సాక్షి, అంబాజీపేట: పండగ వేళ తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. అంబాజీపేట గ్రంథాలయం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన భర్త మాకే శ్రీనివాస్(30) అక్కడికక్కడే మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. దంపతులు ముమ్మిడివరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment