భయపెడుతున్న సీనియర్‌ నటుడు | Sharath Kumar Look in Pamban | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 1:36 PM | Last Updated on Wed, Jan 31 2018 3:53 PM

Sharath Kumar In pamban - Sakshi

‘పాంబన్‌’ సినిమాలో శరత్‌ కుమార్‌

తెలుగులో సహాయ పాత్రల్లో ఆకట్టుకుంటున్న సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కోలీవుడ్‌ లో లీడ్‌ రోల్స్‌లో నటిస్తూ అలరిస్తున్నాడు. తమిళ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సీనియర్‌ స్టార్‌ వెండితెరపై ఆసక్తికర పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లోనే తొలి సారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నారు శరత్ కుమార్. గ్రాఫిక్స్‌ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ ఫాంటసీ మూవీ పాంబన్‌ అనే టైటిల్‌ తో రూపొందుతోంది.

ఈ సినిమా రోజు బుధవారం చెన్నై లో ప్రారంభమయ్యింది. సినిమా ఓపెనింగ్‌ సమయంలోనే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. శరత్‌ కుమార్‌ స్నేక్‌ మ్యాన్‌గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్స్‌ కోలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వెంకటేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ దేవా సంగీత మందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement