Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films Details Inside - Sakshi
Sakshi News home page

Uriyadi Vijay Kumar: ఆ నిర్మాణ సంస్థలో రెండోసారి విజయ్‌ సినిమా..

Published Wed, Jul 13 2022 4:54 PM | Last Updated on Wed, Jul 13 2022 5:27 PM

Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films - Sakshi

Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films: 'ఉరియడి' చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కుమార్‌. ఆ తర్వాత సూర్య, జ్యోతికల నిర్మాణా సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'ఉరియడి-2' చిత్రం చేసిన ఈయన తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. రీల్‌ గుడ్ ఫిలీంస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇది ఈ సంస్థలో ఆయన చేస్తున్న రెండో చిత్రం. 

ప్రీతి అస్రాణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి 'సేతుమాన్‌' చిత్రం ఫేమ్‌ తమిళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్‌ జయ రాజ్‌ ఛాయగ్రహణం, వసంత గోవింద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ సంఘటనలతో పక్కా కమర్షియల్‌ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 

చదవండి: నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్‌
జీవితంలో వారు మనకు స్పెషల్‌: నాగ చైతన్య
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement