husband died
-
బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తపై భార్య దాడి, మృతి
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు దుబాయ్‌కు తీసుకెళ్లలేదని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడికి దిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విచిత్ర ఉదంతం పుణెలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. వానావ్డీ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో 36 ఏళ్ల నిఖిల్ ఖన్నా, తన భార్య రేణుక(33)తో కలిసి జీవిస్తున్నాడు. వీరు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. నిఖిల్ నిర్మాణ రంగంలో వ్యాపారిగా పనిచేస్తున్నారు. ఇటీవల రేణుక బర్త్‌డే జరగ్గా.. ఆ వేడుకలను జరుపుకునేందుకు దుబాయ్ వెళ్దామని శుక్రవారం మధ్యహ్నాం తన భర్త నిఖిల్‌ను అడిగింది. ఇందుకు అతడు నిరాకరించాడు. పుట్టినరోజు, పెళ్లి రోజు నిఖిల్ తన భార్యకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది. కనీసం కొంతమంది బంధువులతో అయినా ఢిల్లీ వెళ్లి సెలబ్రేట్ చేసుకుందని తన భర్తను కోరినప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందర రాలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ ఆవేశంలో నిఖిల్ ముఖంపై రేణుక గట్టిగా కొట్టింది. దీంతో నిఖిల్ ముక్కుకు గాయమైంది, అతని పళ్లు కూడా కొన్ని విరిగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేణుకను అదుపులికి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: పెళ్లై 11 ఏళ్లు, పిల్లలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం -
నాడు కరోనాతో భర్త మృతి.. ఇప్పుడు సమాధి తవ్వి అస్తికలు తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన తన భర్త అస్తికల కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన భర్తను ఖననం చేసిన ప్రాంతంలో ఏకంగా తవ్వకాలు జరిపింది. అనంతరం, అతడి అస్తికలను స్వగ్రామంలో ఖననం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన జే పాల్, జాలీ పాల్ జంట యూపీలోని ఫరూఖాబాద్‌లో నివాసం ఉంటోంది. అయితే, కరోనా సమయంలో వైరస్ కారణంగా భర్త ఈజే పాల్ మృతి చెందాడు. లాక్డౌన్ కారణంగా భర్త మృత దేహాన్ని ఆమె కేరళలోని అతని స్వగ్రామానికి తీసుకువెళ్లలేకపోయింది. భర్త మరణానంతరం ఆమె మాత్రం తిరిగి కేరళ వెళ్లిపోయింది. అయితే, ఆమె తన భర్త అందించిన ప్రేమను మరచిపోలేకపోయింది. దీంతో, జాలీ పాల్ తన భర్త అస్థికలను కేరళ తీసుకువెళ్లి, అక్కడ తిరిగి ఖననం చేసేందుకు ఫరూఖాబాద్‌లోని శ్మశాన వాటికలో తవ్వకాలు జరిపేందుకు జిల్లా అధికారుల అనుమతి కోరింది. ఆమె వినతిని స్వీకరించిన అధికారులు పాల్ సమాధిని తవ్వేందుకు అనుమతినిచ్చారు. స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో పాల్ సమాధి తవ్వకాలు జరిపి, అస్థికలను వెలికితీశారు. ఇప్పుడు జాలీ పాల్ వీటిని తీసుకుని కేరళ వెళ్లి, అక్కడ వాటిని ఖననం చేయనుంది. ఈ సందర్భంగా జాలీ పాల్ మాట్లాడుతూ తన భర్త పాల్ సెంట్ ఏంథనీ స్కూలులో టీచర్ అని తెలిపింది. కరోనా కాలంలో తన భర్త మృతి చెందాడని, లాక్డౌన్ కారణంగా తన భర్త మృతదేహాన్ని కేరళ తీసుకువెళ్లలేకపోయానని పేర్కొంది. అందుకే ఇప్పుడు భర్త అస్థికలను కేరళ తీసుకువెళ్లేందుకు అధికారుల అనుమతి తీసుకున్నానని స్పష్టం చేసింది. వాటిని కేరళలోని తమ స్వగ్రామంలో ఖననం చేయనున్నానని పేర్కొంది. ఇది కూడా చదవండి: రెండేళ్ల ప్రేమ, పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. చివరకు.. -
అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన
ఆలమూరు/అంబాజీపేట(కోనసీమ జిల్లా): వచ్చేవారం అతని భార్యకు వైద్యులు ప్రసవ తేదీని ఇచ్చారు. ఆ కుటుంబంలో మరొకరు చేరుతారన్న ఆనందం అట్టే కాలం నిలువలేదు. రోడ్డు ప్రమాదం అతనిని పొట్టన పెట్టుకోవడంతో ఒక్కసారిగా విషాదం అలముకొంది. ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల లాకుల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన యలమంచిలి నాగరాజు (45) మృతి చెందినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం ద్విచక్ర వాహనంపై వస్తున్న నాగరాజును చొప్పెల్ల లాకుల సమీపంలో రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఐసర్ వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరంలోని హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న నాగరాజు తన తల్లిని చూసేందుకు సొంత ఊరికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య శాకర్య కుమారి, ఐదేళ్ల కుమార్తె విషీక ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఐదేళ్ల కుమార్తె విషీక అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు? మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామని అమాయకంగా అడుగుతున్న తీరు ఘటనా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: 30 ఏళ్లకే గుండెపోటు.. కారణాలేంటి?.. ఇలా చేయకపోతే డేంజర్లో పడినట్టే! -
వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్
నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా, నటిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సహానటి, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే గత నెల మీనా భర్త విద్యాసాగర్ హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో.. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్ కోవిడ్, ఊపరితిత్తుల సమస్యలతో అనారోగ్య బారిన పడ్డారు. ఆయన లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ జూన్ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి భర్త విద్యాసాగర్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం(బహుమతి). కానీ చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా(నా) గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతరాలిని. మీలాంటి వారి ఆశ్వీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి’ అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా మీనా, విద్యాసాగర్‌ను 2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా
భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’ ‘విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా. చదవండి: వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు.. కాగా గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్‌డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్‌లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
సీనియర్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ( ఫైల్ ఫోటో ) ( ఫైల్ ఫోటో ) -
భార్య కాపురానికి రాలేదని.. భర్త ఆత్మహత్య
నాగర్‌కర్నూల్: భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్‌కాలనీకి చెందిన రాజవర్ధన్‌రెడ్డి (30) ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు రెండేళ్లక్రితం వివాహం కాగా కుటుంబ కలహాలతో ఆరు నెలల కిత్రం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో భర్త మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లోని పైగదిలో ఉరేసుకుని చనిపోయాడు. కొద్దిసేపటికి తల్లి పద్మమ్మ గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ చంద్రయ్య పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి లోని మార్చురీకి తరలించారు. -
భర్త ఇంటి ముందు యువతి ధర్నా
సాక్షి, తిరువణ్ణామలై(తమిళనాడు): పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని పాపంబాడి గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు పూఅరసన్(22), చెన్నైలో మినీ వ్యాన్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కల్లకుర్చికి చెందిన అమ్ము(22) తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం పూఅరసన్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అమ్మును అమ్మగారింటికి పంపి వేశారు. అనంతరం భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అమ్ము తన వివాహం సమయంలో వేసిన బంగారం, వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరింది. అయితే ఇందుకు అత్తగారింటిలో అంగీకరించక పోవడంతో ఆమె ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు చెన్నై హైకోర్టులోను ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టేందుకు యత్నించగా ఇంటికి తాళం వేసి అత్తింటి వారు పరారయ్యారు. దీంతో అమ్ము శనివారం అత్తింటి ముందు చంటి బిడ్డతో ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెతో చర్చించి ధర్నాను విరమింప జేశారు. