ఢిల్లీ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా.. ఇంట్లో తన నగల్ని దొంగతనం చేసిన కుమారుడేనని ఓ తల్లి గుర్తించ లేకపోయింది. ఖరీదైన నగలు మాయమవ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించింది ఆ తల్లి. చివరికి ఏమైందంటే?
వివరాల్లోకి వెళితే..ఆగస్ట్ 3 న, ఢిల్లీ - నజాఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ‘‘సార్.. సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆగస్ట్ 2 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగంతకులు మా ఇంట్లో చొరబడి నా రెండు గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఒక ఉంగరాల్ని దొంగతనం చేశారు‘‘ అని ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఇంటిని, ఇంటి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ పుటేజీని చెక్ చేశారు. కానీ అందులో ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాధితురాలి ఇంటి పక్కనే ఉన్న ఇళ్లల్లో సోదాలు జరిపారు. స్థానికులను ఆరా తీశారు. అయినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని డీసీపీ అంకిత్ సింగ్ తెలిపారు.
చివరగా బంగారు నగలు మాయం అవ్వడంపై బాధితురాలి కుటుంబ సభ్యుల్ని విచారించారు. పోలీసుల విచారణలో దొంగతనం జరిగిన తర్వాత 9వ తరగతి చదువుతున్న బాధితురాలి కుమారుడి అందుబాటులో లేకపోవడంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది. వెంటనే పోలీసులు బాలుడి స్కూల్, అతడి స్నేహితుల్ని విచారించగా..దొంగతనం చేసిందనే బాధితుడి కుమారుడేనని నిర్ధారణకు వచ్చారు.
బాలుడి కోసం ధరంపూర్, కక్రోలా, నజాఫ్‌గఢ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో బాలుడు పోలీసుల్ని తప్పించుకున్నాడు. చివరికి తన ఇంటి సమీపంలో పోలీసుకు చిక్కినట్లు డీసీపీ అంకిత్ సింగ్ వెల్లడించారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అమ్మ బంగారాన్ని తానే దొంగతనం చేసినట్లు కుమారుడు అంగీకరించాడు. బంగారాన్ని అమ్మగా వచ్చిన రూ. 50 వేలతో ఐఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్‌గా ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇక ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన నగల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో
బాధితురాలి భర్త అనారోగ్య సమస్యలతో కొద్ది కాలం క్రితం మరణించారు. కుమారుడికి చదువు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. పలుమార్లు ఇదే విషయంపై సదరు మహిళ కుమారుడిని మందలిస్తుండేంది. ఈ తరుణంలో 9 వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలు పుట్టిన రోజు. ఆమెను ఆకట్టుకునేందుకు.. ఆమె పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం నగదు కావాలని కన్న తల్లిని కోరాడు. ముందు చదువుపై దృష్టిసారించాలని అతడికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని చెవి దిద్దులు, చేతి ఉంగరంతోపాటు చైన్లు తీసుకు వెళ్లి.. స్థానికంగా ఉన్న వేర్వేరు బంగారం దుఖాణాల్ని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment