it minister
-
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ ఈవెంట్: పోస్టర్ ఆవిష్కరించిన ఐటీ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్‌లోని టీ-హబ్‌లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024' ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్క్లేవ్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. -
భారత్‌లో వాట్సాప్ నిలిచిపోతుందా? ఐటీ మంత్రి ఏమన్నారంటే
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారతదేశంలో తన కార్యాలపాలను నిలిపి వేస్తుందా? అని కాంగ్రెస్ సభ్యుడు 'వివేక్ తంఖా' అడిగిన ప్రశ్నకు.. సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' సమాధానమిచ్చారు.వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా దేశంలో తమ సేవలను మూసివేసే యోచనల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల కారణంగా వాట్సాప్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోందా అనే ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఇచ్చారు.ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తన సేవలను భారతదేశంలో నిలిపివేయనున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చెప్పినట్లు ఎన్క్రిప్షన్ను ఉల్లంఘిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, ఇది యాప్ మీద ప్రజలకున్న నమ్మకం పోతుందని వాట్సాప్ తరపు న్యాయవాది తేజస్ కరియా కోర్టుకు తెలిపారు.కొత్త నియమాలు గోప్యతకు భంగం కలిగిస్తాయని ఇప్పటికే వాట్సాప్, మెటా సంస్థలు పలుమార్లు ఆరోపించాయి. ఫిబ్రవరి 2021లో ప్రవేశపెట్టిన ఈ నియమాలు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ను కలిగి ఉంటాయి. హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కోవడానికి ఈ నియమాలు అవసరమైనవని పేర్కొంటూ భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సమర్థిస్తుంది.వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెట్టినట్లయితే అది కంపెనీని.. దాని 400 మిలియన్ల మంది వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో చాలా మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌పై ఆధారపడి ఉన్నాయి. వాట్సాప్ ఇండియాను వీడితే ఇలాంటి కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించవచ్చు.. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని పలువురు భావిస్తున్నారు. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌పై మంత్రి వీడియో
భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్ మారుతుండడం విశేషం. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్‌కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు మంత్రి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్ ఎకోసిమ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. #WATCH | Delhi | During his media interaction after the cabinet approval of 3 more semiconductor units, Union Minister Ashwini Vaishnaw explains the development of India’s semiconductor ecosystem on the whiteboard in his office. pic.twitter.com/D9RHfhAryE — ANI (@ANI) March 1, 2024 -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
BioAsia 2024: ప్రతిష్టాత్మకంగా బయోఏషియా సదస్సు
బయోఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్-సైన్సెస్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి బయోఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయోఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ‘డేటా & ఏఐ: రీడిఫైనింగ్ పాసిబిలిటీస్’ అనే థీమ్‌తో జరగనున్న బయో ఏషియా 21వ ఎడిషన్‌లో ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లతో సహా 70 మందికిపైగా ప్రభావవంతమైన వక్తలు ప్రసంగించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మందికిపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్లో ఈసారి 200కిపైగా కంపెనీలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. -
ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..
ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్‌తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్వర్క్ లేదా టెలికమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. తాజా డ్రాఫ్ట్ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. -
TS:ఐటీ మంత్రి ఎవరో..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోర్ట్‌ఫోలియోపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్‌గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లే బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్‌స్వీప్ చేసిందన్న వాదనా ఉంది. ఇప్పుడు శాఖ తీసుకునే మంత్రిని యూత్ కేటీఆర్‌తో పోల్చడం ఖాయం. కొత్తగా ఐటీ శాఖ తీసుకునే మంత్రి కేటీఆర్ రేంజ్లో శాఖ నిర్వహించకపోతే యువత అసంతృప్తికి గురయ్యే చాన్స్ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖ కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఎక్కువ మంది సీనియర్లే. వీరిలో ఎవరికీ గతంలో ఐటీ శాఖ నిర్వహించిన అనుభవం లేదు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదంటే శ్రీధర్‌బాబుకు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కేటీఆర్‌కు ధీటుగా ఐటీ శాఖను నిర్వహించగలుగుతారా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలో ఇంకో ఆరుగురు మంత్రులను తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. కొత్తగా మంత్రులు కానున్న వారి జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుల పేర్లు ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా వారికి ఖాయంగా ఐటీ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అమెరికాలో ఐటీ బిజినెస్‌ను కూడా ఈయన నడుపుతున్నారు. గతంలో రాహుల్‌గాంధీ టీంలో పనిచేసిన ఈయన కాంగ్రెస్ పార్టీకి ఐటీ పరంగా సేవలందించారు. సభ్యత్వ నమోదు, ఎన్నికల్లో అనలిటిక్స్ వంటి విషయాల్లో ఈయన పార్టీ కోసం ఎంతో కృషి చేసినట్లు చెబుతారు. దీంతో మదన్‌మోహన్‌రావుకు ఐటీ శాఖ వచ్చే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువకులకు, వ్యాపార రంగంలో పరిచయాలు ఉన్న వారికి ఐటీ శాఖ కేటాయిస్తేనే కేటీఆర్‌కు ధీటుగా ఆ శాఖలో పనిచేయగలుగుతారని యువత భావిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌కు కొత్తగా ఎన్నో కంపెనీలు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఎంఎన్సీ కంపెనీలతో మరిన్ని పెట్టుబడులు పెట్టించి ఎంతో మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇలా కేటీఆర్ స్థాయిలో పనిచేసి ఐటీలో బ్రాండ్ హైదరాబాద్‌ను నిలబెట్టాలంటే ఐటీ రంగంపైన అవగాహన, అనుభవం ఉన్నవారైతేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది యువకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. యశోదకు తరలింపు -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
ఐఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రం క్లారిటీ, ఎంపీలపై మండిపడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. -
త్వరలో విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ సేవలు
-
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్‌సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్‌సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్‌సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్‌లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్‌లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్‌లపై ప్రభావం పడలేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సత్వరం పూనుకుని చర్యలు తీసుకోవడం వల్ల సిలికాన్ వేలీ బ్యాంకు (ఎస్వీబీ) సంక్షోభ ప్రభావాలు దేశీ స్టార్టప్‌లపై పడలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. ఇండియా గ్లోబల్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎస్వీబీ కుప్పకూలినప్పుడు.. అందులో నిధులు ఉన్న భారతీయ స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. అది చిన్నపాటి సంక్షోభమైనప్పటికీ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క అంకుర సంస్థపైనా ప్రతికూల ప్రభావం పడకుండా .. మొత్తం ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేసిందని వైష్ణవ్ చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా మాత్రమే ఉన్న భారత్.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌లో ముందుకు పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు చాలా మటుకు అంతర్జాతీయ డెవలపర్లు భారత స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను తమ భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నారని మంత్రి వివరించారు. భారత్ కూడా చాట్‌జీపీటీ లాంటివి తయారు చేయగలదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మరికొద్ది వారాలు ఆగండి. ఒక భారీ ప్రకటన ఉండబోతోంది‘ అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఎకానమీకి భారత్ వంటి విశ్వసనీయ భాగస్వామి చాలా అవసరమని వైష్ణవ్ పేర్కొన్నారు. క్వాంటమ్ ఆధారిత టెలికం నెట్వర్క్ .. దేశీయంగా తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత సురక్షితమైన టెలికం నెట్వర్క్ లింక్ ప్రస్తుతం న్యూఢిల్లీ సీజీవో కాంప్లెక్స్‌లోని సంచార్ భవన్, ఎన్ఐసీ మధ్య అందుబాటులోకి వచ్చిందని వైష్ణవ్ చెప్పారు. ఈ వ్యవస్థ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయగలిగే ఎథికల్ హ్యాకర్లకు రూ. 10 లక్షల బహుమతి ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సీ–డాట్ రూపొందించినట్లు మంత్రి వివరించారు. -
హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యాప్‌లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్‌ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్ చిత్రాన్ని వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap. All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022 భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్. వాట్సాప్ క్షమాపణలు.. మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది వాట్సాప్. జరిగిన తప్పుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్ ఇదీ చదవండి: స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై ‘బీఎస్ఎఫ్’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్‌ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్‌పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులకు భారీ షాక్!
మూన్‌లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్‌లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు. “ఒక విధాన పరంగా, నైతికంగా మూన్‌లైటింగ్‌ను ఎలా అనుమతించవచ్చు? మూన్‌లైటింగ్‌కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు. కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేరే చోటికెళ్లి పనిచేసుకోండి బెంగళూరు టెక్ సమ్మిట్‌ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్‌లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్‌లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు. చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’ -
చంద్రబాబును విశ్వసించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు : గుడివాడ అమర్నాథ్
-
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు’
భువనేశ్వర్: రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేశారు. కేంద్రప్రభుత్వం సంకల్పించిన 5జీ సేవలు తొలి దశలోనే రాష్ట్రానికి కల్పిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. దేశంలో పలు ప్రాంతాలకు ఈ సేవలు లభిస్తాయని, ఈ వ్యవస్థలో మానవాళికి ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన రేడియేషన్ పరిమితి కంటే సుమారు 10 రెట్లు తక్కువగా దేశంలో ప్రవేశ పెట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుందని స్పష్టంచేశారు. వినియోగదారులకు విస్తృత 5జీ సేవలు కల్పించేందుకు అనుబంధ టెలికాం సంస్థలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అతి త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తొలి దశలో అవకాశం కల్పించే యోచన కనబరచడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: పవర్ ఆఫ్ సారీ:రూ.6 లక్షలతో.. 50కోట్లు వచ్చాయ్!