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. వివరాలు... మాన్విలో రంగరేజ్(40),నూరుస్లు కిరాణా అంగడి నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి ఇద్దరూ బైక్‌లో ఇంటికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రంగరేజ్ అక్కడికక్కడే మృతి చెందగా నూరుస్ గాయపడింది. పోలీసులు క్షతగాత్రురాలిని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అల్లుని దాడిలో అత్త హతం బనశంకరి: మద్యం మత్తులో అల్లుడు కొట్టిన దెబ్బలకు అత్త మరణించింది. ఈ ఘటన బాళేహెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రమేశ్, మంజుల దంపతులు అత్త కాళమ్మ (75) కలిసి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మద్యం తాగి విందు చేసుకున్నారు. ఇంతలో రమేశ్‌కు అత్తతో గొడవ చెలరేగి ఆమెను తీవ్రంగా కొట్టి బయటకు తరిమేశాడు. తల, గొంతుకు తీవ్రగాయాలు కావడంతో పాటు రాత్రంతా చలిలో వణికిపోయి కాళమ్మ మతిచెందింది. పోలీసులు రమేశ్‌ను అరెస్ట్‌చేశారు. -
నవ దంపతుల జీవితంలో ‘పిడుగుపాటు’
సాక్షి, మేడ్చల్: పిడుగుపాటు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన మేడ్చల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. రావల్కోల్ గ్రామానికి చెందిన చీర్ల మహేష్ (25)కు సొంతంగా పశువులు ఉన్నాయి. వాటిని కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పశువులను మేపడానికి వెళ్లిన మహేష్‌కు సమీపంలో పిడుగు పడింది. దాని ధాటికి మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాధచాయలు మహేష్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం మగశిశువు జన్మించాడు. అంతా సాఫీగా సాగుతున్న కుటుంబంలో పిడుగుపాటు ఆ కుటుంబ సభ్యులను కుదిపేసింది. మహేష్ మరణ వార్తతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
‘కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ’ వీడింది
సాక్షి, బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని కొప్పర్గ గ్రామంలో ఈ నెల 11న లభించిన కాలిన శవం మిస్టరీని బోధన్ పోలీసులు ఛేదించారు. ఈమేరకు పట్టణంలోని బోధన్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బోధన్ ఏసీపీ రామారావు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని బిలోలి తాలుక లాడ్క గ్రామానికి చెందిన అమృత్వార్ అశోక్‌ను, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మల్లపూర్ గ్రామానికి చెందిన బాగవ్వ కూతురు అంజమ్మకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇల్లరికంగా వచ్చిన అశోక్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు అందజేశారు. కానీ అశోక్ పెళ్లి తర్వాత వ్యాసనాలు, జల్సాలకు అలవాటు పడి భూమిని అమ్ముకుని భార్య, కూతురును ఇబ్బందులను గురిచేశాడు. దీంతో వారి కుటుంబ కలహాల గురించి పలుమార్లు పెద్దలు అశోక్‌ను మందలించారు. అయినా అశోక్ తన పద్దతి మార్చుకోలేదు. ఈక్రమంలో అంజమ్మకు అన్న వరుసైన మహారాష్ట్రలోని బిలోలి తాలుక కార్లా గ్రామానికి చెందిన తొకల్‌వార్ పోచయ్య అశోక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన చెల్లెలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌ను హతమార్చాలని పోచయ్య పథకం వేశాడు. ఈక్రమంలో నిందితుడు పోచయ్య పథకం ప్రకారం అశోక్‌ను మద్యం తాగుదామని పిలిపించి బోధన్ మండలంలోని కొప్పర్గ శివారులోకి తీసుకువచ్చాడు. మద్యం తాగిచ్చి మద్యం మత్తులో ఉన్న అశోక్‌పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా ఈ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రామారావు తెలిపారు. చాకచక్యం వ్యవహరించి కేసు చేధించిన బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై సందీప్, కానిస్టేబుల్స్‌లు అనంద్ గౌడ్, సురేష్, జీవన్, హోంగార్డు సర్దార్లను ఏసీపీ రామారావు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ సందిప్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు. -
క్షణికావేశం ప్రాణాన్ని బలిగొంది
