sharath kumar
-
Kannappa: నాథనాధుడుగా శరత్ కుమార్..లుక్ అదిరింది!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు(జులై 14) ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. On the special occasion of @realsarathkumar Garu's birthday, Team #Kannappa🏹 is thrilled to introduce him as Nathanadhudu! Wishing you a legendary year ahead 🏹@24FramesFactory @avaentofficial @KannappaMovie#HBDSarathkumar #KannappaMovie #ATrueIndianEpicTale #HarHarMahadevॐ pic.twitter.com/MMyUMTo8ge— Kannappa The Movie (@kannappamovie) July 14, 2024 -
తమిళ డైరెక్టర్ కొడుకు హీరోగా ‘ హిట్ లిస్ట్’
తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
త్వరలోనే రామదాస్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !
తమిళ నటుడు శరత్‌కుమార్, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'క్రిమినల్'. దక్షిణామూర్తి ఈ చిత్రాన్ని పర్సా పిక్చర్స్, పీఆర్.మీనాక్షీసుందరం, బిగ్ ప్రింట్ పిక్చర్స్, ఐబీ.కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నానని వాటిని తెరకెక్కించడానికి పలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. (ఇది చదవండి: Neha Shetty: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ‘రాధిక’) అలాంటి సమయంలో తనకు టీకొట్టు వద్ద ఒక ఆలోచన వచ్చిందని అదే క్రిమినల్ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నటుడు శరత్‌కుమార్, గౌతమ్ కార్తిక్ ఈ కథలోకి రావడంతో చిత్రానికి ఇంకా భారీ క్రేజ్ వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్లో నిర్మాతలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రం మాదిరి మదురై నేపథ్యంలో ఇంతకుముందు పలు ప్రేమ కథా చిత్రాలు వచ్చాయని.. అయితే వాటికి క్రిమినల్ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగే క్రైమ్, థ్రిల్లర్ సంఘటనలే ఈ చిత్రమని అన్నారు. కాగా దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్, విడుదల తేదీలను వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. Thanks @SilambarasanTR_ for releasing our #Criminal movie First Look poster and for your wishes. https://t.co/U3ggy655Og — Parsa Pictures Pvt Ltd (@ParsaPictures) August 25, 2023 -
'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
టైటిల్: పోర్ తొళిల్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా దర్శకుడు: విఘ్నేశ్ రాజా సంగీతం: జేక్స్ బెజోయ్ ఎడిటర్: శ్రీజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ విడుదల తేది: 2023 ఆగస్టు 11 (సోనీ లివ్) థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అలా కొన్నాళ్ల ముందు తమిళంలో విడుదలైన 'పోర్ తొళిల్' సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ స్టోరీకి తోడు సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్(అశోక్ సెల్వన్) వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా ఉంటుంది. తిరుచ్చిలో జరిగిన ఓ మర్డర్ కేసు విచారణ బాధ్యత ఈ ముగ్గురికి అప్పగిస్తారు. దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చివరకు లోకనాథన్, ప్రకాశ్, వీణ... హంతకుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే 'పోర్ తొళిల్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా ఏదైనా సరే దాదాపుగా రెండే అంశాలు ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటిలో ఏదో ఓ పాయింట్ ఆధారంగానే దాదాపు అన్ని మూవీస్ తీస్తుంటారు. 'పోర్ తొళిల్'కి కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. అయితే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే థ్రిల్. మూవీ చూస్తున్నంతసేపు మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ ఏదో ఓ కొత్త ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మ్యాజిక్ అదే. ఫస్టాప్ విషయానికొస్తే.. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ చోట యువతి శవం కనిపిస్తుంది. అలా ఫస్ట్ సీన్‌తోనే దర్శకుడు నేరుగా పాయింట్లోకి తీసుకెళ్లిపోయాడు. అనంతరం ఎస్పీ లోకనాథన్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్ పాత్రల పరిచయం. మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉండే ఈ ఇద్దరు కలిసి, ఓ మర్డర్ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలోనే వీళ్లకు ఆధారాలు ఒక్కొక్కటిగా దొరకడం.. ఇలా స్టోరీ చకచకా పరుగెడుతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓ టెంపోలో సాగిన సినిమా.. సెకండాఫ్‌లో మాత్రం మంచి ట్విస్టులతో మరో రేంజుకి వెళ్లింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మంచి థ్రిల్ ఇచ్చే సీన్స్‌తో ఎండ్ చేయడం బాగుంది. ఓవైపు లోకనాథన్, ప్రకాశ్... మర్డర్ కేసు దర్యాప్తు చేస్తుండగానే వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా సాధారణ ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్ అమాయకత్వంతో సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది. సీన్స్ అన్నింటికీ క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం బాగుంది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని కాకుండా చివర్లో ఓ సందేశం ఇచ్చారు. అయితే అది చూసిన తర్వాత నిజంగానే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో కిల్లర్స్‌లా మారతారా అనే డౌట్ వస్తుంది. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కనిపించే పాత్రలు చాలా తక్కువ. కాకపోతే ప్రతి ఒక్కరినీ దర్శకుడు బాగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌గా అశోక్ సెల్వన్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రకాశ్ పాత్ర మొదట భయస్తుడిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మారిపోతుంది. వీణగా నిఖిల్ విమల్ బాగానే చేసింది. ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనుకుంటాం. కానీ మూవీ చివరకొచ్చేసరికి ఈమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. కెన్నడీగా శరత్‌బాబు రోల్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. 'పోర్ తొళిల్' సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, దర్శకుడు విఘ్నేశ్ రాజాతో కలిసి మంచి థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు అందించారు. హీరోహీరోయిన్లు ఉన్నారు కదా అని లవ్ ట్రాక్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు మంచి పనిచేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే 'పోర్ తొళిల్' బెస్ట్ ఆప్షన్. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ
మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే దాన్ని ఆదరించాలి. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు చాలామంది మూవీ లవర్స్‌కి మనసులో ఉన్నమాట. అలా వాళ్లు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. పేరుకే ఇది థ్రిల్లర్ సినిమా అయ్యుండొచ్చు కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే సమ్‌థింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) స్ట్రీమింగ్ డేట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. కరెక్ట్‌గా తీయాలే గానీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలా తమిళంలో జూన్ 9న రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమా 'పోర్ తొడిల్'. యంగ్ హీరో అశోక్ సెల్వన్, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అయితే పోలీసులు-మర్డర్ మిస్టరీ ఇలాంటివి చాలా చూశాం కదా అని మీరనుకోవచ్చు కానీ వాటితో పోలిస్తే ఇది స్పెషల్. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. ఆగస్టు 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 'పోర్ తొడిల్' కథేంటి?ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. మనోడికి కాస్త బిడియం, భయం. అడిషనల్ డీజీపై ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్‌లోని సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుంది. తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే నగరంలో ఇదే రీతిలో జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. ఇంతకీ వీళ్లని చంపుతన్నది ఎవరు? ప్రకాశ్-లోకనాథ్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ. తమిళంలో సెన్సేషన్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో? The wait is over! The Thriller Sensation that Shattered Box Office Records, "Por Thozhil" is streaming on Sony LIV from Aug 11th.#PorThozhilOnSonyLIV #PorThozhil #SonyLIV @ApplauseSocial #E4Experiments @epriusstudio @nairsameer @SegalDeepak @e4echennai @cvsarathi pic.twitter.com/LOthMauGbD — Sony LIV (@SonyLIV) August 1, 2023 (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!) -
ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, ఆల్ ఇండి యా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి తతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చ ర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా తదితర అంశాలపై ఇరువు రూ మాట్లాడుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్య కలాపాల విస్తరణ ప్రణాళికలో భాగంగా వివి ధ రాష్ట్రాలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రుల తో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితతో శరత్‌కుమార్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం శరత్‌కుమార్‌కు కవిత పోచంపల్లి శాలువాతో పాటు జ్ఞాపికను అందజేశారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను సరిదిద్దాలి.. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులను సరిదిద్దేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్ చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కవిత డిమాండ్ చేశారు. ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. చదవండి: ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! ఆస్తిపన్ను ఆదాయం పెంపునకు జీహెచ్ఎంసీ చర్యలు -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా.. త్వరలో షూటింగ్
చెన్నై సినిమా: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్‌ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. నటుడు శరత్‌కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్‌కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? -
మరోసారి కరోనా బారిన పడ్డ హీరో శరత్ కుమార్
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్ కుమార్ ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సొకింది. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో శరత్ కుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Good evening my near and dear friends relatives and my brothers and sisters In the political party,this evening I have tested positive and have self isolated myself,I humbly request all the dear ones who have been in contact for the past week to test yourself immediately — R Sarath Kumar (@realsarathkumar) February 1, 2022 -
