మూన్‌లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు.
ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్‌లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు.
“ఒక విధాన పరంగా, నైతికంగా మూన్‌లైటింగ్‌ను ఎలా అనుమతించవచ్చు? మూన్‌లైటింగ్‌కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్‌ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్‌మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు.
కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
వేరే చోటికెళ్లి పనిచేసుకోండి
బెంగళూరు టెక్ సమ్మిట్‌ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్‌లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్‌లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు.
చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’
Comments
Please login to add a commentAdd a comment