karanataka
-
సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట
బెంగళూరు : ముడా కేసులో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు భారీ ఊరట దక్కింది. ఆయనకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.ముడా స్కాం ఇదే..మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది. -
మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా!
బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని ఆరోపించారు. కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా తన పిటిషన్లో కోరారు.బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు. ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లు అందించాలని మాల్యా కోరారు.వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. -
భారత్‌లో మంకీపాక్స్ కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు : భారత్‌లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్‌లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్‌కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు?
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడా (muda scam) స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (cm siddaramaiah) పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రకటించింది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివిధ వ్యక్తుల పేరిట రిజిస్టరయినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా.. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. బినామీల పేరుతో బీఎం పార్వతికి అక్రమంగా ముడా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది.బీఎం పార్వతితో పాటు పలువురు రియల్ ఎస్టేట్వ్యాపారులకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఫలితంగా ఆ స్థలాల్ని భారీ మొత్తానికి అమ్మేలా ఒప్పందం జరిగినట్లుగా ఆధారాల్ని స్వాధీనం చేసుకుంది. ముడా ప్లాట్ల కేటాయింపు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో పాటు డమ్మీ వ్యక్తుల పేరు మీద జరిగినట్లు ఈడీ ఆరోపించింది.సోదాల్లో తమకు ప్లాట్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా పలువురు అప్పటి ముడా చైర్మన్, ముడా కమీషనర్‌కు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని కట్టబెట్టినట్లుగా తమకు పలు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.కాగా, గతంలో ముడా కమిషనర్‌గా పనిచేసిన జీటీ దినేష్‌కుమార్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఇతర కొనుగోళ్లకు సంబంధించి సహకార సంఘం ద్వారా డబ్బు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదిస్తున్నారు. -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
సాక్షి,బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ (సోమనహళ్లి మల్లయ్య కృష్ణ) (92) ఏళ్ల వయసులో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు ఉదయం 2.30 -2.45 గంటల సమయంలో తన నివాసంలో మరణించారు. ఎస్ఎం కృష్ణ అక్టోబర్ 11,1999 నుండి మే 28,2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 1993 నుండి 1994 డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 2009-2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అయితే, కాంగ్రెస్‌తో దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారు. 2017 మార్చిలో బీజేపీలో చేరారు. పద్మవిభూషణ్ అవార్డ్తోప్రజా వ్యవహారాల (Public Affairs) రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డ్‌తో సత్కరించింది.సిలికాన్ సిటీ కేరాఫ్ ఎస్ఎం కృష్ణకర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఎస్ఎం కృష్ణ తన పదవీ కాలంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్లే బెంగళూరు సిలికాన్ వ్యాలీగా అవతరించిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జాన్ కెన్నెడీ తరుఫున కృష్ణ ఎన్నికల ప్రచారం ఎస్ఎం కృష్ణ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ (డల్లాస్), జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 1960లో మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తరుఫున ప్రచారం చేశారు. నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తన తరుఫున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ 28 కృష్ణకు లేఖ రాశారు. దీంతో ఆయన జాన్ కెన్నెడీ మద్దుతగా ప్రచారంలో పాల్గొన్నారు. 1961లో కెన్నెడీ 35వ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కృష్ణ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. 1962లో కృష్ణ.. మద్దూరు నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 👉చదవండి : నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు! -
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్‌కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్‌పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్
బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. Karnataka CM Siddaramaiah''s wife Parvathi decides to return 14 controversial sites to MUDA— Press Trust of India (@PTI_News) September 30, 2024 -
భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సభలోకి ఓ అగంతకుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది?కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం సిద్ధరామయ్యకు శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ వ్యక్తి వేదికపైకి రాకముందే పోలీసు అధికారులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తి సిద్ధరామయ్య అభిమాని అని, శాలువతో సత్కరించాలని సీఎం వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.కాగా,సీఎం సభలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా..అగంతకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 📍बेंगलुरुकर्नाटक के CM सिद्धारमैया की सुरक्षा में बड़ी चूक सामने आई है. दरअसल, एक कार्यक्रम के दौरान एक युवक भागते हुए उनके मंच पर पहुंच गया. जिसे कार्यक्रम में मौजूद सुरक्षाकर्मियों ने दबोचा लिया और मंच से नीचे उतारकर पुलिस के हवाले कर दिया.@siddaramaiah #Bengaluru… https://t.co/xKyZW4fVws pic.twitter.com/vDqbA1GEWf— Dainik Live (@Dainik_Live) September 15, 2024ఇదీ చదవండి : టీ తాగేందుకు రావాలని వైద్యులకు దీదీ ఆహ్వానం -
దర్శన్ తూగదీప చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బెంగళూరు : అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. తాజాగా, బెంగళూరు పోలీసులు దర్శన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం హత్య కేసులో బళ్లారీ జైల్లో ఉన్న దర్శన్ జ్యుడిషయల్ కస్టడీ సెప్టెంబర్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్శన్‌కు మరిన్ని కఠిన శిక్షలు పడేలా బెంగళూరు పోలీసులు బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని 200పైగా ఆధారాల్ని సేకరించారు. వాటిల్లో దర్శన్‌తో పాటు, ఇతర నిందితులు ధరించిన దస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ రిపోర్ట్లు సైతం ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం నుండి తీసిన ఫోటోలు, తనని కొట్ట వద్దని రేణుకా స్వామి వేడుకుంటున్న సీసీటీవీ పుటేజీతో పాటు, దాడి చేసే సమయంలో నటి పవిత్ర గౌడ చెప్పులకు అంటిన రేణుకాస్వామి రక్తపు మరకల తాలూకు ఆధారాల్ని పోలీసులు సేకరించారు. వాటిని ఛార్జ్ షీట్లో జత చేశారు. పరప్పన జైలు నుంచి అగ్రహార జైలుకుఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు.. పరప్పన అగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్‌ను బళ్లారి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించారు.కాగా, రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అస్నా తుపాను.. కర్ణాటకకు రెడ్ అలెర్ట్
బెంగళూరు: అస్నా తుపాను విస్తరిస్తున్న క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది అస్నా తుపాన్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఏర్పడటం సాధారణం కాదని తెలిపింది. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 అరేబియా సముద్రంలో మొదటిసారి విస్తరించిన ఈ తుపాన్‌కు పాకిస్తాన్.. అస్నా తుపానుగా పేరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందినిస సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే నిన్న శుక్రవారం వర్షం కొంత తెరిపి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు. -
‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. సుప్రీంలోనూ ఎదురుదెబ్బ అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యకు ఏం జరగదు అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. -
కేంద్రం కుట్రపై న్యాయపోరాటం చేస్తాం: సిద్ధరామయ్య
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రజాస్వామమ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది. అందుకు గవర్నర్ థావర్ను పావుగా వాడుకుంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.Bengaluru | On Karnataka Governor granting permission to prosecute him in the alleged MUDA scam, CM Siddaramaiah says, "We have called an urgent cabinet meeting today. I thank DK Shivakumar and all my ministers. Congress party also stands with me. Congress workers are also… pic.twitter.com/z4GIw7ZWSa— ANI (@ANI) August 17, 2024చదవండి: MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’ -
తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి..
బెంగళూరు : కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటాం. అయితే కుక్కల్లో విశ్వాసమే కాదు.. అమితమైన ప్రేమ కూడా చూపిస్తాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సాధారణంగా పెంపుడు కుక్కలు ఒక వీధి దాటి మరో వీధికి వెళ్లి తిరిగి రావడమే చాలా అరుదు. అలాంటి ఓ కుక్క ఏకంగా వందల కిలోమీర్లు ప్రయాణించింది. కొండలు,గుట్టలు, వాగులు,వంకలు దాటి చివరికి గమ్య స్థానానికి చేరుకుంది. దీంతో కుక్క యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా పిలిచి ఊరబంతి పెట్టించాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి (విఠలుడి దేవాలయం) ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు. అలా ఓ ఏడాది పాదయాత్ర చేస్తున్న తన వెంట ఓ కుక్కని నడిచింది. అందుకే దానికి ‘మహారాజ్’ అని పేరు పెట్టాడు. తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే సమయంలో మహారాజ్‌ను తన వెంటే తీసుకుని వెళ్లేవారు.అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది విఠల్ రుక్మిణి ఆలయ దర్శనానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో పాదయాత్రగా వెళ్లిన కమలేష్‌కు మహారాష్ట పండరీపూర్‌కు వెళ్లిన తర్వాత మహారాజ్ తప్పి పోయింది. కుక్క గురించి స్థానికులను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కమలేష్ తన పాదయాత్ర ముగించుకుని జులై 14న ఇంటికి చేరుకున్నారు.ఈ తరుణంలో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క మహారాజ్ తన యజమాని కమలేష్ వద్దకు చేరింది. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. మహారాజ్ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు. -
ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు!.. కోర్టు ఆగ్రహం.. వీడియో వైరల్
ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం ఆమె ఇప్పటి వరకు ఏడుగురిని వివాహం చేసుకుంది. ఆరుగురు భర్తల నుంచి ఏదో ఒక సాకు చూపించడం వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ సారి తన ఏడవ భర్త నుంచి న్యాయం చేయాలని కోరడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. తన ఏడవ భర్త నుంచి విడాకులు కోరడంపై కేసును విచారిస్తున్న న్యాయవాదిని పలు ప్రశ్నలు సంధించారు. ఆమె ఏడుగురు భర్తలపై సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.న్యాయవాది స్పందిస్తూ..‘అవును, వివాహిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు సెక్షన్ 498ఏ కింద వారందరిపై కేసు నమోదైంది. అదనంగా నిర్వహణ కోసం డబ్బులు కావాలని కోరడంతో..అప్పుడు న్యాయమూర్తి ప్రతి భర్తతో ఎంతకాలం ఉన్నారని అడిగారు. విడాకులు తీసుకునే ముందు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉన్నట్లు సమాధానం చెప్పింది. అదే సమయంలో సదరు మహిళ సెటిల్ మెంట్ కోసం భారీ మొత్తంలో డబ్బులు అడిగినట్లు న్యాయమూర్తి గుర్తించారు. దీంతో సదరు మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు. SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024 -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెయిల్
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సూరజ్ రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో తనని లైంగికంగా వేధించాడని 27ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీన్నారు. విచారణ చేపట్టిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో సూరజ్ రేవణ్ణ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.తనపై వచ్చిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ స్పందించాడు.ఫిర్యాదు దారుడు తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు రాబట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. -
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. -
‘నాపై పోక్సో కేసు కొట్టేయండి’.. హైకోర్టుకు మాజీ సీఎం యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో తనపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ ఓ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు.జూన్ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటల పాటు విచారించారు. పోక్స్ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం స్పందిస్తూ ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ ఆయన అన్నారు.తాజాగా,ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఆ రెండు పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణకు రానున్నాయి.అనూహ్యంగా గురువారం సాయంత్రం సీఐడీ యడ్యురప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తనపై నమోదు చేసిన పోక్స్ కేసును కొట్టి వేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
లైంగిక వేధింపుల కేసు : యడ్యూరప్పకు ఎదురు దెబ్బ!
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్‌ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసుఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్‌లో పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసుకేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.ఆయన మాజీ సీఎం తొందరపడొద్దుజూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.ఎక్కడ విచారించాలోఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఐఏఎస్ రోహిణి సింధూరి నా భూమిని కబ్జా చేశారు.. ప్రముఖ సింగర్ ఫిర్యాదు
బెంగళూరు : కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.pic.twitter.com/GeUF0N9Y4k— Lucky Ali (@luckyali) June 20, 2024లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్‌కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్‌లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. -
పవిత్ర గౌడ చూస్తుండగానే.. ఒళ్లు జలదరించేలా రేణుక స్వామి హత్య
బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రేణుకస్వామిని దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాకిచ్చి హత్య చేసినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయి. రేణుక స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖం సగం భాగంలో కుక్కలు పీక్కుతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.అయితే ఈ రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్‌ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం.జూన్8న రేణుక స్వామి తన స్వగ్రామమైన చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్లు దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్రగౌడలు వచ్చారు. అనంతరం,రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు ఒళ్లు జలదరించేలా హత్య చేశారు. ఆ హత్య జరిగే సమయంలో పవిత్రగౌడ అక్కడే ఉండడం గమనార్హం.కాగా, ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇద్దరు నటులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. హత్య కోసం దర్శన్ నిందితులకు రూ.50లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రూ.30 లక్షలు కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన పవన్‌కు చెల్లించగా.. రాఘవేంద్ర, కార్తీక్‌ల కుటుంబాలకు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85చేరగా.. డీజిల్ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. -
పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్
బెంగళూరు: పదో తరగతిలో 625 మార్కులకు 625 మార్కులు సాధించిన 'అంకిత'ను నటుడు రిషబ్ శెట్టితో పాటు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా ప్రశంసించారు. స్టేట్ టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.10వ తరగతి పరీక్షలో 625/625 మార్కులు సాధించిన బాగల్కోట్కు చెందిన అంకితను మంగళవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సన్మానించారు. అంతే కాకుండా ఆ విద్యార్ధి ప్రతిభకు మెచ్చి ప్రోత్సాహక బహుమతిగా రూ.5 లక్షలు ప్రదానం చేశారు.అంకితను మాత్రమే కాకుండా మండ్య విద్యార్థి నవనీత్‌ను కూడా డీకే శివకుమార్ సత్కరించి.. ప్రోత్సాహక బహుమతిగా రూ.2 లక్షలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#WATCH | Karnataka Deputy CM DK Shivakumar felicitates Ankitha, a student from Bagalkot who got 625/625 marks in the 10th exam and awarded Rs 5 lakhs.DK Shivakumar also felicitated Navneet, a student from Mandya, and also awarded Rs 2 lakhs. pic.twitter.com/mvpdJIfVng— ANI (@ANI) May 14, 2024 -
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిరంజన్ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్‌షాకు తన కుమార్తె నేహా హీరేమత్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్ హిరేమఠ వెల్లడించారు -
ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ప్రధాని మౌనమేలారేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్లో పేర్కొన్నారు.అక్కడుంది మీ ప్రభుత్వమే కదాప్రియాంక గాంధీ ట్వీట్‌పై మంగళవారం ఉదయం అమిత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్‌ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు. విచారణకు బీజేపీ డిమాండ్ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.పరువు పోతుందంటూకాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.రేవణ్ణను రప్పిస్తాంమరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్‌లో చేరారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్పూర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేశారు. ఈ నెల ప్రారంభంలో మాలికయ్య గుత్తేదార్ తన సోదరుడు నితిన్ వెంకయ్య గుత్తేదార్‌ను బీజేపీలోకి చేర్చుకోవడంతో గుత్తేదార్ కలత చెందారు.పలు నివేదికల ప్రకారం, కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే .. శారదామోహన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. శారదా మోహన్ శెట్టి 2013 నుండి 2018 వరకు ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె బీజేపీలోకి మారారు. కాగా, మల్లిఖార్జున్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కలబురగి (గుల్బర్గా) నుంచి పోటీ చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎంపీ
కర్ణాటక బీజేపీకి భారీ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కొప్పల్ ఎంపీ కరాడి సంగన్న గుడ్‌బై చెప్పారు. బుధవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాండ్య, కోలార్‌లలో పార్టీ లోక్‌సభ అభ్యర్ధుల తరుపున ప్రచారం జరపనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ కరాడి సంగన్న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సంగన్నకు మొండి చేయి చూపించింది. ఆయన బదులు బసవరాజ్ క్యావటూర్ను లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించింది. దీంతో అలకబూనిన సంగన్న తాజాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. -
బీజేపీ మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసింది: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్‌కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయలు చెప్పటం వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు బదలు.. ఎన్నికల తర్వాత సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
మరోసారి ఇన్ఫోసిస్ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం
బెంగళూరు: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీసీఐటీఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. -
200 స్థానాలు కూడా కష్టమే.. బీజేపీపై ప్రియాంక్ ఖర్గే సెటైర్లు!
బెంగళూరు : ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు కూడా గెలవదని, రాష్ట్రంలో ఎనిమిది సీట్లు కూడా దాటదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే చెబుతోంది. అంతర్గత పోరుతో రాష్ట్ర బీజేపీ పద్నాలుగు,పదిహేను సీట్లలో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కమలం ఎనిమిది లోక్‌సభ స్థానాలు దాటడం కష్టమేనని’ జోస్యం చెప్పారు. ఇన్ని అబద్దాలా? కర్ణాటకకు కరువు సాయం విషయంలో హోం మంత్రి అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించిన ఖర్గే.. కరువు సాయం కోరుతూ సీఎం సిద్ధరామయ్య ‘ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రి (సహాయం కోరుతూ)తో భేటీ అవ్వడం అబద్ధమా? ఐఎంసీటీ (ఇంటర్ మినిస్ట్రీరియల్ కేంద్ర బృందం) కర్ణాటకలో సర్వే చేసి కేంద్రానికి నివేదిక సమర్పించడం అబద్ధమా? ఆ తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశాన్ని నిర్వహించి, కర్ణాటకలో కరువును అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లిఖితపూర్వకంగా ప్రశంసించడం అబద్ధమా? అని ప్రశ్నలు సంధించారు. అమిత్ షా ఎందుకు ఇలా అబద్దాలు ఆడుతున్నారోనని అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. . కరువుపై కాంగ్రెస్ రాజకీయం కాగా, మంగళవారం బెంగళూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కరువు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని,ఈ అంశం ఎన్నికల సంఘం వద్ద ఉందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంక్ ఖర్గే స్పందించారు. -
కేరళ సీఎం విజయన్ కూతురిపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేశాయి. వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రూ.1.72 కోట్ల చెల్లింపులు కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపింది. ఐటీ అధికారుల సోదాలతో వెలుగులోకి అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు (Interim Board) సీఎంఆర్ఎల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదావీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్ఎఫ్ఐఓ వాణి విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణకు వ్యతికేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్ పిటిషన్‌ను కొట్టి వేసింది. తాజాగా ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు అవాస్తవం ఇదే అంశంపై ఈ ఏడాది జనవరి అసెంబ్లీ సమావేశాల్లో కేరళ సీఎం పనిరయి విజయన్ స్పందించారు. తన భార్య పదవీ విరమణ నిధులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. -
నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది
బెంగళూరు, సాక్షి : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్‌సభ సీటును హెగ్డేకి ఇవ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇలా అనంత్ కుమార్ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్‌సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్ ఠాకూర్, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. -
నేనూ ట్రోల్స్‌కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్‌కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
బీజేపికి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి?
సాక్షి, బెంగళూరు : లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిలో ఒక నేత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం, కేంద్ర మంత్రి డీవీ సదానంద్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 224 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన కమలం కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే, త్వరలో జరగబోయే 28 లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుని కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్న కషాయ దళానికి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం జయ్ ప్రకాష్ హెగ్డే కొద్ది రోజుల క్రితం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, కేజే జార్జ్ సమక్షంలో బైందూరు మాజీ ఎమ్మెల్యే సుకుమార్ శెట్టి, ముదిగెరె మాజీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామితో పాటు కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన కోర్గి జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్‌లో చేరారు. గతంలో ఉడిపి చిక్కమగళూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలపుపొందిన హెగ్డే ఈ సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. మాజీ సీఎం సదానంద్ గౌడ సైతం తాజాగా మాజీ సదానంద్ గౌడ సైతం పార్టీని వదిలి వెళ్లడంపై బీజేపీలో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి వైసీకే వడియార్‌పై కాంగ్రెస్ తరుపున మైసూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న సదానంద్ గౌడ బీజేపీకి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరిక, ఏ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అంశాలపై మరో రెండ్రోరోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరువయ్యారు. దీంతో చేసేది లేక పలువురు మంత్రులనే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించేలా వారిని బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందంటూ పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలని పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు. స్క్రీనింగ్ కమిటీ తర్వాతే క్లారిటీ అయితే లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుందని ఆయన..మంత్రుల్లో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలనే చర్చలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే అంగీకరిస్తారో వారినే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతామని, నేటి సమావేశం (స్క్రీనింగ్ కమిటీ) తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరమేశ్వర చెప్పారు. ఢిల్లీకి జాబితా కాగా, అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.‘మేము సాయంత్రం సమావేశం అవుతున్నాం. అభ్యర్థిని ప్రకటించే హక్కు మాకు లేదు. ప్రతిపాదనల్ని ఢిల్లీకి పంపుతాం. కేంద్ర ఎన్నికల కమిటీ అక్కడ సమావేశమవుతుంది.మా సిఫార్సును ఆమోదించొచ్చు. లేదంటే తిరస్కరించొచ్చు. జాబితాలో కొత్త పేర్లను చేర్చొచ్చు’ అని చెప్పారు. తొలిజాబితాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్ తొలి జాబితాలో కర్ణాటకలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ తొలి జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించలేదు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. చదరపు అడుగు 7వేల నుంచి రూ.10 వేలకి పెరిగింది
అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని పెంచింది. దీంతో బెంగళూరులో అపార్ట్మెంట్ ధరలు 10-20 శాతం పెరిగాయి. శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలు గరిష్ట స్థాయిలో పెరుగుదల కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గైడెన్స్ వ్యాల్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆస్తి విక్రయాన్ని రిజిస్ట్రేషన్ చేసే కనీస ధరను సూచిస్తుంది. దీనిని కొన్ని రాష్ట్రాల్లో సర్కిల్ రేట్ అని పిలుస్తారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోని సబర్బన్ ప్రాంతాలైన యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, కేఆర్ పురం ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారీగా పెరిగిన చదరపు అడుగు ధర రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని 20-30 శాతం సవరించింది. ప్రాంతాన్ని బట్టి, ఐటీ కారిడార్లలో ఇది 50 శాతానికి చేరుకోవచ్చని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ప్రస్తుతం యలహంకలో ఒక అపార్ట్మెంట్ చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండేది..ఇప్పుడు అది కాస్తా రూ.11,500కి పెరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండగా ఇప్పుడు రూ.10,000కు విక్రయిస్తున్నారు. కేఆర్ పురంలో అపార్ట్మెంట్ ఖరీదు చదరపు అడుగుకు రూ.5,500 నుంచి రూ.500-1000 పెరిగింది. ఎంజీ రోడ్లో 5కిలోమీటర్ల మేర ప్రాపర్టీ ధరలు లొకేషన్ ఆధారంగా చదరపు అడుగుకు రూ. 12,000-30,000. సీబీడీ ప్రాంతంలోని ప్రధాన ప్రాంతాలలో ఒకటైన లావెల్లే రోడ్లో ధరలు చదరపు అడుగు రూ. 20,000-22,000 ఉండగా.. గతంలో చదరపు అడుగుకు రూ.18,000కి పెరిగాయి. ఇందిరానగర్‌లో ప్రాపర్టీ ధరలు కనీసం రూ.10,000-20,000కి చేరాయి. సమానమైన ఇళ్ల ధరలు బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో మార్గదర్శక విలువ, వాస్తవ ప్రాపర్టీ ధరల మధ్య వ్యత్యాసం దాదాపు 40-50 శాతం ఉండగా..శివార్లలో ఇది దాదాపు 30 శాతం ఉందని స్థానిక రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. చాలా ప్రదేశాలలో మార్గదర్శక విలువ ఇప్పటికే మార్కెట్ విలువలో 40 శాతం కంటే తక్కువగా ఉంది. అందువల్ల, సర్కిల్ రేట్ల పెరుగుదల ప్రధాన ప్రదేశాలలో ధరలలో అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే శివారు ప్రాంతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది అని రియల్టీ కార్ప్స్ డైరెక్టర్ సునీల్ సింగ్ తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.లక్షకి పెరిగింది పెరిగిన గైడెన్స్ విలువ కొన్ని ప్రాంతాలలో ఇళ్లను కొనుగులో చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని రియాల్టీ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎక్కువగా మధ్యతరగతి, లోయర్ ఎండ్ బడ్జెట్ గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై ప్రభావం చూపుతుంది. 14 శాతం పెంపు వారి ఖర్చులను రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచుతుంది’ అని సింగ్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం గైడెన్స్ విలువను చివరిసారిగా పెంచింది కానీ కోవిడ్-19 సమయంలో తగ్గించింది. రెవిన్యూ శాఖ వివరాల ప్రకారం, పెరుగుదలకు ప్రధాన కారణాలలో అంతకంతకూ తరిగిపోతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని, కాబట్టే ప్రాపర్టీ గైడెన్స్ వ్యాల్యూ ధరని పెంచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. -
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దూకుడుగా ముందుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి ఫలితాలు రాష్ట్రంలోనూ పునరావృతమవుతాయనే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు.. ఎన్నికలు జరిగే వరకు ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో ఈ నెల 25న భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న ఈ సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ఇతర కీలక నేతలను ఆహ్వానించనున్నారు. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా రాష్ట్రంలో మూడు చోట్ల సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా గత నెలలో మంచిర్యాలలో సత్యాగ్రహ సభను నిర్వహించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇప్పుడు జడ్చర్లలో రెండో సభను నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేతలు.. జడ్చర్ల సభకు భారీ ఎత్తున కేడర్‌ను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు కల్లా 50 మంది వరకు అభ్యర్థుల ఖరారు! మరోవైపు అభ్యర్థుల ఖరారులోనూ కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. వీలున్నంత మంది అభ్యర్థులను 6 నెలల ముందే ప్రకటించడం ద్వారా ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశాన్ని కల్పించాలని చాలామంది నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 45–50 మంది అభ్యర్థులను ఈ ఏడాది ఆగస్టు కల్లా ప్రకటించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మరిన్ని డిక్లరేషన్లు యూత్ డిక్లరేషన్‌కు మంచి స్పందన రావడం, దీనిపై ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేసే పరిస్థితి లేకపోవడంతో మరిన్ని డిక్లరేషన్లకు టీపీసీసీ సిద్ధమవుతోంది. మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డిక్లరేషన్లు ప్రకటిస్తామని, తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు చేసే మేలు గురించి వాటిల్లో వివరిస్తామని సరూర్‌నగర్ సభలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వచ్చే నెలలో మహిళా, బీసీ డిక్లరేషన్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళా డిక్లరేషన్‌కు సోనియాగాంధీని, బీసీ డిక్లరేషన్‌కు దేశంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని, తద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని, ప్రజలకు మరింత భరోసా కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను సోనియా, రాహుల్‌లలో ఒకరి అపాయింట్మెంట్ కోసం టీపీసీసీ నేతలు ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు. చేరికలపై ప్రత్యేక దృష్టి ఇతర పార్టీల నుంచి వీలైనంతగా వలసలు ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వారు పార్టీలో చేరేందుకు తానే ఇబ్బందిగా ఉన్నట్టయితే పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరికల కమిటీని పరిపుష్టం చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీకి ఇప్పటికే జానారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి లాంటి నేతలకు కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. వీరు కాంగ్రెస్‌ను వీడిన వారితో, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారితోనూ త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్టు సమాచారం. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి!
రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ (మొత్తం 224 సీట్లు) 16వ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరుగుతున్న నేపథ్యంలో ఈ దక్షిణాది రాజ్యంపై నేడు అందరి దృష్టి పడింది. ఐటీ రంగంలో భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ఇంజన్ మాదిరి పనిచేస్తూ.. టెక్నాలజీ కేంద్రంగా కర్ణాటకను ముందుకు తీసుకుపోతోంది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తర్వాత నాలుగో అత్యంత ధనిక భారత రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. 247.38 బిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో (జీఎస్టీడీపీ) కర్ణాటక పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పొడవైన సముద్రతీరం, అరేబియా సముద్రం తీరం వెంబడి ఆధునిక రేవు పట్టణాలు, నగరాలు అభివృద్ధిచెందడం కూడా ఈ మూడో అతిపెద్ద దక్షిణాది రాష్ట్రం (ఏపీ విభజనతో ఈ స్థానం దక్కింది) ప్రగతికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, ఇంకా రాయలసీమ జిల్లాలవాసులకు తమిళనాడు రాజధాని చెన్నై మాదిరిగానే బెంగళూరు, ఇతర కర్ణాటక పట్టణాలు, నగరాలు వలస వచ్చి స్థిరపడడానికి అనువైన ప్రాంతాలుగా మారాయి. బెంగళూరు, తుమకూరు తదితర ప్రాంతాలు అందించే వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలు లక్షలాది మంది తెలుగు ప్రజలను అక్కడకు రప్పిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వ్యక్తులు ఐదారుగురు వరకూ వివిధ పార్టీ తరఫున కర్ణాటక శాసనసభకు కిందటి రెండు మూడు ఎన్నికల్లో గెలవడం సాధారణ విషయంగా మారింది. దక్షిణాదిన లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య రీత్యా చూస్తే తమిళనాడు తర్వాత (39) అత్యధిక స్థానాలు ఉన్నది ఈ రాష్ట్రంలోనే (28). తెలుగు, కన్నడ లిపుల మధ్య పోలికలు ఉండడమేగాక, గతంలో రెండు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఒకే తీరున నడిచాయి. 1978 నుంచి 2004 వరకూ ఒకే సమయంలో ఏపీ, కర్ణాటక ఎన్నికలు 1978 జనవరిలో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయిన రెండు నెలలకే ఉమ్మడి ఏపీ, కర్ణాటకలో ఒకేసారి జరిగిన ఈ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో కొత్తగా హస్తం గుర్తుతో వచ్చిన కాంగ్రెస్ (ఐ) రెండు చోట్లా విజయం సాధించింది. అలాగే ఐదేళ్ల తర్వాత 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏపీ, కర్ణాటకలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అయితే 2004 వరకూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం విశేషం. కాని, 2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన కర్ణాటక 12వ శాసనసభ రాజకీయ అస్థిరత వల్ల నాలుగేళ్లకే రద్దవడంతో ఈ రెండు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కాలం వ్యత్యాసంతో జరగడం ఆనవాయితీగా మారింది. అలాగే కిందటిసారి తెలంగాణ అసెంబ్లీకి ఆరు నెలలు ముందుగానే 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరిపించడంతో ఇప్పుడు మొదట వేసవిలో (మే నెలలో) కర్ణాటకలో, శీతాకాలంలో (డిసెంబర్) తెలంగాణలో, వచ్చే ఏడాది ఏప్రిల్–మేలో ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత 30 ఏళ్లలో సంభవించిన రాజకీయ పరిణామాల వల్ల ఇలా మూడు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఆరు నెలల తేడాతో వరుసగా మూడు వేర్వేరు సందర్భాల్లో జరిగే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో మాదిరిగానే లక్షలాది మంది తెలుగువారు అన్ని రంగాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర్రం కావడంతో కర్ణాటక రాజకీయాలపై తెలుగునాట ఎనలేని ఆసక్తి వ్యక్తమౌతోంది. మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాజకీయాల ప్రభావం విస్తరించిన కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉంటుందా అని ఓట్లు లెక్కించే మే 13 కోసం తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. 2004 ఎన్నికల నుంచీ కర్ణాటకలో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీలే ఏర్పడుతూ వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాతైనా ఈసారి రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఏదో ఒక పార్టీకి కనీస మెజారిటీకి అవసరమైన సీట్లు వస్తాయా? రావా? అనేదే నేడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
కర్ణాటక బ్యాంక్ : రూ.1.75 లక్షల కోట్లు !
మంగళూరు: కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 17.69 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉంది. శతాబ్ది సంవత్సరం కావడంతో రూ.1,75,000 కోట్ల టర్నోవర్‌పై అంచనాతో ఉన్నట్టు బ్యాంక్ సీఈవో, ఎండీ ఎంఎస్ మహాబలేశ్వర తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కర్ణాటక బ్యాంక్ శాఖల సిబ్బందితో మంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి వర్చవల్‌గా ఆయన మాట్లాడారు. 2023–24 సంవత్సరానికి బ్యాంక్ ప్రణాళికలను వారితో పంచుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి టర్నోవర్ 7.63 శాతం వృద్ధితో రూ.1,48,694 కోట్లు (ప్రాథమిక వివరాల ప్రకారం) ఉందని, డిపాజిట్లు రూ.87,362 కోట్లుగా, అడ్వాన్స్‌లు (రుణాలు) రూ.61,326 కోట్లుగా ఉన్నట్టు వివరించారు. బ్యాంక్ కాసా రేషియో 32.97 శాతానికి చేరినట్టు తెలిపారు. రుణాలు, ఆస్తుల పరంగా స్థిరమైన వృద్ధిని గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్టు మహాబలేశ్వర చెప్పారు. ఆస్తుల, అప్పుల మెరుగైన నిర్వహణతోపాటు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని సమర్థంగా అధిగమించినట్టు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18తో కర్ణాటక బ్యాంక్ నూరవ సంవత్సరాలోకి అడుగు పెట్టడం గమనార్హం. గడిచిన సంవత్సరానికి కర్ణాటక బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు బ్యాంక్ ఈడీ శేఖర్ రావు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో నిర్వహణ రేషియోలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు. -
ఇవే నా చివరి ఎన్నికలు... రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతా
మైసూరు: నేను పోటీ చేసే చివరి ఎన్నికలు ఇవే. తరువాత పోటీ చేయను. రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతానని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికలో తాను పుట్టి పెరిగిన ఊరు అయిన వరుణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం మైసూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో తాను చాముండేశ్వరి నియోజకవర్గంలో పోటీ చేయగా, కొంచెం అనుమానం ఉండడంతో, బాదామిలోనూ పోటీకి దిగినట్లు చెప్పారు. ఈసారి ఎలాంటి అనుమానం లేదని, వరుణలో గెలుస్తానని అన్నారు. కాగా గత ఎన్నికలప్పుడు కూడా సిద్దరామయ్య ఇవే నా చివరి ఎన్నికలని చెప్పడం గమనార్హం. -
బళ్లారి సిటీ టికెట్ ఎవరికో? పోటీలో నారా భరత్‌రెడ్డి!
సాక్షి,బళ్లారి: మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తొలి జాబితాలో ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి ఆరుగురికి టికెట్లు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఐదుగురికి, ఒకరు మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఖరారు చేశారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, కంప్లి నుంచి గణేష్‌లకు టికెట్ ఖరారు కాగా, విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భీమానాయక్, హడగలి నుంచి పరమేశ్వర నాయక్, విజయనగర నుంచి మాజీ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్పలకు టికెట్ ఖరారు చేశారు. ఆరు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు కాగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. బళ్లారి నగరం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో తుది జాబితాలో అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బళ్లారి సిటీ టికెట్ ఎవరికో? బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు పోటీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో ప్రముఖంగా టచ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, మాజీ జెడ్పీ మెంబర్ అల్లం ప్రశాంత్, మాజీ మంత్రి ఎం.దివాకర్‌బాబు పేర్లు పరిశీలనలో ఉన్నా, వీరిలో ఇద్దరి పేర్లను మాత్రమే హైకమాండ్ మరీ ముఖ్యంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తెరపైకి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేయాలని స్వయానా పోటీలో ఉన్న మాజీ మంత్రి దివాకర్‌బాబు ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందో ఇప్పట్లో తేలే అంశం కాదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా ఖరారు కాని స్థానాలివే హరపనహళ్లి నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దివంగత ఎంపీ ప్రకాష్ కుమార్తె టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిరుగుప్ప నియోజకవర్గం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు తీవ్ర పోటీ పడుతుండగా పేరును ఖరారు చేయలేకపోయారని తెలుస్తోంది. కూడ్లిగి నియోజకవర్గం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో. బీజేపీ తరపున ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారో వేచి చూసి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. -
కర్ణాటకలో ఏబీసీ క్లీన్టెక్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు
బెంగళూరు: పునరుత్పాదక విద్యుత్ రంగ దిగ్గజం యాక్సిస్ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఏబీసీ క్లీన్టెక్ తాజాగా కర్ణాటకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 50,000 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి ఇన్వెస్ట్ కర్ణాటక 2022 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్‌తో వచ్చే 10 ఏళ్లలో 5,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుందని ఏబీసీ క్లీన్టెక్ సీఎండీ రవి కుమార్ రెడ్డి తెలిపారు. జీరో కార్బన్ ఎకానమీగా ఎదిగేందుకు, స్థానిక ఎకానమీకి తోడ్పాటు అందించేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సమతౌల్యమైన అభివృద్ధి సాధనకు, భవిష్యత్ తరాలకి సురక్షితమైన.. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించేందుకు పునరుత్పాదక శక్తి ఒక్కటే మార్గమని కర్ణాటక అదనపు చీఫ్ సెక్రటరీ ఈవీ రమణా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పొందిన రాష్ట్రంగా కర్ణాటక నిల్చినట్లు ఆయన వివరించారు. హైదరాబాదీ సంస్థ యాక్సిస్ ఎనర్జీ, అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటైన బ్రూక్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ గా ఏబీసీ రెన్యువబుల్స్‌ను ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం 2 గిగావాట్ల పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను నిర్మిస్తోంది. -
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులకు భారీ షాక్!
మూన్‌లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్‌లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు. “ఒక విధాన పరంగా, నైతికంగా మూన్‌లైటింగ్‌ను ఎలా అనుమతించవచ్చు? మూన్‌లైటింగ్‌కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు. కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేరే చోటికెళ్లి పనిచేసుకోండి బెంగళూరు టెక్ సమ్మిట్‌ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్‌లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్‌లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు. చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’ -
నేను కీలుబొమ్మను కాదు.. కర్నాటక సీఎం సంచలన వ్యాఖ్యలు
శివాజీనగర: రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం నూతన ముఖ్యమంత్రి అన్వేషణలో ఉందనే వార్తలను కర్నాటక సీఎం బసవరాజ బొమ్మై తోసిపుచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, రానున్న ఎన్నికలు తన నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ పూర్తి సహకారం ఇచ్చిందని, పరిపాలనలో ఏ సీనియర్ నాయకుల జోక్యం లేదని, తాను ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప ప్రతిరోజు పరిపాలనలో మార్గదర్శనం చేస్తారు, అంతే తప్ప నిత్యం వేలు పెడతారనే విమర్శలు నిరాధారమైనవని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ, హత్య, అల్లర్లకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానలే కారణమని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ చేసే అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంట్రాక్టర్ల సంఘం నేతలందరూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మార్పిడి చట్టం అవసరమని, పార్టీ ఎమ్మెల్యే తల్లి మతం మారింది. అందువల్ల ఈ చట్టం అనివార్యమైందని, చట్టం వచ్చాక మత మార్పిళ్లు తగ్గాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు -
నాన్‌వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?
కర్నాటకలో నాన్–వెజ్ రాజకీయం భగ్గుమంది. మడికెరిలో మాంసాహార భోజనం చేసి, ఆలయ దర్శనానికి వెళ్తే తప్పేముంది అని సీఎల్పీ నేత సిద్దరామయ్య చెప్పడంపై అధికార బీజేపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇక మడికెరిలో జరిగిన గుడ్ల దాడిని ఖండిస్తూ త్వరలో అక్కడ ధర్నా చేస్తానని హస్తం ప్రకటించడం కూడా వేడెక్కించింది. మొత్తానికి గుడ్లు, నాన్ వెజ్ ఇప్పుడు రాజకీయాలకు ఘాటైన మసాలాను కలిపాయి. మైసూరు/ శివాజీనగర: టిప్పు సుల్తాన్ దండయాత్ర చేసినప్పుడే కొడగు ప్రజలు భయపడలేదు, సిద్దరామయ్య వస్తే భయపడతారా? అని మైసూరు–కొడగు ఎంపీ ప్రతాపసింహ అన్నారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడగులో గుడ్ల దాడి జరిగిందని మళ్లీ కొడగును ముట్టడిస్తామని, అక్కడ భారీ ధర్నా చేస్తామని సిద్దరామయ్య చెబితే ఎవరూ భయపడబోరన్నారు. కొడగు ప్రజలను హత్య చేసిన టిప్పు జయంతిని నిర్వహించిన సిద్దరామయ్యను కొడగు ప్రజలు ఎలా క్షమిస్తారన్నారు. సిద్దరామయ్య భార్య చాముండేశ్వరి అమ్మవారికి భక్తురాలు, ఆమె కూడా మాంసం తిని ఆలయానికి వెళ్తారా? అనేది చెప్పాలన్నారు. పంది మాంసం తిని మీ స్నేహితుడు, ఎమ్మెల్యే అయిన జమీర్ అహ్మద్ ఇంటికి వెళ్తారా? అని మండిపడ్డారు. మాంసాహారం తిని పూజలకు వెళ్లారు మైసూరు నగర మాజీ మేయర్ రవికుమార్ మాట్లాడుతూ 2017లో దసరా వేడుకల్లో సిద్దరామయ్య మాంసాహార భోజనం చేసి చాముండేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాడని, ఇది నిజమని అన్నారు. లలిత మహాల్ ప్యాలెస్‌లో జిల్లా యంత్రాంగం శాకాహార, మాంసాహార భోజనాలను ఏర్పాటు చేయగా, ఆయన మాంసాహారం తిని వచ్చి పూజలకు వెళ్లారన్నారు. మొండితనం వద్దు: విజయేంద్ర సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహార స్వాతంత్య్రం ఉంది. అయితే మాంసం తిని దేవాలయానికి వెళతానని చెప్పడం మొండితనం, ఇటువంటి వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సీఎల్పీ నేత సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. సోమవారం శిరహట్టిలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక సంస్కృతి సంప్రదాయముంది. మత నిష్ట ఉంది, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదు. మాంసం తిని గుడికి వెళతానని చెప్పడాన్ని నేనొక్కన్నే కాదు రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు అని అన్నారు. ప్రజలపై యుద్ధం చేస్తావా: విశ్వనాథ్ కొడగులో భారీ ధర్నా చేయాలని సిద్దరామయ్య యోచించడం తగదని, దీనిని విరమించుకోవాలని బీజేపి ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకుల పైన ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు ఇలా ఏవి దొరికితే అవి వెయ్యడం సహజమన్నారు. అలాగని ప్రజల మీద యుద్ధం చేయ్యడం సరికాదని, కాబట్టి ధర్నాను మానుకోవాలని సూచించారు. శుక్రవారం టెన్షన్ కాగా, వచ్చే శుక్రవారం మడికెరి ఎస్పీ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేయనుంది. అదే రోజు మరోచోట బీజేపీ జాగృతి సమావేశం జరపనుంది. దీంతో కాఫీ సీమలో టెన్షన్ నెలకొంది. పందిమాంసం తిని వెళ్తారా: యత్నాళ్ సిద్దరామయ్యకు ధైర్యముంటే పంది మాంసం తిని, మసీదుకు వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ సవాల్ విసిరారు. సోమవారం విజయపురలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నిచోట్ల మాంసాహారం తిని ఆలయాలకు వెళ్లొచ్చు, కొన్నిచోట్ల వెళ్లడం నిషిద్ధం. దేవాలయానికి మాంసం తిని వెళ్లకూడదా? అని సిద్దరామయ్య ప్రశ్నించడం దేవున్ని నమ్మే ఆస్తికుల మనసుకు బాధ కలిగించింది. ఆయనకు ధైర్యముంటే పంది మాంసం తిని మసీదుకు వెళ్లాలి అని సవాల్ చేశారు. -
కిరాతకం: ప్రేమిస్తున్నానని వెంటపడి ఆమెపై..
యశవంతపుర: ఐటీ సిటీలో కొంతకాలంగా వినిపించని యాసిడ్ దాడి మళ్లీ తెర మీదకు వచ్చింది. సుంకదకట్టలో ఒక యువతిపై దుండగుడు యాసిడ్ దాడి చేశాడు. స్థానిక ముత్తూట్ ఆఫీసులో ఓ యువతి (23) పని చేస్తోంది. నాగేశ్ అనే యువకుడు రోజూ ఆమె వెంటపడి ప్రేమించాలని అడిగేవాడు. గురువారం ఉదయం 8:30 సమయంలో కూడా అదే మాదిరిగా ఆఫీసు వద్దకు వచ్చి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ప్రేమించనని చెప్పడంతో నిన్ను ప్రేమించను, నా వెంట పడొద్దు అని ఆమె ఛీ కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో దుండగుడు ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న సీసాలో నుంచి యాసిడ్‌ను ఆమెపై గుమ్మరించి పరారయ్యాడు. బాధను తట్టుకోలేక యువతి రక్షించాలని కేకలు వేసింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతి గొంతు, కాలు సహా శరీరంలో 40 శాతం గాయాలైనట్లు వైద్యుడు కార్తీక్ తెలిపారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కామాక్షిపాళ్య పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి యాసిడ్ దాడిని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఇది ఒక అమానవీయ ఘటన. నిందితునిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించాను, బాధితురాలికి మెరుగైన చికిత్సలను అందిస్తామన్నారు. అతన్ని వదలొద్దు: యువతి తనపై దాడి చేసిన నాగేశ్‌ను వదలవద్దని బాధిత యువతి డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు విచారించారు. అతన్ని మాత్రం వదలద్దు, సరైన శిక్ష పడాలి అని ఆమె అన్నారు. ముత్తూట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నట్లు తెలిపింది. కాగా, యాసిడ్ పోసి పరారైన నిందితుడు నాగేశ్ కోర్టు వద్దకు వెళ్లి లాయర్‌ను కలిశాడు. ఆపై అతని ఫోన్ స్విచాఫ్ అయిందని పోలీసుల విచారణలో బయట పడింది. ఇది కూడా చదవండి: ఆటోలో యువతిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి.. -
గాయత్రి నువ్వు లేని జీవితం నాకు వద్దు..
కర్ణాటక (మైసూరు) : భార్య లేని బతుకు వ్యర్థమని తలచి ఒక భర్త పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న సంఘటన మైసూరు తాలూకాలోని హంచ్యా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. రెండు నెలల క్రితమే మహేష్ (45) భార్య గాయత్రి (37) బీపీ మందులకు బదులుగా వేరే మందులు వేసుకోవడంతో ఆరోగ్యం దెబ్బతిని కన్నుమూసింది. అప్పటి నుంచి భార్యను తలుచుకుంటూ వేదన పడేవాడు. ఆదివారం ఉదయం ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు మహేష్ తన సోదరునికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, తన ఇద్దరు పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పాడు. -
హిజాబ్ వద్దు..కాషాయం వద్దు కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
-
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. వివరాలు... మాన్విలో రంగరేజ్(40),నూరుస్లు కిరాణా అంగడి నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి ఇద్దరూ బైక్‌లో ఇంటికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రంగరేజ్ అక్కడికక్కడే మృతి చెందగా నూరుస్ గాయపడింది. పోలీసులు క్షతగాత్రురాలిని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అల్లుని దాడిలో అత్త హతం బనశంకరి: మద్యం మత్తులో అల్లుడు కొట్టిన దెబ్బలకు అత్త మరణించింది. ఈ ఘటన బాళేహెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రమేశ్, మంజుల దంపతులు అత్త కాళమ్మ (75) కలిసి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మద్యం తాగి విందు చేసుకున్నారు. ఇంతలో రమేశ్‌కు అత్తతో గొడవ చెలరేగి ఆమెను తీవ్రంగా కొట్టి బయటకు తరిమేశాడు. తల, గొంతుకు తీవ్రగాయాలు కావడంతో పాటు రాత్రంతా చలిలో వణికిపోయి కాళమ్మ మతిచెందింది. పోలీసులు రమేశ్‌ను అరెస్ట్‌చేశారు. -
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్టు తిరస్కరించింది. పోలీసుల నివేదికను తప్పుబట్టిన కోర్టు.. భూముల డీనోటిఫికేషన్‌పై పునర్విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ భూమి అప్పగింతపై యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అడిగినంత ఇవ్వకపోతే మధ్యలోనే మృతదేహాల్ని వదిలేస్తున్నారు!
బెంగళూరు: అంబులెన్స్ డ్రైవర్లు. రోగులను సమయానికి ఆస్పత్రులకు తరలించడం వారి విధి. అంతేకాదు తప్పనిసరి పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాల్ని కాపాడతారనే మంచి పేరుంది. కానీ ఈ కరోనా కష్టకాలంలో పలువురు అంబులెన్స్ డ్రైవర్లు సంపాదనే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కారణంతో కరోనా పేషెంట్లను, వారి డెడ్ బాడీలను మార్గం మద్యలో వదిలేసి పారిపోతున్నారు. బెంగళూరులోని తుమకూరుకు చెందిన శరత్(26) అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా విలయ తాండవాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కరోనా పేషెంట్లను, డెడ్ బాడీలను స్మశాన వాటికి తరలిస్తుండే వాడు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ శరత్ కరోనాతో మరణించిన బాధితుడి డెడ్ బాడీని హెబ్బాల్ సమీపంలోని ఓ ఫుట్ పాత్‌పై వదిలేసి పారిపోయాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అమృత హళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో శరత్ కరోనా బాధితులను, డెడ్ బాడీలను ఇలాగే గతంలో మార్గం మద్యలోనే వదిలేసినట్లు తేలింది. ఇక హెబ్బాల్ సమీపంలో కరోనాతో మరణించిన బాధితుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించేందుకు అతని కుటుంబ సభ్యులతో రూ.3వేలకు మాట్లాడుకున్నాడు. కానీ హెబ్బాల్ సమీపంలోకి రాగానే శరత్‌కు దుర్బుద్ధి పుట్టింది. బాధితుల రోధనల్ని క్యాష్ చేసుకునేందుకు కుట్రకు పాల్పడ్డాడు. డెడ్ బాడీని తరలించాలంటే రూ.3వేలు కాదు ఇంకో 18వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.దీంతో ఆందోళనకు గురైన మృతుడి భార్య తాను అంత ఇవ్వలేనని, ముందుగా మాట్లాడుకున్నంత ఇస్తానని వేడుకుంది. అయినా సరే డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. పాపం చివరికి అడిగినంత డబ్బులు ఇవ్వులేదని కారణం చూపుతూ మృతుడి డెడ్ బాడీని పుట్ పాత్ పై వదిలేసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: భర్త కరోనాతో మృతి చెందడంతో కలత చెందిన భార్య (గర్భిణి) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపుర పట్టణ పరిధిలోని బసవేశ్వరనగర్‌లో నివసిస్తున్న బెస్కాం ఉద్యోగి నందిని (28)ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని రెండేళ్ల క్రితం మైసూరుకు చెందిన సతీష్ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకుంది. సతీష్ వ్యాపార నిమిత్తం మైసూరు, కనకపుర తిరిగేవారు. మైసూరులో ఉన్న సతీష్ తల్లి గతవారం కరోనాతో మృతి చెందింది. సతీష్‌కూ కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నందిని మూడు నెలల గర్భిణి. దీంతో కలత చెందిన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు -
కరోనా బెడ్ల స్కాం .. తెరపైకి బీజేపీ ఎంపీ?
బెంగళూరు: ఒక పక్క దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోపక్క ఆసుపత్రిలో బెడ్లు దొరకక, ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. గళూరులో భారీ ఎత్తున ఆస్పత్రి బెడ్ల కుంభకోణం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులున్నారని, వారి సాయంతో ఆస్పత్రులలో బెడ్లను బ్లాక్ చేయించి పెద్దమొత్తం లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. నేత్రావతి, రోహిత్ కుమార్, డాక్టర్ రిహాన్, బొమ్మనహళ్లికి డాక్టర్ శశి కుమార్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన వైద్య పరిక్షల్లో డాక్టర్ రోహిత్ కు కరోనా పాజిటీవ్ రావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు జోన్లలో పనిచేస్తున్న వారిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టామని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన 17 మందిని ప్రశ్నించామనీ, అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేయనున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రైవేట్ ఆస్పత్రి బెడ్లని కరోనా పేషెంట్లకు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్పత్రులో బెడ్లు కరువయ్యాయి. దీంతో కరోనా బాధితులకు అండగా ఉండే బెడ్ల కేటాయింపు జరగాలని.. ఆ ప్రక్రియను బృహత్ బెంగళూరు మహానగర పాలక మున్సిపల్ శాఖకు అప్పగించింది. మున్సిపల్ అధికారులు సిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న తొమ్మిది జోనల్ స్థాయిలలో కరోనా వార్ రూమ్ లను ఏర్పాటు చేసింది. వార్ రూమ్ లలో ఉన్న బెడ్లను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన పలుకబడిని ఉపయోగించి బ్లాక్ చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బెడ్లను డిమాండ్ తగ్గట్లు కేటాయించి, సొమ్ము చేసుకున్నారని అందుకు సంబంధించి ఓ నలుగురు హెల్ప్ చేస్తున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. -
బెంగళూరులో ఆక్సిజన్ కొరత: 24 మంది మృతి
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ పేషెంట్లు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా కర్ణాటకలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతి చెందారు. చామరాజనగర్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన కోవిడ్ బాధితులంతా ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతోనే వారు మరణించారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పించినట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మృతి చెందిన వారి పోస్టుమార్టం నివేదికలు వస్తే బయటపడతాయని అన్నారు. కాగా మృతి చెందిన రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, అదీకాక వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి వెల్లడించారు. వారు కచ్చితంగా ఆక్సిజన్ కొరతతో మరణించారా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. ఈ విషాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. చామరాజనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Corona Cases in India: కరోనా విస్ఫోటం -
మీకు సిగ్గు, శరం ఉందా: మాజీ సీఎం
సాక్షి,బళ్లారి: మంత్రులకు సిగ్గు, శరం ఉంటే అనవసర విషయాలు ప్రస్తావించకూడదని(ఒకే పెళ్లి), లేదంటే గురివింద సామెతను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. ఆయన గురువారం కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మంత్రి సుధాకర్.. ‘ఏకపత్నీవ్రతుడు’ అనే విషయంపై పరోక్షంగా విమర్శలు చేయడంతో మాజీ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మంత్రుల సీడీల విషయాన్ని జనం ఏ విధంగా చర్చించుకుంటున్నారో తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం విడుదలైన సీడీతో పాటు మరికొందరి సీడీలు కూడా విడుదల అవుతాయన్న భయంతోనే కోర్టుకు వెళ్లారనే విషయం మరవకూడదని కుమారస్వామి హితవు పలికారు. తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు వెళతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎదుటి వారి తప్పులనే చూపుతారు కాని తమ తప్పులను ఎరగరన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్యుద్ధాన్ని జనం ఛీత్కరించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జనం సమస్యలను గాలికి వదిలివేశారన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటరావ్ నాడగౌడ ఆయనతో పాటు ఉన్నారు. కాగా కుమారస్వామి తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆయనకు మరో భార్య రాధిక కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. చదవండి: సీడీ కేసు: సిట్ అదుపులో నిందితుడి భార్య -
ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
బనశంకరి: ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బసవకళ్యాణ కు చెందిన వినీత కాంబళే (24) బీదర్ నగరంలోని బ్రిమ్స్ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసిస్తోంది. శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు తెలియరాలేదు. బీదర్ న్యూటౌన్ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చైన్ స్నాచర్ అరెస్ట్ మైసూరు: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడితో పాటు అతని వద్ద నగలను కొనుగోలు చేస్తున్న యువతిని కూడా నంజనగూడు పోలీసుల అరెస్ట్ చేశారు. నిందితుడు చందన్ ఇటీవల ఓ బైక్‌ను అపహరించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసులు నిఘా పెట్టి చందన్‌తో పాటు సుధారాణి అనే మహిళను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మూడు చైన్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. వీరి అరెస్టులో పలు స్నాచింగ్ కేసులు పరిష్కారమయ్యాయి. -
లాయర్ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి
హొసపేటె: న్యాయదేవత ప్రాంగణంలో రక్తపాతం చోటుచేసుకుంది. హొసపేటెలోని సివిల్ జేఎంఎఫ్‌సీ కోర్టు ఆవరణలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది తారిహళ్లి వెంకటేష్(48) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. మ్యాసకేరికి చెందిన వెంకటేష్‌కు– తమ్ముడి కొడుకయ్యే మనోజ్ (22)కి మధ్య కొద్ది నెలలుగా ఆస్తి తగదా ఉంది. వెంకటేష్ రోజూ మాదిరి కోర్టు ప్రాంగణానికి వచ్చి కుర్చీలో కూర్చుని నోటరీలు చూసుకుంటున్నాడు. చప్పుడు లేకుండా వచ్చిన మనోజ్ మచ్చు కొడవలితో వెంకటేష్‌పై పలుమార్లు నరికాడు. మెడ, తలపై తీవ్ర గాయాలతో వెంకటేష్ కొద్దిసేపు విలవిలలాడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. తండోపతండాలుగా జనం చేరుకున్నారు. ఇంతలో పోలీసులు చేరుకుని అక్కడ ఉన్న నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ హత్యాకాండ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. చదవండి: రాంగ్ రూట్లో బైకర్.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -
బెంగళూరు హింస : నష్టాన్ని వారి నుంచే రాబడతాం
బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హింసాకాండకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. హింసలో ఎలాంటి నష్టం వాటిల్లినా అల్లరి మూకల నుంచే రికవరీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హింసకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, నష్టాలను అంచనా వేసి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రికవరీ చేస్తామని చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బెంగళూరు హింసాకాండ వెనుక కుట్రను బహిర్గతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. చదవండి : బెంగళూరు అల్లర్లపై సీఎం సీరియస్ -
వైరల్ వీడియో: గున్న ఏనుగు వాకింగ్!
సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్‌లోని జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని పేర్కొంది. మరో వీడియోను పోస్ట్ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్ టేకర్ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Vedavathi lives walking and running, #Somu takes around three times in a day. Look how she runs!! She was 89 kgs , when arrived now 110kgs, gained any 20kgs in two months.@aranya_kfd @CZA_Delhi @AnandSinghBS @KarnatakaWorld @PIBBengaluru pic.twitter.com/PFPlpFshWi — Zoos of Karnataka (@ZKarnataka) July 13, 2020 -
క్యాబ్ డ్రైవర్ పట్ల అమానుషం
యశవంతపుర : ఓ క్యాబ్ డ్రైవర్‌పై దుండగలు దాష్టీకానికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను కారు బ్యానెట్‌పైకి నెట్టి పలు వీధుల్లో తిప్పారు. ఈ అమానుష ఘటన బెంగళూరు బసమేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి శంకరనగరలో క్యాబ్ డ్రైవర్ శంకరేగౌడ ఇంధనం కోసం సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. చిల్లర కోసం వేచి ఉండగా స్విఫ్ట్‌కారులో ముగ్గురు యువకులు వచ్చారు. వాహనం పక్కకు తీయాలని పెద్దగా హారన్ మోగించారు. శంకరేగౌడను నోటికోచ్చినట్లు దూషించారు. ఒక యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా మిగతా ఇద్దరు శంకరగౌడను తమ కారు బ్యానెట్ఫైకి వేసుకొని వేగంతో వెళ్లిపోయారు. తనను రక్షించాలని శంకరేగౌడ కేకలు వేశాడు. దీనిని చూసినవారు సినిమా షూటింగ్‌గా భావించారు. అయితే తన ప్రాణం పోతుందని, కాపాడాలని శంకరేగౌడ ఆర్తనాదాలు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో అకతాయిలు కారు వేగం తగ్గించారు.దీంతో శంకరగౌడ బ్యానెట్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఘటనా స్థలంలోని ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశంలో 60కు పెరిగిన కరోనా కేసులు
-
విశ్వాస పరీక్షకు సిద్ధం!
-
ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా?
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఉన్న ఎమ్మెల్యేల బలం సరిపోదు. తమ బలం ఫిరాయింపులతో పెరగాలి లేదా ప్రభుత్వ పక్షాన్ని రాజీనామాలతో తగ్గించాలని పథకం వేశారు. ఫిరాయిస్తే కోట్లిస్తాం, మంత్రి పదవిస్తాం అంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన టెలిఫోన్ రికార్డులు బయటపడినా భయపడకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జనతాదళ్ ఎమ్మెల్యేలు ‘వారంతట వారే’ పదవులను గడ్డిపోచల వలె వదిలించుకునేందుకు పథకం వేశారు. ప్రత్యేక విమానం, లగ్జరీ బస్సుల్లో ‘సొంత’ ఖర్చుతో ముంబై వెళ్లిపోయారు. పాపం శివకుమార్ పరుగెత్తి విమానాశ్రయం చేరుకునేటప్పటికే ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ఎగిరిపోయారు. బీజేపీ వారి సర్కార్‌లో మంత్రిపదవి అయితే రెండుమూడు సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే సర్కారు ఉంటుంది కనుక చాలా హాయి. మంత్రి పదవి ఉంటే సహజంగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలి కదా. అప్పుడు ఆదాయ పన్నువారు, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు íసీవీసీ వారు దాడులు చేయకుండా ఊరుకుంటారా? బీజేపీ మంత్రి పదవితో పోల్చితే సంకీర్ణ మంత్రిపదవిలో ప్రమాదాలు ఎక్కువ. పరువు, పదవీ పోయి జైలు దక్కవచ్చు. మరి ఈ శివకుమార్ మాట్లాడేదేముం టుంది? శివకుమార్, కుమార స్వామి, సిద్దరామయ్యకు ఎటూపాలు పోవడం లేదు. రాజీనామా వ్యూహం అద్భుతమైంది. అందులో వచ్చే సౌకర్యమేమంటే ఎవరూ అన్యాయం.. రాజ్యాంగ వ్యతిరేకం అని అరిచే అవకాశాలు లేవు. ఎవరి అభ్యంతరం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. సభలో ఉండి ఓటువేసే వారిలో సగానికి ఒకరెక్కువ ఉంటే చాలు అని మన సంవిధానం చెబుతున్నది కదా. కనుక రాజీనామాలు చేయించేస్తే మళ్లీ ఉపఎన్నికలు జరిగేదాకా మన రాజ్యానికి తిరుగులేదనే వ్యూహంతో యడ్యూరప్ప, వారి అనుయాయులు, ఆపైన ఢిల్లీ నాయకులు కర్ణాటక సింహాసనం మీద కూర్చోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఉపఎన్నికలు జరిగే దాకా ఈ అంకెమారదు, అయితే మనవాళ్లను గెలిపించుకోవడం ఎంత సేపు? జనం కమలం మీద ఓట్లు గుద్దడానికి ఉవ్విళ్లూరుతున్నారు కదా. జనతాదళ్, కాంగ్రెస్ కలిసి పోటీచేసినా సీనియర్ నేత మాజీ ప్రధాని దేవెగౌడనే గెలిపించుకోలేని వారు ఉప ఎన్నికల్లో గెలువగలుగుతారా? ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో పాపం జనతాదళ్‌కు, కాంగ్రెస్‌కు తెలియడం లేదు. శాసనసభలో అసలు బలం 224 అయినా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే అది 208కి పడిపోయి 105 మంది ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ ఆశ. కాంగ్రెస్, జనతాదళ్ సంకీర్ణ బలం వందకు తగ్గిపోతుంది. తిరుగుబాటు ఎమ్మె ల్యేలను కలుసుకోవడానికి శివకుమార్ ముంబైకి వెళ్లినా ప్రయోజనం లేకపొయింది. 1995లో తెలుగుదేశం వారి ఫిరాయింపు ఇంజినీర్లు చెలరేగిన కాలంలో వైస్రాయ్ హోటల్‌కు తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్‌నే రానీయనట్టు, శివకుమార్‌ను అరెస్టు చేసి పంపించారు. ఆ విధంగా న్యాయం, ధర్మం, రాజ్యాంగం, పోలీసులు, పొరుగు ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేల రాజీనామా స్వేచ్ఛను కాపాడడానికి కృషి చేస్తున్నారు. కర్ణాటక శాసన సభాపతి ‘వీరు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా? ఇవి నిజమైన రాజీనామా లేనా?’ అని అనుమానిస్తున్నారు. ఆ విధంగా అనుమానించడం స్పీకర్ రాజ్యాంగ బాధ్యత. రాజీనామా ఎందుకు చేస్తున్నారో స్పీకర్‌కు చెప్పాల్సిన పని లేదు. కానీ అది నిజమైన స్వచ్ఛందమైన రాజీనామా అని స్పీకర్‌కు విశ్వాసం కలగాలి. అందుకు ఆయన తనకు తోచిన విధంగా ఎంక్వయిరీ చేసుకోవచ్చు అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. స్పీకర్ కు కాకపోయినా ఓటర్లకు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకు బాగోలేదు, వారి తప్పులను ఇదివరకు ఎప్పుడైనా ఎత్తి చూపారా? రాజీనామా చేస్తే తప్ప కర్ణాటక ప్రభుత్వం బాగుపడదని ఎప్పుడు తెలిసింది. ఈ జ్ఞానోదయం ముంబై హోటల్‌కు వెళ్లడానికి ముందు కలగకపోవడం కూడా ఆశ్చర్యమే కదా, అయినా పదిమందికలిసి ఒకే బస్సులో వెళ్తున్నా అది ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సొంతంగా ఆలోచించి ఏ కుట్రా లేకుండా ఏదురుద్దేశమూ లేకుండా నిర్ణయించుకు న్నారని ఏ విధంగా అనుకుంటారని స్పీకర్ అనుమానిస్తున్నారు.అయిదేళ్లకోసం ఎన్నుకున్న ప్రజలకు, పార్టీకి ద్రోహం చేస్తూ మధ్యంతరంగా వదిలేయడం ఊరికే జరగదు. బలీయమైన అసలు కారణాలను దాచే శారు. సభ్యత్వాలను గడ్డిపోచగా భావించి వదులు కుంటూంటే ఆపుతారా అని స్పీకర్‌ను కోప్పడాలని ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును అడుగుతున్నారు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
రుణం యమపాశం
కర్ణాటక ,మండ్య : అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్ప డ్డ ఘటన శుక్రవారం మద్దూరు తాలూకా మేళ్లహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రి తం వివాహం చేసుకున్న నాగ రాజు(28), మంజుల(24)లు ఇద్దరు పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురం అప్పుల కారణంగా అల్లకల్లోలానికి గురైంది. వ్యక్తిగత అవసరాల కోసం కొద్ది కాలం క్రితం రూ.1.5 లక్షలు అప్పు చేశారు. సకాలంలో అప్పులు తీర్చేలేకపోవడంతో రుణదాతల వేధింపులు తీవ్రతరమయ్యాయి. దీంతో శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేఎం దొడ్డి పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలు మంజుల ఐదు నెలల గర్భిణీ అనే విషయం తెలియడంతో పాటు ఇద్దరు పిల్లల రోదనతో గ్రామస్తులతో పాటు పోలీసులు సైతం కంటతడి పెట్టారు. -
ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్‌లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. -
కర్ణాటక సెంటిమెంటే గెలిచింది
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీని మరో ఎన్నికల్లో మట్టి కరిపించడం కర్ణాటక ప్రజల సంప్రదాయం. వారి సెంటిమెంట్. గత 30 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాల తీరు సూచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టిన ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడుతున్నారు. బలమైన వారి సంప్రదాయం ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త ఎన్నికల ఎత్తులు కూడా చిత్తయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తతంగా ప్రచారం చేయడంతోపాటు తన వైఖరికి భిన్నంగా గుళ్లూ గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు తిరిగారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా నాయకత్వ పరిణితి పొందిన రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల్లో మరింత నాయకత్వ పరిణితితో వ్యవహరించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా చూశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మాట తీరును మార్చుకున్నారు. మాటను మాటతోనే తిప్పి కొట్టడమూ నేర్చుకున్నారు. గుజరాత్‌తో అతి తక్కుమ మెజారిటీ విజయం సాధించిన బీజేపీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఓటమి తప్పకపోవచ్చని, జోరు మీదున్న రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇక సిద్ధరామయ్య బీజేపీకి బలమైన లింగాయత్‌లను పార్టీకి దూరం చేసేందుకు కృషి చేశారు. వారిని ప్రత్యేక మైనారిటీ మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, ఇతర ఓబీసీ వర్గాల సమీకరణ కు ‘అహిందా’ దక్పథాన్ని అనుసరించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ చారిత్రక అంశాలను తప్పుగా ప్రచారం చేసిన ప్రజలు ఆయన్నే నమ్మారు. హంగ్ తప్పదంటూ చెప్పిన ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలను కూడా తలకిందులు చేస్తూ ప్రజలు తమ సెంటిమెంట్‌కు ఓటేశారు. మరోసారి పాలకపక్షాన్ని ఓడించారు. -
బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న సాయి కుమార్
-
మరోసారి అధికారం కాంగ్రెస్ పార్టీకే !
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మరోసారి అధికారం కాంగ్రెస్‌పార్టీదే అని సీఎం సిద్ధరామయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే ఇందుకు ప్రతిపక్ష బీజేపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు కార్యకర్తలంతా ఐకమత్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహదేవపుర నియోజకవర్గంలోని రామగొండనహళ్లిలో ఏర్పాటు చేసిన ‘మనెమనెగె కాంగ్రెస్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్టలు. వారు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే మనం ప్రజలకు నిజాలు చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన 165 హామీల్లో ఇప్పటికే 155కు పైగా హామీలను నెరవేర్చింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచాము. వాటిని ప్రజలకు చేర్చే బాధ్యత కార్యకర్తలపై ఉంది. అని సీఎం అన్నారు. -
వరుస వివాదాల్లో కర్నాటక సర్కార్
-
తుంగా పరవళ్లు.. కృష్ణమ్మ ఉరకలు
కర్నూలు రూరల్: కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర, కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండటంతో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా తుంగభద్ర, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీరు అడుగంటడం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. వరుణుడు ఆలస్యంగానైనా కరుణించడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులకు జల కళ వస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నిండటంతో శనివారం 10 గేట్లను రెండు మీటర్లు పెకైత్తి 22వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ జలాలు జిల్లాకు చేరనున్నాయి. ఈ దృష్ట్యా నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజుల ముందు నుంచే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ రెండు రోజులకే 10 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు చేరుకోగా.. 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే పోతిరెడ్డిపాడుకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ సర్కిల్ 1, 2లకు శ్రీశైలం జలాలను విడుదల చేయాలంటే ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు అనుమతించాల్సి ఉంది. గతంలో నీటి విడుదలను నిర్ణయించే శివం కమిటీని రాష్ట్ర విభజన తర్వాత రద్దు చేసి కృష్ణా బోర్డులను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పది రోజుల్లో శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగితే మరో పది రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 854 అడుగులకు చేరుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోతిరెడ్డిపాడు ఆధారిత సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల నిర్ణయిస్తాం. నీటి లభ్యత ఆధారంగా వాటాలను కేటాయించారు. - కాశీ విశ్వేశ్వరరావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ -
రేషన్ పక్కదారి
సాక్షి, అనంత పురం : చౌక దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. పలువురు డీలర్లు పేదల పొట్ట కొడుతూ చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కిరోసిన్, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమలు, గోధుమపిండి అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చౌక బియ్యాన్ని జిల్లా నుంచి పొరుగునే ఉన్న కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ రీసైక్లింగ్ చేస్తూ సన్న బియ్యంగా మారుస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు ఉరవకొండ కేంద్ర బిందువుగా ఉంది. గుంతకల్లు, అనంతపురం, శింగనమల, గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా అక్రమ రవాణా సాగుతోంది. మూడు నెలల క్రితం ఉరవకొండలోని టీడీపీ నేత గోదాములో దాదాపు మూడు వేల బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పప్పుశనగను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.136 కోట్లుగా తేల్చారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసు నుంచి బయట పడటంతో పాటు సరుకును విడిపించుకోవడానికి ఆ నాయకుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్‌దీ అదే బాట : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కూడా పక్కదారి పడుతున్నాయి. సిలిండర్ల అక్రమ రవాణాకు కదిరి కేంద్ర బిందువుగా మారింది. తనకల్లులో డీలర్‌షిప్పు పొందిన ఓ గ్యాస్ డీలర్ కదిరి కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్నాడు. అతను మూడు నెలల క్రితం 20 సిలిండర్లను కదిరిలోని అడపాలవీధిలో తన బంధువుల ఇంట్లో అక్రమంగా నిల్వ చేసివుండగా పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. అయితే.. ఓ టీడీపీ నాయకుని ఒత్తిడితో ఆ కేసును నీరుగార్చారు. ఇలాంటి అక్రమాలను ఆ డీలర్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. 502 కేసులు నమోదు : జిల్లాలో 2012 నుంచి 2014 మే మాసం వరకు నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 502 కేసులు నమోదు చేశారు. 191 కోట్ల 51 లక్షల 84 వేల 381 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను, వాటి రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 200 కేసులను మాత్రమే పరిష్కరించారు. కొన్ని కేసులు రాజకీయ జోక్యంతో నీరుగారిపోయాయి. మరికొన్ని విచారణలో ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పీడీయాక్ట్ కింద కేసులు పెడతామని గతంలో అధికారులు హెచ్చరించారు. తర్వాత ఆ ఊసే లేదు. 6ఏ కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. అక్రమార్కులు జరిమానాలతో బయటపడుతున్నారు తప్ప శిక్ష అనుభవించిన దాఖలాలు పెద్దగా లేవు.