పరంపర వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: పరంపర కథ: హరి యేలేటి దర్శకత్వం: కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ నేపథ్య సంగీతం: నరేష్ కుమారన్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల: 24 డిసెంబర్ 2021 బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్ సిరీస్ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్, జగపతి బాబు, శరత్ బాబు వంటి, ఆమని వంటి సీనియర్ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే హాట్‌స్టార్ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇది కావడం విశేషం. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: రాజకీయం, పవర్, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్‌మేకర్‌గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. సెంటిమెంట్‌తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్ (ఇషాన్)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. విశ్లేషణ: కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్‌తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్ సిరీస్. ఈ యాక్షన్ సీన్‌తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్ను చూపించారు దర్శకులు. పొలిటికల్ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్‌ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు. హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి కృష్ణ విజయ్. ఎల్ డైరెక్ట్ చేయగా మిగతా ఎపిసోడ్లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా తీశారు. అస్సలు బోర్ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్ చేశారు. చివరి రెండు ఎపిసోడ్లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు. అయితే క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్‌లా ఉండదు. ఇంకా వెబ్ సిరీస్ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. వెబ్ సిరీస్‌కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు క్రైమాక్స్ అలా ప్లాన్ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్‌తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్‌లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే: నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్, నెగెటివ్ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్ కుమార్ వెల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో శ్రీతేజ్, ప్రవీణ్ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్ చంద్రకు మంచి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్ చంద్ర. అప్పటివరకు సైలెంట్‌గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్ పాత్రలో ఇషాన్ (రోగ్ ఫేమ్) నటించి పర్వాలేదనిపించాడు. రచనగా హీరోయిన్ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్‌గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్‌ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. -
పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం
Kannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్‌తో తదితరులు హాజరయ్యారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్‌వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్‌ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్‌ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్‌తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్‌ను లోపలికి అనుమతించారట. చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్ కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్‌లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్‌పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్‌పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు. -
మా సీఎం అభ్యర్థి కమలహాసన్
సాక్షి, చెన్నై: తమ కూటమి సీఎం అభ్యర్థిగా కమలహాసన్‌ను అంగీకరిస్తున్నట్టు ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ తెలిపారు. కూటమి, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ ఎస్ఎంకే కార్యవర్గం బుధవారం తీర్మానించింది. సమత్తువ మక్కల్ కట్చి రాష్ట్ర కార్యవర్గం భేటీ తూత్తుకుడి జిల్లా ద్రవ్యపురంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు, కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషన్ల అమలతో ఎదురయ్యే నష్టాలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ భావితరాల శ్రేయస్సును కాంక్షిస్తూ, త్యాగాలకు సిద్ధం కావాలని ఎస్ఎంకే కేడర్‌కు పిలుపునిచ్చారు. ఓటును నోటుతో కొనేయ వచ్చన్న ధీమాతో కొందరున్నారని, వారి ప్రలోభాలకు లొంగ వద్దు అని సూచించారు. లొంగిన పక్షంలో భావితరాలకు అష్టకష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఈ పాలకులకు ప్రచారాలకు శరత్‌కుమార్ కావాల్సి వచ్చాడని, ఇప్పుడు శరత్‌కుమార్ అంటే ఎవరో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పే రీతిలో ఈ ఎన్నికల్లో తన పయనం ఉంటుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించడమే కాదు, అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఐజేకే, మక్కల్ నీది మయ్యం వంటి పారీ్టలతో కలిసి కూటమిగా ఎస్ఎంకే ముందుకు సాగుతున్నదని ప్రకటించారు. ఈ కూటమి ఖరారైందని, ఈ కూటమి సీఎం అభ్యరి్థగా కమల్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాధికా కూడా పోటీ చేయనున్నారని తెలిపారు. అది ఏ నియోజకవర్గం అన్న కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే, ఎస్ఎంకే 26 సీట్లలో తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. -
మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి: కమల్