క్షణికావేశం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.. చిన్నారులు సరదాగా టపాసులు కాలుస్తున్నారు.. సమీపంలో ఒకరు పావురాలు పెంచుతున్నాడు.. టపాసుల వలన పావురాలకు ఇబ్బంది అని వాదనకు దిగాడు.. పిల్లలతో వాగ్వాదంపై మేనత్త కల్పించుకుంది. ఇరువురు వాదులాడుకున్నారు.. పక్కన ఉంటున్న వ్యక్తి వివాదంలో కల్పించుకుని.. చెబితే వినరా అంటూ క్షణికావేశంతో కత్తితో భార్యాభర్తలపై దాడి చేశాడు. భర్త మృతి చెందగా భార్య గాయపడిన ఘటన పెడనలో బుధవారం చోటుచేసుకుంది. పెడన: పట్టణంలోని 9వ వార్డు కట్లపల్లిలో సంచలనం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలను బందరు రూరల్ సీఐ ఎన్.కొండయ్య అందించారు. స్థానిక కట్లపల్లిలో అబ్దుల్ ఇర్ఫాన్(45) దంపతులు ఉంటున్నారు. ఐస్, జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇర్ఫాన్ ఇంటి పరిసరాల్లో సరదగా మేనల్లుళ్లు టపాకాయలు కాలుస్తున్నారు. టపాకాయలు కాల్చడం వల్ల సమీపంలోని పెంచుతున్న పావురాలు బెదిరి ఎగిరిపోతాయని పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మధ్య వాదులాట జరిగింది. పక్కింట్లో ఉంటున్న పాలపర్తి ప్రభాకరరావు అనే వ్యక్తి సంబంధం లేకుండానే కల్పించుకుని ఇర్ఫాన్ మేనల్లుళ్లను తిట్టాడు. అదే సమయంలో వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఇర్ఫాన్ నీకు సంబంధం ఏమిటంటూ ప్రభాకరరావును నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ కర్రలతో కొట్టుకునే వరకు వచ్చింది. అనంతరం ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత.. ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకోగా సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. తరువాత మద్యం తాగి కత్తితో వచ్చిన ప్రభాకరరావు, ఇర్ఫాన్‌ను రెచ్చగొట్టి ఇంటి నుంచి బయటకు రప్పించాడు. తొలుత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్ భార్య అబ్దుల్ ఖాజాని(38) చేతిపై దాడి చేశాడు. తీవ్ర గాయమైన ఖాజాని అపస్మారక స్థితిలో పడిపోయింది. వెనుక వచ్చిన ఇర్ఫాన్ డొక్క భాగంలో మూడు కత్తిపోట్లు పొడిచాడు. ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మహబూబ్ బాషా, ట్రైనీ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి, బందరు రూరల్ సీఐ ఎన్.కొండయ్య, పెడన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన ఖాజానీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు కాగా ఒకరికి వివాహం అయింది. -
పండగ వేళ విషాదం..దంపతుల్ని ఢీకొట్టిన లారీ
సాక్షి, అంబాజీపేట: పండగ వేళ తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. అంబాజీపేట గ్రంథాలయం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన భర్త మాకే శ్రీనివాస్(30) అక్కడికక్కడే మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. దంపతులు ముమ్మిడివరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గాయని వాణిజయరామ్కు పతీవియోగం
సినిమా: ప్రఖ్యాత గాయని వాణీజయరామ్ భర్త జయరామ్ సోమవా రం ఉదయం చెన్నై సమీపంలోని వేలూ రులో కన్నుమూశా రు. వేలూరుకు చెంది న వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి. వివాహానంతరం తన పేరులోని వాణికి భర్త పేరును చేర్చుకుని వాణీజయరామ్గా మార్చుకున్నారు. వివాహానంతరం వాణిజయరామ్ గాయనిగా మరింత ఎదిగారు. ఆయన వాణిజయరామ్ను గాయనిగా ఎంతగానో ప్రోత్సహించారు. వివాహానంతరం వాణిజయరామ్ భర్తతో కలిసి కొంత కాలం ముంబయిలో మకాం పెట్టారు. అనంతరం మళ్లీ వేలూ రుకు తిరిగి వచ్చేశారు. వాణిజయరామ్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో 10 వేలకు పైకా పాటలు పాడారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరామ్ సోమవారం తుది శ్వాస విడిచారు.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వేడుకగా భార్యకు సీమంతం .. ఇంతలోనే విషాదం
