కు విన్నవించుకున్నారు. కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా?: కలెక్టర్ ‘50 మంది అధికారులు ఒకేచోట కూర్చొని నాలుగు గంటలు పనిచేస్తున్నారు. దానివల్ల సమస్యలకు పరిష్కారం రావాలి. మీరు(అధికారులు) మాత్రం ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చినట్లుంది’ అని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు స్పష్టమైన నిర్ణయాలు రాయకుండా తూతూ మంత్రంగా కలెక్టర్‌కు అందించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పంచాయతీలోని రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు తమకు 14 నెలల నుంచి వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇన్చార్జ్ డీఎల్పీవో నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. రెగ్యులర్ కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తారు : మండల పరిధిలో మీరు చేయాల్సిన పనులు చేయకుండా నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తున్నారని పొదిలి తహశీల్దార్‌ను కలెక్టర్ నిలదీశారు. పొదిలి మండలం రాజుపాలెంలో 448 మందికి 2009లో సర్వే నెం 1064లో ఇళ్ల పట్టాలిచ్చినా ఇంతవరకు పొజిషన్లు చూపించలేదు. దాంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఐదేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్ పట్టాలు పంపిణీ చేసిన వారిలో అర్హులైన వారితో జాబితాను ప్రచురించి వెంటనే పొజిషన్లు చూపించాలని పొదిలి తహశీల్దార్‌ను ఆదేశించారు. ఏ లోకంలో ఉన్నావు ? - మార్కెటింగ్‌శాఖ అధికారిపై కలెక్టర్ మండిపాటు సుబాబుల్, జామాయిల్ రైతుల నుంచి తక్కువ ధరకు కర్ర కొనుగోలుచేసి మద్దతు ధరకు కొన్నట్లు బిల్లులు ఇస్తుండటంపై కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ కమిటీల పరిధిలో జరుగుతున్న తంతును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, ఇతర నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకిలా జరుగుతోందని మార్కెటింగ్‌శాఖ అధికారిని కలెక్టర్ ప్రశ్నించారు. సుబాబుల్ టన్ను 4400, జామాయిల్ టన్ను 4600 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చెబుతున్న ధర జిల్లాలోదా లేక దేశంలోదా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏమి జరుగుతుందో తెలియకుండా ఊహల్లో ఉండి మాట్లాడతావా అని నిలదీశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ యార్డులపై పోలీసుల సాయంతో ఆకస్మిక తనిఖీలుచేసి నివేదికలు అందించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకులా? ఉలవపాడు మండలం చాకిచర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బారాయుడు సత్రం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ గృహాలకు చెందిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించిన విషయమై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో చుట్టుపక్కన ఉన్నవారు సెప్టిక్ ట్యాంకులు కట్టారని గ్రామ ఉప సర్పంచ్ కామేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సెప్టిక్ ట్యాంకులు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినా సాయం అందలేదు: ఉలవపాడు, సింగరాయకొండ మండలాల్లోని 58 మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి అయినా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని ప్రకాశం జిల్లా యానాది యువజన సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై జాలయ్య, వై అంజిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరులో వెట్టి నుంచి విముక్తి చేసినా ప్రభుత్వం నుంచి 20 వేల రూపాయల నగదు, ఇంటి స్థలం రాలేదన్నారు. దీనిపై విచారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్..కందుకూరు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. చదువులోనూ, మెనూలోనూ వివక్ష : సంతమాగులూరు మండలం ఏల్చూరులోని కేజీబీవీ ఎస్వో తమ పిల్లలకు చదువు చెప్పించడంలో, మెనూ పాటించడంలో వివక్ష ప్రదర్శిస్తోందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2011లో ఎస్‌వోగా బాధ్యతలు స్వీకరించిన ఆవుల సునీత ఎస్సీ విద్యార్థినులను, ఇతర కులాల విద్యార్థినులను వేర్వేరుగా విభజించి వారిమధ్య తగువులు పెట్టిస్తోందన్నారు. కేజీబీవీలో ఎస్సీ కులానికి చెందిన ఎస్వోను నియమించాలని కోరారు. -
ఇద్దరూ.. ఇద్దరే..