చెన్నె: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రకటన వెలువడిన తెల్లారే మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ రాజకీయ దూకుడు పెంచారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్త పొత్తు ఏర్పాటుచేశారు. తనతో కలిసి వచ్చే వారిని కలుపేసుకుని వెళ్తానని ఈ సందర్భంగా కమల్ ప్రకటించాడు. ఎంఎన్ఎం పార్టీ 2018లో స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కమల్ హాసన్ రాజకీయాల్లోకి దిగారు. అవినీతి రహిత తమిళనాడును మార్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కమల్ పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కమల్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తన స్నేహితుడు అగ్ర నటుడు రజనీకాంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. తనకు మద్దతు పలకాలని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై రజనీ ఇప్పటివరకు ఏం స్పందించలేదు. తాజాగా కమల్ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌ను కలిశారు. ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారుచేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అయితే మూడో కూటమి సీఎం అభ్యర్థిని తానేనని కమల్ స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని.. మార్చి 7వ తేదీకి తొలి విడతగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ హాసన్ వివరించారు. మంచి పనుల కోసం తాను తగ్గడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. దీనర్థం కుదిరితే అన్నాడీఎంకే, డీఎంకే, శశికళతో కూడా కలిసేందుకు సిద్ధమని పరోక్షంగా కమల్ చెప్పారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కమల్ హాసన్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
'నాంది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఎన్నికల బరిలో సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై: సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. నటిగా రాధిక అందరికీ సుపరిచితురాలే. భర్త శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు. బీజేపీలోకి కరాటే.. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి శ్రమించిన నేత కరాటే త్యాగరాజన్. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినానంతరం రజనీకాంత్ పార్టీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో త్వరలో ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం అని మద్దతుదారులు పేర్కొంటున్నారు. రాహుల్ పర్యటనలో మార్పు.. తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించిన రాహుల్‌గాంధీ మలి విడతకు సిద్ధమయ్యారు. 14 నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, 14వ తేదీ ప్రధాని రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. దీంతో రాహుల్ పర్యటనలో స్వల్పమార్పులు తప్పలేదు. ఈనెల పదిహేను తర్వాత రాహుల్ పర్యటన తేదీ ప్రకటించనున్నారు. -
రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయండి
పెరంబూరు: నటుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే, రెడియన్స్ మీడియా సంస్థకు నటుడు శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ చెల్లించాల్సిన రూ.2 కోట్లు ఇవ్వకపోవడంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా చెన్నై , సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ రేడియన్స్ మీడియా సంస్థ తరఫున శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్‌లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్లు రాలేదు.దీంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు. -
రాధారవి, శరత్‌కుమార్ అరెస్టుకు ఆదేశం
సాక్షి, చెన్నై: సినీ నటులు రాధారవి, శరత్‌కుమార్‌ల అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రా«ధారవి కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నటీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
జతగా...
20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత శరత్ కుమార్, రాధిక దంపతులు ఆన్ స్క్రీన్ కూడా జోడీగా నటించనున్నారు. గతంలో ‘నమ్మ అన్నాచ్చి, సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక కలసి నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా విక్రమ్ ప్రభు హీరోగా ధన దర్శకత్వంలో ‘వానమ్ కొట్టటుమ్’ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మడోనా సెబాస్టియన్ కథానాయిక. ఈ చిత్రానికి కథ– మాటలు మణిరత్నం, ధన సమకూర్చారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
ద్వేషం స్థానంలో ప్రేమ నిండాలి
‘‘ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం (ఆగ్రహావేదన). అవును.. మా నాన్నగారు సూపర్ బ్లెస్డ్. అద్భుతమైన భార్య దొరికారు. నలుగురు సంతానం ఉన్నారు. ఒక మనవడు ఉన్నాడు. ఆయన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంది. మాది మిక్స్డ్ ఫ్యామిలీ. మమ్మల్ని ట్రోల్ (విమర్శించే) చేసే వారి మనసుల్లోని ద్వేషం స్థానంలో ప్రేమ నిండుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రేయాన్. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? నటిరాధిక మొదటి కుమార్తె రేయాన్. కాగా, శరత్‌కుమార్, రాధికలు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవల శరత్ కుమార్, రాధికల పెళ్లిరోజు సందర్భంగా రేయాన్ తన కొడుకుతో శరత్–రాధికలు ఉన్న ఫోటోను ‘లవ్‌బర్డ్స్. హ్యాపీ యానివర్సరీ’ అనే ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. రేయాన్ చేసిన ఈ పోస్ట్‌ను కొందరు నెటిజన్లు ‘‘శరత్‌కుమార్ ఈజ్ బ్లెస్డ్. రెండో భార్య రాధిక మొదటి కుమార్తె (రేయాన్) కొడుకుతో శరత్ కుమార్’’ అని హేళన చేసే విధంగా పేర్కొన్నారు. ఈ కామెంట్‌కే రేయాన్. పైవిధంగా స్పందించారు. రేయాన్ చేసిన పోస్ట్‌ను రాధిక ట్యాగ్ చేసి...‘‘రేయాన్.. మన బాధ ఎవరికీ తెలీదు. కానీ మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను చూడటానికి అర్హత లేని గుడ్డివారు ట్రోల్ చేస్తున్నారు. వారిని అలాగే వదిలేయ్. అలాగే వేదనతో బతకనివ్వు. మనం మనలాగే హ్యాపీగా ఉందాం’’ అని అన్నారు రాధిక. -
ఇంకేం ఇంకేం కావాలే...
క్లాప్‌బోర్డులు, ఆర్క్ లైట్లు, స్టార్ట్ కెమెరా, షాట్ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్‌లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్ ప్లేసెస్ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్ రీ–యూనియన్’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్‌గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. ఈసారి వీళ్లు మిస్సింగ్. వైట్ అండ్ బ్లూ కలర్‌ని డ్రెస్‌కోడ్‌గా ఫిక్స్ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్‌లాల్, సీనియర్ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్, శరత్‌కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్ చేశారట. మోహన్‌లాల్ కేరళలోని సంప్రదాయపు బోట్ నడుపుతున్నట్టు యాక్ట్ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం. -
ఇదీ న్యూసేనా?
విజయ్, మురుగదాస్‌ల లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగార్ పట్టుకొని పొగ తాగుతున్న స్టిల్ హాట్ టాపిక్‌గా మారింది. మోరల్‌గా ఇది కరెక్టా? కాదా అని తమిళనాడులో చాలా డిబేట్స్ నడిచాయి. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని నటుడు శరత్‌కుమార్‌ని అడగ్గా –‘‘హీరోలు స్మోక్ చేయడం తప్పా? కరెక్టా? అన్నది న్యూస్ అవ్వడం విశేషం. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. ఇటీవల జరిగిన సర్వేలో స్త్రీలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది. అది సీరియస్ విషయం. దాన్ని ఎలా తగ్గించాలి. ఎలాంటి అవగాహన తీసుకురావాలి అనేది న్యూస్ అవ్వాలి, దాని మీద డిబేట్లు జరగాలి కానీ సినిమా పోస్టర్ల మీద, ఇంకో ఇంకో విష యాల్లో కాదు’’ అని ఘాటుగా స్పందించారు. -
ప్రకృతే సాక్ష్యం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వరన్ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు. ‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్ చేసిన టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. టైమ్ మ్యూజిక్ సౌత్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పగపట్టాడు
ఇదివరకు చాలా సినిమాల్లో సాగరకన్యను చూశారు. ఇప్పుడు సాగర వీరుడుని చూపించబోతున్నాం అంటున్నారు తమిళ హీరో శరత్‌కుమార్. ఏ.వెంకటెశ్ దర్శకత్వంలో శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాంబన్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్స్‌లో శరత్ కుమార్ సగం మనిషి, సగం సర్పంలా కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ గెటప్ చూడగానే మనిషి సర్పంగా మారాడా లేక సర్పం మనిషిగా మారిందా? అనే అసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాము పగపట్టిందంటే తీర్చుకునే వరకు వదలదు అంటారు. మరి ఆగ్రహం నిండిన కళ్లు, చేతిలో శూలం చూస్తుంటే ఈ పాము మనిషి ఎవరి మీదో పగతో రగిలిపోతున్నట్టుగా ఉంది కదూ. మరి ఈ సినిమాలో ‘సర్ప మనిషి’గా కనిపిస్తున్న శరత్‌కుమార్ ఎవరి మీద బుసలు కొడతాడో? ఎలా పగ తీర్చుకుంటాడో చూడాలి. గతంలో దర్శకుడు వెంకటేశ్– శరత్‌కుమార్ కాంబినేషన్లో ‘మహాప్రభు, చాణక్య’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈసారి కూడా హిట్ ఖాయం అంటున్నారు.