బూర్జ: వారికి వివాహం జరిగి పదేళ్లయింది. సంతానం కోసం ఎన్నో ఆలయాలు తిరిగారు. ఎందరో దేవుళ్లకు మొక్కారు. వాళ్ల పూజలు ఫలించాయి. భార్య గర్భవతి అని తెలియగానే భర్త సంబరపడిపోయారు. ఏడు నెలలు గిర్రున తిరిగాయి. సీమంతం వేడుక శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు సందడి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ముద్దులొలికే చిన్నారిని ఎత్తుకుంటానని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ఆ కుటుంబంలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది. బిడ్డను చూడకుండానే ఆ తండ్రి విద్యుత్ షాక్‌తో మరణించిన హృదయవిదారక సంఘటన మండలంలోని కేకేరాజపురంలో శనివారం జరిగింది. నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి గ్రామానికి చెందిన వేపారి లోకేశ్వరరావు(46) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రసుత్తం వీరు విశాఖపట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం జ్ఞాన ప్రసూన(పద్మ)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కలగకపోవడంతో నిరుత్సాహపడ్డారు. చివరకు పద్మ గర్భవతి అని తెలియడంతో వారి కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి. స్వగ్రామంలో భార్యకు సీమంతం చేయాలని నాలుగు రోజుల క్రితం భార్యను తీసుకుని లోకేశ్వరరావు కేకే రాజపురానికి వచ్చారు. బంధువులు, మిత్రులు అందరినీ పిలిచి సంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా శుక్రవారం సీమంతం నిర్వహించారు. వచ్చిన వారంతా భార్యాభర్తలను చూసి ఎంతో సంతోషించారు. బంధువులంతా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఆనందం ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఇంతలోనే లోకేశ్వరరావు విద్యుత్‌షాక్‌తో శనివారం మృత్యువాతపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగానే.. బంధువులు వస్తారని మూడు రోజులు కిందటే ఇంట్లో కొత్తగా మోటార్ వేయించారు. శనివారం మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించినా ఆన్ కాలేదు. అందులో నీరు పోయగానే వెంటనే విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో మోటార్‌కే అతుక్కుపోయారు. పక్కనే ఉన్న తల్లి రాజేశ్వరమ్మ కర్రతో కొట్టడంతో కిందకు పడిపోయారు. హుటాహుటిన లోకేష్‌ను ఆటోలో పాలకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. లోకేశ్వరరావు మృతిచెందాడని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్త విన్న పద్మ విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. మరో రెండు నెలల్లో చిన్నారిని చూసుకుని మురిసిపోవాలని లోకేష్ ఎంతో సంబరపడ్డాడని, కానీ బిడ్డను చూడకుండానే ఇలా విగతజీవిగా మారడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కగానొన్క కొడుకు తన చేతుల్లోనే మరణించడాన్ని తట్టుకోలేక ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామానికి వచ్చి నాలుగు రోజులు మిత్రులను కలిసి ఆనందాన్ని పంచుకున్నాడని, ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని విషణ్ణ వదనాలతో రోదిస్తున్నారు. -
భర్తను చంపిన భార్య
రామగుండం: నిత్యం భార్యను వేధింపులకు గురి చేయడంతో ఓ భార్య భర్తను హతమార్చిన ఘటన రామగుండం పట్టణంలో జరిగింది. రామగుండం సీఐ సాగర్, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆయలం ఎదుట ఎత్తరి మల్లేశ్–సరిత దంపతులు నివసిస్తుంటారు. వీరికి కుమారుడు భాస్కర్, కూతురు సరిత ఉన్నారు. ఇతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వీరి ఇంటి పక్కనే తమ్ముడు విజయ్‌కుమార్ నివాసం ఉంది. కాగా మల్లేశ్ తరచూ వివిధ కారణాలతో భార్య సరితను వేధిస్తుంటాడు. భార్య సరిత తల్లిగారు వరంగల్ జిల్లాలోని మడికొండ మండల పరి«ధిలో రాంపూర్ గ్రామంలో ఒక ఆస్తిని రాసిచ్చారు. దానిని విక్రయించి డబ్బులు తీసుకురమ్మని భార్య సరితపై చేయి చేసుకుంటూ అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీంతో భార్య సహనం కోల్పోయి తన మరిది విజయ్‌తో కలిసి ఆదివారం రాత్రి మల్లేశ్ నిద్రిస్తున్న సమయంలో విచక్షణారహితంగా కత్తులు, గడ్డపారతో పొడిచి హతమార్చారు. స్థానికులు గుర్తించి రామగుండం పోలీసులకు సమాచారమివ్వడంతో గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి, రామగుండం సీఐ, ఎస్సైలు ఘటన స్థలిలో విచారించారు. అక్కడే ఉన్న గడ్డపార, రెండు కత్తులను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య సరిత, మృతుడి తమ్ముడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ..
మందస: దాంపత్య జీవితం ప్రారంభమైననాడే భర్త జీవితంలో భార్య సగమవుతుంది. కష్టాల్లో, సుఖాల్లో తోడు ఉంటానని ఒకరినొకరు నమ్ముకుని సాగించిన జీవితంలో అర్థాంతరంగా ఒకరు దూరమైతే ఆ వేదన వర్ణనాతీ తం. భర్త మృతిచెందడంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర సంఘటన మందస మండలంలోని మఖరజోలలో శుక్రవారం జరిగింది. మఖరజోల గ్రామానికి చెందిన కంచరాన దుర్యోధన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం కష్టాల్లో నెట్టుకొస్తోంది. భార్య సుధారాణి భర్తకు తోడుగా శ్రమిస్తోంది. భార్య, భర్తలిద్దరూ ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులను దాటుకొస్తున్నారు. వీరి శ్రమైక జీవనాన్ని చూసి, ఓర్వలేక విధి ఆగ్రహించింది. మృత్యు‘తీగ’ పాశాన్ని విద్యుత్ రూపంలో దుర్యోధనపై విసిరింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. కష్టాల కడలి నుంచి నెట్టుకొస్తున్న ఆ కుటుంబం అనాథగా మారింది. కుమా ర్తె నీహారిక, కుమారుడు భార్గవ్‌తో పాటు భార్య సుధారాణి దిక్కులేనివారయ్యారు. దుర్యోధన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి.. భర్త మృతదేహానికి తలకొరివి పెట్టడానికి సుధారాణి ముందువచ్చింది. బాధను పెదవిన బిగపట్టి, అంత్యక్రియలు నిర్వహించింది. పిల్లల ఆక్రందనను ఆపలేక.. అంత్యక్రియలు నిర్వహించే దిక్కులేక.. చివరికి అన్ని తానై.. భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన సుధారాణి దీనస్థితి చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించాయి. -
తోపులాటలో కిందపడి భర్త మృతి
విశాఖ క్రైం: పూటుగా మద్యం సేవించి భార్యతో గొడవ పడిన సంఘటనలో భార్య ఒక్కసారిగా తోయడంతో కిందపడి భర్త మృతి చెందాడు. ఈ ఘటన నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం చిన్నూరు మసీదు వద్ద భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఏలూరు గణేష్ (33) నివాసముంటున్నాడు. గణేష్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి రావడంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గణేష్ పూటుగా మద్యం సేవించి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయకపోవడంతో... తలుపు తీయకపోతే నిన్ను చంపేస్తానని కేకలు పెట్టాడు. దీంతో లక్ష్మి తలుపులు తీసింది. కోపంతో రెచ్చిపోయిన గణేష్ భార్యను చంపేస్తానంటూ గ్యాస్ సిలిండర్ పైపు తీశాడు. ఇద్దరి మధ్య తెల్లవారిజాము 2 గంటల వరకూ గొడవ కొనసాగింది. లక్ష్మి భయపడి భర్తను గట్టిగా తోసి ఇంటి నుంచి బయటకు వచ్చి తాళం వేసి అదే ప్రాంతంలో ఉంటున్న అత్త త్రినాథమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అత్తకు జరిగిన సంఘటన పూర్తిగా వివరించింది. అత్తతో కలిసి ఉదయం 7.30 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లి తాళం తీసి చూసేసరికి భర్త మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. తల భాగం నుంచి రక్తం రావడాన్ని గురించారు. వెంటనే మృతుడి తల్లి త్రినాథమ్మ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తిరుమలరావు ఆదేశాల మేరకు ఎస్ఐ శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. -
ఆర్కే బీచ్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: నగరంలోని ఆర్కేబీచ్లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం మద్యం మత్తులో బీచ్‌లో పడి ఉన్న మహిళను గుర్తించిన సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మర్రిపాలేనికి చెందిన నారాయణరావు, రాజారమణి దంపతులు బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించి సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. నారాయణరావు మృతిచెందాడు. రాజారమణి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలులో భర్త మృతి... భాష రాక ఇబ్బందులు
హైదరాబాద్: రైలులో ప్రయాణిస్తుండగా భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. భాష తెలియని ప్రాంతంలో.. విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో అతని భార్య నరకయాతన అనుభవిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో అనారోగ్యంతో రైలులోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రైల్వే సిబ్బంది కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని భార్య లీలా భాష తెలియక, వివరాలు సరిగ్గా చెప్పలేక నరకయాతన అనుభవిస్తోంది. భర్త మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ అర్థిస్తోంది. మరోవైపు రమేష్ మరణ వార్త తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్పందించిన కేటీఆర్: మృతుడి కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిచాలని మృతుడి స్నేహితుడు ట్విట్టర్ ద్వారా ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావును కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యూపీలోని అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామమని హామీ ఇచ్చారు. -
దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి..
బెంగుళూరు: తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి వివాహం చేసుకున్న ఓ యువతి తన భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. హాసన్ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి... హాసన్ సమీపంలోని కిత్తనగర గ్రామానికి చెందిన విశ్వనాథ్(28), ఆశ(25)కు ఈ ఏడాది ఫిబ్రవరి 16న వివాహమైంది. మెట్టినింటికి వెళ్లి సేద్యం పనులు చేయలేనని భర్తకు తెగేసి చెప్పిన ఆమె కొన్నిరోజులకే పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు పంచాయతీ పెట్టి సర్దిచెప్పి ఆమెను భర్త వద్దకు పంపారు. ఈ క్రమంలో తన భర్తను స్నేహితుడి బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లింది. హాసన్మహారాజ పార్కులో భర్తకు విషం మాత్రలు మింగించి విషం ఇంజెక్షన్ వేసి ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని నాటకం ఆడింది. ఇదిలా ఉండగా స్పృహలోకి వచ్చిన విశ్వనాథ్ అతికష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వెంటనే అతడిని హాసన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టూర్లో విషాదం.. పొరపాటున భర్తను చంపేసింది
బెంగళూరు: బెంగళూరులో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబం కేరళలోని మున్నార్‌కు విహారయాత్రకు వెళ్లగా, విషాదాన్ని మిగిల్చింది. భార్య ప్రమాదవశాత్తూ కారుతో.. సైకిల్‌తో వెళ్తున్న భర్తను ఢీకొట్టడంతో ఆయన మరణించాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. అశోక్ సుకుమారన్ నాయర్, రేష్మి దంపతులు తమ పిల్లలు శ్రద్ధ (7), శ్రేయ (5)లతో కలసి మున్నార్‌కు వెళ్లారు. అశోక్ సరదాగా సైకిల్‌పై రైడింగ్‌కు వెళ్లాడు. ఆయన వెనుకే రేష్మి పిల్లలతో కలసి కారులో వెళ్తోంది. కాగా పిల్లలు స్టీరియో సిస్టమ్ సౌండ్ ఎక్కువగా పెట్టడంతో.. డ్రైవింగ్ చేస్తున్న రేష్మి తగ్గించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె నియంత్రణ కోల్పోయి కారుతో ముందు వెళ్తున్న భర్తను ఢీకొట్టింది. అశోక్ తలకు తీవ్రగాయమైంది. రేష్మి తన భర్తను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అశోక్ శరీరంపై పెద్ద గాయాలు కాకపోయినా, తలకు తగలడంతో ముక్కులోంచి ఎక్కువగా రక్తస్రావమై చనిపోయాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవని, రేష్మి విషాదం నుంచి కోలుకోలేదని పోలీస్ అధికారి చెప్పారు. అశోక్, రేష్మిలది కేరళ కాగా, ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. -
ఆ నలుగురు
భర్త చనిపోయాడు...కుమార్తె అందుబాటులో లేదు. కుమారుడు మద్యానికి బానిసై ఎక్కడున్నాడో తెలియదు..పాపాం అభాగ్యురాలు భర్త దహన సంస్కారాలు కోసం ఆరాటపడింది. దుఃఖాన్ని దిగమింగుకుని నేరుగా కాన్వెంట్ జంక్షన్లో ఉన్న హిందూశ్మశాన వాటికకు వెళ్లింది. అక్కడ శ్మశానవాటిక ఇన్చార్జి ప్రసన్నకుమార్‌ను కలిసింది. ‘నా భర్త అనారోగ్యం చనిపోయాడు..కనీసం శ్మశానికి తీసుకొచ్చేవారూ కూడా లేరు..మీరే సాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంది. మనసున్న ప్రసన్నకుమార్ స్పందించారు. శ్మశానవాటిక ఇన్‌చార్జ్‌తో పాటు వర్కర్స్ రమణమూర్తి, సుందరరావు, పోలరాజు, తులసి అల్లిపురం వచ్చి దహన సంస్కరణలు నిర్వహించారు. అంతేకాదు సత్యవతి ఆర్థిక పరిస్థితి గమనించి శ్మశానవాటిక సిబ్బంది రూ.1500లు కూడా అందజేసి ఇలా మానవత్వం చాటుకున్నారు. (అల్లిపురం పాలకేంద్రం సమీపంలోని కనకరాజు ప్లాస్టిక్ సామాన్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనారోగ్యంతో మంగళవారం మతి చెందాడు.)