విద్యారణ్యపురి : వివాదాలు.. వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా వస్తున్న డీఈఓపైనా వివాదాస్పద ముద్ర ఇదివరకే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారుు. హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ గత ఏడాది మే 22న విజయ్‌కుమార్ జిల్లాకు డీఈఓగా వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీలతో ఆయన ఉపాధ్యాయులను హడలెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకేసారి ఒకటి, రెండు మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేసి.. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించారు. పలువురు ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయడమే కాకుండా.. ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. దీంతో పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొన్ని సంఘాలు ఏకంగా ఆందోళన బాట పట్టగా.. మరి కొన్ని సంఘాలు విజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయ బ్యూటిఫికేషన్‌పై పెద్ద దుమారం చెలరేగింది. ఆయన పర్యవేక్షణలో ఈ పనులు జరిగారుు. డీఈఓ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అరుుతే బ్యూటిఫికేషన్ కోసం సమీకరించిన నిధుల్లో అవకతవకలక పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో డీఈఓ విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగారుు. అవకతవతకలకు సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. ఇలా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కుమార్‌పై వినూత్న కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలనూ పొందారు. జిల్లాలోని ఆత్మకూరు, గీసుకొండ, ధర్మసాగర్ మండలాలకు చెందిన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పించారు. క్యాంపులు నిర్వహించి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై సక్తి పెంపొందేలా కృషి చేశారు. ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేసేలా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. జఫర్‌గఢ్ మండలంలో కొందరు విద్యార్థులకు వంద గంటల్లో ఇంగ్లిష్ నేర్పించడం వంటి వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని సొషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లతో కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఏర్పాటు చేసి... దాని ద్వారా బాలవక్త, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈనెల 14న జిల్లాస్థాయి ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలైన ఇద్దరి విద్యార్థులకు ఓరుగల్లు సేవా ట్రస్టు నుంచి రూ. లక్ష ఇప్పిం చారు. ఓరుగల్లుసేవా ట్రస్టుకు కోశాధికారిగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యూరు. అదేవిధంగా.. దాతలపై ఆధారపడి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సృజనోత్సవాలకు ఓరుగల్లు సేవాట్రస్టు ద్వారా కలెక్టర్ కిషన్‌తో రూ.1.50 లక్షలు ఇప్పించారు. బదిలీ అరుున సోమవా రం కూడా ప్రాక్టిసింగ్ పీఎస్‌లో తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలడంతో హెచ్ఎంను సస్పెం డ్ చేయడంతోపాటు ఐదుగురు టీచర్లకు ఇంక్రిమెంట్ కట్ చేశారు. కాగా, బదిలీ అరుున డీఈఓ విజయ్‌కుమార్‌కు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. -
విన్నపాలు వినేదెవరు?
ఒంగోలు టూటౌన్: సర్కారు నిర్వాకంతో పింఛన్లు కోల్పోయిన వేలాది మంది కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఒంగోలు తరలి వచ్చారు. జన్మభూమి అనంతరం కలెక్టరేట్లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో నిండిపోయింది. నడవలేని వారు..కర్ర ఊతంతోనో..కుటుంబ సభ్యుల సాయంతోనో మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చారు. పింఛన్లు తీసేశారంటూ వచ్చిన వారిని పలకరించే నాథుడే లేకుండాపోయారు. ఉదయం 10.30కు గ్రీవెన్స్‌సెల్ ప్రారంభించగా 12 కాకుండానే వేరే కార్యక్రమాలున్నాయంటూ కలెక్టర్ విజయకుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన డీఆర్వో ఎన్ఆర్ ఖాసీం, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో అర్జీ ఎవరికి ఇవ్వాలో తెలియక..ఎక్కువ దూరం నడవలేక ఎక్కడివారు అక్కడే నిరాశగా కూలబడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎవరైనా పలకరిస్తే చాలు.. ఆగని కన్నీళ్లతో అన్యాయంగా పింఛన్ తీసేశారంటూ విలపించిన పండుటాకుల పరిస్థితి వేదనాభరితం. పింఛన్లకు రాజకీయ రంగు: చూసేవాళ్లు లేక, ఆదరించే వాళ్లు కరువైన వృద్ధులకు ఏదో కంటితుడుపుగా ఇచ్చే పెన్షన్‌కు రాజకీయరంగు పులిమారు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓట్లేశారని పగబట్టి పెన్షన్లు తొలగించారని పొన్నలూరు మండలం ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బాధితులు వాపోయారు. తన పేరు మీద ఒకటిన్నర ఎకరపొలం ఉందని పెన్షన్ తొలగించారని కోడూరి తిరుపతయ్య వాపోయాడు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారికి, 20 ఎకరాలు ఉన్న వాళ్లకి, అనర్హుల పేర్లను మళ్లీ ఇటివల జాబితా తయారు చేసి పంపారని.. అర్హులమైన తమ పేర్లు పంపలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు చేయూత: పెన్షన్ల కోసం అష్టకష్టాలు పడి ఒంగోలు గ్రీవెన్స్సెల్కి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలు చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు వారికి మధ్నాహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బాధితులు వచ్చారు. వీరందరికీ స్థానిక అంబేద్కర్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా పెన్షన్ బాధితులు వచ్చారు. ఇలా అన్ని మండలాల నుంచి వేలాది మంది పండుటాకులు తరలిరావడం చూపరులను కలచివేసింది. కొందరు వృద్ధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇంత మంది వేదనకు కారణభూతమైన ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. -
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఒంగోలు టౌన్: రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. వాగులు, వంకలు పొంగుతున్నందున ప్రజలు రాకపోకలు సాగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనిచేసేచోట తహశీల్దార్లు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ శుక్రవారం అన్ని మండలాల తహ శీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలు, వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారాన్ని జిల్లా కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు రెవెన్యూ అధికారులతోపాటు అన్ని శాఖల అధికారులను డిప్యూట్ చేసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో జేసీబీ ద్వారా వర్షపు నీరు పోయేలా డైవర్షన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. అర్హత కలిగిన పింఛన్లు తొలగిస్తే అధికారులపై వేటు: జిల్లాలో అర్హత కలిగిన వారి పింఛన్లు తొలగిస్తే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ కమిటీల ద్వారా తొలగించిన పింఛన్లలో అర్హులుంటే విచారించి జిల్లా కమిటీకి ఈనెల 15వ తేదీలోపు పంపించాలని ఆదేశించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో వయస్సు తక్కువగా చూపడం వల్ల తొలగించిన పింఛన్‌దారులకు ఈనెల 15నుంచి 20వ తేదీలోపు ప్రత్యేకంగా ఏరియా ఆసుపత్రుల్లో తేదీలను ప్రకటిస్తామని, ఆ తేదీల్లో పింఛన్‌దారులు వెళ్లి వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకొని అధికారులకు అందించాలని సూచించారు. అర్హులైన పింఛన్‌దారులను తొలగిస్తే సంబంధిత ఎంపీడీవోలపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఎపిక్, ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం: రుణమాఫీకి సంబంధించి రైతులకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు లేకుంటే ఎపిక్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తీసుకొని ఈనెల 15వ తేదీలోపు బ్యాంకుల్లో అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఒంగోలు ఆర్డీఓ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు. -
సందడిగా సృజనోత్సవం
విద్యారణ్యపురి : పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు సృజనోత్సవాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. కొందరు చిన్నారులు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తుండగా మరికొందరు విద్యార్థులు తిలకిస్తూ కేరింతలు కొడుతూ వారిని ప్రోత్సహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్, లష్కర్‌బజార్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ప్రతిభాపాటవ పోటీల సృజనోత్సవం రెండో రోజూ కనుల పండువగా కొనసాగింది. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి : డీఈఓ విజయ్ కుమార్ గ్రామ స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలని, అందుకు భవిష్యత్తులో మండల, డివిజన్ స్థాయిల్లో కూడా సృజనోత్సవం నిర్వహించాలనే ఆలోచన ఉందన్నారు. రెండోరోజు సృజనోత్సవంలో భాగంగా బుధవారం మర్కజీ హైస్కూల్లో జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ విద్యార్థులకు ఏ ఆంశంలో ఆసక్తి ఉందో గమనించి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. ఐఅండ్‌పీఆర్ డిప్యూటీ డెరైక్టర్ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. వచ్చే నెలలో కాకతీయ కల్చర్ ఫెస్ట్‌ను కూడా కలెక్టర్ నిర్వహించబోతున్నారని, అందులో కూడా విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. డివిజనల్ పీఆర్వో శ్రీనివాస్, ఎన్ఐసీ అధికారి విజయకుమార్, సృజనోత్సవం కార్యదర్శి, హెచ్ఎం ఇ. దేవేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ వల్స పైడి, బాధ్యులు రహమాన్ మాట్లాడారు. పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది సృజన్సోతవంలో నేను నాటిక పోటీల్లో పాల్గొనటం ఆనందంగా ఉంది. చిన్నోడు నాటికలో డాక్టర్ పాత్ర పోషించాను. నాకు నాటికలంటే ఇష్టం. భవిష్యత్తులో నిజంగా డాక్టర్ కావాలనేది లక్ష్యంగా చదువుకుంటున్నాను. డాక్టర్ పాత్రలో సంతృప్తిగా చేశాను. - జి. అభిషేక్, శ్రీనివాస రామనుజం హైస్కూల్, ఉనికిచర్ల పేరిణి లాస్యంలో ప్రతిభ చూపాను సృజనోత్సవం ప్రతిభాపాటవ పోటీ ల్లో పేరిణి లాస్యం నృత్యం పోటీలో పాల్గనడం ఆనందంగా ఉంది. నేను పేరిణిలాస్యంపై ఉన్న మక్కువతో శిక్షణ కూడా తీసుకుంటున్నా. ప్రతిభ ను నిరూపించుకునేందుకు మంచి అవకాశం దొరికినట్లు భావిస్తున్నా. సృజనోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. - వి. రాగశ్రీ తేజస్వీ హైస్కూల్, హన్మకొండ -
విశాఖలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల భేటీ
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కార్యకర్తల సమావేశం సోమవారం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో జరిగింది. చంద్రబాబు నాయుడు చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నిరసనలు చేపట్టనున్న విషయం తెలిసిందే. జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ధర్నా కార్యచరణపై చర్చించారు. -
రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలివ్వండి
ఒంగోలు టౌన్:జిల్లాలోని అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు, రైతులకు ఇతోధికంగా రుణాలు అందించి లక్ష్యసాధనలో బ్యాంకర్లు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నెలాఖరులోగా బ్రాంచ్ మేనేజర్లు, అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. మండల స్థాయిలో నిర్వహించే జేఎంఎల్బీసీలో, గ్రామ సభల్లో బ్రాంచ్ మేనేజర్లు విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. బ్రాంచ్ మేనేజర్లు హాజరు కాకుంటే ఎందుచేత హాజరు కాలేదో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. 28 నుంచి గ్రామాల ఎంపిక వివిధ కార్పొరేషన్లలో యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్, లబ్ధిదారులకు సంబంధించి ఈనెల 28, 29 తేదీల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో మండల కమిటీల ద్వారా గ్రామాల ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 30, 31 తేదీల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నవంబర్ 12 నుంచి 28వ తేదీ వరకు గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. డిసెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. 9 నుంచి 21వ తేదీ వరకు డాక్యుమెంటేషన్, బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియ నిర్వహించాలన్నారు. 23 నాటికి స్క్రూట్నీ నిర్వహించి తుది జాబితా జిల్లా కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. 23 నుంచి 31వ తేదీలోపు కార్పొరేషన్ అధికారులు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 5 నుంచి సంబంధిత రంగాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. 19 నుంచి 31వ తేదీలోపు మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు రిసోర్స్ పర్సన్స్, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారితో శిక్షణ ఇప్పించాలన్నారు. గతంలో మంజూరై గ్రౌండింగ్ అయిన యూనిట్లకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు బ్యాంకర్లు సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకుల ద్వారా పౌరులకు అందాల్సిన సేవలు, మౌలిక వసతులు సక్రమంగా కల్పించాలని ఆదేశించారు. క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ: 2015-2016 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను కలెక్టర్ విజయకుమార్ ఆవిష్కరించారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్, స్టెప్, పశుసంవర్ధకశాఖ, మెప్మాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సంబంధిత అధికారులు వివరించారు. డీఆర్డీఏ, ఐకేపీ తరఫున సెప్టెంబర్‌లో రూ.332 కోట్లు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ లక్ష్యం కాగా, రూ.183 కోట్లు చేరుకున్నట్లు పీడీ పద్మజ వివరించారు. సమావేశంలో సిండికేట్ బ్యాంకు డీజీఎం పీబీఎల్ నరసింహారావు, నాబార్డు ఏజీఎం జ్యోతిశ్రీనివాస్, ఆర్బీఐ ప్రతినిధి మురళీధర్, ఎల్డీఎం నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి, స్టెప్ సీఈవో బీ రవి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. 31లోపు హౌస్ హోల్డ్ సర్వే పూర్తిచేయాలి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు సంబంధించి జిల్లాలో హౌస్ హోల్డ్ సర్వే ఈనెల 31నాటికి పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ పద్మజను కలెక్టర్ ఆదేశించారు. సర్వే చేసిన వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. సర్వేకు సంబంధించిన ఫారాలు అన్ని బ్యాంకులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే చేసిన వివరాలను అకనాలెడ్జ్మెంట్తో సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండేలా బ్యాంకర్లు సహకరించాలని సూచించారు.