గుండెముక్కలైంది.. టాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం | Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence | Sakshi
Sakshi News home page

Meena Husband Vidya Sagar Dies: మీనా భర్త హఠాన్మరణం పట్ల సెలబ్రిటీల సంతాపం..

Published Wed, Jun 29 2022 12:51 PM | Last Updated on Wed, Jun 29 2022 1:10 PM

Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence - Sakshi

Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్‌ హీరోయిన్‌ మీనా భర్త విద్యాసాగర్‌ మరణించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్‌ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్‌ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్‌, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్‌ మృతిపట్ల సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 

'విద్యాసాగర్‌ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
 


'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు.

'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్‌ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. 
 


'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్‌ కుమార్‌ తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement