చెన్నై సినిమా: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్‌ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు.
నటుడు శరత్‌కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్‌కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా
షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా?
Comments
Please login to add a commentAdd a comment