తూర్పుగోదావరి(అంబాజీపేట): అంబాజీపేట మండలం తొండవరంలోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులంతా ఆరు బయట నిద్రపోతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న బారాబత్తుల అర్జున్ రావు పర్సులోని తాళాలు తీసుకొని ఇంట్లో దొరికిన కాడికి దోచుకున్నారు.
ఇంట్లో ఉన్న 11 కాసుల బంగారం, రూ.30 వేల నగదుతో పాటు గ్యాస్ సిలిండర్, కంది పప్పు, చింతపండు ఏది దొరికితే అది ఎత్తుకెళ్లి పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.