మృతుడు రంగరేజ్(ఫైల్), ప్రమాద దృశ్యాలు
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. వివరాలు... మాన్విలో రంగరేజ్(40),నూరుస్‌లు కిరాణా అంగడి నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి ఇద్దరూ బైక్‌లో ఇంటికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రంగరేజ్ అక్కడికక్కడే మృతి చెందగా నూరుస్ గాయపడింది. పోలీసులు క్షతగాత్రురాలిని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
అల్లుని దాడిలో అత్త హతం
బనశంకరి: మద్యం మత్తులో అల్లుడు కొట్టిన దెబ్బలకు అత్త మరణించింది. ఈ ఘటన బాళేహెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రమేశ్, మంజుల దంపతులు అత్త కాళమ్మ (75) కలిసి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మద్యం తాగి విందు చేసుకున్నారు. ఇంతలో రమేశ్‌కు అత్తతో గొడవ చెలరేగి ఆమెను తీవ్రంగా కొట్టి బయటకు తరిమేశాడు. తల, గొంతుకు తీవ్రగాయాలు కావడంతో పాటు రాత్రంతా చలిలో వణికిపోయి కాళమ్మ మతిచెందింది. పోలీసులు రమేశ్‌ను అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment