
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.
రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను దివ్యప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం సహాయక చర్యలో పాల్గొన్నారు.
చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్‌సైట్‌లో చలాన్లు కడితే ఇక అంతే..
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024
Comments
Please login to add a commentAdd a comment