ambaajipeta
-
పండగ వేళ విషాదం..దంపతుల్ని ఢీకొట్టిన లారీ
సాక్షి, అంబాజీపేట: పండగ వేళ తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. అంబాజీపేట గ్రంథాలయం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన భర్త మాకే శ్రీనివాస్(30) అక్కడికక్కడే మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. దంపతులు ముమ్మిడివరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏది దొరికితే అది పట్టుకెళ్లారు
తూర్పుగోదావరి(అంబాజీపేట): అంబాజీపేట మండలం తొండవరంలోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులంతా ఆరు బయట నిద్రపోతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న బారాబత్తుల అర్జున్ రావు పర్సులోని తాళాలు తీసుకొని ఇంట్లో దొరికిన కాడికి దోచుకున్నారు. ఇంట్లో ఉన్న 11 కాసుల బంగారం, రూ.30 వేల నగదుతో పాటు గ్యాస్ సిలిండర్, కంది పప్పు, చింతపండు ఏది దొరికితే అది ఎత్తుకెళ్లి పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.