
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు.
బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.
కేసులో ట్విస్ట్..
మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్‌తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు.

Comments
Please login to add a commentAdd a comment